Monday 6 March 2023

 🕉 pranjali Prabha  మన గుడి : 01

     చిత్తూరు జిల్లా , andhra pradesh  🕉

*కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం..*

🕉 మన గుడి  : 01🕉

🔅 చిత్తూరు జిల్లా :  కాణిపాకం

🔅కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం

 తిరుమలపై కోనేటి రాయుని కోనేటి రాయని దర్శించుకున్న భక్తులు  కాణిపాకంలో స్వయంభువుగా వెలసిన వరసిద్ధి వినాయకుని దర్శించుకుంటారు. ఇక్కడ వినాయకుడు బావిలో దర్శనమివ్వటం విశేషం. ఇక్కడ స్వామివారి మహిమలు అనంతం. 

ఎందరో భక్తులు వినాయకుడి మహిమలను కథలు కథలుగా చెప్పుకుంటారు. కాణిపాకం ప్రజలు సాధారణంగా న్యాయస్థానాలను ఆశ్రయించరు, పోలీసులకు ఫిర్యాదు చేయరు. దోషిగా అనుమానించిన వ్యక్తి చేత కాణిసాకం వినాయకుని వద్ద ప్రమాణం చేయిస్తారు. ప్రమాణం సత్యమైనదైతే అతడు నిర్దోషి, ఒకవేళ అసత్య ప్రమాణం చేసి ఉంటే వినాయకుడే వెంటనే అతడి పని పడతాడని భావిస్తారు.

 కాణిపాకంగా మారిన విహరపురి : చరిత్ర,  విశిష్టత. 

కాణిపాకం క్షేత్రం  ఒకప్పుడు విహరపురి గా పిలువబడేది.

కాణిపాకం పేరు వెనుక అసలు రహస్యం.. 

కాణి అంటే పావు ఎకరా మడిభూమి లేదా మాగాణి అని, పారకం అంటే నీళ్లు పొలంలోకి పారటం అని అర్ధం.

టెంకాయ నీళ్ళు కాణి భాగం అంతా ప్రవహించడం వల్ల కాణిపాకం అయింది

 ప్రకృతి వైపరీత్యాల వల్ల విహరపురి తన మునుపటి వైభవాన్ని కోల్పోయింది. వరదలు వచ్చి, బహుదా నది పొంగిపొర్లడంతో ఆలయంలోని వరసిద్ధి వినాయకుడు బావిలోకి జారి, అక్కడే ఉండిపోయాడు.

 విహరపురి ఈ వరదల నుండి కోలుకుంటుండగానే అనావృష్టి సంభవించి పట్టణం మరుభూమిగా మారిపోయింది. 

ఈ దుర్భర పరిస్థితుల్లో కూడా కలిసివెలసి జీవిస్తున్న ముగ్గురు మిత్రులకు కాణి పొలం వుండేది.

 కాణి అంటే 1.3 ఎకరం. వీరిలో మొదటివాడు గుడ్డి, రెండవవాడు చెవిటి, మూడవవాడు మూగ. వీరికి పుట్టుకతోనే ఈ వైకల్యాలు సంభవించాయి. పంట వేయడానికి అవసరమైన నీటి కోసం బావిని లోతు చేయడానికి చెవిటి, మూగ మిత్రులు చేతిలో గునపాలతో బావిలోకి దిగారు. గుడ్డి మిత్రుడు మాత్రం గట్టునే ఉండిపోయాడు. మిత్రులిద్దరూ గునపంతో పోటు వేయగానే ఠంగ్ మన్న శబ్దం వచ్చింది. వెంటనే వెచ్చటి రక్తం పైకి చిమ్మింది. ఈ రక్తపు చుక్కలు మీద  పడగానే చెవిటి మిత్రునికి మాట వినిపించింది. మూగ మిత్రునికి మాట వచ్చింది. ఇది భగవంతుడి మహాత్మ్యమని తెలుసుకున్న మిత్రులిద్దరు రక్తదారను ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే నెత్తుటి ధార ఆగకుండా ఇంకా పైకి చిమ్మి గుడ్డివాని కనులను తాకింది. వెంటనే వానికి చూపు వచ్చింది. వెంటనే అతడు రాజు వద్దకు పరుగుతీసి, జరిగినదంతా చెప్పాడు. అది విని రాజు తన రాణులతోను, దానదాసీజనంతోను, అక్కడకు చేరుకుని ఆ బావిలో లెక్కిలేనన్ని కొబ్బరికాయలు కొట్టి, స్వామివారిని శాంతింప జేశాడు. అలా బావి నుండి ఉబికి వచ్చిన కొబ్బరి నీరు కాణిపై పారింది. దాంతో విహారపురికి కాణిపాకం అనే పేరు సార్థకమై, క్రమంగా కాణిపాకంగా మారింది.

