Tuesday, 17 August 2021

kavitalu




నేటి నా పాట పాట సంఖ్య:-566.

********

పాట సందర్భంపై నా విశ్లేషణ.

**********

నేటి యువతుల తీరు వేష భాషలు నచ్చక  పాత భావజాలం  అణుకువ మెలుకువల ఆచారాల కల

అమ్మాయి కోసం వేచిచూస్తు వెదుకుతున్న విలువలు సంప్రదాయం  కలగలసిన   ఓ యువకుడు కట్టుబొట్టు భారతీయ వస్త్రధారణ వైవాహికత వైపు ఆశక్తి కలిగిన వాడికి   కనిపించింది   తన మనసు కోరుకున్న అన్ని అర్హతల సహజ సిద్ద ముగ్ధ  మనోహరి కనిపించగానే అతనిలోని ఆనందం ఇలా పాటగా పాడుతోంది..!

*************

పల్లవి:-

****

సహజ సౌందర్యం ఇన్నాళ్లకి  నా   కళ్ళ పడగా


వయసులో పుష్పం ప్రేమగా పిలిచెగా 

మనసులో ఇష్టం  ప్రేమగా  కురిసెగా..

తనువులో కష్టం ప్రేమగా మెరిసెగా ...

 

నిజం మాధుర్యమై నవ్వుతూ నడిచిరాగా

వయసు మురిసెనే ఒళ్లు పులకింతగా!!


ఏం చెప్పను  ఎన్నాళ్ళుగానో ఎదురు చూసానో

కుదురులేని మనసుతో...

నీవు కానరాక ఎంతగా వెతికానో  

నిదురలేని  ఈ కళ్ళతో !!


ఇన్నాళ్లకు కరుణించి కనిపించినావే 

అనురాగ దేవతవై..

సహజ సౌందర్యం నా కళ్ళ పడగా

మనసులో ఇష్టం ప్రేమగా కురిసెగా !!

చరణం:-

*****

ఆ కురులు  నీలి మేఘాల సిరులు

ఆ ముఖారవిందం  మందార పువ్వుల లాలిత్యం

ఆ హృదయాలయం తూరుపు ఉషోదయ సమయం

ఆ  నడక వయ్యారం జలజల పారే కృష్ణా ప్రవాహం!!


ఎందెందు చూసినా

నీలో అందచందాల  పూలవనాలే 

ఆకాశ తీరానా  ఎగెరెగిరిపోతున్నా

గువ్వల గుంపుల చూపులన్ని నీపైనే!!

పల్లవి:-

****

సహజ సౌందర్యం నా కళ్ళ పడగా

మనసులో ఇష్టం ప్రేమగా కురిసెనే!!

చరణం:-

****

మది దోచినా హంసద్వని రాగమాలికవే

సిగ్గు వదిలి  ఒకసారి నావైపు చూడవే

మొగ్గ తొడిగిన పువ్వా  మొగ్గు నా వైపు దూకవే   

సిరిమల్లే నవ్వా!!


చుక్కలన్ని చూస్తున్నాయని  పక్క ఏమో ఒప్పుకోకుంది

కోరికేమో  కోనసీమలా పచ్చగా  చిగురు వేసింది

కోక  ఏమో కేక వేసే   కాక నంతా  కైపుగా మార్చేసింది

చీకటి దుప్పటై మీదికొచ్చింది చిన్నది మత్తు గా హత్తుకుందీ...

 పల్లవి:-

****

 సహజ సౌందర్యం ఇన్నాళ్లకు  నా కళ్ళ పడగా

 మనసులో ఇష్టం ప్రేమగా మారెనే ..!!

************

నేటి నా పాట పాట సంఖ్య:-561.

**********

పాట సందర్భంపై నా విశ్లేషణ.

*********

సర్వేశ్వరుడైన ఈశ్వరుడి  సన్నిదానమే తన నివాసం కాగా  బసవేశ్వరుడు ఈశ్వరుని స్తుతిస్తు పాడుతున్న పాట. మనిషిగా పుట్టి ఋషిలా తపస్సు చేసి అల్పాయుష్కుడైన  వాడు చిరంజీవి గా ఈశ్వరుని చేత వరంపొంది కైలాసం లో పరమేశ్వరుని పాదాల చెంత ఉండు భాగ్యం పొంది ప్రధమ గణాలలో ముఖ్యుడిగా

 భాసిల్లుతోన్న నందీశ్వరుడి భక్తి పరవశం ఈ పాట.

***************

పల్లవి:-

***

భక్తి దారి చూపినా నా దేవరా  పరమేశ్వరా

ముక్తి ప్రసాదించి నీ దరికి  చేర్చుకున్నా విశ్వేశ్వరా!!


భక్తి దారి చూపినా నా దేవరా పరమేశ్వరా

ముక్తి ప్రసాదించి నీ దరికి నన్ను  చేర్చుకున్నా విశ్వేశ్వరా!!


భౌతిక బాధల వలయం ఛేదించగా 

నైతిక విలువల మార్గం పయనించగా

ఆత్మస్వరూపుడిగా  దేహభావం దహించగా

పంచాక్షరీ మంత్రం ఓంనమశ్శివాయ

ఓంనమశ్శివాయ ఓంనమశ్శివాయ


స్మరించిగా సమసిన అంతర్యుద్ధం

స్థితప్రజ్ఞతకు నీ ఆజ్ఞ దారిచూపెను  దయామయా

అజ్ఞానానంధకారం దహనమై

సుజ్ఞానం ఉదయించి నీ సన్నిదానం వరమాయే ఓంకారా..!!


పంచాక్షరీ మంత్రం అమితానందం

పరవశమైన ఈ తనువణువు పొందిన  ఆత్మనందం 

కర్మ నాశనం జన్మరాహిత్యం 

 నీ నామ స్మరణం ఓంనమశ్శివాయ ఓంనమశ్శివాయ!!


ఇది చాలులే ఇక ఏది వద్దులే

పంచక్షరి మంత్రం మించిని పంచభక్ష్యాలు

వుంటాయా ఈ సృష్టిలో సర్వేశ్వరాయ

సదాశివాయ ఓం నమశ్శివాయ!!


 భక్తి దారి చూపినా నా దేవరా పరమేశ్వరా!

చరణం:-

***

నీ ద్యాసలో  నీ నామ ద్యానం స్మరించగా

అణువణువునా విభూది గా సంతరించుకొని

నిశ్చలమే మనస్సున చేరి ఉషస్సు గా తాకింది

అచంచలమైన భక్తి ఊటా 

ఉప్పొంగెనులే గంగా ప్రవాహమై నా మది అణువణువునా ఆది శంకరా అనాధ రక్షకా

పరమేశ్వరా పాహిమాం పాహిమాం పరమాత్మా!!


అంతరంగాన భక్తి జ్యోతిని  వెలిగించినా

అంతులేని ఆనందం వైపు  అడుగులే వేయించినా

ముక్తి త్రోవ చూపినా

రక్తిపై మోహమే తుడిపేసినా

ముత్యమల్లే మెరిసేలా 

నా మనసును  మల్లెపూవులా మార్చేసినా

మల్లికార్జునా !!


నిను సేవించే భాగ్యం  ప్రసాదించినా నా తండ్రి

ఈశ్వరా మల్లేశ్వరా!!ఈశ్వరా పరమేశ్వరా !!


భక్తి దారి చూపినా దేవా పరమేశ్వరా

ముక్తి ప్రసాదించి నీ దరికి చేర్చుకున్నావయ్యా  దయాస్వరూపా!!

చరణం:-

***

నీ లీలామృతం త్రాగినానయా

కన్నీళ్ల కడలిని దాటినానయా 

లోకానికంతా ఆకలి  తొలగించే

వరమునే నొసగి నందిశ్వరుడిగా

బసవేశ్వరుడిగా నామకరణమే చేసి

భువిన నన్ను భూమాతకు తోడుగా

పంపి చరితార్దుడను చేసినావు చెన్న మల్లేశ్వరా!!


వందనమయ్యా విశ్వ విభుడా 

పార్వతీ వల్లభా పరమేశ్వరా!!


నీ సన్నిదిలో  నీ బంటుగా ఉంటు

నిను నిత్యం కొలిచే నన్ను  నీ నోట  మనసారా మహానందని పిలిపించుకొనుట   

మహాదానందం  మహితాత్మా

మహదానందం మహితాత్మా!!

పల్లవి:-

***

భక్తి దారిచూపినా దేవరా  పరమేశ్వరా

ముక్తి ప్రసాదించి నీ దరిన ఉండే వరమునే ప్రసాదించిన విశ్వేశ్వరా!!


అల్పాయుష్కుడను చిరంజీవి గా దీవించావు

అనంతమైన ఆనందుడిగా చరిత్రలోనే నిలిపావు

ప్రధమగణాలలోముఖ్యుడిగా చేసావు

నిత్యం నీ యందుండే లా   నిను స్పర్శించేలా   

నీ వాహనమై నా జన్మతరించే లా 

ఆదిదంపతులకు సేవలు చేయు భాగ్యమును నొసంగి  ఎవరికి దక్కని భాగ్యం నాకిచ్చినావు నంది వాహన నాగభూషణ 

వందనం వందనం వందనం ఓంనమశ్శివాయ!!


పరవశం నా అణువణువు పావనం నా తనువు  కైలాసం నా నివాసం

పార్వతీ పరమేశ్వరులు కొలుచు ఈ జన్మం పంచాక్షరీ మంత్రం  నా స్వర వీణా తంతువై

నిరంతరం  స్మరిస్తు చిరంజీవి గా నిలిచాను తండ్రి నీ సన్నిదిలో ఈ నంది..

ఓంనమశ్శివాయ ఓంనమశ్శివాయ ఓంనమశ్శివాయ!!

పల్లవి:-

****

భక్తి దారి చూపినా దేవరా పరమేశ్వరా

ముక్తి  ప్రసాదించిన నీ దరికి నన్ను చేర్చుకున్నా విశ్వేశ్వరా!!

*************

మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ , 

6281190539



సైన్సు దినోత్సవం

పాట

సాకీ:

సైన్సు దినోత్సవమా!

ప్రజాసైన్సు దినోత్సవమా!

పల్లవి: సైన్సు దినోత్సవం

సైన్సు దినోత్సవం

సైన్సును ముందుకు నడిపించే విజ్ఞాన ఉత్సవం

విజ్ఞానం ఉనికి తెలిపి నిలుపు దినోత్సవం

సైన్సును ముందుకు నడిపే జ్ఞాన ఉత్సవం

విజ్ఞానం ఉనికి తెలిపినిలుపు 

దినోత్సవం

బుద్ధి చూపు నేర్పించే దినోత్సవం

                             ...సైన్సు

చరణం1:

నిజము తెలివి వెలుగులనూచూపించు దినోత్సవం

బుద్ధిలోని చీకట్లను తొలగించుట నేర్పించును

చదువుకు పునాది వేసి మెదడుకు .మెరుగులు దిద్దును

సైన్సు లేని చదువంటే గుండేలేని దేహమే... సైన్సు

చరణం2:

ఏడాదిలోన నేర్చుకున్న సైన్సు లోని ముచ్చట్లను

పంచనామ చేసుకొనీ దిద్దుకొనే సందర్భము

నిజము తెలివి వెలుగుతోటి దిద్దుకొనే సందర్భము

సైన్సుపాఠములలోనీ సారాంశము  నే ర్చెదమూ.. సైన్సు

చరణం 3:

మనసులోని మర్మాలకు ఉన్నపాట్లు

చూపించును

సైన్సంటే జీవితమని చాటి చెప్పి నేర్పించును

సైన్సంటే ప్రగతియనే లెక్కలనూ నేర్పించును

సై న్సే జీవిత కళలకుఅద్దమనీ చాటించును... సైన్సు

వల్లభాపురంజనార్దన

944016

3687

చుక్కలు

సైన్సుపాట


పల్లవి:

ఆరుతు వెలుగుతు మినుకు మిణుకుమని తారలు వెలిగేదెందుకో?

సూర్యునిలాగా వెలుగునిచ్చుటకు

చుక్కలకెందుకు వీలవదో!?

                                 ...ఆరుతు

చరణం1:

సూర్యునికన్నా చుక్కలు పెద్దవి

ఎన్నో రెట్ల కాంతి ఉన్నవీ

దివిటీముందు  దీపంలాగా

అవి వెలవెల పోవును ఎందుకనీ?...ఆరుతు

చరణం2:

వాతావరణములోపలఉన్నా

గాలి స్థిరముగా ఉండదురన్నా

అటుయిటు కదులుతు ఉంటుందన్నా

ఆ గాలే దీనికి కారణమన్నా...ఆరు

చరణం3:

గాలిపొరల సాంద్రతలో తేడా

ఉష్ణోగ్రతలో వచ్చేతేడా

వాయు వీచికల నడకల తేడా

కాంతి పయనమును నికువరిస్తవీ

                                  ...ఆరుతు

చరణం4:

తక్కువ ఎక్కువ సాంద్రతలుండే

దారులకాంతీ పయనిస్తుంటే

వక్రీభవనము చెందుటవలనా

చుక్కల వెలుగులు నిలకడగుండవు

                              ....ఆరుతూ

చరణం5:

గాలి అలల దిశ మారుటవలనా

పొరల సాంద్రతలు ఆపుటవలనా

కాంతి నిలకడగ కంటిని చేరదు

చుక్కలందుకే మినుకుమినుకు మని వెలుగు తుంటవీ...ఆరుతు

వల్లభాపురంజనార్దన

9440163687

నేటి నాపాట పాట సంఖ్య:-555.

******************************

రచన;- మహేష్ వూటుకూరి  ✍️

9640713717.

దోర్నాల.

 ప్రకాశం జిల్లా.

22/02/2023.

****************

పాట సందర్భంపై నా విశ్లేషణ.:-

***************************

తెలియని తనం చేసిన తప్పలను  తెలిసి తనం   ఇది తప్పు అని చెప్పినప్పుడు సరిదిద్దుకొంటే అది తెలివైన తనం అవుతుంది . 

బోయవాడు వాల్మీకి అయి నట్లుగా ఒక మనిషిని ఒక అమ్మాయి తనలోని లోపాలను ఎత్తి చూపుతుంది తన పాపాల చిట్టా విప్పి చెబుతుంది దాని వలన  ఎంత మందికి ఎంత నష్టం జరిగిందో వివరిస్తుందీ.


పొగరులోనో తెలియక నో చేసావు నీ తప్పులకు వాళ్ళ కష్టాలు చూడంటు చూయిస్తుంది. కళ్ళారచూసిన  ఆ వ్యక్తి తన తప్పును సరిచేసుకుంటాడు  

అందరి బాధ్యత లు తీసుకుంటాడు తనలా తప్పులు చేసే వారిని తప్పులు చేయకుండా మార్గదర్శిగా మారి దారి చూపుతాడు

అతనిలో మార్పుకు కారణమైన ఆమె ను కృతజ్ఞతా భావంతో 

ఇలా పాట రూపంలో కీర్తిస్తు  ఇలా పాడుతు

మనసులో దేవతలా కొలుస్తు ప్రేమిస్తుంటాడు అతని మానవత్వానికి  ప్రేమతత్వానికి ఫిదా అయిన ఆమెలో కూడ అతనిపై ప్రేమ పుడుతుంది అలా మంచి ఆలోచనలెపుడు మంచికి ప్రాణం పోసి పదిమందికి మేలుచేస్తాయనే సారాంశమే ఈ పాట.

*************************************************పల్లవి:-

*******

అహాహా అహాహాహా

ఆహాహా హా

పల్లవి:-

******

ప్రకృతి కి ప్రాణం పోసిన తొలికిరణం లా

నాలో  తెగువకు జీవం  పోసావు(లే)

ఆకృతే లేని  ఈ ప్రాణికి చిరునవ్వులు అద్దావు(లే)

నేనేంటో తెలిపి నా గమ్యానికి తెరచాపవై నిలిచావు(లే)!!


మరిచిపోయిన పాఠం గురుతు చేసావులే

పరీక్షలో నెగ్గేలా  నాకో రూపం ఇచ్చావులే

మరిచి పోను నేస్తమా నీ సాయం

నా చివరి శ్వాస వరకుఇక  నీవే నా ప్రాణం.!!


ప్రకృతి కీ  ప్రాణం పోసిన తొలికిరణం లా

నాలో తెగువకు ప్రాణం పోసావులే..!!

చరణం:-

*********

మనిషి ధర్మం మరచి

ధనమే సర్వస్వం అనుచు

స్నేహానికి సాయం  విడిచి

ద్రోహం చేస్తుంటే


కళ్ళుమూసుకున్నా  పెద్దరికం అవుతుందా

తప్పించుకునే దారులు వెతుకుట తప్పు కదా

తప్పు ఒప్పుల నిశిత పరిశీలన తెలిసిన అనుభవమా

నిజము వైపు నిలిచి సత్యం బతికించుమా !!


నిజానిజాల జీవన సారమే జీవిత సౌభాగ్యం

ప్రజా జీవన  సహకారమే సంతోషాలకు మూలం

మన గమనం మన గమ్యం సమతుల్యం

రేపటి భవితకు మన మిచ్చు ఐశ్వర్యం.!!


ప్రకృతి కి ప్రాణం పోసిన వేకువలా

నాలో తెగువకు జీవం పోసావులే.!!

చరణం:-

********

నీవు నేను  వేరను భావం ప్రగతికి అవరోదం

దారులు వేరైనా గమ్యం అగమ్యగోచరం

అంతా మనమనుకొని పదం కలిపి అడుగేసి చూడు

ఆనందం అంతా మన ఇంట  పూల వనమల్లే వికశించునులే !!


కల కాలం సాగేలా కలుపు చేయీ చేయి

కలుపు మొక్కలను  పీకివేయి

వటవృక్షమల్లే మీ వంశం నిలబడగలదు 

ఎందరికో నీడనే ఇవ్వగలదు

లోకమే వసుదైక కుటుంబమనీ చాటేది ఉమ్మడి కుటుంబాల వేదికలేను

సాదించిన  ఐక్యతా సాధికరత  సాగాలి ఏరువాకలా!!


ఈ సత్యం గ్రహించిన నిత్యం 

ఆనందం మన హృదయం.

అపుడే ఆరోగ్యం  మన  మా  నవజాతికి

ఆయుష్మాన్ భవ దీవెనలు!!


నీ దారిలో నడిచి ముళ్ళదారులన్ని

మల్లెల రహదారులుగా మార్చాను

ఎల్లలు లేని ఆనందానికి మార్గం చూపావు

కలలేని  తలపులకు హృదయం తలుపులు తెరిచావు

ఉషోదయం గా మార్చావు.!!


 ప్రకృతి కి ప్రాణం పోసిన తొలికిరణం లా

 నాలో వెలుగుల జ్ఞానం మేల్కొలిపావులే!!

************************************

ఆహాహా  ఆహా హాహా ఆహాహా..


**********

నేటి నా పాట పాట సంఖ్య:-561.

**********

రచన :- మహేష్ వూటుకూరి  ✍️

9640713717.

దోర్నాల.

28/02/2023.

*******

పాట సందర్భంపై నా విశ్లేషణ.

*********

సర్వేశ్వరుడైన ఈశ్వరుడి  సన్నిదానమే తన నివాసం కాగా  బసవేశ్వరుడు ఈశ్వరుని స్తుతిస్తు పాడుతున్న పాట. మనిషిగా పుట్టి ఋషిలా తపస్సు చేసి అల్పాయుష్కుడైన  వాడు చిరంజీవి గా ఈశ్వరుని చేత వరంపొంది కైలాసం లో పరమేశ్వరుని పాదాల చెంత ఉండు భాగ్యం పొంది ప్రధమ గణాలలో ముఖ్యుడిగా

 భాసిల్లుతోన్న నందీశ్వరుడి భక్తి పరవశం ఈ పాట.

***************

పల్లవి:-

***

భక్తి దారి చూపినా నా దేవరా  పరమేశ్వరా

ముక్తి ప్రసాదించి నీ దరికి  చేర్చుకున్నా విశ్వేశ్వరా!!


భక్తి దారి చూపినా నా దేవరా పరమేశ్వరా

ముక్తి ప్రసాదించి నీ దరికి నన్ను  చేర్చుకున్నా విశ్వేశ్వరా!!


భౌతిక బాధల వలయం ఛేదించగా 

నైతిక విలువల మార్గం పయనించగా

ఆత్మస్వరూపుడిగా  దేహభావం దహించగా

పంచాక్షరీ మంత్రం ఓంనమశ్శివాయ

ఓంనమశ్శివాయ ఓంనమశ్శివాయ


స్మరించిగా సమసిన అంతర్యుద్ధం

స్థితప్రజ్ఞతకు నీ ఆజ్ఞ దారిచూపెను  దయామయా

అజ్ఞానానంధకారం దహనమై

సుజ్ఞానం ఉదయించి నీ సన్నిదానం వరమాయే ఓంకారా..!!


పంచాక్షరీ మంత్రం అమితానందం

పరవశమైన ఈ తనువణువు పొందిన  ఆత్మనందం 

కర్మ నాశనం జన్మరాహిత్యం 

 నీ నామ స్మరణం ఓంనమశ్శివాయ ఓంనమశ్శివాయ!!


ఇది చాలులే ఇక ఏది వద్దులే

పంచక్షరి మంత్రం మించిని పంచభక్ష్యాలు

వుంటాయా ఈ సృష్టిలో సర్వేశ్వరాయ

సదాశివాయ ఓం నమశ్శివాయ!!


 భక్తి దారి చూపినా నా దేవరా పరమేశ్వరా!

చరణం:-

***

నీ ద్యాసలో  నీ నామ ద్యానం స్మరించగా

అణువణువునా విభూది గా సంతరించుకొని

నిశ్చలమే మనస్సున చేరి ఉషస్సు గా తాకింది

అచంచలమైన భక్తి ఊటా 

ఉప్పొంగెనులే గంగా ప్రవాహమై నా మది అణువణువునా ఆది శంకరా అనాధ రక్షకా

పరమేశ్వరా పాహిమాం పాహిమాం పరమాత్మా!!


అంతరంగాన భక్తి జ్యోతిని  వెలిగించినా

అంతులేని ఆనందం వైపు  అడుగులే వేయించినా

ముక్తి త్రోవ చూపినా

రక్తిపై మోహమే తుడిపేసినా

ముత్యమల్లే మెరిసేలా 

నా మనసును  మల్లెపూవులా మార్చేసినా

మల్లికార్జునా !!


నిను సేవించే భాగ్యం  ప్రసాదించినా నా తండ్రి

ఈశ్వరా మల్లేశ్వరా!!ఈశ్వరా పరమేశ్వరా !!


భక్తి దారి చూపినా దేవా పరమేశ్వరా

ముక్తి ప్రసాదించి నీ దరికి చేర్చుకున్నావయ్యా  దయాస్వరూపా!!

చరణం:-

***

నీ లీలామృతం త్రాగినానయా

కన్నీళ్ల కడలిని దాటినానయా 

లోకానికంతా ఆకలి  తొలగించే

వరమునే నొసగి నందిశ్వరుడిగా

బసవేశ్వరుడిగా నామకరణమే చేసి

భువిన నన్ను భూమాతకు తోడుగా

పంపి చరితార్దుడను చేసినావు చెన్న మల్లేశ్వరా!!


వందనమయ్యా విశ్వ విభుడా 

పార్వతీ వల్లభా పరమేశ్వరా!!


నీ సన్నిదిలో  నీ బంటుగా ఉంటు

నిను నిత్యం కొలిచే నన్ను  నీ నోట  మనసారా మహానందని పిలిపించుకొనుట   

మహాదానందం  మహితాత్మా

మహదానందం మహితాత్మా!!

పల్లవి:-

***

భక్తి దారిచూపినా దేవరా  పరమేశ్వరా

ముక్తి ప్రసాదించి నీ దరిన ఉండే వరమునే ప్రసాదించిన విశ్వేశ్వరా!!


అల్పాయుష్కుడను చిరంజీవి గా దీవించావు

అనంతమైన ఆనందుడిగా చరిత్రలోనే నిలిపావు

ప్రధమగణాలలోముఖ్యుడిగా చేసావు

నిత్యం నీ యందుండే లా   నిను స్పర్శించేలా   

నీ వాహనమై నా జన్మతరించే లా 

ఆదిదంపతులకు సేవలు చేయు భాగ్యమును నొసంగి  ఎవరికి దక్కని భాగ్యం నాకిచ్చినావు నంది వాహన నాగభూషణ 

వందనం వందనం వందనం ఓంనమశ్శివాయ!!


పరవశం నా అణువణువు

పావనం నా తనువు  

 కైలాసం నా నివాసం

పార్వతీ పరమేశ్వరులు కొలుచు ఈ జన్మం

పంచాక్షరీ మంత్రం  నా స్వర వీణా తంతువై

నిరంతరం  స్మరిస్తు చిరంజీవి గా నిలిచాను తండ్రి 

నీ సన్నిదిలో ఈ నంది..

ఓంనమశ్శివాయ ఓంనమశ్శివాయ ఓంనమశ్శివాయ!!

పల్లవి:-

****

భక్తి దారి చూపినా దేవరా పరమేశ్వరా

ముక్తి  ప్రసాదించిన నీ దరికి నన్ను చేర్చుకున్నా విశ్వేశ్వరా!!

*************

*****************************

నేటి నా పాట పాట సంఖ్య:-560.

******************************

 రచన :- మహేష్ వూటుకూరి  ✍️

9640713717.

దోర్నాల.

27/02/2023.

****************

పాట సందర్భంపై నా విశ్లేషణ.

***************************

ప్రేమ ఎలా మొగ్గ తొడుగుతుందో  అంతలోనే వాడి రాలిపోతుందో ఆ దేవుడికే తెలియాలి.

అతనిలో మంచిని గుర్తించిన ఓ అమ్మాయి అతనే తన సర్వస్వమని తలచి అతని వెంట పడుతుంది

 తీరా ప్రేమ చిగురించి  మొగ్గ తొడిగాక పరిస్థితులకు 

తలఒంచి  ప్రేమ నుంచి వైదొలగిన సమయంలో  ప్రేమే లోకమనుకున్న ప్రేమికుడు పిచ్చి వాడిలా తయారై దేవదాసుగా మారిపోతాడు  ఆమె ఓ పెద్దింటి కోడలై ఓ వారసుడితో కనిపిస్తుంది.  విధి నాటకంలో భాగమైన కాలం  ఇద్దరు తారసపడి గతంలోకి వెళ్ళి  కన్నీటి పర్యంతమవుతు   మనసుల మూగవేదన ఈ పాట.

*********************************************

 పల్లవి:-

******** 

మరిచావా మరిచావా ఓ ప్రేమా నన్ను మరిచావా

మరిచావా మరిచావా ఓ భామా నన్ను మరిచావా!!


మరిచావా మరిచావా ఓ ప్రేమా నన్ను మరిచావా!!


తొలిపొద్దు రాకముందే నా ముందు వాలేదానివే

తొలి కోడి కూయక ముందే నా తలుపు తట్టే దానివే

తొలి ముద్దు నాతో పంచుకొంటివే

తొలి సిగ్గు నాలో  చూసుకుంటివే!!


తొలిప్రేమ చిగురుల్లో కోయిలమ్మవై 

కుహ కుహ రాగం  పాడితివే

నెమలి వల్లే ఆడిపాడి కౌగిళ్ళ లో కరిగిపోతివే

అంతలోనే వింతగా మారిపోయి

అంతులేని ఆవేదనగామార్చి నను విడిచిపోతివే!!


మరిచావా మరిచావా ఓ ప్రేమ నన్ను మరిచావా

మరిచావా మరిచావా ఓ భామ నన్ను మరిచావా!!

చరణం:-1

********

ప్రేమించానంటు నా వెంటపడినావే

నా ప్రేమ కావాలంటు  పడిగాపులే కాసినావే!!

వద్దన్నా వినకుండా ప్రేమ లోకి దించినావే

నేనే నీవెంటపడేలా చేసుకున్నావే


ఇపుడేమో ఇలాచేసినావే

నమ్మించి మోసం చేసినావే.. !!

ఏమైపోయేదే నేను

ఎట్లాబ్రతీకేది నీవు లేకుండా నేను.!!

పల్లవి:-

********

మరిచావా మరిచావా ఓ ప్రేమ నన్ను మరిచావా!!

చరణం:-2

*******

దేవుడి ముడివేసిన ప్రేమను ఏ దయ్యం విడదీసిందే

ధర్మం తప్పిన ప్రేయసి నీవే విడమరచి చెప్పాలి

నన్ను ఏ మార్చి  చేసిన గాయం మజ్నులా  మార్చివేసిందే

శోకమైన దేహం సొమ్మసిల్లి పడిపోతే  పట్టుకున్నావా


గతమంతా గుర్తుకు రాలేదా  వర్తమానం కళ్ళుకప్పిందా

భవిష్యత్తు లేకుండా చేసి భావితరంతో భాసిల్లుతున్నావా

వాడిపోయి రాలిపోతున్నా పూ వనాన్ని చూసి జాలివేస్తుందా జాబిల్లి తోటకు!!


ఆశలన్నీ  ఆవిరైపోయి శ్వాస ఆగి పోతున్న సమయాన

 చూసిపోదామని వచ్చావా

చివరి క్షణాన వచ్చినావు  తులసి తీర్ధమే వేసి పోదువులే

 నా చివరి కోరికగా కనిపించినావులే

నీ తొలి ప్రేమకు  అంతిమ సంస్కారం చూసి పో చెలి

పల్లవి:-

*********

 మరిచావా మరిచావా ఓ ప్రేమ నన్ను మరిచావా

మరిచావా మరిచావా ఓ భామ నన్ను మరిచావా!!

