Wednesday 17 February 2016

01.శుభప్రదం, 02.శంకరాభరణం (1980), 03. శుభోదయం (1980),04.ఉండమ్మా బొట్టు పెడతా 05.చిన్నబ్బాయి (1997), 06.అంతులేని కథ (1976) ,07.గాలి మేడలు (1962) 08.గోపి గోపిక గోదావరి (2009) 09. చందన (1974) ,10. గుప్పెడు మనసు (1979) 11.mudda banti puvvu

ఓం శ్రీ రామ్    ఓం శ్రీ రామ్    ఓం శ్రీ రామ్ 
ప్రాంజలి ప్రభ -  సంగీత ప్రభ

The "Traffic Light Tree" is an art installation by Frenchman Pierre Vivant. It was installed in East London on a roundabout just beyond the Canary Wharf estate in 1999.:
సర్వేజనా సుఖినోభవంతు


కళా తపస్వి కాశినాధుని విశ్వనాధ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు... smile emoticon
మౌనమే చెబుతోంది నీ మౌనమే చెబుతోంది ఏ మాట నీ మాటున దాగుందో...
చిత్రం : శుభప్రదం
సాహిత్యం : అనంత శ్రీరామ్
గానం : బాలు, ప్రణవి
సంగీతం : మణిశర్మ

మౌనమే చెబుతోంది నీ మౌనమే చెబుతోంది ......
మౌనమే చెబుతోంది నీ మౌనమే చెబుతోంది
ఏ మాట నీ మాటున దాగుందో
చూపు చెబుతోంది నీ చూపు చెబుతోంది
ఎద చాటునున్న ఆశ ఏమందో .. ఏమందో

మౌనమే చెబుతోందా నా మౌనమే చెబుతోందా
ఏ మాట నా మాటున దాగుందో
చూపు చెబుతోందా నా చూపు చెబుతోందా
ఎద చాటునున్న ఆశ ఏమందో .. ఏమందో

అదిగో నీ బిడియం నాకు చెబుతోంది ఏమని
ఎంత ఆరాటాన్ని లోపల ఆపిందో
ఇదిగో నీ చొరవే నాకు చెబుతోంది ఏమని
ఇంత ఆనందాన్ని పంచగ చేరిందో
ఇరువురి చెరలో పరువం చెబుతోంది
ఒకరినొకరం వద్దనుకోలేనంత ప్రేమ సొంతమయ్యిందని

మౌనమే చెబుతోంది నీ మౌనమే చెబుతోంది
ఏ మాట నీ మాటున దాగుందో

వేసే ప్రతి అడుగు దారికి చెబుతోంది
నేటి నుండి నేను ఒంటరి కాదంటూ
పలికే ప్రతి పలుకు బాషకి చెబుతోంది
శ్వాసచేప్పే ప్రేమబాషం వినమంటూ
గుప్పెడు గుండెల చప్పుడు చెబుతోంది
ఎప్పటికీ లయ తప్పని రాగం నీ నా అనురాగం అని

మౌనమే చెబుతోంది ఏ మాట నీ మాటున దాగుందో
మౌనమే చెబుతోంది నీ మౌనమే చెబుతోంది
ఏ మాట నీ మాటున దాగుందో ....
Latest HD Video Songs from K. Viswanadh , Allari Naresh's Subhapradam
కళా తపస్వి కాశినాధుని విశ్వనాధ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు..._/\_
చిత్రం : శంకరాభరణం (1980)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : త్యాగయ్య, వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి

పల్లవి:
సామజవరగమనా..
సామజవరగమనా సాధుహృత్ సారసాబ్జపాల
కాలాతీత విఖ్యాత..
సామజవరగమనా సాధుహృత్ సారసాబ్జపాల
కాలాతీత విఖ్యాత.. సామజవరగమన..

సామనిగమజ సుధా...
సామనిగమజ సుధామయ గాన విచక్షణ గుణశీల
దయాలవాల మాం పాలయ..
సామనిగమజ సుధామయ గాన విచక్షణ గుణశీల
దయాలవాల మాం పాలయ..

