Sunday 19 March 2023

 


26/05/2023.
******
పాట సందర్భంపై నా విశ్లేషణ.
*********
నేటి యువతలో ఉన్న లోపాలను సరిచేసేలా 
మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసనలు చూడనేలా ప్రగల్భాలు గొప్పలు చెబుతే సరిపోదంటు 
గుండెల నిండా ప్రశ్నించే దమ్ముండాలంటు  యువతలో కదలిక తెచ్చి చైతన్య పరచి  నేడు రేపు నాదే నంటు
ఉత్సాహంతో విశ్వాసంతో ముందడుగు వేయించేలా
సాగే పాట. అడుగడుగులో  సత్తా చాటేలా మునుముందు కు సాగించి సాహసం చేయమంటు
సమాజం నీదంటు  చాటి చెప్పే పాట.!!
***********
పల్లవి:-
***
ప్రశ్నించడం తెలియదే జవాబు వివరంచడం రాదే 
ప్రపంచాన్ని ఎలా ఏలుతావో చెప్పలేదే, దేశ కుటుంబాన్ని అర్ధం చేసుకోలేదే, 
ప్రజ్ఞ ఎలా అబ్బుతుందో తెలుసుకో ముందుగా, ధైర్యంగా తప్పుతప్పని, సత్యము సత్యమని వాదించడం నేర్చుకో.. నేర్చుకో.. నేర్చుకో 

ఆజ్ఞాపించడం అర్హత అనుకోవద్దులే 
ఆగ్రహించడం  చేవ ఉన్నవాడి లక్షణం అనకులే 

నోరుందనో  జేబులో డబ్బుందనో
గొప్పోడివనుకునే రోజులైతే కాదులే
అందరిలో నీ ఒకడి వని మరచి ప్రవర్తన ఎందుకులే 

 ప్రశ్నించడం చేతకానోడివై 
 ప్రపంచాన్ని ఎలా ఏలుతావులే .
చరణం:-1
***
పనిచేసేవానికి తిండి కరువయ్యే రోజులే
పలుకరింపులతో మాయ చేసె రోజులే 

పైపై మాటలు  విని
సలాం కొట్టే జనాలు లేరులే 
కష్టించే తత్వానికి ఇష్టపడేవారే లేరులే 

నష్టనివారణ చర్యలు చెప్ప లేవులే 
నీ సత్తా ఏమిటో  తెలిప లేవులే 
పిల్లిని చూసి పులి అనే స్వభావం గల వాడివి లే 

రేపటి రోజు నీదని చెప్ప లేవులే 
నేటి రోజుపై పట్టు సాధించవులే 
పట్టు పట్టడమంటే తేనెతుట్టేలా ఉండాలిలే 
పట్టుదల పై సవారి చేయ లేవులే 
 పల్లవి:-
***
ప్రశ్నించడమే చేతకానోడివిలే 
ప్రపంచాన్ని ఎలా ఏలుతావులే 
 చరణం:-2
****
భుజం భుజం కలిపి నడిపించే చొరవ లేదులే 
జనంలోకి చొచ్చుకుపోయే తెగువ లేదులే 
నువ్వు కావాలిరా ఆ ధైర్యం నిలవాలిలే 

భజన పరుల పూజలను   
దరికే రానీవకులే 
నిన్ను నీవు నమ్మి ముందుకు సాగ వలే 
నీవు చేసే పని ఎన్నటీకి వమ్ముకాదులే
నమ్మకమే నీకు బలము అని తెలుసుకోవాలిలే 

 కాలం ఎప్పుడు సవాళ్ళ వెంట ఉండును లే 
 భయమే లేకుండా కదలాలిలే 
గాయం అయినపుడు మందుగా మారాలిలే 
న్యాయం వైపు నడువు విజయం నీదవుతుందిలే 
 
గమ్యం ఎంత దూరమైనా
నిర్ణయం నీదే కావాలిలే 
బాధైనా బఢభాగ్నైనా  లెక్కే చేయక నడుం బిగించాలిలే 
పక్కా ప్రణాళికతో  నిక్కచ్చిగా  ముందడుగు వేయాలిలే 

