Monday, 15 December 2025

తిరుప్పావు. 1 వ దినము చెలుల పాట.


రండు రండు వేగిగా రండు మగువలరా

ముదముగా కృష్ణుని పొందగోరు వేళ

మార్గశీర్షపు పూర్ణిమాతిథి, నేడు

మహిని భక్తితో యీధనుర్మాస వ్రతము 

చేసు కుందాము రారండి చెలియలార ! 


దివ్యభూషాప్రసాధితగోపబాలలా 

రా! 

మన కెల్ల నారాయణుండు, 

దీప్తాయుధుcడు, దండతీవ్రుడు కఱిమేని, వీరసింహుcడు, నూర్యవిధుముఖుండు, 

నందగోపకమనోనందనుండు, విశాల కమలాక్షుcడు, యశోద గన్న బిడ్డ,


దండియాయుధములు దాల్చి గోవిందుని రక్షించు నందుండు రమణులార ! తననువు నల్లని ;యెఱ్ఱ తామరనేత్రాల

యందాలు చూడగానతివలార !

తహతహలాడెడు తల్లియశోదమ్మ 

 దయను దీవించగా తరుణులార !


ప్రియముగా చల్లచల్లనివెన్నెలొలుకు 

చందురుని మించు ప్రేమతో చక్కగాను 

వైరులకు తీవ్రమైనట్టి భాస్కరునిగ 

దివ్యముఖమండలంబు దేదీప్యమొలుకు 

తగిన మననోము నొమంగ ద రలిరెండు 

మహిని భక్తితో యీధనుర్మాస వ్రతము 

చేసు కుందాము రారండి చెలియలార ! 

వ్రతము 

చేసు కుందాము రారండి చెలియలార ! 

****

. మీ విధేయుడు మల్లా ప్రగడ

*****

: 🌹 తిరుప్పావై – రెండవ రోజు 🌹

🌷 పాశురము ఆధారంగా – పాట రూపం 🌷


చరణం – 1

కనుల కాటుకనిడవద్దు కాంతలార!

క్షణము నోర్పుగా నుండుము కాంతలార!

తలను పూలుతుఱుమవద్దు తరుణులార!

తలపు లన్నీ దేవుని కను తరుణులార!


పల్లవి

రండి రండి చెలియలార!

వ్రతమునాచరింతము వనితలార!

పాలసముద్రాన పవ్వళించిన

విష్ణు పాదపద్మంబు సేవించుదమురా!


చరణం – 2

పాలు త్రాగక యుండుడి పడతులార!

మేలు చేయుట కలలను మీరలార!

చేయతగనట్టి పనివలదు చెలియలార!

ప్రాయమును పంచ వీలుగా పడుతులార!


పల్లవి

రండి రండి చెలియలార!

వ్రతమునాచరింతము వనితలార!

పాలసముద్రాన పవ్వళించిన

విష్ణు పాదపద్మంబు సేవించుదమురా!


చరణం – 3

సాధ్వులార! సూర్యోదయమైనది

శుద్ధిగా స్నానంబు చేసి వచ్చెదము

రండి వనితలార! చెలియలార!

హృదయముల శుద్ధిచేసి చేరెదము


చరణం – 4

పాలసముద్రాన పవ్వళించిన

విష్ణు పాదపద్మంబుల ప్రస్తుతించ

చేతనైనంతలో దాపరికములేక

భువిలో సేవలకై చేరుదమురా!


చరణం – 5

సన్యాసులకు బ్రహ్మచారులకు భిక్ష

సత్పాత్రులకు భిక్ష సలుపుదము

వినరమ్మ రండి చెలులార!

దయధర్మంబు దారిలో నడచుదము


చరణం – 6

పరుల దూషించవద్దమ్మ వనితలార!

మరులు గొల్పించు వీలిది మగువలార!

శాశ్వతమైన సుఖముకొరకై సఖియలార!

వ్రతమునాచరింతము రండి వనితలార!


పల్లవి (ముగింపు)

రండి రండి చెలియలార!

వ్రతమునాచరింతము వనితలార!

పాలసముద్రాన పవ్వళించిన

విష్ణు పాదపద్మంబు సేవించుదమురా! 

🙏🙏🙏🙏🙏

[ పాశురము.. 2 పాటగా

మల్లా ప్రగడ


కాటుక పెట్టక, కల్వ పూలు చుట్టక,

 చెయ్యరాని పనులు చేయబోక,

పాలుత్రాగక, పరులను దూషించక,

వినరమ్మా రండి చెలు లార యిక

ర్వంసహాస్థితజనులార! మనదగు వ్రతవిధానము కదలి ర

హితమతి వినుండు, పరిధిర


పాలసంద్రంబులోపల జగద్రక్షచిం 

తన యోగనిద్రలోcదగులు పరము పాదముల్‌ గొనియాడి పాలునేయియు మాని వేకువ నీరాడ వెడలవలయు, 


 బాగుమీర మనము తీరుజనుల గా రండి

వేగ తెలిపి వేగిర ముదముగా రండి రండి

 సాగు విభుని సన్నుతించి సంతసించి రండి

వారి జారి ముఖుల మెల్ల వ్రతము జీతమే రండి 


రించు త్రోవల నెఱింగి వర్తింత మెపుడు, 

తగిన మననోము నోమంగc దరలిరండు.

