Friday, 5 September 2025

 శీర్షిక: నీవే నమ్మా — కీర్తన


పల్లవి (Chorus — పద్యం మాదిరిగా మళ్లించాలి)

నీవే — ఈ ప్రాణమే మనోమయ తీరమ్ము నీవే,

నీవే — ఈ ప్రాభవమ్ముగా మనసయ్యేను నీవే,

నీవే — ఈ ధ్యానమే సహాయము మూలమ్ము నీవే,

నీవే — ఈ ధ్యాస యెవిహారము జ్ఞానమ్ము నీవే।

(పల్లవిని 2సార్లు పాడి, తర్వాత చరణానికి వెళ్ళండి)


చరణం 1

ఈ జీవితమ్ములో హృది యందమ్ము నీవేగా,

రాజీవనేత్ర యా రసరాజమ్ము నీవేగా;

జీవ శిఖలాల బిగింపుల మధ్యలో వెలుగునై,

నీ నామ స్మృతే నివాసమై నాది నీవేగా॥


(పల్లవి రెండవసారి — సంకల్పంగా మన్నించి పాడి)


చరణం 2

ఈ రోజు రాత్రిలో నెలచందున్డు నీవేగా,

ఈ మోజు దీవిలో యిల సూర్యుడూ నీవేగా;

వెలుగులందు నీ రూపమే మార్గదర్శిని,

అరుణోదయములనూ నీవే నిఖిలాంశునీ॥


(పల్లవి — ఒకసారి పాడి)


బ్రిడ్జ్ / అంతర (మధ్యలో మౌన భావం తరువాత)


ఈ మనస్సదిలో నీ శరణమనే గాధను,

హృదయతలలో నీ శక్తి సాక్షాత్కారమని;

సత్కర్మ పధ్మం పక్కనుంటే నేనెక్కడ వెన్నెత్తను,

నీ దర్శనమే ధ్యాసారాధనమే — నీవే నీవే॥


(పల్లవి — ముగింపు కోసం 3సార్లు, చివరిదీ నెమ్మదిగా వినతిగా)


ముగింపు (Antara reprise)

నీవే — నీవే — నీవే... (మెలోడి నెమ్మదిగా ఆరెత్తి శాంతిగా ముగిస్తారు)


సంగీత సూచన

తాలం: ఆది తాళం (8-beat)


వేగం: మధ్యమ (క్రిందపాటి) — భక్తి, శాంతి భావం కోసం కొంచెం నెమ్మదిగా.

రాగo సూచన: శంకరాభరణం

****

🎶 చిన్న పాట 🎶

పల్లవి

గర్వమునే కళ్ళు మూసె – గట్టున తేలదు జీవితం

ధైర్యముతో బుద్ధి మేలే – ధర్మమే క్షేమ ఫలితం ॥


చరణం

వ్యాకుల కర్మలు చీకటియై – మార్గమునుండి తారుమారుగన్

సాధన శోధనలోనే – సీత జాడలు కనుగొనగన్ ॥


ఒనరగు గూపభేకముతో – ప్రగల్భమునేను లాడవద్దు

జ్ఞాన ధర్మమే మేలనియు – జీవన కీర్తి నిలుస్తుందు ॥


మాయగర్వంబు వీడి సాగు – సత్యమునే సుగమ మార్గం

భక్తి విశ్వాసమే తాళమై – బ్రతుకు గీతము గానమౌ ॥

👉

శ్రీశ్రీ శ్రీ వెంకటేశ భజన... (01)


పల్లవి :

శ్రీ వేంకటేశా నీ దయే ఆశ్రయము

శ్రీనివాసా నీ భజన సౌఖ్యము ॥


చరణం 1 :

శ్రీ గణనాథునిన్ గొలిచితిని

సాగర బంధములు తొలగించితివి

భవభయంబులు నశింపజేసి

ధర్మతత్త్వమున్ నన్ను నిలిపితివి ॥


చరణం 2 :

హృద్యమై శాంతి యందు నిలిపి

నీ పాదములే సత్యమని చూపితివి

గద్యములందు ముక్తి ప్రసాదించి

భక్తి వేల్లెలు నాలో నింపితివి ॥


చరణం 3 :

జగమునందున్ నీవే శరణు

జనులందరికీ దయే కరణు

పద్య గద్యముల పాటలలోన

పులకింపగ నీవే ప్రాణధనము ॥


చరణం 4 :