షట్పదిగా రాజరాజీ 

==

రాజరాజీ షట్పది: UUI UUIU // UUI UUIU // UUI UUIU - UUIUU

==

బేలూరి శిల్పమ్మువా

పాలేటిపై నూర్మివా 

కాలాంబుదేంద్రాగ్నివా - కామాబ్జవల్లీ 

ఏలాసుగంధమ్ముతో 

లీలారవిందమ్ముతో 

బాలామణీ గాంచుమా - భామామతల్లీ 

==

సోమాగ్నిలో మండనా 

ధూమమ్ములో నుండనా 

నీమానసాభ్రమ్ములో - నేనేల లేనో 

ఈమేను నీదే గదా 

ప్రేమమ్ము నీవే గదా 

కామాగ్ని మండింతువా - కన్నీట నార్ప(న్) 

==

రాగాలతో హాసమా 

రోగాలతో వాసమా 

యీగాలిలో నేమియో - యీగాథ లేమో 

యీగుండెలో భారమే 

యీగుండె నిస్సారమే 

నాగమ్యమెందున్నదో - నాగమ్య మేమో

==

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

0 Co


 ఓం శ్రీ రాం - శ్రీ మాత్రేనమ:

(ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం ) 
 రచయత: మల్లాప్రగడ  శ్రీ దేవి రామకృష్ణ
నేటి రాధాకృష్ణ సరస గీతం 
విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ   

రాధానీ కల ఇదిగా -కృష్ణానీ కల ఇదిగా 
రాధానీ వలపులుగా - కృష్ణా నీ తలపులుగా 

నీమాయన్ బడితినిగా  
దాహమ్మున్ అడిగితిగాఁ 
నీ కాలమ్ ఇది కథగా   
దేహమ్మున్ వడి వడిగా 
  
రాధానీ కల ఇదిగా - కృష్ణానీ కల ఇదిగా 

నీకై కోర్కెలు మదిగా  
ప్రేమమ్మేగ కథలుగా  
నాకై తీర్పుగను మదిగా 
స్నేహమ్మే గ మనసుగా 

రాధానీ వలపులుగా - కృష్ణా నీ తలపులుగా 
   
లోకమ్మంతయు కనగా   
జీవంమ్మంతయు కలగా
నాకంమ్మంతయు మనగా 
ప్రేమమ్మంతయు కళగా

రాధానీ కల ఇదిగా - కృష్ణానీ కల ఇదిగా 

ఏకాంతమ్ము న నెలగా  
శ్రీ కాంచమ్మును వలగా
శ్రీ శాంతమ్ముయు నెలగా  
శ్రీ శాంతిత్వము వలగా

రాధానీ వలపులుగా - కృష్ణా నీ తలపులుగా 
     
ప్రేమాచ్ఛాదక మనగా 
దేహత్యాగము అనగా 
ప్రోత్యాహమ్ముయు యనగా 
ఉచ్చాహమ్ము యు అనగా 

రాధానీ కల ఇదిగా - కృష్ణానీ కల ఇదిగా 
రాధానీ వలపులుగా - కృష్ణా నీ తలపులుగా    
కృష్ణానీ కల ఇదిగా - రాధానీ కల ఇదిగా
కృష్ణా నీ తలపులుగా- రాధానీ వలపులుగా

ఆధారం: UU UII IIU

*****

నేటి కవిత - రాధాకృష్ణసరసగీతం  
విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ 

సమయమ్ము చేబట్టి .. సుఖమునే కోరినా
పంతమ్ము మానము ..ప్రణతు లివియే రాధా 

అతిగాను అనలేదు..అర్ధంబు తెలిపితీ
పరమార్ధమును తెల్సి ..పలుకు లివియె కృష్ణా 

మదిలో భావం అనంతం కృష్ణా 
అనంతాన్ని చేసుకోలేము అర్ధం 
అర్థంలోనే దాగి ఉంది పరమార్ధం 
పరమార్ధ భావాలే నిజమైన అర్ధం
  
సమయమ్ము చేబట్టి .. సుఖమునే కోరినా
పంతమ్ము మానము ..ప్రణతు లివియే రాధా 

అతిగాను అనలేదు..అర్ధంబు తెలిపితీ
పరమార్ధమును తెల్సి ..పలుకు లివియె కృష్ణా 

మనసు ఎప్పుడూ నలుగుతుంది రాధా 
కారణం ఇదేనని చెప్పనంటుంది 
సుఖదుఃఖం చుట్టూ తిరుగుతుంది   
ఎండా వాన చలికి మనసు పూస్తుంది 

ఇష్టమైన బ్రతుకు..ఇప్పుడూ ఎప్పుడూ
క్రమశిక్షణ తొ సాగు.. కనికరమ్మె రాధా 

నిర్ణయించు కొనునది.. నియమబధ్ధముగనే
ఓర్పుపరిశ్రమే ఒప్పు ప్రేమ కృష్ణా 

ఒకటికి ఒకటి  మన మమేకం  కృష్ణా 
మమేకం లోనే ఉన్నది ఏకత్వం 
ఏకత్వంలో ఉన్నది సృజనత్వం  
సృజనత్వమే కవితలో పటుత్వం

కేశములెన్నో చెప్పుట కష్టమే  రాధా 
తరంగాలెన్నో తెల్పుట కష్టమే   
మనసు అంతరంగాలు తెలుపుట కష్టమే 
కావ్యాలను గగన చుక్కలను తెల్పుట కష్టమే 
 
సమయమ్ము చేబట్టి .. సుఖమునే కోరినా
పంతమ్ము మానము ..ప్రణతు లివియే రాధా 
అతిగాను అనలేదు..అర్ధంబు తెలిపితీ
పరమార్ధమును తెల్సి ..పలుకు లివియె కృష్ణా 

ఇష్టమైన బ్రతుకు..ఇప్పుడూ ఎప్పుడూ
క్రమశిక్షణ తొ సాగు.. కనికరమ్మె రాధా 

నిర్ణయించు కొనునది.. నియమబధ్ధముగనే
ఓర్పుపరిశ్రమే ఒప్పు ప్రేమ కృష్ణా 


నేటి రాధాకృష్ణ సరసగీతం - 03-02-2022
ప్రాంజలి ప్రభ -- మల్లాప్రగడ రామకృష్ణ 

హృదయమనే కోవెలలో నిదురించే రాధా 
వయసు ఉడుకు తగ్గించే ముద్దుల కృష్ణా  
మనసుతోను మధురాన్ని పంచేటి రాధా 
మగువల మనసునే దోచేటి ముద్దుల కృష్ణా 

ఎకసెక్కె ములు ఏల..ఏది ఎందాకనో
అందాక కులుకులే .. అరిగి నాను రాధా 

తైతక్క లాటలు.. తక్కువ అనగ లేను
విశ్వాస పలుకులు..విజయ మగును కృష్ణా 

మనసుతోను మధురాన్ని పంచేటి రాధా 
మగువల మనసునే దోచేటి ముద్దుల కృష్ణా 

నొప్పింత లేకుండ ..నొప్పింత రాకుండ
మనసునొప్పింపక..మనుగడగను రాధా 

ఆర్భాటములు లేవు..అంతరములు లేవు
ఆలుమగలు గాను బ్రతక వలెను కృష్ణా 

హృదయమనే కోవెలలో నిదురించే రాధా 
వయసు ఉడుకు తగ్గించే ముద్దుల కృష్ణా  

ప్రేమయే మనకిక.. ప్రేమయే శ్రధ్ధగా
శ్రద్ధకలిగెనేని .. శుభము మనకు రాధా 

సులభసాధ్యముప్రేమ...సుమధురమ్ముగ ప్రేమ
సర్వసృష్టికి సమయ మేను కృష్ణా 

హృదయమనే కోవెలలో నిదురించే రాధా 
వయసు ఉడుకు తగ్గించే ముద్దుల కృష్ణా  
వినుడునాదు పలుకు విశ్వసించు ము ప్రేమ
దెలియవచ్చెటి మేలు దెలుపు ప్రేమ రాధా 

అడిగిన తలపున..ఆదరముయు ప్రేమ
అలుకలేని సుఖము.. అందు ప్రేమ కృష్ణా 
మనసుతోను మధురాన్ని పంచేటి రాధా 
మగువల మనసునే దోచేటి ముద్దుల కృష్ణా 

హృదయమనే కోవెలలో నిదురించే రాధా 
వయసు ఉడుకు తగ్గించే ముద్దుల కృష్ణా  
మనసుతోను మధురాన్ని పంచేటి రాధా 
మగువల మనసునే దోచేటి ముద్దుల కృష్ణా 

నేటి రాధాకృష్ణ సరసగీతం - ప్రాంజలి ప్రభ  
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 

పరవశించే మనసు పలికే
తనువుపై చెమట చిలికే
శృతిలయలు పెదవులపై వనికే 
మధుర క్షణాల్లో మాటలు అలికే 

గడిచిన ప్రతి క్షణము గమ్య మయ్యె 
ఉదయ భానుకర్తవ్యమే ఊత మయ్యె
కళ్ళ ముందట ఆయుధం కావ్య మయ్యె
చేష్ట లన్నియు నిజముయే చెంత కృష్ణా      

పరవశించే మనసు పలికే
తనువుపై చెమట చిలికే
శృతిలయలు పెదవులపై వనికే

ఆశల గొడుగు చేరకు ఆట లాగ  
ఆశ తలుపు తట్టకు నిరాశ యేగ 
అలసిన మనసు లో వేట లాగ
గెలుపు ఓటమి లాగానె గొలుసు రాధా 

పరవశించే మనసు పలికే
తనువుపై చెమట చిలికే
శృతిలయలు పెదవులపై వనికే 
మధుర క్షణాల్లో మాటలు అలికే 

లాలి పాటతో కమ్మగా జాలి ఆట 
గాలి వాటమై బ్రతుకుయే కాలి బాట 
మాలి లాగానే జీవితం మేలి మాట 
రాలి పొయేటి ఆకుయే రవ్వ వెల్గు కృష్ణా 

పరవశించే మనసు పలికే
తనువుపై చెమట చిలికే
శృతిలయలు పెదవులపై వనికే 

వెన్నెల కురిసే రాత్రుల్ని వేడు కొనుచు 
మంచు కప్పిన కాలము మనసు అనుచు  
తరువులకు ఉన్న పుష్పాలు తపన యనుచు  
లేత ఆకులు వలననే నీవు రాధా 

పరవశించే మనసు పలికే
తనువుపై చెమట చిలికే
శృతిలయలు పెదవులపై వనికే 

--((()))--


నేటి రాధాకృష్ణ సరస గీతం- ప్రాంజలి ప్రభ 
విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ  
02-02-2022

సానుకూలము ఇదియే 
తనువునే సంగ్రహించు కృష్ణా --- 2 
సామర్ధ్యము చూపావు లే 
నీపై విశ్వాసమంది రాధా   --- 2 

చలిపులి పిలిచింది చర్మంబు పగిలింది
మంచునే కురిపించి మాటు వేసె రాధా 

చల్లగాలి యె పెర్గి చపలచిత్తము ఆయె
మత్తును పెంచియు మమత కోరె కృష్ణా 

కలలాయె బత్కు.. కలకాల మేలు. 
కిలరావ మయ్యె కీర్తి బతుకే రాధ

విలలాప సేవ.వెలలాగ చిందు. .
వలలాగ జిక్కి వృధ్ధి బతుకే. కృష్ణా

చలిలోన వచ్చాను చక్కని చుక్కను
వెచ్చపర్చు మిపుడే వేగ మల్లె రాధా  ---2

కౌగిలి అందించు కరములు బందించు
సౌఖ్యముయే నీకు సుఖము నాకు కృష్ణా ---2

అలకాయె నీవు  అలనాడు మాట. 
అందుకేది చెప్పి ప్రీతి బతుకే కృష్ణా

జలకాలు ఆడి.జిలికేను మేలు 
చలిలాగ వేడు శాంతి బతుకే  రాధా

మోదము లేదని మైకము లేదని
వినుము తీరు ఇదియు వింత కాదు కృష్ణా 

ఖేదము లేదని భేదము లేదని
అన్నమాట ఇదియు ఆశ కాదు రాధా 

గరికపైవొదిగాను విశ్రాంతి తీరు వేళ
మత్తుగావిని పించుము గాన లీల కృష్ణా 

అణువణువు నిండిన ప్రణవం ఆత్ర హేళ
నువ్వు అడుగంట ని ప్రమ నమ్మె లీల రాధా 

విలలాప సేవ వెలలాగ చిందు.
వలలాగ జిక్కి వృధ్ధి బతుకే కృష్ణా

చలిపులి పిలిచింది చర్మంబు పగిలింది
మంచునే కురిపించి మాటు వేసె రాధా 

సానుకూలము ఇదియే 
తనువునే సంగ్రహించు కృష్ణా --- 2 
సామర్ధ్యము చూపావు లే 
నీపై విశ్వాసమంది రాధా   --- 2 

*****

నేటి రాధ కృష్ణ సరస గీతం - ప్రాంజలి ప్రభ 
విధేయుడు ।మల్లాప్రగడ రామకృష్ణ -- 02-02-2022

ఉదయ వెలుగులు కమ్మె నాలో 
హృదయ భావాలు చిమ్మె నీలో ---2

ప్రకృతి ప్రభావము కమ్మె  నాలో   
ప్రకృతిఁ ప్రాభవం  చిమ్మె నీలో -- 2

సాగి పోయేను కాల గమన మేను 
కాగి పోయేను ప్రేమ గమన మేను 
వేగి పోయేను సేవ గమన మేను
యోగి అయ్యేను ధర్మ గమన మేను 

ఉదయ వెలుగులు కమ్మె నాలో 
హృదయ భావాలు చిమ్మె నీలో ---2

కాలమే దేహంతొ ఆడుతుంది  
ప్రేమయే దాహంతొ పాడుతుంది 
ద్వేషమే కోపంతొ  చేరుతుంది   
స్వేశ్చయె స్నేహంతొ మాయమైంది
 
ప్రకృతి ప్రభావము కమ్మె  నాలో   
ప్రకృతిఁ ప్రాభవం  చిమ్మె నీలో---2

పువ్వుల వసంతం చిమ్ముతుంది 
కొవ్వులు హేమంతం కమ్ముతుంది 
నవ్వుల శ్రీమంతం ప్రేమిస్తుంది 
మువ్వల శ్రీ శబ్దం  హృద్యమైంది
 
ఉదయ వెలుగులు కమ్మె నాలో 
హృదయ భావాలు చిమ్మె నీలో --2 

గతకాలపు తలుపులు తెరిచి
భవిష్యత్తుకు సహకారం అందించి 
ప్రకృతితో పరిమళాలు పొంది 
అక్షరసాహిత్యం బ్రతుకౌతుంది 

ఉదయ వెలుగులు కమ్మె నాలో 
హృదయ భావాలు చిమ్మె నీలో ---2

ప్రకృతి ప్రభావము కమ్మె  నాలో   
ప్రకృతిఁ ప్రాభవం  చిమ్మె నీలో
******


నేటి రాధాకృష్ణ సరస పద్యం 
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ  

శ్వాసలో శ్వాసనైతిని కృష్ణా    
ప్రాణములొ ప్రాణమైతివి రాధా  
ఊపిరిలొ ఊపిరైతిని  కృష్ణా
జీవములొ జీవమైతివి రాధా

పువ్వు హృదయంలొ నెత్తురు పూలు విచ్చె 
దాహముతొ రసజ్వలితమై దేహ మిచ్చె రాధా 

వెచ్చగా విచ్చుకున్నను వేడి నిచ్చె 
మమత చెక్కిళ్ళు చల్లారె మనసు నిచ్చె కృష్ణా 

శ్వాసలో శ్వాసనైతిని కృష్ణా 
ప్రాణములొ ప్రాణమైతివి రాధా
ఊపిరిలొ ఊపిరైతిని కృష్ణా 
జీవములొ జీవమైతివి రాధా

ఎఱ్ఱనిపెదాలు మధువునే పెదవి కిచ్చె 
స్పర్శతో ఒళ్ళంతా వేడి సెగలు చొచ్చె రాధా 

వేడి నెత్తురు తీగలై వేగ మొచ్చె 
చేతులబిగింపు లోచల్లఁ చేయ నిచ్చె కృష్ణా 

శ్వాసలో శ్వాసనైతివి   రాధా
ప్రాణములొ ప్రాణమైతిని కృష్ణా  
ఊపిరిలొ ఊపిరైతివి  రాధా
జీవములొ జీవమైతిని కృష్ణా
  
మెత్తటినున్నటి దేహము మత్తు పెంచె 
దేహముచితకే చల్లార్చె దృతియు నెంచె రాధా 

ప్రతిభ సాన్నిధ్య సాయుజ్య ప్రేమ నుంచె 
వేళ్ళు మీటి ప్రకంపన వేగా పరిచె కృష్ణా 
      
శ్వాసలో శ్వాసనైతివి   రాధా
ప్రాణములొ ప్రాణమైతిని  కృష్ణా
ఊపిరిలొ ఊపిరైతివి రాధా
జీవములొ జీవమైతిని కృష్ణా

*****
   
నేటి రాధాకృష్ణ సరస గీతం 
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ  

ఒ ఓ రాధ నీవు   ఒ ఓ కృష్ణ నేను  
ఒ ఓ కృష్ణ నేను ఒ ఓ రాధ నీవు   
ఒ ఓ రాధ నీవు   ఒ ఓ కృష్ణ నేను  
ఒ ఓ కృష్ణ నేను ఒ ఓ రాధ నీవు   

ప్రవేశమ్ము నీది ప్రయాణమ్ము నాది   
ప్రమాణమ్ము ఇచ్చి ప్రయాణంబు చేసె  
ప్రశంసించు దాన బ్రదీపించు దాన
మమైకమ్ము దాన మాదియమ్ము దాన 

ఒ ఓ రాధ నీవు   ఒ ఓ కృష్ణ నేను  
ఒ ఓ కృష్ణ నేను ఒ ఓ రాధ నీవు   

ప్రదానమ్ము లేదు ప్రమేయమ్ము లేదు 
ప్రసాదమ్ము లేదు ప్రమోదమ్ము లేదు 
ప్రపంచమ్ము లేదు ప్రకోపమ్ములేదు 
ప్రభావము లేదు ప్రవేశమ్ము లేదు 

ఒ ఓ రాధ నీవు   ఒ ఓ కృష్ణ నేను  
ఒ ఓ కృష్ణ నేను ఒ ఓ రాధ నీవు   

హుషారైన దాన సుమారైన దాన 
ఖరీ దైన దాన  ఖర్చేకాని దాన 
యసామాన్య దాన యమోఘంపు దాన 
సువాసమ్ము దాన సుదేహమ్ము దాన 

ఒ ఓ రాధ నీవు   ఒ ఓ కృష్ణ నేను  
ఒ ఓ కృష్ణ నేను ఒ ఓ రాధ నీవు   

మమేకమ్ముఁ రక్తి మనోమాయ సూక్తి 
సహాయమ్ము సూక్తి సమాధాన యుక్తి 
వినోదమ్ము యుక్తి వివాదమ్ము శక్తి 
విశేషంపు శక్తి విశాలంపు దృష్టి 

ఒ ఓ రాధ నీవు   ఒ ఓ కృష్ణ నేను  
ఒ ఓ కృష్ణ నేను ఒ ఓ రాధ నీవు   
 
ప్రధానమ్ము గాను ప్రకాశమ్ము  గాను 
నిదానమ్ము గాను విధానమ్ము  మౌను  
సదానందమౌను సదాసౌఖ్య మౌను 
ముదా వెల్గు నౌను ముదాస్పర్శ నేను  

ఒ ఓ రాధ నీవు   ఒ ఓ కృష్ణ నేను  
ఒ ఓ కృష్ణ నేను ఒ ఓ రాధ నీవు   
ఒ ఓ రాధ నీవు   ఒ ఓ కృష్ణ నేను  
ఒ ఓ కృష్ణ నేను ఒ ఓ రాధ నీవు   

*****
ఆధారం : గణములు - య,జ,య,జ యతి- 7


నేటి సరసమైన గీతం 
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 

నవ్వుల కొవ్వుల రాజా, అందుకోవా కాజా 
పువ్వుల యవ్వని రాణి, పొందుకోరి పూజా 
ఒక్కసారి విను, ఒకే  ఒక్కమాట విను 
వంత పల్కుతావా, వద్దు వద్దంటావా 

నీలి కన్నుల మెరుపు నవుతా
కాలి శింజిని  పిలుపు నవుతా
జాలి హాసిని  గెలుపు నవుతా
మెలి మోహిని వలపు నవుతా 

ఒక్కసారి విను, ఒకే  ఒక్కమాట విను 
వంత పల్కుతావా, వద్దు వద్దంటావా 

పరవ సింపచేసే పెదవి నీకె   
తళుకు లొలికే కంటిపాపలు నీకె 
చెక్కిలికి మైమరపించే ముద్దు నీకె   
నాదు తలపుల కుదుపు అంత నీకె    

ఒక్కసారి విను, ఒకే  ఒక్కమాట విను 
వంత పల్కుతావా, వద్దు వద్దంటావా 

పలకరిస్తే వలపుల తలుపునె  
ఎదలో  అలజడి అలలనె 
తనువు పులకల వలపునె 
నీకు మేలును చేసే మలపునె 

ఒక్కసారి విను, ఒకే  ఒక్కమాట విను 
వంత పల్కుతావా, వద్దు వద్దంటావా 
 
చంద్రకాంతిని ప్రతిఫలింప చేస్తా 
నీలికన్నుల నాట్యాన్ని చేసి చూపిస్తా 
తమలపాకుల మడుపు కిల్లి అందిస్తా  
నిరాశలను తరిమి అసలు నింపేస్తా 

నవ్వుల కొవ్వుల రాజా, అందుకోవా కాజా 
పువ్వుల యవ్వని రాణి, పొందుకోరి పూజా 
ఒక్కసారి విను, ఒకే  ఒక్కమాట విను 
వంత పల్కుతావా, వద్దు వద్దంటావా 
   
ఎత్తుకు పై ఎత్తులు ఎందుకే 
ఎంతైనా మత్తుకు చిత్తవుటే 
అంత తొందర నీకు ఎందుకే 
ముందొచ్చేది మనువాడే పండగే 

నవ్వుల పువ్వుల రాణి నాజూకుగా ఇస్తావా కాజా 
యవ్వన మగధీరుడిని పొందుకోరి పూజా
ఒక్కసారి విను, ఒకే  ఒక్కమాట విను 
వంత పల్కుతావా, వద్దు వద్దంటావా 

అంతే లే నామాటవినరు నీమాట వినాలంటారు 
తొలకరి చినుకులా వచ్చి తైపీ తడిపి పోతుంటారు  
ఒక్కసారి విను, ఒకే  ఒక్కమాట విను 
వంత పల్కుతావా, వద్దు వద్దంటావా 

అవునులే మనమధ్య మాటల యుద్ధం వద్దులే 
అవునులే మనమధ్య మాటల యుద్ధం వద్దులే 
అవునులే మనమధ్య మాటల యుద్ధం వద్దులే 

--(()))--

నేటి సాహిత్య గీతం 
మల్లాప్రగడ రామకృష్ణ 

మనసు కోరె-- పాఠము ఏదో
శాంతి పల్కు - గెలుపు నవుతా 
వయసు కోరె  - మోక్షము ఏదో 
కాంతి పల్కు -  దాహము నవుతా 

మనిషి నీవె-- మాటలు నీవే 
మనసు నీదె -- మార్గము నీవే 
ఇలా వుంటె --ఇచ్ఛా ఏలా
ఇలా ఉంటె --ఇచ్ఛా ఏలా

తనువు మాటు-- దాగు పాఠమే
అణువు చోటు --- కాగు పాఠమే 
క్షణము నోటు -- వేగు పాఠమే 
మనిషి నాటు -- మాగు పాఠమే 

మనిషి నీవె--- మాటలు నీవే 
మనసు నీదె -- మార్గము నీవే 
ఇలా వుంటె --ఇచ్ఛా ఏలా
ఇలా ఉంటె ---ఇచ్ఛా ఏలా

చిరిగిన ప్యాంటు --- చిన్నది చొక్కా
చేతిలో సెల్లు---చెవులకు జోడే
మాసిన గడ్డం--- చింపిరి జుట్టే
శరణము చెప్పే -- ప్రేమ పాఠమే

మనసు కోరె-- పాఠము ఏదో
శాంతి పల్కు - గెలుపు నవుతా 
వయసు కోరె  - మోక్షము ఏదో 
కాంతి పల్కు -  దాహము నవుతా 

రాణి పల్కిన -- మధువు గుండెలొ 
వాణి పల్కిన -- చదువు గుండెలొ 
బోణి చిల్కిన -- పొదుపు గుండెలొ 
ప్రాణి చిల్కిన -- ప్రేమ పాఠమే

మనసు కోరె-- పాఠము ఏదో
శాంతి పల్కు - గెలుపు నవుతా 
వయసు కోరె  - మోక్షము ఏదో 
కాంతి పల్కు -  దాహము నవుతా 

ప్రణయ మిదే--- ప్రణతివి నీవే
తృణము ఇదే--- థలుకులు నీవే
ప్రణయములో--- భధికుడ నీవే
ప్రణయ మిదియు--- ప్రధమ పాఠమే
   
మనిషి నీవె--- మాటలు నీవే 
మనసు నీదె -- మార్గము నీవే 
ఇలా వుంటె --ఇచ్ఛా ఏలా
ఇలా ఉంటె ---ఇచ్ఛా ఏలా

*****


నేటి ఛందస్సు గీతం 
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 

తరుణము చిలికిన చిలిపి ఊహలకు
శరణము తెలిపిన మెదిలె భావముకు
అనుభవ భావాలు తెలిపి బ్రతుకుటకు  
మనసుతొ చేసే ముప్పు ఒప్పు తెలుపుటకు  

ఓచెలి నామాట వినుము నన్ను నమ్ముము 
నే చెప్పేది వేద వాక్కు కాదు పేమవాక్కే 
నే చెప్పేది వేద వాక్కు కాదు పేమవాక్కే 

నలుగురు నడిచేది  - నమ్మకమైన పలుకు 
దేహము భద్రముకే  - దేశమందు 
పదుగురు పలుకేది  - పదవీవ్యామోహమే 
వేద మంత్రముయేను - వేల్పు లందు 

ఓచెలి నామాట వినుము నన్ను నమ్ముము 
నే చెప్పేది వేద వాక్కు కాదు పేమవాక్కే 
నే చెప్పేది వేద వాక్కు కాదు పేమవాక్కే 
 
చెడుగుడు పలికేను - చేతసత్తువవులే 
 ప్రేమ సూత్రము యేను -- ప్రేమ పొందు 
తనమన మనసేను - తపనల భావాలె 
భార్య మార్గము యేను - భాగ్యమందు 

ఓచెలి నామాట వినుము నన్ను నమ్ముము 
నే చెప్పేది వేద వాక్కు కాదు పేమవాక్కే 
నే చెప్పేది వేద వాక్కు కాదు పేమవాక్కే 

తొలి బుడి అడుగులే - తొందర పలుకులే  
పడిలేచుట యగుటే - పెదవి నందు 
సమయము పలుకేను - సమరము శాంతియే 
తల్లితండ్రుల మాట - త్యాగ మందు 

ఓచెలి నామాట వినుము నన్ను నమ్ముము 
నే చెప్పేది వేద వాక్కు కాదు పేమవాక్కే 
నే చెప్పేది వేద వాక్కు కాదు పేమవాక్కే 

తొలకరి చినుకులు - తపనలు పెంచుటే 
పడి పారుట యగుటే - పడతి నందు 
మమతను పంచేది - మనసును ఇచ్చేది  
తల్లియే తెలిపెను - తృప్తె మందు  

తరుణము చిలికిన చిలిపి ఊహలకు
శరణము తెలిపిన మెదిలె భావముకు
అనుభవ భావాలు తెలిపి బ్రతుకుటకు  
మనసుతొ చేసే ముప్పు ఒప్పు తెలుపుటకు  

ఓచెలి నామాట వినుము నన్ను నమ్ముము 
నే చెప్పేది వేద వాక్కు కాదు పేమవాక్కే 
నే చెప్పేది వేద వాక్కు కాదు పేమవాక్కే 
  
****


 నేటి సాహిత్య గీతం  - కలువలు- ప్రాంజలి ప్రభ  
 30-01-2022 - మల్లాప్రగడ రామకృష్ణ 

అబ్బో అబ్బో అబ్బో ఏమి ఏమి నటనా  
లాలసులనే రంజిల్లాపరిచే నటనా  
లాలసులనే రంజిల్లాపరిచే నటనా

కలువలు పూజ లాలసులకే కు అనకు  
ముడుపులు దైవ లాలసులకే అనకు   
మకుటము రాజ లాలసులకే అనకు   
సకటము బద్ద లాలసులకే అనకు 
   
కర్మాను సారము కలిగే ఫలితమే 
ఆనంద మందరికీ  అద్భుతమే
అబ్బో అబ్బో అబ్బో ఏమి ఏమి నటనా  
లాలసులనే రంజిల్లాపరిచే నటనా  
   
కపటము మోస లాలసులకే అనకు 
నటనము హాస్యలాలసులకే అనకు 
జపమును మౌన లాలసులకే అనకు 
తపమును మోక్ష లాలసులకే అనకు 
 
కృషితో నాస్తి అని తెలిపే నటనా 
మౌన హాస్య మోక్ష మాయ లాలసుల నటనా     
అబ్బో అబ్బో అబ్బో ఏమి ఏమి నటనా  
లాలసులనే రంజిల్లాపరిచే నటనా  

ధనమును సత్య లాలసులకే అనకు  
గుణమును మంచి లాలసులకే అనకు
గ తియును ధర్మ లాలసులకే   అనకు
మతియును న్యాయ లాలసులకే అనకు

న్యాయ ధర్మ సత్య మాయ లాలసల నటనా  
అబ్బో అబ్బో అబ్బో ఏమి ఏమి నటనా  
లాలసులనే రంజిల్లాపరిచే నటనా  
 
తలపులు ప్రేమలాలసులకే అనకు 
గడువులు అప్పులాలసులకే అనకు
పదవులు భోగలాలసులకే  అనకు
చదువులు విద్యలాలసులకే అనకు

ప్రేమ భోగవిద్య మాయ లాలసల నటనా 
అబ్బో అబ్బో అబ్బో ఏమి ఏమి నటనా  
లాలసులనే రంజిల్లాపరిచే నటనా  

--((*))--


ప్రాంజలి ప్రభ - సరస గీతం -29-01-2022

ఉన్న దాన్ని చూడరా, ముద్దునిచ్చి పిలవరా 
కళలు తీర్చు మదియెరా,  కలలు తీర్చు మదియెరా,
అవునా 
 
తొలి బుడి అడుగులు పడిలేచె  
తొలకరి చినుకులు  పడి లేచె 
తడిపొడి పలుకులు మది దోచె  
మగసిరి కులుకులు శివపెంచె  

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ 
ఉన్న దాన్ని చూడరా, ముద్దునిచ్చి పిలవరా 
కళలు తీర్చు మదియెరా, కలలు తీర్చు మదియెరా, అవునా 
 
తరుణము చిలికిన చలిపెంచె  
శరణము తెలిపిన మదినెంచె  
చరణపు పలుకులు కులుకుంచె  
కరుణతొ బిగువును సరియంచె  

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ 
ఉన్న దాన్ని చూడరా ముద్దునిచ్చి పిలవరా 
కళలు తీర్చు మదియెరా, కలలు తీర్చు మదియెరా, అవునా 

తడబడి కనుగొని చెలి వచ్చె  
అనుభవ తెలిపియు పస పంచె 
మనసుతొ కనుగొని వలపించె  
మమతను తెలిపియు మదినుంచె 

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ 
ఉన్న దాన్ని చూడరా ముద్దునిచ్చి పిలవరా 
కళలు తీర్చు మదియెరా, కలలు తీర్చు మదియెరా, అవునా 

విలువలు నడవడి జగతిచ్చె  
మనసు మగువకు గడబిడిచ్చె 
తరుణము చిలికెడి పలుకిచ్చె  
వినయపు చినుకులు చలినిచ్చె  

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ 
ఉన్న దాన్ని చూడరా ముద్దునిచ్చి పిలవరా 
కలలు తీర్చు మదియెరా అవునా 

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ 
అవునే ఉన్నది సుఖమే అయ్యెరా 
కలలను తీర్చే మగధీరునురా 
నీకుతోడు నేను, నాకుతోడు నీవెరా  

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
అవునే ఉన్నది సుఖమే అయ్యెరా 
కలలను తీర్చే మగధీరునురా 
నీకుతోడు నేను, నాకుతోడు నీవెరా  

--(())--

నేటి ఛందస్సు గీతం - 28-01-2022
విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ  

నినునమ్మితి నామనోహరా
ననుపాలింపగ రమ్ము నాదొరా  
మనసంతయు నీకునామొరా 
వినిపించేదను ప్రార్ధనమ్మె రా      
అణువంతయు శాంతి ఇమ్మురా 

వరమియ్యుము రామచంద్రమూర్తీ 
మురిపించేమది మోహనాబ్ధిమూర్తీ
తరుణమ్ముయు వచ్చి పొమ్ము మూర్తీ
శరణమ్మే ఇది  సత్య ధర్మ మూర్తీ 

నినునమ్మితి నామనోహరా
ననుపాలింపగ రమ్ము నాదొరా  
మనసంతయు నీకు నామొరా 
 
చిరుహాసము చేత కాదు మూర్తీ 
మరిజాగేందుకు మౌనమేల మూర్తీ 
దరిజేరుము  ధర్మ సౌర్య మూర్తీ 
కరుణమ్మే ఇక కామ్య దాత మూర్తీ 

మనసంతయు నీకు నామొరా 
వినిపించేదను ప్రార్ధనమ్మె రా      
అణువంతయు శాంతి ఇమ్మురా 
 
అరుణోదయ మయ్యె తేజొ మూర్తీ 
తరుణంమంతయు దేహ తృప్తి మూర్తీ 
హరినామము హాయి నిచ్చు మూర్తీ  
సిరిమువ్వే నువు సర్వ రక్ష మూర్తీ 

నినునమ్మితి నామనోహరా
ననుపాలింపగ రమ్ము నాదొరా  
మనసంతయు నీకునామొరా 

చెరణాలను చేరినాము మూర్తీ  
చిరునవ్వేమియు మమ్ముచూసి మూర్తీ 
వరమాలతొ వందనమ్ము మూర్తీ
సరిలేరెవ్వరు సామదాన మూర్తీ  

నినునమ్మితి నామనోహరా
ననుపాలింపగ రమ్ము నాదొరా  
మనసంతయు నీకునామొరా 
వినిపించేదను ప్రార్ధనమ్మె రా      
అణువంతయు శాంతి ఇమ్మురా 

ఆధారం : IIUII - UIUI UU / IIU UII - UIUI UU
****
 

నేటి సాహిత్య గీతం 
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 

యువత ప్రాయము విలువ ఎంతోమేలు 
చెపుతా విను ఆకర్షణ కు లొంగకుంటేమీలు  

తెలిసీ తెలియని యవ్వనప్రాయము
మనసే పరుగులు ఆశతొ ప్రాయము
తనువే తపనల సేవల ప్రాయము

నిత్య గలాబి పువ్వు గుభాలింపు ఆకర్షణ లే
నిత్య వినోద నటన కళాకారి ఆకర్షణ లే
నిత్య మదీయ మమత శుభంకారి ఆకర్షణ లే
నిత్య మనోమయ జ్ఞాన విజ్ఞాన ఆకర్షణ లే