*****

మల్లా ప్రగడ గారు 🙏

మీ పాశురము–2 ను పాట రూపంలో (పల్లవి–చరణాలు)  ఆజ్ఞాత్మకత, తిరుప్పావై గంభీరత .


 పాశురము – 2 (పాట రూపం) 

పల్లవి

కాటుక పెట్టక, కల్వ పూలు చుట్టక,

చెయ్యరాని పనులు చేయబోక,

పాలుత్రాగక, పరులను దూషించక,

వినరమ్మా రండి చెలులార ఇక ॥


చరణం – 1

సర్వంసహాస్థితజనులార వినుడి మాట,

మనదగు వ్రతవిధానము నడిచే దారి తాట,

హితమతి వినుడి, పరిధి దాటక,

నియమమున నిలిచి నడువుడి మెల్లగా ॥


చరణం – 2

పాలసంద్రంబులో జగద్రక్షకుడు,

యోగనిద్రలోన దగులున్ పరముడు,

పరమపాదముల్ గొనియాడి భక్తితో,

పాలునేయియు మాని వేకువ నీరాడి ॥


పల్లవి (పునః)

కాటుక పెట్టక, కల్వ పూలు చుట్టక,

చెయ్యరాని పనులు చేయబోక,

పాలుత్రాగక, పరులను దూషించక,

వినరమ్మా రండి చెలులార ఇక ॥


చరణం – 3

బాగుమీర మనము తీరుజనులమై,

వేగం తెలిపి ముదముగా రండిరా,

సాగు విభుని సన్నుతించి సంతసించి,

వ్రతము జీతమై జీవనమార్పు చేయుదాం ॥


చరణం – 4

రించు త్రోవల నెఱింగి వర్తింత మేపుడు,

తగిన మననోము నోమంగా దరలి రండి,

శుద్ధ మనసుతో సేవయే శరణ్యమై,

భక్తి దీపము వెలిగించి నడుద్దాం ॥


ముగింపు (సంధి / మంగళం)

నియమమే నిత్యము, నమ్మకమే బలం,

వ్రతమొక జీవన మార్గమై వెలుగును దయచేయున్ ॥

*****


🌷 తిరుప్పావై – మూడవ రోజు (పాట రూపం) 🌷

పల్లవి

ఏల కరుణించ రారు నోము నోచు వారమీ

ఏల కనుపించ బోరు నోము తీరు స్వామీ

ఏల దీవించ రారు గోపికా సమూహమీ

ఏల మురిపించ బోరు కన్యకామణీ ॥


చరణం – 1

ఏల నివసింత్రు వనముల కరుల తెరలలో

నేల తిలకించరొరుల కలువ కన్నులలో

ఏల సతతమ్ము జపము ప్రేమ మీరగా

ఏల మననమ్ము మనము నోము చేయగా ॥


చరణం – 2

ఏల మౌనవ్రతములు పెరుగ నీటి వరులై

ఏల కందమూలములు నడుమ తిరుగులై

ఏల యజ్ఞయాగములు నెలకు మూడవై

ఏల మించు ధ్యానము మూడడుగుల వానికై ॥


చరణం – 3

బలిసిన చేపలెగిరి పడుచు నున్నదీ

తేనెద్రావిన తుమ్మెద మైమరచినదీ

మత్తుగా నిద్రలో జారి లోకమరచినదీ

గోవులన్నియు పుష్టియై కోరినది తెచ్చునీ ॥


చరణం – 4

పాలనిడుచుండు చక్కటి పాడి కల్గునీ

ఎంతులేని ఐశ్వర్యమబ్బు మనకునీ

కనుక వ్రతము చేద్దమురండి కాంతలార

రండి రండి చేరి పాడెదం అందరార్ ॥


చరణం – 5

చెలులార వినరమ్మ బలిచక్రవర్తిచే

పొందిన దానమానందమిడగగా

ఆకాశమంతట లోకాల కొలచిన

పురుషోత్తముని దివ్య చరణములన్ ॥


చరణం – 6 (మంగళాంతం)

నామంబులు జగతి క్షేమంబుకై పాడి

వసుధ తిరుప్పావై వ్రతము కొరకు

స్నానముల్ జేసియు సకల కోర్కెలు తీరి

శ్రీహరి కృపతో జీవితం పండుగ కాగ ॥

👉

*****

ఆండాళ్ తిరుప్పావై – 4వ పాశురం “ఆళిమళైకణ్ణా” భావాన పాటగా

🌧️ ఆళిమళైకణ్ణా – వర్ష ప్రార్థనా గీతం 🌧️

(తిరుప్పావై – 4వ పాశురార్థ భావగీతం)


పల్లవి

ఆళిమళై కణ్ణా… అచ్యుతా రా

సేవలు జేయుచు సిరులు నిచ్చే దాతా రా

ముందుగా ఇంద్రుని మొక్కుదాం మమ్మ

వర్షాల వరములు కురిపించుమమ్మ

చరణం – 1

వర్షదేవుడా, సంకోచమొద్దు రా

సముద్రమధ్యమునకు వెళ్లి నీటిని త్రాగు రా

గర్జించి గర్జించి గగనమున నిండుగా

నారాయణుని నల్లని కాంతిలా మెరిసి రా

చరణం – 2

పద్మనాభుని చేతిలోని చక్రమువలే

సుదర్శనమై మెరయుము మేఘములే

పంచజన్యమువలే గర్జించిక రా

వైకుంఠధామ శరపరంపరలా కురిపించు రా

చరణం – 3

ప్రజలెల్ల జీవించునట్లు వర్షము రా

పంటల పల్లవించి పరవశించునట్లు రా

మార్గశిరమాసమున వ్రతమాచరించు

స్నానము చేసి ఆనందించునట్లు చేయుము

చరణం – 4

ప్రాణులెల్ల జీవించి పరిఢవిల్లగా

భూమాత నవ్వున నవనవలసగా

మార్గళి నీరాడ మేము మేపుతో

జూగు చేయక వర్షింప నేగుదెమ్ము

చరణం – 5 (ముగింపు ప్రార్థన)