పాడితి నిత్యం నీ పాదములు

భక్తిపూర్వకముగా జ్ఞాపకములు

ఆలపితి భవ భయ నాశకా

వేంకటేశా నీవే పరమేశ్వరా ॥


పల్లవి :

శ్రీ వేంకటేశా నీ దయే ఆశ్రయము

శ్రీనివాసా నీ భజన సౌఖ్యము ॥


****

శ్రీశ్రీ శ్రీ వెంకటేశ భజన... (02)


పల్లవి

భజనరూపంలో ఇలా పాడవచ్చు:


పల్లవి:

స్వాభావ్యే శ్రీ మహాలక్ష్మీ! శరణాగత రక్షిణీ!

స్వాభావ్యే శ్రీ మహాలక్ష్మీ! శరణాగత రక్షిణీ!


చరణం 1:

సుధీ సహాయముగా వెలిగే శాంతి స్వరూపిణీ

సంధ్యార్ధ కాంతులా కిరణించే దివ్యాంగిణీ ॥ స్వాభావ్యే… ॥


చరణం 2:

గంభీర కాంతియై జగమేల వెలుగునింపితివి

గమ్యార్థ సిద్ధిగా భక్తులకు దారినిచ్చితివి ॥ స్వాభావ్యే… ॥


చరణం 3:

ప్రాభల్య మూర్తియై సర్వమును ఆవరించితివి

భూభార హారణై వేంకటేశుని సోదరిణీ ॥ స్వాభావ్యే… ॥

🎶 అక్షరాల పాట 🎶


పల్లవి

అచ్చులు ఆనందం – అఆఇఈ ఉఊఋౠ ఎఏఐ ఒఓఔ అంఅః

పాడుదాం పల్లకీ – అక్షరాల ఆటలో కలసి!


చరణం

ఆ… అరుగు దగ్గర కూర్చుని,

ఆ… ఆటలతో పాడుతూ!


ఇ… ఇటుకలు తెచ్చి కట్టుదాం,

ఈ… ఈల వేస్తూ పరుగెత్తుదాం!


ఉ… ఉడత దగ్గర చేరి నవ్వుదాం,

ఊ… ఊగుతూ ఊయలలో ఊగుదాం!


ఋ… ఋషి ఆశీస్సు తీసుకుందాం,

ౠ… రమ్యమైన మాటలు చెప్పుకుందాం!


ఎ… ఎత్తు బల్లపై ఎక్కుదాం,

ఏ… ఏనుగు మీద ఊగుదాం!


ఐ… ఐసు తింటూ ఆడుదాం,

ఒ… ఒంటె దగ్గర చేరుదాం!


ఓ… ఓర్పుతో సరదాగా చూద్దాం,

ఔ… ఔరా అంటూ హర్షం చేసుకుందాం!


అం… అందరం కలసి మెలసి,

అః… అంతఃపురంలో రాణి చూద్దాం!


ముగింపు

అచ్చుల పాట పాడుదాం,

అందరం కలసి ఆడుదాం! 🎶

*****


సీస పద్యము


ప్రభుత్వ నిర్లక్ష్య ప్రభవమ్ము యిది యేను

తెలుగు వ్రాతలు వద్దు చెడుది ముద్దు

 తెలుగుముద్రణలేదు తెగులు ఆంగ్లము సద్ది 

భాషరాష్ట్రము సిగ్గు భవము లేదు 

ఆత్మ గౌరవమనే అందెలు యెక్కుట

అధికార వాంఛలు అప్పు గతిగ

మాతృభాషకుమంట మనతెలుగని 

తెలుగు ఆత్మలఘోష తప్ప దికను 

తే. గీ

మనకు భగవద్గీత పలుకు మాటవరకు 

చెప్పు ఒకటి చేయు నొకటి చితక బాదు 

రాజకీయము ధనమగు రాళ్ళ తెలుగు 

మాతృ భాష నిద్రగమారు మచ్చ బ్రతుకు

****

పద్యానికి భావవివరణ

➡️ ప్రభుత్వ నిర్లక్ష్యం వలన తెలుగు భాష వెనుకబడింది.

పాఠశాలలో, ముద్రణలో తెలుగు దూరమవుతోంది.

