Monday 1 February 2016

01 ప్రేమించు పెళ్లాడు (1985) ,02వందేమాతరం (1985),03.స్వయంవరం (1999),04 బాణం (2009),05 అదుర్స్ (2010) 06.శ్రీకృష్ణ తులాభారం (1966), 07.నాటకాల రాయుడు (1969),08.అల్లరి ప్రేమికుడు (1994), 09.వందేమాతరం (1985),10. భలే కృష్ణుడు (1980) 11. నువ్వే నువ్వే



ఓం శ్రీ రామ్   ఓం శ్రీ రామ్   ఓం శ్ర్ఫీ అం 
పంజలి ప్రభ- సంగీత ప్రభ
♒ Mermaids Among Us ♒ art photography & paintings of sea sirens & water maidens -:
సర్వేజనా సుఖినోభవంతు 



నిరంతరమూ వసంతములే...మందారమునా మరందములే...

చిత్రం : ప్రేమించు పెళ్లాడు (1985)
సంగీతం: ఇళయరాజా
రచన : వేటూరి
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి

నిరంతరమూ వసంతములే..మందారమునా మరందములే
స్వరాలు సుమాలుగ పూచే..పదాలు ఫాలాలుగ పండె

నిరంతరమూ వసంతములే..మందారమునా మరందములే
నిరంతరమూ వసంతములే..మందారమునా మరందములే

హాయిగా పాటపాడే కోయిలే మాకు నేస్తం
తేనెలో తానమాడే తుమ్మెదే మాకు చుట్టం
నదులలో వీణ మీటే తెమ్మెరే మాకు ప్రాణం
అలలపై నాట్యమాడే వెన్నెలే వేణు గానం

ఆకసానికవి తారలా..
ఆశకున్న విరిదారులా..
ఈ సమయం ఉషోదయమై..మా హృదయం జ్వలిస్తుంటే

నిరంతరమూ వసంతములే..మందారమునా మరందములే
స్వరాలు సుమాలుగ పూచే..పదాలు ఫాలాలుగ పండె
నిరంతరమూ వసంతములే..మందారమునా మరందములే

అగ్నిపత్రాలు రాసీ గ్రీష్మమే సాగిపోయే
మెరుపులేఖలు రాసే మేఘమే మూగవోయే
మంచు ధాన్యాలు కొలిచీ పౌష్యమే వెళ్ళిపోయే
మాఘ దాహాలలోనా అందమే అత్తరాయే

మల్లెకొమ్మ చిరునవ్వులా..
మనసులోని మరు దివ్వెలా..
ఈ సమయం రసోదయమై..మా ప్రణయం ఫలిస్తుంటే

నిరంతరమూ వసంతములే..మందారమునా మరందములే
స్వరాలు సుమాలుగ పూచే..పదాలు ఫాలాలుగ పండె
నిరంతరమూ వసంతములే..మందారమునా మరందములే

https://www.youtube.com/watch?v=ZT0_lTcb6gE


preminchu pelladu song







మరల తెలుపనా...ప్రియా...మరల తెలుపనా...

చిత్రం : స్వయంవరం (1999)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
రచన : భువన చంద్ర
గానం : చిత్ర

మప మప ని రిమ రిమ స ఆ ఆ ఆ...

మరల తెలుపనా ప్రియా మరల తెలుపనా
ఎదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని
కనుపాపలో నింపుకున్నా చిరునవ్వుల పరిచయాన్ని

విరబూసిన వెన్నెలలో తెర తీసిన బిడియాలని
అణువణువు అల్లుకున్న అంతులేని విరహాలని
నిదురపోని కన్నులలో పవళించు ఆశలని
చెప్ప లేక చేతకాక మనసుపడే తడబాటుని

నిన్న లేని భావమేదొ కనులు తెరిచి కలయచూచి
మాటరాని మౌనమేదో పెదవి మీద ఒదిగిపోయి
ఒక క్షణమే ఆవేదన మరు క్షణమే ఆరాధన
తెలిరరాక తెలుపలేక మనసు పడే మధుర బాధ..
మరల తెలుపనా ప్రియా మరల తెలుపనా....

https://www.youtube.com/watch?v=sETIzbkAY1o


Swayamvaram Telugu Movie Songs | Marala Telupana Song | Venu | Laya | Mango Music
www.youtube.com

Marala Telupana Video Song from Swayamvaram Telugu movie on Mango Music, featuring Venu Thottempudi



Liచంద్రకళా చంద్రకళా చంద్రకళా...కరకర కొరికే సొగసరికే చాంగుభళా...