తగిన మననోము నోమంగ దరలిరండు

ధర్మమార్గమున నడిపించు కృష్ణుండు

ఆళిమళై కణ్ణా! ఆపద తీర్చు రా

అన్నప్రసాదముతో లోకమంత నింపు రా

ముగింపు పల్లవి (నెమ్మదిగా)

ఆళిమళై కణ్ణా… అచ్యుతా రా

సేవలతో సిరులు నిచ్చే కరుణాసాగరా

🎶 పాడే సూచన

రాగభావం: మోహనం /

*****



*జై శ్రీమన్నారాయణ!*

  *శుభ ధనుర్మాసం….*



*తిరుప్పావై గురించి ప్రాధమిక అవగాహన ఆధారంగా తయారు చేసిన 108 ప్రశ్నలు-జవాబుల గోష్టియే ఈ తిరుప్పావై.*


శ్రీకృష్ణుడు అందరినీ కలిసి రమ్మన్నాడు, లౌకిక సుఖాలు ఎవరికి వారు అనుభవించేవి, కాని భగవత్ అనుభవం అందరితో కలిసి చేసేవి, దాన్నే గోష్టి అంటారు.


*1. ఆండాళ్ అని ఎవరికి పేరు?    

     = గోదాదేవి.


2. తిరుమల ఆలయంలో ధనుర్మాసంలో దేని బదులుగా తిరుప్పావై గానం చేస్తారు?

=  సుప్రభాతం బదులుగా.


3. ఏది అసలైన మంచిరోజని గోదాదేవి చెప్పినది?

= ‘భగవంతుని పొందాలి అని మన మనసులో పడిన రోజే’ మంచిరోజు.


4. గోదాదేవి తులసివనంలో లభించగా పెంచిన తండ్రి ఎవరు?

   =  శ్రీ విష్ణు చిత్తులు.(పెరియాళ్వార్)


5. ఆళ్వారులు ఎంతమంది?

      = 12మంది.


6. గోదాదేవి ఎవరి అంశగా అవతరించింది?

     = భూదేవి.


7. గోదాదేవి తిరుప్పావైను ఏ భాషలో గానం చేసింది?

   = తమిళ భాష.


8. తిరుప్పావై ఏ దివ్య ప్రబంధములోని భాగము?

  = నాలాయిర్ దివ్యప్రబంధము.


9. శ్రీ వైష్ణవ దివ్యదేశాలు ఎన్ని?

      = 108.


10. గోదాదేవి అవతరించిన దివ్యదేశం పేరు ఏమిటి?

    = శ్రీవిల్లిపుత్తూరు.


11. దామోదరుడు అని శ్రీకృష్ణుని ఎందుకు పిలుస్తారు?

   = దామము (త్రాడు) ఉదరము నందు కలవాడు కనుక.


12. శ్రీవిల్లిపుత్తూరు గోపురం ఎత్తు ఎంత?

    = 196 అడుగులు.


13. ‘లోకాఃసమస్తాఃసుఖినో భవంతు’ అనే భావన తిరుప్పావై ఎన్నవ పాశురంలో చెప్పబడినది?

= మూడవ పాశురం.


14. శ్రీవిల్లిపుత్తూర్ లోని రంగనాథ ఆలయంలో రాత్రి పూట స్వామికి చేసే ఆరగింపుకు ఏమని పేరు?

= తిరుసాదము.


15. శ్రీవిష్ణుచిత్తులు వారు తనకు తులసివనంలో లభించిన ఆండాళ్ కు మొదట పెట్టిన పేరు ఏమిటి?

= కోదై (గోదా)


16. పెరియాళ్వారుని (శ్రీవిష్ణుచిత్తులు) భగవంతుడి ఏ అంశగా భావిస్తారు?

= గరుడాంశము.


17. తిరుప్పావైను సంస్కృతంలో ఏమంటారు?

=  శ్రీవ్రతము.


18. మేఘాన్ని ఎలా గర్జించమని గోదాదేవి చెబుతుంది?

= పరమాత్మ చేతిలోని శంఖమువలే.


19. శ్రీవేంకటేశ్వరుని చేరుటకై గోదాదేవి ఎవరిని వేడుకొన్నది?

= మన్మధుని


20. తల్లివద్ద కృష్ణుడు ఎలా ఉంటాడని గోదాదేవి చెప్పినది?

= సింహం పిల్లవలె.


21. తిరుప్పావై వ్రతమును ఆచరించుటకు అర్హత యేమిటి?

= ధృడమైన కోరిక, పట్టుదల.


22. కాలం కలసి రాకుండా దిక్కుతోచని స్థితి ఉన్నపుడు తిరుప్పావై ఎన్నవ పాశురాన్ని ప్రతిరోజు 11 సార్లు పారాయణం చేయాలని చెబుతారు?