ఆంగ్లానికి అధిక ప్రాధాన్యం వస్తోంది.

తన భాషను గౌరవించని రాష్ట్రానికి సిగ్గు, ఆత్మాభిమానం లేకుండా పోయింది.

➡️ అధికార వాంఛలతో, స్వలాభాల కోసం, ఆత్మగౌరవం అనే మాటలతోనే మాయచేస్తున్నారు.

మాతృభాష మంటలో కాలిపోతూ ఉంది.

తెలుగు ఆత్మలఘోష తప్ప దానికి మద్దతు లేదు.

➡️ రాజకీయ నాయకులు భగవద్గీత, మాతృభాష, సంస్కృతి అనే మాటలు పలుకుతారు కానీ ఆచరణలో వేరేలా ఉంటారు.

రాజకీయమంటే ధనం, లాభం, స్వార్థం మాత్రమే.

దాని మధ్యలో తెలుగు మాతృభాష నిద్రలో మునిగి, దుర్భర జీవితాన్ని గడుపుతోంది.

*****

*****

ఎండలోన వానలోన నీవెగా 

దండలోన+ పూలలోన నీవెగా వేంకటేశ్వరా


విన్నవించనా సంతజేయనా విన్నవించి వింతజూప వేంకటేశ్వరా  


తలంతు నిన్నె యొంటిగా జనమ్ములో 

తలంతు నిన్నె మేడలో వనమ్ములో 

తలంతు నిన్నె యెప్పుడీ మనమ్ములో 

తలంతు నిన్నె మన్కిలో వేంకటేశ్వరా


ఆకసాన వెల్గు తార నీవెగా 

రాకలోన వెల్గు చంద్రుఁ డీవెగా వేంకటేశ్వరా


తలంతు నిన్నె జపమ్ముగాను

ఎండలోననే వానలోననే ఎండ వాన తోడుగాను వేంకటేశ్వరా 


వరమ్ము నీవె నాకు పూర్వ జన్మలో 

వరమ్ము నీవె నాకు నేఁటి జన్మలో 

వరమ్ము నీవె నాకు ముందు జన్మలో 

వరమ్ము నీవె భూమిలో వేంకటేశ్వరా


విస్మయమ్ముగా సంభవమ్ముగా విస్మయిమ్ము సంభవమ్ము వేంకటేశ్వరా


పదమ్ము పాడుచుందు నీకు ఛందమై 

ముదమ్ము నిండ మోహనాంగి యందమై 

సుధారసమ్ము చిందు పుష్ప గంధమై 

హృదాంతరాళ నందమై వేంకటేశ్వరా


వెన్నెలమ్మగా కిన్నెరత్విగా వెన్నెలమ్మ కిన్నెరత్వ వేంకటేశ్వరా 


*****

జీవన గీతిక శ్రేణి. (12)

*మేము అరవై లో ఇరవై* 

పచ్చగా పండు టాకులo చప్పుడు ఎండుటాకులం 

 అర్ధం చేసు కునే వాళ్ళం అనుభవాల వృద్ధులం


తలలు పండి నోళ్ళమే కళలు పంచె వాళ్ళమే 

 మంచిమాట తిమ్మరుసులమే గౌరవించడం అనని వాళ్ళమే 


కంటి చూపు మంద గించిన వయసుపెరిగినదే యనిన  

 ముందు చూపు లేనివారానిన మూడుకాళ్ళ ముసలోడనిన


అలసిపోయింది కాయమే ప్రేమతత్వము శాంతమే

సందేహం తీర్చేశక్తులమే ద్రోహం చేయలేని దేహమే

 

ఎగిరి అంబరాన్ని అందుకో లేము ఈ భూమికి కాబోము భారం కాము

ఆత్మగౌరవంతో జీవించే వారము బిడ్డలకే సంపద పంచె వాళ్ళము


కుందేళ్ళమై పరుగులు తీయలేము  తాబేళ్లమై గెలుపు బాట చూపలేము

మేధస్సుతో జయం కూర్చే వాళ్ళము ప్రోత్సాహంతో ప్రేమించే వాళ్ళము 


చెడుగుడు కూతల సత్తా చూపలేము చదరంగపు ఎత్తులు నేర్పగలము

అనుకున్నవి  సాధించ మార్గం చెప్పే వారము

సమయం ఎంతో బిడ్డలకోసం వెచ్చించేవారము

 సమయమంతా మీకు సమర్పిస్తాం అనేవారమే


అనుకోకుంటే అధిక ప్రసంగం చేసేవారమే

 అనుభవ సారం పంచుకుంటూ ఉండేవారమే

వాడిపోయే పూవులమైనా సహకరించేవారుమే

సౌరభాలు వెదజల్లుతూ ఆరోగ్యంగా తిరిగేవారమే


*****

జీవన గీతిక శ్రేణి  (12)

-ఓం నమః శివాయ శివతాండవం.