 జయము జయము నీదే  విజయ లక్ష్మి నీదే కావాలిలే 
 జయము జయము నీవే ప్రజలంతా నీ వెంటే ఉంటారులే 
 పల్లవి:-
***
 ప్రశ్నించడమే చేతకానోడివి కావులే 
 ప్రపంచాన్ని ఎలా ఏల గలవు తావులే 
 ************

 రచన:-
27/05/2023. *****  పాట సందర్భంపై నా విశ్లేషణ.
****౮****
ప్రేమలో పడినపుడు ఆ  ప్రేమికుల హృదయం ఎలా ఒకరికై ఒకరు పరితపిస్తారు ఎలా  ఒకరి సాంగత్యాన్ని ఒకరు కోరుకుంటు  ప్రశంసించుకుంటు   ఎంతగా ఇష్టపడుతున్నానో తెలుపుతు  ప్రకృతి తో పోలుస్తు తన సంతోషాన్ని తెలుపుతు ప్రేమలో లీనమై పిడుకుంటున్న ఈ పాట.
*****************
పల్లవి:-
***
ఓనమాలు నేర్పవా 
ఓర్పుచూపి ఆదుకోవా
ఓటమిలోని విజయాన్ని అందించవా  
ఓహోహో ఒహొహో ఒహొహో

ఈ ఉదయములే నన్ను కదిలించావు  
నీ  హృదయమల్లే నన్ను వేదించావు  
ప్రేమగా పలుకరించేనులే ...
ఓహోహో ఒహొహో ఒహొహో

ప్రతి క్షణం  నీ స్మరణై 
నన్ను వెంటాడుతున్నదే 
నాహృదయంలో నేవి  
మనసంతా  వేణువై  పాడేనులే..

ఆహహా  ఆహాహా

ప్రియతమా  నిను చూచిన క్షణమే
అనురాగాన్ని అందించాలని 
ఆశపడ్డా నీపైనా, 

మధురమా మనోరమా మానస వీణ  
నీ ప్రేమ పొందిన భాగ్యమే నేనై
సౌఖ్యమెంతగానో పొందానులే..
ఓహోహో ఒహొహో ఒహొహో

ఈ ఉదయములే నన్ను కదిలించావు  
నీ  హృదయమల్లే నన్ను వేదించావు  
ప్రేమగా పలుకరించేనులే ...
ఓహోహో ఒహొహో ఒహొహో
చరణం:-
****
పిలిచినంతనే పలికే దేవతవే
పలుకంగనే వరమై కురిసి
చేరుకున్న  చిరునవ్వువే

అలలా ఎగసినావు   
కలనే కరిగించినావులే...

వలపే రుచి చూపినావు
తలపుల్లో  తిష్టవేసినావే...

వరుడవై పక్కన చేరి గిలిగింతలతో 
చలి మంటలు రాచేసినావురా  నాలోనా...
పల్లవి:-
**
ఈ ఉదయములే నన్ను కదిలించావు  
నీ  హృదయమల్లే నన్ను వేదించావు  
ప్రేమగా పలుకరించేనులే ...
ఓహోహో ఒహొహో ఒహొహో
చరణం:-
***
వెచ్చని నీ ఒడిని వీడలేకుండే
బానిసగా మార్చేసినావులే..!!

స్వచ్ఛమైన  పుట్టతేనెవే
నీ అధరములే అమృతధార లే
జాలువారినా  పెదవులను ముద్దాడినాకే
తెలిసిందిలే  అమరత్వమే సాధించినానని..!!

