Sunday 16 January 2022

నేటి ఛందస్సు గీతం -ప్రాంజలి ప్రభ 25-01-2022

విదేయదు మల్లాప్రగడ రామకృష్ణ 


కాన రావా ఈశ్వరా ధ్యానించి తే

ప్రేమ లేదా ఈశ్వరా మాపై ననే

భక్తి నంతా చూపు చున్నా యోగిగా

తప్పులున్నా కావు మయ్యా ఈశ్వరా


దేహ ముందీ ఈశ్వరా నీ సేవకే

దాహ తీర్చూ ఈశ్వరా నీ దాసిగా


మానసమ్మూ మాయలోనే నుంటినే

హ బాధే తెల్ప కే నే నంటినే

దారి అంతా ధర్మ మే నీ సృష్టి యే 

నేను చేసే న్యాయ మే ధ్యేయమ్ము గా


కాన రావా ఈశ్వరా ధ్యానించి తే

ప్రేమ లేదా ఈశ్వరా మాపై ననే


కానరాదే కండ్ల ముందా హాసమే

చెప్ప లేనే కాల మంతా నీదియే

ఒప్పు కున్నా జీవి తానా ధైర్యమే

పెంచు చున్న శక్తి నీదే ఈశ్వరా


కాన రావా ఈశ్వరా ధ్యానించి తే

ప్రేమ లేదా ఈశ్వరా మాపై ననే


వెన్నలయ్యా వెల్లకో యీ కాంతితో

దేశ మంతా నమ్మి ఉందీ ప్రేమతో

శ్వాస అంతా హాయి గొల్పే నిద్రతో

ప్రేమతోనే కల్చు చున్నా ఈశ్వరా


కాన రావా ఈశ్వరా ధ్యానించి తే

ప్రేమ లేదా ఈశ్వరా మాపై ననే


నిమ్మ కమ్మే భ్రాంతి అంతా తొల్గునే

నమ్మి కొల్చే కాంతి నంతా నీదిలే

భక్తి నంతా చూపు చున్నా యోగిగా

తప్పులున్నా కావు మయ్యా ఈశ్వరా


కాన రావా ఈశ్వరా ధ్యానించి తే

ప్రేమ లేదా ఈశ్వరా మాపై ననే


మన్ను నందే పుట్టి యున్నా  మాయకే

చిక్కి యున్నా నన్ను నీవే కావుమా

కాల మాయే ఉంది నన్నూ చూడుమా

సాహ సొమ్మే నాది కూడా ఈశ్వరా


కాన రావా ఈశ్వరా ధ్యానించి తే

ప్రేమ లేదా ఈశ్వరా మాపై ననే


బీద వానిన్ ప్రేమ తోడన్ చూడవా

ఆశ పాశమ్ తోనె ఉన్నన్ మార్చవా

సేయు సేవల్ దాన ధర్మమ్ సల్పితీ

భక్తి భావమ్ తెల్పు చున్నాన్ ఈశ్వరా


కాన రావా ఈశ్వరా ధ్యానించి తే

ప్రేమ లేదా ఈశ్వరా మాపై ననే

భక్తి నంతా చూపు చున్నా యోగిగా

తప్పులున్నా కావు మయ్యా ఈశ్వరా


ఆధారం: UIUU UIU UUIU 


UU II UU II *UU II UU II U - 


నేటి ఛందస్సు పాట - ప్రాంజలి ప్రభ - 24-01-2022 

విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ 

 

స్నేహమ్మును పెంచాలిక - క్షేమమ్మును కోరంగనులే 

మోహమ్ముయు ప్రేమే ఇక - మోక్షమును పెంచేందుకులే 

  

చూడాలని ఉందీ నిను - చూడాలని ఉందీ మనసే  

పాడాలని ఉందీ మన  -   పాఠాలను చెప్పాలి ప్రియా 

ఆడాలని ఉందీ ఇక  --  ఆపాలని లేదే వయసే  

తోడైతివి ప్రేమే ఇక   --- దాహమ్ము తీర్చాలి ప్రియా 


సందేహము మర్వాలిలె - సంతోషము తో ఆడుటయే 

పొందాలిలె నుత్యాహము - ప్రోత్సాహము తో పాడుటయే 

చిందేయుటె చిన్మాయయె - చిత్రాలుగ  నే చూడుటయే 

పందాలులె కట్టేయకు - పందారము యే చేయద్దుయే     

  

