Thursday, 17 April 2025

ఏప్రియల్ మూడవ వారామ్.. వేంకటేశ్వరుని కీర్తనలు





ప్రాంజలి ప్రభ.. కొత్త పాట..ఆశ...886

మల్లా ప్రగడ రామకృష్ణ


ఆశే నిన్ను మార్చు 

 అర్థము చుట్టు చేర్చు 

ఆశే అంగాంగ మార్పు 

అనర్ధము చుట్టు కూర్పు 


ఆశ మనస్సునే మార్చు 

ఆశయాన్నే యే మార్చు 

అత్యాశ అంతానికి మార్పు 

కళంకితగా చుట్టు కూర్పు 


పేరాశ జాడ్యము గా మార్చు 

చిత్తము శాంతిలేక మార్చు

పరిపకారం కొరకు ఆశపడుట మార్పు 

నీ వంతు సేవ ఆరాట పడుట మార్పు 


ఆతురపడు తల్లి తండ్రి సేవలు మార్చు

ఉత్సాహపడు దేవుని పూజలు మార్చు

ఆశపడు ఋణము తీర్చ మార్పు

ఆశపడు దేవుడ్ని కొలిచేందుకు నిన్ను మార్చు 


ఆశాపాశము సర్వ హృదయము చేర్చు 

ఆశాపాశము సత్య ధర్మ వాక్కు చేర్చు 

ఆశాపాశము సత్కర్మల జీవితమ్ చేర్చు 

ఆశాపాశము దైవనిర్ణయము బట్టే మార్చు 


ఆశే నిన్ను మార్చు 

 అర్థము చుట్టు చేర్చు 

ఆశే అంగాంగ మార్పు 

అనర్ధము చుట్టు కూర్పు 


సర్వే జనా సుఖినో భవంతు

*****

ప్రాంజలి ప్రభ . తత్త్వము...887

 మల్లాప్రగడ రామకృష్ణ


లోకమెల్ల వసంతవేళ సురూపశోభలమీరగా

చాకచక్య పసందుతీర విరాజ రాజిత తీరుగా 

రాకపోకలు పంతమేళను నీకుగావిధి యేలగా 

ఆకువక్కలు సున్నమే కలిపా సుఖమ్ముకు మేలుగా 


చీకటుల్ తన జీవితమ్మున చిమ్మిరేగిన వేళలో 

చాకిరిన్ సహణమ్ముగా మమ జాతరే గుణ మేళలో 

వాకిటన్ మనసంతజూపుత వల్ల మాలిన గాలిలో 

సాకుగన్ విధివాక్కుగా సమ సౌఖ్యమేమది మాయలే 


శోకతప్తహృదంతరంగపుక్షోభతోడ కవీశ పుం

స్కోకి లొక్కటి కావుకావని గొంతువిప్పె నుగాదికిన్. 

ఏక విద్దెల సంతసమ్మగు యేల నిర్ణయ మేమదిన్ 

మేక మనస్సు కాంతులేయగు మేలు చేయుట కాలమున్ 


వాకిటంతను తీర్పు కాంతుల వాక్కు లిప్పె నుయాదిగన్ 

సాకులన్నియు లేని వింతల సాధనమ్ము గమూలమున్ 

దూకుడొక్కటి కాక భ్రాoతి సుదూరమేయగు కాలమున్ 

కోకిలొక్కటి కావుకావని గొంతు విప్పె నుగాదికిన్"

*****

కీర్తన.... 888

వాక్కు కర్మ మహాత్ముని కాలరీతి 

వాక్కు మనసఖ్యతను బట్టి వాదనమ్ము 

వాక్కు మరొక విధానము వాన మల్లె 

వాక్కు జీవిత మలుపుకు వర్షమౌను


ఎవరో వత్తురనేమనస్సు కదలన్ యెన్నేళ్లు సేవాభవన్ 

భవతత్త్వంబగు జన్మ భూమి కతనన్ భాగ్యమ్ము ధర్మంబుగన్ 

నవలోకంబును సృష్టి చేయ కలపన్ నాణ్యత్వ లక్ష్యంబుగన్ 

అవనీస్వేచ్ఛను తెల్పకర్తయతడున్ ఆశ్చర్య నాంధ్రుడహో


 * ఎవరో వత్తురనేమనస్సు కదలన్ యెన్నేళ్లు సేవాభవన్: ఎవరో వస్తారని ఎదురు చూస్తూ, మనస్సు కదలక ఎన్ని సంవత్సరాలు ఈ సేవాభవనంలో గడిచాయో! ఇక్కడ 'సేవాభవన్' అనేది బహుశా కవి తన జీవితాన్ని లేదా తన ఆశయాలను ఉద్దేశించి ఉండవచ్చు. ఏదో గొప్ప మార్పు వస్తుందని నిరీక్షిస్తూ కాలం గడిచిపోయిందని కవి ఆవేదన చెందుతున్నారు


 * భవతత్త్వంబగు జన్మ భూమి కతనన్ భాగ్యమ్ము ధర్మంబుగన్: జీవిత సత్యమైన ఈ జన్మభూమి కారణంగా, నాకు కలిగిన భాగ్యం ధర్మబద్ధమైనది. తన జన్మభూమి పట్ల కవికి ఉన్న గౌరవం, దాని ద్వారా పొందినది ఏదైనా ధర్మంతో కూడుకున్నదని ఆయన భావిస్తున్నారు.


 * నవలోకంబును సృష్టి చేయ కలపన్ నాణ్యత్వ లక్ష్యంబుగన్: ఒక నూతన ప్రపంచాన్ని సృష్టించడానికి, నాణ్యమైన లక్ష్యంతో అందరినీ కలపాలని ఉంది. సమాజంలో మంచి మార్పు తీసుకురావాలని, ఉన్నతమైన ఆశయాలతో అందరూ కలిసి పనిచేయాలని కవి ఆకాంక్షిస్తున్నారు.


 * అవనీస్వేచ్ఛను తెల్పకార్తయతడున్ ఆశ్చర్య నాంధ్రుడహో: భూమిపై స్వేచ్ఛ యొక్క విలువను తెలియజేయడానికి ఆరాటపడే ఆ ఆంధ్రుడు ఆశ్చర్యకరుడు కదా! ఇక్కడ కవి తనను తాను లేదా స్వేచ్ఛ కోసం తపించే ఏదైనా గొప్ప వ్యక్తిని గురించి చెబుతున్నారు. స్వేచ్ఛ యొక్క ప్రాముఖ్యతను చాటడానికి తపించే ఆ వ్యక్తిని చూసి కవి ఆశ్చర్యపోతున్నారు.


మొత్తంగా ఈ పద్యం నిరీక్షణ, జన్మభూమి పట్ల గౌరవం, నూతన సమాజ నిర్మాణ కాంక్ష మరియు స్వేచ్ఛ యొక్క ఆవశ్యకతను తెలియజేస్తుంది.

