Thursday 6 January 2022

 పాట సందర్భం:-

*******

ఇద్దరి మద్య   మౌనం వీడి మాటగా మారి

 ప్రేమ కురిసి పరిణయమై కలిసి  సరసమై అలసి సొలసి పోయే సమయంలో మధురమైన పాటై  

సుధలే పంచుకున్న తియ్యని క్షణాల స్వరగీతం.

*****************

పల్లవి;-

***


నినుకోరి  ఇష్టంగాను వచ్చాను 

ననుచేరి మురిపాలనే అందించు 

నీ ముద్దు కన్నెసొగసునె అర్పించు చెలియా.


నినుకోరి  ఇష్టంగాను వచ్చాను 

ననుచేరి సుఖమంతా పొందాలి  

నీ నవ్వే నామనసును దోచింది సఖియా .


వలపులన్నీ చూపెదలే 

తలుపులన్నీ పంచదలే 

బిగువులన్ని పొందువులే 

సొగసులన్నీ నావియులే 


నినుకోరి  ఇష్టంగాను వచ్చాను 

ననుచేరి మురిపాలనే అందించు 

నీ ముద్దు కన్నెసొగసునె అర్పించు చెలియా.


నినుకోరి  ఇష్టంగాను వచ్చాను 

ననుచేరి సుఖమంతా పొందాలి  

నీ నవ్వే నామనసును దోచింది సఖియా .

 

 చరణం:-

*****

నీకు వయసొచ్చింది వలపును తీర్చే మగాడ్ని నేనున్నా 

ఇది పొంగే వయసు అదుపుచేయుట ఎందుకే 

అందు బాటులో ఉంది అందుకో ఇక అంతా నీ సొంతమే 


అలా చూసేసి ఏదేదో చేద్దామనుకోకురా 

కొంపే కొల్లేరయ్యేలో  గుట్టే విప్పెయ్యకురా

ఈ వంపు సొంపులన్నీ నీసొంతమే అక్కడ ఇక్కడ రా 

ఈ శిల్పమే ఇక నీ ఇష్టమురా 

 పల్లవి:-

****

నినుకోరి  ఇష్టంగాను వచ్చాను 

ననుచేరి మురిపాలనే అందించు 

నీ ముద్దు కన్నెసొగసునె అర్పించు చెలియా.


నినుకోరి  ఇష్టంగాను వచ్చాను 

ననుచేరి సుఖమంతా పొందాలి  

నీ నవ్వే నామనసును దోచింది సఖియా .

 

 చరణం:-

****

తలుపులు తెరిచాను రా 

వలపు రుచి ఇక చుడాలిరా 

 బలుపునే గెలిపించాలి రా 

ఆనంద శిఖరాన్ని ఇక అందుకుందాం రా 


 హాయి హాయిగా నీడలా ఉంటానే 

 తీయ తీయగా పాటగా ఉంటానే 

 ఊయలలో ఉంచి అటాడుతానే 

 మల్లెలు సుఘందాన్ని పొందుదామే  


 చెలియా చెలియా  చిలిపి చేష్టలు నీసొంతమే  

 సఖియా  సఖియా  సొగసుల అన్నీనీసొంతమే  

  పల్లవి:-


నినుకోరి  ఇష్టంగాను వచ్చాను 

ననుచేరి మురిపాలనే అందించు 

నీ ముద్దు కన్నెసొగసునె అర్పించు చెలియా.


నినుకోరి  ఇష్టంగాను వచ్చాను 

ననుచేరి సుఖమంతా పొందాలి  

నీ నవ్వే నామనసును దోచింది సఖియా .


*********

 

నేటి పాట -- ఓ మనిషి  


ఓ మనిషి ఇది లోక మాయ 

గెలవాలి జీవితంలో మాయ 

బ్రతికి బ్రతికించుట మాయ 

నా అనేది విడువక ఉండే మాయ 

 

ఓమనిషి 

జీవితమే ఒక కేళీ రంగం  

ఇదియే సుఖ దుఖమ్ముల సంగం 

త్యాగమే దానికి శృంగం    

ఇదియే తృష్ణ యే శాంతికి భంగం 

ఇహ పరాల చదరంగం   

ఇదియే ఆడుతుంది అంతరంగం


ఓ మనిషి ఇది లోక మాయ 

గెలవాలి జీవితంలో మాయ 

బ్రతికి బ్రతికించుట మాయ 

నా అనేది విడువక ఉండే మాయ 


ఓ మనిషి నీకుతోడు రారు  

తల్లి,తండ్రి, భార్య, పుత్రుడు, జ్ఞాతులు   వీరె వ్వరు    

పరలోకమునకు సహాయముగా రానేరారు.   

ధర్మమొక్కటే  నీ వెంట అచటికి  సహాయముగా  చేరు 



ఓ మనిషి ఇది లోక మాయ 

గెలవాలి జీవితంలో మాయ 

బ్రతికి బ్రతికించుట మాయ 

నా అనేది విడువక ఉండే మాయ 


ఓ మనిషి .

కేవలము కన్నులు సర్వాన్నీ  చూడ లేవు. 

మన ఆలోచనతో కొంత తెలిసుకొవాలి నీవు . 