ఈరీతిగ నే చెప్పితి  - ఈ నాడులె నీకే సౌఖ్యమే 

ప్రారంభముగా తెల్పితి - ప్రాధాన్యత యే సౌభాగ్యమే 

సారూప్యము గా పల్కితి - సామాన్యము యే కారుణ్యమే 

ఆరాధన యే నామది -- ఆరోగ్యముయే సౌలభ్యమే 


చూడాలని ఉందీ నిను - చూడాలని ఉందీ మనసే  

పాడాలని ఉందీ మన  -   పాఠాలను చెప్పాలి ప్రియా 

ఆడాలని ఉందీ ఇక  --  ఆపాలని లేదే వయసే  

తోడైతివి ప్రేమే ఇక   --- దాహమ్ము తీర్చాలి ప్రియా 


స్నేహమ్మును పెంచాలిక - క్షేమమ్మును కోరంగనులే 

మోహమ్ముయు ప్రేమే ఇక - మోక్షమును పెంచేందుకులే 

  

ఆధారం:  త య స భ త వ -9


___(())--


నేటి  ఛందస్సు కరోనా  గీతం 

విధేయుడు మాల్లాప్రగడ రామకృష్ణ   


అమ్మ నీ దయ చూపుమ్ము దారిన తప్పాము మేము

తండ్రి నీకృప యే మాకు రోగము తగ్గించు దేవ 

అమ్మ నీప్రేమ పంచాలి ధైర్యమ్ము లేదాయె మాకు 

తండ్రి ఈ విష రాగాన్ని మింగియు లోకాన్ని చూడు      


కాలమైనది దాహమ్ము దేహము ఆనంద మేది  

రక్తసిక్తముగా మారుతున్నది ఈ  కర్మ భూమి 

ధైర్యమా సహనమ్మేను లేదులె భాంధవ్య మేది  

వ్యాధిగ్రస్తము పాపమ్ము మూలము ఈ ధర్మ భూమి 


అమ్మ నీ దయ చూపుమ్ము దారిన తప్పాము మేము

తండ్రి నీకృప యే మాకు రోగము తగ్గించు దేవ 


తిండియూ పనియేలేక బాధలె కారుణ్య మేది 

అమ్మ ఆత్రము పెర్గేను పుత్రిక ప్రేమకే భూమి 

పేగుబంధమునే తెంచె పుత్రుని క్రూరత్వ మైంది 

జన్మస్థానముయే లేక వేదన చేసే ను భూమి  


అమ్మ నీ దయ చూపుమ్ము దారిన తప్పాము మేము

తండ్రి నీకృప యే మాకు రోగము తగ్గించు దేవ 

     