****

*******

ప్రాంజలి ప్రభ.. కీర్తన...899

మల్లాప్రగడ రామకృష్ణ 


అయ్యా అయ్యా వెంకయ్యా మమ్ము...ఆదు కోవయ్యా 

మొయ్యా మొయ్యా భూమయ్యా.. యేలు కోవయ్యా 

అయ్యా అయ్యా వెంకయ్యా మమ్ము..ఆదు కోవయ్యా 

మొయ్యా మొయ్యా భూమయ్యా.. యేలు కోవయ్యా 


నిను సేవింతు మయ్యా చింత తీర్చుము

మము పాలించు మయ్యా మాయ మార్చుము 

వినుమా మాట లయ్యా విద్య చేర్చుము 

కనుమా మా స్థితయ్యా కాల మందున 


ప్రణయమ్మున్ గనయ్యా పాఠ్యమేవిధి 

తృణమేమా కళయ్యా పూజ్యమేవిధి 

గుణమే మా పనయ్యా గుప్తమేవిధి 

క్షణమే మా గతయ్యా కాలమే విధి 


సాధు జనపరి రక్షక సత్య పాల 

ఆదు కోవయ్య ఆత్మగా ఆది పురుష 

నాదు జన్మయు నీదయ సాధు శీల

వాదు లాటలు కాదయ్య వాక్కు తీర్చు 


చెడు పలుకుల గ్రహము చేటు తలపు 

చెడు పలుకుల చెలిమి చెడును భువిని 

చెడు సతి పతి యన చెరచు బలము 

చెడు నటనల విలువ చేటు మలుపు 


లోకమందున వైపరీత్యము లోభమే మార్చు వయ్యా 

చీకటింటన గాలి కాంతులు శీఘ్రమే చేర్చు మయ్యా 

శోకముల్ దలగించి సత్క్రప జూపుటే మేలు నయ్యా 

లోకమందున మానవాళికి రోదనం బాప వయ్యా 


అయ్యా అయ్యా వెంకయ్యా మమ్ము... ఆదు కోవయ్యా 

మొయ్యా మొయ్యా భూమయ్యా..యేలు కోవయ్యా 

అయ్యా అయ్యా వెంకయ్యా మమ్ము..ఆదు కోవయ్యా 

మొయ్యా మొయ్యా భూమయ్యా.. యేలు కోవయ్యా

***


ప్రాంజలి ప్రభ.. కొత్త పాట....990

రచన.. మల్లాప్రగడ రామకృష్ణ


ఎవరివో నీవేవరివో 

నన్ను చేరి ముద్దుచేయ వచ్చితివా 

నామనసుదోచి నన్ను మార్చ దళచితివా 

ఎవరివో నీవెవరివో 


శృంగార వనాన విరిసిన ముద్ద మందార కుసుమానివో

దివిసీమ వీడి నేలకు దిగిన అప్సర సుందరి తిలోత్తమవో

కన్నె కలువల తటిలో విహరించే

రతి శాస్త్రము నేర్చిన రాజహంసవో

ప్రేమ విరులతో ముద్దు మచ్చట్లాడు చిలిపి సుకుమార పూలతవో........ ఎవరివో


జిలిబిలి మెరపుల వగలొలుకు 

శశాంకుని ప్రియ నెచ్చెలి తారవో

తాపసుల చిత్తమునైనా చిత్తు చేయు మన్మథుని ప్రణయ శరానివో 

సరస సామ్రాజ్యాన్ని సొగసుతో శాసించే కవిరాజు శ్రీనాథుని కావ్య కాంతవో

వలపు రాణివో.. కులుకుల హరిణివో అందాల భరిణివో రమణీ ఎవరివో...


శృతిలయలు కలగలపి మనసును ఉడికించెదవో

సరిగమలు తెలిపి నవరసాలు త్రాగించడవో

కరుణ కనికర వలపులతో హృదయాన్ని మర్ధించెదవో

శృంగార డోలికలో ఊగించి లాలించి పాలించెదవో


ఎవరివో నీవేవరివో 

నన్ను చేరి ముద్దుచేయ వచ్చితివా 

నామనసుదోచి నన్ను మార్చ దళచితివా 

ఎవరివో నీవెవరివో 

**--


ఏది నిజమ్ము కాల మని యెవ్వరు చెప్ప మనస్సు యే దియున్ 

ఏది భయమ్ము తేని నిధి యేమని చెప్ప యశస్సు యే దియున్ 

ఏది సుఖమ్ము లేని మది యెల్లలు లేని యుషస్సు యే దియున్ 

ఏది వినోద దుఃఖమగు యెంచ గలేస్థితి చెప్ప జీవిగన్

******

ప్రాంజలి ప్రభ.. కీర్తన...991

మల్లాప్రగడ రామకృష్ణ 


మనసాయాలోచనలే 

మనసా వాచా కళలగు మంత్రపు తీరుణ్ 

మనసా మమతల్ శుభముల్ 

మనసైన త్రికరణ శుద్ధి మానస రామా!


జ్ఞాన సమర్ధత వలెనే 

మాన సమాన గుణమగుట మాయలె తొలగున్ 

మానస మంత్రము మౌనము 

ధ్యాన పరంపర సుఖమగు దారిగ రామా!


దీనుల దైవము నౌచును

దీనత్వముఁ దీయనెంచి దీనారములన్

దీనానుకంపనత వివిధ

కానుక లెన్నియొ నొసఁగిన ఘనుఁడవు రామా!


గానము చేసెద నిత్యము 

ప్రాణము నిచ్చెద నిరతము ప్రాభవ భక్తిన్ 

ఋణమును తీర్చెద సకలము 

ప్రణయపు భావ భవమగుట ప్రధమము రామా!


దీనపు తలపులు తాలును 

దీనత లోలోన యేడ్చె దివ్యపు కళలున్ 

దీనపు తగువులు దూరగ

దీనత సేవలు సహజము దీక్షలు రామా!


*****

నేటి కీర్తన....992


అదే నేను.. అదే నీవు..

ఎందుకు మన మధ్య ఆలోచన 

అదే దేహం.. అదే దాహం 

ఎందుకు మన మధ్య తాపత్రయం 

అదే మోహమ్.. అదే శోకమ్ 

ఎందుకు మనమధ్య. ఉన్మాదం 


అదే నాజన్మభూమి రక్ష  అదే నా మాతృ భాష దీక్ష 

మన మధ్య లేనిది కక్ష ఎవ్వరూ వెయ్యలేరు శిక్ష 


నా తల్లి నేర్పిన ఓర్పు నాతండ్రి నేర్పిన నేర్పు 

నా బిడ్డలు నేర్పిన మార్పు నా భార్య నా కిచ్చే తీర్పు 


ఎంతో ఇష్టం వసంత కాలం హృదయాన్ని దహించు కాలం 

కోరేది నిత్య సంతోష కాలం చాలు ప్రకృతి నేర్పే సత్య కాలం 


మనం వీడాలి మౌనం చెయ్యాలి దానం ఉండాలి ధైర్యం 

మనo మానవభ్యుదయానికి నిరంతరం చెయ్యాలి యుద్ధం 


దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ ప్రేరణ విద్యా బోధన 

సత్సంఘ సమ్మోహనం సమయ సద్భుద్ది తర్పణం 


అదే నేను.. అదే నీవు..