భుజంగంబులె హారముల్ భూతసంఘంబు జంగముల్

పంచభూతంబులుగనే జంగంబులున్ సు నాట్యమున్


న్పైతృ జాలంబులున్ నాట్య బృందంబులవ్వ శైలజార్ధంబు లో న లఘించగా

ఆర్ధ జైవాతృకుండాడ ధందిక్క ధంధిక్క జాళ్వాల మద్దెళ్ళు కంపింపగన్


విష్ణుజా ధారలన్ ధాత్రి శోభిల్ల జేజేల జుండున్ఘనశ్యామలాంగుండు సప్తర్షి జంభారి సంఘంబు సేవింప నందీ

శు జొహారు భృంగీశు స్తొత్రంబు స్కంధే శు జేజేలు


విఘ్నేషు శుండాల సౌస్వర్య జాత్యంపు ఘీంకార మాకాశ సీమం దుజృంభింప సంసారదుఖఃఘ్న !


ఓ శై లజామాత !

నీ నాట్య లాస్యంబు శ్రీ శై లజా మాత క్రీగంట లక్షించుచో అంగజానంద శృంగార కంజాక్షి యయ్యెన్ ప్రజాక్షేమమోదంబు ప్రాప్టించె భూమాత

జంజాటముల్ మాన్పి ధర్త్తింపు మో దేవ !


జోబిళ్ళ సేతున్ శివా ! కృత్తివాసా ! అజస్రంబు నీ నృత్త మానంద కందంబు జన్మంబు ధన్యంబు పూర్ణంబు గాగా సజావై మనోనేత్ర సెంయోగమౌ న

జోజో వరంబిమ్ము లోకేశ ఈశా ! అజేయా ! మహేశా ! మహాదేవదేవా !


---

జీవన గీతిక శ్రేణి (11) గుట్టు

మనసు అనేది ఎక్కడో లోతట్టు 

 చిన్నపాటి విరహాల వరద భట్టు 

 కన్య కనులు కవింపు ఉడుం పట్టు

 ఉండలేని సుఖాలు తొందర బెట్టు  


 ప్రేమించడమే కనువిప్పు మెట్టు

 నేనున్నానని తపించడమే పట్టు 

 మగువ తోడుగా మగవాడి గుట్టు 

 మగవాడి భాగ్యము మగువ బెట్టు 


 దివ్యం అమూల్యమైనట్టు 

 పాప పుణ్యాలు మోహమైనట్టు 

 గుండె మంట లార్పే మనసు గుట్టు 

 రెప్పపాటు నిప్పు చల్ల నైనట్టు 


 సొట్ట మల్లే కష్టం వస్తే కళ్ళ నీళ్లు పెట్టు 

 వ్యక్తి వెక్కి వెక్కి నవ్వులు చులక నైనట్టు 

 గజిబిజి వ్యవహారం గాయ మైనట్టు

 సవాళ్లతో సతమత మై నవ్విన్నట్టు


కాల జ్ఞానిగ సాగిపోవాలన్నట్టు

దుర్నీతి చూసి దాగిపోవాలన్నట్టు

మానవత్వము బత్కాలన్నట్టు

అమృతం త్రాగిపోవా లన్నట్టు


సత్కృతి జేయ ఊగిపోవా లన్నట్టు

చెడు కనపడిన తూగిపోవా లన్నట్టు

నిత్యము కలలా ఆగిపోవా లన్నట్టు

ధైర్యమే తొత్తు! కష్టంచిత్తయి నట్టు

*****

జీవన గీతిక శ్రేణి (10) విఘ్న నాయక 


పరుగులన్నియు తప్పకుండును  పాలు పంచుత శఖ్యతన్ 

దిరిగె చక్రము మాదిరే యగు తెల్ప గల్గెడి యోగ్యతన్  

 పురమునందున  యందరందరు పుణ్యమూర్తులు యేకమున్

 తిరుగతత్త్వము విఘ్ణనాయక తీర్పుగా యగు సందడే 


కుట్టుచుండును కాలమె ప్పుడు కొంచమైనను వీలుగన్,

పట్టుచుండును ధుమ్ముతప్పదు వాహనమ్ముల తీరుగన్ 

కొట్టుచుండును వర్ష మెప్పుడు గుడ్డ పందిరి దాటుచున్,

పొట్ట యంతయు చూడ ముచ్చట  మోదకమ్మను ముట్టుచున్.