జాలి చూపని పాశం ఇదేలె మనోధైర్యమేది     

తీర్పులో ఇక మార్చేను దేహ ఔదార్య భూమి 

బ్రత్కులో ఇక కష్టాలె సేవ సుఖమ్మేను ఏది 

స్వేశ్చయే మన నష్టాలె వాంఛ ప్రేమమ్ము భూమి   


అమ్మ నీ దయ చూపుమ్ము దారిన తప్పాము మేము

తండ్రి నీకృప యే మాకు రోగము తగ్గించు దేవ 


కాదు ఔనని చెప్పేను మానస దౌర్భాగ్య మేను 

లేదు ఉందని ఒప్పేను ఆశల ఆకర్ష భూమి 

పేద గొప్పయు లేకేను రోగము చుట్టేసి ఉంది 

 చేదు తీపి మనస్సేను పంచెను ప్రారబ్ధ భూమి 


అమ్మ నీ దయ చూపుమ్ము దారిన తప్పాము మేము

తండ్రి నీకృప యే మాకు రోగము తగ్గించు దేవ 

అమ్మ నీప్రేమ పంచాలి ధైర్యమ్ము లేదాయె మాకు 

తండ్రి ఈ విష రాగాన్ని మింగియు లోకాన్ని చూడు      


అమ్మ నీ దయ చూపుమ్ము దారిన తప్పాము మేము

తండ్రి నీకృప యే మాకు రోగము తగ్గించు దేవ 


ఆధారం : UIUIIU UIUII UUI UI

___((()))___


నేటి సాహిత్యం పాట  

విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ


విన్నపాలను వినవే - బ్రేమ పారు అమృతమై  

చిన్న చేష్టలు వదిలై - బావ మాట సుకృతమై  

విన్నపాలను వినవే - బ్రేమ పారు అమృతమై  

చిన్న చేష్టలు వదిలై - బావ మాట సుకృతమై  


నిన్ను చూడగ మన సై -  నేడు పొంగెను చెలియా 

కన్ను కొట్టకు  ఇపుడే  -  వాద మెందుకు సఖియా 

నన్ను తక్కువ చెయకే - శబ్ద  భేదము  చెలియా      

మన్ను తింటిని ఇపుడే  -  పాశ  మైనది సఖియా -- 1 


విన్నపాలను వినవే - బ్రేమ పారు అమృతమై  

చిన్న చేష్టలు వదిలై - బావ మాట సుకృతమై  


నిత్యమంగళ మిదియే - బ్రేమ రాగపు మదిరా  

సత్య వాదిగ వినుమా  -  నీవు నాకొక  నిధిరా 

పత్య మెందుకు ఇపుడే - నీవు నాకిక  మదిరా 

తత్వ మేదియు లేదురా  -  దూరముండేది నెలరా --2


విన్నపాలను వినవే - బ్రేమ పారు అమృతమై  

చిన్న చేష్టలు వదిలై - బావ మాట సుకృతమై  


ప్రేమ సంద్రపు టలలా -  కామ మోహిని  కలలా 

శ్వేత  పుష్పము కమలా -  అంద మంతయు వలలా 

బుద్ధి మంచిది విమలా  -  బ్రాంతి నొందకు భ్రమలా 

లాలి పాడెద  సరసా   - రా పరుండుము వడిలా  --3


విన్నపాలను వినవే - బ్రేమ పారు అమృతమై  

చిన్న చేష్టలు వదిలై - బావ మాట సుకృతమై  


కాల మాయయు ఇదియే - కాపు కాయుట వరకే   

మాట మోసము కాదుగా - మూగ గుండుట దెనికే     

మాయ చేసిన మనిషే - మోటు వానిగ అనకే 

తీరు మారును ఇపుడే  -  తేరు కోవుట కథలే ---4


విన్నపాలను వినవే - బ్రేమ పారు అమృతమై  

చిన్న చేష్టలు వదిలై - బావ మాట సుకృతమై  


ఆధారము :  UI UII IIU - UI UII IIU

 


నేటి  ఛందస్సు గీతం -- ప్రాంజలి ప్రభ  

రచయిత : మల్లాప్రగడ  రామకృష్ణ


ఒరేయ్ ఏమయిందిరా మీకు 

మాటలు తడబడుతున్నాయ్ 


ఏమాయ కమ్మింది  మాపైన యే 

శుబ్రమ్ము చేస్తాను ఆరోగ మే

మేమేమి చే సాము  ఆసేవ యే 

ఏరోగ మూ రాదు భయ్యమ్ములే


మా పనిలో నీ ప్రశ్నలు దేనికీ

 