= మొదటి పాశురం.


23. శ్రీకృష్ణుడు యశోద గర్భాన జన్మించాడని గోదాదేవి ఎందుకు కీర్తిస్తుంది?

= దేవకీపుత్రుడని కీర్తిస్తే కంసుడికి తెలిసి పోతుందేమోనని. (భావనా పరాకాష్ఠ)


24. ధనుర్మాస వ్రతం పాటించేటపుడు చేయవలసిన పనులేవో, చేయకూడని పనులేవో తిరుప్పావై ఎన్నో పాశురంలో చెప్పబడినది?

= రెండవ పాశురం.


25. తిరుప్పావై మూడవ పాశురంలో దశావతారాలలోని ఏ అవతారం గానం చేయబడినది?

= వామన అవతారం.


26. ఆళ్వార్లకు మరో పేరేమిటి?

= వైష్ణవ భక్తాగ్రేసరులు. దైవభక్తిలో మునిగి లోతు తెలుసుకున్నవారు, కాపాడువారు అని అర్థము.


27. నెలకు ఎన్ని వర్షాలు కురవాలని గోదాదేవి చెప్పినది?

=  మూడు.


28. మేఘాన్ని ఏ విధంగా మెరవుమని గోదాదేవి శాసిస్తుంది?

= పద్మనాభుడి చేతిలోని సుదర్శన చక్రం వలె.


29. శ్రీకృష్ణుడు ఎక్కడ జన్మించాడో చెప్పడానికి గోదాదేవి చెప్పిన పేరు ఏమిటి?

= ఉత్తర మధుర. (మధుర మీనాక్షి అని అనుకోకుండా వుండడానికి).


30. ‘పెరునీర్’ అంటే  ‘పెద్ద మనస్సున్నది’ అని గోదాదేవి ఏ నదిని కీర్తిస్తుంది?

= యమునా నది.


31. మనందరం పాటించవలసిన ఏ గుణాన్ని గోదాదేవి నాల్గవ పాశురంలో చెబుతుంది?

= దానగుణం.


32. లోకాన్ని సుఖపెట్టే లక్షణం ఉండాలని గోదాదేవి ఎవరికి చెబుతుంది?

= వర్షానికి.


33. పరమాత్మవద్దకు వచ్చేటపుడు ఎలా రావాలని గోదాదేవి చెబుతుంది?

= పరిశుద్ధులమై (త్రికరణ శుద్ధిగా) రావాలి.


34. విగ్రహరూపంలో వున్న పరమాత్మపై మనకు మంచి విశ్వాసం కలగాలంటే తిరుప్పావై ఎన్నవ పాశురం పారాయణ చేసుకోవాలి?

= ఐదవ పాశురం.


35. విష్వక్సేన అంశగా గల ఆళ్వారు పేరేమిటి?

= నమ్మళ్వారు.


36. తిరుప్పావై ఆరవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?

= బుద్ధివ్రతం.


37. గోదాదేవి మొదటగా మేల్కొనే గోపికను ఏమని పిలుస్తుంది?

= పిళ్ళాయ్ (పిల్లా).


38. తిరుప్పావై ఆరునుండి పదిహేను వరకు గోదాదేవిచే లేపబడు గోపికలను ఎవరితో పోల్చి చెబుతారు?

= ఆళ్వార్లతో.


39. గద (కౌమోదకీ) అంశ గా గల ఆళ్వారు ఎవరు?

= పూదత్తాళ్వారు.


*40. తిరుప్పావైలోని ఏడవ పాశురం ఏ దివ్యదేశంలో రెండుసార్లు పాడుతారు?

= శ్రీపెరుంబుదూరులో ఆదికేశవ పెరుమాళ్ సన్నిధిలో.


*41. కీచుకీచుమని అరిచే  ‘ఏ’ పక్షులు తిరుప్పావైలో ప్రస్తావించబడ్డాయి?

= భరద్వాజ (చాతక) పక్షులు.


*42. తిరుప్పావై ఏడవ పాశురంలో స్మరింపబడిన ఆళ్వారు ఎవరు?

= కులశేఖరాళ్వార్.


*43.  మనకు తెలిసిన మంచి విషయాలు పదిమందితో పంచుకోవాలని మనకు తెలియచేసే ప్రాణులేవి?

= పక్షులు.


*44. ఎనిమిదవ  పాశురంలో నిద్రలేపబడు గోపిక ఏ ఆళ్వారును సూచిస్తుంది?

= నమ్మళ్వారు.


*45. పశువులను ప్రాతఃకాలాన్నే చిరుమేత కొరకు వెళ్ళే పచ్చిక బయళ్లను తిరుప్పావైలో ఏమంటారు?

= శిరువీడు.


*46. భగవానుడి కౌస్తుభాంశముతో పోల్చబడిన ఆళ్వారు ఎవరు?

= కులశేఖరాళ్వార్.


*47. అగస్త్యుడు నిలిచిన ఊరుకు ఏమని పేరు?

= కుంభకోణం.


*48. పదకొండవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?

= ప్రీతి వ్రతం.


*49. కర్మయోగాన్ని చెప్పిన ఆళ్వారు ఎవరు?

= పూదత్తాళ్వార్.


