Sunday, 4 October 2026

 


*******

చిరుహాసము నీవుగా

తరుణాన తపంబుగా

కరుణయే శుభంబుగా


కలకాలముండనేను 

చెలిమిగా సాగనేను 

బలిమిగా సేవ నేను 


విరజాజి తీగ నేను

వరమల్లె వెంట గాను

చరణంబు దరి నేను


సాయంబు సేయ సర్వదా

ధ్యేయంబు గాను నుండెదా

ప్రాయంబు ఎంత వేడెదా


ప్రేమామృతం పొందనాను 

క్షేమామృతం  కోరినాను 

సోమామృతం పంచినాను 


నీ చూపు వెన్నెలై జూడు 

నీ చూరు పట్టాను జూడు 

నీ చురుకు నన్ను జూడు


గాయత్రీ చందస్సుగా మీ విధేయుడు 

మల్లాప్రగడ

*******

మనసు వయసు నిన్నె మత్తుగా నిన్ను చేరే 

తణువు తపన నిన్నే తన్మాయ చేయ కోరే


వినగ వలచి రమ్ము గీతంబు నేను పాడే 

వినతి గమన మొంది విద్యల్లె నేను నీడే


మనసు ధరణి నమ్మే మార్గంబు గాను చేరే 

గుణము దయను నమ్మే గొప్యంబు గాను చేరే 


మనము మనము సేవే మానంబు గాను మేలే 

ఋణము రణము సేవే రుద్రంబు తీరు మేలే


ఏ మామది గాంచితీ ఏ రూపము నెంచితీ 

ఏ ప్రేమను చూపితీ  ఏ రూకలు కోరితీ 

ఏ తామస భామినీ  ఏ రుద్రంబు నెంచి తీ 

ఏ నామము పల్కితీ  ఏ రొద్రంబు గాంచి తీ

*****

💐 ప్రేమంటే ఆరామం


ప్రేమగీతం


పల్లవి:


ప్రేమంటే ఇష్టపడటమే కాదు

కష్టపెట్టక నిలిచే అనుబంధం

ప్రేమంటే మాటల మాధుర్యమే కాదు

హృదయాలు కలిపే మధురానందం


ప్రేమంటే ప్రేమను చెప్పుటే కాదు

మనసు విప్పి మమతను పంచటం

ప్రేమంటే కామపు కోరికే కాదు

జీవితమంతా ఆరామం చేయటం


చరణం – 1


దుఃఖమివ్వక సంతోషమివ్వాలి

అనునయంతో అభినందించాలి

విషమమైన వేళలో సమమై నిలవాలి

వేదనలోనూ వెన్నంటి ఉండాలి


సరిగమల గాంధర్వ గానమే కాదు

సరాగాల సంగమ రాగమది

వర్ణరంజిత స్వప్నమే కాదు

అపరంజి ప్రేమకు రూపమది


చరణం – 2


రాకా చంద్రుని వెన్నెలే కాదు

ఏకైక రజనీగంధ పరిమళం

పద్మంలోని మకరందమే కాదు

ప్రేమలోని మధురానుభవం


పురస్కారమాశించని ప్రేమ

ప్రతిఫలాన్ని కోరని హృదయం

సంస్కారంతో సుగంధమై నిలిచి

సహజీవనానికి సౌభాగ్యం


చరణం – 3


ప్రేమ అనుభవైక వేద్యమమ్మా

ఆస్వాదకులకు అమృతధార

హృదయం విప్పిన అనురాగమమ్మా

అనుబంధాలకు ఆనందధార


ఇష్టంలోనూ కష్టం కలిగించని

ఇంపైన ఆత్మీయత ప్రేమ

జన్మజన్మలకు జ్ఞాపకమయ్యే

జీవన మాధుర్యమే ప్రేమ!


ముగింపు:


ప్రేమంటే పొందటం మాత్రమే కాదు

పరులకు ఆనందం పంచటం

ప్రేమంటే ఒకరి కోసం మరొకరు

ప్రేమతో జీవితం వెలిగించటం!

******

ఎంత పని చేసే దొర కొడుకు 

 అతని జ్యాసే కడుపులో ఉడుకు 


 శాంత మని నను చేరగా నాకు ఒనుకు 

 చెప్పలేని తనము అది ఏమి కిటుకు 

 తప్పు కాదని నిజంబును చెప్ప పలుకు 

 ఒప్పు తప్పులు చూడలేదని మాత్రం అనకు 


చలి తెచ్చేను ఇక కౌగలింతలే మనకు 

వానలా వచ్చానని మాత్రం నీవు అనకు 

ఎండలా ఏడిపించానని భయంతో యనకు 

మనమధ్య మoకుపట్టుకాదు వలపుల కులుకు 


ఎంత పని చేసే దొర కొడుకు 

 అతని జ్యాసే కడుపులో ఉడుకు


థలుకు లన్నియు క్షణము థాక గరుకు 

తపన విలువలన్ని బ్రతుకు థాటి సరుకు 

థవల లీలలు చూపకు థాటి యనకు 

తరము తరముగా సాగెడి తప్పు థలుకు 


కలువ పువ్వెకదా యని సంబరపడి నలపకు 

చెలిమి చేయుచున్నాదని చపల మెందుకు 

చలవ చేయ మనసు దాహమే ననకు 

పలుకులో మర్మము గాంచక పలుకకు


ఎంత పని చేసే దొర కొడుకు 

 అతని జ్యాసే కడుపులో ఉడుకు

ఎంత పని చేసే దొర కొడుకు 

 అతని జ్యాసే కడుపులో ఉడుకు

*******

పల్లవి


మూలమేదైనా ముఖ్యం మనశ్శాంతి

తృప్తి నిండితే అదే మనకు కాంతి

మనసు మారితే మారును జీవనరీతి

శాంతి నిలిచితే సుఖమే మన ఆస్తి!


చరణం – 1


ఆలోచన తప్పితే ఆచరణ తప్పు

ఆచరణ తప్పితే ఆవేదన తప్పదు

ఆవేదన పెరిగితే అశాంతి చేరును

అశాంతి మనిషిని అలమటింపజేయును!


చరణం – 2


కోరిక పెరిగితే తృష్ణయే పెరుగును

మక్కువ పెరిగితే మోహమే కలుగును

మోహమున అహమే మొలకెత్తి పెరుగును

అహముతో అధికార మాశించి పోవును!


చరణం – 3


అధికార మంటున స్వార్థము చేరును

స్వార్థము చివరకు అనర్థము తేవును

అవివేకముతో అవకతవకలాయె

అనిశ్చితి భయమై మనసును కుదిపె!


చరణం – 4


భయముతో సందేహ భావములు పెరుగును

సంతులనం తప్పితే సంతృప్తి కరువగును

అసంతృప్తి ద్వేషపు అగ్నిని రగిలించు

అసూయ మనశ్శాంతి ఆనవాలు చెరిపించు!


చరణం – 5


అసమర్థత వెనుక బద్ధకము నిలుచును

బద్ధకము వెనుక వాయిదా పెరుగును

వేయి మూలాలున్న తప్పులు చేయించు

తప్పుల పరంపర తిప్పలు తెచ్చును!