చిత్రం : అదుర్స్ (2010)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : రామ జోగయ్య శాస్త్రి
గానం :హరిహరన్ , రీటా

నీ కోలకళ్ళ మెరుపొకొక్క ఓం నమః
నీ తేనె పెదవి ఎరుపుకొక్క ఓం నమః
నీ పట్టు కురుల మెరుపుకొక్క ఓం నమః
మేలు జాతి కోహినూరు సొగసుకు ఓం నమః

{baby one more time
?? of on the line
i want to make u my darling jam
baby give me one chance
rhythm offing glance
take me to a party and lets go dance}

చంద్రకళా చంద్రకళా చంద్రకళా
కరకర కొరికే సొగసరికే చాంగుభళా
చంద్రకళా చంద్రకళా చంద్రకళా
నిదురను నరికే నిగనిగకే చాంగుభళా
ఓ... మనసే మరిగే సలసల వయసే విరిగే పెళపెళ
మతులే చెదిరేలా మహు బాగున్నదే నీ ఒంటి వాస్తు కళా

చంద్రకళా...{One more time}
చంద్రకళా...{Thats the way I like it}

ని స స ని స స ని స గ గ స స
ని స స ని స స ని స గ గ స
ని స స గ గ గ మ మ గ గ స స
ని స స గ గ గ మ మ గ గ స

ఓ... కులుకులకు పత్రం పుష్పం
తళుకులకు అష్టోత్తరం
{yeah thats the way i want it}
చమకులకు ధూపం దీపం
నడకలకు నీరాంజనం
{Yeah thats the way to do it}
అడుగుకో పూవై పుడతా నీ పదములు ముద్దాడేలా
చీరలా నీ జత కడతా అనునిత్యం నిన్ను అద్దుకు తిరిగేలా

చంద్రకళా...{One more time}
చంద్రకళా...{Thats the way I like it}

ఓ... పురుషులను పగబట్టేలా సొగసుపొడి వెదజల్లకే
{Yeah thats the way i was born}
వయసు మడి గది దాటేలా వగలతో వలల్లకే
{yeah thats the way i was made}
నీకేసి చూస్తే ధక్ ధక్ దరువేస్తుందే దిల్ తబలా
శివకాశి చిటపట సరుకై చెలరేగావే రంభా రాక్షసిలా
చంద్రకళా...{One more time}
చంద్రకళా...{Thats the way I like it}

https://www.youtube.com/watch?v=Tjx-Aly8KTk
Chandrakala Full Video Song - Adhurs Video Songs - Jr.NTR, Nayanatara, Sheela
Watch : Chandrakala Full Video Song - Adhurs Video Songs - Jr.NTR, Nayanatara, Sheela SUBSCRIBE Adit...



   
  


ఆహా...ఈ పాటని S.వరలక్ష్మి గారూ కూడా పాడార...అద్భుతః.... _/\_

మీరజాలగలడా నా యానతి...వ్రతవిధాన మహిమన్ సత్యాపతి

చిత్రం : శ్రీకృష్ణ తులాభారం (1966)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : స్థానం నరసింహారావు
నేపధ్య గానం : S.వరలక్ష్మి

పల్లవి :

మీరజాలగలడా...
మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి

మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి

చరణం 1 :

నటన సూత్రధారి మురారి.. ఎటుల దాటగలడో నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
నటన సూత్రధారి మురారి.. ఎటుల దాటగలడో నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి

మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి

చరణం 2 :

సుధాప్రణయజలధిన్ వైదర్భికి ఈద తావు గలదే
నాతోనిక వాదులాడగలడా సత్యాపతి
సుధాప్రణయజలధిన్ వైదర్భికి ఈద తావు గలదే
నాతోనిక వాదులాడగలడా సత్యాపతి

మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి

చరణం 3 :

మధుర మధుర మురళీగానరసాస్వాదనమున..
ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..
మధుర మధుర మురళీగానరసాస్వాదనమున
అధర సుధారస మదినే గ్రోలగ
అధర సుధారస మదినే గ్రోలగ

మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
మీరజాలగలడా...

https://www.youtube.com/watch?v=apFnoeutgDA
meerajaalagalaDaa - s varalakshmi
Beautiful rendition of "meerajaalagalaDaa" by s varalakshmi from the movie "sree kRshNa tulaabhaaram...