 సంతానం లేని దంపతులు, దీర్ఘ వ్యాధులతో బాధపడుతున్న వారు కాణిపాకం వినాయకుని దర్శించుకుని, 11 లేదా 22, 41 రోజులు నియమానుసారం పూజలు చేస్తే సంతాన ప్రాప్తి, ఆరోగ్యప్రాప్తి కలుగుతాయని భక్తుల విశ్వాసం. వరసిద్ధి వినాయకుడు స్వయంభువుగా వెలసిన బావిలోని జలాన్ని భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు.

ప్రతిఏటా వినాయకచవితి పండుగ రోజు నుంచి 21 రోజులపాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాల రోజుల్లో లక్షలాది మంది భక్తులు సత్యప్రమాణాల స్వామి దర్శనానికి వస్తుంటారు. 

చిత్తూరు జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో వెలసిన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దివ్యక్షేత్రం దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. తిరుమల తిరుపతికి 72 కిలోమీటర్ల దూరంలో వుంది.

 పెరుగుతున్న విగ్రహం

స్వామి దినదిన ప్రవర్థమానంగా పెరుగుతూ వున్నాడని భక్తుల నమ్మకం. దీనికి సాక్ష్యంగా సుమారు 50 సంవత్సరాల ముందు స్వామి వారికి చేయించిన వెండి కవచం నేడు స్వామి వారికి సరిపోవడం లేదు. స్వామివారు ఆవిర్భవించినప్పుడు కనిపించని బొజ్జ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది స్వామి పెరుగుతూ వున్నాడనడానికి చక్కని నిదర్శనం. అందుకే స్వామి వారు స్వయంభువునిగా ఖ్యాతినొందారు.

 బాహుదానది చరిత్ర

వినాయకస్వామి వెలసిన బాహుదానదికి ఆ పేరు రావడం గురించి కూడా పురాణ కథవుంది. 

స్వామిని చూడాలని శంఖుడు, అంఖితుడు అనే ఇరువురు సోదరులు కాలినడకన బయలుదేరారు.

దైవ లీలలో భాగంగా చేయని తప్పుకు అంఖితుడికి రాజుగారి ద్వారా చేతులు నరకమని శిక్ష పడింది. 

భటులు రాజు ఆజ్ఞ ప్రకారం అంఖితుడి చేతులను ఖండించారు. తమ్ముడికి ఊహించిన శిక్ష పడటంతో దు:ఖంతో తమ్ముని వెంటబెట్టుకొని శంఖుడు కాణిపాకం వినాయకస్వామి దర్శనానికి వెళ్ళాడు. 

దైవదర్శనానికి ముందుగా అక్కడ నదిలో స్నానమాచరిస్తుండగా ఖండించిన అంఖితుని చేతులు తిరిగివచ్చాయి.పోయిన బహువులు తిరిగి వచ్చిన కారణంగా ఆ నదికి బహుదానదిగా పేరు వచ్చింది.

 శివుడు, విష్ణువు ఒకే పుణ్యక్షేత్రంలో అదీ ఒకే ప్రాంగణంలో వుండటంతో కాణిపాకం క్షేత్రాన్ని శివవైష్ణవ క్షేత్రంగా పిలుస్తారు...