చరణం – 6


మోహమును వీడి వివేకము పొందాలి

స్వార్థమును విడిచి సమభావముండాలి

కోరికల హద్దును గుర్తించి నడవాలి

తృప్తితో జీవిత గమ్యాన్ని చేరాలి!


ముగింపు పల్లవి


మూలమేదైనా ముఖ్యం మనశ్శాంతి

తృప్తి నిండితే అదే మనకు కాంతి

తప్పుల మూలాలను తెలుసుకొని మార్చి

శాంతితో జీవిద్దాం సంతోషమందీ!

*****

చూడూ కుసుమమ కళగా కలకాలం 

నేడూ కవనము కథగా కలకాలం 


నాడూ మనసున జపమై యిది నీకే

నేడూ భయమున జడమై యిది నీకే


వాడూ వయసున వలగా కలకాలం 

వీడూ వలపున  విలువా కలకాలం


నిండైనది దయ గుణమై యిది నీకే 

మెండైనది కృప ఫలమై మది నీకే


డూడూ యనుచును ననుగా దరి చేరే 

డూడూ పలుకుల పసగా మరి చేరే 


చూడూ నిడిన ఫలమదే వరుసాయే 

చూడూ నిడని ఫలమదే  కరువాయే 


ఆడూ మదిగను వరమై స్థితి గానే 

ఆడూ విధిగను  గుణమై గతి గానే 


చూడూ కుసుమమ కళగా కలకాలం 

నేడూ కవనము కథగా కలకాలం

******

పల్లవి:

ఒక్కసారి నిన్ను చూసినా

రెప్పవేయుట సాధ్యపడునా! నేనంట ఓ దేవి 

మనసులోన నిన్ను దాచినా

మరచిపోవుట సాధ్యపడునా! నేనంట ఓ దేవి 


అనుపల్లవి:

ఈ వీణ మీటేది నీవేనంట

ఈ మౌనమంతా నీ ఆటంట

ఈ మేను నీ మాటే నేనంట

ఈ మౌనమెలాగో ఈ పూటంట

ఈ నాదమంతా నీ నిధి మోతంట! ఓ దేవి 


చరణం – 1

మనసు నుండి వెడలిపోయినా

మరచిపోలేదంట  ఓ దేవి 

కనుల ముందర నీవు లేకున్నా

కలలలో నిన్ను చూడ లేదంట ఓ దేవి 


మంత్రమేమీ నేర్వకుండానే

మధుర భావమే పొంగ గలదంట.. ఓ దేవి 

కాళిదాసు కమ్మని కావ్యంలో

నీ రూపు దాగక సాధ్యపడునా! అని ఆశంట ఓ దేవి 


చరణం – 2

నీవు రాసే కవనమందున

ఒదిగిపోవుట సాధ్యపడ లేదంట 

నీ కలములోని అక్షరమై

నీ హృదయములో నిలువ లేదంట 


నీ ఊహలన్నీ ఊయలలూగ

నా ఆశలన్నీ రాగాలవగా

నీ పదములలో నా పదములుగా

కలిసిపోవుట సాధ్య మే దంట ఓ దేవి 


చరణం – 3

మూగబోయిన మనసుకేమో

మౌనభాషలు స్వరములవగా

మాటలకందని మధురిమలన్నీ

మనసుల వీణను మీటగలవంట ఓ దేవి 


నీవే గీతమై నేనే రాగమై

నీవే భావమై నేనే కవనమై

మౌనమే మన ప్రేమగీతమై

మమతల లోకాన మునిగిపోవుట సాధ్యపడునంట ఓ దేవి 


ముగింపు పల్లవి:

ఒక్కసారి నిన్ను చూసినా

రెప్పవేయుట సాధ్యపడునా యంట ఓ దేవి 

మనసులో నిన్ను నిలుపుకున్నాక

మరచిపోవుట సాధ్యపడునా యంట ఓ దేవి 

నీ ప్రేమలో నేనైపోయాక

విడిపోవుట సాధ్యపడునా!నే నంట.. ఓ ఓ దేవీ....

*****

పల్లవి

ఆహా అల్లము పెసరట్టు… 

ఆంధ్రుల ముద్దు పెసరట్టు

తిన్న కొద్దీ తనివి తీరని… 

రుచుల రాజు పెసరట్టు

ఆహా అల్లము పెసరట్టు… 

ఆహా అల్లము పెసరట్టు!

చరణం – 1

పచ్చని పెసలు నానబెట్టి

చక్కని పిండిగా రుబ్బి పెట్టి

అల్లము తోడు కలిపి నెమ్మది

అద్భుత రుచికి పునాది వేసి

ఉల్లిపాయ మిరప తరిగి

జీలకర్రను జతగా చేర్చి

పెనముపైన గుండ్రంగా పోసి

పెసరట్టు పరిమళం పూయి

పల్లవి

ఆహా అల్లము పెసరట్టు… ఆంధ్రుల ముద్దు పెసరట్టు

తిన్న కొద్దీ తనివి తీరని… రుచుల రాజు పెసరట్టు!

చరణం – 2

దినుసులన్నీ పైపై చల్లి

వెన్నపూసను చుట్టూ వేసి

నెమ్మదిగా అది వేగుచుండగా

ఊరంతా వాసన వ్యాపించగా

కొబ్బరి అల్లం పచ్చళ్లతో

కలసి రుచి మరింత పెరిగె

పళ్లెములో అందంగా చేరి

పిలిచె అందరినీ భోజనానికి

పల్లవి

ఆహా అల్లము పెసరట్టు… ఆంధ్రుల ముద్దు పెసరట్టు

తిన్న కొద్దీ తనివి తీరని… రుచుల రాజు పెసరట్టు!

చరణం – 3

జీడిపప్పు ఉప్మా తోడైతే

జిహ్వకు పండుగే మరి అయితే

లోన చుట్టి వడ్డించినప్పుడు

లోకమంతా మెచ్చే రుచియది

తెలుగోడు చెయ్యెత్తి పలుకును

"జై" అంటూ గర్వముగా నిలుచును

అలరారే ఆ పెసరట్టు

వేనోళ్ళ కీర్తి పొందునట్టు

ముగింపు

పసందుగా ఆరగించండి

పెసరట్టు రుచిని ఆస్వాదించండి

ఆంధ్ర భోజన వైభవమిది

అందరికీ నోరూరునట్టు!