నీలాల కన్నులో మెల్ల మెల్లగా నిదుర రావమ్మ రావే...నిండారా రావే...

చిత్రం: నాటకాల రాయుడు (1969)
సంగీతం: జి.కె. వెంకటేశ్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

నీలాల కన్నులో మెల్ల మెల్లగా నిదుర రావమ్మ రావే నిండారా రావే
నెలవంక చలువ్వల్లు వెదజల్లగా నిదుర రావమ్మ రావే నెమ్మదిగా రావే
నీలాల కన్నులో మెల్ల మెల్లగా నిదుర రావమ్మ రావే నిండారా రావే

చరణం 1:

చిరుగాలి బాల పాడింది జోల పాడిందీ జోల
చిగురాకు మనసు కనుపాపలందు ఎగపోసేనమ్మ ఏవేవో కలలు
కలలన్ని కళలెన్నో విరబూయగా నిదుర రావమ్మా రావే నెమ్మదిగా రావే
నీలాల కన్నులో మెల్ల మెల్లగా నిదుర రావమ్మా రావే నిండార రావే

చరణం 2:

నిదురమ్మ ఒడిలో ఒరిగింది రేయి ఊగింది లాలి
గగనాని చూచి ఒక కన్ను దోయి వినిపించమంది ఎన్నెన్నో కతలు
కత చెప్పి మురిపించి మరపించగా నిదుర రావమ్మ రావే నెమ్మదిగా రావే
నీలాల కన్నులో మెల్ల మెల్లగా నిదుర రావమ్మా రావే నిండారా రావే
నెలవంక చలువ్వల్లు వెదజల్లగా నిదుర రావమ్మా రావే నెమ్మదిగా రావే

https://www.youtube.com/watch?v=Sgtugy2bZXE
Neelala Kannullo Melamellaga
Movie: Natakala Rayudu (1969), Music: G.K.Venkatesh


చిలిపి చిలక ఐ లవ్ యూ అన్నవేళలో...కలికి చిలక కవ్వింతల తోరణాలలో

చిత్రం : అల్లరి ప్రేమికుడు (1994)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
రచన : వేటూరి
గానం : ఎస్.పి.బాలు, చిత్ర

పల్లవి :

చిలిపి చిలక ఐ లవ్ యూ అన్నవేళలో
కలికి చిలక కవ్వింతల తోరణాలలో
చిలక పచ్చ పైటకి కోకిలమ్మ పాటకి
రేపో మాపో కమ్మని శోభనం
చిలిపి చిలక ఐ లవ్ యూ అన్నవేళలో
కలికి చిలక కవ్వింతల తోరణాలలో
చిలక పచ్చ పైటకి కోకిలమ్మ పాటకి
రేపో మాపో కమ్మని శోభనం

చరణం : 1

సంపంగి రేకుల్లో కొంపేసుకున్నాక
కలికి వయ్యారాల ఒంపు
ఆ... కబురు పంపు....ఆ... గుబులు చంపు
వంగల్లి రెక్కల్లో ఒళ్లారబోశాక
వయసు గోదాట్లోకి దింపు
ఆ... మరుల గుంపు....ఆ... మగువ తెంపు
అహో ప్రియా మహోదయా లయ దయ లగావో
సుహాసిని సుభాషిణి చెలీ సఖీ చలావో
ఈ వసంతాల పూల వరదలా
నను అల్లుకోవే తీగ మరదలా
నూజివీడు మామిడో...మోజు పడ్డ కాముడో
ఇచ్చాడమ్మా తీయని జీవితం