*50. పదమూడవ పాశురంలో చెప్పబడిన గోపికల రెండు వర్గాలు ఎవరెవరికి చెందినవారు?

= శ్రీకృష్ణుని వర్గం, శ్రీరాముని వర్గం.


*51. పదమూడవ పాశురంలో శ్రీకృష్ణుని ఏ లీల తెలుపబడింది?

= బకాసుర వధ.

 

*52. సన్యాసులు ధరించే కాషాయ వస్త్రాలు దేనిని సూచిస్తాయి?

= త్యాగం.


*53. శ్రీవత్సము అంశగా గల ఆళ్వారు ఎవరు?

= తిరుప్పాణి.


*54. తిరుప్పావై జీయర్ అని ఎవరికి పేరు?

= భగవద్రామానుజులు.


*55. తిరుప్పావై 30 పాశురములలో మధ్యదైన 15వ పాశురంలో చెప్పబడిన భక్తుని విశేష లక్షణమేమి?

= నానేదానాయిడుగ- అంటే ‘దోషము నా యందే కలదు!’


*56. శ్రీకృష్ణుడు కువలయాపీడమను ఏనుగును సంహరించుటలో అంతరార్ధమేమి?

= అహంకారమును హతమార్చుట.


*57. పదహారవ (16వ) పాశురం నుండి ఏ వ్రతము ప్రారంభమగుచున్నది?

= దాస్య వ్రతము.


*58. గోపికలు ఆచార్యునిగా ఎవరిని భావిస్తున్నారు?

= నందగోపుని (భగవానుని అందించారు కనుక)


*59. కోయిల్ అనగా ఏమి?

= కోన్ అనగా స్వామి. ఇల్ అనగా స్థానము. - భగవంతుని నివాసము.


*60. నందుణ్ణి ఏ గుణము గలవానినిగా గోపికలు కీర్తిస్తారు?

= దాన గుణము.


*61. గోపికలు ‘ఎంబెరుమాన్’(మా స్వామీ) అని ఎవరిని పిలుస్తారు?

= నందుడు.


*62. భగవానుడి ధనురంశగా గల ఆళ్వారు ఎవరు?

= తిరుమంగై యాళ్వారు. 


*63. గోపికలు తమ వంశమునకు .!మంగళ దీపమని’ ఎవరిని కీర్తిస్తారు?

= యశోద.


*64. ‘శెంపొర్కజలడి’ -ఎర్రని బంగారు కడియం దాల్చిన పాదం (Golden leg) గలవాడని గోపికలు ఎవరిని కీర్తించెను?

= బలరాముడు. 


*65. నీళాదేవి ఎవరు?

= కృష్ణుని మేనమామైన కుంభుని కూతురు.


*66. యశోద తమ్ముడు ఎవరు?

= కుంభుడు.


*67. భగవానుడి ఖడ్గము (నందకము) అంశముగా గల ఆళ్వారు ఎవరు?

= పేయాళ్వారు.


*68. ఆండాళ్ అలంకరణలో విశేషమేమిటి?

= ఎడమవైపు కొప్పు. ఎడమచేతిలో చిలుక.


*69. భగవద్రామానుజులు అత్యంత ప్రేమతో అనుసంధానం చేసే పాశురమేది?

= 18 వ పాశురం.


*70. లక్ష్మీ అమ్మవారి కటాక్షం లభించాలంటే ఏ పాశురాన్ని నిత్యం 11 సార్లు పఠించాలి?

= 18వ పాశురం.


*71. శ్రీకృష్ణుడు శయనించిన మంచపు కోళ్ళు ఏ ఏనుగు దంతాలతో చేయబడ్డాయని గోదాదేవి వర్ణించినది?

= కువలయాపీడము.


*72. అశ్వినీ దేవతలు ఎవరు?

= సంజ్ఞాదేవి కుమారులు ఇద్దరు- నాసత్యుడు, దన్రుడు.


*73. గోపికలు నీళాదేవినుండి ఏ వస్తువులు వరముగా పొందిరి?

= అద్దము, విసనకఱ్ఱ.


*74. తిరుప్పావై 20 వ పాశురం పారాయణ వలన ఏ లౌకిక కోరికలు తీరును?

= కుటుంబ కలహాలు తొలగి అన్యోన్య దాంపత్య జీవనం.


*75. ఇరవై మూడవ పాశురంలో గోపికలు పరమాత్మను ఏ జంతువుతో పోల్చిరి?

= మృగరాజగు సింహము.


*76. ప్రసిద్థములైన మూడు గుహల పేర్లేమిటి?

= అహోబిలం, పాండవుల గుహ, వ్యాస గుహ.


*77. పరమాత్మ వద్ద ఎట్టి వాసన యుండును?

= సర్వగంథః -సర్వవిధ పరిమళములు.


*78. పరమాత్మ బ్రహ్మకు వేదోపదేశము చేయుటను ఏ జంతువు అరుపుతో పోలుస్తారు?

= సింహ గర్జన.


*79. కిరీటాలు ఎన్నిరకాలు? వాటి పేర్లేమిటి?

= మూడు-కిరీటం, మకుటం, చూడావతంసము.


*80. కపిత్థవృక్షమనగా ఏ చెట్టు?

= వెలగ చెట్టు.


*81. ఇరవై ఆరవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?

= భోగవ్రతము.


*82. ఇరవై ఆరవ పాశురాన్ని ఏ దివ్యదేశంలో రెండుసార్లు చదువుతారు?