సామజవరగమనా...
చరణం 1:
ఆమని కోయిలా.. ఇలా నా జీవనవేణువులూదగా
ఆమని కోయిలా.. ఇలా నా జీవనవేణువులూదగా
మధురలాలసల మధుప లాలనల
మధురలాలసల మధుప లాలనల పెదవిలోని మధువులాను
వ్రతము పూని జతకు చేరగా...

నిసా దనీ మదా గమా
సమమగ గదదమ మనినిద సనిదమ దనిసా దనిసా
గదదమ మనినిద దససని గపనిద నిసగ నిసగ
సమగమ గససని నిగసగ సనినిద దనినిద మదదని గమదని సనిదమగస

సామజవరగమనా సాధుహృత్ సారసాబ్జపాల
కాలాతీత విఖ్యాత.. సామజవరగమన

చరణం 2:
వేసవి రేయిలా.. ఇలా నా ఎదలో మల్లెలు చల్లగా
వేసవి రేయిలా.. ఇలా నా ఎదలో మల్లెలు చల్లగా
మదిని కోరికలు మదన గీతికలు
మదిని కోరికలు మదన గీతికలు
పరువమంత విరుల పాన్పు పరచి నిన్ను
పలుకరించగా...

ఊ..ఆ...గమా గమదమ గమా
గమనిద మదా మదనిస దనినినిని
మద నినినిని
గమదదదద మదనినిని
గమద సాసా సానీ సాగా
సగమగ గమదని గమదని
మదనిస మదనిస దనిసగమా....ఆ.. ఆ..
Saamaja Vara Gamana - Sankarabharanam - Rajalakshmi & Chandra Mohan - Telugu Songs.…

No Title
m3.linksden.xyz
కళా తపస్వి కాశినాధుని విశ్వనాధ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు... :)

అడుగడుగున గుడి వుంది అందరిలో గుడి వుంది...ఆ గుడిలో దీపముంది అదియే దైవం \

చిత్రం : ఉండమ్మా బొట్టు పెడతా
సంగీతం : KV మహదేవన్
రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం : సుశీల

అడుగడుగున గుడి వుంది అందరిలో గుడి వుంది
ఆ గుడిలో దీపముంది అదియే దైవం

ఇల్లూ వాకిలి ఒళ్ళూ మనసూ ఈశుని కొలువనిపించాలి
ఎల్లవేళలా మంచుకడిగిన మల్లెపూవులా ఉంచాలి
దీపం మరిమరి వెలగాలి తెరలు పొరలు తొలగాలి

తల్లి తండ్రి గురువు పెద్దలు పిల్లలు కొలిచే దైవం
కల్లా కపటం తెలియని పాపలు తల్లులు వలచే దైవం
ప్రతి మనిషి నడిచే దైవం ప్రతి పులుగు ఎగిరే దైవం

https://www.youtube.com/watch?v=URpp8byXq7Q
Adugaduguna Gudivundi Andarilo Gudivundi Song - Undamma Bottu Pedata Movie Songs - Krishna - Jamuna
Watch Adugaduguna Gudivundi Andarilo Gudivundi Song From Undamma Bottu Pedata Movie, starring Krishn...

కళా తపస్వి కాశినాధుని విశ్వనాధ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు... :)

వసంతుడికి ఎలా తెలిసెనంట వనకన్య మనసులోని మాట...తెలుసుకో ఓ వనమాలీ…

చిత్రం : చిన్నబ్బాయి (1997)
సంగీతం : ఇళయరాజా
రచన : సిరివెన్నెల
గానం : చిత్ర , ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , మాల్గాడి శుభ

వసంతుడికి ఎలా తెలిసెనంట వనకన్య మనసులోని మాట
తేటినెలా స్వాగతించెనంట మదిలోన మధువు నింపుకున్న తోట
తెలుసుకో తెలుసుకో ఓ వనమాలీ…

ఇదేనా నే నేర్పింది...