1-10-26

వృద్ధుల దినోత్సవ సందర్భంగా  పార్కులో వృద్ధులను కలిసిన విద్యార్థులు వారిని గౌరవిస్తూ, ప్రేమతో పాడే పాటగా


అనురాగాల ఆభరణం....అనుభవాల నిలయం

పల్లవి:

అనురాగాల ఆభరణం మీరే పెద్దలారా

అనుభవాల నిలయం మీరే మా ఆదర్శమా

పార్కులో మీతో కలసి పాడుతున్నామయ్యా

మీ దీవెనలే మాకు వెలుగుల బాటయ్యా


చరణం – 1

తాతయ్య నవ్వుల్లో దాగుంది తోడూ నీడ

అమ్మమ్మ కబురుల్లో దొరుకును తీపి బాట

మీ మధుర పలుకుల్లో పొంగుతుంది ఆప్యాయత

మీ సాన్నిధ్యమే మాకు నిండైన ఆనందం


చరణం – 2

కాలం నేర్పిన పాఠాల నిఘంటువు మీరయ్యా

సహనానికి శ్రమకు ప్రతిరూపం మీరయ్యా

మా నడక దారుల్లో దివ్వెలై వెలిగేరు

తలవంచి దండమిడే పూజనీయులయ్యారు


చరణం – 3

ఒడిలో కూర్చోబెట్టి నీతి కథలు చెప్పేరు

అడుగడుగునా మాకు దీవెనలు అందించేరు

కష్టాల సుడిగుండంలో కొండంత ధైర్యమై

మా భవిష్యత్తు పునాదికి శిల్పులై నిలిచేరు


చరణం – 4

మీ అనుభవాల బాటలో నడుస్తాము మేమంతా

మీ మాటల వెలుగుల్లో నేర్చుకుంటాము నిత్యమా

కనుపాపలా కాపాడే జ్ఞానవృద్ధులారా

మీ చిరునవ్వులోనే చూస్తాము మా స్వర్గమా


ముగింపు – అందరూ:

పెద్దలారా... పెద్దలారా... మా ప్రేమను స్వీకరించండి

మీ దీవెనల నీడలో మా జీవితాలు సాగనీ

అనురాగాల ఆభరణం మీరే పెద్దలారా

అనుభవాల నిలయం మీరే మా ఆదర్శమా!


మీ విధేయుడు.. మల్లాప్రగడ రామకృష్ణ, ప్రాంజలి ప్రభ

2-10- 26 గాంధీ జయంతిగా..పాట 

పల్లవి


గాంధీ తాత జన్మదినం గానమై పలుకుదాం

సత్యమార్గ దీపమై సాగినవాడి జ్ఞాపకం చేసుకుందాం

అహింసామృత సందేశం అందరికీ పంచుదాం

మహాత్ముని మహిమలను మనసారా స్మరించుదాం॥


చరణం – 1


నల్లని వాడు చల్లని చూపు కరుణ నిండిన హృదయం

అంగవస్త్రమే ఆభరణమై వెలిగిన అతని సౌమ్యం

చిరునవ్వుతో చీకటిలోన వెలుగులు నింపిన వాడే

భారత మాత ఒడిలో పుట్టిన మహనీయుడే॥


చరణం – 2


సోడాబుడ్డి అద్దములతో సాధువు రూపముగానూ

సాధారణ జీవనంతో సత్యానికి రూపముగానూ

కర్ర చేత పట్టి నడిచెను ప్రజలతో పాటు

కష్టాలలో తోడై నిలిచెను ప్రేమగల తాత॥


చరణం – 3


ఖడ్గముతో కాదు గాని శాంతిమంత్ర బలముతో

అణుబాంబుకన్న గొప్పదైన అహింసా మార్గముతో

సత్యాగ్రహ జ్యోతిని వెలిగించి జాతిని ఏకం చేసి

స్వాతంత్ర్య సూర్యోదయాన్ని తెచ్చిన మహాత్ముడే॥


చరణం – 4


జన్మదినోత్సవ వేళన మనమందరం పలుకుదాం

సత్యము ధర్మము సేవలనే జీవనమున నడుపుదాం

గాంధీ తాత చూపిన బాట భావితరానికి అందిద్దాం

భారత గౌరవ గాథను భక్తితో నిలుపుదాం॥


ముగింపు


గాంధీ తాతా నీ సందేశం గుండెలో నిలిచెదం

ప్రేమ అహింసా మార్గముతో ప్రపంచాన్ని గెలిచెదం॥


 మీ మల్లాప్రగడ రామకృష్ణ

*****

3/10/  ప్రేమ గీతం 


పల్లవి


నమ్మకం గాంచని మనసుతో

ఆశా పాశాల ఆలనతో

నిజమునే నీడను మరచితివా?

నను వీడి వెళుతున్నావా?


నిన్ను నేను నాపలేను అయినా

నిన్ను వీడి నే నుండలేను

నీ దారికి అడ్డురాను గాని

నిన్ను ప్రేమిస్తూ నుంటాను॥


చరణం – 1


కర్పూరంలా వెలుగునిచ్చి

సువాసన నందించి కరిగిపోతివా?

కాల వైపరీత్యం గానలేవా?

చదువుకున్న దానివి మరచిపోతివా?


మిన్ను విరిగి పైబడినా

కాళ్ల క్రింద మన్ను కదిలినా

కన్న ప్రేమను వద్దన్నా

మనసు నిన్నే తలచునా॥


పల్లవి


నిన్ను నేను నాపలేను అయినా

నిన్ను వీడి నే నుండలేను

నీ దారికి అడ్డురాను గాని

నిన్ను ప్రేమిస్తూ నుంటాను॥


చరణం – 2


సూర్య చంద్రులు గతులు తప్పినా

ప్రకృతి ప్రళయ గర్జన చేసినా

పాశ బంధాలు విమర్శించినా

నిన్ను నేను మరువలేను.


మరచి నేను జీవించలేను

నీ పయనానికి తోడుగా

నా ఆఖరి పయనం వరకూ

నిశ్శబ్ద నీడనై సాగెదా॥


చరణం – 3


కొడి గట్టిన దీపమై నేనున్నా

ఏ గాలికి ఎప్పుడు ఆరునో?

చివరి శ్వాస మిగిలే వరకూ

నీ జ్ఞాపకమే నా జీవనమో.


నీవు సంతోషంగా ఉండాలని

నిత్యం కోరే హృదయమిది

దూరమైనా ప్రేమ మారదు

నీ పేరే నా ప్రాణనిధి॥


ముగింపు


నమ్మకం గాంచని మనసుతో

ఆశా పాశాల ఆలనతో

నిజమునే నీడను మరచితివా?

నను వీడి వెళుతున్నావా?


నిన్ను ప్రేమిస్తూ నుంటాను...

నిన్ను ప్రేమిస్తూ నుంటాను...

****

04/10..ఆనాటి ప్రేమాభిషేకం గుర్తుకొచ్చింది 

వెంటనే నాకలం యీ విధంగా సాగింది మీరే చదవండి 

ప్రాంజలి ప్రభ పాట 


పల్లవి


ఆగదు ఏ నిమిషము నీ కోసమూ,

ఆగితే ఏ నిమిషము ఆగదు ఈ లోకమూ.

తెలిసినా తెలియకపోయినా కాలగమనమూ,

తరలిపోతూనే ఉంటుంది ఈ జీవన రాగమూ.


చరణం – 1


కోపము ఏ నిమిషము నీకు ఉండదూ,

ఉండినా ఏ నిమిషము నిలువదూ.

తెలిసినా ఏ నిమిషము ఆగదు ఈ కాలమూ,

నడిపించు మార్గమది నిత్య సత్యమూ.


చరణం – 2


పాపము ఏ నిమిషము నీకు అంటదూ,

అంటినా ఏ నిమిషము దాచలేవదూ.

ఆపదలో మౌనమై నిలిచే వేళలో,

ఆత్మసాక్షి పలుకుతుంది అంతరంగములో.