= శ్రీవిల్లిపుత్తూరు.


*83. పరమాత్మ యొక్క శంఖమునకు ఏమని పేరు?

= పాంచజన్యము.


*84. ఇరవై ఏడవ పాశురంలో పేర్కొనబడిన ‘కూడార్’ ఎవరు?

= సర్వేశ్వరునితో కూడి ఉండుటకు ఇష్టపడని వారు.


*85. ఇరవై ఏడవ పాశురం రోజు సమర్పించే ప్రసాదం పేరు ఏమిటి?

= కూడారై ప్రసాదం (108 వెండి గంగాళాలలో ఈ ప్రసాదం ఆరగింపు చేస్తారు)


*86. భగవంతుడి శిఱుపేరు (చిన్నపేరు) ఏమిటి?

= గోవింద.


*87. భగవానుడి సుదర్శన చక్రాంశముగా గల ఆళ్వారు ఎవరు?

=  తిరుమొళిశై యాళ్వారు.


*88. కృష్ణునికి, గోపికలకు ఉన్న సంబంధం దేనితో పోల్చబడినది?

= సూర్యునికి, కాంతికి గల సంబంధము.


*89. గోదాదేవి తాను ఎవరి వెనుక వెళ్తున్నట్లు ఇరవై ఎనిమిదివ పాశురంలో పాడుతుంది?

= ఆవుల వెనుక.


*90. ధనుర్మాసములో ఎన్నవ పాశురము చదివే రోజున స్వాములకు నూతన వస్త్రములు సమర్పించే సంప్రదాయము కలదు?

= 27 వ పాశురం.


*91. పొత్తామరై అడి- అందమైన తామర పూవు వంటి బంగారు ఛాయ కలిగిన పాదములు ఎవరివి?

= శ్రీకృష్ణునివి.


*92. భగవంతుని పాదములకు మంగళం పాడుట ఎవరి లక్షణము?

= దాసుని లక్షణములు.


*93.  ‘అజాయమానః’ (పుట్టుక లేనివాడు) అని పరమాత్మను గూర్చి పలికిన ఉపనిషత్తు వెంటనే మాటమార్చి ఏమని పలికెను?

=  ‘బహుధా విజాయతే’(అనేక విధములుగా పుట్టుచున్నాడు)


*94. సముద్రాన్ని దాటించేది ఓడ అయితే సంసారమును దాటించే ఓడ ఏది?

= విష్ణుపోతము(విష్ణువనే ఓడ)


*95. పరమాత్మ గొప్పా? ఆయన దాసులు గొప్పా?

= ఆయన దాసులే గొప్ప.


*96. ఏడేడు జన్మలనగా ఎన్ని జన్మలని అర్ధము?

= ఎన్ని జన్మలకైనా అని అర్థము.


*97. ఇరవై తొమ్మిదవ పాశురములో గోదాదేవి ఏ దివ్యదేశమును కీర్తించెను?

= అయోధ్య.


*98. వజ్గం అంటే ఏమిటి?

= ఓడ.


*99. ధన్వంతరి అవతారంలో శ్రీమహావిష్ణువు చేతిలో ఏమి కలిగి వుంటాడు?

= అమృత కలశం.


*100. ముప్ఫయ్యవ పాశురంలో పరమాత్మను ఏమని వర్ణించెను?

=  ‘తిజ్గళ్ తిరుముగత్తు’- అనగా చంద్రుని పోలిన దివ్యతిరుముఖ మండలం గలవాడా.


*101. గోపికల దివ్యాభరణములేవి?

= కృష్ణుని ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించుటయే.


*102. శ్రీ విల్లిపుత్తూరు ఎటువంటిదని గోదాదేవి కీర్తించెను?

‘అణి పుదువై’  ఈ జగత్తుకే మణివంటిది.


*103. శ్రీవిష్ణుచిత్తుల వారు తమ మెడలో ఏ మాల ధరించెను?

= పైమ్ కమల తణ్తెరియల్ - నల్లని చల్లని తామర పూసల మాల.


*104. గోదాదేవి ముఫ్పైవ పాశురంలో తాను ఎవరి కూతురునని చెప్పెను?

=  పట్టర్ పిరాన్ కోదై (శ్రీవిష్ణుచిత్తుల వారి గోదాదేవిని).

 

*105. తిరుప్పావై ఎటువంటి మాల?

= ముఫ్ఫై తమిళ పాశురములనే పూసలతో చేయబడ్డ మాల.


*106. శ్రీకృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ‘ఆముక్తమాల్యద’ ఎవరి పేరు?

= గోదాదేవి.


*107. శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలో ఎవరి కల్యాణం వర్ణింపబడినది?

= గోదాదేవి మరియు శ్రీరంగేశుల కల్యాణం.


*108. భగవానుడి వనమాల అంశగా గల ఆళ్వారు పేరేమిటి?

= తొండరపడిప్పొడి యాళ్వార్.