తెలిసీ తెలియని యవ్వనప్రాయము
మనసే పరుగులు ఆశతొ ప్రాయము
తనువే తపనల సేవల ప్రాయము

సమయ సర్వలోకాల సంపదాకర్షణ లే
సమయ ధర్మపీఠాల బోధనాకర్షణ లే
సమయ జన్మభావల పోషణాకర్షణ లే
సమయ అమ్మతత్వ ఉషోదయాకర్షణ లే

తెలిసీ తెలియని యవ్వనప్రాయము
మనసే పరుగులు ఆశతొ ప్రాయము
తనువే తపనల సేవల ప్రాయము

పచ్చని నవ్వు పూదోట పువ్వు హృదయాకర్షణలే 
వెచ్చని కడలి వేన్నీళ్లు తపము చలియాకర్షణ లే
నచ్చిన పిలుపు కన్నీళ్లు నదులు మగువాకర్షణ లే
మెచ్చిన మనసు ఇల్లాలు కొరకు సుఖమాకర్షణ లే

తెలిసీ తెలియని యవ్వనప్రాయము
మనసే పరుగులు ఆశతొ ప్రాయము
తనువే తపనల సేవల ప్రాయము

అక్కర వయసు కొచ్చిన పడచు చుట్టమాకర్షణ లే
చెక్కర తీపి పాకము పాల  కోవకాకర్షణ లే
ముక్కెర పడచు ముక్కుతొ మెఱుపు  నాట్యమాకర్షణ లే
మక్కువ చూపె కొద్దియు మగువ మనస్సె ఆకర్షణ లే

తెలిసీ తెలియని యవ్వనప్రాయము
మనసే పరుగులు ఆశతొ ప్రాయము
తనువే తపనల సేవల ప్రాయము

యువతా ప్రాయము విలువ ఎంతోమేలు 
చెపుతా విను ఆకర్షణ కు లొంగకుంటేమీలు 

--(())--


ప్రాంజలి ప్రభ - నేటి గీతం - 28-01-2022
విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ 

రామ జపము రామ అనుచు నున్న 
లంక నంత శబ్ద మయ్యె అచట
హనుమ చెట్టు దిగియు చెంత చేరె 
వినయ పూర్వ వందనములు తెల్పె    

రామ రామ రామ అనుచు రామ భక్త హనుమ
శోక మున్న సీత చూసి మనసు విప్పి తెల్పె హనుమ 

క్షేమ మమ్మ క్షేమ మమ్మ  మీకు  
భూమి తనయ వేగ వినుమ మాట    
భూమి పతియు వేగుచుండె గాన 
భూమి లోన వేగ మతము పెరిగె    

భూమిలోన వేఱు లేరు మీరు      
ప్రేమమయులు కాన  వచ్చె మాకు      
రామలక్ష్మణులు నిజాన ప్రేమ
హృదయు తోను హృదయ మంత తెలిపె  

రామ రామ రామ అనుచు రామ భక్త హనుమ
శోక మున్న సీత చూసి మనసు విప్పి తెల్పె హనుమ 
 
ప్రేమహృదయులైన కపులు మీరు       
రామచంద్రు డాన తీయ చుండె        
సామ దాన క్షేమ కోరు వారు
కామితార్థ మొంద కపులు వీరు 
 
స్వామి సరస పోరు వేగ మయ్యె  
వేగ మంటు వత్తు వానరలులె        
జాగు సేయ జాము రమ్మ వారు       
మూగ బాధ తొలగు బ్రదుకు నీకు   

రామ రామ రామ అనుచు రామ భక్త హనుమ
శోక మున్న సీత చూసి మనసు విప్పి తెల్పె హనుమ 

బాగు పడును గాను పదిల మనెను        
బాగు పడదు భాధ అనెటి సేవ    
యోగ మొందు యోగి  రాజ్య లక్ష్మి    
రాగ మది ముఖారి యగును కలత 

మాను అనక మాన సమ్ము ఉండు         
కలత మాను కళలు మమ్మ యిపుడు     
కలుగు మంచి కలత పుడమి కెపుడు    
వెలయు రామచంద్ర మూర్తి చేరి 

రామ రామ రామ అనుచు రామ భక్త హనుమ
శోక మున్న సీత చూసి మనసు విప్పి తెల్పె హనుమ 

నిలువ గాను నియమ మనుచు నుండె           
నిలువ రామమూర్తి యండ మనము      
తొలగు దుష్ట రావణుండు  ఇకను     
యిలను రాలు మ్రుత్యు వోలె ఇపుడు   

అంగనామణీ యనుంగు మెరుపు 
యుంగరమును పంపె రాము నీకు 

రామ రామ రామ అనుచు రామ భక్త హనుమ
శోక మున్న సీత చూసి మనసు విప్పి తెల్పె హనుమ 
     
నంగుళి వెలసిల్లిన దది రంగు  
రంగు మణుల యాసనాలు వలెను       
రంగు రంగు మ్రుగ్గులు పలు చూచె     
మంగళము గయోధ్య పిలుచు నూత్న 

కాంతితోను కలలు తీరు వేలు 
నూత్న కాంతు లిడు కిరీట మగును      
రత్నముల ధరింతు రింక మాత       
రత్నగర్భ తనయ యైన యతుల 

రామ రామ రామ అనుచు రామ భక్త హనుమ
శోక మున్న సీత చూసి మనసు విప్పి తెల్పె హనుమ 

రత్నమాల దాల్చు దనుజ నపుడు       
రత్న మగు దశముఖ మకుట వేళ   
రత్న మదియు నేల వ్రాలు తప్ప 
తప్ప దమ్మ రామ జయము ఇపుడు      

తప్ప దమ్మ నీ విడుదల మనసు      
తప్ప దమ్మ రావణ వధ ఇపుడు       
తప్ప దుర్వి తనయ నీవు ఇపుడు      
తప్పకుండ లంక వీడ వలెను 

రామ రామ రామ అనుచు రామ భక్త హనుమ
శోక మున్న సీత చూసి మనసు విప్పి తెల్పె హనుమ 
     
గొప్పగాను చూతు వతని రయము          
క్షేమ మమ్మ క్షేమ మమ్మ అకట   
రామచంద్రమూర్తి యతడు అచట      
ప్రేమల హనుమంతు నన్ను పంపె  

శ్రీమతులు వెలుంగ నీదు ప్రేమ       
క్షేమ వార్త నతని కిత్తు ఇపుడు   
భూమి పుత్త్రి జీవిత మిక చాలు          
సుందరమగు వదనము లిక మేలు
     
రామ రామ రామ అనుచు రామ భక్త హనుమ
శోక మున్న సీత చూసి మనసు విప్పి తెల్పె హనుమ 

సుందరమగు హృదయము లిక పంచు      
సుందరమగు బ్రదుకు లింక వెలుగు          
అందము లిక చిందువారు మనసు        
చందన మగు గాలి తావి అపుడు      
చిందు లిడుచు పోదు నీదు క్షేమ 
వార్త తోను హనుమ రామచంద్ర  

రామ రామ రామ అనుచు రామ భక్త హనుమ
శోక మున్న సీత చూసి మనసు విప్పి తెల్పె హనుమ 
రామ రామ రామ అనుచు రామ భక్త హనుమ
శోక మున్న సీత చూసి మనసు విప్పి తెల్పె హనుమ 

******
నేటి సాహిత్య గీతం  - తోడు 
విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ 

తోడు తోడు అంటూ ఆడి చూడు  
ఆడి అడి అంటూ  పాట చూడు 
పాడి పాడి అంటూ మాట చూడు 
మాట మాట అంటూ కలసి చూడు  

మనసుకు మనసు నీడలా మమత తోడు 
మనసుకు మమత హాయిని మౌన  తోడు 
మమతకు స్నేహము విలువ మంచి తోడు     
స్నేహముకు బలము ప్రేమ సహన తోడు

బలముకి ధనము దైర్యము బంధ తోడు 
ధనము ధర్మానికి వినయ ధరణి  తోడు 
ధర్మమే న్యాయముననిత్య దారి  తోడు
న్యాయముకు సత్య మార్గము నయన తోడు

తోడు తోడు అంటూ ఆడి చూడు  
ఆడి అడి అంటూ  పాట చూడు 
పాడి పాడి అంటూ మాట చూడు 
మాట మాట అంటూ కలసి చూడు  

సత్యమే మనిషికి నీడ సమయ తోడు 
మనిషికి ప్రేమ మనసు మాట తోడు 
ప్రేమలే దేశమునకుయే క్షేమ తోడు   
ఒకరి కొకరుగా ఒక్కరై ఓర్పు తోడు

నియమ కష్టాల కు కడలి నిత్య తోడు 
నియమ సుఖములకు మనిషి నిత్య తోడు 
నియమ క్రమశిక్షణకు చీమ నిత్య తోడు 
నియమ ఐక్యమత్యము కాకి నిత్య తోడు 

తోడు తోడు అంటూ ఆడి చూడు  
ఆడి అడి అంటూ  పాట చూడు 
పాడి పాడి అంటూ మాట చూడు 
మాట మాట అంటూ కలసి చూడు  
  
సమయ నీడలు ఎండకు సత్య తోడు
సమయ చలియంత వెచ్చగా సత్య తోడు
సమయ ఆతృతఆశలు సత్య తోడు
సమయ కోపాని కి ప్రేమ సత్య తోడు

తోడు తోడు అంటూ ఆడి చూడు  
ఆడి అడి అంటూ  పాట చూడు 
పాడి పాడి అంటూ మాట చూడు 
మాట మాట అంటూ కలసి చూడు  

--((*))--

నేటి  మనసు ఛందస్సు  గీతం 
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 

మరుమల్లెలావికసించి నున్నాను 
మకరంద మంతాను దోచి పొమ్మురా 
అధరమ్ము తీపిని ఆస్వాదించు రా 
అందాల బొమ్మను ఆటపట్టించకురా    

చిరునవ్వు చిందించు సిరులు కురుపించు 
ముద్దిచ్చి మైమర్చె మోహనా రా 
నిఱుపేద నాపైనఁ గరుణఁ జూపించు 
సరసిజోద్భవ రమ్ము - సంతుష్టి రా  

పుత్తడి బొమ్మనై పు వై ఉన్నాను 
ముద్దిచ్చి మొహమే తీర్చాలి రా 
చిరునవ్వుతో రమ్ము సిరులు అందిస్తా 
స్మరణమ్ము నీపైన మోహనా రా 

హాసమ్ము పంచియే హాయిఁ గొనిపోర
ఆర్భాటమే కాదు మోహనా రా 
అందాలన్నీ పొంది ఆడి మరవాలి 
అధరమ్ము తీపిని అందుకోరా 
   
ఇదియేను శృంగారమనకు మన్మధా 
ప్రకృతిలో ధర్మమే మోహనా రా 
వయసున్నది వలపు వుంది మన్మధా 
వరుసైన దాన్నిలే మోహనా రా     

మరుమల్లెలావికసించి నున్నాను 
మకరంద మంతాను దోచి పొమ్మురా 
అధరమ్ము తీపిని ఆస్వాదించు రా 
అందాల బొమ్మను ఆటపట్టించకురా    

అధరమ్ము తీపిని ఆస్వాదించు రా 
అందాల బొమ్మను ఆటపట్టించకురా    

___((()))____

ప్రాంజలి ప్రభ - సాహిత్య గీతం 
విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ 

ప్రధానమ్ము వీవే ఈశ్వరా 
ప్రభావమ్ము నీదే ఈశ్వరా 
సహాయమ్ము వీవే ఈశ్వరా 
సమాధాన మీదే ఈశ్వరా 

వినోదమ్ము వల్లేను వివాహం మహేశా  
మనోనేత్ర మళ్లేను మహానేత్ర మహేశా    

సహాయమ్ము పొందే అవకాశం మహేశా 
అహమ్మేమి లేదే వర దాహం మహేశా 
మొహమ్మేను కాదే సమదేహం మహేశా 
విహారమ్ము పోదాం అభిమానం మహేశా 

సుశైలేంద్ర వీవే ఈశ్వరా 
శుదర్మేంద్ర నీవే  ఈశ్వరా 
శుభాకార వీవే ఈశ్వరా  
శుభాకాంక్ష నీకే ఈశ్వరా 

విధానమ్ము తెల్పే ను వివేకం మహేశా 
నిదానమ్ము గానే విని పించే మహేశా 
సదానమ్ము నీదే వస పొందే మహేశా 
ప్రధానమ్ము నీవే ‌‌ను ప్రమోదం మహేశా   

ప్రధానమ్ము వీవే ఈశ్వరా 
ప్రభావమ్ము నీదే ఈశ్వరా 
సహాయమ్ము వీవే ఈశ్వరా 
సమాధాన మీదే ఈశ్వరా 

అకాలమ్ము కాదే సహనమ్మే మహేశా
సకాలమ్ము ఉందే ‌‌సమ ర్ధత్వం మహేశా
వికాసమ్ము ఉందే అభిమానం మహేశా
రకాలన్ని చూపేను రరామం మహేశా

సుశైలేంద్ర వీవే ఈశ్వరా 
శుదర్మేంద్ర నీవే  ఈశ్వరా 
శుభాకార వీవే ఈశ్వరా  
శుభాకాంక్ష నీకే ఈశ్వరా 

ప్రభావమ్ము వల్లే ‌‌‌‌‌ప్రయాణమ్మె మహేశా
సభా ప్రాభవమ్మే ను సమానామ్ మహేశా
ముభావమ్ము వల్లే సమూలామ్ మహేశా
ప్రభావమ్ము వెల్గే ప్రసాదం మహేశా

ప్రధానమ్ము వీవే ఈశ్వరా  ప్రభావమ్ము నీదే ఈశ్వరా 
సహాయమ్ము వీవే ఈశ్వరా సమాధాన మీదే ఈశ్వరా 
సుశైలేంద్ర వీవే ఈశ్వరా శుదర్మేంద్ర నీవే  ఈశ్వరా 
శుభాకార వీవే ఈశ్వరా  శుభాకాంక్ష నీకే ఈశ్వరా 

ఆధారం .య.య.య.య.8
00000
నేటి గీతం - రాజ్యం
ప్రాంజలి ప్రభ -- మల్లాప్రగడ రామకృష్ణ 
వందేమాతరం .. వందేమాతరం ... వందేమాతరం 

సుఖానికి మూలం ధర్మం
ధర్మానికి మూలం అర్ధం 
అర్ధానికి మూలం అర్ధాంగి 
అర్ధాంగికి మూలం రాజ్యం 

రాజ్యానికి మూలం ఇంద్రియం 
ఇంద్రియానికి మూలం వినయం 
వినయానికి మూలం వృద్ధ సేవ 
వృద్ధసేవకు మూలం విజ్ఞానము 

విజ్ఞానమునకు మూలం సంపాదన 
సంపాదన కు మూలం ఆత్మ తృప్తి
ఆత్మతృప్తికి మూలం ఓర్పు లాభం 
ఓర్పులాభానికి మూలం ప్రకృతి వరం 

ప్రకృతి వరానికి మూలం క్రమశిక్షణ 
క్రమశిక్షణ కు మూలం సూర్యోదయం
సూర్యోదయానికి మూలం కాలచక్రం 
కాలచక్రానికి మూలం విధాత సృష్టి 

విధాత సృష్టి కి మూలం ఆదిపరాశక్తి 
ఆదిపరాశక్తి కి మూలం సర్వాంతర్యామి 
సర్వాంతర్యామి కి మూలం ప్రేమతత్వం 
ప్రేమతత్వానికి మూలం నమ్మకత్వమే         
--((*))--

****
*ప్రాంజలి ప్రభ నేటి సరస సంభాషణ గీతం  
విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ 

ఊహలు గుసగుసలయ్యే వయ్యారంగా ఊగగా
ఉపిరిసలపని కౌగిలి చిక్కెను ఆనందంగా   

సాంఘీకంగా కధలను పోల్చగా 
సామాన్యంగా నిజమును తెల్పగా 
స్నేహంగానే  కళలను  తీర్చెగా 
ఆనందంతో అలకను మార్చెగా 
 
ఊహలు గుసగుసలయ్యే వయ్యారంగా ఊగగా
ఉపిరిసలపని కౌగిలి చిక్కెను ఆనందంగా   

సంధానం గా అణుకువ చూపెగా 
మేధస్సంతా తెలుపుచు ఉండెగా  
శక్తీ నంతా  కలలతొ పూడ్చగా  
మౌనంగానే ఒకటవ టానికేగా  

ఊహలు గుసగుసలయ్యే వయ్యారంగా ఊగగా
ఉపిరిసలపని కౌగిలి చిక్కెను ఆనందంగా   

సమ్మోహంగా కణతలు విచ్చెగా 
ప్రాధాన్యంగా పలుకులు  పల్కెగా  
ప్రాభావంగా విలువలు పెంచెగా  
వ్యత్యాసంగా వలపులు చూపెగా 

ఊహలు గుసగుసలయ్యే వయ్యారంగా ఊగగా
ఉపిరిసలపని కౌగిలి చిక్కెను ఆనందంగా   
     
పాఠాలన్నీ వరుసగ చెప్పగా  
సమ్మోహంతో మనసును పంచె గా 
సంతోషంతో ఒకరిగ మార్పుగా    
కొర్కళన్నీ మనసుతొ  తీర్పుగా 

ఊహలు గుసగుసలయ్యే వయ్యారంగా ఊగగా
ఉపిరిసలపని కౌగిలి చిక్కెను ఆనందంగా   

ఆధారం:  UUUU-IIII-UIU 

--((*))--



ఫిబ్రవరి 21  మాతృభాష దినోత్సవం

రచయత : మల్లాపగడ రామకృష్ణ 


ప్రాంజలి ప్రభ  (8 )

మేఘాలు దట్టంగా కమ్ముకొని 
ఒక్కసారి వర్షం కురిపించి 
గుర్తుచేస్తున్నాయి

అకాలపు వరద పొంగు గమనాన్ని 
చూడగా స్త్రీల కన్నీరు భాదలు  
గుర్తుకొస్తున్నాయి

మంచుకొండలు ఎర్రబారటాన్ని
ఏరులా కరిగి బోతూ 
గుర్తుచేస్తున్నాయి   

గద్దల మూకమ్ముడి గమనాన్ని  
చూడగా రక్తపు కళేబరాలు
గుర్తుకొస్తున్నాయి 

ఎగసి పడుతున్న కెరటాల్ని 
చూడగా ముష్కరమూకల దాడులు  
గుర్తుకొస్తున్నాయి

దొంగదెబ్బ చేసి శాలువా కప్పటాన్ని 
వెర్రి వెంగళప్ప చేసే చేష్టలు  
గుర్తుకొస్తున్నాయి

కొవ్వొత్తిలా వెలుగు పంచి కరిగి పోటాన్ని
శ్రీ కృష్ణ భగవానుని బోధలు 
గుర్తుకొస్తున్నాయి

బిడ్డల కోసం పుడమి తల్లి రక్తాన్ని 
చిందిస్తూ ఘోషిస్తూ విలపించటం 
గుర్తుకొస్తున్నాయి

ఆత్మలు పరిబ్రమిస్తూ చిత్రాలలో 
మనో హృదయలలోచేరి 
గుర్తు చేస్తున్నాయి 

గతం గత: అనుకోవటం ఎందుకు 
భవిషత్తు పూలబాట కదనుకోవటం ఎందుకు 
వర్తమానంలో గుర్తు చేస్తున్నాయి 
--((**))-

ఫిబ్రవరి 21  మాతృభాష దినోత్సవం

రచయత : మల్లాపగడ రామకృష్ణ 
ప్రాంజలి ప్రభ  (7 )

వందనమ్ములు పలుకు తున్నా భాషామ తల్లికి 
వందనమ్ములు పల్కుతున్నా పండిత పామర్లకి   
వందనమ్ములు గురువు తల్లి తండ్రు లందరికి  
తెలుగుభాషను బ్రతికించమని కోరుతున్నా  

ప్రతిదినమ్ము నాకు భాషోత్సవంబుగ నుండునే   
ప్రతిదినమ్ము వరమె, కలో తెలియకుండెనే  
ప్రతిదినమ్ము శ్రీకరమ్ముగఁ గొలుచు చుండెనే  
ప్రస్తుతించుచుండి భాష పద కరుణ దయలే  . 

తెలుఁగు వెలుఁగుఁ బంచి దేశదేశమ్ములఁ యందు  

దలిఋణమ్ము దీర్చి ధన్య జీవి అవ్వాలి ముందు  
శ్రీమాత పితల భాష బ్రతికించు సత్య ముందు  
వలయునట్టి ప్రేమ పెంచు భాషాభివృద్ధి యందు  

తీయనగుచు వినఁగ హాయి గూర్చెడి తెలుగు 

తాయి పలుకు భాష తనివినిడును తెలుగు  
శ్రేయమిడెడు నాకుఁ జెప్పలేనంత వెలుగుగా  
చదువి వ్రాయఁట యందు హాయి నొసగు తెలుగు  

ప్రాంజలి హాస్య గీత ప్రభ - గణతంత్ర దినోత్త్సవ సందర్భముగా 
 
ఒక్కసారి విను--ఒక్కసారి విను--ఒక్కసారి విను
ఒక్కసారి విను ఒక్కమాట మాటవిను 
వంత పల్కుతావా, వద్దు వద్దంటావా 
ముద్దు వద్దు అంటూ ముద్దు చేస్తావా 

ధనాన్ని చూస్తే ఎవరికైనా - బుద్ది చంచల మౌతుంది 
శెవాన్ని చూస్తే ఎవరికైనా  - బుద్ది వేదాంత మౌతుంది
స్త్రీ వేషాన్ని చూస్తే ఎవరికైనా - బుద్ధి ఆలోచన మారుతుంది  
యువతి కళ్ళు చూస్తే ఎవరికైనా - బుద్ధి ఎదో తెల్పాలనిపిస్తుంది

ఒక్కసారి విను--ఒక్కసారి విను--ఒక్కసారి విను
ఒక్కసారి విను ఒక్కమాట మాటవిను 
వంత పల్కుతావా, వద్దు వద్దంటావా 
ముద్దు వద్దు అంటూ ముద్దు చేస్తావా 
 
పౌర్ణమి వన్నెల చూస్తే ఎవరికైనా  - కలలు నిజం చేసుకోవాలనిపిస్తుంది        
అమావాస్య చీకటిని చూస్తే ఎవరికైనా - తెలియని మైకం కమ్ము కుంటుంది 
తలఎత్తి పైకి చూస్తే ఎవరికైనా - కళ్ళను కమ్మే వెలుగు కనబడుతుంది
చుక్కలతో చంద్రుని చూస్తే ఎవరికైనా - మనసు తన్మయత్వం చెందుతుంది 

ఒక్కసారి విను--ఒక్కసారి విను--ఒక్కసారి విను
ఒక్కసారి విను ఒక్కమాట మాటవిను 
వంత పల్కుతావా, వద్దు వద్దంటావా 
ముద్దు వద్దు అంటూ ముద్దు చేస్తావా 

కమనీయ ప్రకృతి చూస్తే ఎవరికైనా - నయనాలు వెలుగు చిమ్ముతుంది
అనుకోని సంఘటన చూస్తే ఎవరికైనా - హృదయం గగుర్పాటు చెందుతుంది 
పరువాల పిల్లల్ని చూస్తే ఎవరికైనా  - నోటిలో జిల్లాలు ఊరి హాయిగుంటుంది 
పిటపిట లాడే పిరుదులు ఎవరికైనా -- ఊపుతూఉంటే వళ్ళు  ఝల్లు మంటుంది 
   
ఒక్కసారి విను--ఒక్కసారి విను--ఒక్కసారి విను
ఒక్కసారి విను ఒక్కమాట మాటవిను 
వంత పల్కుతావా, వద్దు వద్దంటావా 
ముద్దు వద్దు అంటూ ముద్దు చేస్తావా 

--((*))--



ఫిబ్రవరి 21  మాతృభాష దినోత్సవం

రచయత : మల్లాపగడ రామకృష్ణ 
ప్రాంజలి ప్రభ  (6 )

మనస్సు రంజిల్లఁ పరచి 
మనో నిగ్రహాన్నిపెంచేటి
తలచినంతనే తన్మయత్వం 
కల్గించి శాంతిని పంచేటి 
తీపి నొందించు పీయూష 
తేనెలొలుకు తెలుగు భాష 

చదివినంతనే మదిలో మెదిలి       
హృదయాన్ని ఆనంద డోలికలో 
ఉంచి దివ్య కావ్యాభిరుచి
కల్పించే తెలుగు భాష 

అమ్మ పాలు రుచి ఉండగా    

దాది చెంత పాలు త్రాగ నేలా 
తెలుగు భాష తీయగా నుండగా 
పొరుగు భాష చెంతకు పోవనేలా 

చీకట్లో కలసి పొయ్యేది కాదు 

చిరుదీపమై వెలుగు నిచ్చేది భాష 
అణగద్రొక్కి పైకెక్కాలని అనుకోనిది కాదు
స్వయం కృషితో ఎదగాలనుకొనే భాష  

కవి సమూహములందు కాళిదాసు లెస్స 

కోటలందు కొండపల్లి కోట లెస్స    
నగరులందు అమరావతి లెస్స 
దేశభాషలందు తెలుగు లెస్స 

--((**))--


ఫిబ్రవరి 21  మాతృభాష దినోత్సవం

రచయత : మల్లాపగడ రామకృష్ణ 
ప్రాంజలి ప్రభ  (5 )

తెలుగు వీర లేవరా

దీక్షపూని సాగరా  
తెలుగు మాత స్వేశ్చ కోరి
ఉద్యమం చేయరా

అంగ్లమా నీకు జోహార్ 
అంగ్లమా నీకు జోహార్
వేదభూమిని కలుషితం చేసావు 
మాతృభూమి రూపు రేఖలు మార్చి వేశావు 
విపరీత ధోరణి తో నష్టాలే కల్పించావు 
ఆశలు చూపి మొదటికే మోసం చేస్తున్నావు 

మూడేండ్లకే పిల్లలకే ధనం కోసం 

ఉద్యోగరీత్యా తల్లి తండ్రులు ప్రేమను పంచక 
తెలుగునొదలి ఆంగ్లమే గొప్పని చేరుస్తున్నారు  
ఎప్పుడు మారుతుంది ఈ వ్యవస్థా 
ప్రభుత్వమే ఉచిత భోధనతో అనేక 
సౌకర్యాలు కల్పిస్తే ఎందుకు చేర్చరు
తెలుగు భోదనా పద్ధతిలో        
    
అమ్మ భాష వదలి ఆంగ్లభాషను 
చూసి సంబరపడి కాలం ఎప్పుడు మారుతుంది 
తెలుగు భాషాసంస్కృతి సాంప్రదాయం 
సంగీత సాహిత్యాభివృద్ధికి ప్రతిఒక్కరు కృషి చేస్తే 
తేనెలొలుకు తెలుగు భాష వెలుగు సిద్ధికి 
మహర్దశకు ఉద్యమం చేయరా 

తెలుగు వీర లేవరా

దీక్షపూని సాగరా  
తెలుగు మాత స్వేశ్చ కోరి
ఉద్యమం చేయరా
--((**))--


ఫిబ్రవరి 21  మాతృభాష దినోత్సవం

రచయత : మల్లాపగడ రామకృష్ణ 

ప్రాంజలి ప్రభ  (4 )

చెడు చూడకు ఎందుకంటే 
చెడు వినకు ఎందు కంటే 
చెడు అనకు ఎందు కంటే 
నీవు నీచుట్టువారు బతకాలికదా

చెడు చూస్తె కనబడు ప్రత్యక్ష నరకం

చెడు వింటే జోరీగ దుష్ట శంఖారావం 
చెడు అంటే మటు మాయం సర్వసుఖం 
అందుకే నేనంటా నిగ్రహ శక్తి ఉండి నీవెంట  

చెడు చూసిన నిలవదు నీ మనసు

చెడు విన్న పరుగేట్టు నీ మనసు 
చెడు అన్న ఉండనీయదు మనసు 
అందుకే నేనంటా నీది కాదు మనసు 
మరో కరికి అర్పించాక ఉండదు హక్కు 
  
చెడు చూసిన నీలోపెరుగు అజ్ఞానం 
చెడు విన్న నీలో పెరుగు అసత్యం 
చెడు అన్న నీకు పోవు నిజ స్నేహం 
అందుకే నేనంట విజ్ఞానం 
సత్యం స్నేహం ఉండాలి నీవెంట  

అందుకే మన మాతృభాషను నమ్ముకో 
అదే నిన్ను అందిపించి బ్రతికిస్తుంది 

--((**))--


ఫిబ్రవరి 21  మాతృభాష దినోత్సవం

రచయత : మల్లాపగడ రామకృష్ణ 
ప్రాంజలి ప్రభ  (3)

అయ్య బాబోయ్ అమ్మ బాబోయ్
తెలుగు కెంత కష్టం వచ్చింది  
ఏమి చిత్రం ఏమి విచిత్రం
తెలుగు భాషకు ఎంతో నకష్టం 

చేదు బాబోయ్ వద్దు బాబోయ్

అందదు ఆంగ్ల విద్యలో సరైన భావం   
ఏమి తంత్రం ఏమి కుతంత్రం
తెలుగు భాషకు తెచ్చిన మంత్రం 
  
నమ్మ లేనోయ్ నమ్మ వద్దోయ్
తెలుగు బాష తప్ప అన్య భాష
నమ్మ మిత్రం నమ్మే అమిత్రం
తెలుగు భాష మిత్రం, ఆగ్లం అమిత్రం  

మంచి లేదోయ్ చెడు వుందోయ్

అర్ధం చేసుకోలేని భాష ఆంగ్లం  
లేదు శాంతి లేదే విశ్రాంతి
ఆంగ్ల చదువుల్లో  అంతా బ్రాంతి 

కాల ముందోయ్ నమ్మ వద్దోయ్ 
ఆంగ్లంలో లేదు జ్ణాణం లేదే విజ్ణాణం
గీత నీదోయ్, గురు బోధోయ్
తెలుగే కాలం తెలుగే నిత్య సకాలం

నమ్మ లేనోయ్ ఉండ లేదోయ్

కళ లేదు కల లేదు ఆంగ్లంలో 
మంచి బుధ్ధి మంచి కార్యం
చేసే జీవితం తెలుగులో ఉందోయ్

--((**))--

ఫిబ్రవరి 21  మాతృభాష దినోత్సవం

రచయత : మల్లాపగడ రామకృష్ణ 
ప్రాంజలి ప్రభ  (2)

తెలుగు జాతి మనది 

నిండుగ వెలుగు జాతి మనది
ప్రాంతాలు భేధము లేనిది
ఆంధ్రుల ఆరాధ్య భాష ఇది

అంధకారంలో పడిపోతున్నది

వేలుగులా తెలుగును పంచాల్సి ఉంది
ఇది జాతి మత కుల భేధం లేని భాష ఇది
జాతీయ అంతర్జాతీయంగా వ్రృధ్ధిలోనికి తేవాల్సినది

నిజం నిలకడగ తెలప గలిగేది

పుకారు ప్రవాహంగా పరుగెత్తించేది
స్నేహం బలంగా నిలప గలీగేది
పగని మార్చి ప్రేమను పెంచే జాతి ఇది

ఓటమిని గెలుపు మార్చగలిగేది

నమ్మకాన్ని కల్పించి అందర్ని కలిపేది
సమస్యల పరిష్కారం చూపగలిగేది
ఆత్మవిశ్వాసం కల్పించే తెలుగు జాతి ఇది 


--((**))--



ఫిబ్రవరి 21  మాతృభాష దినోత్సవం

కవితలు వ్రాద్దామనుకున్నా  
ఆదరించేవారిని ఆత్మీయతతో పిలుస్తున్నది.
రచయత: మల్లాప్రగడ  రామకృష్ణ   
ప్రాంజలి ప్రభ - (1)
  
బాబూ వినరా, పాప వినరా 
మన తెలుగు భాషలో చదివారా 
అదే నీ తల్లి భాషరా
దీనిని మించినదీ లోకంలో ఏదీ లేదురా 

అమ్మా నాన్నా అని మనసారా పిలవరా 

పిలుపులో ఉన్న ఆత్మీయతను గమనించరా
ఆమ్మ నాన్న స్నేహితుడిలా ఆదుకునేది తెలుగురా 
ఆద మరచి తెలుగును చులకన చేయకురా

కడు హీన స్థితిలో నుంది మాతృభాష చూడరా

కన్నీరు కార్చుతున్నది తెలుగు తల్లి కనుమూరా 
నేటి యువజంటన్నా కళ్ళు తెరచి ఉండాలిరా

తమిళ, మరాఠీ, కన్నడల తపన వెళ్లి చూడరా 
తరతరాల నుండి తల్లి హష భక్తులైయున్నారురా 
తల్లి భాషలో చదవలేని ఆంధ్రులు ఎందుకురా
తెలుగుభాషను ఉద్దరించలేని తనయులున్నా దండగరా     
జీవంలేని జీవిలా భాషరాని మొద్దులా ఉండకురా 

తెలుగుభాషను వృద్ధి చేయు మార్గాన్ని వెతకరా 

తెలుగు తల్లి కన్నీరు తుడిచే మార్గం చూడురా 
ప్రభుత్వం తల్లి తండ్రులే తెలుగు ప్రేమ హీనులురా 

దూరపు చదువులకోసం ఆత్మీయతకే కరువౌ తున్నారురా 

ప్రభుత్వం వారు కంటినీరు తుడుపులా ప్రవర్తిస్తున్నారురా 
ఆదిలోనే ఆంగ్లం వద్దని అనేవారు కరువయ్యారురా 
కూడు అమ్మ భాష పెడుతుంది ఆంగ్లం పెట్టదురా
మాతృ భాష వల్లనే మన సంస్కృతి బతుకునురా 
మన వేదపురాణాలు యితిహాసాలు చదవాలిరా  

బాబూ వినరా, పాప వినరా 

మన తెలుగు భాషలో చదివారా 
అదే నీ తల్లి భాషరా
దీనిని మించినదీ లోకంలో ఏదీ లేదురా 
--((**))-- 


మీ అభిప్రాయాలు కుడా తెలియ పరచండి 

తెలుగు భాష ప్రతికించుటకు ముందుకురండి


కాళిదాసు గర్వభంగం


మండు వేసవిలో ఒకరోజు మహాకవి కాళిదాసు పరదేశానికి బయల్దేరాడు.