చరణం – 3


శాపము ఏ నిమిషము నీకు తెలవదూ,

తెలిసిన ఏ నిమిషము నిన్ను మరువదూ.

చేసిన కర్మల ఫలము వెంట నడచునూ,

చైతన్య దీపమై సత్యము వెలుగునూ.


చరణం – 4


విషయములెల్ల జనులకు విషములగునూ,

విషయములు తెలిసిన విజయమాగునూ.

బంధపాశములెల్ల పలుకులై నిలుచునూ,

భక్తి మార్గమందు బంధములు వీడునూ.


ముగింపు


బ్రతుకులలో పరమాత్మను గాంచ గలుగు విధి,

భవసాగర దాటించు దివ్యమైన నిధి.

ఆగదు కాలచక్రము, ఆగదు జీవగతి,

ఆత్మజ్యోతి గాంచుటే మానవుని సుగతి.

*****

నేటి నిగ్రహం పాట 


మౌన ధ్యానంలో నిగ్రహం

తత్వ భాష్యంలో నిగ్రహం

ధ్యాన విశ్వాసంలో నిగ్రహం

శాంతి హృదయంలో నిగ్రహం

నిగ్రహంలోనే అంతా శూన్యం...


కోరికల కట్టెలను కోసే శక్తి నిగ్రహం,

కోపపు జ్వాలలను చల్లార్చే యుక్తి నిగ్రహం,

మోహపు మబ్బులను తొలగించే దీప్తి నిగ్రహం,

మనసును గెలిపించే మహిమ నిగ్రహం,

నిగ్రహంలోనే అంతా శూన్యం...


మాటల పొదుపులో మాధుర్యం నిగ్రహం,

చూపుల సౌమ్యంలో చైతన్యం నిగ్రహం,

నడతలో నీతి నిలిపే ధర్మం నిగ్రహం,

జీవిత సాఫల్యానికి మూలం నిగ్రహం,

నిగ్రహంలోనే అంతా శూన్యం...


కర్తవ్య దీక్షలో కాంతి నిగ్రహం,

కాలగమనంలో సమత్వం నిగ్రహం,

సేవా భావంలో సౌఖ్యం నిగ్రహం,

సత్య మార్గంలో సాధన నిగ్రహం,

నిగ్రహంలోనే అంతా శూన్యం...


అహమును విడిచిన ఆత్మకు శూన్యం,

అరాటములు వీడిన చిత్తానికి శూన్యం,

బంధములు దాటిన భావానికి శూన్యం,

పరబ్రహ్మ తత్వమే తెలిసినపుడు శూన్యం,

నిగ్రహంలోనే అంతా శూన్యం...


*****

నేటి పాట 

పల్లవి

ఒక్క మాట చెప్పలేను…

చక్కదాన్ని మెప్పలేను…

చుక్క లేక నప్పలేను…

బక్కచిక్కి ఉండలేను…

మందు సొగసా? మత్తైన పూదో…

మది మురిసే మధురమైన పూదో!

చరణం – 1

అందం ఇచ్చునే పెక్కు…

చందం ఇచ్చునే చిక్కు…

మేదం పెరుగునే దిక్కు…

గంధం దక్కునే మొక్కు…

సంతసమే బ్రహ్మానందం…

మనసంతా మధురానందం…

మందు సొగసా? మత్తైన పూదో…

మది మురిసే మధురమైన పూదో!

చరణం – 2

అందం ఎవరి సొంతమో…

గంధం ఎవరి శాంతమో…

మోదం ఎవరి పొంతమో…

వేదం ఎవరి కాంతమో…

గదరా! ఏమా భాగ్యయోగం…

మనసు పొందే మధురభాగ్యం…

మందు సొగసా? మత్తైన పూదో…

మది మురిసే మధురమైన పూదో!

చరణం – 3

ఎందెందునైనా నిట్టి…

పందెమేదని యట్టి…

మండమేదని మెట్టి…

చిందమేదని చుట్టి…

సుందరి లేనిచోటేదీ?

పూబోణి లేనిచోటేదీ?

మందు సొగసా? మత్తైన పూదో…

మది మురిసే మధురమైన పూదో!

చరణం – 4

మందేదో ఇది మత్తు…

చిందేదో అది చిత్తు…

ముందేదో ఇది మెత్తు…

నాందేదో అది నెత్తు…

మందు సొగసే మత్తైనది…

పూదో పరిమళమై పూసినది…

మందు సొగసా? మత్తైన పూదో…

మది మురిసే మధురమైన పూదో!

******

శీర్షిక: ఒక కవి హెచ్చరిక

పల్లవి

ఎందుకు ఈ వ్యర్థ ప్రయోగాలు? 

జీవితమే భారమైనందుకా? 

ఎందుకు ఈ అంతర్జాల యాత్రలు? 

మరణాన్ని ఆపగలవా?


ఎందుకు ఈ వ్యర్థ ప్రయోగాలు? 

మనసుల్ని దూరం చేసినవా? 

ఎందుకు ఈ యంత్ర విప్లవాలు? 

మానవత్వం మరిచినవా?


చరణం – 1

సముద్రాలన్నీ ఈదుతున్నావు యంత్ర బలంతో, పాతాళాన్ని వెతుకుతున్నావు విజ్ఞాన వెలుగుతో, 

నింగిని కొలుస్తున్నావు కొత్త కొత్త చూపుతో, 

మనిషి హృదయం గెలిచావా చెప్పు నిజముతో?


గగనాన్ని తాకినా గుండెను తాకలేక, 

వేగముగా పరిగెత్తి ప్రేమను నిలపలేక, 

విజ్ఞాన శిఖరమై వెలుగులు నింపినా,

 విలువల దీపమై వెలగకపోతే ఏమిటి?


పల్లవి

ఎందుకు ఈ వ్యర్థ ప్రయోగాలు? 

జీవితమే భారమైనందుకా? 

ఎందుకు ఈ అంతర్జాల యాత్రలు?

మరణాన్ని ఆపగలవా?


చరణం – 2

జానెడు పొట్టకు గుప్పెడు మెతుకులు అందక, 

జీవన పోరాటం నిత్యమై నిలువక, పని చేసే చేతులకు దారి లేకుండగా, 

యంత్రాల మహిమతో యేమి లాభమయ్యగా?


శ్రమను తగ్గించాలి, మనిషిని కాదు, సౌఖ్యము పెంచాలి, సోమరితనం కాదు, విజ్ఞాన ఫలమంటే సేవకై ఉండాలి, బాధలను పెంచే భారమై మారకూడదు.


చరణం – 3

రోగమును చూసేది యంత్ర సహాయమే, 

రోగిని కాపాడేది మానవ హృదయమే, 

ధనమే లక్ష్యమై దయ మరచిన చోట,

 వైద్యము వ్యాపారమై వేదన మిగుల్చునే.


న్యాయము నిలవాలి, నీతి వెలగాలి, 

మానవ గౌరవమే ముందు సాగాలి, 

ప్రగతి పేరుతో ప్రజలను మరచితే, 

ప్రశ్నల తుఫాను ఒక రోజు లేవదీయునే.