ఆణ్డాళ్ దివ్య తిరువడిగళే  శరణమ్🙏

[14/12, 21:10] Mallapragada Ramakrishna: *భక్త జనావళికి అక్షరాజ్యం, పురాణ యితిహాసాల మకరందం, ధర్మశాస్త్ర కోవిదులకు ఆహారం, జ్ఞానచకోర భక్తుల అమృతం, భక్త జ్ఞానపిపాసులకు అక్షర నిలయం, సాధుసంతుల నిత్యం మణిమాల భగవద్గీత*


*ఆస్తికుల ఆదాయం, నాస్తికుల ఆయుధం, అహంకారుల గుణపాఠం, ఆధ్యాత్మిక భవిష్యత్తు, మూఢాంధులకు దివ్యసాధనం, జ్ఞానాంధులకు కనువిప్పు తెచ్చే భగవద్గీత*


*ఆధ్యాత్మికులకు జ్ఞాన శిఖరం నిత్యసేవనం అదే జీవనం, ఆస్వాదించే వారికి మధురం, ఔ పోసన పట్టే వారికి సుమధురం, ధర్మాధర్మాల సకర్మ వికర్మల మనోహరం భగవద్గీత*


*గురుబోధల మధురవనం, నిరంతర సంచరించే వనం, ఆధ్యాత్మిక భక్తి సుమవనం, భక్తుని గ్రోలే ఉద్యానవనం, మనోహ్లాదానికి నందనవనం, వ్యక్తిత్వ వికాసానికి విడివనం భగవద్గీత.*


*అక్షర మధురం, హృదయ మృదంగ ధ్యానం, హైందవ శంఖారావం, సామూహిక అంతర్జాలం, ధ్వనించే  నాదం, లయాత్మక ప్రతిధ్వనుల వేదం భగవద్గీత*


*ఆరాధించే వారికి వైభోగం, అనుభవించే వారికి భోగం, ఆస్వాదించే వారికి రాగం, నిత్యానుష్టాన పరులకు యోగం అదే భగవద్గీత*


*సాధకుల ఏకాగ్రత ధ్యానం, నిరంతర పయనం, గమ్యస్థానం, ముక్తి మార్గం వైపు జ్ఞాన బిక్షువులు విహరించే సొరంగం, ఆధ్యాత్మి సారంగం, అన్వేషించే గమనం భగవద్గీత.*


*అనూహ్య శక్తి సామర్థ్యాల వరం, అదే దైవబలం గ్రామ కాంతులమయం, పుణ్యఫలం, సాక్షాత్కార యోగం, నిత్యo ధ్యానం చేసే మార్గం భగవద్గీత. *


*రాజయోగం, ఆనందాలతీరం, అద్భుత ప్రవచనామృత జ్ఞాన ధనం, అష్టాదశ అధ్యాయాల ఆనందసారం, గురుపీఠం భగవద్గీత*

[15/12, 07:09] Mallapragada Ramakrishna: *🌈సూర్య నమస్కారాలలో*

*12 భంగిమలు ఉంటాయి.*


వాటి పేర్లు: 

ప్రణమాసనం, హస్త ఉత్తానాసనం, హస్త పాదాసనం, అశ్వ సంచాలనాసనం, చతురంగ దండాసనం, అష్టాంగ నమస్కార, భుజంగాసనం*, 


*పర్వతాసనం, అశ్వ సంచాలనాసనం, హస్త పాదాసనం, హస్త ఉత్తానాసనం, మరియు ప్రణమాసనం*. 


*🌈సూర్య నమస్కారంలోని 12 భంగిమలు:*


*1.🌞 ప్రణమాసనం (Pranamasana):*

*నమస్కార భంగిమలో నిలబడటం*


*2.🌞 హస్త ఉత్తానాసనం (Hasta Uttanasana):*

*చేతులు పైకెత్తి, శరీరాన్ని కొద్దిగా వెనుకకు వంచడం*.


*3.🌞 హస్త పాదాసనం (Hasta Padasana):*

*ముందుకు వంగి, చేతులతో పాదాలను తాకడం.*


*4. 🌞అశ్వ సంచాలనాసనం (Ashwa Sanchalanasana):*

*కుడి కాలును వీలైనంత వెనుకకు చాచి, మోకాలు నేలకు తాకకుండా ఉంచడం*.


*5. 🌞చతురంగ దండాసనం (Chaturanga Dandasana):*

*శరీరాన్ని నేలమీదకు దించి, చేతులతో బ్యాలెన్స్ చేయడం.*


*6.🌞 అష్టాంగ నమస్కార (Ashtanga Namaskara):*

*శరీరాన్ని నేలమీదకు దించి, 8 భాగాలు (రెండు పాదాలు, రెండు చేతులు, రెండు మోకాళ్లు, ఛాతీ మరియు గడ్డం) నేలను తాకడం.*


*7. 🌞భుజంగాసనం (Bhujangasana):*

*పాముల వలె శరీరాన్ని పైకి లేపడం.*


*8.🌞 పర్వతాసనం (Parvatasana):*

*పర్వతం ఆకారంలో శరీరాన్ని పైకి లేపడం*.


*9. 🌞అశ్వ సంచాలనాసనం (Ashwa Sanchalanasana):*

*ఎడమ కాలును వీలైనంత వెనుకకు చాచి, మోకాలు నేలకు తాకకుండా ఉంచడం*.


*10. 🌞హస్త పాదాసనం (Hasta Padasana):*

*ముందుకు వంగి, చేతులతో పాదాలను తాకడం.*


*11. 🌞హస్త ఉత్తానాసనం (Hasta Uttanasana):*

*చేతులు పైకెత్తి, శరీరాన్ని కొద్దిగా వెనుకకు వంచడం*.