మిట్ట మధ్యాహ్న సమయానికి ఒక కుగ్రామానికి చేరుకున్నాడు.


బాగా దాహం వేయడంతో ఓ గుడిసె దగ్గరికి నీళ్ల కోసం వెళ్తాడు.


ఓ బాలిక నీటి కుండతో గుడిసెలోకి వెళ్తుంటుంది.


ఆమెను చూసి... ‘బాలికా! నాకు దాహంగా ఉంది.


నీళ్లు ఇవ్వమ’ని అడిగాడు కాళిదాసు. అప్పుడా బాలిక...


‘మీ రెవరో నాకు తెలియదు.. నీళ్లు ఎలా ఇచ్చేద’ని బదులిచ్చింది. కాళిదాసు:


‘నేను ఎవరో తెలియక పోవడం ఏంటి?


పెద్ద పండితుడను. ఎవరిని అడిగినా చెబుతార’ని అన్నాడు.*


అహంకార పూరిత మైన ఆ మాటలు విని బాలిక నవ్వి...


‘మీరు అసత్య మాడుతున్నారు.


ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు.


వారెవరో చెబితే నీళ్లు ఇస్తాను’ అంటుంది.


అప్పుడు కాళిదాసు కాసేపు ఆలోచించి...


‘నాకు తెలియదు. గొంతు ఎండి పోతోంది.


ముందు నీళ్లు ఇవ్వమ’ని బతిమాలుకుంటాడు.


అయినా ఆ బాలిక కనికరించదు.


‘ఇద్దరు బలవంతులు ఎవరో కాదు ఆకలి, దాహం. ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు?’


అని అడుగు తుంది. బాలిక.*


‘నేను బాటసారి’ని అన్నాడు కాళిదాసు.


‘మళ్లీ అసత్య మాడుతున్నారు.


బాటసారి అంటే ఒకచోటి నుంచి మరోచోటికి బడలిక లేకుండా వెళ్లాలి.


మీరేమో అలిసి పోయారు కదా.


ఈ లోకం లో అలా అలసి పోకుండా సంచరించే బాటసారులు ఇద్దరే ఉన్నారు.


వారే సూర్యచంద్రులు!’


అని చెప్పి గుడిసెలోకి వెళ్లింది బాలిక.


దాహానికి తట్టుకోలేక.. ఆ గుడిసె ముందే నిలబడి..


‘మాతా నీళ్లు ఇవ్వండి.


దాహం తో చనిపోయేలా ఉన్నాను..’ 

అని ప్రాధేయపడ్డాడు కాళిదాసు.

లోపలి నుంచి ఓ ముసలావిడ బయటకు వచ్చి...


‘మీరెవరో సెలవివ్వండి...


నీళ్లిస్తాను’ అంది. కాళిదాసు దీనంగా...


‘నేను అతిథిని..!’ అని బదులిచ్చాడు.*


‘మీరు అసత్యం చెబుతున్నారు.


ఈ సృష్టిలో ఇద్దరే అతిథులు.


ఒకటి ధనం, రెండోది యవ్వనం.


ఈ రెండూ ఎప్పుడు వెళ్లిపోతాయో ఎవరికీ తెలియదు’ అంటుంది.*


కాళిదాసు.. ‘నేను సహనశీలిని నీళ్లు ఇవ్వండ’ని వేడుకుంటాడు.*


కానీ ఆమె ‘మీరు మళ్లీ అసత్యమే చెబుతున్నారు.


ఈ ప్రపంచంలో ఇద్దరే సహన శీలురు ఉన్నారు.


ఒకటి భూమి, రెండోది వృక్షం. ఇప్పుడు నిజం చెప్పు నీవెవరు?’ అని అడిగింది.


ఓపిక నశించిన కాళిదాసు..


‘నేను మూర్ఖుడను. ఇప్పుడైనా నీళ్లివ్వండ’ని అడిగాడు.


ఆ అవ్వ నవ్వుతూ...‘


ఇదీ అసత్యమే.


ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు.


ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు. అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. రెండోవాడు.

ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు’ అని అంటుంది.

ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది.*


*ఆ అవ్వ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుతాడు. _


ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది._


‘కాళిదాసా..! విద్యతో వినయం వృద్ధి చెందాలి కానీ, అహంకారం కాదు నాయనా!


కీర్తిప్రతిష్ఠల మాయలో పడిపోయిన నీ బుద్ధిని మరల్చడానికే ఈ పరీక్ష’అని జలమును అనుగ్రహిస్తుంది


--((**))--




అదృష్టం ఆదమరిస్తే - దరిద్రం దారిచూపు

ఒంటరిగా చావాలనిపిస్తే - ప్రేమ కూడా దారిచూపు

విలయం తాండ విస్తే - వినయం దారిచూపు

వికాసం వెంబడిస్తే - విజయం దారిచూపు

అర్ధం కోసం అనర్ధంచేస్తే - శక్తిని తుంచే దారిచూపు

నిరాశావాదానికి వస్తే - చేసే కర్మలు దారి చూపు

బలహీనత వెంబడీస్తే - బావుటా దారిచూపు

ఓటమి వెంబడిస్తే - వికృతి దారిచూపు

లెక్కకు ధుఖం వస్తే - కన్నీరు దారిచూపు

లెక్కకు పాపం చేస్తే - గత దానం దారిచూపు

లోకం నిద్రలేకుండా చేస్తే - సముద్రం దారిచూపు

నీడ అంద్దంలా వెంబడిస్తే - తికమకే దారిచూపు

ఓటరుని ముంచి వేస్తే - ఆశలు దారిచూపు

కారు వేగము పెంచేస్తే - కాటికి దారిచూపు

--((**))--



కొలవలెను నీ సొగసు సుకుమారాన్ని

హృదయంలో దాచిఉంచలేను సోయగాన్ని
వర్ణించి చెప్పలేను ముచ్చటైన భావాల్ని
చెప్పలేకున్నాను ముద్దులోని మహత్సాన్ని

పెదవులకు పదవులను కట్టిన వైనాన్ని
మెరుపుల సందడిలో దాగిఉన్న మోనాన్ని
కలిసిన చిత్ర విచిత్ర సొబగులు సౌరభాన్ని
చెప్పలేను రెప్పల మాటున దాస్తోగిన అందాన్ని

--((***))--


--((***))--

 చిన్నది

నేను రయ్యమని వస్తే 
ఖంగు తినకు శాస్త్రీ 
నాతో పెట్టు కుంటే
నలిగి పోతుంది ఇస్త్రీ

నాకోసం ముందే వచ్చే
బుర్ర మీసాల మేస్త్రీ
నేను కనుక చేయ్ వేస్తే
తప్పక మారు సాల్తీ

నీకండలకు వయసుకరిగే 
నా మనసు దాచి ఇస్తా
ఒక్క సారి నావంక చూస్తే
ఒకటికి ఒకటి ఫ్రీ ఇస్తా 

నేను చిలకలూరి పేట
చింతలు తీర్చె శింతామణి
మారుతుంది నీ లైఫ్  హిష్టరే
నెచెయ్ వేస్తె నీలైఫ్ బ్లాకు బష్టరే

--((**))--


--((***))--రూపాయి కన్నా రూపం గొప్పది
వేల కన్నా వినయం గొప్పది
లక్షల కన్నా లక్షణం గొప్పది
కోట్ల కన్నా కరుణ గొప్పది

బాల్యం ఉడుకు మాట గొప్పది
యవ్వనం ఉడుకు ప్రేమ గొప్పది
వృధ్ధాప్యం  బిడ్డల విద్య గొప్పది.
వానప్రస్థం మనః శాంతి గొప్పది

ఆశ కన్నా ఆకలి గొప్పది
ఊహ కన్నా ఊపిరి గొప్పది
మేను కన్నా మాట గొప్పది
మతి కన్నా మోనం గొప్పది

మబ్బు కన్నా మేఘం గొప్పది
నేల కన్నా పంట గొప్పది
ఆత్మ కన్నా గాలి  గొప్పది
అగ్ని  కన్నా దైవం గొప్పది


--((**))--


Ilustraciones realizadas para Hermano Gato, mi marca de láminas decorativas e ilustraciones personalizadas por encargo. Para conocer más puedes visitar: www.hermanogato.com
వేదోద్ధారణ సేసినదెవరు?
 విద్యాదేవిగ వెల్గెడిదెవరు?
నాదోపాసన మెచ్చెడిదెవరు?
నాట్యానందము నొందెడిదెవరు?

ఓ మనసా నీవెక్కడా, ఓ మనసా నీవెక్కడా
నా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడా
చెప్పవా ఇక్కడా

ఆధారంబయి యుండెడిదెవరు?
అక్షీణంబుగ మించెడిదెవరు?
లేదన్నట్టిది పల్కనిదెవరు?
 ప్రేమే రూపుగఁ దోచెడిదెవరు?
ఓ మనసా నీవెక్కడా ఓ మనసా నీవెక్కడా
నా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడా
చెప్పవా ఇక్కడా


అంతా తానయి నిండెడిదెవరు ?
 ఐశ్వర్యంబుగ నుండెడి దెవరు ?
చింతా శోకముఁ బాపెడిదెవరు ?
శ్రేయంబైనది యిచ్చెడిదెవరు?
ఓ మనసా నీవెక్కడా, ఓ మనసా నీవెక్కడా
నా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడా
చెప్పవా ఇక్కడా


కాంతిన్‌ గుండెల నింపెడిదెవరు?
 కంటిన్‌ రెప్పగఁ గాచెడిదెవరు?
చెంతన్‌ గూర్చొని పల్కెడిదెవరు?
 స్నేహంబెప్పుడు పంచెడిదెవరు?

ఓ మనసా నీవెక్కడా ఓ మనసా నీవెక్కడా
నా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడా
చెప్పవా ఇక్కడా


బోధన్‌ జేయుచుఁ దెల్పెడిదెవరు?
ముక్తన్‌ జేయఁగఁ దల్చెడిదెవరు?
నీ ధైర్యంబునుఁ బెంచెడిదెవరు?
నీ మార్గంబెదొ చూపెడిదెవరు?
ఓ మనసా నీవెక్కడా, ఓ మనసా నీవెక్కడా
నా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడా
చెప్పవా ఇక్కడా


నీ దైన్యంబునుఁ గూల్చెడిదెవరు?
నీకై శక్తిని నిచ్చెడిదెవరు?
నీ దైవంబుగ నిల్చినదెవరు?
 నీవే నేనని యన్నది యెవరు?
ఓ మనసా నీవెక్కడా ఓ మనసా నీవెక్కడా
నా మాటకు సమాధానము చెప్పవా ఇక్కడా
చెప్పవా ఇక్కడా

--((***))--
ఓ అబలా మేలుకో!! 

నాడు సతీసహగమనం పేరిట 
సజీవ దహనం చేసి 
పైశాచికానందంతో 
కరాళ నృత్యం చేసిన 
నర రూప పిశాచాలనూ 
క్షమించిన క్షమాగుణం నీది 

పెనిమిటి పొయాడన్న నెపంతో 
నీ కెశాలని తీసి నిన్ననాకారిని చేసి 
శిరోముండనం చేయించి ఏకవస్త్రం కట్టించి 
చీకటి గదిలొ బంధించి 
అపశకునానికి చిహ్నానివని 
అవహేళన చేసి అవమానించినా 
అసుర సమాన అహంకార పూరిత జాతినీ 
క్షమించిన క్షమాగుణం నీది 

కన్యాశుల్కం నాడు 
కన్నవారి ధనదాహానికి బలై 
ఈడుజారి కాడుజేరే వగ్గులకు 
నిన్ను అమ్ముకున్న ఆ స్వార్థపరులనూ 
క్షమించిన క్షమాగుణం నీది 

నేడు వరకట్నం కోసం 
అత్తారింటి వారి ధనదాహానికి బలైపోతూ 
ఆరళ్ళను పెట్టినా ఆడిపోసుకున్నా 
అగ్నికాహుతి జేసినా 
హలాహలాన్ని మింగిన పరమ శివునిలా 
బాధని గుండెల్లో దాచుకుని వారినీ 
క్షమిస్తున్న క్షమాగుణం నీది 

కాలం యేదైనా వ్యవస్థ యేదైనా 
రూపం యెదైనా అన్యాయమయ్యేది 
బలైపోయేది నీవైనా... ఎదురు మాటాడక 
మౌనంగా భరిస్తూనే వున్న సహనమూర్తివీవు 

పురుషాహంకారంతో నీ స్త్రీ జాతినీ 
రూపుదిద్దుకోక ముందే 
కడతేర్చాలని చూస్తున్న 
అమానుషాన్ని మౌనంగా చూస్తూ క్షమిస్తున్నావ్ 

తిరిగి తిరిగి పురుషాహంకారానికి 
జన్మనిస్తున్నావ్ తల్లివై మమకారం 
పంచి పోషిస్తున్న నీక్షమాగుణానికి 
జోహారులు 

ఎన్నాళ్ళు ..........ఇంకెన్నాళ్ళు......... 
ఏ జంతు జాలంలొనూ కనరాని అమానుషం 
నా నరజాతి ఆడజాతి కే అడుగడుగున అన్యాయం 
నేత్రాలలొ రోషాగ్ని రుధిరజ్వాలల నింపుకుని 
పురుష జాతి కబంద హస్తాల నుండి 
విముక్తి పొంది.....నువ్వో అపరకాళివై 
శివమెత్తి భావితరాల నీజాతి 
బానిసత్వానికి విముక్తి కలిగించుకో!! 

--((***))--

Bala Thandapani, Murugan Statue Holding Staff-http://www.lotussculpture.com/muruganwargod.htm
ఓ కాలమా ఏమిటి పరిస్థితి 
నన్ను నేను తెలుసుకోలేని స్థితి 

నాకు తోడు  ఉంది ఓక ఇంతి 
దాని మనస్సు తెలుసుకోలేని స్థితి 
నా ఆలోచన ఒక కొలిక్కి రాని స్థితి 
సమయస్పుర్తిగా తెలుసుకోలేని గతి 

నిజం నిప్పు లాంటిది 
అది చెప్పిన తప్పే, చెప్పక పోయినా తప్పే 
ధనం ఆశ లాంటిది 
అది ఉన్న గొప్పే, లేకున్నా ముప్పే  

ఇరువురు కలిస్తేనే సృష్టి 
ఆకర్షణ, వికర్షణలు తప్పవు 
మనిషి వేస్తాడు కొన్ని తప్పటడుగులు 
తెలియక వేస్తె కష్టం, తెలిసి వేస్తె పాపం 

మతం చలవే జీవితం  
ఆదరిస్తే సుఖం, నిరాకరిస్తే నరకం 
ధనంలో లేదు జీవితం 
ప్రేమను పంచి, పొందటంలో ఉంది 

దొంగలకు పాలకులకు నిద్ర ఉండదు
ఉన్నది దోచుకోవటం, అందరిది పంచటం 
వయసు మార్పుల్లో ఉంటుంది ఆ సక్తి     
వ్యసనంగాను, మరోవైపు ఆద్యాత్మికంగాను 

మంచికి, ధర్మానికి  విలువ లేదు
తలవంచి లేదా, తలయెత్తి మాట్లాడినా తప్పే 
మనిషి మనిషిగా గుర్తింపు లేనిచోట 
ఏది చెప్పినా అది తెప్పే, ఒప్పును గుర్తించరు   
  
ఓ కాలమా ఏమిటి పరిస్థితి 
నన్ను నేను తెలుసుకోలేని స్థితి 


--((***))--


చుక్కలో చుక్కనై
చిక్కల్లో చక్కనై
చంద్రుడిలో మచ్చనై
చమత్కార చరితనై
నా వయసుకు తగ్గ వరుని కోసం వేటనై

చదరంలో తునకనై
చరితంలో కథనై
చూతుర్య సుహాసినై
చాపల్య దాసినై
చాతుర్యంతో వరున్ని పొందు కోసం వేటనై

చలంలో చిక్కెి
చామంతి పువై
చల్లకు కరువై
చల్ల దనానికి లోకువై
చల్లని చల్లను పంచే వరుని కోసం వేటనై

చూపులకు బరువై
చూపరులకు కరువై
చేతులు రాకయై
చేప కన్నులయై
చేప కన్నులతో వరుని కోసం వేటనై

నీటిలో రుచిగా నేనై
సూర్యచంద్రలలోన కాంతిని నేనై
ఆకాశంలో శబ్దాన్ని నేనై
వేదాలలోని ప్రణవాన్ని నేనై
నరులలో పౌరుషాన్ని నేనై

నేనై నేనై అని ఆలోచిస్తున్నారా
అదే అంతరాత్మ ప్రేమగా
అందరిలో వ్యాపించిఉన్న
భగవంతుని లీల అదే ప్రేమ హేల


--((***))--



ఆనాడు ముఖవర్ఛస్సు చూసి
సోది రూపాన న్యాయం జరిగె
ఆకాశవాణి, దూర్వాణి ద్వార
ధర్మబద్ధంగా నిర్వాహణ జరిగె

వేదాల అర్ధాలను అందరికీ అందచేసి
మన:శాంతి, మనోసంకల్పం కలిగె
నేడు అంతర్జాల మహోజ్వల వెలుగు
ప్రాంజలిప్రభ గా రూపాంతరం జరిగె

పత్రికా స్వేస్చను రక్షించటం
ధ్యేయంగ నిర్వహిస్తున్న ప్రభ
సూర్యుని వెలుగలా చీకటి
తరిమి వెలుగును నింపుటే
ధర్మాన్ని నిలబెట్టడం మా ధ్యేయం
ఎవ్వరికి తలవంచం
ధర్మం, సత్యం , న్యాయం
నిలబెట్టుటకు శాంతిని కల్పించుటకు
ప్రజల పక్షమే ఉండుటకు
ప్రాంజలి ప్రభ ఉంటుంది నిత్యం

ఇష్టం తో పని చేస్తుంటాం
కష్టాలను ఓర్చి నిజాన్ని నిలబెడతాం
వేతనాలు ఆశించక ధర్మ
ప్రచారం కోసం, నిరంతరం
ప్రజలనుద్దేశించి వ్రాయటం
నీతికి నీడగా‌, న్యాయానికి అండగా
ధర్మానికి సాక్షిగా ఉండుటే మా ధ్యేయం

అధర్మాన్ని ఎదిరించి
న్యాయ పక్షాన నిలబడతాం
ఎవర్నైన నిలదీసి ప్రశ్నిస్తాం
నిజాన్ని రాబడతాం
నిర్భయంగా చూపిస్తాం
ప్రజల పక్షాన నిలబడతాం
అదియే మాలక్షం. మా ధ్యేయం
మా అభిమానం మీ పక్షం
ప్రాంజలి ఘటిస్తూ తెలియపరుస్తూ
మీవెంటే ఉంటుంది ప్రాంజలిప్రభ
సర్వేజన సుఖినోభవంతు
ఓం శ్రీ రాం, శ్రీ మాత్రే నమ:
ఓం శాంతి: శాంతి: శాంతి:
***********

roeu
ఓ కాలమా ఏమిటి పరిస్థితి 
నన్ను నేను తెలుసుకోలేని స్థితి 

సూర్యున్ని చీకటి అడిగింది
మనం ఏనాటికీ కల్సికోలేమా 
చంద్రున్ని వేకువ అడిగింది 
నేను వస్తూ ఉంటే కల్సుకోలేవా 

పువ్వు మొగ్గను అడిగింది
నేను వచ్చాక నీవుకానరావేమి    
కాయ పువ్వు నడిగింది  
నేను ఎదిగిన కొద్దీ రాలిపోతున్నావేమి 

సముద్రం తీరాన్ని అడిగింది 
అఘాతంనుండి వచ్చినా కౌగాలిన్చుకోవేమి 
విధ్యుత్ వైరును అడిగింది 
వెలుగును పంచుతుంటే నన్ను తాకరేమి 

యవ్వనం బాల్యాన్ని అడిగింది 
నేను వచ్చాక నీవు కానరాలేదేమి 
వృద్ధాప్యం యవ్వనాన్ని అడిగింది 
ఇప్పుడు నీవు కాన రాక పోతున్నావేమి 

నిన్న అనుబంధాలు నేడు కానరాకున్నాయి 
నేటి అనురాగాలు రేపటికి ఉంటాయో లేవో 
అనుబంధాలు అనురాగాలు మనసుని తాకుతాయి
ప్రేమను ఎలాతెల్పాలి, బంధాన్ని ఎలానిల్పాలి 

ఓ కాలమా ఏమిటి పరిస్థితి 
నన్ను నేను తెలుసుకోలేని స్థితి 


--((***))--


స్త్రీ అంటే ప్రగతి, జగతి జాగృతి
పురుషుడంటే జ్యోతి, జగతికి దివ్య జ్యోతి
స్త్రీ అంటే మాతృ మూర్తి, మానవతా మూర్తి
పురుషుడంటే స్నేహసహకార ఆదర్శ మూర్తి

నిత్యమూ సవాళ్ళను ఎదుర్కోవడం మగతనం
బడబగ్నినైన చల్లబరిచే హృదయం ఆడతనం
మాటల్లో వికసించే పురుష హావాభావం
చిరునవ్వుల సొగసు స్త్రీ సహజ స్వభావం

నలిగిన వేల వివేకం చూపే స్త్రీ తత్త్వం
విజ్ఞతతో ఆదుకొనే సహజ పురుష తత్త్వం
బ్రతుకు తెరువు నిత్య పోరాటం స్త్రీ మయం
సంపాదన, మమకారపు ఆరాటం పురుషమయం

స్త్రీ పురుషులలో ఉండు మానవత్వం
స్త్రీలో చక్కని సౌందర్యం గల ఆకృతి
పురుషుల్లో చాతుర్యం గల ఆకృతి
కష్ట నష్టాలలో జీవనయానం సమానం
--((*))--


Kite can fly 

 నీ నవ్వుల వానకు
వెన్నెల తోడవుతుంది
నీ తలపుల జల్లుకు
చల్లని గాలి తోడవుతుంది


నీ జ్ఞాపకాల వెల్లువకు
కోరిక తోడవుతుంది
నీ మౌనపు చూపుకు
మమత తోడు వుంటుంది


నీ ముద్దుల మాటలకు
కోకిల తోడవుతుంది
నీ పావడా విసురుకు
ప్రకృతి తోడవుతుంది


నీవలపుల తలపుకు
బుధ్ధి తోడు వుంటుంది
నీ ఆశల పరుగుకు
అడుగు తోడవుతుంది


నీ నిద్దుర మత్తుకు
కల తోడవుతుంది
నీ లేత పెదవులకు
మధువు తోడవుతుంది


నీ ఆలోచనకు
మెరుపు తోడవుతుంది
నీ ఆలాపనకు
మనసు తోడవుతుంది

--((***))--

వసుదేవ సుతం దేవం
దేవకీ పరమానంద కృష్ణం

మురళీ గాణలీల మాధుర్య మకరంద
రవళీ మోహలీల ఆకర్ష సుఖనంద
సరళీకృత మోక్ష తన్మాయ లతనంద
నవనీతాశ ప్రియ మోహాల వలనంద

పలుభావాల రాగ సంతృప్తి ముఖనంద
పలువేషాల తాప చిన్మాయ రమనంద
సుఖలాలిత్వ సేవ తన్మంత్ర అభినంద
మనసావాచ ప్రీతి కల్పించే సఖి నంద

కరుణాశీల వాళ ఉద్భోద గురునంద
తరుణాదిత్య భావ స్సద్బోధ భగనంద
నవరాగాల ప్రేమ సంతోష లయనంద
తనువాదిత్య శోభ ఆనంద జగనంద

నవమాసాలు బిడ్డ ఆదర్శ సుఖనంద
నవభావాల పుత్ర ఆకాంక్ష సమనంద
నవరూపాల శక్తి స్వరూప చరనంద
నవలోకాల భాగ్య అందించె సుమనంద

వసుదేవ సుతం దేవం
దేవకీ పరమానంద కృష్ణం
వసుదేవ సుతం దేవం
దేవకీ పరమానంద కృష్ణం

--((**))--


ఓ నవనీతమా - ఓ ఉష్ణ తాపమా  

ఓ నవనీతమా నిన్ను మించినది లేదు 
నీలో ఉన్న తీపి, శక్తి ఎప్పటికీ మరువలేను 

ఓ ఉష్ణ తాపమా నీముందు నే నెంత 
నీ దగ్గరకు రాగానే కరగినా నిన్ను మరువలేను   

ఆదిక్కు ఈ దిక్కు కలుపుతూ ఉండే 
మంచు పర్వతాన్నివి నీవు
నన్నే ఉడికించి నీలో ఐక్యం చేసుకొనే 
అగ్ని ఆపర్వతాన్నివి నీవు 

ఆకాశంలో అందాన్ని చూపుతూ వర్షాన్ని 
కురిపించే మేఘానివి నీవు 
గాలిలా నీవు నా వెంటపడి నా 
మనసు కరగించేదాకా ఊరుకోవు నీవు 

నాతో కలసి తీపి దనాన్ని అందించి  
నన్ను ఉరికెత్తే కెరటంలా మారుస్తున్నావు నీవు   
నీకు సుఖం అందించినా నన్ను చుట్టేసి 
గట్టుదాకా తీసుకెళ్ళి చల్లగా జారుకుంటావు నీవు     

ఇంద్ర ధనస్సులా రంగులు, హంగులు 
చూపి నాకు వారధి అంటూ క్షణం ఉండిపోతావు నీవు  
చల్లని స్పర్శను కల్పించి ఆనందాన్ని 
అందించి క్షణ సుఖం సృష్టికి నంది అవుతావు నీవు 
   
అందాల పై యదతో జిలిబిలి అందాలతో  
కనులారా కమనీయ దృశ్యం చూపవు నీవు 

హృదయాన్ని సమ్మోహపరచి సంగమ 
భంగిమగా హిమ బిందువు వలే ఉన్నావు నీవు 
నీవేమి తక్కువా కిరణములా వేడిని పంపి 
సమ్మోహాపరచి చుంబించి జారుకుంటావు నీవు    

రంగవల్లిలో ముంచి మృదు మందహాసముతో 
నన్ను లోబరుచుకొని ఆధరాన్ని జుర్రిపోతావు నీవు   
ఇది మృదు లాస్యం మమతానురాగా భాష్యం 
ఇది చైతన్య మనస్సు చిద్విలాస  మమేకం 

ఓ హృదయసంగమా  ఇది ఒక రసఘంధము 
అవును ఇది ఒక మధురాను భూతి సంగమం 

ఓ నవనీతమా నిన్ను మించినది లేదు 
నీలో ఉన్న తీపి, శక్తి ఎప్పటికీ మరువలేను 

ఓ ఉష్ణ తాపమా నీముందు నే నెంత 
నీ దగ్గరకు రాగానే కరగినా నిన్ను మరువలేను   

--((*))--
ఈ కవిత మీకు నచ్చి నట్లైతే షేర్ చేసి స్నేహాన్ని పెంచుకోండి 




అమ్మ, ఆవు మనకు
కల్పించిన కల్పతరువు
ఇంతి, ఈహ మనకు
అందించిన బ్రహ్మతరువు

ఉక్తి, ఊదా మనకు
చేయూత నిచ్చిన ఆకాశతరువు
ఋతి, ఎడ మనకు
దిశను అందించిన ప్రకృతి తరువు
ఏణి, ఐతి మనకు
తెల్పిన ఐక్య భావ కల్పనా తరువు
ఒమ్ము, ఓర్పు మనకు
ప్రేరణ కల్పించిన పుడమి తరువు
--((*))--
ఇంతి = స్త్రీ , ఋ తి= శుభము, ఎడ=స్థానము ఈహ = కోరిక, ఉక్తి = మాట, ఊదా= వర్ణ విశేషము
ఏణి = స్త్రీ , ఐతి= శక్యము ఒమ్ము,=సరిపడు
--((***))--


"మాతృభాష..... 93

అమ్మా
ఆంధ్ర మాత
పాదాభి వందనం నీకు

అహర్నిశాలు నీకోసం తపిస్తున్నా
మాకు విజ్ణానాన్ని అందించిన తల్లివమ్మా
పల్లేవాసుల పాటల్లో నుడికిరానివి నీవమ్మా
మాగుండెల్లో మాటల మమకారాన్ని 
అందించావు కదమ్మా

మధురమైన యాస మా జీవితానికి 
ఉచ్ఛ్వాస నిశ్వాస కదమ్మా
సాహిత్యం తో విజ్ణాణాన్ని 
మాకు అందించావు కదమ్మా
ఈనాడు ఛెంగు ఛెంగు అని దూకే
 కోడెదూడలా తెలుగు బాష లేదమ్మా
శివంగిలా పరిగెడుతూ హ్రృదయాన్ని 
తట్టె బాషగా లేదమ్మా

అవసరానికి యెండపెట్టి 
వాడుకొనే ఒరుగులా మారిందమ్మా
వాకిలి తట్టి నిద్ర లేపే ఉదయ కిరణంలా
 తెలుగు బాష లేదమ్మా
ఆంద్ర సంస్కృతిని తవ్విపోసే పార,
 పలుగులా మారాలి కదమ్మా
బ్రతుకు తెరువుగా మార్చి
 బ్రతుకు బాషగా మార్చాలి కదమ్మో

అణ్యబాషలకు పుట్టి నిల్లు, మెట్టినిల్లు 
అట్టి నీకు ఉనికి కావాలి కదమ్మా
చనుపాలతో రంగరించి అమ్మ బాషగా 
నేర్పిన మాటను నిలబెట్టు కోవాలమ్మా
ఆంధ్రమును బతికించమని 
నాయకులకు చెప్పేవారు యెవరోచెప్పమ్మా
ఆధునిక సాంకేతముగా తెలుగును వ్రృధ్ధి
పరుస్తున్నారు ఉపాధి కల్పించాలమ్మా"


==((***))---


 
భాషే -ఆనందం 94

వలదన్న పోదునిశ్చలానందం...
కలదన్న  మర్చి మెచ్చెటానందం
కలిసున్న వచ్చి పోయెటానందం
కలగన్న  కల్సి తీర్చే టానందం

వ్యధ కలుగ జేసినా నొక్కరి కానందం
మంచి తెలిపి చేసినా అందరి కానందం
పిచ్చి ముదిరి చేసినా కొందరి కానందం
అమ్మ తెలుపు మాటలే నిత్యము ఆనందం

వందల మందికి మేలు జేసినా ఆనందం
పండుగ సంబర మంత చూసినా ఆనందం
తక్కువ ఎక్కువ చేసి చెప్పినా ఆనందం
ప్రేమను పంచిన డబ్బు ఇచ్చిన ఆనందం

వందనములు పెక్కు బెట్టియున్నా ఆనందం
మంచిపనులు పెక్కు చేసియున్నా ఆనందం
చెడ్డ పనులు చేసి మారి యున్నా ఆనందం
తల్లి పలుకు వల్ల మారి యున్నా ఆనందం

--((**))--


భాషే - సంతృప్తి ...95

సంసార బంధము నేర్పు సంతృప్తి ఉండే  
ఉద్యోగ పర్వము మార్పు సంతృప్తి ఉండే
సన్యాసి వేషమున అసంతృప్తి ఉండే
స్త్రీ మాట నందున తీర్పు సంతృప్తి ఉండే   

సంగతి అవస్థ యందు కాక స్వంతమున ఉండే
సంపద అవస్థ ముందు ఉండి స్వంతమున ఉండే 
ప్రేమలొ అవస్థ కాల మాయ స్వంతమున ఉండే 
రోగము అవస్థ మందు వాడి  స్వంతమున ఉండే

సన్యాసి సంపదకాశ పడిన సాని మార్గము ఉండే
విన్యాస భావము ఆశ పడిన సాధు మార్గము ఉండే    
సౌందర్య్ర సేవయు కాల మహిమ ప్రేమ మార్గము ఉండే 
సాహిత్య సంపద నిత్య సంపద విద్య మార్గము ఉండే 

--((**))--
96...