ఏమైనా సరే    ఏదైనా సరే
నీవు నా తోడైనందుకు కృతజ్ఞతగా 
నా  కౌగిళినే  కానుకగా ఇస్తున్నా మన్మధా
ఆ జాబిల్లి సాక్షిగా...
 పల్లవి:-
****
ఈ ఉదయములే నన్ను కదిలించావు  
నీ  హృదయమల్లే నన్ను వేదించావు  
ప్రేమగా పలుకరించేనులే ...
ఓహోహో ఒహొహో ఒహొహో
********
28/05/2023.
*****
 పాట సందర్భంపై నా  విశ్లేషణ.
***********
 ఎందరో మహానుభావులు   ఆ మహానుభావులందరికి లోకి   మహానుభావుడు తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని విశ్వ వ్యాప్తం చేసిన ఏకైక వ్యక్తి మన అన్న నందమూరి  తారక రాముడు.  వంద సంవత్సరాల క్రితం ఇదే రోజు ఈ భూమి పై పుట్టిన   గొప్ప తేజం సంకల్ప స్వరూపం.సుఃదర రూపం   పరిపూర్ణ మహోన్నత వ్యక్తిత్వం. చరిత్రలో సువర్ణాక్షరాలలో లిఖించుకున్న 
దివ్య భవ్య విశ్వ రూపం నటరత్న విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు జన్మదినం సందర్భంగా
 ఈ పాట.
*౮**************
 పల్లవి:-
****
విశ్వం మెచ్చిన తిరుగు లేని మనిషి 
విశ్వ నరుడై వెలుగొందిన  ఎదురులేని మనిషి
సర్వం తెలిసిన బంగారు మనిషి 
ఆంద్రావనికే ఆత్మగౌరవాన్ని ప్రసాదించిన మహర్షి.బ్రహ్మర్షి 
కోరస్.
***
మనిషి మహా మనిషి, మహర్షి, బ్రహ్మర్షి..

విశ్వ విఖ్యాత నటరత్న, పద్మశ్రీ నాట సార్వభౌముడై 
సర్వ ప్రపంచ హృదయాలలో  నిలిచిన రాజర్షి..
కోరస్:-
***
 మనిషి మహా మనిషి, మహర్షి, బ్రహ్మర్షి..

ప్రజా సేవకుడై  సమాజమే దేవాలయం అన్న కధా నాయకుడు 
ప్రజలే నా దేవుళ్ళని   సంక్షేమానికే పునాదులు వేసిన మనుషుల్లో దేవుడు 
జన హృదయాలలో శాశ్వతంగా నిలిచిన సాహసవంతుడు 

మనిషి మహా మనిషి, మహర్షి, బ్రహ్మర్షి..

కోరస్:-
***
మనిషి మహా మనిషి, మహర్షి, బ్రహ్మర్షి..

విశ్వం మెచ్చిన చండ శాసనుడు 
విశ్వనరుడై వెలుగొందిన విశ్వరూపం ఆటగాడు
చరణం:-
క్రమశిక్షణ తో నడిపించిన బడిపంతులు 
ఆకాశమంతగా ఎదిగిన అదృష్టవంతుడు 
కాలంతో పరుగెత్తె పెత్తందారలను అరికట్టిన సింహబలుడు 
ఎవ్వరు అందుకోలేనంత  కీర్తి నే పొందిన దాన వీర సూర కర్ణుడు 

రామ నామధేయుడై  
నందమూరి ఇంట జన్మించాడు 
ఆ రాముడే ఆదర్శమై
శ్రీ కృష్ణుడిలా చక్రం తిప్పాడు 
మా తారక రాముడు
మన తెలుగువారి ఆత్మగౌరవ నినాదమై తెలుగుదేశం పార్టీ పెట్టాడు, ముఖ్యమంత్రిగా ఏలినోడు 
తెలుగోల్లందరి గుండెల్లో పదిలంగా నిలిచిన జగదేక వీరుడు 
 పల్లవి:-
***
విశ్వం మెచ్చిన మనిషి
విశ్వనరుడై నిలిచిన మహామనిషి.
చరణం:-
***
సంఘసంస్కర్తగా మంచికి మరోపేరుగా 
పట్వాడి వ్యవస్థ నే భూస్థాపితం చేసాడు 
ఆడపడుచులకు అండ దండగా
ఆస్తి హక్కు కల్పించిన మర్మయోగి 

ఉచిత కరెంటు ఇచ్చి 
పేదోడి గుడిసెల్లో వెలుగై నిలిచాడు 
రెండు రూపాయల కే 
బియ్యం పథకాన్ని ప్రవేశ పెట్టి
ఇంటింటికి అమ్మై అన్నం పెట్టిన 
అన్నపూర్ణ గా నిలిచాడు 