పిక్కటిల్లెడు శబ్ద మెప్పుడు వీను లందున తప్పదున్

ముక్కులెప్పుడు కాల్వ కంపు నె మోద మొందుచు బీల్చుగన్!

చుక్క లేయుచు మందు బాబులు సొమ్మసిల్లుచు పొ ర్లుగన్! 

కుక్కలెప్పుడు  దాకకుండగ గోలతో గణ నాయికా


ఆడుచుండును భామ లెప్పుడు నన్ని గుడ్డలు జార్చుచున్,

మూడు పొద్దుల తిండి యెచ్చట పుట్ట బోదుగా నీడలో ,

పాడుపడ్డ మిఠాయి లెట్టును భక్తి పేరిట పంచుటన్,

పాడియాపుర వక్ర తుండుని పట్టుబట్టి వసించగన్

******

జీవన గీతిక శ్రేణి (10)

ఆసంధ్యలోన నేనుగా  యానందమవ్వ నిత్యమున్

ఆ కాంక్షలోన నేనుగా బంధమ్ముగాను నిత్యమున్


ఈసంధ్యలోన నేనుగా యేకాంతమవ్వ సత్యమున్

 ఈ కాంక్షలోన నేనుగా ధర్మార్ధ మగు సత్యమున్


వాసంతమైన బాడఁగా వర్ణమ్ములన్ని నిండెనా

ప్రశాంతమైన నీడగా కవిత్వమ్ములు తెల్పినా


వేసారెనది డెందమే విస్ఫోటమైన నీజతా

పాశమనేది యిష్టమే దుర్మార్గమైన నీజతా


అందాల తీరు వర్షమున్ హర్షమ్ముగాను నేడుగన్

సంతోష మౌను జల్లులే సాహిత్యమౌను నేడుగన్


సందేహమేళ  పర్వమే సారంగమేళ శాంతమే

ఈ దేహమేను నీదియే ఈ దాహమేను శాంతియే


బంధమ్ము లవి లోకమున్ వారించిరేరి యవ్వరే 

మౌనమ్ము లోన కాలమున్ మోక్షమ్ము గాను తెల్పరే


నిందించఁగాను నిన్నునే నిందుంటినే నిస్తేజమై 

సంతృప్తిగాను పొందువే యామాటలేల నిప్పుడే


ఆమందిరము సుందరం బాహాయిగాను పోదమా 

వనమంతయు చూపులే వత్సల్యమగు నేరుగా


ప్రేమమ్ములోన జీవమో విచ్ఛిన్నమైన  కష్టమే

దేహమ్ములోన రోగమో విపరీతంగ నష్టమే


ఓమోహమాయ యింతిగా యుత్సాహమది చూపిటే

ఓ ప్రేమ మాయ పంతమే ప్రో త్సాహమది పంచుటే


ఈమన్కిలో న నున్నదో యేకాంకమైన  లక్ష్యమే

ఈ యంబరమ్ము కోర్కెలే యే మ్మున్నదన తప్పదే


****

జీవన గీతిక శ్రేణి (8)