తెలుసుకో తెలుసుకో తెలుసుకో తెలుసుకో ఓ వనమాలి…
తెలుసుకో తెలుసుకో ఓ వనమాలీ
ఈ రాధిక మదిలో అనురాగం తెలిపే
రాయబారమేదో చేయ రావే ఓ చిరుగాలి
తెలుసుకో తెలుసుకో ఓ వనమాలీ ఓ వనమాలీ
.
మంగ మనసు లోగిలికి నీలి కళ్లే వాకిలి… ఆ…
దాగని తలపులతో అవి తెలుపవ స్నేహాంజలి…
ఎరుపెక్కిన చెక్కిలిపై అదురుతున్న పెదవులపై
భాష లేని ప్రేమలేఖ రాసుకున్న వేళ
తెలుసుకో తెలుసుకో ఓ వనమాలీ ఓ వనమాలీ
.
కొత్త టైపు మ్యూసిక్కుల్లో మత్తు రేపే మాజిక్కుంది హొయ్యా…హా..ఆ.
కుర్రకాలం కవ్విస్తుంది… కొంటెమేళం కావాలంది..సయ్యా..హా..ఆ
ఆడే న్యూ స్వింగ్తో… పాడే పాప్ సాంగ్తో… భూగోళం ఊగాలి..హొయ్యా…
నాది జనమంతా మెచ్చే నాట్యం
కాదే అది నడుముని విరిచే పైత్యం
నాలా మెరుపల్లే నువ్వు బ్రేక్ చెయ్
హే బాలా నీ తికమక పరుగుకు బ్రేక్ వెయ్
నీ చురుకెంత?... ఆ మెరుపెంత
ఏది వెయ్ చూస్తా?...చిటికెయ్ చెప్తా

తక్కిట తక…
శృతిలయలకు సరిపడ గల జతులివి
తెలుసుకో.. తెలుసుకో.. ఓ వనమాలీ ఓ వనమాలీ

ఈ రాధిక మదిలో అనురాగం తెలిపే రాయబారమేదో చేయ రావే ఓ చిరుగాలి
తెలుసుకో.. తెలుసుకో.. ఓ వనమాలీ ఓ వనమాలీ

https://www.youtube.com/watch?v=STxVmawQDtI
Chinnabbayi Songs - Telusuko Telusuko - Ramya Krishna - Venkatesh - Ravali
Venkatesh Ramya Krishna Ravali's Chinnabbayi Telugu Movie Song Music : Ilayaraja Lyrics : Sirivennel...

కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు...రాళ్ళలో ఉన్న నీరూ కళ్ళకెలా తెలుసు

చిత్రం: అంతులేని కథ (1976)
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: జానకి

పల్లవి:

కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు
కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు
రాళ్ళలో ఉన్న నీరూ కళ్ళకెలా తెలుసు
రాళ్ళలో ఉన్న నీరూ కళ్ళకెలా తెలుసు

నాలో ఉన్న మనసూ నాకు గాక ఇంకెవరికి తెలుసూ

కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు
రాళ్ళలో ఉన్న నీరూ కళ్ళకెలా తెలుసు

చరణం 1:

తానే మంటై వెలుగిచ్చు దీపం
చెప్పదు తనలో చెలరేగు తాపం

నే వెళ్ళు దారీ ఓ ముళ్ళ దారీ
నే వెళ్ళు దారీ ఓ ముళ్ళ దారీ
రాలేరు ఎవరూ నాతో చేరీ
నాలో ఉన్న మనసు నాకు గాక ఇంకెవరికి తెలుసు

చరణం 2:

వేసవిలోనూ వానలు రావా
కోవెల శిలకూ జీవం రాదా

జరిగే నాడే జరుగును అన్నీ
జరిగే నాడే జరుగును అన్నీ
జరిగిన నాడే తెలియును కొన్నీ

నాలో ఉన్న మనసు నాకు గాక ఇంకెవరికి తెలుసూ

https://www.youtube.com/watch?v=AJBkbN68p9w
Kallallo Unnadedo - Anthuleni Katha - Jayapradha & Prasad Babu
Kallallo Unnadedo - Anthuleni Katha - Jayapradha & Prasad Babu - Telugu Songs. Listen to this sad so...

కృష్ణా..ఆ..కృష్ణా..మంచిమాటేరా..మంచిమాటేరా..రారా...మంచిమాటేరా..