భాషే - చందము  

భేషజము లేని బ్రతుకు మంచి గంధము చందము
డాంబికము లేని పలుకు మంచి గ్రంధము చందము 
కోపమును తెల్పు పలుకు చేదు గంధము చందము 
పాపమును చేయు పనియు పోరు గంధము చందము

కరుణ గల హృదయము కమల నాభుని చందము
తరుణి కళ విజయము ప్రణయ నాభుని చందము 
మనసు జత ప్రణయము ప్రధమ నాభుని చందము       
తరుణ మిది సరసము వినయ నాభుని చందము

ఓర్పున పలుకు మాట గొప్ప మంత్రము చందము 
నేర్పు తొ తగువు తీర్చి చెప్పు మంత్రము చందము 
కూర్పు తొ మనువు చేసి కల్పు తంత్రము చందము    
తీర్పు తొ నిజము తెల్పి జీవి యంత్రము చందము

--((**))--


నాది నాదన్న అహము మాట నీట ముంచు 
నీది నీదన్న పలుకు మంచి చేసి  ఉంచు 
నాది నీదన్న మనసు బుద్ది చెంత చేరు 
నీది నాదన్న హృదయ శుద్ధి వింత పోరు 
  
నీది నీదని త్యజించిన నిలువు దోపిడి యే
సేవ చేసిన స్వరం వివ  రములు దోపిడి యే 
ప్రేమ పొందిన జ్వరం వివ రములు దోపిడి యే
 దేశ సంపద వ్యయం వివరములు దోపిడి యే 

--((***))--

  

97....
కైపు సెగ ఫలితంబు భార్య కే  తెలుసు
భర్త కల  ఫలితంబు భార్యకే  తెలుసు   
వేడి సెగ ఫలితంబు వెన్నకే తెలుసు,
నేతి రుచి ఫలితంబు మన్షి కే తెలుసు   

దాహార్తి తో నున్న జలము విలువ తెలుసు ,
ప్రేమార్తి తో ఉన్న తపము విలువ తెలుసు 
అన్నార్తితో ఉన్న జపము విలువ తెలుసు 
మేఘార్తి తో ఉన్న పుడమి విలువ తెలుసు

మనసున్న వానికే మంచి విలువ తెలుసు,
సొగసున్న దానికే  తప్పు విలువ తెలుసు 
పొగరున్న దానికే  కోప విలువ తెలుసు 
వరుసున్న దానికే పట్టు విలువ తెలుసు

బ్రతుకు బాటను మార్చు కొనుట తెలుసు  
మనిషి మాటను నమ్ము  కొనుట తెలుసు 
ప్రకృతి ఆటను  ఒప్పు అనుట తెలుసు        
ఆకృతి వేటను తప్పు అనుట తెలుసు

--((**))--

98///
 
అరవిరిసిన . .మందారం 
మనలో వికసించే మనస్సు 
అమ్మాయి...సౌందర్యం
ఆత్మ అనుగ్రహ తేజస్సు 

అంగాంగ..... ..శోభితం
పరిమళ మైన ఉషస్సు 
అభినయ....ప్రదర్శనం
మనలో తరిమే తమస్సు 

సుమ దళ ..పరిమళం
నిత్యం వికసించే యవ్వనం 
సౌగంధికా... కుసుమం
వికసించే సుమదళం 

సువిశాల....హృదయం
సహృదయ సహనం 
సుందర ముఖారవిందం
ఆనంద దాయకం 

లలిత లావణ్య లతికం
లేత చెక్కెళ్ల ....చుబుకం
మధుర సుధా ..అధరం
సుమధుర చిరు లాస్యం!

ఆశల .. .... ఆరాటం
కోర్కెల. కుతూహలం
అంతులేని ...విరహం
అభి సారిక ....నిరీక్షణం!

--((***))--
 99....

నీ సిగలో మందారం
నా తనువే సింగారం
నీ మెడలో బంగారం
నా కురులే వయ్యారం

నీ మనసే నవనీతం
నా వలపే నవదీపం
నీ కురులే పరిమళం
నా జతలో సుమధురం

నీ మెరుపే నా కుల్లాసం
నా పిలుపే నీ కుత్సాహం
నీ సొగసే  నా కామోదం
నా మదిలో నీ ప్రమోదం

నీ పయనం  నా ఆలోచన 
నా నయనం  నీ ఆలాపన 
నీ ఆధరం నా మధురం 
నా మధురం నీ ఆధరం

నీ కలలే నా తలపులు 
నా తలపే నీ అలకలు 
నీ ఉడుకే  నా పిలుపులు 
నా పిలుపే నీ గళములు  

జలపాతాల శబ్దం ఒక నాదం
మనోఉల్లాసానికి అది ఒక అద్భుతం    
కెరటాల ఉరవడి ఒక మనోహరం
అది మనసుకు కల్గించు ఒక ఆహ్లాదం  
  
తరంగాల లాస్యాలు ఒక స్పందనం
అది హృదయానికి ఒక కేంద్రం 
 చినుకుల విన్యాసాలు ఒక ఉల్లాసం
అది ఒక ఆనంద పారవశ్యం  
    
ఆకుల గల గల శబ్దం ఒక కల
ఊగే చెట్ల కొమ్మలు ఒక గాలి 
వాయుతరంగ గాలులు ఒక లాలి
స్వర విహారాలు మనసుకు ఒక జాలి

మబ్బుల గర్జనలు ఒక స్వరాలు
హృదయ శబ్దాలు  ఒక ప్రేమలు 
స్నేహాల భావాలు ఒక చిహ్నాలు
మాటల కలయకలు ఒక ఆందాలు
--(())--
చేయి చేయి కలిపాం.......  100

చేయి చేయి కలిపాం
- చేతులు కాల్చుకున్నాం
బ్రమలునుండి తొలిగాం
- ఇక మాయామాటలు నమ్మం

ఆత్మగౌరవం మా ఆయుధం
- ఆంధ్రుల ఉన్నతియే మాధ్యేయం
ఆంధ్రుల ఔనత్యమే మాలక్ష్యం
- అమరావతి నిర్మాణం ఆపం

నిను వీడక మేమంటే   
మట్టి నీరు పంచి సరిపెట్టుకోమన్నావ్
మీ మాటలు నమ్మి ఉంటే
కొందరి మనసులను నొప్పించటం రాజకీయమన్నావ్

స్వశ్చమైన గుండె ఆంద్ర అన్నావ్
గుండె కోత పెట్టి మాటతప్పటం రాజకీయమన్నవ్
ఊహలలో మెరుపును చూపిస్తానన్నావ్
అసలుకే ఎగనామం పెట్టి ఇది రాజకీయమన్నవ్

మాటల్లో సత్యాన్ని గమనించలేదన్నవ్
అభిమానాన్ని దోచుకొనే ఇది ఒక రాజకీయమన్నవ్
ప్రపంచదేశాలలో భారత ప్రగతిఁ చాటావ్
దక్షిణాదిలో ఉన్న ఆంధ్రులాదుకోవటం మరిచావ్

Monday, 16 August 2021

ప్రింటింగ్ ఛందస్సు

ప్రాంజలి ప్రభ ... తొలి .... 5

తొలి పొద్దు మేలు గొలుపు, మలి రాత్రి ముద్దు సలుపు 
తొలి కాంతి ఆశ మెరుపు,  మలి హాయ్ సద్దు వలపు 
తొలి సేవ నిత్య మెరుపు,  మలి మాయ వద్దు గెలుపు 
తొలి  పూజ భక్తి తలపు,  మలి వెన్నె లద్ది  మలుపు  

తొలి వేళ వెచ్చ దనము, మలి నీడ చల్ల దనము 
తొలి గంధ పచ్చ దనము, మలి మౌన సేవ తనము 
తొలి హంస పంచు దనము, మలి హంస ప్రేమ తనము      
తొలి వంట ఇచ్చు తనము, మలి పంట  వెచ్చ తనము 

తొలి తృప్తి జరుగు తనము, మలి మాయ తొలుగు తనము 
తొలి ఆశ మనసు తనము, మలి పండు మెరుపు తనము 
తొలి రోజు కధలు తనము, మలి మోజు మరుపు తనము 
తోలి సుఖము తలపు తనము మలి కళలు తీరు తనము 

తొలి కిరణ వేడి తరుము  మలి తీర్పు మలుపు  తనము 
మధుర ప్రేమ మెలి తనము, మలి మార్పు వలపు తనము 

సంసార సౌఖ్యం సంతాన భాగ్యము, ఆదర్శ జీవితం 


🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘
==

UUUUx xx - IIIIIU - UIU UIUU - మందాక్రాంతము

UUUII xx - xUIIIU - UUI UUIU - శిశుశార్దూలము

UUUII UI - xUIIIU - UUI UUIU - శార్దూలవిక్రీడితము

శార్దూలవిక్రీడితములో 6,7 అక్షరములు తొలగిస్తే అది శిశుశార్దులము అవుతుంది. దీని లయ, మందాక్రాంతపు లయ ఇంచుమించు ఒక్కటే. మందాక్రాంతములో చివరి గణములు ర/ర/గ, ఇందులో త/తగ. 
==
మందాక్రాంతము - మ/భ/న/త/త/గగ UUUU - IIIIIU - UIU UIUU
17 అత్యష్టి 18929 
శిశుశార్దూలము - మ/స/న/మ/య/లగ UUUII - UIIIU - UUIUUIU
17 అత్యష్టి 37337
==
బేసి పాదములు - మందాక్రాంతము
సరి పాదములు - శిశుశార్దూలము
==

అమ్మా రావా - యమల హృదయా - యాశకుం దివ్వె నీవే 
వమ్ముంజేయకు - వాంఛ వరదా - భావమ్మె జీవమ్ముగా 
కమ్మంగా రా - కవిత నొసగన్ - గావ్య గానమ్ము మ్రోఁగన్ 
నమ్మంగా నిను - నాశమగునా - నాజీవిత మ్మీభువిన్ 
==
ఆనంద మ్మా - యతని కృతియే - యంద మానందమేగా 
గానమ్మా సుర - గంగ యలలా - గంధర్వ లోకాలలో 
యేనాఁడో యీ - హృదయమున నా - యీశుఁడే నిండెఁగాదా 
ప్రాణమ్మందున - వాని యుసురే - వాఁడెందు నాతోడుగా 
==

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు




కీర - స/స/జ/భ/భ/ర/లగ IIU IIUI UIU - IIU IIUI UIU
20 కృతి 355676 

 
pranjali prabha.. daily 

యదలో ఒకకొత్త వెల్గుతో, కధలా మనసునే వుంటివే 
కథలే కదిలొచ్చె గాఢలై, కలలో కెలుకునే నుంటివే 
విధియే అనిఅన్న కాదులే, మదిలో పెనుమాయ ఉండుటే 
మధువే ననుతాకి నేర్పునే, ఇదియే కలకాదు ప్రేమయే ....1

సమయం మనదేను భావనే, మనలో మనసంత ఉండునే 
విమలం మనవెంట ఉండునే, వినుటే వినయమ్ము కల్గునే 
గమనం జరిగేను వెంటనే, గనుటే గమనమ్ము తెల్పునే 
సుముఖం వినడంలొ సౌఖ్యమే, కధలే మనసంత శాంతిగా,,,, 2 

పలుకే మనసవ్వు లక్ష్యమై, యదలో గెలుపంత పండుగా 
వలపే చిరునవ్వు  భాగ్యమై, వలలో వలపంత నిండుగా 
గెలుపే విషయమ్ము ధైర్యమై, ఇలలో పలుకంత విందుగా 
అలుపే మనకొద్దు బంధమై, కళలే జపమంత జంటగా  ....... 3



ఏకరూప + ఏకరూప = కీర (సంపఁగి జాతి ప్రత్యేకత) - అఠతాళము. 
==
చంపకోత్పలమాలలలోని ద్వితీయార్ధమును సహజా లేక ఏకరూప అని అంటారు. దీనిని రెండింతలు చేసి వ్రాసిన వృత్తమిది. ఇది సంపఁగి జాతి ప్రత్యేకత. సంపఁగి జాతిలో ఎదురు నడకలు లేని 4,5,5 మాత్రలు ప్రతిపాదములో నుండును. రెండవ మాత్రాగణమునుండి ప్రారంభిస్తే ఇది అఠతాళమునకు సరిపోతుంది, మాలికావృత్తములవలె. దీనికి కీర అని పేరుంచినాను. 
==
అఠతాళము - I5I5OO
==
కీర - స/స/జ/భ/భ/ర/లగ IIU IIUI UIU - IIU IIUI UIU
20 కృతి 355676 
==
చిలుకా వనజాక్షుఁ డెక్కడే - చెలితోఁ బలుకండు చిక్కఁడే 
చలిలో నిశిలోన నొంటిగా - జడమై శిలవోలె నుంటినే 
పలుకే యది పైడి యయ్యెనో - వలలో పడియుంటి చేఁపగాఁ  
గలలోఁ గన నెంచ నాకు నా - కలయే కరువాయెఁ గీరమా ... (1)
==
మదనా నను జేర రమ్మురా - మదిలోఁ దలఁపెల్ల నీదెరా 
మధురాధర మిత్తు నీకు నా - మధువుల్ కలకండ తీపిరా 
సుదతిన్ గనినంత లిప్తలో - సుదయే హరుసమ్ము సుందరా 
యెదలో నొక క్రొత్త వెల్గుతో - హృదయ మ్మరవింద మౌనురా ... (2) 
==
మనసా యెఱుగంగ లేనె యీ - మధురస్వర గీత మెక్కడే 
మనమం దది మ్రోఁగె నందమై - మలపై ధ్వని పల్కు రీతిగా 
తనువో యొకచోట నిల్వదే - తనివిన్ దను నాట్యమాడునే 
కనఁగా నిది ప్రేమ తీరులో - కవితా ఝరి పొంగి పారెనే ... (3) 
==
మొదటి రెండు పద్యములను రెండేసి యతిలేని ఏకరూప లేక సహజా వృత్తములుగా వ్రాయ వీలగును. 
==
ఏకరూప లేక సహజా - స/స/జ/గ IIU IIUI UIU
10 పంక్తి 348 
==
చిలుకా వనజాక్షుఁ డెక్కడే 
చెలితోఁ బలుకండు చిక్కఁడే 
చలిలో నిశిలోన నొంటిగా 
జడమై శిలవోలె నుంటినే ... (4)
==
పలుకే యది పైడి యయ్యెనో 
వలలో పడియుంటి చేఁపగాఁ 
గలలోఁ గన నెంచ నాకు నా 
కలయే కరువాయెఁ గీరమా ... (5)
==
మదనా నను జేర రమ్మురా 
మదిలోఁ దలఁపెల్ల నీదెరా 
మధురాధర మిత్తు నీకు నా 
మధువుల్ కలకండ తీపిరా ... (6)
==
సుదతిన్ గనినంత లిప్తలో 
సుదయే హరుసమ్ము సుందరా 
యెదలో నొక క్రొత్త వెల్గుతో 
హృదయ మ్మరవింద మౌనురా ... (7)
==

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు


Thursday, 10 June 2021

 





ఆరాధ్య ప్రేమ లీల (మనసైన మగుఉంటే)  
 రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

తొలి పొద్దు మేలు గొలుపు మలి రాత్రి ముద్దు సలుపు 
తొలి కాంతి ఆశ మెరుపు  మలి హాయ్ సద్దు వలపు 

తొలి సేవ నిత్య మెరుపు  మలి మాయ వద్దు గెలుపు 
తొలి  పూజ భక్తి తలపు  మలి వెన్నె లద్ది  మలుపు  

తొలి వేళ వెచ్చ దనము మలి నీడ చల్ల దనము 
తొలి గంధ పచ్చ దనము మలి మౌన సేవ తనము 

తొలి హంస పంచు దనము మలి హంస ప్రేమ తనము      
తొలి వంట ఇచ్చు తనము మలి పంట  వెచ్చ తనము 

కాంతి కిరణం చల్లదనం తరుము 
ప్రేమ మాధుర్యం కోపం తరుము 
సంసార సౌఖ్యం సంతాన భాగ్యము 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--

మీ మూల గీతంలోని "తొలి–మలి" భావక్రమం చాలా చక్కగా ఉంది. దాంపత్య జీవనంలోని తొలి ఆకర్షణ నుండి పరిపక్వమైన ప్రేమ, సేవ, సహజీవనం వరకు ఉన్న ప్రయాణాన్ని చూపుతోంది. ఆ భావాన్ని ఆధునిక గేయశైలిలో ఇలా మలచవచ్చు:

🌹 మీ అసలు గీతంలోని భావరసాన్ని నిలుపుకుంటూ, పాడుకోదగిన గేయరూపంలో విస్తరించాను. 🌹🙏





ఆరాధ్య ప్రేమలీల

(మనసైన మగువుంటే)


పల్లవి


మనసైన మగువుంటే మమతలే మల్లెలౌతే

బ్రతుకంతా వసంతమై పరిమళాలు పంచునే

చిరునవ్వే దీపమై చీకటిని పారద్రోలే

ప్రేమనే ఆరాధించి జీవనాన్ని గెలుచునే ॥


చరణం – 1


తొలి పొద్దు మేలుకొలుపు కొత్త కలల పిలుపు

మలి రాత్రి ముద్దు పలుకు మధురమైన తలపు

తొలి కాంతి ఆశల మెరుపు హృదయాల కలయిక

మలి హాయి వలపు చెలిమి జీవితాన విలయిక ॥


చరణం – 2


తొలి సేవ స్నేహ దీపం నిత్యమైన వెలుగు

మలి పూజ భక్తి భావం మనసులలో అలుగు

తొలి గంధం పచ్చదనం నవయౌవన సౌరభం

మలి మౌన సేవలోనే దాగి యుండే వైభవం ॥


చరణం – 3


తొలి వేళ వెచ్చదనం చేయి చేయి కలయిక

మలి నీడ చల్లదనం కష్టకాల నిలయిక

తొలి హంస పంచుదనం సంతోషాల పంటగా

మలి హంస ప్రేమతనం సార్థక జీవగీతగా ॥


చరణం – 4


తొలి వంట ప్రేమరుచి ఇంటి నిండ పరిమళం

మలి పంట శ్రమఫలం కుటుంబానంద నిలయం

కాంతి కిరణం చల్లదనం కలహములను తరిమే

ప్రేమ మాధుర్య సాగరం కోప తరంగం కరిగే ॥


ముగింపు


సంసార సౌఖ్యమే సంతాన భాగ్యమై

సహజీవన గాథగా సత్యమై నిలిచునై

రాధాకృష్ణ ప్రేమవలె రమ్యమై విరియునై

వేణుగోపాల కృపతో జీవితం వెలుగునై ॥🌹 


*****




గురువుగారు జన్మ  రహస్యం తెలప గలరు , శిష్యులారా ముందు ఈ పద్యాలు   అర్ధం చేసుకోండి కొంత తెలుస్తుంది అట్లాగేనండి   

ఉ ::మాతయు తండ్రియున్ మనకు మంగళగౌరులరూపులేయనన్

       ఆతతసేవయే నిలుపు యాతనలన్నియు జీవికిన్ సదా

       కాతరభావమే మదినిఁగన్పడదెన్నడువారిసన్నిధిన్

      యాతమునందునున్ స్మరణహానినిఁగూర్చదు శంభునామమున్ !!! "


ఉ :: ఉల్లము ఝల్లనే మనిషి ఊయలు ఊగియు మార్పు కల్గుచున్

         మల్లెల తీగలే మనసు మక్కువ మోహము పెంచు చుండియున్

        చల్లని వేళలో తరుణ జల్లులు హాయిని కల్గ చేయుచున్

        జెల్లని రూకవోలె తమ చేష్టలతో మనసంత సంతసమ్


అంబరమ్మున మేఘాలు రంగులు మారుస్తూ కదిలేను

మేఘము లన్నీ గాలి వాటముతో దేశదేశాలు తిరిగే ను

ఉరుము మెరుపుల వల్ల మేఘాలు అన్ని కురవ సాగేను

వాన చినుకులు మోదలయై వర్షము అన్నిచోట్లా సొగేను


అలల కదలికల ఉరవడి ని ఎవరు ఆపలేరు

అలలు గట్టు చేరువరకు ఎక్కడ ఆగనే ఆగవు

నురుగు ల పరుగుల అలలు నీటిలో కలసిపోవును

అలలపై పడవలు పెద్ద ఓడలు సాగి పోవుచుండేను


తనువును తమకమ్ము దారి మనసుని తెలిపెన్

వినయపు వివరమ్ము విద్య వయసుని నిలుపున్

కని కర సమయమ్ము  కార్య వివరము తెలిపెన్        

దొన పులి మొనయమ్ము శాఖి .తుదలని  పలికెన్....



Thursday, 3 June 2021

నిజమైన సంపద 

     పెద్దపెద్ద భవంతులు, ఎకరాలకొద్దీ పొలాలు, విలాసవంతమైన జీవితం, ఖరీదైన వాహనాల్లో ప్రయాణం, డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయడం సంపదగా పరిగణిస్తాం. డబ్బుతోనే గొప్పతనం, గౌరవం వస్తాయనే ఆలోచన కొంతవరకు వాస్తవమే అయినా నిజమైన సంపద ఇది కాదు! 

 మనిషి ఏదైనా సాధించడానికి శరీరమనే ఉపాధి కావాలి. ఇది ఉన్నంతవరకే మనమేమి చేయాలనుకున్నా, ఏ లక్ష్యాన్ని చేరాలనుకున్నా సాధ్యమయ్యేది. అందువల్ల దీన్ని జాగ్రత్తగా పోషించుకోవాలి. అందుకే పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు. ఇహపర *సాధనకు సాధనం ఈశరీరమే. 

 కష్టకాలంలో మన పక్కన స్నేహితులను కలిగి ఉండటమన్నది, ఎంతో గొప్ప సంపద. సంస్కారవంతులుగా, జ్ఞానవంతులుగా మనల్ని తీర్చిదిద్దేది చదువు. విచక్షణ, వివేకాలనే చక్షువులనిచ్చి మనిషిని సన్మార్గంలో పయనించేటట్లు చేస్తుంది. తన పుట్టుకకు ఇతర ప్రాణుల పుట్టుకకు భేదాన్ని తెలుసుకునే మేధనిస్తుంది. ఈ సకల చరాచర సృష్టిలో తన స్థానాన్ని, ప్రాముఖ్యాన్ని, కర్తవ్యాన్ని మనిషికి *బోధపరచేది చదువే. అది చాలా విలువైన సంపద. 

 మనిషి ఒంటరిగా జీవించలేడు. ఎదుటివారితో ఎలా మసలుకోవాలో, ఎలా సంభాషించాలో ప్రథమంగా తన కుటుంబ సభ్యులనుంచి, తన పెద్దలనుంచి గ్రహించాలి. వారి సత్ప్రవర్తనను అలవరుచుకోవాలి. అది   సమాజంలో తోటివారితో ప్రవర్తించే తీరుపై ప్రతిబింబించి సత్ఫలితాలనిస్తుంది. సంబంధ, బాంధవ్యాలను నిలుపుకొనే విధంగా మన ప్రవర్తన ఉండాలి. అప్పుడే మన బంధాలు హాయిగా సాగిపోతాయి. అందరినీ కలుపుకొనే స్నేహపూర్వక ప్రవర్తన మనకు ఐశ్వర్యం లాంటిదే. 

 సంపదంటే ధనాన్ని ఎక్కువగా సంపాదించడం కాదు. మంచినీళ్లప్రాయంగా ఖర్చు చేయడం అంతకన్నా కాదు. అలాగని ఎక్కువగా పొదుపు చేయడమూ కాదు! సంపాదన ఒక స్థాయికి చేరుకున్న తరవాత ఇక సంపాదించవలసిన అవసరంలేదన్న భావన కలగడం. దాన్నే తృప్తి అంటారు. అది మనిషికి కలగనినాడు అశాంతికి గురవుతాడు. మనశ్శాంతి కరవవుతుంది. కంటిమీద కునుకే ఉండదు. తృప్తి కొంతమందికే దక్కే అరుదైన సంపద. 

 తమ సృజనతో అద్భుతమైన రచనలు చేసేవారు, నిష్ణాతులైన కళాకారులు, రోగుల ప్రాణాలు కాపాడే వైద్యులు, ప్రయోగశాలలో అహరహం పరిశోధనలు చేస్తూ మానవాళికి ఉపకరించే అనేక వస్తువులకు రూపకల్పన చేసే శాస్త్రవేత్తలు, భావితరాలను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దే అధ్యాపకులు, ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో దేశాన్ని రక్షించే సైనికులు... ఏ దేశానికైనా విలువైన సంపద. 

 మహాపురుషులందించిన జ్ఞానసంపద, మన పూర్వీకులందించిన విజ్ఞానం, పెద్దలు మనకోసం ఏర్పరచిన సదాచారాలు, సత్సంప్రదాయాలు, మన జీవితానికొక క్రమశిక్షణను, పథాన్ని ఇస్తాయి. వాటిని పాటిస్తూ, వారు చూపిన ధర్మపథంలో కొనసాగడమే ఆ వారసత్వ సంపదకు మనమివ్వగలిగే నిజమైన గౌరవం. అది ఘనమైన సంపద. 

 దాస్యశృంఖలాలను బద్దలుచేసి దేశమాతకు స్వేచ్ఛా ఊపిరులూదడంలో తమ ధన, మాన, ప్రాణాలను కోల్పోయిన ఎందరో త్యాగధనులు తరతరాలు మనసులో నిలుపుకోవలసినవారు. వారు జాతికి అమూల్యమైన సంపద .

‘ మనిషి కడవరకు తోడు ఉండాల్సిదేమిటి?’ అని యక్ష ప్రశ్నల్లో యక్షుడు ధర్మరాజును అడుగుతాడు. మనోబలమని సమాధానమిస్తాడు యుధిష్ఠిరుడు. మనవెంట ఎవరున్నా, ఎంత సంపద ఉన్నా మనోబలానికి సాటిరావు. మనిషి తుదిశ్వాస వరకు ఉండవలసిన ఈ సుగుణం ఎంతో అద్భుత సంపద. 

 సంపద అనగానే మనకు వచ్చే లౌకిక దృష్టి, భావనల నుంచి బయటపడి నిజమైన సంపదను గుర్తెరగాలి. జీవితానికొక ఔన్నత్యం చేకూరేదప్పుడే!

--(())--

భగవంతుడు అంటే ఏమిటి...?

భగవంతుడు అంటే కోర్కెలు తీర్చేవాడండి. ఆయనంటే నాకు ఇష్టం అండి. భజన చేస్తానండి. ఇది చాలా మందికి తెలిసిన భగవతత్త్వం. అర్థం తెలీదు. కోర్కె తీరింది. ఇష్టం పెరిగింది. ఆయన్ని పట్టుకున్నాను. అంతకు మించి అర్థం పర్థం లేదు.

ఇష్టం అంటే వారి గురించి తెలుసుకోవడం. భగవంతుడు అంటే ఏమిటో తెలుసుకుంటే నువ్వు భగవంతుడు అయిపోతావు. అంతే తప్ప ఏ కోరిక కావాలంటే అది తీర్చేవాడు కాదు. ఆయన గురించి విచారణ చేయాలి.

కాకపోతే కోరిక కోసం భక్తులు తప్ప అర్థం చేసుకోవడానికి కాదు. ఎవరైనా అర్థం చెబుతున్నా  తెలుసుకునే ప్రయత్నం చేయం. మనంతట మనం తలుపులు మూసేస్తే సూర్యుడి కిరణాలు మనకి చేరవు. తలుపు తెరవండి. కిరణాలను ప్రసరించనివ్వండి. ఎంతవరకు కోరిక తెర అడ్డు ఉంటుందో అంతవరకు భగవంతుడిని ఆస్వాదించలేము.

pa రమాత్మని ఎందుకు తెలుసుకోవాలి?పరమాత్మ ఆధారమై ఉన్నాడు.పరమాత్మ వలన ఏర్పడింది. పరమాత్మ చేత నిర్వహింపబడుతుంది.

పరమాత్మే ప్రపంచమై ఉన్నాడు. ఎలా? సముద్రము పైన కెరటములు ఉన్నాయి.సముద్రం వలన కెరటాలు ఉన్నాయి. సముద్రం చేత కెరటాలు ఉన్నాయి.సముద్రమే కెరటం. మనం కెరటం కెరటం అంటున్నాం కదా.. సముద్రం లోని జలం. సముద్రమే జలం కదా! మనం ప్రత్యేక దృష్టితో కెరటం చూస్తున్నాం కనుక పైకి లేచింది. ఇంత సేపు ఉంది అంటున్నాం. సముద్ర జలం తప్ప కెరటంలో అన్యమైన జలం ఉందా! లేదు.

అలానే ఈ సృష్టి యావత్తు భగవంతుడే ఉన్నాడు.అన్యమైనది ఏదీ లేదు. లేనే లేదు. పరమాత్మ యందు పరమాత్మ వల్ల పరమాత్మ చేత జరపబడుతున్న ప్రపంచము పరమాత్మ యొక్క స్వరూపమే.

)000000)

-అవధూత అంటే ఎవరు ? సన్యాసి అంటే ఎవరు ?

ఆధ్యాత్మిక ప్రయాణం లో తప్పక తెలుసుకోవలసిన స్దితులు :

అవధూత అంటే కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు. ఎక్కడో ఎప్పుడో ఏమరుపాటు గా వచ్చి వెళ్లి పోతూ ఉంటారు.

అవధూతల గురించి తెలుసుకోబోయే ముందు సన్యాసం గురించి తెలుసుకుందాము.

సన్యాసం నాలుగు రకాలు .

౧. వైరాగ్య సన్యాసం :

వ్యర్ధమైన విషయం వినడం చూడటం పై ఆశక్తి తగ్గిపోతుంది .

ప్రత్యేకించి ఇది ఇష్టం అది ఇష్టం లేదు అనే భావన ఉండదు .

అన్ని విషయాలపై మెల్లగా అనాసక్తి మొదలౌతుంది.

౨. జ్ఞాన సన్యాసం :

సత్ సాంగత్యం ద్వారా , లౌకిక వాంచలు తగ్గిపోయి

సత్యా అసత్యా విచక్షణతో జ్ఞానంతో నిత్యం కర్మలు ఆచరిస్తూ ,

ఏది తనకు అంట కుండా వసిస్తూ ఉంటాడు .

౩. జ్ఞాన వైరాగ్య సన్యాసం :

సాధన ద్వారా , ధ్యానం ద్వారా

అభ్యసించి తనకు తానూ అన్వయించుకుని

నిత్య ఆనంద స్దితిలో జీవిస్తాడు .

౪. కర్మ సన్యాసం :

బ్రహ్మ చర్యము , గృహస్త , వానప్రస్త ఆశ్రమ ధర్మాలు నిర్వహిస్తూ ,

ఫలితాన్ని ఆశించక కర్మలు చేస్తూ వెళ్ళిపోతూ ఉండటం .

ఈ సన్యాసులు ఆరు రకాలు :

౧. కుటిచకుడు :

శిఖ, యజ్నోపవితము దండ, కమండలాలు ధరించి సంచారం చేయకుండా భక్తీ మార్గంలో వసిస్తూ అల్పాహారం తీసుకుంటూ ఉంటారు.