గణేశ్వరా గజాననా కవీశ్వరా కనంగ రా

ప్రణమ్మురా ప్రధానమై ప్రభావమే మనమ్మురా

మనస్సులోఁ దలంతురా మహేశ్వరా మనంగ రా

గుణమ్ముతో పఠిoతురా శుభమ్మురా క్షణమ్ము రా


అనాదిలో సునాదమా యనంతమౌ ప్రకాశమా

వినమ్రతా సహాయమా విధానమా విశాలమా

దినమ్ము నా నమస్సులే దివస్పతీ యనంగ రా

మనమ్ముగా వయస్సులో మనస్పతీ యుగంమురా


వినోద చిత్తరంజనా వికారరూప భంజనా

గుణాల వింత పోయినా గుణమ్ము దీప రంజనా

ప్రణామమిచ్చి కొల్తు నా పథమ్ములోఁ జనంగ రా

తృణమ్ముగాను చెందునా సుఖంములో జపమ్మురా


అనాథశోక నాశనా యశేష వాగ్విభూషణా

పునాది నేడు వేసినా పురమ్ముగాను ఉండునా

తృణమ్ములోని విశ్వమా కృపాలు ప్రాపనంగ రా

వనమ్ములోని వృక్షమా వరాలు నివ్వగల్గు నా


సునీలకంఠపుత్రకా శుభమ్ము లిమ్ము మోహనా

ప్రణీత భావ చంద్రికా ప్రభావ దివ్య కాంతిగా

జనప్రియా సతీసుతా జగాన మేలనంగ రా

మనభయమ్ము దేహమే ప్రఘాడ దాహమేనురా


---

“జీవన గీతిక” శ్రేణి (1)

1.

ఎవ్వరి ఎవ్వరి జోడు – ఏర్కపర్చలేని రేడు

కాలగతిగ నమ్మడు – నమ్మకమ్ము సరిజోడు

రేయి పగలు జీవుడు – సుఖదుఃఖాల రెప్పడు

బ్రత్కు లక్ష్యము చూడడు – చక్ర మల్లె తిరుగుడు


2.

అశాశ్వతం మిదం కదా – అధర్మ సంచితమే కదా

దుష్ట చతుష్టయమే కదా – నీ శక్తి సత్యమే కదా

సంకల్ప బలమే కదా – కాల స్వధర్మమే కదా

చీకటి వెల్గుయే కదా – తృప్తి సంతృప్తియే కదా


3.

ఈ దార్సనిక గీతికా – ధర్మార్థమును పొందికా

నది కడలి చేరికా – పుట్టి గిట్టుట తీరికా

కాలమాయలు డప్పికా – కప్పగంతుల మాలికా

జీవ సత్యము తేలికా – మృత్యు ఘోషలు చాలికా

4

జీవితానికే గీతమిది  జీవసత్యమే నీతియది  

కాలనాటికే యాతనయి  మరణమునకే శాంతియది  

భ్రమలలోన తేలికగ  ధర్మమంతయు నిలువగ  

వెంకటేశుని మాధురీ  లీలలోనే పరమగీ

*****

జీవన గీతిక శ్రేణి(2)