కళ్ళు చూసినదే  సత్యమనుకో  రాదనీ  తెలియవు  

మన వెన్ను మనకు కనపడ నట్లే 

కొన్ని సత్యాలు  తరచి చూస్తె గాని  కనపడవు 


ఓ మనిషి ఇది లోక మాయ 

గెలవాలి జీవితంలో మాయ 

బ్రతికి బ్రతికించుట మాయ 

నా అనేది విడువక ఉండే మాయ 


ఓ మనిషి 

సొంత కుల వృత్తిచే జీవించుట ఉత్తమం 

వ్యాపార, వర్తకము వలననూ కృషివలననూ జీవించుట మధ్యమం  

ఒకరి క్రింద పనిచేసి జీవించుట అధమం 

దొంగిలించుట మృత్యువును కొని తెచ్చుకొనుట యేయని ఎరుగ వలెను।

దొంగతనము కంటే మరణమే మేలు।


ఓ మనిషి ఇది లోక మాయ 

గెలవాలి జీవితంలో మాయ 

బ్రతికి బ్రతికించుట మాయ 

నా అనేది విడువక ఉండే మాయ 


___((()))____



మీకు ఇవే ప్రాంజలి ప్రభ శుభాకాంక్షలు 

 నేటి పాట


రాముడే దేముడూ ..మాయింట వేల్పుడే

సామమే భజన నిత్యమూ

సామమే భజన నిత్యమూ ధ్యానమై

ప్రేమనే పంచు రీతిగా


చేసేది చేసియే.. అందరం వేడుకే

చూసేది చూసి సంబరం

చూసేది చూసి సంబరం ప్రాణమై

ఆశేది లేదు ఆదుకో


కాలమే మమ్మును ..మార్చేను ఖచ్చితం

గాలమై కలలు లాగె లే

గాలమై కలలు లాగెలే నిత్యమై

తాళము వేసె బ్రతుకులే


మామాట నమ్ముమూ తీయంగ ఉండునే

మామాట తప్పు కాదులే

మామాట తప్పు కాదులే సత్యమై

మామాట నిత్య వేణువై


రాగమై తాళమై.. పల్లవీ పాడితీ

వేగమే కాదు ఈపాట

వేగమే కాదు ఈపాట.. హృద్యమై

యోగమై దైవ ప్రార్థనే

0 Co


ప్రాంజలి ప్రభ గొబ్బి పాటలు

*గొబ్బియ్యాలో*

గొబ్బియ్యాలో గొబ్బి గొబ్బి పాడారమ్మా - నిబ్బరంపు చేడేలే గొబ్బియాలో

గొబ్బియ్యాలో ఎండి గజ్జా పగడామువ్వా - డేగకాలికి గట్టిరే గొబ్బియాలో             

గొబ్బియ్యాలో డేగబోయి ఎంకటేశుని - దేవాలాన వాలేనే గొబ్బియ్యాలో

గొబ్బియ్యాలో ఎంకటేశుని కాపులారా - డేగవచ్చే కానారో గొబ్బియ్యాలో

గొబ్బియ్యాలో కానాలేమే కన్నెలారా - చూడలేమే పడతూలూ గొబ్బియ్యాలో            

గొబ్బియ్యాలో డేగబోయి గోయిందురాజులు - దేవాలాన వాలేనే గొబ్బియ్యాలో

గొబ్బియ్యాలో గోయిందు రాజుల కాపులారా - డేగవచ్చే కానారే గొబ్బియ్యాలో

గొబ్బియ్యాలో కానాలేమే కన్నెలారా - చూడలేమే పడతూలూ గొబ్బియ్యాలో            

గొబ్బియ్యాలో డేగబోయి కాళాస్త్రి - దేవాలాన వాలేనే గొబ్బియ్యాలో

గొబ్బియ్యాలో కాళాస్త్రి కాపులారా - డేగవచ్చే కానారే గొబ్బియ్యాలో

గొబ్బియ్యాలో కానాలేమే కన్నెలారా - చూడలేమే పడతూలూ గొబ్బియ్యాలో             

గొబ్బియ్యాలో డేగబోయి తలకోన - దేవాలాన వాలేనే గొబ్బియ్యాలో

గొబ్బియ్యాలో తలకోనా కాపులారా - డేగవచ్చే కానారే గొబ్బియ్యాలో

గొబ్బియ్యాలో కానలేమే కన్నెలారా - కానాలేమే పడతూలూ గొబ్బియ్యాలో

 కన్నెపిల్లలు మాత్రమే గొబ్బెమ్మల్ని పెట్టి ఆడిపాడతారనుకుంటే పొరపాటు. ముత్తయిదువులూ తమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలనీ... పిల్లాపాపలతో తమ ఇళ్లు కళకళలాడాలని కోరుకుంటూ గొబ్బెమ్మలకి పూజచేస్తారిలా...