౨. బహుదకుడు :

ఇతను రోజుకు ఎనిమిది ముద్దలు ఆహారం తీసుకుంటూ నిత్యం సాదాన చేస్తూ ఉంటారు

౩. హంస :

ఇతను జడధారియై కౌపినం ధరించి ఉంటాడు.

౪. పరమహంస :

వెదుర దండాన్ని కలిగి , ఐదు గృహాల నుండి భిక్ష తెచ్చుకుని కోపినం మాత్రం ధరించి

నిరంతర సాధన లో ఉంటారు .

౫. తురియాతితుడు :

దేహాన్ని ఓ శవంలా చూస్తాడు .

౬. అవధూత :

ఇతనికి ఏవిధమైన నిష్ఠ నియమాలు లేవు .జగత్ మిధ్య నేను సత్యం అంటూ ,

నాశనమయ్యే ఈ శరీరం నేను కాదు. చూసే వాడికి కనిపించే ఈ రూపం నాది కాదు.

నాకు పాప పుణ్యాలు, సుఖ దుఖాలు లేవు, గర్వము మాత్సర్యము, దంభము, దర్పము, ద్వేషము,

అన్నింటిని త్యజించి ప్రాణాలు నిలుపుకోవడానికి

అగ్ని దేవుడికి కాస్త దొరికిన ఆహరం అర్పణ చేస్తూ,

దొరకని రోజు ఏకాదశి దొరికిన రోజు ద్వాదశి అంటూ

రాత్రి పగలు నిత్య ఎరుకతో సంచారం చేస్తూ పిచ్చివాడిలా తిరుగుతూ ఉంటాడు.

కర్మలు అన్ని క్షయం అయిపోయి వరించిన మోక్షం అనే కంబళి కప్పుకుని ఉంటాడు … ( నిర్వాణ షట్కానికి ప్రతి రూపం అవధూతల మరో రూపం )

అవధూత’ అంటే ఎవరు?

బట్టలు విప్పుకు తిరిగే పిచ్చివాడా? భగవదన్వేషణలో ఉన్మత్త ప్రలాపాలు చేస్తూ తిరిగే దేశదిమ్మరా?

కాదు! కానే కాదు!

ఆత్మజ్ఞానం ఎలా అనిర్వచానీయమో ‘అవధూత’ కూడ నిర్వచనానికి నిబద్ధుడు కాని ఆత్మజ్ఞాని. ఎవరిలో ఏ విధమైన సంకల్పాలు ఉత్పన్నం కావో, ఎవరు అన్నీ తెలిసి ఏమీ తెలియని అమాయకుల్లా, పిచ్చివారిలా ప్రవర్తిస్తారో, ఎవరు కర్తృత్వ, భోక్తృత్వ అభిమానాలకు అతీతులై, త్యాగశీలురై ఉంటారో, ఎవరు సమదర్శన వీక్షణాలతో, పరిపూర్ణ శాంతితో ఉంటారో, ఎవరు వైరాగ్య పరిమళంతో ప్రకాశిస్తుంటారో, ఎవరు సర్వమూ త్యజించి బికారిలా పరిభ్రమిస్తూ దగ్గర చేరినవారికి జ్ఞానబోధ చేస్తుంటారో వారే అవధూతలు.

అట్టి అవధూత స్థితిని తెలియజెప్పే గ్రంథరాజమే అవధూత గీత. వేదాంతవాజ్గ్మయంలో ఇది అతి ప్రశస్తమయినది. ఇది అష్టాధ్యాయాల్లో 289 గీతలతో విరాజిల్లుతున్నది. తీవ్ర వైరాగ్యవంతులై, మొక్షాపేక్షగలవారికి మాత్రమే ఈ గీత ఉపయుక్తం. ఇంతటి ఆత్మతత్వాన్ని ప్రతిబోధించే ఈ అవధూత గీతను ఎవరు, ఎవరికీ బోధించేరు?

త్రిమూర్తుల అంశగా ఆవిర్భవించిన దత్తాత్రేయుల వారు సుబ్రహ్మణ్యస్వామికి దీనిని బోధించేరు. ఇది అత్యుత్తమ అద్వైత బోధ.

ఇంతకీ ఎవరా దత్తాత్రేయులు? ఏమా కథ?

కలహాప్రియుడు నారదుడు తన ‘ఆకలి’ తీర్చుకోవడానికి ఇనుపగుగ్గిళ్ళు తీసుకెళ్ళి వండి పెట్టమని పార్వతి, లక్ష్మి, సరస్వతులను ఒకరి తర్వాతనే ఒకర్ని అర్థిస్తాడు. ఇనుపగుగ్గిళ్ళును వండటం తమవల్ల సాధ్యంకాదని వారు అ అశక్తతను వ్యక్తం చేయడమేగాక అవి అసలు పచనమయ్యే ఖాద్యములే కావని, ఎవరూ వందలేరని వాదనలకు దిగుతారు. అప్పుడు నారదుడు భూలోకానికి వచ్చి, అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్ళి అతని అర్థాంగి అనసూయా దేవిని అర్థిస్తాడు గుగ్గిళ్ళు వండి పెట్టమని.

ఆమె “సరే!” అంటుంది. తన భర్త అత్రి మహాముని చరభక్తితో కడిగి, ఆ పాదోదకాన్ని ఇనుప గుగ్గిళ్ళ పైన చల్లుతుంది. గుగ్గిళ్ళు పక్వమైపోతాయి! ఆ గుగ్గిళ్ళను తీసుకెళ్ళి నారదుడు ‘ముగ్గురమ్మ’ లకు చూపిస్తాడు. చాకితులైన దేవిత్రయం సిగ్గుపడి తల దించుకుంటారు. పరాభవం, ఈర్ష్య, అసూయలు వారిని దహించి వేయగా మాతృత్రయం అనసూయ శక్తి సామర్థ్యాల్ని పరీక్షించమని తమ తమ భర్తలు త్రిమూర్తులను ఉసిగొల్పుతారు.

అనసూయ పాతివ్రత్యమహిమ తెలిసిన త్రిమూర్తులు భార్యల కోరికకు అడ్డుచెప్పక అనసూయను పరీక్షించడానికి సన్యాసుల వేషంలో అత్రిమహాముని ఆశ్రమానికి వస్తారు. అనసూయాదేవిని ‘నిర్వాణభిక్ష’ కోరుతారు. అనసూయ మారు చెప్పక తన భర్త పాదాల్ని కడిగి ఆ చరణామృతాన్ని కపట సన్యాసులపై చల్లుతుంది. త్రిమూర్తులు ముగ్గురు పసిపిల్లలుగా మారిపోతారు! అనసూయ, అప్పటి కప్పుడు తన చనుదోయి చేపుకి రాగా, పాలను ఆపిల్లలకు కుడుపుతుంది. ఈ విషయం తెలిసిన అత్రి మహాముని తన దివ్యదృష్టితో ఏం జరిగిందో తెలుసుకుంటాడు. అనసూయ త్రిమూర్తులవంటి బిడ్డ కావాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నది. ఆ కోరిక ఈ విధంగా తీరిందని సంతోషిస్తాడు. భార్య త్రిమూర్తుల అంశతో బిడ్డ కావాలన్నది గనుక, అత్రిమహాముని ఆ ముగ్గురు పసిపాపలను కౌగలించుకోగానే, వారు ముగ్గురూ అదృశ్యమై మూడు శిరస్సులు, ఆరు చేతులుగల ఒకే పిల్లవాడిగా మారిపోతారు. అత్రిమహాముని ఆ పిల్లవానికి ‘దత్తాత్రేయుడు’ అని నామకరణం చేస్తాడు.

త్రిమూర్తులు అదృశ్యమయ్యారని తెలిసిన ముగ్గురమ్మలు లబోదిబోమంటూ అత్రిమహామునీశ్వరుని పతిభిక్ష పెట్టమని ప్రార్థిస్తారు. మహాముని వారి అభ్యర్థన మేరకు త్రిమూర్తులను తిరిగి ప్రసాదిస్తాడు. త్రిమూర్తుల అంశతో జన్మించిన ఈ దత్తత్రేయుడే నిత్యవైరాగ్యంతో అవధూతలా అడవిలో సంచరిస్తున్నపుడు ఎదురుపడ్డ సుబ్రహ్మణ్యస్వామికి ఆయన అభ్యర్థనమేరకు అవధూత గీతను బోధిస్తాడు. 

ఇంతకీ అవధూత లక్షణాలేమిటి?

ఆశాపాశాళ నుంచి విడువబడినవాడు, ఆదిమధ్యాంతరములందు నిర్మలుడు, నిత్యానందస్వరూపుడు అయిన అట్టివానికి ‘అ’ కారం అతని లక్షణం.


ఎవని చేత వాసనలు విడువబడినవో, ఎవడు నిరామయుడై ఉన్నాడో, ఎవడు వర్తమాన పదార్థాలలో ఉనికి కలిగివున్నాడో అట్టివానికి ‘వ’ కారం లక్షణమైఉన్నవాడు

ఎవని శరీరం ధూళిధూసరితమై ఉందో, ఎవని చిత్తం నియమింపబడి ఉన్నదో, ఎవడు ధ్యాన ధారణల విముక్తుడై ఉన్నాడో వానికి ‘ధూ’కారం లక్షణమై ఉన్నది.


తత్త్వచింత కలిగియున్నవాడు, చింతాచేష్టాలు వీడినవాడు, అహంకార మాంద్యములను విడిచినవాడు ఎవడో వానికి ‘త’కారం లక్షణం.

 *1. శ్రీమాతా*
 -----------------
 లక్ష్మీ స్వరూపిణి యై అన్ని సంపదలను ప్రసాదించు తల్లికి నమస్కారము.
 
            ఈ లోకంలో ఏ ప్రాణి అయినాసరే తనకు ఏదైనా బాధ కలిగినప్పుడు అమ్మా ! అంటుంది. అంటే తన తల్లి వచ్చి ఆ బాధను తీరుస్తుంది అని ఆ ప్రాణి నమ్మకం. జన్మానాం నరజన్మ దుర్లభం. జన్మలన్నింటిలోకి దుర్లభమైనది మానవజన్మ. ఎన్నో వేల జన్మలు ఎత్తిన తరువాత పూర్వజన్మలలో చేసిన మంచి ఫలితము ఆధారంగా మానవజన్మ వస్తుంది. అందుకే మానవజన్మ ఉత్తమమైనది. ప్రాణులకన్నింటికీ ఇంద్రియాలుంటాయి.

            ఆహార నిద్రా మైధునాలు అన్నిటికీ సమానమే. కాని మానవులకు మనస్సు అనబడే పదకొండవ ఇంద్రియము ఒకటి ఉంటుంది. దీనివల్లనే అతడు ఆలోచించగలుగుతాడు. అంటే మానవుడికి యుక్తాయుక్త విచక్షణ ఉంటుంది. పాపపుణ్యాల యోచన ఉంటుంది. ధర్మాధర్మాల వివేచన ఉంటుంది. ఆ ప్రాణి చేసే కర్మలను బట్టి ఎన్నోవేలసార్లు జన్మ ఎత్తవలసి ఉంటుంది. చివరకు పరమాత్మలో నుంచి వచ్చిన ఈ జీవాత్మ మళ్ళీ పరమాత్మను చేరుతుంది. ఈ లోగా కొన్ని లక్షల సార్లు పుట్టటం జరుగుతుంది. ప్రతి జన్మలోనూ ఒక తల్లి ఉంటుంది. లోకంలో పిల్లలు లేని తల్లులుంటారు. కాని తల్లిలేని పిల్లలు మాత్రం ఉండరు. అందుచేతనే ప్రతివారికి ఒక తల్లి ఉంటుంది. మరి అమ్మ అని పిలిస్తే ఏ తల్లిని పిలిచినట్లు ? పోనీ ఈ జన్మలోని తల్లినే పిలిచాడు అనుకుందాం. ఆమె తన బిడ్డ యొక్క కష్టాలు తీర్చగలుగుతుందా ? తాపత్రయాలు పొగొట్టగలుగుతుందా ?

            తాపత్రయాలు మూడురకాలు అవి.

1. ఆధి భౌతికము : తనకన్న ఇతరులైన అనగా భార్యాపుత్రులకు సంభవించిన వ్యాధుల వలన, సర్పవృశ్చికాది బాధల వలన పరితపించుట.
2. ఆధి దైవికము : ప్రకృతి సిద్ధమైన వాటివలన కలుగుబాధలు. అగ్ని ప్రమాదము, భూకంపము, వరదలు మొదలైన వాటివల్ల కలుగునవి.
3. ఆధ్యాత్మికము : తన దేహంలో ఉన్న ఇంద్రియాలకు కలిగిన వ్యాధులచే దుఃఖించుట. అలసత్వము, కపటము, అవిశ్వాసము, శ్రద్ధ మొదలైనవి.

            బిడ్డ యొక్క తాపత్రయాలు తీర్చాలి అంటే ఆ తల్లికే సాధ్యమవుతుంది. మరి ఆ తల్లి అంటే ఎవరు ?

            అమ్మల గన్నయమ్మ ముగు రమ్మల మూలపుటమ్మ తల్లులకే తల్లియైనటువంటిది. ముగురమ్మలు అంటే త్రిశక్తులు. వారే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులు. వారిని సృష్టించినటువంటిది. ఆవిడే పరమేశ్వరి. జగన్మాత రాత్పరి. సృష్టి స్థితి లయకారిణి అయిన ఆ దేవియే అమ్మ. ఆమె కరుణామయి.       దయాసముద్రురాలు. అందుకే అమ్మా ! అని ఒకసారి పిలవగానే పరవశించిపోయి కోరిన కోరికలు తీరుస్తుంది. మరి శ్రీ అంటే ఏమిటి ? శ్రీ అనేది గౌరవ వాచకము. విశేషణము. గొప్పదయిన అని అర్ధం. శ్రీయనలక్ష్మి, శ్రీయనగారి, శ్రీయనసరస్వతి. శ్రీ అంటే లక్ష్మి, సరస్వతి, పార్వతి అని అర్ధం కాబట్టి ఈ ముగ్గురికీ మూలస్వరూపురాలయినది.

ఆమెయే సదాశివుని అర్థాంగి పరాశక్తి. దేవీ భాగవతంలో త్రిమూర్తులు ఒక దివ్య విమానం ఎక్కి మణిద్వీపం చేరతారు. అక్కడ పరమేశ్వరి శ్రీచక్రం మీద కూర్చుని దర్శనమిస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు “తల్లీ నీవే పరమేశ్వరివా ? నీవే పరబ్రహ్మవా ? నీ తత్త్వాన్ని మాకు వివరించవలసింది”  అని అడుగుతాడు. అప్పుడు ఆ దేవి చెబుతుంది. “నీటిలోని చల్లదానాన్ని నేనే. అగ్నిలోని వెచ్చదనాన్ని నేనే సూర్యునిలోని తేజస్సును, చంద్రుని లోని మంచును నేనే. నేను లేని వస్తువు జగత్తులో ఏదీలేదు. అంతదాకా ఎందుకు ? మీ ముగ్గురూ కూడా నేను లేకుండా ఏ పనీ చెయ్యలేరు. శక్తితో కలిస్తేనే బ్రహ్మ లోకాలను సృష్టిస్తాడు. విష్ణువు లోకాలను రక్షిస్తాడు. రుద్రుడు సంహారం చేస్తాడు. కాబట్టి నేను లేనిది ఏదీలేదు. చరాచర జగత్తంతా నేనే నిండి ఉన్నాను” అని చెబుతుంది. ఆ పరమేశ్వరియే శ్రీ మాత. ఆమె శక్తి స్వరూపిణి. ఆమె లేకుండా ఏ పనీ జరగదు. అందుకే శంకరభగవత్సాదులవారు సౌందర్యలహరిలోని
         
  మొదటి శ్లోకంలో

  శివ శక్త్యా యుక్తోయది భవతి శక్తః ప్రభవితుం
  నచేదేవం దేవో న ఖలు కుశలః స్పన్దితు మపి
  అత స్త్వా మారాధ్యాం హరిహరవిరించాదిభి రపి
  ప్రణన్తుం స్తోతుంవా కథ మకృతపుణ్యః ప్రభవతి ?

            ఓ భగవతీ ! సర్వమంగళ సహితుడగు శివుడు జగన్పిర్మాణశక్తివైన నీతో కూడిననే ఈ జగత్తును సృష్టించటానికి సమర్థుడౌతాడు. అలాకాకపోతే అతడు కదలటానికి కూడా అశక్తుడు. కాబట్టి హరిహర ట్రహ్మాదులచే పూజించుటకుగాని నీకు నమస్కరించటానికిగాని పూర్వపుణ్యము ఉండాలి కదా ?

            అంటే త్రిమూర్తులను సృష్టించినది, వారిచేత పూజించబడేది అయిన ఆ పరదేవతయే  శ్రీమాత. ఆవిడే వేదాలను సృష్టించి బ్రహ్మకు సమర్పించింది అని ఉపనిషత్తులలో చెప్పబడింది.

            మాతృశబ్దం ఉభయలింగంగా చెప్పబడుతోంది. దేవీభాగవతంలో పరమేశ్వరి తన తత్వాన్ని వివరిస్తూ “ఉపాధి భేదంవల్ల రెండు విధాలయినట్లుగా, అద్దంలో కనిపించే ప్రకృతిలాగా క్రియాసమయంలో భిన్నంగా కనిపించినా పరమావస్థ యందు బ్రహ్మపదార్థం ఒక్కటే. దానికి వైవిధ్యం లేదు. సృష్టిసమయంలోగాని, లయసమయంలోగాని నాకు
స్త్రీపురుష నపుంసక బేధాలు లేవు.” అని చెబుతుంది. అందుచేతనే మాతృశబ్దం ఉభయలింగాత్మకమని చెప్పారు.

            శ్రీ అంటే విషము. మాతి అంటే కంఠము నందుంచుకొనినది. గరళమును    కంఠము నందుంచు కొన్నవాడు. గరళకంఠుడు అన్బప్పుడు పుంలింగము అవుతుంది. మాతా - తల్లి అనే అర్ధంలో స్త్రీలింగమవుతుంది. ఇక్కడ మాతృశబ్దం చాలా గొప్పది. అందుకే దానికి ముందు శ్రీ అనే గౌరవవాచకము ఉంచటం జరిగింది. మాత అనే శబ్దము త్రిపురసుందరినే తెలుపుతుంది. హ సక లర డ అనే ఆరు అక్షరాలు బాలామంత్రం త్రిపుటిలో మూడు అచ్చులతో కూడి ఉన్నాయి. ఆ మూడు మాత అని చెప్పబడతాయి. ఇక్కడ  హసకలరడైం, హసకలరడీం, హసకలరడౌఃలో చివర అచ్చులు ఐ ఈ జౌ బాలామంత్రం ఐం క్లీం సౌః ఇందులోని అచ్చులు మాతృకాబోధకాలు అని గుర్తించాలి. ఈ విషయాన్ని కాళిదాసు వ్రాసిన వపంచస్తవాలలో ఒకటయిన “లఘుస్తవం”లోని 18వ శ్లోక వివరణలో చెప్పారు. ఆ శ్లోకం.

            మాయా కుండలినీ క్రియా మధుమతీ కాళీ కలామాలినీ
            మాతంగో విజయా జయా భగవతీ దేవీ శివా శాంభవీ
            శక్తి శృంకరవల్లభా త్రినయనా వాగ్యాదినీ భైరవీ
            ట్రీంకారీ త్రిపురా పరాపరమయీ మాతా కుమారీ త్యపి!॥

            స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తులో సర్వప్రాణులు ఎవరివల్ల జన్మిస్తున్నాయో ఆవిడ మాత  ఎవ్వనిచే జనించుజగము ? ఎవ్వనిలోపల నుండు లీనమై ?
            ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు. మూలకారణంబెవ్వ డనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానె అయినా వాడెవ్వడు ?
            జగత్తులోని లోకాలన్నీ ఎవరియందు లీనమై ఉన్నాయో, ఎవని వల్ల సృష్టి జరుగుతున్నదో, అంటే సృష్టిస్థితి లయాలకు కారణభూతుడెవరో, ఆది మధ్యాంతర హితుడెవరో, సర్వమూ తానే అయిన వాడెవరో అతడే మాత. సకలసద్గుణ సంపన్నురాలు, పవిత్రమూర్తి అయిన ఆ తల్లి సుఖసంపదలు, భోగభాగ్యాలే కాదు. శ్రీ రూపమయిన అమృతత్వాన్ని కూడా ప్రసాదిస్తుంది.

            యోబ్రహ్మాణి విధాతిపూర్వం సృష్టికాలంలో బ్రహ్మదేవుడికి త్రయీవిద్య నుపదేశించింది. త్రయీవిద్య అంటే వేదవిద్య. అవి బుగ్‌ యజుర్‌ సామవేదాలు. అంతేకాదు జీవికి ముూక్తిని ప్రసాదిస్తుంది.అందుకే శ్రీమాత అని పిలువబడుతోంది. ఏ విషయాన్ని తెలుసుకోవాలని ఉన్నప్పటికీ జ్ఞాత జ్ఞాతృ జ్షేయము అనే మూడు ఉండాలి. అంటే 1. తెలుసుకొనేవాడు. £. తెలుసుకొను శక్తి 8. తెలుసుకొను విషయము. ఈ మూడింటినీ త్రిపుటి అంటారు. ఈ త్రిపుటికి అధిదేవత, థ్రిభుజానికి అధిదేవత, వ్యక్తావ్యక్తస్వరూపిణి అయిన బాలాత్రిపురసుందరి శ్రీ అని చెప్పబడుతోంది. త్రికోణంలోనే బిందు వుంటుంది. ఆ బిందువులో పరమేశ్వరి ఉంటుంది. అందుకే ఆదేవి.

            బిందుమండలవాసిని అని పిలవబడుతోంది. ఆవిడే శ్రీమాత, పరమేశ్వరి నిరాకార, నిర్లుణస్వరూప. ఆమెకు రూపంలేదు. కాని జగత్తంతా ఆమె స్వరూపమే. ఛాందోగ్యోపనిషత్తు లో సత్యకామజాబాలికి ఒక ఆబోతు బ్రహ్మ నాలుగు పాదాలుగా ఉంటుంది. అందులో మొదటి పాదం నేను చెబుతాను. “ నాలుగుదిక్కులూ ఆ పరబ్రహ్మ స్వరూపమే” అంటుంది. రెండవపాదాన్ని అగ్నిదేవుడు చెబుతూ” భూమి, ఆకాశము, సముద్రాలు, నదులు,
పర్వతాలు అన్ని బ్రహ్మపదార్థంలోని అంతర్భాగాలే” అంటాడు.

            మూడవపాదాన్ని ఒక హంస చెబుతూ “ అన్నీ పరబ్రహ్మలోని భాగాలే” అంటుంది.
            నాల్లవపాదాన్ని ఒక నీటిపక్షి చెబుతూ “ప్రాణం బ్రహ్మ, దృష్టి బ్రహ్మ, శ్రవణం బ్రహ్మ, మనస్సు బ్రహ్మ” అంటుంది. అంటే జగత్తంతా పరమేశ్వరస్వరూపమే. అతడికి ఆది మధ్య అంతము అనేవి లేవు. 'జగత్తులోని 'అగ్న్ని సూర్యుడు, చంద్రుడు, విద్యుల్లతలు దేవీ భాగవతంలోని సప్తమస్కంధంలో తారకాసురుని బాధలు పడలేక దేవతలంతా పరమేశ్వరిని ధ్యానిస్తారు. అప్పుడు చైత్రశుద్ధ నవమి, శుక్రవారం వేదసమ్మతమైన పరంజ్యోతి వారి ఎదుట ప్రత్యక్షమయింది. ఆ రూపం ఎలా ఉందంటే

            కోటిసూర్యప్రతీకాశం చంద్రకోటిసుశీతలమ్‌ ॥
            విద్యుత్కోటిసమానాభ మరుణం తత్సరం మహః
            నైవ చోర్ధ్వం న తిర్యక్పన మధ్యే పరిజగ్రభత్‌ ॥
            ఆద్యంతరహితం తత్తు న హస్తా ద్యంగ సంయుతమ్‌
            నచ స్రీ రూప మథవా నపుంరూప మధోభయమ్‌ ॥

            కొన్నివేల కోట్ల సూర్యులయొక్క కాంతులతో, కోట్లకొలది చంద్రుల చల్లదనముతో,
కొన్నికోట్ల మెరుపులు ఒక్కసారి వచ్చినట్లుగా ఒక్కసారి తళుక్కున మెరిసింది. అది కోటి పాగసాగగా అది అరుణారుణకాంతులు వెదజల్లుతోంది. దానికి పైన, క్రింద, నడుమ, అడ్డము అనేవి ఏవీ లేవు. ఆద్యంతాలు లేవు. కాలు చేతులు లేవు. స్త్రీ పురుష నపుంసక భేదాలు లేవు. అది పరమేశ్వరి స్వరూపం. ఆవిడ శ్రీమాత. అందుకే ఆవిడను చెప్పేటప్పుడు అన్నిరూపులు నీ రూపమైనవాడ !

            ఆది మధ్యాంతములు లేక అలరువాడ ! అని చెప్పటం జరుగుతుంది. ఆ దేవి ఆత్రత్రాణ పరాయణ. బిడ్డల కోరికలు తీర్చేది. వారిని సన్మార్గంలో నడిపించేది. కాబట్టే ఆవిడ శ్రీమాత అనబడుతోంది. అందుచేతనే దుర్వాసుడు తన “శ్రీదేవీ మహిమ్మః స్తుతి”లో శ్రీమాత స్తిపురే ! పరాత్సరతరే దేవి ! త్రిలోకీ అంటాడు. లోకంలోని ప్రాణులకు మాత అని పిలిపించుకునే అధికారం ఉంది. ఆ పరమేశ్వరి సర్వులకు మాత లోకాలన్నింటికీ మాత. అందుకనే శ్రీమాత అనబడుతోంది.

            ఈ నామంలో దేవి సృష్టి రూపిణి.
            --000--

    
ఏమిటో....ఈ మనసు !
********************
మా చిన్నప్పుడు మేము మా పోస్టు మేన్ వచ్చే టైముకి దారి కాసే వాళ్ళం. అతను మా ఇంటి ముందు సైకిల్ స్టాండ్ వేస్తే, మహానందపడిపోయేవాళ్ళం. తీరా చేసి, అద్దెకున్న వాళ్ళకిచ్చి,
మాకేమీ ఉత్తరాలు లేవంటే, నీరసం వచ్చేది.మాకు ఒకటైనా పోస్టు కార్డు ఇస్తే, మొదట చదవడానికి పోటీలు పడి, దెబ్బలాడుకుని, 'బలవంతుడిదే ఉత్తరం' అన్నట్టు లాక్కుని, నాలుగుసార్లు చదివాక, మిగిలినవారిని 'ఉత్తరా'ధికారుల్ని చేసేవాళ్ళం.

ఢిల్లీ నుంచి మా అక్క రాసిన 'ఇంగ్లాండు' కవరు వస్తే, దాంట్లో విశేషాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి,
దానికి ఎంత గ్లామరో !
ఉత్తరానికి మూడు పక్కలా నింపేశాక, 'అందరినీ అడిగానని' చెప్పాలి కాబట్టి, మా పనిమనిషి అప్పలమ్మ దగ్గిరనించీ, ప్రతి నెలా టైముకి అద్దె ఇవ్వని ప్రకాశం అంకుల్, పాలు పొసే పాలశంకరం లాంటి వాళ్ళ పేర్లు రాయడానికి మార్జిన్ లు వాడుకునేది.

1965 లో పాకిస్తాన్ తో యుద్ధం వచ్చినప్పుడు ప్రభుత్వం వారు తీసుకునే 'బ్లాక్ ఔట్'
(కరెంటు తీసేసి,పట్టణమంతా చీకటి చేసెయ్యడం,) విమానం మోత వినిపిస్తే సైరన్ మోగించడం లాంటి విశేషాలన్నీ పూసలు గా గుచ్చి, పెద్ద కవరు రాసేది. ఢిల్లీ లో రిపబ్లిక్ డే కి జరిగే ఉత్సవాల విశేషాలు మొదటిసారిగా మా అక్క రాసిన 'పే.....ధ్ధ' ఉత్తరం ద్వారా తెలుసుకున్నాం.

ఠావులు ఠావులు ఉత్తరాలు రాసేస్తే, అదనంగా స్టాంపులు అతికించాలని అప్పుడే తెలిసింది.
ఆ ఉత్తరాన్ని వంతుల వారీగా ఎన్నిసార్లు చదివి ఉంటామో చెప్పాలంటే, 'మాయాబజార్ సినిమా చూసినన్నిసార్లు' అని చెప్పాలి. క్లాసు పుస్తకాల కంటే, మా అక్క రాసిన ఉత్తరాలే ఎక్కువ ఆకర్షణగాను, విజ్ఞానదాయకం గాను ఉండేవి.

అందుకే కాబోలు, నెహ్రూ గారు, "కూతురికి ఉత్తరాలు" అనే శీర్షికతో, ఇందిరా గాంధీ గారికి జైలు నుంచే ఉత్తరాలు తెగ రాసి పడేశారు "మీకు పాఠాలు చెప్పను, కధలు చెబుతాను" అని
విష్ణు శర్మ, ముగ్గురు మొద్దబ్బాయిలయిన రాజ కుమారులకి కధలు వినిపించి, వాళ్ళతో పాటు,
మనక్కూడా పంచ తంత్రాలూ బోధించాడు 

                      ★★★★★★★★

ఇప్పుడు మన గుట్లన్నీ గూగుల్ మామకి, ఫేస్ బుక్కు అంకుల్ కీ తెలిసినట్టే, మనకి ఎవరెవరి దగ్గర్నుంచి ఉత్తరాలు వస్తాయో, ఎవరి దగ్గర్నుంచి ఎంత మనీ ఆర్దరు వస్తుందో, ఎవరింట్లో పెళ్ళి కూతుళ్ళ కోసం, "అమ్మాయి నచ్చింది" అని వచ్చే ఉత్తరం కోసం పడిగాపులు కాస్తున్నారో, ఏ కుర్రాడు తనకి ఉజ్జోగం ఇస్తున్నట్టు వచ్చే ఉత్తరం కోసం గెడ్డం పెంచుతున్నాడో,
నాటి పోస్టు మేన్ లకి  బాగా తెలుసు.

కాబట్టే, దసరా మామూళ్లు దండిగా ఇచ్చేవాళ్ళం. ఇవ్వకపోతే, 'అలుగుటయే ఎరుంగని' పోస్టు మాన్ అలిగిననాడు, ఉత్తరాలే కాదు, కుదరబోయే పెళ్ళి సంబంధం, రాబోయే ఉజ్జోగం కూడా
కాకి ఎత్తుకు పోతుందేమోనని భయం !

అప్పటి పోస్టు మాన్ లు ప్రతి కుటుంబానికి ఆప్తులు, హీరోలు !
టెలిగ్రాములు తెచ్చే ఎర్ర సైకిల్ వాళ్ళు, శత్రువులు, విలన్ లు !
టెలిగ్రామ్ వచ్చిందంటే.. "సో అండ్ సో సీరియస్, స్టార్ట్ ఇమీడియేట్లీ" యే !
అందుకే...టెలిగ్రాములకి నూరేళ్లూ నిండించాము !
 
                    ★★★★★★★★

రెండు మూడు తరాల వాళ్ళం అలా....
'ఉత్తర'కుమారులం, 'ఉత్తరా'కుమార్తెలం గా వెలుగుతూ, తీగలకి గుచ్చిన పాత ఉత్తరాలే దుమ్ము దులిపి, మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ ఉండగానే.....

'రోజులు మారాయి' సినిమా తీసిన చాలా కాలానికి, మా రోజులు మారడం మొదలెట్టాయి.
వింతలు, విడ్డూరాలు, విష్ణు మాయలు జరిగిపోతున్నాయి !

మనలాంటి వాళ్ళకి ఇంట్లో దేశవాళీ టెలిఫోను రావడానికే సగం జీవితం గడిచిపోతే, గత రెండు దశాబ్దాలుగా అన్ని రంగాల్లోనూ మార్పులే మార్పులు !

