ఆరాధ్య ప్రేమ లీల (మనసైన మగుఉంటే)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
తొలి పొద్దు మేలు గొలుపు మలి రాత్రి ముద్దు సలుపు
తొలి కాంతి ఆశ మెరుపు మలి హాయ్ సద్దు వలపు
తొలి సేవ నిత్య మెరుపు మలి మాయ వద్దు గెలుపు
తొలి పూజ భక్తి తలపు మలి వెన్నె లద్ది మలుపు
తొలి వేళ వెచ్చ దనము మలి నీడ చల్ల దనము
తొలి గంధ పచ్చ దనము మలి మౌన సేవ తనము
తొలి హంస పంచు దనము మలి హంస ప్రేమ తనము
తొలి వంట ఇచ్చు తనము మలి పంట వెచ్చ తనము
కాంతి కిరణం చల్లదనం తరుము
ప్రేమ మాధుర్యం కోపం తరుము
సంసార సౌఖ్యం సంతాన భాగ్యము
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--
మీ మూల గీతంలోని "తొలి–మలి" భావక్రమం చాలా చక్కగా ఉంది. దాంపత్య జీవనంలోని తొలి ఆకర్షణ నుండి పరిపక్వమైన ప్రేమ, సేవ, సహజీవనం వరకు ఉన్న ప్రయాణాన్ని చూపుతోంది. ఆ భావాన్ని ఆధునిక గేయశైలిలో ఇలా మలచవచ్చు:
🌹 మీ అసలు గీతంలోని భావరసాన్ని నిలుపుకుంటూ, పాడుకోదగిన గేయరూపంలో విస్తరించాను. 🌹🙏
ఆరాధ్య ప్రేమలీల
(మనసైన మగువుంటే)
పల్లవి
మనసైన మగువుంటే మమతలే మల్లెలౌతే
బ్రతుకంతా వసంతమై పరిమళాలు పంచునే
చిరునవ్వే దీపమై చీకటిని పారద్రోలే
ప్రేమనే ఆరాధించి జీవనాన్ని గెలుచునే ॥
చరణం – 1
తొలి పొద్దు మేలుకొలుపు కొత్త కలల పిలుపు
మలి రాత్రి ముద్దు పలుకు మధురమైన తలపు
తొలి కాంతి ఆశల మెరుపు హృదయాల కలయిక
మలి హాయి వలపు చెలిమి జీవితాన విలయిక ॥
చరణం – 2
తొలి సేవ స్నేహ దీపం నిత్యమైన వెలుగు
మలి పూజ భక్తి భావం మనసులలో అలుగు
తొలి గంధం పచ్చదనం నవయౌవన సౌరభం
మలి మౌన సేవలోనే దాగి యుండే వైభవం ॥
చరణం – 3
తొలి వేళ వెచ్చదనం చేయి చేయి కలయిక
మలి నీడ చల్లదనం కష్టకాల నిలయిక
తొలి హంస పంచుదనం సంతోషాల పంటగా
మలి హంస ప్రేమతనం సార్థక జీవగీతగా ॥
చరణం – 4
తొలి వంట ప్రేమరుచి ఇంటి నిండ పరిమళం
మలి పంట శ్రమఫలం కుటుంబానంద నిలయం
కాంతి కిరణం చల్లదనం కలహములను తరిమే
ప్రేమ మాధుర్య సాగరం కోప తరంగం కరిగే ॥
ముగింపు
సంసార సౌఖ్యమే సంతాన భాగ్యమై
సహజీవన గాథగా సత్యమై నిలిచునై
రాధాకృష్ణ ప్రేమవలె రమ్యమై విరియునై
వేణుగోపాల కృపతో జీవితం వెలుగునై ॥🌹
*****
గురువుగారు జన్మ రహస్యం తెలప గలరు , శిష్యులారా ముందు ఈ పద్యాలు అర్ధం చేసుకోండి కొంత తెలుస్తుంది అట్లాగేనండి
ఉ ::మాతయు తండ్రియున్ మనకు మంగళగౌరులరూపులేయనన్
ఆతతసేవయే నిలుపు యాతనలన్నియు జీవికిన్ సదా
కాతరభావమే మదినిఁగన్పడదెన్నడువారిసన్నిధిన్
యాతమునందునున్ స్మరణహానినిఁగూర్చదు శంభునామమున్ !!! "
ఉ :: ఉల్లము ఝల్లనే మనిషి ఊయలు ఊగియు మార్పు కల్గుచున్
మల్లెల తీగలే మనసు మక్కువ మోహము పెంచు చుండియున్
చల్లని వేళలో తరుణ జల్లులు హాయిని కల్గ చేయుచున్
జెల్లని రూకవోలె తమ చేష్టలతో మనసంత సంతసమ్
అంబరమ్మున మేఘాలు రంగులు మారుస్తూ కదిలేను
మేఘము లన్నీ గాలి వాటముతో దేశదేశాలు తిరిగే ను
ఉరుము మెరుపుల వల్ల మేఘాలు అన్ని కురవ సాగేను
వాన చినుకులు మోదలయై వర్షము అన్నిచోట్లా సొగేను
అలల కదలికల ఉరవడి ని ఎవరు ఆపలేరు
అలలు గట్టు చేరువరకు ఎక్కడ ఆగనే ఆగవు
నురుగు ల పరుగుల అలలు నీటిలో కలసిపోవును
అలలపై పడవలు పెద్ద ఓడలు సాగి పోవుచుండేను
తనువును తమకమ్ము దారి మనసుని తెలిపెన్
వినయపు వివరమ్ము విద్య వయసుని నిలుపున్
కని కర సమయమ్ము కార్య వివరము తెలిపెన్
దొన పులి మొనయమ్ము శాఖి .తుదలని పలికెన్....
No comments:
Post a Comment