ముగింపు

విజ్ఞానమా! నీవు మానవుని మిత్రుడవు, 

వినాశమునకు కాదు, వికాసమునకు సేతువువు, 

యంత్రం చేతిలో కాదు భవితవ్య నిర్ణయం, 

మానవత్వమే నిలుపును జగతి జీవనం!

-***

ఓం శ్రీ రామ.. శ్రీ మాత్రేనమః



Thursday, 17 September 2026

 

పల్లవి



కీర్తన 

వీణ మీటి ప్రియముగా మనసు తట్ట గలుగగా

గానమొకటి పాడనా గోవిందా!

కలసి బ్రతుకు తెలపనా వేంకటేశా!

కరుణ చూపి నడిపించు నాథా!


చరణం 1


ప్రాణపుష్ప సరము నే నీ పాదాలకర్పింతున్

ప్రాభవంబు కాలమే నీ చిత్తమని నమ్మితిన్

రాణమాయలన్నియు రమ్యతాభవమాయెగన్

నీ నామ స్మరణతో నిత్య శాంతి పొందెదన్


చరణం 2


వాన జల్లు కురియునో వాసనలై పరిమళించునో

తేనె ధారలై జారునో తత్త్వమార్గము తెలియునో

కోనసీమ తలపులై కోరికలన్నీ వికసించునో

నీ దయ గతి చూపగా జీవయాత్ర సాగునో


చరణం 3


సందె వెలుగు చెలగగా సౌమ్య భావము వెల్లునో

సుందర నభ్రమందున నీ మహిమలు మెరవునో

సుందరమ్ము పవనమే సుగుణ గీతము పాడునో

సుందరుడవు నీవని సృష్టియంత పలుకునో


చరణం 4


తృష్ణ నాకు మనసులో తీర్చువాడవు నీవయా

కృష్ణుని గన నాశయే కృపా సింధువై నిలువయా

కృష్ణవేణి జలములో శృతి లయాలు కలిసెగా

దృష్టి పుష్టి నొసగి నన్ను దివ్య మార్గము నడిపయా


ముగింపు


వీణ మీటి ప్రియముగా హృదయ నాదమై నిలువగా

గానమై నీ కీర్తనే గగనమంత విరియగా

వేంకటేశ గోవిందా! కృష్ణ మురారీ! రక్షించు

భక్త హృదయ మందిరమున్ భాసిల్లుము నిత్యమున్.

[20/09, 06:40] Mallapragada Ramakrishna: 20/09/2026

శ్రీ వేంకటేశ్వరుని ప్రార్థించే కీర్తన

పల్లవి :

వేంకటేశ్వరా ! నీవే మా దారి చూపువాడవా

విధి వలయముల మధ్య భక్తిని కాపాడవా ॥

చరణం – 1

హరివిల్లు రంగులన్ని నీ మహిమ వెలుగులయ్యా

పుష్ప వికాస సౌరభాలు నీ కృపల పరిమళమయ్యా

పుడమి నిండిన అందమంత నీ సృష్టి వైభవమయ్యా

హృదయమందు అనురాగాక్షరమై నిలువుమయ్యా ॥

చరణం – 2

ఆలోచనల అతీతమగు ఆత్మశాంతి నీవయ్యా

ధ్యాన మార్గ సాధ్యమగు దివ్య తత్వము నీవయ్యా

శ్వాసలోని జీవనాదం శాశ్వతమై నీవయ్యా

ధరణిపై పరమౌషధమై దయతోడ నిలువయ్యా ॥

చరణం – 3

నమ్మకమే జీవితానికి నిలువెత్తు తోడయ్యా

అమ్మ ప్రేమలో కనిపించే అమృత హృదయమయ్యా

దైవ విలువ తెలిసే నేత్ర జ్యోతివి నీవయ్యా

సిరుల మాయ కథల వెనుకసత్యరూపుడవయ్యా ॥

చరణం – 4

రెచ్చి పోయు మనసునకు నియమ మార్గ దాతవా

మచ్చలేని భావములకు మంగళ దీపమవ్వవా

సంచిత భవ బంధములను సడల జేయువాడవా

వేంకటాద్రి నిలయుడవై వేడుకొనిన దైవమా ॥

ముగింపు :

గోవిందా గోవిందా శ్రీనివాస గోవిందా

భక్త హృదయ నివాస వేంకటేశ గోవిందా ॥

[20/09, 11:21] Mallapragada Ramakrishna: 20/09

వెంకటేశ్వర కీర్తన 

సారథి నీవే నాకు తల్లి తండ్రి గురువు నీవే 

జీవన సారథ్యం నీదే నీ తోడు నాకు నీడే 

త్రోవ తప్పకుండా కాపాడే బాధ్యత నీదే 

కాల మాయలన్ని నను చేరకుండా బాధ్యత నీదే.....వేంకటేశ్వరా 

కలికాలపు నరుల చేష్టలకు లోబడ కుండా

 మూర్ఖపు మాటలే మనసున చేరకుండా 

విష మాధ్యమ ప్రగాఢతకు బలి కాకుండా 

 నీ మీద నమ్మకం అనే భక్తి విడకుండా... స్వేచ్చ నివ్వు.... వేంకటేశ్వరా 

నాలో నేనై... కదిలే నీ కాలమనే వాహనానికి నా కృషి వేడకుండా                                   

యోగ, క్షేమాలను వహించే పెన్నిధి నీవే నన్ను వీడకుండా 

ఆనందమై నడిపించే సన్నిధానం నీదే అయినా నీ ధ్యానం మారకుండా ముక్తి మార్గం జూపు.... వేంకటేశ్వరా 

నీ నైపుణ్యతను వీక్షించే హృదయం నేనైనపుడు నా హృదయంలో నీవు వీడకుండా 

భౌతిక విమోచనం నాకిచ్చే.. స్వేచ్ఛాతంత్రపు రథ  "సారథి" నీవే....వేంకటేశ్వరా

సారథి నీవే నాకు తల్లి తండ్రి గురువు నీవే 

జీవన సారథ్యం నీదే నీ తోడు నాకు నీడే

*****

శ్రీ వేంకటేశ్వర కీర్తన

పల్లవి

సప్తగిరి నివాసా శ్రీ వేంకటేశా

గోవింద గోవింద గోవిందా!

గుప్తమగు నీ లీలల గంభీరతను

భక్తుల హృదయమందు వెలిగించు గోవిందా!


చరణం – 1

సుప్తులైన జనులు చూడలేరయ్యా

గుప్తమయ నీ భక్తి మహిమలయ్యా

ఆప్తులతో విధి ఆశయ మాయలలో

యుక్తిగ నడిపించు దయామయుడయ్యా


చరణం – 2

లుప్తమగు శుభములు లోకమందున

గుప్తమగు కరుణలు నీ చరణమున

లుప్తమైన విలువల వెలుగునిచ్చి

భక్తుల బ్రతుకులకు భావము నీవయ్యా


చరణం – 3

శప్తులైన రీతుల సాగు జీవులను

రక్షించు కరుణామయ రమణా నీవు

సత్యమార్గ చూపు సర్వేశ్వరా

సంకటహరణ శ్రీనివాసా


చరణం – 4

సప్తగిరి నివాస సహనస్వరూపా

సప్తగిరి నివాస సమయబోధా

సప్తగిరి నివాస సృజనశక్తీ

సప్తగిరి నివాస శరణు గోవిందా


ముగింపు

ఓం నమో వేంకటేశాయ నమో నమః

ఓం నమో శ్రీనివాసాయ నమో నమః

భక్తజనావన గోవిందా

సప్తగిరీశా పాహి మాం గోవిందా!