మార్గమ్ములే ప్రశ్న లయ్యేనుగా

కాలమ్ము మాయగా చుడాలిగా

ఇంతెందు కాలోచనా ముందుగా   

పంతమ్ము పోకుమా అద్రుష్టమే


ఒరేయ్ ఏమయిందిరా మీకు 

మాటలు తడబడుతున్నాయ్ 


ఏరోగ మీదాక రాకుండులే

ఏకష్టమూ రాక సౌఖ్యమ్ములే

ఈ దేశ కష్టమ్ము భావించులే

బిడ్డల్తొ ఉండేది సౌకర్యమే


అవును మా పనిలో ఎప్పుడూ ఆనందమే 


సంతోష జీవమ్ము ఆనందమే

ఉద్వేగ ఉద్యోగ సేవార్ధమే 

ఎందెందు అందందే ఆరోగ్యమే

ఎవ్వారె మన్నాను మౌనమ్ము యే 


ఒరేయ్ ఏమయిందిరా మీకు 

మాటలు తడబడుతున్నాయ్ 


పంచియు ఆహ్లాద మే పొందుటే

ఎంచేసు యున్నానొ ఈమాయలే 

మేమీ చె సే యున్న ఇంతానులే 

కాలమ్ము తీర్చేను మాబంధమే 


ఒరేయ్ ఏమయిందిరా మీకు 

మాటలు తడబడుతున్నాయ్ 

ఆధారం విశాలాంతిక - త/త/త/గ UUI UUI - UUIU


--(())--

నేటి గీతము --ప్రాంజలి ప్రభ -21-01-2022

విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 


ఇరువురి మధ్య ఉహల అల్లికలు 

అందుకోవాలని తహ తహలు  

పంచుకోవాలని కుతకుతలు 

చిరునగవు చిందుల పలుకులు 


తొందర వద్దు అంతయు పొందు - తోడును నేను మొహమె 

అందరి ముందు ఆటయు వద్దు - ఆశను తీర్చు దాహమె 

మంధర బుద్ది ఇక్కడ వద్దు - మానస వీణ మీటుము  

గంధము పొందె శాంతిగ ఉండి - దాహము తగ్గు చేయుము  


సుందరి నాకు డెందము మ్రోఁగెఁ - జూడఁగ నిన్ను సత్యము

ముందర వచ్చి నవ్వుము లెస్సఁ - బూలను నిత్తు నిత్యము

సందియ మేల సందెల వేళ - చల్లని గాలి వీచెను

మందముగాను మల్లెల తావి - మత్తును జల్లి లేచెను


నల్లని నేల యెఱ్ఱని నింగి - నల్దెసలందు నాదము

మెల్లగ వెల్గు మేదిని వీడె - మెండుగ నింక మోదము

ఉల్లమునందు నూహల డోల - యూర్వశి సేయు నృత్తము

వల్లకి మీటి రాగము పాడఁ - బల్లవి పూచు నగత్యము


చల్లని రేయి రాగము పల్కె - రాత్రియు రాస లీలకు 

తెల్లని పాలు తెచ్చితి త్రాగు - తేమగ ఉన్న వేళయె 

ఉల్లము జల్లు అయ్యెను రమ్ము - ఊరిక ఉండు టేలను     

బెల్లము పొందు అల్లము కాదు - బెర్కు దేని కిందులొ 


ఆధారం: ఊహల డోల - భ/ర/స/జ/జ/భ

UII UI UII UI - UII UI UII విఱుపుతో -


ఈరోజు సాహిత్యం పాట (20-01-2022)