అఖిల  లోకరమణీ -ఆర్తి నివార రూపిణీ

సుఖమున్ దయ రమ్యతా-.సార్ణవమైన కారిణీ 

సూర్య చంద్ర సమానమై --శఖ్యతమ్నగు మూర్తినీ

భక్తమనస్సు రక్షణీ --భావముతో ను నిత్యణీ


 నిలుపుదీసమర్ధణీ --తల్లీశక్తి స్వరూపిణీ

 తల్లివై శాంతి పంచుటే -వాగ్దే విగాను గమ్యణీ

స సరిగమపాయణీ -మధురము దపానణీ 

భవమయాన రాగణీ  --ససాగ దీయు మాలిణీ


 అకారమైమదీ యమైనాఆచార్య గకర్షిణీ

అదిపుర్షుని ఆశ్రితా ఆనంద వర్ధమాలిణీ

 ఆరాధ్యత సుహాసిణీ అమృతానంద వాహిణీ

 మంగళాకార శుభoగీ మాధుర్య మధుసూధణీ 


మాతృశ్రీ – కరుణారసమూర్తిణీసుఖ దాయిణీ

మాతృశ్రీ -- చరణాల సమర్ధతా జయ రూపిణీ

మాతృశ్రీ -- భవ భవనా తత్పరత సహాయి ణీ

మాతృశ్రీ -- బంధ భావనా సర్వమయి సుదర్శణీ


****

🌸 జీవన గీతిక శ్రేణి (మూడవది) 🌸


పద్యము

సర్వం శుభం భూయాత్ – విశ్వం సకలం సమర్థమగున్

సద్భావ సంకల్పమున్ – జన్మ మర్మమున్ మార్గమున్

మారణ హోమమున్ – అంతా దైవమయం గానున్

అభిమాన అభ్యుదయం – అష్టోత్తర కర్తవ్యమున్


---

అభిజ్ఞానం అలంకారం

అభివాదం ఆత్మ జ్ఞానం

అమిత అమూల్య భావం

అరవింద చరణాల పర్వమ్

అగ్రత అఖండ అరుణోదయమ్

అమోగా అద్భుత రూపమ్

అమృత అభీష్ట ఆశ్రిత మందారమ్


---

నమో కేశవ నారాయణమ్

నమో మాధవ విశ్వరూపమ్

నమో గోవిందాయన భాష్యమ్

నమో మధుసూదనాభి యుక్తమ్

నమో త్రివిక్రమ స్వరూపమ్

నమో నమో శ్రీరామ తత్వమ్


---

🌺 శ్రీ గరుడ ఆంజనేయ తుంబుర నారద 🌺

🌸 శ్రీ శ్రీ శుభోదయమ్ 🌸


---

జీవన గీతిక శ్రేణి( 9 )


కోలాట కళ మెప్పులే మద్దెల కళ మోతలే 

ఆడాల్లన్నను మాటలే ఆడలేనిది వో టిలే 

అరక కాడి దున్నలే పుడమి దున్నె నాడిలే 

పశువులను తోలులే ముళ్ళు కర్రల కేకులే 


కలువ పువ్వు కాడలే గాలి బుడగ తీరులే 

 గడ్డి పోచలు మౌకులే గట్టి ఏనుగు పట్టులే 

 కావడి బద్ద ముక్కలే గడుసు యెండ తీరులే 

 కర్ర కాలిన బొగ్గులే ఇనుము కాలి సాగులే 


 కొమ్మ కదల సాగులే పువ్వుల గుత్తి ఊగులే 

 కర్ర పైన జెండా వలే జీవితమ్మున మార్పులే


చిక్కడు సిరి కౌగిటే జిక్కడు యోగి పుంగవై

 జీక్కడు ఇంతి లీలలో జిక్కడు పువ్వు యాటలో

 జిక్కడు తండ్రి కోటలో చిక్కడు తల్లి మాటలో

 జిక్కెలే రోలు తాడులో  జిక్కెలే మాయ యాటలో 


 చిరుహాసపు ఆటలో చిందులు వేయ కృష్టుడే 

 పరిహాసపు మాటలో మంత్రము వేయు కృష్ణుడే 

పరి సరాల బాటలో బుడత గాను కృష్ణుడే 

మంగళమ్మగు మాయలో మనసు పంచు కృష్ణుడే

******

జీవన గీతిక శ్రేణి.. (7)

తల్లిలా దేవతౌనులే తండ్రిలా రక్షకుoడుగన్

నిత్య గురువు మార్గదర్శి విద్యగానుయాత్రగన్ ॥


నీటియందగు ఔషధమ్ము గాలిలాయె జీవనన్

సూర్యుని శక్తి దీపమై చంద్రుని శాంతి దాయకన్ ॥


ధైర్యమౌను బలమ్ముగన్ ఓపికగాగుణమ్ముగన్

ప్రేమజీవిత దానమున్ స్నేహమేబంధ జీవమున్ ॥


సత్యమే మన ఆయుధమ్ అబద్ధమేను శత్రువున్

పుణ్యమే మన దానమున్ ద్రోహమేమన పాపమున్ 


కన్నీరు లీల చూపగన్ నవ్వు ఔషధ మవ్వగన్

మౌనమేమనసౌఖ్యమున్ ధ్యానమే శాంతి మార్గమున్ ॥


ఆరోగ్యమ్ము ధనమ్ముగన్ సంపదలన్ని భారమున్

నిత్య కృషియె మంత్రమున్ యీ అలసట యంత్రమున్ ॥


పుస్తకమేను దాహమున్ జ్ఞానమే కాంతిగమ్యమున్

అజ్ఞానమేను చీకటిన్ విజ్ఞానమేను మార్గమున్ ॥


మన రక్తము బంధమున్ భూమియన్నది తల్లిగన్

ఆకాశమన్న తండ్రిగన్ సముద్రమన్న తోడుగన్ ॥


ఉద్యోగమన్న శోధనన్ వ్యాపారమన్న సాహసన్

జీవన గీత లాలసన్ జ్ఞానమే పయనమ్ముగన్ ॥


****


No comments:

Post a Comment