ధనుర్మాస సందర్భముగా ప్రాంజలి ప్రభ
🌼 తిరుప్పావై – 6వ రోజు (పాటరూపం )
పల్లవి :
మునులు యోగులు మననమున నునుచుకొనియు
మెల్లగా లేచి “హరి” యను మేటి నామమున
నిదుర విడిచి మేలుకొన జేసిరే
తగిన మననోము నోమమున దరలిరే
చరణం – 1 :
ముందు లేచినట్టి సకల సుందరాంగులై
ముగ్ధ మందయాన నిటుల నిదుర మలుపులై
పక్షిజాలమెల్ల దిశల పాఠ్య వీక్షణమై
కూతలిడుచు గూళ్లలోన గోలలాయెనే
చరణం – 2 :
వదలె పంకజాక్షు సేవ జ్ఞప్తి పర్చుటై
దెలుపు తెల్ల శంఖ పిలుపు తీరు కర్ణమై
సరణి జొరద బాల లేచిరా నందబాలుడై
బూతన చను బాలు ద్రావి యముని పాలులై
చరణం – 3 :
రక్కసుండు బండి రూపు నుక్కు మిగిలి రాగమై
సంధులొక్క మొగిని వ్రక్క ద్రొక్కె ముదమున
మునులు యోగిజనులు నీట మునిగి వేడ్కగా
“హరి” యను నాదమెల్ల వినగరాదటే
చరణం – 4 :
మెల్ల మెల్ల నుల్ల మల్ల బల్లవించి చెల్లనే
సంతసిల్లి లేచిరార సంబరంబు మళ్ళియే
ముగింపు (ఆహ్వానం) :
అంతమంది గొంతుల శబ్దమధికమయ్యెనే
మా చెవులసోక వచ్చాము మగువలారా!
కనుక మీరును వింటిరి గాన లేచి
స్నానమాచరించి వచ్చి చక్కగాను
వ్రతము చేయుదమిక రండి భక్తితోడ
*****
సప్తపది - 6
సప్తపదులను ముద్దుపళని వ్రాసినదా లేక
ఆమె గురువుగారు శ్రీనివాసులు వ్రాసిరా అను ప్రశ్న ఒకటి ఉన్నది.
కాని మనకు దొఱకిన సప్తపదులు ముద్దుపళని
దనియే భావిస్తున్నారు.
అసలు సప్తపదులు అంటే ఏమిటి?
ఏడు పాదములున్న ఏ పద్యమైనా సప్తపదియే.
కావున ఈ సప్తపదులకు కూడ ఏడు పాదాలు ఉన్నాయి.
ముద్దుపళని సప్తపదులు త్ర్యస్రగతికి చెందినవి,
అనగా మూడు మాత్రలతో నిండినవి.
ఎక్కువగా గ-ల,న-గణములు ఉన్నా
అక్కడక్కడ ల-గములు కూడ ఉన్నాయి.
నాలుగేసి గణములకు యతియో లేక ప్రాసయతియో ఉండాలి.
ప్రాస ఐచ్ఛికము.
కన్నడములోని భోగషట్పదికి ఇట్టి గణాలు ఉన్నాయి.
భోగషట్పదికి ఆఱు పాదాలు.
మొదటి మూడు పాదములవలె చివరి మూడు పాదాలు.
మొదటి మూడు పాదాలలో-
మొదటి రెండు పాదాలకు 12 మాత్రలు,
మూడవ పాదమునకు 20 మాత్రలు.
పద్యము మొత్తములో 88 మాత్రలు (అష్తకోత్తరాష్టదశకము).
ప్రాస నియతము.----నాగవర్మ చందోంబుధినుండి లక్షణాలు-
మున్ని నంఘ్రిగళిగె మాత్రె
పన్నెరడు విరాజిసువుదు
చన్నె మేలణాడిగె మాత్రె పత్తుమెరడు
సన్నిసల్కె భోగదాఱు
చెన్నపదగళొందు గూడి
సన్నుతాంగి అష్టకోత్తరాష్టదశక కేళ్
సప్తపది - 6
ముందు లేచినట్టి సకల సుందరాంగు లొక్క ముగ్ధ
మందయాన నిటుల నిదుర మలుప వచ్చిరే
పక్షిజాల మెల్ల దెసల వీక్షణములు గొలిపి వేగ
కుక్షులకయి కూతలిడుచు గూళ్ళు వదలెనే
పంకజాక్షు సేవ జ్ఞప్తిపఱచుకొఱకు దెలుపు తెల్ల
సంకు పిలుపు నీదు కర్ణ సరణి జొరదటే
బాల లేచిరావె నందబాలుడు దా బూతన చను
బాలు ద్రావి దాని యముని పాలు చేసెనే
రక్కసుండు బండి రూపు నుక్కు మిగిలి రాగ సంధు
లొక్క మొగిని వ్రక్కలుగా ద్రొక్కె ముదముగా
మునులు యోగిజనులు నీట మునిగి వేడ్క హరీ హరీ
యనెడు నాద మినుమడించె వినగరాదటే
మెల్ల మెల్ల నుల్ల మల్ల బల్లవించి చెల్ల సంత-
సిల్లి లేచినార మిటుల మళ్ళి లేగదే
[ veerarajua: తిరుప్పావు. 6 వ దినము
"శ్రీ ద్రవిడాంధ్ర తిరుప్పావు" తెలుగుసీస పద్య సమర్పణ.
ఆ౦డాళు శ్రీ. తి. కం. తిరువేంగడాచార్యులు వారి సౌజన్యముతో
సీ. పులుగులు. గలకలc బలుకుచు నేcగెడి,
గరుడ వాహాలయగర్భమునను
సితశంఖరావంబు చెవిcబడలేదటే
లేచిరమ్మా పిల్ల! లేచిరమ్ము.
పూతనాస్తనవిషపూరము బీలిచి,
కాలను బండిని గూలcదన్ని,
క్షీరవారాశిలో శేషశయ్యనుంబండు
లోకబీజమును ముల్లోకములను
గీ. మునులు యోగులు మననుల నునుచుకొనియు
మెల్లగాలేచి “హరి” యను మేటియఱపు
నామదినిదూరి మేలుకొనంగcజేసె
తగిన మననోము నోమంగc దరలిరండు. 6
No comments:
Post a Comment