*****""

 *సంకురాతిరి*

సంకురాతిరి పండుగొచ్చె గొబ్బియల్లో - సంబరాల పండుగొచ్చె గొబ్బియల్లో

పుష్యమాసం పండుగొచ్చె గొబ్బియల్లో - పుణ్యకాలం వచ్చినాది గొబ్బియల్లో

సూర్యదేముడు వచ్చినాడు గొబ్బియల్లో - మకరరాశి చేరినాడు గొబ్బియల్లో

భోగిమంట లేసినారు గొబ్బియల్లో -  కళ్లాపి చల్లినారు గొబ్బియల్లో

ముగ్గులెన్నో పెట్టినారు - గొబ్బిళ్లు పెట్టినారు గొబ్బియల్లో

గుమ్మడి పూలు పెట్టినారు గొబ్బియల్లో-  తంగేడుపూలు చల్లినారు గొబ్బియల్లో

బంతిపూలు కట్టినారు గొబ్బియల్లో - చేమంతు లల్లినారు గొబ్బియల్లో

తోరణాలు కట్టినారు గొబ్బియల్లో - గడపకు పసుపు పూసినారు గొబ్బియల్లో

బొమ్మల కొలువు పెట్టినారు గొబ్బియల్లో - భోగిదాన మిచ్చినారు గొబ్బియల్లో

పాడి పంట పండుగొచ్చె గొబ్బియల్లో - ఇంటినిండ ధాన్యాలు గొబ్బియల్లో

అన్నపూర్ణ ఇంటిలోన గొబ్బియల్లో - పిండి వంటలు చేసినారు గొబ్బియల్లో 

అల్లుళ్లు వచ్చినారు గొబ్బియల్లో - అలకపాన్పు వేసినారు గొబ్బియల్లో 

కూతుళ్లు వచ్చినారు గొబ్బియల్లో - కొత్త కోక కట్టినారు గొబ్బియల్లో 

బావగారు వచ్చినారు గొబ్బియల్లో - బడాయిలు చూపినారు గొబ్బియల్లో 

మరదళ్లు వచ్చినారు గొబ్బియల్లో - మంచి గంధం పూసినారు గొబ్బియల్లో 

బుడబుక్కలోడు వచ్చినాడు గొబ్బియల్లో - గంగిరెద్దుల మేళాలొచ్చె గొబ్బియల్లో 

జంగమదేవర వచ్చినాడు గొబ్బియల్లో - ఎరుకలసాని వచ్చినాది గొబ్బియల్లో 

ధాన్యాలు పొందినవారు గొబ్బియల్లో - దీవించి వెళ్లినారు గొబ్బియల్లో 

కోళ్ల పందెమాడినారు గొబ్బియల్లో - కోలాటమాడినారు గొబ్బియల్లో 

పల్లెలోని రైతులంతా గొబ్బియల్లో - పార్వాటమాడినారు గొబ్బియల్లో 

చందమామ వెన్నెల్లో గొబ్బియల్లో - చెమ్మచెక్క లాడినారు గొబ్బియల్లో 

సంకురాతిరి లక్ష్మివచ్చె గొబ్బియల్లో - చల్లగాను దీవించె గొబ్బియల్లో 

గొబ్బియల్లో గొబ్బియల్లో... గొబ్బియల్లో..

*"**

*భోగిపళ్లు*

భోగిపళ్లు పోయరారె అమ్మలారా

కోమలాంగులందరు గూడి కొమ్మలారా...                      

భోగిపళ్లు!! భోగిపళ్లు పోయరారే!!

చిట్టి చిట్టి పాపలను చేరదీసి

కొత్త కొత్త బొమ్మలను కొలువు దీర్చి 

కన్నెలొలుకు వన్నెలకు చిన్నెలిచ్చి 

ముద్దు గొలుపు మురిపాలు మూటగట్టి

భోగిపళ్లు!! భోగిపళ్లు పోయరారే!! 

రేగుపళ్లు రాగి డబ్బులు 

చెరుకు గడలు సెనగ గింజలు 

బంతిపూల రేకులతో కొమ్మలారా...

 దిష్టిదీసి దిగదుడిచి అమ్మలారా... 

భోగిపళ్లు!! భోగిపళ్లు పోయరారే!! 

కాంతులీను హారతిచ్చి

కమలనాభు కరుణ కోరి 

అందమైన బొమ్మలకు కొమ్మలారా 

బొమ్మలంటి పిల్లలకు అమ్మలారా 

భోగిపళ్లు!! భోగిపళ్లు పోయరారే!!

🙏🍒🍒🙏🍒🍒🙏🍒🍒🙏

*గొబ్బియెల్లో*

గొబ్బియల్లో గొబ్బియల్లో కొండానయ్యకు గొబ్బిల్లు

ఆదిలక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిల్లు

కన్నె పిల్లల కోర్కెలు తీర్చే

వెన్నాలయ్యకు గొబ్బిల్లు

ఆ వెన్నాలయ్యకు గొబ్బిల్లో

ముద్దులగుమ్మ బంగరు బొమ్మ

రుక్మిణమ్మకు గొబ్బిల్లో

ఆ రుక్మిణమ్మకు గొబ్బిల్లు

గొబ్బియల్లో గొబ్బియల్లో కొండానయ్యకు గొబ్బిల్లు

ఆదిలక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిల్లు

హైలో హైలెస్సారే హరిదాసులు వచ్చారే

దోసిట రాసులు తేరే కొప్పును నింపేయ్రే

డూ డూ బసవను చూడే వాకిట నిలుచున్నాడే

అల్లరి చేస్తున్నడే సందడే మొనగాడె

కొత్త అల్లుళ్ళ అజమాయిషీలే

బావ మరదళ్ల చిలిపి వేషాలే

కోడి పందాల పరవల్లే

తోడు పేకాట రాయుల్లే

వాడ వాడంతా సరదాల చిందులేసేలా ..