ఒకప్పుడు విమానం శబ్దం వినిపిస్తే, బయటికి పరుగెత్తి చూసిన మధ్య తరగతి వాళ్ళలో చాలామంది
లక్షలకి పడగలెత్తి, కోట్లకి అర్రులు చాస్తూ...
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లాగ, గౌలిగూడా బస్ స్టాండు లాగ, విమానాశ్రయాలు ఖాళీ లేకుండా చేసేశారు. 

"మా వాడు డల్లాస్"అంటే, "మా అమ్మాయి "డెట్రాయిట్" అనేవారు !
"మా అల్లుడికి లండన్ లో ఆన్ సైట్ ఆఫర్ వచ్చింది" అంటే, "మా వాళ్ళకి కెనడా సిటిజెన్ షిప్ వచ్చేసింది" అనేవాళ్ళు. ప్రస్తుతం కొరోనా కాటుకి, ఆ దేశాలతో పాటు, మనవాళ్ళు కూడా పాపం,
బిక్కు బిక్కుమంటున్నారనుకోండి !

ఇండియా కి విదేశీ మారక ద్రవ్యం పంపిస్తున్నది, దేశం లో టాక్స్ లు నిక్కచ్చిగా కడుతున్నదీ,
తద్వారా దేశ ఆర్థిక పురోగతికి దోహద పడుతున్నదీ, మన మధ్య తరగతి వాళ్ళేట !

పావు కిలో బరువున్న నోకియా ఫోను తో మొదలయిన మన సాంకేతిక ప్రస్థానం, కొంప కి పది చొప్పున, తల ఒక్కింటికి రెండు చొప్పున, సెల్ ఫోనులు, టాబ్ లు కాక, లాప్ టాప్ లు అదనం గా వచ్చి కూచున్నాయి ! ఇంటి నిండా చార్జర్ ల కలగాపులగం !

పొద్దున్న లేచాక, దైవ ధ్యానం,దీపారాధన కంటే ముందే, 'కరచరవాణీ' దర్శనం చెయ్యాల్సి రావడమే కాదు, అన్నిటికీ ఛార్జింగ్ పెట్టడానికే జీవితం సరిపోతోంది !

ఇంక పనికొచ్చే పోస్టులు చూడ్డం, పనికిరాని వాళ్ళు పంపిన పోస్టులు తీసెయ్యడం, నిత్య కృత్యం ఐపోయింది. ఇది కాక, మన "ఎగుమతి - దిగుమతి"  వ్యాపారం (అదే నండి అప్ లోడ్, డౌన్ లోడ్)
ఉండనే ఉంది !
(ఇదేదో పెద్ద వ్యాపారం అనుకోకండి, మనకి వాట్సాప్ లో వచ్చినవి అందరికీ పంపడం, ఫేస్ బుక్కు లో చూసినవి షేర్ చెయ్యడం లాంటివి) ఇలా కొంతకాలంగా 'అత్యాధునిక సాంకేతిక విప్లవాలను ఔపోసన పట్టి, అలరారుతున్నాం' అని సంతోషిస్తుండగా...

ఒక రోజు మా పని మనిషి గొంతు, వాష్ ఏరియా లో నుంచి గట్టిగా వినపడుతోంది.
'ఏదైనా గొడవా' అని వెళ్ళి చూస్తే...
దుబాయ్ లో ఉన్న కొడుకుతో వీడియో కాల్ మాట్లాడుతోంది !

తన దగ్గర ఉన్నది నా ఫోను కంటే కొత్త మోడలు, ఖరీదయినది !
అన్నట్టు....రోజులు మారాయి కదూ....

                  ★★★★★★★★

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, ఒక రోజు మా పిల్లలు హడావిడిగా వచ్చి, నన్ను లాక్కెళ్లి,
లాప్ టాప్ ముందు కూచోబెట్టారు.తీరా చూస్తే, సినిమా ఆఖరి రీలులో గ్రూప్ ఫోటో లాగ,   దేశ విదేశాల్లో ఉన్న మా వాళ్ళందరూ అందులో ఉన్నారు !
అందరూ ఒకే సారి, "బావ గారూ బాగున్నారా ?', "హాయ్ బ్రో",  "హల్లో తాత గారూ" "బాబయ్యా, ఎలా ఉన్నావ్ ?" "అల్లుడూ...కులాసానా ?" "మావయ్యా, చాలా రోజులయింది, నిన్ను చూసి"
అని కోరస్ పాడేస్తున్నారు !
ఒక్కక్కళ్ళనే గుర్తుపట్టి, పలకరించి, పులకరించడానికి కొంచెం టైం పట్టింది. "ఖండములు ఎన్ని, అవి ఏవి ?" అని, హైస్కూల్ లో సోషల్ మేష్టారు అడిగితే, తడుముకుని, బట్టీ బట్టి చెప్పేవాళ్ళం.
ఇప్పుడు ఖండములు, ఖండాంతరములు అన్నీ ఒకే చోట కనిపించేస్తున్నాయి !!!

ఆస్ట్రేలియా, అమెరికా, ఇండియా, కెనడా, సింగపూర్,లండన్ ఇలా అన్ని దేశాల నుంచీ,
బీరకాయ పీచువాళ్ళందరూ....
కెనేడియన్ దగ్గిరనించీ తాడేపల్లిగూడేరియన్ వరకు కొరోనా ధర్మమా అని, ఒకేసారి, కొంపల్లో కూచుని, నెల రోజులుగా అన్ని రకాల కాలక్షేపాలు చేసి, చేసి, విసుగెత్తి, బహుశా గాలి మార్పు కోసం, యిలా...
"జూమ్" వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరూ ఒకే సారి దండెత్తారు. ఎవరికీ హెయిర్ కట్ లు లేనట్టుంది !
మగంగులు అందరూ  తలలు మాసి ఉన్నారు. కొన్ని పాత మొహాలు...
ఆకారాలు, ప్రాకారాలు మారిపోయాయి. కొన్ని కొత్త మొహాలు గుర్తుపట్టలేకపోతున్నా. కొన్ని పిల్ల మొహాలు యవ్వనం లోకి వచ్చేస్తున్నాయి. కొన్ని చంటి మొహాలు కొత్తగా పుట్టాయి.

సామూహిక యోగక్షేమాల కార్యక్రమం అయ్యాక, ఎవరెవరు, ఎక్కడెక్కడ పని చేస్తున్నారో,
ఎవరికి ఎంతమంది పిల్లలో సగర్వంగా చెప్పుకున్నాక, లోకల్ కొరోనా వార్తలు, స్కోరులు చదువుకున్నాక, 'ఆరోగ్యాలు జాగ్రత్త' లాంటి షరా మామూలు హెచ్చరికలు చేసుకుని, చివరిగా సామూహికంగా జాతీయ గీతం పాడినట్టు, అందరం "గో, కొరోనా, గో" అనే మంత్రం చదివి, 'బై' లు చెప్పుకున్నాం. 
                      ★★★★★★★★

ఇదంతా అయ్యాక, కొత్త రకం ప్రసార మాధ్యమాలు వచ్చాయని, 'కానీ' ఖర్చు లేకుండా, నిమిషాల్లో,
ప్రపంచం లో ఎక్కడ ఉన్నా,మన వాళ్ళందరినీ చూస్తూ మాట్లాడుకునే సౌకర్యాలు వచ్చిన కారణంగా అందరి విశేషాలు, యోగ క్షేమాలు తెలుసుకోగలుతున్నామని సంతోషించాను.

                       ౦౦౦౦౦౦౦౦౦౦౦

కానీ ఏమిటో.....ఆ డొక్కు సైకిల్ మీద ఖాకీ గుడ్డలతో వచ్చి, నవ్వుతూ అరుగు మీద ఎదురు చూస్తున్న మాకు అందించిన ఆ 'కార్డు ముక్క' ఇచ్చిన ఆనందం, ఇప్పుడు వాట్సాప్ లు, ఫేస్ బుక్ లు తెచ్చే వందల కొద్దీ పోస్టులు,విశేషాలు, స్కైపులు, 'జూమ్' లు చూపించే  వీడియోలు ఇవ్వలేకపోతున్నాయి !

అవునులే ! నాన్న 200 రూపాయలతో రెండు చక్రాల సైకిల్ కొన్నప్పుడు, ఎంతగానో ఆనందించిన ఇదే బుర్ర, పది లక్షలు పెట్టి నాలుగు చక్రాల కారు కొనుక్కున్నప్పుడు ఆనందించలేకపోడమేవిటి ?కాల మహిమ కాకపోతేను ? ఏమిటో....యీ మనసు !!!

sekarana     వారణాసి సుధాకర్.

                        ★★★★★★★★

సేకరణ ప్రాంజలి ప్రభ 

శిష్టత - మార్గ శిర మాసం


శిష్టత - మార్గ శిర మాసం వినేటి నుండి మార్గశిర మాసం ప్రారంభం

వేదములలో సామవేదమును, రుద్రులలో శంకరుడను, చందస్సులో గాయత్రిని, మాసాలలో మార్గశీర్షమాసాన్ని అన్నడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. మహాభారతకాలంలో మాసములు మార్గశీర్షముతో ఆరంభమవుతూ ఉండేవి. కనుక మాసములలో మార్గశీర్షము మొదటిది. అట్లే ఈమాసములో ఆచరించబడు ఉపవాసాది వ్రతములన్నియు మహాఫలమును ఇచ్చునవిగా శాస్త్రములయందు చెప్పబడినది.

హేమంత ఋతువు లో వచ్చే మొదటి నెల. దీనినే జ్యోతిష్యాన్ని అనుసరించి సౌరమాన ప్రకారం ధనుర్మాసమని, చంద్రమానం ప్రకారం మార్గశిర మాసమని అంటారు. ఆధ్యాత్మికం గా ప్రసిద్దమైన ఈ మాసం ప్రకృతి లో కూడా సౌందర్యాన్ని, శాంతిని సంతరిస్తుంది. మృగశిర నక్షత్రం లో కూడిన పూర్ణిమ వచ్చిన కారణం గా ఈ మాసానికి మార్గశీర్ష మాసమమని పేరు. శ్రీ కృష్ణ పరమాత్ముడు మార్గశిర మాసం స్వయం గా ఆయనే అని తెలియజేశాడు. ఈ మాసం లో చేసే ఏ పూజైన, హోమమైన, అభిషేకమైనా ఎటువంటి దైవకార్యం చేసినా దానిని స్వయం గా తనే స్వీకరిస్తానని తెలియ చేసాడు. చంద్రుడు మనః కారకుడు, ఆ చంద్రుడు అనుకూలం గా లేక పొతే, మంచి ఆలోచనలు కలగవు, మానసిక స్థితి సరైన మార్గం లో ఉండదు. అందుకని చంద్రుడు అనుకూలించే కాలం లో మన దైవపూజలని ప్రారంభిస్తే వాటి మీద శ్రద్ద బాగా పెరిగి తద్వారా మనోధైర్యం వృద్ది చెందుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రుని కి ఉచ్ఛ స్థానం వృషభ రాశి, మృగశిర నక్షత్రం వృషభరాశి కి చెందినది కావున, చంద్రుని సంపూర్ణ అనుగ్రహం ఉండి దైవ కార్యాలని చేసే కొద్దీ చేయలనిపించే మంచి ఆలోచనలు కలుగుతాయి. శుద్ద పాడ్యమి నుండి ఈ మాసమంతా శ్రీ మహా విష్ణువు ని పూజిస్తారు.ప్రాతః కాలం ఆచరించే స్నానాన్ని మాఘ స్నానాలు అంటారు. శ్రీ మహా విష్ణువు కి ప్రీతికరమైన ఈ మాసం లో విష్ణు సహస్రనామ పఠనం అనంతకోటి పుణ్య ఫలితాలనందిస్తుంది.

--(())--

సేకరణ ప్రాంజలి ప్రభ 

శిష్టత - మార్గ శిర మాసం

సూర్యుడు 12 రాశుల్లో ఒకదాని నుండి మరోదాని లోనికి నెలకు ఒకసారి మారుతుంటాడు. అలా వృశ్చిక రాశి నుండి ధనురాశిలోనికి సూర్యుడు రావడం తో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసం లో పసుపు, ఆవాలు, మెంతులు , మిరియాలు, చింతపండు పెరుగు మొదలైనవి క్షార గుణాన్ని హరించి ఆరోగ్యాన్ని కాపాడతాయి కాబట్టి, మనం తీసుకొనే ఆహార పదార్దాల లో వీటిని విరివిగా ఉపయోగిస్తారు.

మార్గశిర శుద్ద పంచమి రోజున నాగ పూజ చేయడం విశేష ఫలితాన్నిస్తుంది. శుభకార్యాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజుగా చెప్పబడింది.

మార్గశిర శుద్ద షష్ఠి ని స్కంద షష్ఠి అని వ్యవహరిస్తారు. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి ని శక్తికొలది పూజిస్తే సంతాన అనుకూలత కలుగుతుందని ప్రతీతి.

మార్గశిర శుద్ద సప్తమి ని భానుసప్తమి, జయసప్తమి, మిత్ర సప్తమి అని అంటారు. ఈ రోజు సూర్యారాధన చేసి పాయసం నివేదన చేస్తే అనేకమైన మంచి ఫలితాలు కలుగుతాయి.

మార్గశిర అష్టమి ని కాళభైరవాష్టమి గా పిలుస్తారు, శివుని మరో రూపమే భైరవుడు. భైరవుడంటే పోషకుడని, భయంకురడనే అర్ధాలు వస్తాయి. భైరవుని దగ్గర కాలుడు (కాలం) కూడా అణిగి ఉంటాడు కనుకనే కాళభైరవుడయ్యాడు. భైరవుణ్ణి శరణు కోరితే మృత్యు భయం తొలగిపోతుంది. ఈరోజు గంగా స్నానం, పితృ తర్పణం, శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే ఏడాది మొత్తం లౌకిక, పార లౌకిక బాధల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే భైరవుని వాహనమైన శునకానికి పాలు, పెరుగు, వంటివి ఆహారం గా ఇవ్వడం మంచిది.

మార్గశిర ఏకాదశి ని మోక్షద ఏకాదశి గా చెప్తారు. ఈరోజు శ్రీ మహా విష్ణువు కి అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్పబడింది. విష్ణు సహస్రనామ పారాయణం సర్వ పాపాలను తొలగిస్తుంది. ఈ రోజున చేసుకొనే ఉత్తర ద్వారా దర్శనం వలన మోక్షం లభిస్తుందని చెప్తారు. ఈ మాసం లో వచ్చే ద్వాదశి ని అఖండ ద్వాదశి అంటారు.

మార్గశిర శుద్ద త్రయోదశి నాడు హనుమత్భక్తులు హన్మద్వ్రతం ఆచరిస్తారు.

మార్గశిర శుద్ద పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతి. దత్తాత్రేయుడంటే సాక్ష్యాత్తు త్రిమూర్తి స్వరూపం. అనఘావ్రతం ఆచరించి స్వామీ ని నోరార పూజిస్తే సకల పాపాలు తొలగుతాయి.

కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మ రాజు కోరలు తెరుచుకొని ఉంటాడు, ఈ రోజుల్ని యమదంష్ట్రులుగా చెబుతారు.మార్గశిర పౌర్ణమి తో అనేక రకమైన వ్యాదులు, అనారోగ్య సమస్యలు తొలగుతాయి, కనుక కృతజ్ఞత పూర్వకం గా ఈ దినం యమధర్మ రాజుని ఆరాదిస్తారు. ఈ పౌర్ణమి ని కోరల పున్నమి, నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు.

--(())--

-(())--

ఒక తల్లికి నలుగురు కూతుళ్లు వుండేవారు. మనకు నవ్వుల కొరకు ఆమె ఈ విధంగా ముద్దు పేర్లతో పిలిచిది. అందులో మొదటి అమ్మాయి పేరు విరిగిన, రెండవ అమ్మాయి పేరు చిరిగిన, మూడవ అమ్మాయి పేరు పాడయిపోయిన, నాలుగవ అమ్మాయి పేరు చనిపోయిన...

ఇలా ఈ విధంగా ఆ తల్లి తన కూతుళ్లకు పేర్లు పెట్టుకుంది. ఒకరోజు వీరి ఇంటికి ఒక అతిథి వస్తాడు.అతనితో తల్లి అడుగుతూ... ‘‘మీరు కుర్చీలో కూర్చుంటారా లేక చాప మీద కూర్చుంటారా?’’

అతిథి : ‘‘కుర్చీ మీద కూర్చుంటాను’’ 

తల్లి : ‘‘విరిగిన..! కుర్చీ తీసుకుని రా’’!

అతిథి : ‘‘వద్దులేండీ..! నేను చాపమీదే కూర్చుంటాను’’

తల్లి : ‘‘చిరిగిన..! చాప తీసుకుని రా’’

అతిథి : ‘‘ఉండనివ్వండి... నేను కింద నేలపైనే కూర్చుంటాను’’

అలా అని ఆ అతిథి నేలమీద కూర్చుంటాడు. కొద్దిసేపు తరువాత....

తల్లి : ‘‘మీరు టీ తీసుకుంటారా.. పాలు తీసుకుంటారా?’’

అతిథి : ‘‘టీ’’

తల్లి : ‘‘పాడయిపోయిన...! టీ తీసుకుని రామ్మా..’’

అతిథి : ‘‘వద్దు వద్దులెండి.. నేను పాలు తీసుకుంటాను’’

తల్లి : ‘‘చనిపోయిన..! ఆవు పాలు తీసుకుని రామ్మా’’

ఈ మాటలు విన్న అతిథి ఏమీ తోచక అక్కడి నుంచి పారిపోతాడు

--(())__

 

సేకరణ ప్రాంజలి ప్రభ 

శిష్టత - మార్గ శిర మాసం

బ్రాహ్మి ముహూర్తం లో ఎందుకు లేవాలి?

పెద్దలు అందరు చెప్తూ ఉంటారు-----బ్రాహ్మి ముహూర్తం లో నిద్ర లేవాలి అని. అలా ఎందుకు. అసలు బ్రాహ్మి ముహూర్తం అంటే ఏమిటి? సుర్యొదయమునకు 48 నిముషముల ముందు ఉన్న సమయమును బ్రాహ్మి ముహూర్తం అంటారు. అంటే రాత్రిభాగము లోని ఆఖరి 48 నిముషములు అన్నమాట. ఈ సమయము పూజలకు, జపాలకు మంత్ర సాధనకు విశిష్టమైన సమయముగా చెప్తారు.

ముఖ్యంగా విద్యార్థులు బ్రాహ్మి ముహూర్తం లో లేచి చదువుకుంటే చదువు బాగా వస్తుంది అని అంటారు. దేనికి వెనుక ఏదైనా రహస్యం ఉందా? అంటే విశ్లేషిస్తే పెద్దగా ఏమి లేదు. మన శరీరం లో ఒక జివ గడియారం ఉంటుంది. (virtual clock ) దీనిని అనుసరించే మన జీవక్రియలు అన్ని జరుగుతాయి. ఆ ప్రకారం ఉదయపు వేళల్లో మనలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మనలోని ఒత్తిడి ని తగ్గిస్తుంది. ఈ హార్మోన్ మన జ్ఞాపకశక్తిపై కూడా ప్రభావం చూపుతుంది. అందువలన ఆ సమయములో చదువుకుంటే పిల్లలకు మంచిది. చదివిన పాఠాలన్నీ చక్కగా గుర్తు ఉంటాయి. అంతకు ముందు రోజు భరించిన ఒత్తిడులు అన్ని నిద్రలో మరిచిపోతాము కాబట్టి మెదడు ఉత్తేజం తో ఉంటుంది. పరిసరాలు కూడా నిశ్శబ్దం గా ఉంటాయి. ఈ అన్ని కారణాల వల్ల చదివినది మెదడులో జాగ్రత్తగా నిక్షిప్తం అవుతుంది.

మరి పెద్దవాళ్ళు ఎందుకు లేవాలి? ఆయుర్వేదం ప్రకారం రాత్రి తొందరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయం ముందే నిద్ర లేచేవారికి ఆరోగ్య సమస్యలు రావు. ఎందుకంటే ఉదయాన్నే ప్రక్రుతి ఎంతో అందంగా ఉంటుంది. చెట్లు ఆక్సిజన్ విడుదల చేస్తాయి అని మనందరకూ తెలుసు.రాత్రంతా చెట్లు విడిచిన ఆక్సిజన్ వేకువన కాలుష్యం బారిన పడకుండా ఎక్కువ పరిమాణం లో మనకు అందుబాటులో ఉంటుంది. వాకింగ్ కు వెళ్లేవారికి ఇది చాల ఉపయోగ పడుతుంది.

మరి గృహిణులు ఎందుకు లేవాలి? ఇది అందరకు తెలిసినదే. గృహిణులకు నిద్ర లేచిన దగ్గర నుంచి ఎన్నో పనులు. పిల్లల సంరక్షణ, ఇంట్లో పెద్దవారి సంరక్షణ, వంటపనులు, ఇంటిపనులతో క్షణం తీరిక లేకుండా గడుపుతారు వారు రోజంతా. అటువంటి వారికీ ఒత్తిడి లేని జీవన విధానం, మానసిక , శారీరిక ఆరోగ్యం చాల అవసరం. బ్రాహ్మి ముహూర్తం లో లేవటం వలన మానసిక ఒత్తిడులు తగ్గుతాయి, శారీరిక ఆరోగ్యం కూడా సమకూరుతుంది అని చెప్పుకున్నాం కదా. ఇంకా ఏంటంటే, వేకువనే లేవడం వలన ఇంటి పనులు అన్ని ఒక పద్దతిగా ఆందోళన లేకుండా చేసుకోవడానికి వీలు అవుతుంది. గందరగోళం లేకుండా ఉంటుంది. పనులు ఒక క్రమశిక్షణతో జరుగుతాయి. ప్రతిరోజూ సూర్యోదయం చూసే అలవాటు ఉన్నవారికి హృదయం, మెదడు, ప్రశాంతంగా ఉంటాయి.

బ్రాహ్మి ముహూర్తం లో లేవడం వలన ఇంకొక మేలు ఏమిటంటే, సూర్యుని లేత కిరణాలు మన పైన ప్రసరిస్తాయి. సూర్యరశ్మి లో డి విటమిన్ ఉంటుంది అని అందరికి తెలుసు, ఎముకల పటుత్వానికి ఇది ఎంతో అవసరం. ఇదివరకు మాములు ఇల్లు ఉన్నపుడు ఏదో ఒకవేపు నుంచి ఎండ ఇంట్లోకి వచ్చేది. ఈనాడు అంతా apartment culture కదా. కొన్ని ఇళ్ళల్లో సూర్యోదయం కనిపించదు. అటువంటివారికి డి విటమిన్ లోపం వచ్చే అవకాసం ఉంది. కొన్ని చర్మ వ్యాదులకు కూడా సూర్యరశ్మి మేలు చేస్తుంది. అటువంటి వారు ఉదయం , సాయంత్రం కొన్ని నిముషాలు సూర్య కిరణాలు తమకు సోకేటట్టుగా లేత ఎండలో నుంచోవడం ఎంతో మంచిది.

మనం తొందరగా లేస్తే, పిల్లలు కూడా మనలను చూసి లేవడం అలవాటు చేసుకుంటారు. వారికీ కూడా క్రమశిక్షణ అలవాటు అవుతుంది. మన పూర్వులు ఏమి చెప్పినా, మన మంచికే చెప్పారు. వారు చెప్పిన సూత్రాల వెనుక ఎన్నో శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే మనకు ఎప్పుడూ మేలే జరుగుతుంది.

--(())--


 --(())--

కొన్ని సంవత్సరాలు గడిచాయి .ఒకనాడు ముంజుడి సభకు ఒక గొప్ప జ్యోతిష్కుడు వచ్చాడు.రాజుకు నమస్కరించి రాజా!ఈ ప్రపంచం లో నాలాంటి జ్యోతిష శాస్త్ర పండితుడు లేడని చెప్పుకుంటారు.భూత భవిష్యత్
వర్తమానాలలో ఏ విషయంగురించైనా మీకేదయినా కావాలంటే అడగండి అన్నాడు.ఎంత ప్రతిభాశాలి అయినా యింత అహంకారమా?అనిపించింది ముంజుడికి.మీకు చేతనైతే నా జీవితం లో పుట్టినప్పటినుంచీ ఇప్పటిదాకా
జరిగిన ముఖ్య ఘట్టాలను చెప్పు అన్నాడు.ఆ పండితుడు ముంజుడి జీవిత చిత్ర అంతా చెప్పుకొచ్చాడు.

. ఎవ్వరూ ఎరుగని ఎన్నో రహస్య విషయాలను కూడా అతనికి మాత్రమె చెప్పాడు.ఆయన ప్రతిభకు రాజు నివ్వెరపోయి కాళ్ళమీద పడిపోయాడు.తగినరీతి సత్కరించి ఆయనవిద్యను ప్రశంసిస్తూ యిలా అన్నాడు.

మాతేవ రక్షతి, పితేవ హితే నియుంక్తే
కాంతేవ చాభిరమయత్య పనీయ ఖేదం
కీర్తిం చ దిక్షు వితనోతి,తనోతి లక్ష్మీం
కిం కిం న సాధయతి కల్పలతేన విద్యా

అర్థము:--చేతిలో వున్న విద్య కల్ప వృక్షపు లతలా దేనినయినా సాధించి పెట్టగలదు.తల్లి రక్షించినట్టు రక్షిస్తుంది.తండ్రి లాగా ధర్మ మైన కార్యాలలో నియోగిస్తుంది.భార్యలా దుఖం పోగొట్టి సంతోష పరుస్తుంది. కీర్తిని అన్ని దిక్కులకూ వ్యాపింప జేస్తుంది.సంపదను కలిగిస్తుంది,విద్య సాధించ లేనిది ఏమి వుంది?

సభ ముగిసిన తర్వాత ముంజుడి మంత్రి ఒక సలహా యిచ్చాడు.
పనిలో పనిగా భోజుడి జాతకం ఎలా వుందో చూడ మని అడగరాదా?అని.నిజమే భోజుడి భవిష్యత్తు ఎలా వుంటుందో తెలిస్తే ముంజుడి భవిష్యత్తు కూడా
తెలిసినట్టే. అందువల్ల భోజుడి జనంకుండాలి చూపించి జాతక ఎలా వుంటుందో చెప్పమన్నాడు.యువరాజును స్వయంగా చూస్తేనే జాతకం సరిగ్గా చెప్పగలను అన్నాడు.జ్యోతిష్కుడు మున్జుడు భోజుడిని గురుకులం నుంచి పిలిపించాడు.భోజుడి వినయ విధేయతలు, శరీర సౌందర్యం,అతనిలో ఉట్టిపడే రాజ తేజస్సూ చూసి జ్యోతిష్కుడు అబ్బుర పడ్డాడు. ఈ బాలుడి జాతకం స్వయంగా బ్రహ్న్మదేవుడు చెప్ప వలిసిందే. ఇతన్ని గురుకులానికి పంపివేయండి. అని భోజుడు వెళ్ళిపోయాక యిలా చెప్పాడు.
.
పంచాశత్ పంచ వర్షాణి సప్త మాసాః దినత్రయం
భోజ రాజేన భోక్తవ్యః శ గౌడో దక్షణ పథః

యాభయిసంవత్సరాల, ఏడునెలల మూడు రోజుల కాలం,గౌడ దేశం తో సహా ఈ దక్షిణాపథం అంతా భోజుడి చేత పాలించ బడుతుంది.
యీమాటలు విన్న ముంజుడు ముఖంలో సంతోషాన్ని ప్రకటించినా మనసులో మాత్రం ఈ భవిష్య వాణి రుచించ లేదు.మందిరానికి వెళ్లి దీర్ఘంగా ఆలోచించాడు.ఈ రాజ్యం భోజుడి చేతిలోకి పొతే తను జీవచ్చవం లా బ్రతుక వలిసిందే అసలు యిదొక విచిత్రం అధికారం సంపదా లేకపోతె మనిషికి విలువే మారిపోతుంది.ఎన్ని తెలివి తేటలు వున్నా అధికారము,ధనమూ కోల్పోతే ఆ మనిషి మరో మనిషిగా మారిపోతాడు.ఈ ఆలోచనల వాళ్ళ ఏమి ఉపయోగం?ఏది చేస్తే లాభమో అదే తక్షణ కర్తవ్యమ్.ఎక్కువ పాపభీతి,దయా,నలుగురూ
ఏమనుకుంటారో నని సంకోచము వుంటే సంపద మనల్ని వదిలి వెళ్ళిపోతుంది.
.
అతి దాక్షిణ్య యుక్తానాం,శంకితానం పదే పదే
పరాపవాడ భీరూణాం,దూరతః యాన్తి సంపదః

ఎక్కువ దయకలిగి ప్రతిదానికీ సంకోచిస్తూ లోక నిందకు భయపడే పిరికి వాళ్ళ నుంచి సంపదలు దూరంగా వెళ్లి పోతాయి. అందుకే తాత్సారం చేయకుండా మన స్వార్థమెదొ అది సాధించుకునే ప్రయత్నం చెయ్యటం
యిప్పటి కర్తవ్యమ్ శత్రువును గానీ,వ్యాధిని గానీ నాశనం చెయ్యక పొతే అవి మనల్ని నాశనం చేస్తాయి.

ఇలా ఆలోచించి ముంజుడు ఒక నిర్ణయానికి వచ్చాడు.తన మిత్రుడూ మహా బలశాలీ అయిన వత్స రాజును దూతను పంపి పిలిపించాడు.అతనికి జ్యోతిష్కుడు చెప్పిన భవిష్య వాణి గురిచి చెప్పి భోజుడిని ఎలాగై నా చంపించాలి అని చెప్పాడు..వత్సరాజు నవ్వాడు.ముంజరాజా!కేవలం జ్యోతిష్యం విని చర్య తీసుకునే ముందు బాగా ఆలోచించు.అవతార పురుషుడయిన రాముడి పట్టాభిషేకం కోసం బ్రహ్మ పుత్రుడు వసిష్టుడు ముహూర్తం పెట్టాడు.ఏమయింది?రాముడు భార్యా సమేతంగా అడవులకు పోవలిసి వచ్చింది.

ఎవరో పొట్టకూటికి చెప్పిన భవిష్య వాణి ఆధారంగా భోజుడిని చంపేస్తే ఆ పాపం నీవు చచ్చే వర్ఫకూ వెంటాడుతుంది.అదలా ఉంచినా యిప్పుడు నువ్వు యువరాజును చంపితే నీ కొలువులోవున్న సింధుల రాజు సన్నిహితులు తిరగబడి అల్లకల్లోలం సృష్టిస్తారు ఎందుకంటె వాళ్ళ దృష్టిలో భోజుడే రాజు.నీవు అతడి సంరక్షకుడివి మాత్రమే జాగ్రత్తగా ఆలోచించు.అని సలహా యిచ్చాడు.ముంజుడికి కోపం వచ్చింది.రాజు నీవా?నేనా?రాజాజ్ఞ నిర్వహించడమే సామంతులపని.అన్నాడు.

ఇక గత్యంతరం లేక వత్సరాజు భోజుడిని గురుకులం నుండి నేరుగా భువనేశ్వరీ ఆలయానికి పిలిపించాడు. యువరాజా!జ్యోతిష్యుడు నీ గురించి చెప్పిన జోస్య విని ముంజరాజు నిన్ను చంపమని నన్నాదేసించాడు..
నేను రాజాజ్ఞ పాటింపక తప్పదు కదా! అన్నాడు.గుండె నిబ్బరం ,ధైర్యం భోజరాజు సహజ లక్షణాలు.ఓ! వత్సరాజా చావు బ్రతుకులు కాలవశాన జరిగేవి.
రామే ప్రవ్రజనం,బలే :నియమనం పాండో: సుతానాం వనం వృష్ణీ నాం నిధనం నలస్య నృపతే రాజ్యాత్ పరిభ్రంశనం కారాగార నిషేవణం చ మరణం సంచితస్య లంకే స్వరే సర్వః కాలవశేన నశ్యతి నరః కో వా పరిత్రాయతే
అర్థము:--రాముడి చరిత్రలో అరణ్య వాసం, బలిచక్రవర్తి గర్వభంగం, పాండు సుతుల వనవాసం, యాదవకుల నాశనం,నలమహారాజుకు రాజ్యనష్టం,లంకేశ్వరుడు రావణుడికి కార్తవీర్యార్జునుని చెరసాల లో నివాసం,మరణం యివన్నీ ఆలోచించి చూస్తే మనిషికి నాశనం కాలవశాన కలుగుతుంది.ఎవరు రక్షించ గలరు?ఈశ్వరేచ్చనుఅనుసరించి సముద్రం యింకి పోయి స్థలం గా మారుతుంది.స్థలం గా వున్నది సముద్రం గామారు తుంది.చిన్న దుమ్ముకనం కొండంతగా మారుతుంది,మేరు పర్వతం యిసుక రేణువు అయిపోతుంది.గడ్డిపోచ వజ్రాయుధ మవుతుంది,అగ్ని చల్ల బడుతుంది మంచు దహించి వేస్తుంది.ఈ లీలలన్నీ చూపగల ఆ ఈశ్వరుడికి నమస్కారం.విధి లిఖితం.