చిత్రం: గాలి మేడలు (1962)
సంగీతం: టి.జి. లింగప్ప
గీతరచయిత: సముద్రాల (జూనియర్)
నేపధ్య గానం: రేణుక

పల్లవి:

కృష్ణా..ఆ..కృష్ణా..ఆ...ఆ..ఆ
మంచిమాటేరా..మంచిమాటేరా..రారా
మంచిమాటేరా..
చెలియ మనసు తెలుసుకోరా..
చెలియ మనసు తెలుసుకోరా..
పిలుపు వినరారా.....
మంచిమాటేరా..రారా..మంచిమాటేరా..

చరణం 1:

మనసులోని మమతలన్ని..పూలుపూసెనురా..ఆ..ఆ
మనసులోని మమతలన్ని..పూలుపూసెనురా
అలుక ఏలా..పలుకవేలా..
అలుక ఏలా..పలుకవేలా .. పిలుపు వినరారా.....ఆ
మంచిమాటేరా..రారా..మంచిమాటేరా...

చరణం 2:

కన్నెరాధా నిన్నుకోరి..వేచియున్నదిరా..ఆ..
కన్నెరాధా నిన్నుకోరి..వేచియున్నదిరా
నీదుతలపే..మధురబాధై..మదినితలెచెనురా..ఆ
నీవులేకా..నిలువలేను..పిలుపు వినరారా..ఆ
మంచిమాటేరా..రారా..మంచిమాటేరా

http://m3.linksden.xyz/telugu/Gaali%20Medalu%20%281962%29/02%20-%20Krishna.mp3

m3.linksden.xyz

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల...నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల

చిత్రం: గోపి గోపిక గోదావరి (2009)
సంగీతం: చక్రి
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: చక్రి, కౌసల్యా

పల్లవి:

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల
ఎందుకో ఏకాంత వేళా చెంతకే రానందీ వేళా
గాలిలో రాగాల మాల జంటగా తోడుంది నీలా
నీ ఊహలో కల ఊగింది ఊయల
ఆకాశవాణిలా పాడింది కోకిల

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల

చరణం 1:

సరిగమలే వర్ణాలుగా కలగలిసేనా
కంటి పరదా నీ బొమ్మగా కళలొలికేనా
వర్ణమై వచ్చానా వర్ణమై పాడానా
జాణ తెలుగులా జాణ వెలుగులా
వెన్నైలై గిచ్చానా వేకువే తెచ్చానా
పాల మడుగులా పూల జిలుగులా
అన్ని పోలికలు విన్నా వేడుకలో ఉన్నా
నువ్వేమన్నా నీ మాటల్లో నన్నే చూస్తున్నా

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల
నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల

చరణం 2:

ప్రతి ఉదయం నీలా నవ్వే సొగసుల జోల
ప్రతి కిరణం నీలా వాలే వెలుగుల మాల
అంతగా నచ్చానా ఆశలే పెంచానా
గొంతు కలపనా గుండె తడపనా
నిన్నలా వచ్చానా రేపుగా మారానా
ప్రేమ తరఫున గీత చెరపనా
ఎంత దూరాన నీవున్నా నితోనే నే లేనా
నా ఊపిరే నీ ఊసుగా మారిందంటున్నా

https://www.youtube.com/watch?v=_c9Y8ZzaJ1k
Nuvvakkadunte Full Video Song - Gopi Gopika Godavari Video Songs - Venu, Kamalini Mukherjee
Watch : Nuvvakkadunte Full Video Song - Gopi Gopika Godavari Video Songs - Venu, Kamalini Mukherjee ...


ఓ రామ చక్కని బంగారు బొమ్మా...నీ రాత రంపపుకోత ఆయెనా...