భగ భగ భగ భగ భోగిమంటలే

గణ గణ గణ గణ గంగిరెద్దులే

కణ కణ కణ కణ కిరణ కాంతులే

ధగ ధగ ధగ ధగ ధను సూర్యుడే

చక చక చక చక మేకర్ రాశిలో

మెరిసే మురిసే సంక్రాంతే

భగ భగ భగ భగ భోగిమంటలే

గణ గణ గణ గణ గంగిరెద్దులే

కణ కణ కణ కణ కిరణ కాంతులే

ధగ ధగ ధగ ధగ ధను సూర్యుడే

చక చక చక చక మేకర్ రాశిలో

మెరిసే మురిసే సంక్రాంతే

మూనాళ్ల సంబరమే ఉత్సవమే

ఏడాది పాటంతా జ్ఞాపకమే

క్షణం తీరిక క్షణం అలసట

వశం కానీ ఉత్సాహమే

రైతు రారాజుల రాతలే మారగా

పెట్టు పోతలతో అందరికి చేయూతగా

మంచి తరుణాలకే పంచ పరమాణ్ణమే

పంచి పెట్టెల మనలోని మంచి తనమే

భగ భగ భగ భగ భోగిమంటలే

గణ గణ గణ గణ గంగిరెద్దులే

కణ కణ కణ కణ కిరణ కాంతులే

ధగ ధగ ధగ ధగ ధను సూర్యుడే

చక చక చక చక మేకర్ రాశిలో

మెరిసే మురిసే సంక్రాంతే

హే భగ భగ భగ భగ

గణ గణ గణ గణ

హే కణ కణ కణ కణ

హే భగ భగ భగ భగ

గణ గణ గణ గణ

ధగ ధగ ధగ ధగ ధను సూర్యుడే

రోకళ్ళు దంచేటి ధాన్యాలే

మనసుల్ని నింపేటి మాన్యాలే

స్వరం నిండుగా సంగీతాలుగా

సంతోషాలు మన సొంతమే

మట్టిలో పుట్టిన పట్టు బంగారమే

పెట్టి చేసారు మన చిన్ని హృదయాలనే

సాన పెట్టేయిలా కోరుకుంటే అలా

నింగి తారల్ని ఈ నెలలో పండించేలా

భగ భగ భగ భగ భోగిమంటలే

గణ గణ గణ గణ గంగిరెద్దులే

కణ కణ కణ కణ కిరణ కాంతులే

ధగ ధగ ధగ ధగ ధను సూర్యుడే

చక చక చక చక మేకర్ రాశిలో

మెరిసే మురిసే సంక్రాంతే

సాన పెట్టేయిలా కోరుకుంటే అలా

నింగి తారల్ని ఈ నెలలో పండించేలా

భగ భగ భగ భగ భోగిమంటలే

గణ గణ గణ గణ గంగిరెద్దులే

కణ కణ కణ కణ కిరణ కాంతులే

ధగ ధగ ధగ ధగ ధను సూర్యుడే

చక చక చక చక మేకర్ రాశిలో

మెరిసే మురిసే సంక్రాంతే

""""*"""'*"""


సంక్రాంతి పాట

రచయిత మల్లాప్రగడ రామకృష్ణ


అదిగదిగో వచ్చెను ఆనందం తెచ్ఛెను సరదాల సంక్రాంతి పండగా

సంతోషం వెల్లువిరిసె నిండుగా


ఇంట పంట కొత్త అల్లుళ్ళు చేయు పిండి వంట లు

వాకి టింట గొబ్బెమ్మ  పుత్తడి బొమ్మ ముగ్గులు

ముంగిట భోగిమంటలు కోడి పందాల ఆటలు

గంగిరెద్దుల,హరిదాసుల, గాలిపటాల సందడులు

సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటె ప్రేమానురాగాలు


సూర్యునిద్వారా వచ్చే కాంతి సంక్రాంతి యంట

ఆత్మ జ్ఞానం తో వచ్చే కాంతి సంక్రాంతి యంట

భౌతిక ఆధారంతో మెచ్చే క్రాంతి సంక్రాంతి యంట

సజ్జన సాంగత్యం తో వచ్చే శాంతి సంక్రాంతి యంట

సాధ్యాయ సాధనతో వచ్చే క్రాంతి సంక్రాంతి యంట


నిష్కల్మష హృదయం తో సాగే సంక్రాంతి పనులు

కల్మషం కపటములు లేక కలిసే సంక్రాంతి బంధువులు

స్వచ్ఛమైన మనస్సుతో  సంక్రాంతి యంట సంబరాలు

శాంత నిర్మలతలు ఆనందాల సంక్రాంతి పడచులు

ప్రేమానురాగాలతో కల్సుకొనే తల్లిదండ్రులు బిడ్డ లు


అదిగదుగో వచ్చేను,ఆనందంతచ్చేను సరదాల సంక్రాంతి పండుగా

సంతో‌షం వెల్లువిరిసే నిండుగా


నేటి పాట 

రాధాకృష్ణ లీలా మాధుర్యం 


కాలము తీర్చే -- కష్టము లన్నీ 

గోలలు వద్దూ -- గోప్యము గుండూ 

మాలల మల్లే -- మానస బత్కే

మేళము వద్దూ -- మేలుని గూర్చీ 


రమ్ము ముకుందా -- కామ్య ముకుందా  

ధీర ముకుందా -- రాధ ముకుందా 


కాదనకోయీ -- లేదనకోయీ

నాదరి రావా - నాదమయా 

వాదము వద్దూ -- మోదమువద్దూ 

వేదము హద్దూ -- వేదమయా 


రమ్ము ముకుందా -- కామ్య  ముకుందా  

ధీర ముకుందా -- రాధ ముకుందా 


వేకువ లోనా -- వేల్పులు చూడూ 

మక్కువతోనా -- మాధురియా 

శ్లోకము లోనా -- శాకము లోనా 

పాకములోనా - పక్వము యా 


రమ్ము ముకుందా -- కామ్య ముకుందా  

ధీర ముకుందా -- రాధ ముకుందా 


ధాత్రివి నీవే - రాత్రివి నీవే 

బ్రాంతివి నీవే - నేత్రము యే 

కాంతివి నీవే - శాంతివి నీవే  

స్తోత్రము నీవే - గాత్రము యే 


రమ్ము ముకుందా --కామ్య ముకుందా  

ధీర ముకుందా -- రాధ ముకుందా 


మాధవు నీవే - రాధను నేనే 

శోధన ఏలా - గాధను లే 

కాదన కోయీ - లేదను కోయీ 

నాదరి రావా - నాదమ యీ


రమ్ము ముకుందా -- కామ్య ముకుందా  

ధీర ముకుందా -- రాధ ముకుందా 


కాలము తీర్చే -- కష్టము లన్నీ 

గోలలు వద్దూ -- గోప్యము గుండూ 

మాలల మల్లే -- మానస బత్కే

మేళము వద్దూ -- మేలుని గూర్చీ 


ఆధారము :శరషట్పది: UII UU / UII UU / UII UU - UIIU

విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 

--((()))--

నేటి పాట -- లక్షణతో జానకి పలుకే 

మల్లాప్రగడ రామకృష్ణ 


ఏమియాశ నీకు - వినపడలేదా ఆర్తనాదం 

తప్పుచేయాలని తలంచావు వెనకాడుతున్నావు 

లక్ష్మణా ఈ జానకి రాముని తప్ప అన్య మొహమైన చూడదు   


లక్ష్మణ నీడన - సీతయు చేరెను 

సీతయు డెందము - భగ్గుమనేన్ 

రాముని గూర్చియు - నాకును చెప్పకు 

నామనసౌనిక - నాదముగా 

 

ప్రేమము కోపము - నీ నటనేననె  

నామది నిన్నును - కోరదులే 

ప్రేమము లేదియు - ద్వేషము లేదియు

సోదరి ప్రేమయు - యాచకుకిన్ 


కాలము సర్పము - కాటును వేయును 

రాముడు కష్టము - తెల్పెను గన్ 

తొందర లేదియు - ఆశతొ ఉంటివి 

ధర్మము తప్పియు - ఏ పలుకున్ 


దిక్కులు చూడకు - చూపులు తిప్పుము 

కామపు ఆశలు - మానుముయున్ 

సత్యము తెల్పితి - నైజము మానుము 

చిక్కిన దానిని - కానుకగా 


ప్రేరణ మానుము - వేషము మార్చుము 

ప్రేయసి వళ్లెను - చూడకుమీ  

గాలి నెదుర్చుచుఁ - గన్నుల నీరిడి

వ్రాలుట జీవన - వైభవమా

   

రాముని రక్షగ - వెళ్లుము ఇప్పుడె 

లక్ష్మణ తొందర - చేయుమున్ 

భాత్రుడు భాదతొ - పిల్చెను వింటివె 

యామని నేనొక - యాచకి కిన్  


రేఖలు గీసితి - దాటకు ఎప్పుడు 

వెళ్లేద వచ్చెద - తొందరలో 

కష్టము లేదియు - రాముని కెప్పుడు 

రాక్షస మాయయు - కొంచముగన్ 


ఏమియాశ లేదు - వినపడి నాది ఆర్తనాదం 

తప్పుచేయాలని తలంపు లేదు వెనకాడుటలేదు  

రేఖలు దాటకు జానకి, రాముని తప్పక తెచ్చదన్ ఓర్పు వహించుమున్    

ఓర్పు వహించుమున్

--(())--  


నేటి పాట -- ప్రాంజలి ప్రభ  -- 13--01--2022

రచయిత మల్లాప్రగడ రామకృష్ణ 


బ్రతుకు తెరువు ఇదియే  

మన భాగ్యసీమ ఇదియే 

తెలుగు భాష మనది యే  

అంధకారమున ఉన్నది 

వెన్నెల్లోకి తీసుకొద్దాం ----- పల్లవి 


లేవండి తెలుగు భాషను రక్షించు కుందాం 

మాతృభూమి, మాతృమూర్తి, మాతృ భాష, చదువుదాం 


కృష్ణయు పెన్నయు గోదావరియు 

తుంగభద్రయు వంశధారయు 

పొంగుచు పరుగిడు సముద్రమునకు 

జీవము నొసగెడు నిధు లీ నదులు 

నదులజలాలు కడలిలో ఆకలిసేవిధాలుగా 

తెలుగుభాష నరనరాల్లో జీర్ణించుకుందాం 

భారత దేశం మొత్తం విస్తరించి బ్రతుకుదాం  

అన్నిదేశాలూ తిరిగి తెలుగులో బోధలు చేద్దాం  


బ్రతుకు తెరువు ఇదియే  

మన భాగ్యసీమ ఇదియే 

తెలుగు భాష మనది యే 

అంధకారమున ఉన్నది 

వెన్నెల్లోకి తీసుకొద్దాం ---- 1


తేనెలు పూసిన తీయని పలుకులు 

పానము జేయగ నమృతపు చినుకులు 

పాటలు మాటలు పన్నీటి యూటలు 

పద్యము గద్యము లందపు తేటలు 

పండగ  వేడుక అందరి పాటలు 

చింతలు లేకయు సంబర యాటలు 

స్త్రీలలొ ఆశలు తీర్చేటి వింతలు 


బ్రతుకు తెరువు ఇదియే  

మన భాగ్యసీమ ఇదియే 

తెలుగు భాష మనది యే 

అంధకారమున ఉన్నది 

వెన్నెల్లోకి తీసుకొద్దాం    ---- 2


బుద్ధుని బోధన జాటిన ప్రాంతమిది  

శ్రీనాధుడు బుద్ధిని తెలివిని బెంచిన ప్రాంతమిది  

రామకృష్ణ ప్రతిభను చాటిన ప్రాంతమిది  

గీతము నృత్యము కవిత్వము నేర్పిన ప్రాంతమిది  

ప్రీతికి బ్రేమకు సర్వము త్యాగ బుద్ధి గల ప్రాంతమిది   

సకల మతాలకు స్థానము కల్పించు ప్రాంతమిది 


బ్రతుకు తెరువు ఇదియే  

మన భాగ్యసీమ ఇదియే 

తెలుగు భాష మనది యే 

అంధకారమున ఉన్నది 

వెన్నెల్లోకి తీసుకొద్దాం   ---- 3


చెఱుగని సంస్కృతి సాంప్రదాయం నిల్పుదాం 

మఱువక విజ్ఞానాన్ని పెంచుతూ జీవిద్దాం 

మురియుచు శాంతిగ ముందుకు పోదాం

దెస దేశాలలో తెలుగుభాష గొప్పతనం చాటుదాం 

బంగరు భవిశ్యత్తుకు అందరం కృషి చేద్దాం 

తుది రక్తం బిందువులు వరకు తెలుగు కోసం శ్రమిద్దాం 

తల్లి, తండ్రి, గురువు నేర్పిన తెలుగు పాఠాలు చదువుదాం 

 

లేవండి తెలుగు భాషను రక్షించు కుందాం 

మాతృభూమి, మాతృమూర్తి, మాతృ భాష, చదువుదాం 


బ్రతుకు తెరువు ఇదియే  

మన భాగ్యసీమ ఇదియే 

తెలుగు భాష మనది యే 

అంధకారమున ఉన్నది 

వెన్నెల్లోకి తీసుకొద్దాం   ---- 4


-(()))--


నేటి పాట -- మీకు తెలుసా 

ప్రాంజలి ప్రభ 


నీ తోడు నిన్ను మార్చేనులే 

కలిసొచ్చే కాలం ఇదేనులే 

ఆనందపు అనురాగం పండేనులే  

జోవితంలో సుఖసంతోషము వచ్చేనులే

 

ఆ కాలం ఏమి నేర్పింది? అనకు  


పొలం గట్లపై నడిపించి, తడబడకుండా నిలదొక్కుకోవటం నేర్పింది. తెలుసా 

వాగు పక్కన నీటి చెలిమలు తీయించి, శోధించే తత్వం నేర్పింది, తెలుసా 

సీతాఫలాల కోసం చెట్ల చుట్టూ తిరిగించి, అన్వేషణ నేర్పింది. తెలుసా 

తుమ్మ ముల్లు, పల్లేరు గాయాల గుచ్ఛులతో, జీవితం పూలపాన్పు కాదని నేర్పింది.తెలుసా 


అయితే  

చిన్న చిన్న దెబ్బలు తగిలితే, నల్లాలం ఆకు పసరు పోయించి, చిన్న చిన్న ఇంటి వైద్యం చిట్కాలు నేర్పింది. తెలుసా 

చెట్టుమీద మామిడికాయ గురిచూసి కొట్టడం, లక్ష్యాన్ని ఛేదించడం నేర్పింది.తెలుసా 

నిండు బిందెను నెత్తి మీద పెట్టి, నీళ్లు మోయించి, జీవితమంటే బరువు కాదు.. బాధ్యత అని నేర్పింది. తెలుసా 

బావి నుండి బొక్కెనతో నీళ్లు తోడించి, బాలన్స్ గా బరువు లాగటం నేర్పింది. తెలుసా 


నీతోడు నిన్ను మార్చేనులే 

కలిసొచ్చే కాలం ఇదేనులే 

ఆనందపు అనురాగం పండేనులే  

జోవితంలో సుఖసంతోషము వచ్చేనులే


అబ్బా  ఏమిటండి తెలుసా అంటారు ఇప్పుడు రోబోలు చేస్తున్నాయి అది మీకు తెలుసా 

అవునా 

ఇంటి ముంగిటకు అతిథి దేవతలు హరిదాసులు గంగిరెద్దులను రప్పించి, ఉన్న దాంట్లో కొంత పంచుకునే గుణం నేర్పింది మీకు తెలుసా 

విస్తరిలో, అన్నం అంచులు దాటి కింద పడిపోకుండా తినే ఒద్దికను నేర్పింది.మీకు  తెలుసా 

ఒక్క పిప్పర్మెంట్ ను, బట్ట వేసి కొరికి ముక్కలు చేసి, కాకి ఎంగిలి పేరుతో స్నేహితులతో పంచుకోవటం నేర్పింది మీకు తెలుసా 

ముళ్ళు గుచ్చుకోకుండా, ఒక్కటొక్కటిగా రేక్కాయలు తెంపే ఓర్పును నేర్పింది మీకు తెలుసా .

దారంతో విల్లును చేయించి, వస్తు తయారీ మెళకువలు నేర్పింది. మీకు  తెలుసా 


ఆపండీ మీమాటలు తెలుసా దొంగను పట్టి తెలుసా అని అడిగినట్లు ఉంది నీ పాట 

అసలు మీకు తెలుసా చెప్పండి    


అత్తా, మామా, అన్నా వదినా, అమ్మమ్మా, నాయనమ్మా, తాతయ్యా వరుసలతో, ఊరు ఊరంతా ఒక 

కుటుంబమనే ఆత్మీయత నేర్పింది.తెలుసా 

ధైర్యంగా బ్రతికే పాఠాలను నేర్పిన మన బాల్యానికి జీవితాంతం రుణపడి ఉందాం. తెలుసా 


అందరిలో ఒకరం, అందరికోసం ఒకరం, అర్ధం పరమార్ధం తెలుపుటకు సూర్యుడులా సంచరిస్తూ సర్వరోగాలు నివారిస్తు, సర్వాన్ని ఏకం చేయటం తెలుసా మీకు తెలుసా మీకు తెలుసా 


నీతోడు నిన్ను మార్చేనులే 

కలిసొచ్చే కాలం ఇదేనులే 

ఆనందపు అనురాగం పండేనులే  

జోవితంలో సుఖసంతోషము వచ్చేనులే

మీకు తెలుసా మీకు తెలుసా     

  

****


 నేటి - ఒమెక్రాన్ - గీతం  


ఏల బతి కేది మేము, మాకు రక్షణ ఏది

నిదరేమో రాక భయమే వెంట ఉండేది 

కాల నిర్ణయం తెలియదియే ధైర్యమేది 

తిండి లేక రోగానికి మందు లేక ఏల బతుకేది 

బతుకేది బతుకేది బతుకేది ఈశ్వరా


వద్దు వద్దంటే మనసును వదలినావు 

మాలొ ఆశలు పెంచావు మునిగి నావు  

తిరిగి ఉద్యోగం ఊడింది తిండి కరువు 

మాతృ భూమి లో బ్రతకక మారి నావు 

చదివితేనె ఈ కష్టాలు చేరి నాయి ఈశ్వరా  

 

మూతి ముసుగు గుడ్డ కరువే ఊపి రాడ 

తిండి  లేదాయే నీరస తిప్పు లాడ  

ఖాళీ రోడ్డు లా బతుకాయె ఖర్చు లాడ 

కదిలి ఆకలి తీరక కరువు బండ  

రక్షక భటులు దెబ్బలే రంగు లాయె ఈశ్వరా 


ఉడుకు అంతయూ ఆవిరి ఉండలేక 

చెమట తొణులే చిందాయే చెప్ప లేక 

భయము గుప్పిట బంధము బాధ మునక 

ముప్పు ముందాయె బ్రతుకుట మనసు రాక 

దోమ విందాయే కాయము దొప్ప లాగ ఈశ్వరా 


మనసు మాదికాదాయేను మునక లాగ 

బతుకు వేటాయే స్థిరముగా బండి లాగ 

మందు బందాయె బ్రతుకులో మాట లాగ 

అడిగె దిక్కులే దాయేను అటక లాగ 

పైస లేకయే పరమాత్మ దిక్కు లాగ ఈశ్వరా 


ఏల బతి కేది మేము, మాకు రక్షణ ఏది

నిదరేమో రాక భయమే వెంట ఉండేది 

కాల నిర్ణయం తెలియదియే ధైర్యమేది 

తిండి లేక రోగానికి మందు లేక ఏల బతుకేది 

బతుకేది బతుకేది బతుకేది ఈశ్వరా 

--(())++


నేటి పాట  -- నవ్వుకుంటూ పాడుకుందామా ఇలా ।ఎలా 


నీమాటకు నా మాట సరిజోడు ఇలా 

 పాలలో నీరులా కలసిపోదామా ఎలా 

కిరణాలతో వెలుగులా ఉండిపోదామా ఇలా 

చెరువులో పడవులా తిరుగుదామా ఎలా  

గాలిలో ఆకులా  ఎగురుదామా ఇలా 


అబ్బో మరిచెప్పు 


కాలం కాని కాలం లో - కాపు కాయా లంటే ఎలా 

దేశం కాని దేశం లో -  ప్రేమ పొందా లంటే ఎలా 


కాలం కాని కాలం లో కల్సి బత్కు దామా ఇలా 

దేశం కాని దేశం లో  ప్రేమ అడ్డు లేదులే ఇలా 


ఆహా 


మార్పు ల్లేని తీర్పు ల్లో - ఓర్పు ఉండా లంటే ఎలా  

స్నేహం కాని స్నేహం లో - జాలి చూపా లంటే ఎలా 


మార్పు ల్లేని తీర్పుల్లో -- నేర్పు ఉంటె చాలు ఇలా 

స్నేహం కాని స్నేహం లో --సేతువుగా ఉంటే చాలు ఇలా 


ఆహా 


వాడీ లేని వేడి లో - వాపు చూడా లంటే  ఎలా 

నీడా లేని వేడి లో - నాడి చూడా లంటే  ఎలా  


వాడీ లేని వేడి లో -- నిజము చూస్తే చాలు ఇలా 

నీడా లేని వేడి లో -- నటన ఉంటే చాలు ఇలా 


ఆహా 


నీరూ లేని మడ్గు లో  - చేప పట్టా లంటే ఎలా 

చెట్టు లేని ఎండ లో  - నీడ  చూడా లంటే  ఎలా 

నీరూ లేని మడ్గు లో -- మట్టే తీసి చూడు  ఇలా 

చెట్టు లేని ఎండ లో -- బూడిద చూడూ ఇలా 


ఆహా 

ప్రేమా లేని మేను లో - ప్రేమ పొందా లంటే ఎలా 

శృతే లేని  వీణ లో  - గీత  పల్కా లంటే  ఎలా 

ప్రేమా లేని మేను లో --- ముద్దు మీద ముద్దు ఇలా 

శృతే లేని  వీణ లో --- పాటే శృతిగా పాడాలి ఇలా 


నీమాటకు నా మాట సరిజోడు ఇలా 

పాలలో నీరులా కలసిపోదామా ఎలా 

కిరణాలతో వెలుగులా ఉండిపోదామా ఇలా 

చెరువులో పడవులా తిరుగుదామా ఎలా  

గాలిలో ఆకులా  ఎగురుదామా ఇలా 


*****


నేటి పాట  


ఆనందమది ఆహ - ఆధరము నీది 

ఆహ్లాదమది ఆహ అద్భుతం  

ఈవేళ మది ఓహొ - మౌనమ్ము నీది 

ఈవేళ మధురమ్ము అద్భుతం 


ఆనందమది ఆహ - ఆధరము నీది 


సామర్ధ్య మది నీది - సంతోషం ఆహ 

సౌందర్య మది నీది సంసారం 

కాలమ్ము మది నీది - కారుణ్యం ఆహ 

కావ్యమ్ము మధురమ్ము కామాక్షీ


ఆనందమది ఆహ - ఆధరము నీది 

 

సాహిత్య మది నీది - సద్భావం ఆహ 

సౌర్యమ్ము మది నీది సంగ్రామం 

దేహమ్ము ఇక నీది - దౌర్జ్ న్యం ఆహ 

దాహమ్ము ఇక నీది సంసారీ 


ఆనందమది ఆహ - ఆధరము నీది 


ప్రేమమ్ము ఇకచూపు - ప్రోత్సాహం ఆహ 

పోరంత ఇక చూపు ప్రోద్భలం 

స్నేహమ్ము మది నీలొ - సేద్యం మ్మె ఆహ    

ఆహ్లాద మది నీలొ  ఆనందం 


ఆనందమది ఆహ - ఆధరము నీది 

ఆనందమది ఆహ - ఆధరము నీది 


పాటకు ఆధారం 

ఇం/ఇం/ఇం/ సూ /ఇం - ఇం/ఇం/ఇం/సూ 

రచయిత మల్లాప్రగడ రామకృష్ణ 


నేటి పాట 


కాలమిది చల్లని కావలి వెచ్చనా 

కాలమిది చల్లని కావలి వెచ్చనా 

ఈ పనియే నాకు నూరేళ్లు పచ్చన 


ఈ మది చీకటి  అన్నది వెన్నెల 

నీ జత నేనుంటే నిలకడ ఉయ్యాల 


చల్లని గాలిలో కలసి కదులుదామా 

వెచ్చని ఊపులో కలసి మెదులుదామా 

వెన్నెల నీడలో కలసి చిందులేద్దామా 

చక్కని పాటగా కలసి ఊయలూగుదామా


ఈ మది చీకటి  అన్నది వెన్నెల 

నీ జత నేనుంటే నిలకడ ఉయ్యాల 


ఈ  అట వెన్నెలలో మెరిసే తారకులై 

ఈ లేత నవ్వులలో  విరిసే మల్లికలై 

ఈ పాట పల్లవిలో పిలుపే వేణువులై 

ఈ తోట  వరుసల్లో వలపే వెల్లువలై 


ఈ మది చీకటి  అన్నది వెన్నెల 

నీ జత నేనుంటే నిలకడ ఉయ్యాల 


ఈ నాటి తరగలలో గలగలలే నీ మువ్వలై  

ఈ నాటి గాలులలో గుసగుసలే నీ ఊపిరులై  

ఈ చీకటి వెలుగులలో కలయికలే ఉహలులై 

ఈ నాటి గిలింతలలో అల్లికలే మధురములై 


కాలమిది చల్లని కావలి వెచ్చనా 

కాలమిది చల్లని కావలి వెచ్చనా 

ఈ పనియే నాకు నూరేళ్లు పచ్చన 


పలికించెను రాగాలు నా మదిలో 

చిగురించెను అనురాగాలు ఈ వీధిలో 

తలపించెను స్సయ్యాట నా  కలల్లో 

మురిపించెను ముద్దాట ఈ ఆటలలో 


కాలమిది చల్లని కావలి వెచ్చనా 

కాలమిది చల్లని కావలి వెచ్చనా 

ఈ పనియే నాకు నూరేళ్లు పచ్చన 


ఈ మది చీకటి  అన్నది వెన్నెల 

నీ జత నేనుంటే నిలకడ ఉయ్యాల

****


No comments:

Post a Comment