*12. 🌞ప్రణమాసనం (Pranamasana):*

*నమస్కార భంగిమలో నిలబడటం*. 

*ప్రతి భంగిమలోనూ మంత్రాలు జపిస్తారు. ఒక్కో మంత్రం ఒక్కో దేవుడికి లేదా సూర్యుడికి సంబంధించినది. ఈ భంగిమలను క్రమ పద్ధతిలో చేయడం వల్ల శారీరక, మానసిక ప్రయోజనాలు కలుగుతాయి.*

 [14/12, 21:11] Mallapragada Ramakrishna: #*మల్లాప్రకగడ వారి సరళ భోదామృత భగవద్గీత శ్రీకృష్ణవాణి*


*ధర్మశాస్త్రాల పురాణేతిహాసాల సారం, ఆచార్య నిలయం, సంపద సారాంశం, తాత్విక ఆశ్రయం, భక్తుల ఆనంద ఆలయం, తాత్విక చింతన వరుల ఆశయం భగవద్గీత*


*అధర్మంపై ధర్మ విజయకేతనం, జీవులకు భగవత్ తత్వ దర్పణం, కర్తవ్య శుభకేతనం, అంతర్గత లోపాల దర్శనం, 

మనశ్శాంతి కేతనం భగవద్గీత*


.*జీవాత్మకు కర్త, ఆధ్యాత్మిక ప్రయోక్త, అనుబంధ వక్త, తారతమ్య తెలిపే వేత్త, స్వరూపాన్ని బోధించే ప్రవక్త, జీవాత్మ సంధాన రూపకర్త సృష్టికర్త లెక్కించే గుణాంకవేత్త భగవద్గీత*


*కర్త కర్మ క్రియల మనోరధి, సంకల్ప విజయ సారథి, అజ్ఞానాంధకారాన్ని తొలగించు దాశరధి, సంస్కారాన్ని అందించే మహారథి, భగవద్గీత*


*మానవులకు ఆధ్యాత్మిక వజ్రం, జ్ఞానవర ప్రసాద దివ్య మంత్రం, నాయకులకు దండం, పరమాత్మ నేస్తం, సర్వులకు దివ్య ఔషధం భగవద్గీత*


*భగవంతుని అక్షరమాల ముముక్షువులకు ముక్తి మాల,

 దారి చూపే నక్షత్రమాల, విశ్వవ్యాప్తివై ఉన్న దీక్ష మాల, వెలుగునిచ్చే దీపమాల భగవద్గీత.*


*సాధకులకు క్షేత్రం, విజ్ఞానవంతులకు చిత్తం, 

రాగద్వేషాలకు యంత్రం,శక్తియక్తుల తంత్రం 

సంస్కారులకు మంత్రం సమస్త జ్ఞాన సంద్రం భగవద్గీత*


దైవత్వం చూపు మనోనేత్రం జీవకోటిలో పంచే జ్ఞాననేత్రం సాధన మంత్రం శ్రామిక యంత్రం కాల కుతంత్రం అంతా భగవద్గీత


*నింగి నేలను ఏకం చేస్తుంది - వర్షం*.

*దేవుణ్ణి జీవుణ్ణి ఏకం చేస్తుంది - జ్ఞానం*.

*ఈ సృష్టి అనేది తిరగేసిన వృక్షం లాంటిది:- మొదలు (కారణం) అనేది పైన (పరబ్రహ్మంలో) ఉంటుంది.

శాఖలు (కార్యం) అనేవి కింద (ప్రపంచంగా) ఉంటాయి*.

*జీవస్థితి నుండి దైవ స్థితికి చేర్చే వంతెన లాంటిది  ప్రపంచం లో భగవద్గీత*

[14/12, 21:16] Mallapragada Ramakrishna: * *మానసిక సౌభాగ్యానికి శారీరక స్వస్థత ముఖ్యం*

*దేశ రక్షణకు క్రమశిక్షణ ముఖ్యం*


* దరిద్రుని మాట ఎంత యుక్తి సంగతమైనా ఎంత ప్రామాణికమైన దాన్ని ఎవరు వినరు, ధనకుల మాట ఎంత స్పష్టంగా అర్థరహితంగా ఉన్న దాని అందరూ గౌరవిస్తారు*.


*కోరికలు తీర్చుకుంటున్న కొద్దీ పెరుగుతాయే తప్ప కోరిక తీరిన తృప్తి జీవితంలో రాదు. కోరికలు తీర్చుకుని తృప్తి పడదాం అనేది ఎలాంటిది అంటే నిప్పును ఆర్పడానికి నెయ్యి పోయడం వంటిది*


*డబ్బులు సంపాదించాలి.అంతే కాదు ఎక్కువ చెయ్యాలి అలాగే రక్షించాలి.ఏ ఆదాయం లేకుండా తిని పడుక్కుంటే మేలు పర్వతం కూడా కరిగిపోతుంది.*


* "బుద్ధిమంతుడు అప్రియమైన మాటలను, పరుష వచనాన్ని, పరులకు ద్రోహమును, పరస్త్రీని, అధర్మాన్ని, అసత్యాన్ని దూరంగా విడిచిపెట్టాలి".*


* శీలము, దాక్షిణ్యము, మాధుర్యము,# ఉత్తమ కులంలో పుట్టుక, ఇవన్నీ ఎన్ని ఉన్నా ధనహీనులకు రాణించవు. *

No comments:

Post a Comment