చిత్రం : చందన (1974)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : రమేశ్ నాయుడు

పల్లవి :
ఓ రామ చక్కని బంగారు బొమ్మా
ఓ రామ చక్కని బంగారు బొమ్మా
నీ రాత రంపపుకోత ఆయెనా

చరణం 1 :

నీవారూ నావారూ.. నెత్తిన నిప్పులు పోసారే..
నెత్తిన నిప్పులు పోసారే కత్తులు గుండెల్లో గుచ్చారే..
నెత్తుటిలో ముంచెత్తారే... నెత్తుటిలో ముంచెత్తారే

ముత్యాల బొమ్మా.. రతనాల బొమ్మా..
మురిపాల బొమ్మా.. ఓ ముద్దు గుమ్మా
ఓ రామ చక్కని బంగారు బొమ్మా..
నీ రాత రంపపుకోత ఆయెనా

చరణం 2 :

మాలచ్చిమి లేని ఊరూ.. దిక్కుమాలిన వల్లకాడు..
దిక్కుమాలిన వల్లకాడు పాడుదేవుడు ఏడున్నాడో..
పాప మెందుకు మింగిపోడో.. పాప మెందుకు మింగిపోడో

ముత్యాల బొమ్మా.. రతనాల బొమ్మా..
మురిపాల బొమ్మా.. ఓ ముద్దు గుమ్మా
ఓ రామ చక్కని బంగారు బొమ్మా..
నీ రాత రంపపుకోత ఆయెనా

https://www.youtube.com/watch?v=ntsVunCcljY
Chandana | Oh Rama Chakkani song
Listen to one of the heartwarming melodious songs, "Oh Rama Chakkani" sung by Ramesh Naidu from the ...

మౌనమే నీ భాష ఓ మూగ మనసా...తలపులు యేన్నేన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు....

చిత్రం : గుప్పెడు మనసు (1979)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాల మురళీకృష్ణ

పల్లవి :

మౌనమే నీ భాష... ఓ మూగ మనసా
మౌనమే నీ భాష... ఓ మూగ మనసా
తలపులు యేన్నేన్నో కలలుగ కంటావు
తలపులు యేన్నేన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు

మౌనమే నీ భాష... ఓ మూగ మనసా.. ఓ మూగ మనసా

చరణం 1 :

చీకటి గుహ నీవు... చింతల చెలి నీవు
చీకటి గుహ నీవు... చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా... తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో... ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో... యేమై మిగిలేవో

మౌనమే నీ భాష... ఓ మూగ మనసా
తలపులు యేన్నేన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష... ఓ మూగ మనసా.. ఓ మూగ మనసా

చరణం 2 :

కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు
కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు
ఊహల ఉయ్యాలవే మనసా... మాయల దెయ్యానివే
లేనిది కోరేవు.. ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు

మౌనమే నీ భాష... ఓ మూగ మనసా
తలపులు యేన్నేన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష... ఓ మూగ మనసా.. ఓ మూగ మనసా

https://www.youtube.com/watch?v=zPv2SJ5Q2KY
Guppedu Manasu Movie | Mouname Nee Bhasha Video Song | Sarath Babu,Sujatha
► Subscribe us http://goo.gl/dM5GO7 ► Like us on Facebook https://facebook.com/shalimarcinema ► Foll...
 mudda banti puvvu

నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనయ్యా కృష్ణయ్యా
నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనయ్యా కృష్ణయ్యా
వేణువు విందామని నీతో ఉందామని
నీ రాధ వేచేనయ్యా రావయ్యా
ఓ..ఓ..ఓ.. గిరిధరా మురహరా రాధా మనోహరా..ఆ..
నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనయ్యా కృష్ణయ్యా
రావయ్యా...

నీవు వచ్చే చోట నీవు నడిచే బాట
మమతల దీపాలు వెలిగించాను
మమతల దీపాలు వెలిగించాను
కుశలము అడగాలని పదములు కడగాలని
కన్నీటి కెరటాలు తరలించాను
ఓ..ఓ..ఓ.. గిరిధరా మురహరా నా హృదయేశ్వరా..ఆ..
నీ రాధ గుండెలలో తాపము చల్లార్చ రా
నీ రాధ గుండెలలో తాపము చల్లార్చ రా
కృష్ణయ్యా.. ఓ కృష్ణయ్యా..
కృష్ణయ్యా.. ఓ కృష్ణయ్యా..

నీ పద రేణువునైనా పెదవుల వేణువునైనా
బ్రతుకే ధన్యమని భావించాను
బ్రతుకే ధన్యమని భావించాను
నిన్నే చేరాలని నీలో కరగాలని
నా మనసే హారతిగా వెలిగించాను
గోవింద గోవింద గోవింద గోపాలా..

No comments:

Post a Comment