శాసన ప్రాయం, అని దగ్గరలో వుండే మర్రి చెట్టు ఆకులు రెండు తెచ్చాడు.తన కత్తితో పిక్క దగ్గర గాయం చేసుకొని ధారగా కారిపోతున్న రక్తాన్ని ఆ దొప్పలో పట్టాడు.ఒక గడ్డిపోచను ఆ రక్తంలో ముంచుతూ రెండో ఆకుమీద ఒక శ్లోకం వ్రాశాడు.యిది మా చిన్నాన్న ముజుడికి సందేశం గా అందించమని వత్సరాజుకు యిచ్చి నీ రాజాజ్ఞను నిర్వర్తించ మన్నాడు.వత్స రాజుతో బాటు అతడి తమ్ముడు కూడా అక్కడ వున్నాడు.అతను అన్నా!మరణాంతరం కూడా మనల్ని వదలక అనుసరించే మిత్రుడు ధర్మమొక్కటే శరీరానికి సంబంధించిన వన్నీ శరీరం తో బాటు నాశన మయ్యేవే .

ఏక ఏవ సుహృత్ ధర్మః నిధనేప్యను యాతి యః
శరీరేణ సమం నాసం సర్వం అన్యత్ తు గచ్చతి

అర్థము:-- మరణం అనంతరం ప్రయాణం లో తల్లీ,భార్యా బిడ్డా మిత్రుడూ ఎవ్వరూ తోడూ రారు.ధర్మం ఒక్కటే మనకు తోడుగా వచ్చేది.వృద్ధాప్యం,శారీరక రుగ్మతలూ వాట్కి చికిత్స సత్కర్మలు చేయగల శక్తి వున్నా వయసులోనే చేసుకోవాలి ఆ తర్వాతి కాలం మందులు లేని ప్రదేశం లాంటిది.చికిత్స సాధ్యం కాదు.

ఈ సమయం లో అధర్మ కార్యాలు చేసి పాపం మూటకట్టుకుంటే తర్వాత చింతిస్తావు.ఇలా బోధ చేయగా వత్సరాజుకు వైరాగ్య భావం కలిగింది.నిర్దోషి అయిన యువరాజును చంపటానికి మనసు రాలేదు.భోజుడిని తన రథం లో క్పోర్చో పెట్టుకొని రహస్యంగా తన యింటికి తీసుకొని వెళ్లి నేల మాళిగ లోసురక్షితంగా దాచాడు.భోజుడి తలను పోలిన తలను శిల్పుల చేత తయారు చేయించి దాన్ని తీసుకెళ్ళి ముంజుడికి చూపి భోజుడు చనిపోయాడని నమ్మించాడు.తరువాతి కథ సశేషం. భోజుని తలను చూసిన ముంజుడు వత్సా నువ్వు కత్తితో తల నరుకుతున్నప్పుడు భోజుడు ఏమీ అనలేదా?అని అడిగాడు.
ఏమీ అనలేదు కానీ ఈ మర్రి ఆకు మీద ఒక సందేశం రాసి యిచ్చాడు.అని వత్సుడు ముంజ రాజుకు ఆ మర్రి ఆకును అందించాడు.రాజు దీపం తెప్పించి ఆ ఆకు మీది శ్లోకం చదివాడు.

మాం ధాతా చ మహీపతి: కృత యుగాలంకార భూతః గతః
సేతు:యేన మహా దధౌ విరచితః క్వాసౌ దశా స్యాంతకః ?
అన్యే చాపి యుధిష్టిర ప్రభ్రుతయః యాతాః దివం భూపతే
నైకే నాపి సమం గతా వసుమతీ నూనం త్వయా యాస్యతి

అర్థము:--కృత యుగానికి అలంకార భూతమైన మాంధాత చక్రవర్తి వెళ్ళిపోయాడు.త్రేతాయుగం లో సముద్రానికే సేతువు కట్టించిన రావణ సంహారి శ్రేరాముడు ఎక్కడున్నాడు?(క్వ- అసౌ- దశా స్య -అంతకః ఎక్కడ ఆ రావణ సంహారి?)యుధిష్ఠిరుడు మొదలైన యితరులు కూడా దివంగతులైనారు.ఈ మహారాజులలో ఒక్కరి తోనూ ఈ భూమి వెళ్ళలేదు కానీ నీతో మాత్రం నిశ్చయంగా వచ్చేస్తుంది.నీ తాపత్రాయమూ,దురాశా,దుర్బుద్దీ చూస్తే ఈ భూమిని శాశ్వతంగా నీతో బాటు నెత్తిన పెట్టుకొని తీసుకెళ్ల గలను అని అనుకున్నట్టున్నావు అందుకే ఇలాంటి పాపకార్యాలు చేసుకుంటున్నావు.
ఈ వ్యంగ్యాస్త్రం ముంజుడికి తగల వలిసిన చోటే తగిలింది.తను చేసిన దెంత పొరపాటో తెలిసి వచ్చింది.

పశ్చాత్తాపం తో కుమిలి పోయాడు.మంత్రినీ పురోహితుల్నీ పిలిచి తన పాపానికెలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలో చెప్పమని ప్రార్థించాడు.
మాజీ మంత్రి బుద్ధిసాగారుడు వచ్చి రాజును తీవ్రంగా దూశించాడు.నువ్వు రాజుఅల్లొ అధముడివి.నీ అన్న నీ మీద ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేసి ఆయన రాజ్యం దొంగిలించి ఆయన నీ సంరక్షణ లో వదిలి వెళ్ళిన పుత్రుడిని నిర్దాక్షిణ్యంగా చంపావు.నీ లాంటి పాపిష్టి రాజుల పాలనలో ప్రజలు కూడా పాపాత్ములే అవుతారు.

రాజ్ఞి ధర్మిణి ధర్మిష్టా:పాపే పాపపరాః సదా
రాజాన మను వర్తన్తే యధా రాజా తధా ప్రజాః

రాజు ధర్మ మార్గం లో వుంటే ప్రజలు ధర్మిష్టులు గా వుంటారు.రాజు పాపి అయితే ప్రజలూ సదా పాపులే అవుతారు.యెందుకంటే ప్రజలు రాజును  అనుసరిస్తారు.రాజేలాంటి వాడైతే ప్రజలూ అలాగే వుంటారు.

ఈ పాపానికి అగ్ని లో దూకి ప్రాణత్యాగం చెయ్యడమే ప్రాయశ్చిత్తం అన్నారు పురోహితులు.
పశ్చాత్తాప భారం తో అగ్నిలో ప్రవేశించాలని నిశ్చయించు కున్నాడు ముంజుడు.
రాజు కళ్ళు తెరిపించేందుకు మంత్రి బుద్ధి సాగరుడూ,వత్సరాజూ కలిసి , చిన్న నాటకం ఆడారు.

ఒక కాపాలిక మాం త్రికుడిని పిలిపించి అతని చేత స్మశానం లో హోమాలు చేయించి భోజుడిని బ్రతికించి నట్లు నాటకం నడిపించారు.అప్పుడు రహస్యంగా దాచి ఉంచిన భోజుడిని రాజు దగ్గరికి తీసుకొని వచ్చారు.
రాజు భోజుడిని గాడంగా కౌగలించుకొని సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యాన్ని భోజుడికి అప్పగించి తన సొంత కొడుకులందరికీ తలా ఒక గ్రామం యిప్పించాడు. తనకు యిష్టుడయిన జయంతుడనే కొడుకును మాత్రం భోజుడి ఆస్థానం లో భోజుడికి సహాయంగా ఉండేందుకు ఏర్పాటు చేశాడు.భోజ పట్టాభిషేకం అయిన తర్వాత తన భార్యల తో సహా వానప్రస్థా శ్రమానికి అడవులకు తపస్సు చేసుకుందుకు వెళ్ళిపోయాడు.

భోజుడు నిరాటంకంగా ప్రజానురంజకంగా పాలించటం ప్రారంభించాడు.
.ఆ కాలం లో కనుక అలా పశ్చాత్తాప పడ్డారు.న్యాయ మేదో తెలుసుకొని యువరాజుకు రాజ్యాన్ని అప్పగించారు.యిప్పటి మన నాయకులతో పోల్చుకుంటే అప్పటి వాళ్ళు యెంత ధర్మాత్ములో కదా! అని అనిపించక 
మానదు.తపు చేసినా అది తప్పని గ్రహించి తప్పుదిద్దుకున్నవాడు మహాత్ముడే అవుతాడు కదా!
--------------- శుభరాత్రి -------------------

ప్రకృతి సత్యం


*ఎవరినీ మీ నోటితో కానీ మనస్సుతో కానీ నాశనం అవ్వమని, పాడవ్వమని కాని తిట్టకండి.*

*బుద్ది బాగుపడాలి బావుండాలి అని కోరుకోండి.*

*ఒకడు బాగుపడితే వాడి వలన పదిమందికి ఉపయోగం కలుగుతుంది.*

*అంతేకాకుండా ఒకరి మేలు కోరుకున్న మీకు మంచే జరుగుతుంది.*

*ఎందుకంటే*

*ఈ సృష్టిలో మనం మనస్ఫూర్తిగా ఏది తలిస్తే అది జరగడం ఈ సృష్టి రహస్యం.* 

*ఏది మనం ఇస్తామో దానికి పదింతలు లభిస్తుంది.*

*చెట్టుకి నీరు పోస్తేనే కదా వృక్షమై పువ్వులు ఫలాలు ఇస్తుంది.*

*సూర్యుడు నీరు స్వీకరించే కదా వర్షాలు ఇస్తున్నాడు అలాగే ఇది కూడా ..*

*కనుక ఈరోజు నుండి కయ్యానికి కాలు దువ్వకుండా బుద్ధిమారి మంచివారిగా మారాలని కోరుకోండి.*

*అందుకే కదా*

*భార్యని అపహరించిన రావణుడిని రాముడు క్షమిస్తాను అని చెప్పి దేవుడయ్యాడు. అది వినని రావణుడు మృతుడయ్యాడు.*

*యుధిష్ఠిరుడు కూడా మహామహా పాపాత్ములని క్షమించాడు. చివరికి దుర్యోధనుడిని కూడా క్షమిస్తాను అయిదు ఊళ్ళు ఇవ్వమంటే వినకుండా కాలుదువ్వాడు. చివరికి చచ్చాడు.*

 *మేలు కోరుకోవడం మనవంతు.వినకపోతే* *అనుభవించడంవాళ్ళ*

 *వంతు.*

__(())__ 

మానవ దేహము -మహావృక్షము వంటిది-

మానవ దేహం వృక్షంతో సమానం. అది ఎలా? అనే విషయాన్ని వివరించి చెప్పేదే ఈ కథ. మహాభారతం అశ్వమేధపర్వం ముప్పైఅయిదో అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ విషయాలను వివరించి చెప్పాడు.

మానవ దేహం అక్షరాలా ఓ వృక్షం లాంటిది. అజ్ఞానం అనేది ఈ వృక్షానికి మూలమైన బీజం. బుద్ధి దాని బోదె. అహంకారం ఆ చెట్టుకు ఉండే కొమ్మలు. ఇంద్రియాలు ఆ చెట్టు మానుకు ఉన్న తొర్రలు. పంచ మహా భూతాలు ఆ వృక్షానికి ఉన్న విశేషమైన అవయవాలు.

ఆ పంచభూతాల విశేష భేదాలు కొమ్మల నుంచి పుట్టు కొచ్చిన చిరుకొమ్మలు. ఈ కొమ్మలకు, చిరు కొమ్మలకు నిరంతరం సంకల్పాలు అనే ఆకులు పుడుతుంటాయి. కర్మలు అనే పూలు పూస్తుంటాయి. అయితే మనిషి పిచ్చి మొక్కల్లా మిగలగూడదు.

తాను చేసే శుభ, అశుభ కర్మలవల్ల కలిగే సుఖదుఃఖాదులే ఫలాలు (ఆ చెట్ల పండ్లులాగా ) ఇలా బ్రహ్మరూపమైన బీజం నుంచి పుట్టుకొచ్చి ప్రవాహ రూపంగా నిరంతరం ఉండే దేహం అనే వృక్షాన్ని, జాగ్రత్తగా పరిశీలిస్తే, అది అంత సామాన్యమైనదేమీ కాదు చాలా గొప్పదే.

ఎందుకంటే అది ఎన్నెన్నో ప్రాణుల బతుకులకు ఆధారంగా ఉంటుంది. ఆ దేహమనే వృక్షతత్వాన్ని అందరూ గ్రహించ గలగాలి. ఆ తత్వం అర్థం కావాలంటే సద్గురువుల ఉపదేశాలు అవసరం. అయితే ఒకసారి అలా ఉద్భవించిన దేహం సంసార సముద్రంలో పడి తాను, తనవాళ్లు అని కొట్టు మిట్టాడుతూ స్వార్థంతో నిండిపోతే కష్టమే.

నిస్వార్థంగా నిజమైన చెట్టులాగా అందరికీ సహాయపడాలే తప్ప పిచ్చి మొక్కల్లాగా పనికిరాని తీరులోనూ అందరికీ ఇబ్బంది కలిగించే చెట్ల లాగా మనిషి దేహం, ప్రవర్తన మారకూడదు.

తన దేహం అలా మారుతోంది అని సందేహం కలిగినప్పుడు సద్గురువు సూచనల మేరకు జ్ఞానం అనే ఉత్తమ ఖడ్గాన్ని తీసుకొని అజ్ఞాన అడవులు, పిచ్చికొమ్మలు, అనే ఆలోచనలను నశింపచేసుకోవాలి. అప్పుడే మానవ దేహం అందరికీ నీడనిచ్చే మంచి చెట్టులాగా పేరు తెచ్చుకుంటుంది. అలా కానప్పుడు ముళ్లచెట్టు లాగా, కలుపుమొక్కల లాగా అందరి నిరాదరణకు గురవుతుంది.

మంచి చెడ్డలు అవగాహనతో సనాతన జ్ఞానవిషయం ధర్మాన్ని అనుసరిస్తూ అలా మనిషి తన దేహాన్ని, జీవన విధాన్నన్ని,అన్ని ధర్మకార్యాలకు సాధనంగా వినియోగిస్తుండాలి. ఈ విషయం తెలిసిన వారే జీవితం ఫలవంతం చేసుకోగలరు. వారే విద్వాంసులు, సిద్ధులు అని పేరు పొందుతారు.

పూర్వకాలంలో దక్షప్రజాపతి, భరద్వాజుడు, గౌతముడు, శుక్రుడు, వసిష్ఠుడు, కశ్యపుడు, విశ్వామిత్రుడు, అత్రి అనే మహర్షులు తమతమ జీవన మార్గాలలో పెద్దపెద్ద వృక్షాలు గా మానవాళికి ఎంతో విలువైన, సమగ్ర జ్ఞానాన్ని జీవిత విధాన్నన్ని ఆన్దించి, అందరికీ సుఖాన్ని,, ఆనందాన్ని కలగచేశారు.అయితే దేహమైనా, వృక్షమైనా కొద్దికాలంపాటే భూమ్మీద ఉండగలిగేది. కనుక కొంత కాలానికి వారికి అలసట వచ్చింది.

అప్పుడు వారంతా కలిసి అంగీరస మునిని వెంట పెట్టుకొని బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లారు. వెళ్లి అంత,,,,కాలంపాటు తామెన్నో పనులు చేశామని ఆ పనులన్నీ మంచివేనా? లేకపోతే శ్రేష్ఠకర్మ ఎలా చేయాలి? ఒకవేళ పాపం చేసి ఉంటే ఆ పాపం నుంచి ఎలా బయట పడాలి? అనే విషయాలను గురించి చెప్పమన్నారు.

అప్పుడు బ్రహ్మదేవుడు వారందరికీ మంచి పనులు, పుణ్య కార్యాల విషయాలను తెలియ చెప్పాడు. బ్రహ్మ చెప్పిన విషయాలతోపాటు తాము చేసిన పనులు సరిపోల్చుకొని ఆదర్శ వంతమైన జీవితాన్ని మళ్లీ సాగించారు ఆ ఋషులు. ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలియ చెప్పాడు.

ఈ కధ ద్వారా మనం తెలుసుకోవలసినది, గమనించాల్సిన విషయం మనం మన జీవితంలో అనుసరించాల్సిన దేమిటంటే, మనిషి నిస్వార్థంగా ఓ మంచి మహా వృక్షంలాగా అందరికీ సహాయ పడుతూ ఉండాలి.

ఎన్ని మంచి పనులు చేస్తున్నా చివరకు అనుభవజ్ఞుల దగ్గర తమ పనులను సమీక్షించుకుంటూ మంచి, చెడులను బేరీజు వేసుకుంటూ మందుకు నడవాలనే జీవన సత్యాన్ని, ఉత్తమ మార్గదర్శక సూత్రాన్ని మనకు తెలియపరుచును.

--(( ))--

🧘‍♂️సూక్ష్మంలో మోక్షం🧘‍♀️
🕉️🌞🌏🌙🌟🚩               

మనం సాధారణంగా మోక్షమంటే అదేదో చాలా పెద్దది, దానిని సాధించాలంటే మనం ఎంతో ఎదగాలి అనుకుంటాం. 


కానీ ఈ సృష్టిలో చూస్తే పెద్ద పెద్ద ప్రాణులే త్వరగా బంధింపబడతాయి. ఒక పులినో, జింకనో బంధించినంత తేలికగా ఒక ఎలుకనో, చీమనో బంధించగలమా? 


అలాగే పెద్ద చేపలు తేలికగా వలలో పడతాయి కానీ ఎంత చిన్న చేప అయితే వలలో నుండి అంత తేలికగా తప్పించుకోగలుగుతుంది.


అసలు "నేను చాలా పెద్దవాణ్ణి, లేదా గొప్పవాణ్ణి" అనుకోవడమే పెనుమాయ. 
అంతకు మించిన బంధనం ఏముంటుంది? నేను చాలా చిన్నవాడిని, భగవద్భక్తుల దాసానుదాసుడిని అనుకోవడమే మోక్షానికి దగ్గరి దారి.


’సురస’ పెద్ద నోటిలో చిక్కినపుడుగానీ, లంకలో రాక్షసులు త్రాళ్ళతో తనను బంధించినపుడుగానీ హనుమంతుడు సూక్ష్మరూపాన్ని ధరించే కదా ఆ బంధనములనుండి విడివడగలిగింది? 
"సర్వహీన స్వరూపోహం" అని పరమాత్మ తత్వాన్ని తేజోబిందూపనిషత్ నిర్వచిస్తోంది. 


"అణోరణీయాం" అయినవాడే "మహతోమహీయాం" కాగలడు. అయితే మానవుడు ఈ సత్యాన్ని గుర్తించలేక లేనిపోని అహంకారాన్ని తెచ్చిపెట్టుకొని "నా అంతటివాడు లేడు" అని విర్రవీగి చివరికి ఆ మాయకు బద్ధుడై అనేక జన్మలను ఎత్తుతున్నాడు. 


తన నిజస్థితియైన ఆత్మతత్వాన్ని గుర్తించిననాడు అదే ఆత్మతత్వం సర్వేసర్వత్రా వ్యాప్తమై ఉన్నదనే జ్ఞానం కూడా కలుగుతుంది. 


అప్పుడింక ఒకరు గొప్ప ఇంకొకరు తక్కువ అనే భావనే కలుగదు.


ఈ చరాచర సృష్టి అంతా పంచభూతాలతోనే నిర్మించబడినప్పటికీ వివిధ నిష్పత్తులలో వాటి వాటి కలయిక వల్ల మనకు స్థూలంలో ఇన్నిన్ని వస్తుభేదాలతో కనిపిస్తోంది. ఈ స్థూల దృష్టి ఉన్నంతకాలం ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అనే భేదభావన తొలగదు. అదే మనం సూక్ష్మదృష్టితో చూస్తే సృష్టిలోని ప్రతి వస్తువూ, ప్రాణీ అణువులతోనూ, పరమాణువులతోనూ నిర్మితమైనవే కదా. మరి ఈ పరమాణువులన్నీ ఒకే విధమైన ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లతో ఏర్పడినవే కదా! ఇలా సైన్సు ప్రకారం చూసుకున్నా సర్వసమానత్వం మనకు గోచరిస్తుంది.


ఇక భక్తుడవై చూస్తే ఈ సమస్త సృష్టి పరమాత్మనుంచే వచ్చింది కదా? మరి అలాంటప్పుడు ఇక హెచ్చుతగ్గులకు తావెక్కడ? 


మరి జ్ఞాని దృష్టితో చూస్తే ఈ సర్వమూ తన(పరమాత్మ) స్వరూపమే. ఇలా ఏవిధంగా చూసినా సరైన పరిశీలన చేసినవాడికి హెచ్చుతగ్గులు లేవని అర్థమౌతుంది.


మానవుడు ఈ సూక్ష్మదృష్టిని అలవరచుకోలేక కేవలం స్థూల దృష్టితో మాత్రమే చూసి అహంకార మమకారాలకు లోనై బంధనాలను కొనితెచ్చుకుంటున్నాడు.


సూక్ష్మదృష్టి, లేదా సూక్ష్మ భావన అంటే దేనికి అంటకపోవటం. "యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే! సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే" అని భగవద్గీత చెబుతోంది. 


ఆకాశం సర్వవ్యాపమై ఉన్నా దాని సూక్ష్మత్వం చేత దేనికీ అంటకుండా ఉంటోంది. నిజానికి ఆకాశంకన్నా పెద్దది విశాలమైనది ఈ సృష్టిలో ఏదీ లేదు కదా. అంత పెద్దదైనా దాని గుణం సూక్ష్మత్వం. అందుకే అది దేనిచేతా బంధింపబడదు. అలాగే దేహమంతా వ్యాపించియున్నా తన సూక్ష్మత్వం చేత ఆత్మ కూడా దేనికీ అంటదు, దేనిచేతా బంధింపబడదు.


ఇదే సూక్ష్మంలో మోక్షమంటే. బంధన లేకపోవడమే మోక్షం కదా! నిజానికి మన నిజస్థితి సదా మోక్షస్థితే. అయితే అట్టి సదాముక్తయైన ఆత్మను నేననే సూక్ష్మాన్ని గుర్తించలేక ఈ స్థూలదేహం నేననే భ్రమలోపడి మనం బంధితులం అయ్యామని తలపోస్తున్నాం, ముక్తిని కోరుకుంటున్నాం. శ్రీగురుదేవులు బోధించినట్లుగా "ముక్తి అనేది పొందేది కాదు. అది నీ స్వరూపమై/స్వభావమై  ఉన్నది. నువ్వు చేయవలసిందల్లా దానిని గుర్తించడమే." దానికోసం మనం ఈ సూక్ష్మదృష్టిని అలవరచుకోవాలి. ఆథ్యాత్మికంగా ఎదగడం అంటే సమానత్వ దృష్టి సాధించడమే. సమదృష్టి కలవాడే పండితుడని, జ్ఞానియని భగవద్గీతలో అనేకమార్లు చెప్పబడింది.


నేలమీద ఉన్నవాడికి కొన్ని ఎత్తుగానూ, కొన్ని పల్లంగానూ కనిపిస్తాయి కానీ విమానంలో ఎంతో ఎత్తులో ఎగురుతున్నవాడికి ఈ భేదాలు తెలుస్తాయా? వాడికి క్రింద అంతా సమతలంగానే గోచరిస్తుంది. అలాగే ఆథ్యాత్మికంగా తక్కువ స్థాయిలో ఉన్నవాడే ఇంకా "నేను గొప్ప, నువ్వు తక్కువ" అని మాట్లాడుతాడు కానీ ఉన్నతిని సాధించినవాడు ఎన్నడూ ఈ తరతమ భేదాలు చూడడు.

🕉️🌞🌏🌙🌟🚩

🧘‍♂️తత్వబోధ🧘‍♀️
🕉️🌞🌏🌙🌟🚩

" నహికశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ కృత్ "


1-జన్మించటము- మరణించటము కర్మే. కదలిక కదలాలంటే ఆ కదలిక వెనుక ఉన్న శక్తి పేరు కర్మ.


2- నేనన్న ఉనికి ఉనికిగానే ఉంటే స్వరూపం - వ్యవహరిస్తే జీవుడు. 


3- ఆత్మకు కర్మ జడం - జీవునికి కర్మ చేతనం. ఆత్మ నిత్య తృప్తం - జీవుడు నిత్య అసంతృప్తి.... అసంతృప్తి వలన కర్మకు వశుడవుతున్నాడు. 


4- అంత: కరణాన్ని ఎవరైతే స్వాధీనపరచుకున్నారో వారికే ఉపరమ ..... జ్ఞానాన్ని ఉపయోగించి కర్మను పనిముట్టుగా చేసుకోవాలి. 


5- సహస్రారం నుంచి కిందకు దిగక- వాసనలతో - గుణములతో కూడక వ్యవహరించు ... కట్టెలు వేయకు - గాలి కొట్టకు. 


6- సృష్టి ధర్మము నెరిగి యజ్ఞభావం తో కర్మచెయ్యటం శరీర ధారులకెల్ల నియమము.


7- స్వరూప జ్ఞానం ... సర్వాధారమై - సర్వాన్ని ఎరిగి- సర్వ వ్యాపకమై - సర్వాన్ని మింగి వేయగలది సమ్యక్ జ్ఞానం.


8- సాధకులు ... సాత్వికఅహం పోగోట్టు కోలేరు ... ఇది అనుకూల శతృవు - నీడవలే వెన్నంటి ఉంటుంది. రాజసిక , తామసిక అహము ప్రతికూల శతృవులు. 


9- కాల కర్మ వశమైన దానిని కూడా దాటించగలంత బలంగా శమాది షట్క సంపత్తి సాధించబడాలి.


10- ప్రళయ కాలంలో కూడాకాపాడేది ఏదో అది స్వధర్మం.. అటువంటి స్వధర్మాన్ని అనుష్టించటమే శ్రేయస్సు. స్వధర్మం కానిది పరధర్మం. 


11- నిత్యం - శుధ్ధం- బుధ్ధం- ముక్తం- అద్వయం ... వ్యష్టి సాక్షి. సత్యం- చైతన్యం- జ్ఞానం- ఆనందం- ప్రకాశం ... సమిష్టి సాక్షి.
 

12- స్వధర్మానుష్టానమే ..... స్వస్థితిలో నిలకడ చెంది ఉండటమే మడి కట్టుకోవటం .. జీవాత్మ పరమాత్మల అభేధ దర్శనాన్ని కల్గి ఉండటమే స్వధర్మం. జీవాత్మ- పరమాత్మ ల అభేధ దర్శనమనే అంత: సన్యాసాన్ని పొందినవాడికి పరమాత్మ స్థితి యందు నిలకడ చెంది ఉండటమే స్వధర్మం. 

🕉️🌞🌏🌙🌟🚩
🧘‍♂️దివ్యత్వం🧘‍♀️
🕉️🌞🌍🌙🌟🚩

ఎటువంటి మనిషైనా ఈ భూమ్మీదకు వచ్చి ఉత్తి చేతులతో తిరిగి వెళ్ళకూడదు.  కొద్దో గొప్పో దివ్య శక్తి సంపన్నుడు కావాలి.


ఆ శక్తిని ఆత్మలో నిక్షిప్తం చేసి తిరుగు పయనం కావాలి. అదే అతడి శాశ్వత సంపద. వేదాలు పదేపదే చెప్పే విషయం.


దేవుడు, మనిషిని పూర్తిగా తన పనిలో ఉంచుకోవాలని నిత్యం అనుకుంటాడు. మనిషి తాను శరీరం తప్ప మరేమీ కాదన్న భ్రమలో ఉంటూ దేవుడికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు.


శరీరం ఒక ఊబి అంటాడు అరవిందుడు. అందులో కూరుకుపోతే బయటకు రావడం చాలా కష్టం. ఎన్నో జన్మలు అందులోనే ఉన్నాం. ఇప్పుడైనా శరీరాన్ని(శరీర భావాన్ని) వదిలి ఆత్మ వైపు తిరగడం అత్యవసరమని మనిషి గ్రహించిన రోజునే అతడు దివ్యశక్తి సంపన్నుడవుతాడు.


ఏ అవకరం లేని, ఆరోగ్యవంతమైన శరీరాన్ని తల్లిదండ్రులు ఇచ్చారు. ఈ శరీరం నాదని సంతోషంగా చెప్పుకొంటున్నాం.
 

ఈ శరీరాన్ని మనకు ఇచ్చినందుకు ప్రతిఫలంగా వారికి మనం ఏం ఇవ్వాలి? మా పని మేం చేశాం, నీ ధర్మం నువ్వు నెరవేర్చు- అన్నట్లుగా ఉంటుంది ఈ భూమ్మీద మనిషి జన్మ రహస్యం.


శరీరాన్ని చూసి ఆనందపడవచ్చు. అందంగా ఉన్నదైతే మురిసిపోవచ్చు. శరీరాన్ని పోషించి సుఖపెట్టవచ్చు. కాని, ఈ శరీరం దేనికి అని ఎప్పుడైనా నిజాయతీగా ప్రశ్నించుకోవాల్సిందే.


మానవ శరీరం రావడం అదృష్టం. శరీరం గురించి తెలుసుకుంటూ దాని పరిమిత భావాన్ని పోగొట్టుకోవాలి. శరీరం నేను కాదని తెలుసుకోవాలి. శరీర ప్రయోజనం తెలుసుకోవాలి. శరీర బంధం తాత్కాలికమని గ్రహించాలి.


ఈ శరీరం ఉపయోగించి ఇతరులకు సాయపడటం, లోకం కోసం మంచి పనులు చెయ్యడం మంచిదే. సందేహం లేదు. ఇలాంటి వారికి శరీరం ఎక్కువ కాలం ఉండాలి. వాళ్లు దీర్ఘాయు ష్మంతులుగా ఉండాలి.


పుట్టుక కోసం, మరణం కోసం ఈ శరీరం వచ్చినట్లు కనపడుతుంది అందరికీ. శరీరం తప్ప ఇంకేం లేదన్నట్లు బతుకుతారు కొందరు.
 

శరీరాన్ని ఈడుస్తూ బతుకుతారు మరికొందరు. శరీరం జడం. అది శవం లాంటిది. నీ శవాన్ని నువ్వు మోస్తూ తిరుగుతున్నావు అంటారు రమణ మహర్షి.


నీకిచ్చిన శరీరంతోనే ముక్తిని సాధించి, జీవన పరమార్థం నెరవేర్చుకోవాలి అంటున్నాయి ఉప నిషత్తులు. అందరూ ముక్తిని సాధించలేరు. ఎంతో కొంత ప్రయత్నం చేసి దివ్యశక్తి సంపన్నులయ్యే అవ కాశం ఉంది అందరికీ.


జీవితాంతం ఈ శరీరంతో తిరుగుతూ ఉంటాం. దారి మార్చి, ఈ శరీరంతోనే మన అంతరంగ ప్రయాణం మొదలు పెట్టవచ్చు. అప్పుడు దివ్యశక్తి తొలకరి మొదలవుతుంది.


మనసు సారవంతమవుతుంది. కొంతకాలం తరవాత పచ్చటి ఆత్మ పంట పండుతుంది.


దయతో, ప్రేమతో మన అంతరంగ ప్రయాణానికి వాహనంగా ఇచ్చి, ఆత్మను శక్తిసంపన్నం చేసుకోవడానికి ఈశ్వరుడు ప్రసాదించిన అవకాశమే ఈ మానవ శరీరం అని బోధపడుతుంది.


దివ్యత్వం వైపు మనం వేసే ప్రతి అడుగు భగవంతుడికి ఆనందాన్ని ఇస్తూనే ఉంటుంది. మన నేత్రాలు ధ్యానం కోసం మూసినప్పుడు అంతర్నేత్రం తెరుచుకోవడం, హృదయంలో జ్ఞానకమలం వికసించడం ఆయనకు పరమానందం కలిగించే అంశాలు.
 

ఇలాంటి దివ్యానుభవాల ఇంద్రధనుస్సు చిదాకాశంలో వెళ్ళివిరియాలని ఆయన అభిలాష.
***