Monday 16 August 2021

ప్రింటింగ్ ఛందస్సు

ప్రాంజలి ప్రభ ... తొలి .... 5

తొలి పొద్దు మేలు గొలుపు, మలి రాత్రి ముద్దు సలుపు 
తొలి కాంతి ఆశ మెరుపు,  మలి హాయ్ సద్దు వలపు 
తొలి సేవ నిత్య మెరుపు,  మలి మాయ వద్దు గెలుపు 
తొలి  పూజ భక్తి తలపు,  మలి వెన్నె లద్ది  మలుపు  

తొలి వేళ వెచ్చ దనము, మలి నీడ చల్ల దనము 
తొలి గంధ పచ్చ దనము, మలి మౌన సేవ తనము 
తొలి హంస పంచు దనము, మలి హంస ప్రేమ తనము      
తొలి వంట ఇచ్చు తనము, మలి పంట  వెచ్చ తనము 

తొలి తృప్తి జరుగు తనము, మలి మాయ తొలుగు తనము 
తొలి ఆశ మనసు తనము, మలి పండు మెరుపు తనము 
తొలి రోజు కధలు తనము, మలి మోజు మరుపు తనము 
తోలి సుఖము తలపు తనము మలి కళలు తీరు తనము 

తొలి కిరణ వేడి తరుము  మలి తీర్పు మలుపు  తనము 
మధుర ప్రేమ మెలి తనము, మలి మార్పు వలపు తనము 

సంసార సౌఖ్యం సంతాన భాగ్యము, ఆదర్శ జీవితం 


🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘
==

UUUUx xx - IIIIIU - UIU UIUU - మందాక్రాంతము

UUUII xx - xUIIIU - UUI UUIU - శిశుశార్దూలము

UUUII UI - xUIIIU - UUI UUIU - శార్దూలవిక్రీడితము

శార్దూలవిక్రీడితములో 6,7 అక్షరములు తొలగిస్తే అది శిశుశార్దులము అవుతుంది. దీని లయ, మందాక్రాంతపు లయ ఇంచుమించు ఒక్కటే. మందాక్రాంతములో చివరి గణములు ర/ర/గ, ఇందులో త/తగ. 
==
మందాక్రాంతము - మ/భ/న/త/త/గగ UUUU - IIIIIU - UIU UIUU
17 అత్యష్టి 18929 
శిశుశార్దూలము - మ/స/న/మ/య/లగ UUUII - UIIIU - UUIUUIU
17 అత్యష్టి 37337
==
బేసి పాదములు - మందాక్రాంతము
సరి పాదములు - శిశుశార్దూలము
==

అమ్మా రావా - యమల హృదయా - యాశకుం దివ్వె నీవే 
వమ్ముంజేయకు - వాంఛ వరదా - భావమ్మె జీవమ్ముగా 
కమ్మంగా రా - కవిత నొసగన్ - గావ్య గానమ్ము మ్రోఁగన్ 
నమ్మంగా నిను - నాశమగునా - నాజీవిత మ్మీభువిన్ 
==
ఆనంద మ్మా - యతని కృతియే - యంద మానందమేగా 
గానమ్మా సుర - గంగ యలలా - గంధర్వ లోకాలలో 
యేనాఁడో యీ - హృదయమున నా - యీశుఁడే నిండెఁగాదా 
ప్రాణమ్మందున - వాని యుసురే - వాఁడెందు నాతోడుగా 
==

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు




కీర - స/స/జ/భ/భ/ర/లగ IIU IIUI UIU - IIU IIUI UIU
20 కృతి 355676 

 
pranjali prabha.. daily 

యదలో ఒకకొత్త వెల్గుతో, కధలా మనసునే వుంటివే 
కథలే కదిలొచ్చె గాఢలై, కలలో కెలుకునే నుంటివే 
విధియే అనిఅన్న కాదులే, మదిలో పెనుమాయ ఉండుటే 
మధువే ననుతాకి నేర్పునే, ఇదియే కలకాదు ప్రేమయే ....1

సమయం మనదేను భావనే, మనలో మనసంత ఉండునే 
విమలం మనవెంట ఉండునే, వినుటే వినయమ్ము కల్గునే 
గమనం జరిగేను వెంటనే, గనుటే గమనమ్ము తెల్పునే 
సుముఖం వినడంలొ సౌఖ్యమే, కధలే మనసంత శాంతిగా,,,, 2 

పలుకే మనసవ్వు లక్ష్యమై, యదలో గెలుపంత పండుగా 
వలపే చిరునవ్వు  భాగ్యమై, వలలో వలపంత నిండుగా 
గెలుపే విషయమ్ము ధైర్యమై, ఇలలో పలుకంత విందుగా 
అలుపే మనకొద్దు బంధమై, కళలే జపమంత జంటగా  ....... 3



ఏకరూప + ఏకరూప = కీర (సంపఁగి జాతి ప్రత్యేకత) - అఠతాళము. 
==
చంపకోత్పలమాలలలోని ద్వితీయార్ధమును సహజా లేక ఏకరూప అని అంటారు. దీనిని రెండింతలు చేసి వ్రాసిన వృత్తమిది. ఇది సంపఁగి జాతి ప్రత్యేకత. సంపఁగి జాతిలో ఎదురు నడకలు లేని 4,5,5 మాత్రలు ప్రతిపాదములో నుండును. రెండవ మాత్రాగణమునుండి ప్రారంభిస్తే ఇది అఠతాళమునకు సరిపోతుంది, మాలికావృత్తములవలె. దీనికి కీర అని పేరుంచినాను. 
==
అఠతాళము - I5I5OO
==
కీర - స/స/జ/భ/భ/ర/లగ IIU IIUI UIU - IIU IIUI UIU
20 కృతి 355676 
==
చిలుకా వనజాక్షుఁ డెక్కడే - చెలితోఁ బలుకండు చిక్కఁడే 
చలిలో నిశిలోన నొంటిగా - జడమై శిలవోలె నుంటినే 
పలుకే యది పైడి యయ్యెనో - వలలో పడియుంటి చేఁపగాఁ  
గలలోఁ గన నెంచ నాకు నా - కలయే కరువాయెఁ గీరమా ... (1)
==
మదనా నను జేర రమ్మురా - మదిలోఁ దలఁపెల్ల నీదెరా 
మధురాధర మిత్తు నీకు నా - మధువుల్ కలకండ తీపిరా 
సుదతిన్ గనినంత లిప్తలో - సుదయే హరుసమ్ము సుందరా 
యెదలో నొక క్రొత్త వెల్గుతో - హృదయ మ్మరవింద మౌనురా ... (2) 
==
మనసా యెఱుగంగ లేనె యీ - మధురస్వర గీత మెక్కడే 
మనమం దది మ్రోఁగె నందమై - మలపై ధ్వని పల్కు రీతిగా 
తనువో యొకచోట నిల్వదే - తనివిన్ దను నాట్యమాడునే 
కనఁగా నిది ప్రేమ తీరులో - కవితా ఝరి పొంగి పారెనే ... (3) 
==
మొదటి రెండు పద్యములను రెండేసి యతిలేని ఏకరూప లేక సహజా వృత్తములుగా వ్రాయ వీలగును. 
==
ఏకరూప లేక సహజా - స/స/జ/గ IIU IIUI UIU
10 పంక్తి 348 
==
చిలుకా వనజాక్షుఁ డెక్కడే 
చెలితోఁ బలుకండు చిక్కఁడే 
చలిలో నిశిలోన నొంటిగా 
జడమై శిలవోలె నుంటినే ... (4)
==
పలుకే యది పైడి యయ్యెనో 
వలలో పడియుంటి చేఁపగాఁ 
గలలోఁ గన నెంచ నాకు నా 
కలయే కరువాయెఁ గీరమా ... (5)
==
మదనా నను జేర రమ్మురా 
మదిలోఁ దలఁపెల్ల నీదెరా 
మధురాధర మిత్తు నీకు నా 
మధువుల్ కలకండ తీపిరా ... (6)
==
సుదతిన్ గనినంత లిప్తలో 
సుదయే హరుసమ్ము సుందరా 
యెదలో నొక క్రొత్త వెల్గుతో 
హృదయ మ్మరవింద మౌనురా ... (7)
==

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


No comments:

Post a Comment