*****

శ్రీ వేంకటేశ్వరుని శరణాగతి భావంతో కీర్తన

పల్లవి

వేంకటేశ్వరా! విధియాటలలో నీడవు నీవే

వేల జన్మల బంధములను విడిపించు దైవమే

ఓం నమో వేంకటేశాయ! ఓ శ్రీనివాసా!

నీ చరణమే మాకు నిత్య శరణాగతమయ్యా॥


చరణం 1

సమయంబున విధియాటల సహనంబును నేర్పితివి

మమకార వినయములను మనసందున నింపితివి

సముఖంబున మాటలన్ని సమముగా వినిపించితివి

ప్రముఖ విజయమంతయు ప్రభువా! నీ మాయయే॥


చరణం 2

ప్రియమార్గమున నడిపించి ప్రతిభలకు వెలుగిచ్చి

రమ్యమైన కథలందున రసమును నీవు నింపి

క్షణభంగుర జగమందున క్షమగుణమును బోధించి

నయమార్గము చూపించు నారాయణా! నీవే॥


చరణం 3

శపథంబుల సమయంబున శాంతి మార్గము చూపితివి

ఉపదేశముల ద్వారా జీవనార్థము తెలిపితివి

ఉపమేయమై నిలిచినది ఉనికంతయు నీ లీలే

అపవాదులు వచ్చినను అండగాను నిలిచేవే॥


చరణం 4

ఏడుకొండల నిలయుడవు ఇహపర సుఖదాయకుడవు

ఆపదలలో అభయమిచ్చు అనంత కరుణాసాగరుడవు

వేంకటాద్రి శ్రీనివాసా! వేడుకొందుము దయచేయ

ఓం నమో వేంకటేశాయ! రక్షించుము గోవిందా॥

******

మాతృభూమి మాతృభాష మాతృశ్రీ మరువక


పల్లవి :


మాట్లాడే మాట మధుర గీతమై

తెలుగు తల్లి వెలుగు ప్రతి ఇంట నిలువనీ

ఆత్మగౌరవ దీపం ఆరిపోకుండనీ

మాతృభాష మహిమను మనమే కాపాడనీ ॥


చరణం – 1


పెళ్లాం బాధ్యతలే నా కథలై నిలిచెను

పిల్లల సహకారమే కవితలై వెలిసెను

కుటుంబ కర్తవ్యమే కీర్తనలై మారెను

పోగేసుకోవాలనే యావతో సాగెను ॥


చరణం – 2


తరువాతి తరమునకు తెలుగు నేర్పాలనే

తల్లి భాష బ్రతకాలని తపనతో నడవాలనే

ఉన్నది ఒక్క కోరిక తెలుగు వెలుగాలనే

దేశ భాషలందున తెలుగు లెస్స కావాలనే ॥


చరణం – 3


నా భారతం విశ్వగురువై వెలిగే దినముకోసం

నా శ్రమంతా అర్పింతును ధర్మ మార్గం కోసం

విమర్శలెన్ని వచ్చినా వెనుదిరిగే మాటేలే

తిట్లువచ్చిన వేళలోన నిలిచే సంకల్పమే ॥


చరణం – 4


ఉన్న సమయమంతా సద్వినియోగం కావాలి

జీవితమంత దేశసేవకు అంకితం కావాలి

నిస్వార్థ దేశభక్తి నిత్యం నాలో నిలవాలి

భారత మాత పాదసేవే భాగ్యమని తెలవాలి ॥


చరణం – 5


గుర్తించడంలో ఆలస్యమైనా రచనలు ఆగవు

గుండెలోని భాష ప్రేమ గంగలా ఎండవు

భాషాభివృద్ధి బాటలో అడుగులు సాగవు

తెలుగు తల్లి ఆశీస్సులతో రాజయోగం దొరుకును ॥


ముగింపు :


మాతృభూమి మాతృభాష మాతృశ్రీ మరువక

మనసారా సేవ చేయు మార్గమును విడువక

తెలుగు వెలుగు నింపుదాం తరతరాలకు చెలిమిగా

తెలుగు తల్లి చిరంజీవి జగమంతా వెలుగుగా ॥

****

18/09/

లోకములకు తల్లిదండ్రులైన సతీ–భవు భావo 


పల్లవి


వేంకటేశ్వరా! వేంకటేశ్వరా!

జీవిత జోడిని కలిపి నడిపించు వేంకటేశ్వరా!

ప్రేమను అర్థం చేసుకునే మనసు చాలు

ప్రశాంతమైన జీవితం ప్రసాదించు వేంకటేశ్వరా!


చరణం 1


ప్రేమను అర్థం చేసుకొనే మనసు చాలు

సమయానికి సాయం చేసే గుణము చాలు

జీవితంలో జోడీ సరైనదైతే చాలు

కలతలు లేని సంతోషము చాలు

అడుగులు కలిసే అనుబంధము చాలు

ఆశీస్సులందించు వేంకటేశ్వరా!


చరణం 2


పరిస్థితులకు సర్దుబాటు చేసుకోవడం చాలు

కష్టసుఖాలలో కలిసి ఉండటం చాలు

కాళ్లకు గాయం లేని నడక చాలు

హృదయానికి గాయం లేని బ్రతుకు చాలు

సహనముతో ఇంతకాలం సాగితిమయ్యా

సమయమును మార్చుము వేంకటేశ్వరా!


చరణం 3


లోకములకు మాతాపితలని కొందరు

సతీ–భవులని బుధులు పలుకుదురు

జగమునకు జనకజననులై నిలిచిన

దంపతుల దైవత్వము బోధించుదురు

ఆ దాంపత్య ధర్మము మాకు ప్రసాదించి

అనురాగముతో నడిపించు వేంకటేశ్వరా!


చరణం 4


అదితి–ప్రజాపతులని పండితులు పలుకగా

సృష్టికి మూలమైన దంపతులని కొనియాడగా

జీవిత జోడిలో ప్రేమను నింపి

ధర్మమార్గములో అడుగులు కలిపి

కష్టమొచ్చినా విడువని బంధమిచ్చి

కలతలన్నియు తొలగించు వేంకటేశ్వరా!


చరణం 5


సంపదలు వద్దు, సౌఖ్యము ఒక్కటే చాలు

ఆడంబరమేమీ వద్దు, అనురాగము చాలు

పరస్పర గౌరవము, సహనము చాలు

నీ చరణసేవలో ప్రశాంతత చాలు

ఇద్దరి హృదయాలు ఒక్కటై నడిచే

ఇలవేల్పు కృపను ప్రసాదించు వేంకటేశ్వరా!


ముగింపు


వేంకటేశ్వరా! వేంకటేశ్వరా!

మా మనసులను కలిపి నడిపించు వేంకటేశ్వరా!