మీరేలే మా హృద్యమ్మే రా

 శ్రీ రామా నిన్ సేవింతున్ రా

శ్రీ మాతా నిన్ సేవింతున్ రా

శ్రీ లక్ష్మీ నిన్ సేవింతున్ రా

శ్రీ శక్తీ నిన్ సేవింతన్ రా


శ్రీ విశ్వాత్మా బ్రోవన్ గన్ రా

శ్రీ బ్రహ్మాత్మా బ్రోవన్ గన్ రా

శ్రీ ధర్మాత్మా స్నేహమ్మే రా

శ్రీ న్యాయమ్మే ధైర్యమ్మే రా


 ఎన్నోవింటాం దృశ్యం మ్మే  రా

ఆస్వాదిస్తాం ఆనందం రా

సందేహమ్మే  స్వప్నం మ్మే రా

విజ్ఞానం మ్మే  రత్నం మ్మే రా


 వెల్గుల్లోకే వేగమ్మే రా

మల్లోకాలే మోహమ్మే రా

కల్లోలమ్మే కాలమ్మే రా

సల్లాపమ్మే జీవమ్మే రా


 సర్వార్ధమ్మే సద్భావమ్ రా

సద్భావమ్మే సంఘర్షన్ రా

సంఘర్షమ్మే సంతోషమ్ రా

సంతోషమ్మే సంతానమ్ రా


 సాహిత్యమ్మే సద్బుధ్ధే రా

సమ్మోహమ్మే సంతృప్తే రా

మూర్ఖత్వమ్మే దుర్మార్గం రా

విశ్వాసమ్మే విజ్ణానం రా


  జీవేచ్ఛం లో  ఆధిక్యం రా

ఆధిక్యమ్మే జీవమ్మే రా

 పోరాటమ్మే ప్రోద్భావం రా

ప్రోద్భావమ్మే ప్రేమమ్మే రా


ప్రాధాన్యం మ్మే ప్రాబల్యం రా

ప్రాబల్యమ్మే ప్రోత్సాహం రా

ప్రోత్సాహమ్మే ప్రావిణ్యం రా

ప్రావిణ్యంమ్మే పూర్వార్ధం రా


దారిద్ర్యం మ్మే దాసోహం రా

దాసోహమ్మే సాధ్యమ్మే రా

చైతన్యం మ్మే సాక్ష్యమ్మే రా

ధర్మాధర్మం  దైవమ్మే రా


ఆధారం..వజ్రబంధం.. మ.గ

ప్రాంజలి ప్రభ.. విధేయుడు..మల్లాప్రగడ రామకృష్ణ

0


నేటి పాట -- ప్రాంజలి ప్రభ - 20-01-2022


భార్య పుట్టింటి నుండి వచ్చింది భర్త పలుకులు 


ముందు నీ రాకయే ముద్దుగా

పొందు నీ వంతయూ హద్దు గా

నాదియే నీ సొంతమై పద్దుగా

నీదియే నా సొంతమై సిద్ధి గా


ఓసి ఎంతా మజా గున్నవే

చూసి నంతా కలా కాదుగా

వాసి కెక్కావుగా మెట్టుగా

రాసి గున్నా మనో సిధ్ధిగా


ఆపండి మీ పాటలు 


ఎందుకో బాధతో వచ్చెగా

అందుకో జుర్రుకో ముందుగా

సర్దుకో మంటినీ పండుగా

మెచ్చుకో ఇప్పుడే నిండుగా


డెందమే వేచీ నీ కుండెగా

పందమే వద్దే నే నుండగా

అందమే నీదే నీ దాసిగా

గంధమే పొందూ నేనుండగా


అవునే ని పాటలు నన్నుఉడికిస్తున్నాయి 


దూర తీరాలలో వుండగా

వారి భావాలలో నుండగా

చేరు మార్గములో పండుగా

మారు సౌఖ్యమ్ములో నిండుగా


చేర రమ్మంచు నన్నంటివా

చేరి దమ్ముంది మన్నించగా

కోరి ఇమ్మంది పన్నీరు గా

మారి పోయింది కన్నీరు గా



ఆపండి మీ పాటలు 


కోరికే బుద్బుదమ్మెయ్యనా

చేరికే  నెమ్మదమ్మెయ్యనా

తీరికే  సమ్మతమ్మయ్యనా

ఊరికే నమ్మకమ్మయ్యనా


చేరగా మోహనా ఎట్లురా

బేరమే లేదురా పొందురా

నేరమే కాదురా విందుగా

భారమే కాదురా చిందురా


నారి జీవమ్మె ఇక్కట్లు రా

మేరి నాదమ్మె శబ్ధమ్మురా

వారి వైనమ్ము మోహమ్మురా 

చేరి దేహమ్ము దాహమ్ము రా


అవునే మరి 


ఓ మహా శక్తి రమ్మింటికిన్

ఓ సహాయమ్ము ఈవంటికన్

గామితార్ధమ్ము లీడేర్చగన్ 

స్వామి తీర్ధమ్మునే పంచగన్ 


ఆధారం ఛందస్సు 

__(())


నేటి ఛందస్సు పాట -19-01-2022

విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 


సమ్మ తమ్మే  సమానమ్ 

సామదానం సహాయమ్ 

ప్రేమ దారే  వినోదమ్ -- సౌఖ్యమే కాదా 


సేవ భావమ్ సమానమ్ 

దైవ పూజా  ప్రధానమ్ 

హావ భావం  ప్రభావమ్ - ప్రాంతమే కాదా 


విద్య దానం విధానమ్ 

మంద బుద్దే వినాశమ్ 

వేద పాఠం  సహాయమ్ - విశ్వమే కాదా 

 