ఎందుకు మన మధ్య ఆలోచన 

అదే దేహం.. అదే దాహం 

ఎందుకు మన మధ్య తాపత్రయం 

అదే మోహమ్.. అదే శోకమ్ 

ఎందుకు మనమధ్య. ఉన్మాదం

****-

నేటి మందారం **  993


నరుని నేడు నడిపించే ఇంధనమై ధనమ్ముయే

జగము నేడు ప్రధానమై శాశించును ధనమ్ముయే


ఆడిస్తుంది ఏడ్పిస్తు నవ్విస్తూ ఆయుధమౌను

మనిషిని నేడు లోకాన్ని జడిపిస్తూ ధనమ్ముయే


 నేడు అవసరమై అనుబంధాలకు ఆయుధమౌను

 అహంకార మమకార మే కలిగించ ధనమ్ముయే


అధిక ప్రయోజనమ్మే దూర మవ్వ ఆయుధమౌను

కామ క్రోధ మదమునూపెంచు ఆశధనమ్ముయే 


మనశ్శాంతి హరించు లాభనష్టము ఆయుధమౌను

మంచీ చెడు కనలేని బ్రతుకు తీరే  ధనమ్ముయే


ఊపిరాగి పోవునాడు వెంటరాని ధనమ్ముయే

లెక్కకుమించియున్నా ఏమి ఫలమ్ము ధనమ్ముయే


*****

ప్రాంజలి ప్రభ (994) కీర్తన


ఏమయ్యా వెంకయ్యా నీ లీలా మానుష వేషాలను మేము తట్టుకోలేమయ్యా 

మమ్ములను ఎప్పుడు యుద్ధరించు తావయ్యా.. వెంకయ్యా.. వేంకటేశా..


నీవస్సలు పుడమిరేఖగా నున్నా వా!  లేక బలిదానను గావు కేకవయ్యా వా

కదలవు మెదలవు కాని కాలుమోపిన దూర్తులను కబళించ లేకున్నావా.. వెంకయ్యా


కనికరము లేని కసాయిలపై చూపిస్తావేందుకయ్యా.. వెంకయ్యా


పొలిమేరన కళ్ళు పహారా కాస్తుంటే

దేశమంతా నిద్రలో జోగుతుంటే

రక్కసమూకలు రాజ్యమేలు తుంటే

నిశి రాతిరి నిశబ్ధంలో మనుష్యుల

ఆర్తనాదాలు తూటాల ప్రతిధ్వనులు వినలేదయ్యా... వెంకయ్య.. వేంకటేశా


క్షణం క్షణం గుండెకోతలు పెరిగాయి

తెల్లారే సరికే తెల్లారి పోయెను ఏ అమ్మో కన్న ప్రాణా లో వెంకయ్యా

నామాటలు అర్ధం చేసుకోవేమయ్యా


*ప్రేమ పాశము యెరుగని ఓ...పాషాణ హృదయమా నీది

మానవత్వంతో కన్నీటిని మార్చ వా

బంధాలు విడదీసే బంధిఖాన వైనావా

కళ్ళప్పగించి చూస్తున్నావా వెంకయ్యా


ఏమయ్యా వెంకయ్యా నీ లీలా మానుష వేషాలను మేము తట్టు కోలేమయ్యా 

మమ్ములను ఎప్పుడు యుద్ధరించు తావయ్యా వెంకయ్యా.. వేంకటేశా..

 

నమో నమో వేంకటేశాయ నమో నమః

   నమో నమో వేంకటేశాయ నమో నమః

***--


ప్రాంజలి ప్రభ.. (995) కీర్తన 

రచన.. మల్లాప్రగడ రామకృష్ణ 


తప్పొప్పులు తెల్వని వాడ్ని 

ముప్పుయున్న ధైర్యంతో నున్న వాడ్ని 

చెప్పుడు మాటలు పట్టని వాడ్ని 

అప్పు తో జీవితం సాగుతుంది శ్రీ వేంకటేశా 


తప్పు ఒప్పుకుంటే ఎంత తృప్తియో 

క్షమాపణ చెబితే ఎంత సంతృప్తియో 

అబద్ధమాడకుంటే ఎంత ఆహ్లాదంమో 

నిజం మాట్లాడితే ఎంత నిమ్మళంగా ఉంటుందో వేంకటేశా 

అంతా నీదయా కృపా వేంకటేశా 


సహాయం చేస్తే ఎంత  సంతోషమో 

ఆసరాగా ఉంటే ఎంత ఆనందంమో 

నిజాయితీగా ఉంటే ఎంత ప్రశాంతమో 

న్యాయానికి నిలబడితే ఎంత హాయిగా ఉంటుందో వేంకటేశా 

అంతా నీదయా కృపా వేంకటేశా 


భరోసాగా ఉంటే ఎంత న్యాయంగానో 

ధర్మానికి దన్నుగా ఉంటే ఎంత ధైర్యంగానో 

కాల నిర్ణయము నీదే లే 

నిన్ను నమ్మినవాడ్ని నేనేలే 


తప్పొప్పులు తెల్వని వాడ్ని 

ముప్పుయున్న ధైర్యంతో నున్న వాడ్ని 

చెప్పుడు మాటలు పట్టని వాడ్ని 

అప్పు తో జీవితం సాగుతుంది శ్రీ వేంకటేశా 

*****


ప్రాంజలి ప్రభ.. (996) కీర్తన 


కొడకంచి అమ్మోరులు హేల 

వెంకన్న హృదయాన్ని దోచులీల

అయ్యారే ఇర్వురితో ఆనంద హేల 

చూపుల్లు తిప్పలేని అద్భుత కళ


పాలన చేయగ తృప్తియు 

వీలుగ సేవల మనస్సు వేల్పుల తీరుణ్ 

మేలుగ ధర్మ సుఖమ్మగు 

పాలుగ హృదయాంతరాలు పాశపు కళల్


రాత్రిన్ చందురుడౌను రవ్వ వెలుగుల్ 

రమ్యమ్ము చేకూర్చగన్ 

ధాత్రిన్ చల్లగజేయకరుణన్ ధాత్రుత్వ సంభావ్యమున్ 

మైత్రిన్ చేయట ప్రేమ జూపగలగన్ కైవల్య దాహమ్ముగన్ 

రాత్రిన్ పూర్ణిమ పుణ్యమూర్తి యగుటన్ రాజ్యమ్ము యేలేందుకున్


మనసేనీస్మరణమ్ముగా కదలగన్ మాయల్  తొల్గించుమా 

తనువేనీజపమే నిరంతరముగన్ తన్మాయ తొల్గించుమా 

అనువైవిద్యల యీశ్వరీ ననుటయున్ యాకర్ష నీదేసుమా 

పనులేసర్వము నీదయాకృపయగున్ పాశమ్ము గోవిందవై 


కొడకంచి అమ్మోరులు హేల 

వెంకన్న హృదయాన్ని దోచులీల

అయ్యారే ఇర్వురితో ఆనంద హేల 

చూపుల్లు తిప్పలేని అద్భుత కళ

*---*-

ప్రాంజలి ప్రభ.. (997) కీర్తన


ఎక్కడైనా...ఎందైనా.. ఏమైనా ఎంతైనా.. చెప్పవేమయ్యా.. .. శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరాయనమః


 చెప్ప లేవా...నొప్ప లేవా.. ఒప్ప లేవా...మెప్పు కోవా. చెప్పవేమయ్యా.. .. శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరాయనమః


యీ లోకమే...యీ రూపమే... యీ  మానమే....యీ మౌనమే.. శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరాయనమః


యీ కాలమే...యీ దీపమే.. యీ మాయయే....యీ మార్గమే.. శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరాయనమః


శ్రమపడక వచ్చు నా...

ఫలితంబు ఎక్కడైనా ?

పనిలేని సోంబేరికైనా...

మర్యాదుండునే ఎందైనా?.. శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరాయనమః


తృప్తిలేని జీవితమ్మున...

సంతసమున్నదా ఎక్కడైనా? 

ప్రశాంతతకు మించిన 

స్వర్గము కలదా ఎందైనా ? .. శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరాయనమః


అమ్మలేక పుట్టుక నుండున 

మనిషికి ఎక్కడైనా? 

కన్నవారిని నొప్పిపెట్టిన 

సద్గతుండునే ఎందైనా? .. శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరాయనమః


సంస్కారము లేని చదువులోన

ఆదరణుందా ఎక్కడైనా? 

వ్యక్తిత్వమునకు మించిన

ఉన్నత విద్యలు ఎందైనా?.. శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరాయనమః


ఎక్కడైనా ఎందైనా.. ఏమైనా ఎంతైనా.. చెప్పవేమయ్యా.. శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరాయనమః


 చెప్ప లేవా నొప్ప లేవా.. ఒప్ప లేవా మెప్పు కోవా. చెప్పవేమయ్యా.. .. శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరాయనమః


యీ లోకమే యీ రూపమే... యీ  మానమే యీ మౌనమే.... శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరాయనమః

యీ కాలమే యీ దీపమే.. యీ మాయయే యీ మార్గమే.... శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరాయనమః

**-*


ప్రాంజలి ప్రభ.. (998) కీర్తన 


ఓదేవా ఓదేవా నన్ను నన్నుగా జూడలేవా 

ఓ మాయా ఓమాయా నన్ను నన్నుగా వీడి వెళ్ళ లేవా 


తప్పు నేనెరుగక చేయ తప్పలేదు 

అప్పు జీవితానన చొప్ప యప్పు కాదు 

నొప్పుల కళలు సరిజేయ రొప్పు కాదు 

చెప్పు నాతప్పు లన్నియు చిత్త మందు.....ఓ దేవా 


పరిమళమ్ములు విరజిమ్ము పలుకు తీరు 

కరుణ ప్రకృతి కాల నిర్ణయ కామ్య తీరు 

పరిధి మదితలపులు తెలుప గల తీరు 

తరువు లాగజీవము నాది తత్వ తీరు.....ఓ దేవా 


రిపుల వదిలించుకొనుటకు ప్రియము యేల

వారి నెల్ల స్నేహితులుగా పలకరించ

మంచి చేసుకొనుటకన్న మంచి తీరు 

వేరొకటి లేదు.. వినుమయ్య విపుల దేవా 


ఓదేవా ఓదేవా నన్ను నన్నుగా జూడలేవా 

ఓ మాయా ఓమాయా నన్ను నన్నుగా వీడి వెళ్ళ లేవా 

****


ప్రాంజలి ప్రభ.. (999) కీర్తన 

రచన.. మల్లాప్రగడ రామకృష్ణ 


నిత్య పూజలివిగో నేరిచిన నోహో

ప్రత్యక్షమైనట్టి పరమాత్మా 

శ్రీ శ్రీ శ్రీ వేంకటేశాయ నమః 

శ్రీదేవి భూదేవి సహిత 

శ్రీ శ్రీ శ్రీ వేంకటేశాయ నమః 

||నిత్య పూజలివిగో||


సత్యమార్గమును సామాన్యముయె నోహో 

సత్య వాక్కుగను సంఘమ్ముయిది నోహో 


పలుకే సహజము పెదవే పిలుపు యట 

తనువు తపమే సరి చేయునట 

కనుగొను చూపులే ఘన దీపములట 

తనలోపలి అంతర్యామి  

శ్రీ శ్రీ శ్రీ వేంకటేశాయ నమః 

శ్రీదేవి భూదేవి సహిత 

శ్రీ శ్రీ శ్రీ వేంకటేశాయ నమః 


||నిత్య పూజలివిగో||


చిలికే వెన్నయట చిత్రము మూలమై

 కనికరమగు విడి యాట యట 

సులువైన భజనే నీకర్పణ గను 

తలపు లోపల నున్న దైవము  

శ్రీ శ్రీ శ్రీ వేంకటేశాయ నమః 

శ్రీదేవి భూదేవి సహిత 

శ్రీ శ్రీ శ్రీ వేంకటేశాయ నమః 


||నిత్య పూజలివిగో||


మనసు చేష్టలే మంత్ర మయ్యె గతియట 

స్థితిగల జీవుడే దాసుడట

అమరిన మార్పులే కాల నిర్ణయములు 

క్రమముతో  శ్రీ శ్రీ శ్రీ వేంకటేశాయ నమః 

శ్రీదేవి భూదేవి సహిత 

శ్రీ శ్రీ శ్రీ వేంకటేశాయ నమః 

||నిత్య పూజలివిగో||


Monday, 14 April 2025

ఏప్రియల్ రెండవ వారామ్.. వేంకటేశ్వరుని కీర్తనలు

 

ప్రాంజలి ప్రభ... కీర్తన.. ( 7 )...0  -04-2025
 మల్లాప్రగడ రామకృష్ణ 

జలజల జల జలతారలు కదలగా
మిలమిలమిలమెరియుశోభ మిరిమిట్లవ గా
గలగల గలగల సవ్వడి చేయగా
బిలబిల బిలమూలలందు వెంకన్న పూజలు తప్పెట్లతో
గోవిందా.. గోవిందా.. గోవిందా

" వేవేలు విధులందు వెఱపేది మఱపేది
మాయేలు విధియందు మలుపేది అలుపేది
మంచాది చెడులందు మనసేది మమతేది
సంచారి జపమందు స్థలమేది జతయేది... జ..

దైవము నమ్మినయట్టి ధన్యునికి
నమ్మక మార్గము పూజ భవ్యునికి
సమ్మతి కోరియు సేవ దివ్యునకి
శ్రీవేంకటేశ్వరుఁడు చిత్తములో నున్నఁవారు
యీవలేది యావలేది యితని దాసుల కి...".. జ

శ్రీ వేంకటేశ్వరా మనమున ప్రీతితో తలచిన
తొలుగు చింతలు బెదరు వదులు
బుద్ధి వృద్ధి కలుగు ఆయువు పెరుగు.. (2)
గోవిందా నన్న స్మరణే రక్ష సర్వ శుభములకున్.!

జలజల జల జలతారలు కదలగా
మిలమిలమిలమెరియుశోభ మిరిమిట్లవ గా
గలగల గలగల సవ్వడి చేయగా
బిలబిల బిలమూలలందు వెంకన్న పూజలు తప్పెట్లతో
గోవిందా.. గోవిందా.. గోవిందా
*****

ప్రాంజలి ప్రభ... కీర్తన.. (  8)...08-04-2025
 మల్లాప్రగడ రామకృష్ణ 

వేంకటేశ్వరునికి.. కీర్తన
రచన.. మల్లా ప్రగడ రామకృష్ణ

నిన్ను తలచిన వేళ నా మదికి పరవశమే మాయ శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరా..2
నీవు నా చెంత లేని వేళ మదికి శూన్యమే కదా మాయ శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరా.. 2

ఎవరేమన్నా ఆగదు పవనం 
 మంచి చెడులు తెలిపే కవలం 
 ఆశపాశాల మధ్య నలిగే కథనం
 రాగ భావాల మధ్య జీవిత గమనం 
 అన్నీ చూస్తూ సకలం మాయ, 
 గమనం మాయ, గమ్యం మాయ 
 ఆరాధన మాయ, ఆలంబన మాయ, అర్థం మాయ, అర్ధాoగి మాయ, చిత్రం మాయ, రూపం మాయ, ప్రేమ మాయ, ప్రాణం మాయ, లోకమే మాయ కదా శ్రీవశ్రీ శ్రీ వేంకటేశ్వరా....

నిన్ను తలచిన వేళ నా మదికి పరవశమే మాయ శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరా
నీవు నా చెంత లేని వేళ మదికి శూన్యమే కదా మాయ శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరా

నీతులు ఎక్కువ చేతలు తక్కువ 
రాతలన్ని విధాత రంగుల కళ మాయ
చెప్పుట సులభంబు జేయుట కష్టంబు 
తప్పులు ఒప్పులు తెల్పెడికళ మాయ
 నీతినియమములు నిలకడే కరువగు 
జాతి భీతి యగుట జాడ్యపుకళ మాయ
మంచియన్నది యేది మనసు మాయల తీరు 
సంచిత భావము సహన కళలు మాయ

ధర్మము చేసిన వారు దరిద్రులయ్యే  మాయ
 అధిక విద్యావంతులు అప్రయోజకులయ్యే మాయ 
పరమ లుబ్దులు ధన ప్రాపు లయ్యే మాయ
చితి చింత తప్పని లోకములో జీవనమే మాయ
జగద్గురువు కదా శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరా 
లోకరక్షకుడవు కదా శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరా

నిన్ను తలచిన వేళ నా మదికి పరవశమే మాయ శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరా
నీవు నా చెంత లేని వేళ మదికి శూన్యమే కదా మాయ శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరా

గోవిందా, గోవిందా, గోవిందా
*****
శ్రీరామనవమి సందర్భముగా కీర్తన..09..
మల్లాప్రగడ రామకృష్ణ 

మలినమైన నా మనసుని 
మల్లెపువ్వులా మార్చే శక్తి కేవలం
నీ నామస్మరణకు మాత్రమే ఉంది తండ్రి..శ్రీ రామ..శ్రీ రామ.. శ్రీ రామ 

హరేరామ.. హరేరామ.. రామరామ... హరేహరే 
హరేకృష్ణ.. హరేకృష్ణ.. కృష్ణ కృష్ణ.. హరే హరే 

ఎన్నో కన్నీళ్లు కార్చిన రోజులు 
ఎన్నో కష్టాలు కలిగిన క్షణాలు
ఎన్నో ఎన్నెన్నో కలతలు నన్ను వేధించిన
నేను ఎన్నడూ నిన్ను నిందించలేదు.. శ్రీరామ 
నీవు పెట్టే ఈ జీవిత పరీక్షల్లో
నన్నుగెలిపించినా ఓడించినా
నేను చింతించెను...శ్రీ రామ..
 నిన్ను మనసారా..కోరేది ఒకటే

నీ పాద సేవ మీ అభయా హస్తం నాకు 
దూరం చేయకు....శ్రీరామ 
నా మనసు అలజడి తొలగించి
మనశ్శాంతి ప్రసాదించు... శ్రీ రామ
ఒకనాడు నిన్ను దైవంగా కొలిచాను.. శ్రీ రామ 
మరోనాడు నిన్ను సర్వంగా భావించాను.. శ్రీ రామ 
నేడు నా తండ్రిలా నిలుపుకున్నాను...శ్రీ రామ 
నీ బంధం కన్నా గొప్ప బంధం ఏమున్నది...శ్రీ రామ 
 
నా హృదయంలో యున్నావు కదా శ్రీరామ 

ఆపద్బాంధవ అనాధ రక్షక...శ్రీరామ 
హనుమ ఆర్తనాదము విను...శ్రీరామ 
కలియుగవాసులు సకల శుభాలు కోరు...శ్రీరామ 
నిన్నే నమ్మియు ప్రార్ధనలు... శ్రీరామ 

శ్రీరామ.. శ్రీరామ.. శ్రీరామ 
హరేరామ.. హరేరామ.. రామరామ... హరేహరే 
హరేకృష్ణ.. హరేకృష్ణ.. కృష్ణ కృష్ణ.. హరే హరే
*****
శ్రీరామనవమి సందర్భంగా కీర్తన.. 10
మల్లాప్రగడ రామకృష్ణ 

ధర్మరక్షణ జేసె దశరథ రామ
ధర్మమ్ము నిలిపెను ధరణీ నాధ రామ 
తండ్రికిచ్చిన మాట తలదాల్చు తనయుడువు రామ 
రమ్యగుణ సాంద్రుడు రాజ్యవిభుడువు రామ 
తాటకిన్ వధియించి తపసి జన్నము గాచెను రామ 
సుగుణాభి రామ
శివుని విల్లు విరిచి సీతను పెండ్లాడెరామ 
జగదేక వీర జానకి రామ

రామా నిన్నే నమ్మితి 
యేమాయ మముగనుచేర యేతీరుగనో 
రామా మము కావు ములే
మేమానినుపూజనిత్య మీరక చేయున్ 

మానక మాపూజలగా
వానల మధ్యకమణీయ వరుసగుపూజల్
నైనా కళ్యాణముగన్
పానకపెసరపప్పుగాను పలు నైవేద్యమ్ 

అల్లడు గో శ్రీరాముడు 
చల్లగ రాజ్యమునుయేలు చా తుర్యముగన్ 
చల్లని చూపులతో కళ 
కల్లలు లేనివిధముగను గమ్యమ్మగుటన్

నీవే తల్లివి తండ్రివి 
నీవే గురుడవు మనమున నేరుగ రావా 
కావుము భక్తుల రామా 
సేవలు చేసెదము మేము శీఘ్రము రామా 

యేమని చెప్పెద రామా
మామది నీకుగనుపూజ మనసే నీదిన్
రాముని బంటుల మైతిమి
ప్రేమా సంతసముతోను ప్రీతిగ చేయున్

దివ్య సుందరమూర్తి ధీయుతరామ 
మనుజుని రూపుడై మహిలోన జన్మించిన రామ 
మహీ సహనశీలివి రామ 
ఒకమాట యొకపత్ని యొక్కటే బాణమ్మనే రామ 

కరకు బోయని గళమున తరలివచ్చె రామ 
శబరి యెంగిలి గంగలో స్నానమాడె రామ 
హనుమ యెదలోన బ్రవహించె యమృతమ్ము రామ 
రామ నామమె యిలలోన రమ్యమయ్యె 
రామ రామ సీతా రామ 
రామరామ జయ జయ రామ

 " రామో విగ్రహవాన్ ధర్మః "
   సాధుః సత్యపరాక్రమః
   రాజా సర్వస్య లోకస్య
   దేవానా మివ వాసవః౹౹

 మూర్తీభవించిన ధర్మమే శ్రీరాముడు
ఆయన పరమసాధువు. సత్యపరా
క్రముడు.సర్వలోకములకు ప్రభువు.
దేవతలకు ఇంద్రుని వంటివాడు.
*****
ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు 
 ప్రాంజలి ప్రభ మల్లాప్రగడ రామకృష్ణ 

నూట ఎనిమిది నామాలలో సంపూర్ణ రామాయణం.

1.శుద్ధబ్రహ్మ పరాత్పర రామ
2.కాలాత్మక పరమేశ్వర రామ
3.శేషతల్ప సుఖనిద్రిత రామ
4.బ్రహ్మద్యమర ప్రార్ధిత రామ
5.చందకిరణ కులమండన రామ
6.శ్రీమద్దశరధనందన రామ
7.కౌసల్యాసుఖవర్ధన రామ
8.విశ్వామిత్రప్రియధన రామ
9.ఘోరతాటకఘాతక రామ
10.మారీచాదినిపాతక రామ
11.కౌశిక మఖసంరక్షక రామ
12.శ్రీ మదహల్యో ద్దారక రామ
13.గౌతమమునిసంపూజిత రామ
14.సురమునివరగణసంస్తుత రామ
15.నవికధావితమృదుపద రామ
16.మిధిలాపురజనమోదక రామ
17.విదేహమానసరంజక రామ
18.త్రయంబకకార్ముకభంజక రామ
19.సితార్పితవరమాలిక రామ
20.కృతవైవాహిక కౌతుక రామ
21.భార్గవదర్పవినాశక రామ
22.శ్రీ మాధయోద్యా పాలక రామ
23.ఆగణితగుణగణభూషిత రామ
24.అవనితనయాకామిత రామ
25.రాకాచంద్రసమానన రామ
26.పితృవాక్యాశ్రితకానన రామ
27.ప్రియగుహావినివేధితపద రామ
28.తత్ క్షాళితనిజమృదుపద రామ
29.భరద్వాజముఖానందక రామ
౩౦.చిత్రకూటాద్రినికేతన రామ
31.దశరధసంతతచింతిత రామ
32.కైకేయీతనయార్థిత రామ
౩౩.విరచితనిజపాదుక రామ
34.భారతార్పిత నిజపాదుక రామ
35.దండకవనజనపావన రామ
36.దుష్టవిరాధవినాశాన రామ
37.శరభoగసుతీక్షార్చిత రామ
38.అగస్త్యానుగ్రహవర్ధిత రామ
39.గృద్రాధిపగతిదాయక రామ
40.పంచవటీతటసుస్థిత రామ
41.శూర్పణఖార్తి విధాయక రామ
42.ఖరదూషణముఖసూదక రామ
43.సీతాప్రియహరిణానుగ రామ
44.మరిచార్తికృదాశుగా రామ
45.వినష్ట సేతాన్వేషక రామ
46. గృధ్రాధిపగతిదాయక రామ
47.శబరిదత్తఫలాశన రామ
48.కబంధభాహుచ్చేధన రామ
49.హనుమత్సేవితనిజపద రామ
50.నతసుగ్రివభిష్టద రామ
51.గర్వితవాలివిమోచక రామ
52. వానరదుతప్రేషక రామ
53.హితకరలక్ష్మణసంయుత రామ
54.కపివరసంతతసంస్మృత రామ
55.తద్గతి విఘ్నద్వంసక రామ
56.సీతాప్రాణాదారక రామ
57.దుష్టదశాన ధూషిత రామ
58. శిష్టహనూమద్భూషిత రామ
59.సీతూధితకాకావన రామ
60.కృతచూడామణిదర్శన రామ
61. కపివరవహనశ్వాసిత రామ
62.రావణధనప్రస్థిత రామ
63.వనరసైన్యసమావృత రామ
64.శొశితసరిధీశార్థిత రామ
65.విభిషణాభయదాయక రామ
66. సర్వతసేతునిభందక రామ
67.కుంబకర్ణ శిరశ్చెదక రామ
68.రాక్షససంఘవిమర్ధక రామ
69.ఆహిమహిరావణ ధారణ రామ
70.సంహ్రృతదశముఖరావణ రామ
71.విభావముఖసురసంస్తుత రామ
72.ఖస్థితధశరధవీక్షిత రామ
73.సీతాదర్శనమోదిత రామ
74.అభిషిక్త విభీషణ రామ
75.పుష్పకయానారోహణ రామ
76.భరధ్వజాభినిషేవణ రామ
77.భరతప్రాణప్రియకర రామ
78.సాకేత పురీభుషన రామ
79.సకలస్వీయసమానత రామ
80.రత్నలసత్పీఠాస్థిత రామ
81.పట్టాభిషేకాలంకృత రామ
82.పార్థివకులసమ్మానిత రామ
83.విభీషణార్పితరంగక రామ
84.కీశకులానుగ్రహకర రామ
85.సకలజీవసంరక్షక రామ
86.సమస్తలోకోద్ధారక రామ
87.అగణితమునిగాణసంస్తుత రామ
88.విశ్రుత రాక్షసఖండన రామ
89.సితాలింగననిర్వృత రామ
90.నీతిసురక్షితజనపద రామ
91.విపినత్యాజితజనకజ రామ
92.కారితలవణాసురవధ రామ
93.స్వర్గతశంబుక సంస్తుత రామ
94.స్వతనయకుశలవనందిత రామ
95.అశ్వమేధక్రతుదీక్షిత రామ
96.కాలావేదితసురపద రామ
97.ఆయోధ్యజనముక్తిద రామ
98.విధిముఖవిభుదానందక రామ
99.తేజోమయనిజరూపక రామ
100.సంసృతిబన్ధవిమోచక రామ
101.ధర్మస్థాపనతత్పర రామ
102.భక్తిపరాయణముక్తిద రామ
103.సర్వచరాచరపాలక రామ
104.సర్వభవామయవారక రామ
105.వైకుంఠలయసంస్ఠీత రామ
106.నిత్యనందపదస్ఠిత రామ
107.కరుణా నిధి జయ సీతా రామ
108.రామరామ జయరాజా రామ .
*****
శ్రీ వేంకటేశ్వర కీర్తన..11
మల్లాప్రగడ రామకృష్ణ 

నమోకేశవ, నమోనారాయణ, నమోమాధవ,
నమోగోవింద, నమోవిష్ణు, నమోమధుసూధన,
నమోత్రివిక్రమ, నమోవామన, నమోశ్రీధర,
    
నమోహృషేకేశ, నమోపద్మనాభ, నమోదామోదర, 
నమోసంకర్షణ, నమోవాసుదేవ, నమో ప్రద్యుమ్న, నమోయనిరుర్ధ, నమోపురుషోత్తమ, నమోయధోక్షజ,

నమోనారసింహ, నమోఅచ్చుత, నమోజనార్ధన,
నమోఉపేంద్ర , నమోశ్రీకృష్ణ , నమోశ్రీహరి,
నమోవెంకటేశ, నమో శ్రీనివాస, నమోసర్వదేవ,   

నమో అగ్రత, నమో అఖండ, నమో అరుణోదయ,
నమో అమోఘ, నమో అద్భుత, నమో అభిరూప,
 నమోఅమృత,నమోఅభీష్ట, నమో అమ్బుజనాధ,  

నమో అభిమాన, నమో అభ్యు దయ,నమో అష్టోత్తరకర్త,
 నమో అభిజ్ఞాన, నమో అలంకార , నమో అభివాదభర్త,
 నమో అమిత,నమో అమూల్య, నమో అరవిన్దభర్త,      
  
నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ. ఎన్నిసార్లు పలికినా 
నమోనమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ. ఎన్నిసార్లు దర్శించినా 
నమో నమో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ. ఎన్నిసార్లు మొక్కులిచ్చినా                            
నమోనమోశ్రీ తిరుమలతిరుపతి వేంకటేశ. ఎన్నిసార్లు చేయుభజనైనా 
నమోనమోశ్రీ తిరుమలతిరుపతి వేంకటేశ. నమోనమః అని ప్రార్ధనే

Sunday, 6 April 2025

ఏప్రియల్ మొదటి వారామ్.. వేంకటేశ్వరుని కీర్తనలు




 శృంగార కీర్తన.. ప్రాంజలి ప్రభ  ..(1)

రేకు రాగము: మంగళకౌశిక


ఏది యెన్నానో విభుడు యెదురు చూచే నేను 

కాదు నన్నానో కలన కెదురు చూచే నేను 

ప్రేమ సంతోసాలు పెన గొనియే నే నేను 

క్షేమమే కోరేటి స్థితి గనియే నేనేను !!పల్లవి!!(2)


 కనులుగన లేకయు గాలమాయ నట్టుండు 

 తగులు కలవరింపు దలపోసితే 

 కవిపట్లలేనుండు కనిపెట్ట లేకాయె 

 గని పించే కోరికలు ఏమి సేతునే

 !!ఏది!!


తను వాయే యీవిధాన తప్పక వొ ప్ప చెప్పుడు 

మనసైనా యీ పతీమదీ కళ నొప్ప కొప్పడు 

క్షణ మైనా గాగిటా నసా విధి యెట్టి దో ఘని 

వను కాయే వేడుకా పస యిది యేమి సేతునో !!యేది!!


కానుకగా నాతోను పరగ నవ్వన ట్టుండు 

మేనుకు మేనౌను కలవ యివ్వ నట్టుండు 

ఆనుక శ్రీవేంకటేశుఁ డంతలో వచ్చి నట్టుండు 

యానిజ మిప్పుడే కంటి నింకా నేమిసేతునే ॥ఏది ॥

****

మల్లా ప్రగడ రామకృష్ణ


ప్రాంజలి ప్రభ... కీర్తన..(2).. 02-04-2025

 మల్లాప్రగడ రామకృష్ణ 


ఎవరివో నీవెవరివో యనకు వేంకటేశా 

 నవ విధానంబుగతి సేవలగు వేంకటేశా..... (2)


 ఎవరి కన్నుల్లో చేరినావో 

 ఎవరి గుండెల్లో దూరినావో

 ఎవరి మాయల్లో చిక్కినావో 

 ఎవరి ధ్యానాన్నే నమ్మినావో 


 ఎరుక పరచలేని అభాగ్యుడ్ని వెంకటేశా 

 దరిన చెలిమి లేని అభాగ్యుడ్ని వెంకటేశా....(2)


 చూపులతో మంత్రం వేసావో 

 అందముతో తంత్రం చేసావో 

 పందెము తో యంత్రం మారావో

 పొంది క తో సూత్రం చేరావో 


ఎరుక పరచలేని అభాగ్యుడ్ని వెంకటేశా 

 దరిన చెలిమి లేని అభాగ్యుడ్ని వెంకటేశా....(2)


 మనసున్న మనసునైతినో 

 ఊహల గంధము నైతినో 

 ఊయలూప మాలిని నైతినో

 నీ కాలి మువ్వనైన కాకపోతి నో 


ఎరుక పరచలేని అభాగ్యుడ్ని వెంకటేశా 

 దరిన చెలిమి లేని అభాగ్యుడ్ని వెంకటేశా


ఎవరివో నీవెవరివో యనకు వేంకటేశా 

 నవ విధానంబుగతి సేవలగు వేంకటేశా

 నమో వెంకటేశాయ నమో నమః

*****

ప్రాంజలి ప్రభ... కీర్తన.. (3)...03-04-2025

 మల్లాప్రగడ రామకృష్ణ 


శ్రీదేవి భూదేవిల మధ్య శ్రీ వెంకటేశ్వర లీలా విలాసము 


ఆశలు తీర్చగ రావేల, 

అలుపును మార్చవ నీవైనా 

పాశము బంధము యీవేళ , 

పలుకును మార్చవు నీవైనా....


 చరితము చిత్ర విచిత్రముగా చూపెదరా  

 పరిణయ భావ ప్రపత్తముగా మారెదరా 

 తరుణము సత్యము సఖ్యతగా మార్చెదరా 

కరుణను జూపి సహాయముగా యుండెదరా


వలపు పిలుపుతో చిక్కుముడైనదా మీలో 

 ప్రణయ పాఠముతో మధురమైనదా మీలో 

 క్షణ కవ్వింపులతో మనసు సిగ్గైనదా మీలో 

 అణువణువు దోచుకోవాలని ఆశైనదా మీలో 


అందాల ఓ భామలు అందుకో నా లేఖలు

 నా మదిలోని కలలన్నీ చేరాలి మీదాకా

 అడుగులు తడబడే పెదవులను చేరదా

 మిసమిసలాడే వయసులే థలతళ లాడే కనులే 

 కలిసిపోవాలి మన హృదయాల్లో చల్లదనములై


ఆశలు తీర్చగ రావేల, 

అలుపును మార్చవ నీవైనా 

పాశము బంధము యీవేళ , 

పలుకును మార్చవు నీవైనా 


ఆశలు తీర్చెద మేమేలే 

అలుపును మార్చెద మేమేలే 

పాశము బంధము యీ వేళే 

పలుకును మార్చెద సౌఖ్యమేలే

******

ప్రాంజలి ప్రభ... కీర్తన.. (4)...04-04-2025

 మల్లాప్రగడ రామకృష్ణ 


పల్లవి: కలియుగమాయే నీలీలలు

తెలియగలేరే యీస్థితిలు..2

తెలపగలేరే నీ విధులు..2

తిరుమల తిరుపతి వేంకటేశా.... 2


 చరణం:  మానవులైనా, ప సువులకైనా -2

 సంతాపమగును శాపాల వలన -2

 పాప నివారణా…ఆ…ఆఅ…..ఆ

 పాప నివారణ చూపుము కరుణా

ఓ శ్రీ వేంకటేశా....

 

 తెలపగలేరే నీ లీలలు తిరుమల తిరుపతి వెంకటేశా


 చరణం:  వింతైనది లోకము, ఇది మాయాలోకము -2

 సంతసించునంతలోనె కలుగును సంతాపము -2

పంతాల మధ్య నలిగేటి జీవితాల మయము.2

ధర్మా ధర్మాలు తెలపలేని పాలనా యుగము..2


తెలపగలేరే నీ లీలలు తిరుమల తిరుపతి వెంకటేశా

 

 త్యాగముతో… ఒక సోదరుడు, భోగములో మరియొక సోదరుడు -2

ధన పిచ్చిలో ఒక సోదరుడు, మదపిచ్చిలో మరియొక సోదరుడు..2

 ఉండుట యిది మాయా..ఆ.ఆ.... 2


కలియుగమాయే నీలీలలు

తెలియగలేరే యీస్థితిలు..2

తెలపగలేరే నీ విధులు..2

తిరుమల తిరుపతి వేంకటేశా.... 2

నమో వేంకటేశాయ నమో నమః

******

ప్రాంజలి ప్రభ... కీర్తన.. (  5  )...05-04-2025

 మల్లాప్రగడ రామకృష్ణ 


పల్లవి: కలియుగమాయే నీలీలలు

తెలియగలేరే యీస్థితిలు..2

తెలపగలేరే నీ విధులు..2

తిరుమల తిరుపతి వేంకటేశా.... 2


 చరణం:  మానవులైనా, ప సువులకైనా -2

 సంతాపమగును శాపాల వలన -2

 పాప నివారణా…ఆ…ఆఅ…..ఆ

 పాప నివారణ చూపుము కరుణా

ఓ శ్రీ వేంకటేశా....

 

 తెలపగలేరే నీ లీలలు తిరుమల తిరుపతి వెంకటేశా


 చరణం:  వింతైనది లోకము, ఇది మాయాలోకము -2

 సంతసించునంతలోనె కలుగును సంతాపము -2

పంతాల మధ్య నలిగేటి జీవితాల మయము.2

ధర్మా ధర్మాలు తెలపలేని పాలనా యుగము..2

 

 త్యాగముతో… ఒక సోదరుడు, భోగములో మరియొక సోదరుడు -2

ధన పిచ్చిలో ఒక సోదరుడు, మదపిచ్చిలో మరియొక సోదరుడు..2

 ఉండుట యిది మాయా..ఆ.ఆ.. 


కలియుగమాయే నీలీలలు

తెలియగలేరే యీస్థితిలు..2

తెలపగలేరే నీ విధులు..2

తిరుమల తిరుపతి వేంకటేశా.... 2

నమో వేంకటేశాయ నమో నమః

*****

ప్రాంజలి ప్రభ... కీర్తన.. ( 5)...0 -04-2025

 మల్లాప్రగడ రామకృష్ణ 


శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరుని విరహ విలాపం 

రచన.. మల్లాప్రగడ రామకృష్ణ 


మీ కళ్ళ మూలల్లో 

ఒక కళ మేల్కొని నన్ను చూడరే 

మీ అలకబూనిన కథలో 

ఒక ఆశ మేల్కొని నన్ను చూడరే 

నా ముద్దుల చెలులారా.....

నన్ను చేరి ముద్దు చేయరే చెలులారా..... చెలులారా...


కాలము మారే మనసాయెలే, 

చెరవీడిన హృదయమ్ము పులకించిలే

గాలము వేసే జపమాయెలే, 

దరి చేరిన సుగుణాలు ఫలమిచ్చులే

మీరొక శాంతి పలుకాయెలే,  

నను మాయలొ విధిగాను నిలిపేనులే 

నామది మార్చే రుణమాయెలే, 

కనుల చూపుతొ మురిపించి మనసిచ్చులే... మీ 


మీ చల్లని చూపు ఒక్కటి చాలు

నా మది పరవశించిపోడానికి

మీ వెచ్చని కౌగిలిలొక్కటి చాలు 

నాహృదయమున నిండి పోవడానికి 

మీ తియ్యని పొందు నొక్కటి చాలు 

నామనసుగను మారిపోవడానికి 

మీ ముద్దుగ రూపుఁ మక్కువ చాలు 

 నాసుగుణములు నిండి పోవడానికి 


నా మనసంతా మధురంగా మారడానికి.... మీ..


మీ అందమైన వయసులో ,  

నా కంటూ చిన్న చోటు చాలు

మీ ప్రేమ పొంద మనసులో, 

నా కంటూ చిన్న చోటు చాలు

నేను ఎన్ని జన్మలైనా మీ కోసమే, 

 ఎదురుచూడటానికి వీలు 

జన్మజన్మల బంధమని సాగితే 

ఒక్కరొక్కరం యగుతయే చాలు.. మీ 


మీ కళ్ళ మూలల్లో 

ఒక కళ మేల్కొని నన్ను చూడరే 

మీ అలకబూనిన కథలో 

ఒక ఆశ మేల్కొని నన్ను చూడరే 

నా ముద్దుల చెలులారా.....

నన్ను చేరి ముద్దు చేయరే చెలులారా..... చెలులారా...

.*****