అడుగులు కలవాలి — హృదయాలు కలవాలి

కష్టసుఖాలలో తోడుగా నిలవాలి

నీ దయతో మా జీవనయాత్ర సాగాలి

ప్రశాంతి ప్రసాదించు వేంకటేశ్వరా!

******

సన్నిధి–దయ–జీవనమార్గం వేంకటేశాయ నమోనమః 


పల్లవి


వేంకటేశ్వరా! వేంకటేశ్వరా!

వాంఛలు తీర్చుము వేంకటేశ్వరా!

భవసాగరమున మునిగిన నన్ను

దయతో కాచుము వేంకటేశ్వరా!


చరణం 1


సంపదయే లోకమున సౌఖ్యమని నమ్మి

లంపటమందు చిక్కి లాలసపీడితుడనై

జీవనయాత్ర సాగించలేక

భవసాగరములో మునిగితినయ్యా

శ్రీసతీ దయతో చేయి అందించి

ముక్తిమార్గము చూపుము వేంకటేశ్వరా!


చరణం 2


సందడి కాదు భక్తి, సాధ్యమని చెప్పలేము

పందెము కాదు ఇది, పోటీగా చూడలేము

ఉపాసన మార్గమిది నిత్యసత్యమై

మనసును నీ పాదముల చెంత నిలుపును

హృదయ తీరును సరిచేసి నడిపించి

సుఖజీవనము ప్రసాదించు వేంకటేశ్వరా!


చరణం 3


చిందులు తొక్కుచు భక్తబృందములు

చింతలన్నియు మరచి నీ చెంత చేరగా

అందమైన నీ దివ్యరూప దర్శనమే

ఆర్తుల హృదయాలకు తృప్తినిచ్చునయ్యా

ముందుగ నీవే దారిచూపి నడిపించు

ముఖ్యమైన జీవనమార్గము చూపుము వేంకటేశ్వరా!


చరణం 4


బుద్ధిని మంచి మార్గమున నడిపించు

హృదయమున నీ నామస్మరణ నిలిపించు

వందనమే నా స్థితి, నీ పాదమే గతి

నీ దయయే నాకు నిత్యమైన సంపద

వాంఛలన్నియు నీ చరణములకర్పించి

కృపతో నన్ను కాచుము వేంకటేశ్వరా!


ముగింపు


వేంకటేశ్వరా! వేంకటేశ్వరా!

శ్రీ వేంకటేశ్వరా! దయచేయవయ్యా!

లంపటములు తొలగించి, లాలసలు విడిపించి

భవసాగరమునుండి దాటించవయ్యా!

నీ పాదసేవయే నాకు పరమసౌఖ్యము

నీ కృపయే నాకు ముక్తిమార్గము

వాంఛలు తీర్చుము వేంకటేశ్వరా!

వేంకటేశ్వరా! వేంకటేశ్వరా!

******

*

పల్లవి


నను బ్రోవగ రావా శ్రీ రఘువరా

నను దయతో గావా సీతాపతి రామా ॥నను॥


చరణం – 1


యుగయుగాలు మారినా తరతరాలు తరలినా

ప్రేమతనము ఒక్కటే పరమసత్యమయ్యా

నగుమోము గనలేని నా జాలి తెలిసి నీవు

నను బ్రోవగ రావా శ్రీ రఘువరా ॥నను॥


చరణం – 2


కానలేని తనములో వినలేని వయసులో

అనలేని మనసుతో అలమటింతునయ్యా

ఏమని చెప్పెదను ఏదని తెలుపెదను

నను బ్రోవగ రావా శ్రీ రఘువరా ॥నను॥


చరణం – 3


ఈ పరివారమెల్ల నీ దరి చేరునట్లు

కరుణ చూపి మమ్ము కాచవయ్య రామా

ఇటు లుండుదురు ఏల ఇహలోక జనులు

దరి చేర్చుకొనవయ్య దాశరథీ రామా ॥నను॥


చరణం – 4


జగమెల్ల పరమాత్మ నీవొక్కడవనుచు

ఎవరితో మొరపెట్టెద నాకింక రామా

వగజూపకు తాళలేను వ్యథల భారమయ్యా

నన్నేలుకొనవయ్య రఘురామ రామా ॥నను॥


చరణం – 5


ఖగరాజు నీ యానతి విని చేరునేమో స్వామి

నా ఆనతి గమనింపవా కరుణాసాగరా

జానకీపతి నీవే శరణాగత వత్సలా

నను బ్రోవగ రావా శ్రీ రఘువరా ॥నను॥


మంగళం


సీతారామ చంద్రా శ్రీ రఘుకుల తిలకా

భక్తవత్సల రామా భవభయ హరణా

నీ నామమే మాకు నిత్యానంద ధామా

నను బ్రోవగ రావా శ్రీ రఘువరా ॥


ఇది మందగతిలో భజన శైలిలో పాడటానికి అనుకూలంగా ఉంటుంది. "నను బ్రోవగ రావా శ్రీ రఘువరా" అనే పల్లవి ప్రతి చరణం తర్వాత పునరావృతం చేయవచ్చు.

****

పల్లవి


రామా రామా శ్రీరామా

రఘుకుల సోమా శ్రీరామా

నామమే మాకు నావయై నిలిచే

నారాయణ రూపా శ్రీరామా॥


చరణం – 1


పరహిత భావము పోయిన లోకము

పరుల ధనమును దోచెదీ రామా

హింసా మార్గమే హితమని భావించి

హీనమై పోయెదీ రామా॥


శీలము పరీక్షగా మారిన కాలము

చెడ్డ నేతలకే చెల్లెదీ రామా

ధర్మము దాగిన దుర్దిన వేళలో

దారి చూపవే శ్రీరామా॥


పల్లవి


రామా రామా శ్రీరామా

రఘుకుల సోమా శ్రీరామా॥


చరణం – 2


పడకపై దేహము ఉండగనే

కలలో మరో దేహము రామా

మాయల లీలలు చూపుచు నిత్యము

మనసును మోహింప రామా॥


తాను తానుగా నుండియు సకలము

తానై వెలసితివి రామా

అణువణువందున నీవని తెలిసిన

ఆనంద మిచ్చవే రామా॥


పల్లవి


రామా రామా శ్రీరామా

రఘుకుల సోమా శ్రీరామా॥


చరణం – 3


కాలమేదైన కర్మల బాటలో

సాగె జీవితం రామా

కర్తవు నీవని తెలిసిన మాకును

కర్తవ్య మార్గము రామా॥


నాడు నేడు రేపు నీ నామమే

నావై నిలిచెదీ రామా

భక్తుల హృదయమున భాసిలు జ్యోతివై

భద్రము చేయవే రామా॥


చరణం – 4


తోడు నీడగా హనుమంతుడు ఉండగా

భయమెందుకయ్యా రామా

తోయజాక్షుల మైత్రి మహిమతో

లోకము నిలిచెదీ రామా॥


భూతల వాసుల రక్షకుడవు నీవే

భువన పావన రామా

భజన సేయుచు నీ చరణంబుల

శరణము వేడెదం రామా॥


ముగింపు


శ్రీరామ జయ రామ జయ జయ రామ

శ్రీరామ జయ రామ జయ జయ రామ॥ఇదిని భజన శైలిలో "శ్రీరామ జయ రామ జయ జయ రామ"