****

* అపూర్వ శాస్త్రాలు *

 

నేడు అమలులోలేని మనకు తెలియని మన పూర్వీకులు మనకందించిన అపూర్వగ్రంథ శాస్త్ర రాజములు:

 

🌼 1.అక్షరలక్ష:

ఈ గ్రంథం ఒక ఎన్సైక్లోపీడియా గ్రంథము.రచయిత వాల్మీకి

మహర్షి.రేఖాగణితం,బీజగణితం,త్రికోణమితి,భౌతిక గణితశాస్త్రం మొదలైన 325 రకాల గణితప్రక్రియలు, ఖనిజశాస్త్రం,భూగర్భశాస్త్రం,జలయంత్ర శాస్త్రం, గాలి,విద్యుత్,ఉష్ణం లను కొలిచే పద్దతులు మొదలైన ఎన్నో విషయాలు ఇందులో తెల్పబడ్డాయి.

 

🌼 2.శబ్దశాస్త్రం:

రచయిత ఖండిక ఋషి. సృష్టిలోని అన్ని రకాల ధ్వనులను,ప్రతిధ్వనులను ఇది చర్చించింది.ఇందులోని ఐదు అధ్యాయాలలో కృత్రిమంగా శబ్దాలను సృష్టించడం,వాటి పిచ్(స్థాయి),వేగాలను కొలవడం వివరించారు.

 

🌼 3.శిల్పశాస్త్రం:

రచయిత కశ్యపముని. ఇందులో 22 అధ్యాయాలు ఉన్నాయి.307 రకాల శిల్పాల గురించి,101

రకాల విగ్రహాలతో కలిపి సంపూర్ణంగా చర్చించారు. గుళ్ళు,రాజభవనాలు,చావడులు మొదలైన

నిర్మాణవిషయాలు 1000కి పైబడి ఉన్నాయి. ఇదే శాస్త్రం పై విశ్వామిత్రుడు,మయుడు, మారుతి మొదలగు ఋషులు చెప్పిన విషయాలు కూడా ఇందులో చర్చింపబడ్డాయి.

 

🌼 4.సూపశాస్త్రం:

రచయిత సుకేశుడు.ఇది పాకశాస్త్రం.ఊరగాయలు, పిండివంటలు తీపిపదార్థాలు,108 రకాల వ్యంజనాలు మొదలగు అనేకరకాల వంటకాల గురించి, ప్రపంచవ్యాప్తంగా ఆ కాలం లో వాడుకలో ఉన్న 3032 రకాల పదార్థాల తయారీ గురించి చెప్పబడింది.

 

🌼 5.మాలినీ శాస్త్రం:

రచయిత ఋష్యశృంగ ముని.పూలమాలలను తయారుచేయడం,పూలగుత్తులు,పూలతో రకరకాల

శిరోఅలంకరణలు,రహస్యభాషలో పూవులరేకుల పైన ప్రేమసందేశాలు పంపడం లాంటి అనేక

విషయాలు 16 అధ్యాయాలలో వివరింపబడ్డాయి.

 

🌼 6.ధాతుశాస్త్రం:

రచయిత అశ్వినీకుమార. సహజ,కృత్రిమ లోహాలను గురించి 7 అధ్యాయాలలో కూలంకుషంగా వివరించారు.

మిశ్రమలోహాలు,లోహాలను మార్చడం,రాగిని బంగారంగా మార్చడం మొదలగునవి వివరించారు.

 

🌼 7.విషశాస్త్రం:

రచయిత అశ్వినీకుమార.

32 రకాల విషాలు,వాటి గుణాలు,ప్రభావాలు,

విరుగుడులు మొదలైన విషయాలు చెప్పారు.