చిలిపి చిలక ఐ లవ్ యూ అన్నవేళలో
కలికి చిలక కవ్వింతల తోరణాలలో

చరణం : 2

నీలాల మబ్బుల్లో నీళ్లోసుకున్నాక
మెరిసిందిలే చుక్క రూపు
ఆ... కలల కాపు ఆ... కనుల కైపు
పున్నాల ఎన్నెల్లో పువ్వెట్టిపోయాక
తెలిసింది పిల్లాడి ఊపు
ఆ... చిలిపి చూపు ఆ... వలపు రేపు
వరూధిని సరోజిని ఏదే కులుమనాలి
ప్రియా ప్రియా హిమాలయా వరించుకోమనాలి
కోనసీమ కోక మడతలా
చిగురాకు ైరె కు ఎత్తిపొడుపులా
కొత్తపల్లి కొబ్బరో
కొంగుపల్లి జబ్బరో
నచ్చిందమ్మా అమ్మడి వాలకం

https://www.youtube.com/watch?v=eaeDFSX0UXI
Allari Premikudu 1994, Chilipi Chilaka

Like


ఆకాశమా నీవెక్కడ.. అవని పైనున్న నేనెక్కడా

చిత్రం : వందేమాతరం (1985)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు, జానకి

పల్లవి :

ఆకాశమా నీవెక్కడ.. అవని పైనున్న నేనెక్కడా
ఆకాశమా నీవెక్కడ.. అవని పైనున్న నేనెక్కడా
ఏ రెక్కలతో ఎగిసి వచ్చినా...
ఏ రెక్కలతో ఎగిసి వచ్చినా.. నిలువగలన నీపక్కన

ఆకాశమా నీవెక్కడ.. అవని పైనున్న నేనెక్కడా

చరణం 1 :

నీలాల గగనాల ఓ జాబిలి.. నిను నిరుపేద ముంగిట నిలిపేదెలా?
నీలాల గగనాల ఓ జాబిలి.. నిను నిరుపేద ముంగిట నిలిపేదెలా?
ముళ్ళున్న రాలున్న నా దారిలో నీ చల్లని పాదాలు సాగేదెలా?
నీ మనసన్నది నా మది విన్నది.. నిలిచి పోయింది ఒక ప్రశ్నలా
నిలిచి పోయింది ఒక ప్రశ్నలా..

ఆకాశమా... లేదక్కడ ...
ఆకాశమా లేదక్కడ... అది నిలిచి ఉంది నీపక్కన
వేల తారకలు తనలో వున్నా.. వేల తారకలు తనలో వున్నా నేలపైనే తన మక్కువ
ఆకాశమా లేదక్కడ... అది నిలిచి ఉంది నీపక్కన

చరణం 2 :

వెలలేని నీ మనసు కోవెలలో నను తల దాచుకోని చిరు వెలుగునై
వెలలేని నీ మనసు కోవెలలో నను తల దాచుకోని చిరు వెలుగునై
వెను తిరిగి చూడని నీ నడకలో నన్ను కడదాక రాని నీ అడుగునై
మన సహజీవనం వెలిగించాలి నీ సమత కాంతులు ప్రతి దిక్కున
సమత కాంతులు ప్రతి దిక్కున

ఆకాశమా నీవెక్కడ.. అది నిలిచి వుంది నాపక్కన
వేల తారకలు తనలో వున్నా.. వేల తారకలు తనలో వున్నా..
నేలపైనే తన మక్కువ... ఈ నేలపైనే తన మక్కువ

https://www.youtube.com/watch?v=-v2_9awvB54
Aakasama Neevekkada - C Narayana Reddy Sahityam


పొన్న చెట్టు నీడలో.. కన్నయ్య పాడితే...రాగాలే ఊగాయి నీలాల యమునలో..

చిత్రం : భలే కృష్ణుడు (1980)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి :

ఊ..ఊ..ఊ..ఊ..
ఓ..హో..హో..హో..ఆ..ఆ..ఆ..ఆ

పొన్న చెట్టు నీడలో.. కన్నయ్య పాడితే
రాగాలే ఊగాయి నీలాల యమునలో..

పొన్న చెట్టు నీడలో.. కన్నయ్య పాడితే
రాగాలే ఊగాయి నీలాల యమునలో..

ఆ..ఆ...అ.అ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..

పొన్న చెట్టు నీడలో.. కన్నయ్య పాడితే
రాగాలే రేగాయి రాధమ్మ మదిలో..