 *****


పల్లవి


శ్రీరామ జయ రామ జయ జయ రామా

శ్రీరామ జయ రామ జయ జయ రామా

కవితాకన్యను పుట్టించిన రామా

భవిత మార్గము చూపిన రామా॥


చరణం – 1


భువిపై కవితాకన్యను పుట్టించె రామా

భవితకు మార్గము చూపించె రామా

బడినమ్మకముతో నడిపించె రామా

ప్రతి మనసును గాంచిన రామా॥


శ్రీరామ జయ రామ జయ జయ రామా

శ్రీరామ జయ రామ జయ జయ రామా॥


చరణం – 2


నీ వనిమాటలే నెరవేర్చె రామా

కోమల పదలీలలే కూర్చె రామా

అనఘతుల కోటి గుణములు నింపె

నిఖిల గుణములు నేర్పిన రామా॥


శ్రీరామ జయ రామ జయ జయ రామా

శ్రీరామ జయ రామ జయ జయ రామా॥


చరణం – 3


దినకర సంప్రాప్తి నెసగించె రామా

నెవ్వడైనను నీ దారిన నడిపె రామా

అర్థ గౌరవములు అందించె రామా

వాణీ గురుత్వ మహత్త్వము చూపె రామా॥


శ్రీరామ జయ రామ జయ జయ రామా

శ్రీరామ జయ రామ జయ జయ రామా॥


చరణం – 4


ఘనుల బాటను మాకు నేర్పె రామా

ప్రాచేతస విధమును చూపె రామా

కవితా మార్గమున కరుణ చూపి

కలమునకే నీ కృపనిచ్చు రామా॥


శ్రీరామ జయ రామ జయ జయ రామా

శ్రీరామ జయ రామ జయ జయ రామా॥


ముగింపు


కర్తవు నీవే క్రియ మేమే రామా

కలము నడిపేది నీ కృపే రామా

నాడు నేడు రేపు నీ నామమే రామా

శరణు శరణు శ్రీరామ రామా॥


శ్రీరామ జయ రామ జయ జయ రామా

శ్రీరామ జయ రామ జయ జయ రామా॥

****


కీర్తన 


పల్లవి


ఓ మనసా! ఓ మనసా!

నిన్ను నేను నమ్మినాను —

నన్ను నీవు నమ్మలేవా ఓ మనసా!

మనసును జయించు శక్తి నివ్వు రామా॥


చరణం – 1


కుండయినా మట్టియైనా మార్చగలవా?

అణువైనా ధూమమైనా అగ్నినాపగలవా?

కొండయైనా బట్టయైనా దారముగా కూర్చగలవా?

భీకర రూపుడైన యమునైనా ఆపగలవా?


ఓ మనసా! ఓ మనసా!

నీ శక్తికి హద్దులున్నవే మనసా!

నన్ను నీవు నమ్మలేవా ఓ మనసా!

మనసును జయించు శక్తి నివ్వు రామా॥


చరణం – 2


ఎందుకీ మనసు? ఎవ్వరి నెంచగలదు?

వయసు తీరగానే మారిపోవును మనసు!

సొగసునిచ్చి పుచ్చుకొనేది ఈ మనసు,

తమస్సును తప్పించుకోలేనిది ఈ మనసు!


తప్పొప్పులు తెలియని తడబడే మనసా,

తనలో తానే చిక్కిన చంచల మనసా,

నీ చరణమే శరణమని తెలిసేలా

మనసును జయించు శక్తి నివ్వు రామా॥


చరణం – 3


వ్యర్థ పదాలతో కంఠమును శోషింపకు మనసా,

వాక్కును వృథా చేయకు ఓ మనసా!

పరంధాముని పాదకమలములను సేవించి,

పరమాత్ముని నామమును స్మరించు మనసా!


పరమశివుని రాముని నామములు పలుకుతూ,

భక్తితో నీ హృదయమును నింపుము మనసా!

నామస్మరణయే నీకు నిత్య సౌఖ్యమని

తెలిసేలా కరుణించు శ్రీరామా॥


చరణం – 4


నిన్ను నీవు జయించుటే నిజమైన విజయము,

నిన్ను నీవు తెలుసుటే జ్ఞాన మార్గము;

కోరికల కలతలన్నీ తొలగించి రామా,

కరుణతో నా చిత్తమును నిలుపుము రామా!


చంచలమైన నా మనసును చక్కదిద్ది,

చరణసేవలో నన్ను నిలుపుము రామా!

నిన్ను నేను నమ్మితిని — నన్ను నీవు నడిపించు,

మనసును జయించు శక్తి నివ్వు రామా॥


ముగింపు


ఓ మనసా! ఓ మనసా!

రామనామమే నీకు రక్ష మనసా!

శ్రీరామ నామమే నీకు దిక్కు మనసా!

శ్రీరామ జయరామ జయ జయ రామా॥

శ్రీరామ జయరామ జయ జయ రామా॥

******

పల్లవి–చరణాల కీర్తన రూపంలో


పల్లవి


రామా… రామా… శ్రీరామా

మనసున నిండిన సీతారామా

గుణములు తీర్చే దయారామా

మా గమనమునకు మార్గదీపమా॥


అనుపల్లవి


గణములు కదిలే కథలలో రామా

గుణములు తీర్చే విధిలో రామా

అనలము చేయని పనులనెల్లా

అణచి చూపే ధర్మరామా॥


చరణం 1


తనమన భేదము తలపులలో రామా

తొలగించు జ్ఞానము హృదయములో రామా

ఘనమైన జ్ఞానము కాయమునందున్

జ్ఞాపకమై నిలిచే రామా॥


చరణం 2


ఋణముల తత్త్వము పూజ్యమై రామా

రూపమున తీర్చే కరుణామయా

క్షణమున సమరము క్షామము తీర్చే

శాంతి స్వరూపుడవు రామా॥


చరణం 3


తృణమై అహమును త్యజింపజేసి

సుబుద్ధి మార్గమున నడిపించు రామా

తృప్తిని నింపే దయాసాగరా

తరతరములకు వెలుగు రామా॥


చరణం 4


మన కర్మఫలములన్నియు రామా

వనమువలె పెరుగునని చూపు రామా

గుణములు కళలుగా వెలసే హృదయం

ఆణువణువున కథవై రామా॥


చరణం 5


అణుకువ రాగమే బ్రతుకై రామా

అనురాగ గానమే పలుకై రామా

మన ఎఱుక దహించే మౌనముతోడు

మనసును మేల్కొల్పు రామా॥


చరణం 6


మన లక్ష్య గమనము మార్గముతోడు

మంచి బాటలో నడిపించు రామా

కర్మను ధర్మముగా మార్చి చూపే

కరుణామూర్తివి సీతారామా॥


ముగింపు


రామా… రామా… శ్రీరామా

మనసున నిండిన సీతారామా

అహమును దహించి జ్ఞానము నింపి

అణుకువ జీవనమివ్వు రామా॥


రామా… రామా… జయరామా

శాంతి సౌఖ్యముల దయారామా॥

****