ఈ విశాల ప్రపంచమ్ 

ఈ విధానం నిబద్ధమ్ 

ఈ వినాశం ప్రయత్నమ్ -- హావమే కాదా 


సఖ్య తన్ మూ గనైతిన్  

ఆకలిన్ ఆశనైతిన్ 

వాకిలిన్ మార్పుకోరిన్  --- వాదమే కాదా 


మాట మంచే జయమ్మే 

మంచి దారే వివాహమ్ 

కాల మాయే నిదానమ్ - శాంతమే కాదా 


ప్రేమ భావమ్ము గాదా 

ప్రేమ దైవమ్ము గాదా 

ప్రేమ జీవమ్ము గాదా -- దైవమే కదా 


ఆధారం: షట్పదీ హంసమాలా: UIU  UIUU // UIU UIUU // UIU UIUU - UIU UU


__(())__



నేటి పాట -18-01-2022  - ప్రాంజలి ప్రభ 

విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ  

భార్య అలిగినప్పుడు భర్త ఆలాపన 


ప్రాణమ్ము పోసేదిలే 

ప్రాణము తీసేది లే 

వైనమ్ము చూపేదిలే  -- మోహమ్ము దేవీ  


మాటా సుగందమ్ముతో 

ఆటా సుభందమ్ముతో 

వేటా  సుహాసమ్ముతో  -- దాహమ్ము దేవీ 


లీలార విందమ్ముతో 

మొహాల చిత్తమ్ముతో 

దాహాల దానమ్ము తో  -- దేహమ్ము దేవీ


బాలామ ణీ కాంచుమా 

ప్రేమా సఖీ ఎంచుమా 

ఆరావళీ  తిర్చుమా -- కామాబ్జ దేవీ


ప్రేమమ్ము నీవేకదా 

దేహమ్ము నీదేకదా 

దాహమ్ము నీదే కదా -- కామాగ్ని దేవీ


యీ గాలిలో నే ప్రియా 

యీ వానలోనే ప్రియా 

యీ మంచులోనే ప్రియా -- వెచ్చేలె దేవీ


యీ గుండెలో నే నువే 

యీ పువ్వులోనే నువే 

యీ నవ్వులోనే నువే   -- నమ్మాను దేవీ


రాగాలతో హాసమా 

రోగాలతో వాసమా 

రోమాలతో మోసమా  --  యీమాట దేవీ


నీ మాన సాబ్రమ్ములో 

నీ వాంఛ తిరమ్ములో 

నీ ఆశ పాశమ్ము లో  --  నేనేల  దేవీ

ఆధారం :రాజరాజీ షట్పది: UUI UUIU // UUI UUIU // UUI UUIU - UUIUU

*****

0

 


నేటి పాట - ప్రాంజలి ప్రభ 

విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 


అబ్బాచంపకు - ఆత్రమే వయసులే 

రావే నాచెలి - రాజహంసవు గ లే  

ప్రేమాచూపుము - ప్రేమయే మనసు లే   

రావే నా సతి - రాజధీరుడు గలే 


సంతోషం మన సాయె పిల్పుగ నులే  

నీపై సదా ప్రేమలే  

విశ్వాసం ఇక విశ్వ విద్యలుగలే

ఆకాశ మార్గమ్ములే      


ఏవోకొర్కలుగ నిన్ను చేరితిని లే 

ఏదైన మార్పేను లే 

ఆశాపల్కులుగ ఆత్రమే ఇదియులే 

భావమ్ము చెప్పేను లే   


ఏదో యెప్పుడొ - యెందుకో తెలియు లే  

ప్రేమమ్ము నన్నూఁపెలే  

ఏమో యెవ్వరో - యెట్టు లీజగములే  

నీమాయలో ముంచిలే  


నిన్నే దల్చును నిండుగా మనసులే 

సద్భావమే ప్రేమలే 

దేహమ్మే నులె ధర్మమార్గమున లే 

దైవమ్ము చూసేనులే 


అబ్బాచంపకు - ఆత్రమే వయసులే 

రావే నాచెలి - రాజహంసవు గ లే  

ప్రేమాచూపుము - ప్రేమయే మనసు లే   

రావే నా సతి - రాజధీరుడు గలే 

  

ఆధారం: విరళరాజీ - UU UII - UIU IIIU // UUI UUIU

*****

అర్ధసమ వృత్తము విరళరాజీ Taming the Tiger
==
విరళోద్ధతా - మ/స/జ/స UU UII - UIU IIIU  12 జగతి 1881
రాజరాజీ - త/త/గ UUI UUIU 7 ఉష్ణిక్కు 37
ఈ రెండు వృత్తములు వాగ్వల్లభలో పేర్కొనబడినవి. 
శార్దూలవిక్రీడితము = విరళోద్ధతా + రాజరాజీ 
కాని అర్ధసమవృత్తముగా ఇందులో మార్దవము, సంగీతము ధ్వనిస్తాయి!
==
విరళరాజీ - UU UII - UIU IIIU // UUI UUIU
==
రాకాచంద్రుఁడు - రమ్యమై పిలిచె ని 
న్నాకాశ మార్గమ్ములో 
నాకై రమ్మిట - నాదు మానసములో 
నీకై సదా వాసమే 
==
ఎన్నో మారులు - నృత్యమాడితివి నా 
చిన్నారి హృత్సీమపై 
నీన్నే దల్తును - నిండుగా మనసులో 
కన్నయ్య రావేలరా 
==
రావే నాచెలి - రాజహంసవు గదా
జీవాంబురాశిన్ సదా 
దేవీ నామది - దీపమై మనుము నా 
భావాబ్జముల్ నీకెగా 
==
ఏమో యెప్పుడొ - యెందుకో తెలియదే 
ప్రేమమ్ము నన్నూఁపెనే 
ఏమో యెవ్వరో - యెట్టు లీజగములో 
నీమాయలో ముంచిరో 
==
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
0

No comments:

Post a Comment