పొన్న చెట్టు నీడలో.. కన్నయ్య పాడితే
రాగాలే రేగాయి రాధమ్మ మదిలో..
రాధమ్మ మదిలో ...

చరణం 1:

ఎర్రనైన సంజెలో.. నల్లనయ్య నవ్వితే..
పొంగింది గగనాన భూపాల రాగం

ఎర్రనైన సంజెలో.. నల్లనయ్య నవ్వితే..
పొంగింది గగనాన భూపాల రాగం

ఎర్రనైన సంజెలో.. నల్లనయ్య నవ్వితే..
పలికింది పరువాన తొలివలపు రాగం..
తొలివలపు రాగం..

పొన్న చెట్టు నీడలో..కన్నయ్య పాడితే
రాగాలే రేగాయి రాధమ్మ మదిలో..

ఆ..ఆ..ఆ..ఆ..రాగాలే..ఊగాయి నీలాల యమునలో..

చరణం 2:

నీలమేఘశ్యాముని.. నీడ సోకినంతనే..
చిన్నారి నెమలి చేసింది నాట్యం..
నీలమేఘశ్యాముని.. నీడ సోకినంతనే..
చిన్నారి నెమలి చేసింది నాట్యం..

నీలమేఘశ్యాముని.. నీడ సోకినంతనే..
మైమరచి రాధమ్మ మరచింది కాలం
మరచింది కాలం..

పొన్న చెట్టు నీడలో..కన్నయ్య పాడితే
రాగాలే..ఊగాయి నీలాల యమునలో..

పొన్న చెట్టు నీడలో..కన్నయ్య పాడితే
రాగాలే రేగాయి రాధమ్మ మదిలో..
రాధమ్మ మదిలో..

https://www.youtube.com/watch?v=OpzSwyHlkFg
Bhale krishnudu (1980) movie.Song
Super star Krishna golden hits


నా మనసుకేమయింది నీ మాయలో పడింది....నిజమా కలా...........తెలిసేదెలా

చిత్రం : నువ్వే నువ్వే
సంగీతం : కోటి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : ఉదిత్ నారాయణ,నిత్య సంతోషిణి

నా మనసుకేమయింది నీ మాయలో పడింది
నా మనసుకేమయింది నీ మాయలో పడింది
నిజమా కలా...........తెలిసేదెలా
నాకూ అలాగే ఉంది ఎన్నో అనాలనుంది
దాచేదెలా............లోలోపల

మనకిద్దరికీ తెలియంది ఏదో జరిగే ఉంటుంది
అందుకే ఇంతలా గుండె ఉలికిపడుతు ఉంది

చుక్కలే తెచ్చి ఇవ్వనా అంది నీ మీద నాకున్న ప్రేమా
కొత్తగా ఉంది బొత్తిగా నమ్మలేనంత ఈ వింత ధీమా
జంటగా వెంట నువ్వుంటే అందడా నాకు ఆ చందమామ
అందుకే నాకు నువ్వంటే మాటలో చెప్పలేనంత ప్రేమ
పంచుకున్న ముద్దులో ఇలా జతే పడీ
పెంచుకున్న మత్తులో మరీ మతే చెడీ
గాలితో చెప్పనీ మన మొదటి గెలుపు ఇదనీ
.
ఎప్పుడూ గుండె చప్పుడు కొట్టుకుంటుంది నీ పేరులాగా
ఎప్పుడో అప్పుడప్పుడు గుర్తుకొస్తోంది నా పేరు కొద్దిగా
ఒంటిగా ఉండనివ్వదు కళ్లలో ఉన్న నీ రూపు రేఖ
ఇంతగా నన్ను ఎవ్వరూ కమ్ముకోలేదు నీలా ఇలాగా
లోకమంటే ఇద్దరే అదే మనం అనీ
స్వర్గమంటే ఇక్కడే అంటే సరే అనీ
వెన్నెలే పాడనీ మన చిలిపి చెలిమి కథనీ

https://www.youtube.com/watch?v=2EEJRaPuh2E
Naa Manusukemayindi Song - Nuvve Nuvve Movie, Tarun, Shreya, Koti, Trivikram
Watch Naa Manusukemayindi Song From Nuvve Nuvve Movie, starring Tarun, Shriya Saran, Prakash Raj amo...

1 comment: