Monday, 14 April 2025

ఏప్రియల్ రెండవ వారామ్.. వేంకటేశ్వరుని కీర్తనలు

 

ప్రాంజలి ప్రభ... కీర్తన.. ( 7 )...0  -04-2025
 మల్లాప్రగడ రామకృష్ణ 

జలజల జల జలతారలు కదలగా
మిలమిలమిలమెరియుశోభ మిరిమిట్లవ గా
గలగల గలగల సవ్వడి చేయగా
బిలబిల బిలమూలలందు వెంకన్న పూజలు తప్పెట్లతో
గోవిందా.. గోవిందా.. గోవిందా

" వేవేలు విధులందు వెఱపేది మఱపేది
మాయేలు విధియందు మలుపేది అలుపేది
మంచాది చెడులందు మనసేది మమతేది
సంచారి జపమందు స్థలమేది జతయేది... జ..

దైవము నమ్మినయట్టి ధన్యునికి
నమ్మక మార్గము పూజ భవ్యునికి
సమ్మతి కోరియు సేవ దివ్యునకి
శ్రీవేంకటేశ్వరుఁడు చిత్తములో నున్నఁవారు
యీవలేది యావలేది యితని దాసుల కి...".. జ

శ్రీ వేంకటేశ్వరా మనమున ప్రీతితో తలచిన
తొలుగు చింతలు బెదరు వదులు
బుద్ధి వృద్ధి కలుగు ఆయువు పెరుగు.. (2)
గోవిందా నన్న స్మరణే రక్ష సర్వ శుభములకున్.!

జలజల జల జలతారలు కదలగా
మిలమిలమిలమెరియుశోభ మిరిమిట్లవ గా
గలగల గలగల సవ్వడి చేయగా
బిలబిల బిలమూలలందు వెంకన్న పూజలు తప్పెట్లతో
గోవిందా.. గోవిందా.. గోవిందా
*****

ప్రాంజలి ప్రభ... కీర్తన.. (  8)...08-04-2025
 మల్లాప్రగడ రామకృష్ణ 

వేంకటేశ్వరునికి.. కీర్తన
రచన.. మల్లా ప్రగడ రామకృష్ణ

నిన్ను తలచిన వేళ నా మదికి పరవశమే మాయ శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరా..2
నీవు నా చెంత లేని వేళ మదికి శూన్యమే కదా మాయ శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరా.. 2

ఎవరేమన్నా ఆగదు పవనం 
 మంచి చెడులు తెలిపే కవలం 
 ఆశపాశాల మధ్య నలిగే కథనం
 రాగ భావాల మధ్య జీవిత గమనం 
 అన్నీ చూస్తూ సకలం మాయ, 
 గమనం మాయ, గమ్యం మాయ 
 ఆరాధన మాయ, ఆలంబన మాయ, అర్థం మాయ, అర్ధాoగి మాయ, చిత్రం మాయ, రూపం మాయ, ప్రేమ మాయ, ప్రాణం మాయ, లోకమే మాయ కదా శ్రీవశ్రీ శ్రీ వేంకటేశ్వరా....

నిన్ను తలచిన వేళ నా మదికి పరవశమే మాయ శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరా
నీవు నా చెంత లేని వేళ మదికి శూన్యమే కదా మాయ శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరా

నీతులు ఎక్కువ చేతలు తక్కువ 
రాతలన్ని విధాత రంగుల కళ మాయ
చెప్పుట సులభంబు జేయుట కష్టంబు 
తప్పులు ఒప్పులు తెల్పెడికళ మాయ
 నీతినియమములు నిలకడే కరువగు 
జాతి భీతి యగుట జాడ్యపుకళ మాయ
మంచియన్నది యేది మనసు మాయల తీరు 
సంచిత భావము సహన కళలు మాయ

ధర్మము చేసిన వారు దరిద్రులయ్యే  మాయ
 అధిక విద్యావంతులు అప్రయోజకులయ్యే మాయ 
పరమ లుబ్దులు ధన ప్రాపు లయ్యే మాయ
చితి చింత తప్పని లోకములో జీవనమే మాయ
జగద్గురువు కదా శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరా 
లోకరక్షకుడవు కదా శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరా

నిన్ను తలచిన వేళ నా మదికి పరవశమే మాయ శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరా
నీవు నా చెంత లేని వేళ మదికి శూన్యమే కదా మాయ శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరా

గోవిందా, గోవిందా, గోవిందా
*****
శ్రీరామనవమి సందర్భముగా కీర్తన..09..
మల్లాప్రగడ రామకృష్ణ 

మలినమైన నా మనసుని 
మల్లెపువ్వులా మార్చే శక్తి కేవలం
నీ నామస్మరణకు మాత్రమే ఉంది తండ్రి..శ్రీ రామ..శ్రీ రామ.. శ్రీ రామ 

హరేరామ.. హరేరామ.. రామరామ... హరేహరే 
హరేకృష్ణ.. హరేకృష్ణ.. కృష్ణ కృష్ణ.. హరే హరే 

ఎన్నో కన్నీళ్లు కార్చిన రోజులు 
ఎన్నో కష్టాలు కలిగిన క్షణాలు
ఎన్నో ఎన్నెన్నో కలతలు నన్ను వేధించిన
నేను ఎన్నడూ నిన్ను నిందించలేదు.. శ్రీరామ 
నీవు పెట్టే ఈ జీవిత పరీక్షల్లో
నన్నుగెలిపించినా ఓడించినా
నేను చింతించెను...శ్రీ రామ..
 నిన్ను మనసారా..కోరేది ఒకటే

నీ పాద సేవ మీ అభయా హస్తం నాకు 
దూరం చేయకు....శ్రీరామ 
నా మనసు అలజడి తొలగించి
మనశ్శాంతి ప్రసాదించు... శ్రీ రామ
ఒకనాడు నిన్ను దైవంగా కొలిచాను.. శ్రీ రామ 
మరోనాడు నిన్ను సర్వంగా భావించాను.. శ్రీ రామ 
నేడు నా తండ్రిలా నిలుపుకున్నాను...శ్రీ రామ 
నీ బంధం కన్నా గొప్ప బంధం ఏమున్నది...శ్రీ రామ 
 
నా హృదయంలో యున్నావు కదా శ్రీరామ 

ఆపద్బాంధవ అనాధ రక్షక...శ్రీరామ 
హనుమ ఆర్తనాదము విను...శ్రీరామ 
కలియుగవాసులు సకల శుభాలు కోరు...శ్రీరామ 
నిన్నే నమ్మియు ప్రార్ధనలు... శ్రీరామ 

శ్రీరామ.. శ్రీరామ.. శ్రీరామ 
హరేరామ.. హరేరామ.. రామరామ... హరేహరే 
హరేకృష్ణ.. హరేకృష్ణ.. కృష్ణ కృష్ణ.. హరే హరే
*****
శ్రీరామనవమి సందర్భంగా కీర్తన.. 10
మల్లాప్రగడ రామకృష్ణ 

ధర్మరక్షణ జేసె దశరథ రామ
ధర్మమ్ము నిలిపెను ధరణీ నాధ రామ 
తండ్రికిచ్చిన మాట తలదాల్చు తనయుడువు రామ 
రమ్యగుణ సాంద్రుడు రాజ్యవిభుడువు రామ 
తాటకిన్ వధియించి తపసి జన్నము గాచెను రామ 
సుగుణాభి రామ
శివుని విల్లు విరిచి సీతను పెండ్లాడెరామ 
జగదేక వీర జానకి రామ

రామా నిన్నే నమ్మితి 
యేమాయ మముగనుచేర యేతీరుగనో 
రామా మము కావు ములే
మేమానినుపూజనిత్య మీరక చేయున్ 

మానక మాపూజలగా
వానల మధ్యకమణీయ వరుసగుపూజల్
నైనా కళ్యాణముగన్
పానకపెసరపప్పుగాను పలు నైవేద్యమ్ 

అల్లడు గో శ్రీరాముడు 
చల్లగ రాజ్యమునుయేలు చా తుర్యముగన్ 
చల్లని చూపులతో కళ 
కల్లలు లేనివిధముగను గమ్యమ్మగుటన్

నీవే తల్లివి తండ్రివి 
నీవే గురుడవు మనమున నేరుగ రావా 
కావుము భక్తుల రామా 
సేవలు చేసెదము మేము శీఘ్రము రామా 

యేమని చెప్పెద రామా
మామది నీకుగనుపూజ మనసే నీదిన్
రాముని బంటుల మైతిమి
ప్రేమా సంతసముతోను ప్రీతిగ చేయున్

దివ్య సుందరమూర్తి ధీయుతరామ 
మనుజుని రూపుడై మహిలోన జన్మించిన రామ 
మహీ సహనశీలివి రామ 
ఒకమాట యొకపత్ని యొక్కటే బాణమ్మనే రామ 

కరకు బోయని గళమున తరలివచ్చె రామ 
శబరి యెంగిలి గంగలో స్నానమాడె రామ 
హనుమ యెదలోన బ్రవహించె యమృతమ్ము రామ 
రామ నామమె యిలలోన రమ్యమయ్యె 
రామ రామ సీతా రామ 
రామరామ జయ జయ రామ

 " రామో విగ్రహవాన్ ధర్మః "
   సాధుః సత్యపరాక్రమః
   రాజా సర్వస్య లోకస్య
   దేవానా మివ వాసవః౹౹

 మూర్తీభవించిన ధర్మమే శ్రీరాముడు
ఆయన పరమసాధువు. సత్యపరా
క్రముడు.సర్వలోకములకు ప్రభువు.
దేవతలకు ఇంద్రుని వంటివాడు.
*****
ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు 
 ప్రాంజలి ప్రభ మల్లాప్రగడ రామకృష్ణ 

నూట ఎనిమిది నామాలలో సంపూర్ణ రామాయణం.

1.శుద్ధబ్రహ్మ పరాత్పర రామ
2.కాలాత్మక పరమేశ్వర రామ
3.శేషతల్ప సుఖనిద్రిత రామ
4.బ్రహ్మద్యమర ప్రార్ధిత రామ
5.చందకిరణ కులమండన రామ
6.శ్రీమద్దశరధనందన రామ
7.కౌసల్యాసుఖవర్ధన రామ
8.విశ్వామిత్రప్రియధన రామ
9.ఘోరతాటకఘాతక రామ
10.మారీచాదినిపాతక రామ
11.కౌశిక మఖసంరక్షక రామ
12.శ్రీ మదహల్యో ద్దారక రామ
13.గౌతమమునిసంపూజిత రామ
14.సురమునివరగణసంస్తుత రామ
15.నవికధావితమృదుపద రామ
16.మిధిలాపురజనమోదక రామ
17.విదేహమానసరంజక రామ
18.త్రయంబకకార్ముకభంజక రామ
19.సితార్పితవరమాలిక రామ
20.కృతవైవాహిక కౌతుక రామ
21.భార్గవదర్పవినాశక రామ
22.శ్రీ మాధయోద్యా పాలక రామ
23.ఆగణితగుణగణభూషిత రామ
24.అవనితనయాకామిత రామ
25.రాకాచంద్రసమానన రామ
26.పితృవాక్యాశ్రితకానన రామ
27.ప్రియగుహావినివేధితపద రామ
28.తత్ క్షాళితనిజమృదుపద రామ
29.భరద్వాజముఖానందక రామ
౩౦.చిత్రకూటాద్రినికేతన రామ
31.దశరధసంతతచింతిత రామ
32.కైకేయీతనయార్థిత రామ
౩౩.విరచితనిజపాదుక రామ
34.భారతార్పిత నిజపాదుక రామ
35.దండకవనజనపావన రామ
36.దుష్టవిరాధవినాశాన రామ
37.శరభoగసుతీక్షార్చిత రామ
38.అగస్త్యానుగ్రహవర్ధిత రామ
39.గృద్రాధిపగతిదాయక రామ
40.పంచవటీతటసుస్థిత రామ
41.శూర్పణఖార్తి విధాయక రామ
42.ఖరదూషణముఖసూదక రామ
43.సీతాప్రియహరిణానుగ రామ
44.మరిచార్తికృదాశుగా రామ
45.వినష్ట సేతాన్వేషక రామ
46. గృధ్రాధిపగతిదాయక రామ
47.శబరిదత్తఫలాశన రామ
48.కబంధభాహుచ్చేధన రామ
49.హనుమత్సేవితనిజపద రామ
50.నతసుగ్రివభిష్టద రామ
51.గర్వితవాలివిమోచక రామ
52. వానరదుతప్రేషక రామ
53.హితకరలక్ష్మణసంయుత రామ
54.కపివరసంతతసంస్మృత రామ
55.తద్గతి విఘ్నద్వంసక రామ
56.సీతాప్రాణాదారక రామ
57.దుష్టదశాన ధూషిత రామ
58. శిష్టహనూమద్భూషిత రామ
59.సీతూధితకాకావన రామ
60.కృతచూడామణిదర్శన రామ
61. కపివరవహనశ్వాసిత రామ
62.రావణధనప్రస్థిత రామ
63.వనరసైన్యసమావృత రామ
64.శొశితసరిధీశార్థిత రామ
65.విభిషణాభయదాయక రామ
66. సర్వతసేతునిభందక రామ
67.కుంబకర్ణ శిరశ్చెదక రామ
68.రాక్షససంఘవిమర్ధక రామ
69.ఆహిమహిరావణ ధారణ రామ
70.సంహ్రృతదశముఖరావణ రామ
71.విభావముఖసురసంస్తుత రామ
72.ఖస్థితధశరధవీక్షిత రామ
73.సీతాదర్శనమోదిత రామ
74.అభిషిక్త విభీషణ రామ
75.పుష్పకయానారోహణ రామ
76.భరధ్వజాభినిషేవణ రామ
77.భరతప్రాణప్రియకర రామ
78.సాకేత పురీభుషన రామ
79.సకలస్వీయసమానత రామ
80.రత్నలసత్పీఠాస్థిత రామ
81.పట్టాభిషేకాలంకృత రామ
82.పార్థివకులసమ్మానిత రామ
83.విభీషణార్పితరంగక రామ
84.కీశకులానుగ్రహకర రామ
85.సకలజీవసంరక్షక రామ
86.సమస్తలోకోద్ధారక రామ
87.అగణితమునిగాణసంస్తుత రామ
88.విశ్రుత రాక్షసఖండన రామ
89.సితాలింగననిర్వృత రామ
90.నీతిసురక్షితజనపద రామ
91.విపినత్యాజితజనకజ రామ
92.కారితలవణాసురవధ రామ
93.స్వర్గతశంబుక సంస్తుత రామ
94.స్వతనయకుశలవనందిత రామ
95.అశ్వమేధక్రతుదీక్షిత రామ
96.కాలావేదితసురపద రామ
97.ఆయోధ్యజనముక్తిద రామ
98.విధిముఖవిభుదానందక రామ
99.తేజోమయనిజరూపక రామ
100.సంసృతిబన్ధవిమోచక రామ
101.ధర్మస్థాపనతత్పర రామ
102.భక్తిపరాయణముక్తిద రామ
103.సర్వచరాచరపాలక రామ
104.సర్వభవామయవారక రామ
105.వైకుంఠలయసంస్ఠీత రామ
106.నిత్యనందపదస్ఠిత రామ
107.కరుణా నిధి జయ సీతా రామ
108.రామరామ జయరాజా రామ .
*****
శ్రీ వేంకటేశ్వర కీర్తన..11
మల్లాప్రగడ రామకృష్ణ 

నమోకేశవ, నమోనారాయణ, నమోమాధవ,
నమోగోవింద, నమోవిష్ణు, నమోమధుసూధన,
నమోత్రివిక్రమ, నమోవామన, నమోశ్రీధర,
    
నమోహృషేకేశ, నమోపద్మనాభ, నమోదామోదర, 
నమోసంకర్షణ, నమోవాసుదేవ, నమో ప్రద్యుమ్న, నమోయనిరుర్ధ, నమోపురుషోత్తమ, నమోయధోక్షజ,

నమోనారసింహ, నమోఅచ్చుత, నమోజనార్ధన,
నమోఉపేంద్ర , నమోశ్రీకృష్ణ , నమోశ్రీహరి,
నమోవెంకటేశ, నమో శ్రీనివాస, నమోసర్వదేవ,   

నమో అగ్రత, నమో అఖండ, నమో అరుణోదయ,
నమో అమోఘ, నమో అద్భుత, నమో అభిరూప,
 నమోఅమృత,నమోఅభీష్ట, నమో అమ్బుజనాధ,  

నమో అభిమాన, నమో అభ్యు దయ,నమో అష్టోత్తరకర్త,
 నమో అభిజ్ఞాన, నమో అలంకార , నమో అభివాదభర్త,
 నమో అమిత,నమో అమూల్య, నమో అరవిన్దభర్త,      
  
నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ. ఎన్నిసార్లు పలికినా 
నమోనమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ. ఎన్నిసార్లు దర్శించినా 
నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ. ఎన్నిసార్లు మొక్కులిచ్చినా                            
నమోనమోశ్రీ తిరుమలతిరుపతి వేంకటేశ. ఎన్నిసార్లు చేయుభజనైనా 
నమోనమోశ్రీ తిరుమలతిరుపతి వేంకటేశ. నమోనమః అని ప్రార్ధనే

No comments:

Post a Comment