ఎండలోన వానలోన నీవెగా
దండలోన+ పూలలోన నీవెగా వేంకటేశ్వరా
విన్నవించనా సంతజేయనా విన్నవించి వింతజూప వేంకటేశ్వరా
తలంతు నిన్నె యొంటిగా జనమ్ములో
తలంతు నిన్నె మేడలో వనమ్ములో
తలంతు నిన్నె యెప్పుడీ మనమ్ములో
తలంతు నిన్నె మన్కిలో వేంకటేశ్వరా
ఆకసాన వెల్గు తార నీవెగా
రాకలోన వెల్గు చంద్రుఁ డీవెగా వేంకటేశ్వరా
తలంతు నిన్నె జపమ్ముగాను
ఎండలోననే వానలోననే ఎండ వాన తోడుగాను వేంకటేశ్వరా
వరమ్ము నీవె నాకు పూర్వ జన్మలో
వరమ్ము నీవె నాకు నేఁటి జన్మలో
వరమ్ము నీవె నాకు ముందు జన్మలో
వరమ్ము నీవె భూమిలో వేంకటేశ్వరా
విస్మయమ్ముగా సంభవమ్ముగా విస్మయిమ్ము సంభవమ్ము వేంకటేశ్వరా
పదమ్ము పాడుచుందు నీకు ఛందమై
ముదమ్ము నిండ మోహనాంగి యందమై
సుధారసమ్ము చిందు పుష్ప గంధమై
హృదాంతరాళ నందమై వేంకటేశ్వరా
వెన్నెలమ్మగా కిన్నెరత్విగా వెన్నెలమ్మ కిన్నెరత్వ వేంకటేశ్వరా
*****