Friday 19 February 2016

01.మూగనోము (1969),02. అమరశిల్పి జక్కన (1964) 03.రాధాకృష్ణ (1978) ,04.మూడుముళ్ళు (1983) 05.పదహారేళ్ళ వయసు, 06.సిరి సిరి మువ్వ (1978) ,07. బుద్ధిమంతుడు (1969,08 రంగులరాట్నం (1966) , 09.మోసగాళ్లకు మోసగాడు (1971), 10,శ్రీ పాండురంగ మహత్యం (1957) ,11.స్వరాభిషేకం జన్మదిన శుభాకాంక్షలు...



ఏ పాద సీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూముల కన్న విమల తరమో
ఏ పాద పూజ రమా పతి చరణాబ్య పూజల కన్నను పుణ్య తమమో
ఏ పాద తీర్థము పాప సంతాపాగ్ని ఆర్పగా గాలినామృత ఝరమో
ఏ పాద స్మరణ నాగేంద్ర శయుని ధ్యానమ్ము కన్నను మహానంద కరమో
అట్టి పితరుల పద సేవ ఆత్మ మరచి ఇహ పరంబుల కెదమై తపించు వారి
కావగల వారు లేరు ఈ జగాన వేరే నన్ను మన్నించి బ్రోవుమా అమ్మా నాన్నా!

చిత్రం : శ్రీ పాండురంగ మహత్యం (1957)
సంగీతం : టి.వి. రాజు
గీతరచయిత : సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం : ఘంటసాల

https://www.youtube.com/watch?v=9hc-8w0wR9w

Panduranga Mahatyam | Ye Paadha Seema song
Listen to one of the devotional hits,"Ye Paadha Seema" sung by Ghantasala from the classic Pandurang..


కళా తపస్వి కాశినాధుని విశ్వనాధ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు... smile emoticon
ఒక్క క్షణం...ఒక్క క్షణం...గరిమల నీ మురిపెపు ముద్దుల మొలకొచ్చేదిక...ఒక్క క్షణం
చిత్రం : స్వరాభిషేకం
రచన : వేటూరి సుందరరామమూర్తి
సంగీతం : విద్యాసాగర్
గానం : ఎస్.పి.బాలు, శైలజ

ఒక్క క్షణం...ఒక్క క్షణం...
గరిమల నీ మురిపెపు ముద్దుల మొలకొచ్చేదిక
ఒక్క క్షణం...ఒక్క క్షణం...

పల్లవి :
అమ్మకడుపు చల్లగా...అయ్యకలలు పండగా
ఇమ్మనరే... ఇమ్మనరే దేవతల ఈ తల్లికి వరము
ఈ లాలికి స్వరము ఇహము పరము

చరణం : 1
కౌసల్యకు తప్పని అమ్మవేదన మన రామకీర్తన
రామం దశరథ రామం
దనుజ విరామం ధరణిజ సోమం
దేవకికే తప్పని చెరసాల వేదన నవరసాల నర్తన
నంద నందనం భక్త చందనం
గోపికా గోవందనం
గగప రిరిగ సాదసా సరిగరి పదపాగరి
గప దపాదపా సదా గసరి సారి గరీ
గగ రిరి సస రిరి సస దద సదాపగారిసారిగా
తూరుపు తల్లికి తప్పదు ఉదయవేదన
మేఘాలకు తప్పదు మెరుపు వేదన
ఒక్క క్షణం... ఒక్క...

చరణం : 2
కల్లోలపు కడలి మీద తాను తేలగా వటపత్రశాయిగా
తొమ్మిది మాసాల యోగి కెవ్వుకెవ్వున తొలికేక పెట్టగా
శోకంలో పుట్టెనంట రామాయణము
శోకంలో పుట్టెనంట రామాయణము శ్లోకంగా పెరుగునంట
జన్మల ఋణము ఆ ఋణానుబంధమే ఈ శిశు జననం

జో అచ్యుతానంద జోజో ముకుందా
లాలి పరమానంద
రామగోవిందా జోజో...


1 comment: