Thursday 7 June 2018

కొలువై ఉన్నాడే దేవ దేవుడు...కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే...

చిత్రం : స్వర్ణ కమలం
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : SP.బాలసుబ్రహ్మణ్యం,P.సుశీల

కంఠేనాలంబయేత్ గీతం హస్తేన అర్ధం ప్రదర్శయేత్
చక్షుభ్యాం దర్శయేత్ భావం పాదాభ్యాం తాళం ఆచరేత్

పల్లవి :

కొలువై ఉన్నాడే దేవ దేవుడు
కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే
వలరాజు పగవాడే వనిత మొహనాంగుడే
కొలువై ఉన్నాడే...

చరణం : 1

పలుపొంకమగు చిలువల కంకనములమర
నలువంకల మనిరు చులవంక కనర
తలవంక నలవేలు...కులవంక నెలవంక
వలచేత నొసగింక వైఖరి మీరంగ

కొలువై ఉన్నాడే దేవ దేవుడు....కొలువై ఉన్నాడే

చరణం : 2

మేలుగ రంతనంబు రాళు చెక్కిన ఉంగరాలు
భుజగ కేయు రాలు నెరయంగ
పాలు గారు మోమున శ్రీ ను పొడమా...
పులి తోలు గట్టి ముమ్మొన వాలు బట్టి తెరగా

కొలువై ఉన్నాడే దేవ దేవుడు...దేవ దేవుడు కొలువై ఉన్నాడే

https://www.youtube.com/watch?v=aMjeq_9p06E

No comments:

Post a Comment