 

🌼 8.చిత్రకర్మశాస్త్రం(చిత్రలేఖనశాస్త్రం):

 రచయిత భీముడు.ఇందులో 12 అధ్యాయాలు

ఉన్నాయి. సుమారు 200 రకాల చిత్రలేఖన ప్రక్రియల గురించి చెప్పారు. ఒక వ్యక్తి తలవెంట్రుకలను గాని,గోటిని కాని,ఎముకను కాని చూసి ఆ వ్యక్తి బొమ్మను గీసే

ప్రక్రియ చెప్పబడింది.

 

🌼 9.మల్లశాస్త్రం:

రచయిత మల్లుడు. వ్యాయామాలు,ఆటలు, వట్టిచేతులతో చేసే 24 రకాల విద్యలు

చెప్పబడ్డాయి.

 

🌼 10.రత్నపరీక్ష:

రచయిత వాత్సాయన ఋషి.రత్నాలు కల్గిఉన్న 24 లక్షణాలు చెప్పబడ్డాయి.వీటిశుద్దతను

పరీక్షించడానికి 32 పద్దతులు చెప్పబడ్డాయి.రూపం, బరువు మొదలగు తరగతులుగా

విభజించి తర్కించారు.

 

🌼 11.మహేంద్రజాల శాస్త్రం:

సుబ్రహ్మణ్యస్వామి స్వామి శిష్యుడైన వీరబాహువు రచయిత. నీటిపై నడవడం,గాలిలో

తేలడం వంటి మొదలైన భ్రమలను కల్పించే గారడిలను ఇది నేర్పుతుంది.

 

🌼 12.అర్థశాస్త్రం:

రచయిత వ్యాసుడు.ఇందులో భాగాలు 3.ధర్మబద్ధమైన 82 ధనసంపాదనా విధానాలు ఇందులో

వివరించారు.

 

🌼 13.శక్తితంత్రం:

రచయిత అగస్త్యముని. ప్రకృతి,సూర్యుడు,చంద్రుడు,గాలి,అగ్ని మొదలైన 64 రకాల బాహ్యశక్తులు,వాటి ప్రత్యేక వినియోగాలు చెప్పబడ్డాయి. అణువిచ్చేదనం ఇందులోని భాగమే.

 

🌼 14.సౌధామినీకళ:

రచయిత మతంగ ఋషి.నీడల ద్వారా,ఆలోచనల ద్వారా అన్ని కంటికి కనపడే విషయాలను ఆకర్షించే విధానం చెప్పభదింది.భూమి మరియు పర్వతాల లోపలిభాగాల ఛాయాచిత్రాలను తీసే ప్రక్రియ చెప్పబడింది.

 

🌼 15.మేఘశాస్త్రం:

రచయిత అత్రిముని.12 రకాల మేఘాలు,12 రకాల వర్షాలు,64 రకాల మెరుపులు,33 రకాల

పిడుగులు వాటి లక్షణాల గురించి చెప్పబడింది.

 

🌼 16.స్థాపత్యవిద్య:

అదర్వణవేదం లోనిది. ఇంజనీరింగ్,ఆర్కిటెక్చర్,కట్టడాలు,నగరప్రణాలిక మొదలైన సమస్త నిర్మాణ విషయాలు ఇందులో ఉన్నాయి.

 

ఇంకా భగవాన్ కార్తికేయ విరచిత కాలశాస్త్రం,

సాముద్రిక శాస్త్రం, అగ్నివర్మ విరచిత అశ్వశాస్త్రం,

 కుమారస్వామి రచించిన గజశాస్త్రం,

 భరద్వాజ ఋషి రచించిన యంత్రశాస్త్రం మొదలగునవి ,

 ఆయుర్వేదం,ధనుర్వేదం,గాంధర్వవేదం మొదలగు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి.

 

నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద?


వీటిలో చాలా వరకు నేడు అందుబాటులో లేవు​.

ఇందులో ఒక్క శాస్త్ర0 కూడా నాకు తెలవదు ,  ఇంతవరకు చదవలేదు, పుస్తకాలు ఉంటె తెలుపగలరు  ఇది వాట్సాప్ లో సేకరణ మీరు చదవగలరు  

🌼 ఓం నమః శివాయ


No comments:

Post a Comment