ఓ మా నందమూరి  
తెలుగు దేశ విజయ భేరి మ్రొ 
 గించిన రాముని మించిన రాముడు 

ఓ నటరత్న
ఓహోహో  మహా నాయకా
తెలుగు నాడులో
విజయ బావుటా ఎగరేసి
చరిత్ర సృష్టించిన యుగపురుషుడు 

చిన్ననాటి స్నేహితులతో జీవితచక్రమ్, మేలుకొలుపుగా శ్రీ నాధుడు 
ధరిత్రిలో చెరగనిది నీ చరిత
మీతోనే  మా నవ శకానికి నాంది పలికాడు 
మా దేవుడవయ్యావు ఆ దేవుని చెంతకు చేరి
నిత్యం మము  దీవిస్తున్నావు .. 
 సత్యః ప్రభోదిస్తున్నావు..

ఈ మీ శత జయంతి రోజు మీ నామస్మరణం
అరుణోదయ గీతమై అణువణువు పలుకుతోంది
ఆత్మీయ రాగం.. ఆత్మీయ రాగం
పల్లవి:-
****
 విశ్వం మెచ్చిన మనిషి
 విశ్వ నరుడై వెలుగొందిన మహా మనిషి.
************

**********
నేటి నా పాట  సంఖ్య:
**********
రచన:- మల్లాప్రగడ రామకృష్ణ 
******
పాట సందర్భంపై నా విశ్లేషణ:-. ********** అందరూ కలసి ఉగాది పాట .
************** 
పల్లవి:-
****
రంభ, ఊర్వశి మేనక లొచ్చారు,     
సప్త సముద్రాలు దాటి అక్కలై వచ్చారు  
షడ్రుచులు తినాలని యుగాది కొచ్చారు 

ఊరూరూ సంబరం,  మామఇంట్లో ఆనంద తాండవం    
ప్రకృతి పుట్టిల్లి, సంబరం లోగిళ్ళు, ఆనందాల హరివిల్లు    

ఎన్నెన్నో అందాల నెల ఇది  
ఈ బృందావన చందనం  మనఅందరిది 
ఎన్నెన్నో మధుర జ్ఞాపకాలను తలపించేది 
కొత్త వంట, వస్త్ర అపురూప ఘట్టము ఇది 
ఆనందాల యుగాది వేదిక  వీక్షణం   !!

రంభ, ఊర్వశి మేనక లొచ్చారు,     
సప్త సముద్రాలు దాటి అక్కలై వచ్చారు
         
చరణం:-
****
అదృష్టమే మా అందరి ఆనందం 
ఆకాసాన దిగివచ్చిన దేవతల మయం 
ఆనందమే మా లోగిలై సుందరానంద మకరందం  
హరివిల్లులా  విరబూసిందోయి యుగాది వేదిక  వీక్షణం

ప్రకృతి  వీడి ఉండలేము మేము 
పంచాంగం వినందే ఉండలేము 
పదహారణాల తెలుగింటి  వారసులం 
మా అందరి కలయిక మనో ఉల్లాసము  
ఉరుకుల పరుగుల లేవు యుగాది వేదిక  వీక్షణం

పల్లవి:-
**
చరణం:-
***
మేము ఒక్కరొక్కరమే కలసియు 
రసాబసా మవకుండా హృదయాన్ని తలపించియు 
అనుభవజ్ఞులు చెప్పినది అక్షర సత్యమని నేమియు 
అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాము యుగాది 

రంభ, ఊర్వశి మేనక లొచ్చారు,     
సప్త సముద్రాలు దాటి అక్కలై వచ్చారు  
షడ్రుచులు తినాలని యుగాది కొచ్చారు 
ఊరూరూ సంబరం,  మామఇంట్లో ఆనంద తాండవం    
ప్రకృతి పుట్టిల్లి, సంబరం లోగిళ్ళు, ఆనందాల హరివిల్లు    
*************

No comments:

Post a Comment