Friday, 28 August 2020

ఆత్మ బంధువు (1962)*


ఈ  చిన్నప్పుడు ఏడ్చాను అందుకే నాకు  ఇష్టం మీకు ఇష్టమని పొందు పరుస్తున్నాను 

చదువు రాని వాడవని దిగులు చెందకు ..మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు

చిత్రం: ఆత్మ బంధువు (1962)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

చదువు రాని వాడవని దిగులు చెందకు ..
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు
చదువు రాని వాడవని దిగులు చెందకు ..
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు
మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో..
జీవించలేని పనికిరాని బ్రతుకులెందుకు

చదువు రాని వాడవని దిగులు చెందకు ..
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు

చరణం 1:

ఏమి చదివి పక్షులు పైకెగుర గలిగేను
ఏ చదువు వల్ల చేపపిల్ల లీదగలిగెను
అడవిలోని నెమలికెవడు ఆట నేర్పేను
అడవిలోని నెమలికెవడు ఆట నేర్పేను...
కొమ్మ పైని కోయిలమ్మ కెవడు పాట నేర్పేను

చదువు రాని వాడవని దిగులు చెందకు ..
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు

చరణం 2:

తెలివి లేని లేగ దూడ పిలుచుని అంబా అని
యేమెరుగని చంటి పాప యేడ్చును అమ్మా అని
చదువులతో పని యేమి హృదయం ఉన్న చాలు
చదువులతో పని యేమి హృదయం ఉన్న చాలు..
కాయితంబు పూల కన్న గరిక పూవు మేలు

చదువు రాని వాడవని దిగులు చెందకు..
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు
చదువు రాని వాడవని దిగులు చెందకు..
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు


Chaduvu Rani Song - Aathma Bandhuvu Movie - NTR - Savithri - SV Ranga Rao
Watch Chaduvu Rani Video Song from Aathma Bandhuvu Movie, Aathma Bandhuvu HD Movie Click Here To Wat.

Thursday, 27 August 2020

సప్తపది (1981)


ప్రాంజలి  అంతర్జాల పత్రిక ఒక నాటి మేటి సంగీతం ప్రభ

వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళీ...నవరస మురళీ.. ఆనందన మురళీ

చిత్రం : సప్తపది (1981)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి :

వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళీ
నవరస మురళీ.. ఆనందన మురళీ
ఇదేనా.. ఇదేనా.. ఆ మురళి.. మోహనమురళీ
ఇదేనా.. ఆ మురళీ

వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళీ
నవరస మురళీ.. ఆనందన మురళీ
ఇదేనా.. ఆ మురళి..మోహనమురళీ
ఇదేనా... ఆ మురళీ

చరణం 1 :

కాళింది మడుగునా కాళియుని పడగలా
ఆబాల గోపాల మాబాల గోపాలుని
కాళింది మడుగునా కాళియుని పడగలా
ఆబాల గోపాల మాబాల గోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
తాండవమాడిన సరళి.. గుండెల మ్రోగిన మురళి
ఇదేనా..ఇదేనా ఆ మురళీ

చరణం 2 :

అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరలా వినిపించీ.. మరులే కురిపించి
అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరలా వినిపించీ.. మరులే కురిపించి
జీవన రాగమై.. బృందావన గీతమై
ఆ.. జీవన రాగమై.. బృందావన గీతమై
కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి
ఇదేనా.. ఇదేనా ఆ మురళీ

వేణుగానలోలుని మురిపించిన రవళి..
నటనల సరళి ఆ నందనమురళీ
ఇదేనా ఆ మురళి.. మువ్వల మురళీ
ఇదేనా ఆ మురళీ...

చరణం 3 :

మధురానగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనా గీతి పలికించి
మధురానగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనా గీతి పలికించి
సంగీత నాట్యాల సంగమ సుఖ వేణువైఆ....... ఆ....... ఆ.....సంగీత నాట్యాల సంగమ సుఖ వేణువైరాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళిఇదేనా.. ఇదేనా ఆ మురళీ

వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళీ
నవరస మురళీ..ఆనందన మురళీ
ఇదేనా ఇదేనా ఆ మురళి..మోహనమురళీ
ఇదేనా ఆ మురళి.. 
https://www.youtube.com/watch?v=UXN8-m_4X98
Repalliya Yedha Jhalluna [with lyrics] - Saptapadi - Telugu Classics - K.V.Mahadevan | K.Viswanath
Repalliya Yadha Jhalluna Pongina Ravali song from the Telugu movie "Sapthapadi". Movie: Saptapadi Di...

Saturday, 22 August 2020

రెండు రెళ్ళు ఆరు (1985)

గణ గాంధర్వ "బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం కుదట పడాలని ఆశతో"  ఆయన పాడిన పాటలు పొందుపరుస్తున్నాను
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక

కాస్తందుకో.. దరఖాస్తందుకో.. ప్రేమ దర ఖాస్తందుకో..

చిత్రం : రెండు రెళ్ళు ఆరు (1985)
సంగీతం : రాజన్-నాగేంద్ర
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : జానకి, బాలు

పల్లవి :

కాస్తందుకో.. దరఖాస్తందుకో.. ప్రేమ దర ఖాస్తందుకో
ముద్దులతోనే ముద్దరవేసి ప్రేయసి కౌగిలి అందుకో

ఆ ఆ ఆ కాస్తందుకో.. దరఖాస్తందుకో.. భామ దర ఖాస్తందుకో
దగ్గర చేరి దస్తతు చేసి ప్రేయసి కౌగిలి అందుకో

చరణం 1:

చిరుగాలి దరఖాస్తు లేకుంటే కరిమబ్బు
చిరుగాలి దరఖాస్తు లేకుంటే కరిమబ్బు
మెరుపంత నవ్వునా చినుకైన రాలునా?

ఆ ఆ ఆ... ఆ ఆ... ఆహాహహా

జడివాన దరఖాస్తు పడకుంటే సెలయేరు
జడివాన దరఖాస్తు పడకుంటే సెలయేరు
వరదల్లె పొంగునా కడలింట చేరునా?

శుభమస్తు అంటే దరఖాస్తు ఓకే
కాస్తందుకో.. దరఖాస్తందుకో.. భామ దర ఖాస్తందుకో
చరణం 2 :

చలిగాలి దరఖాస్తు తొలియీడు వినకుంటే
చలిగాలి దరఖాస్తు తొలియీడు వినకుంటే
చెలి జంట చేరునా చెలిమల్లే మారునా?

ఆ ఆ ఆ ఆ ఆ.. లలలలా

నెలవంక దరఖాస్తు లేకుంటే చెక్కిళ్ళు
నెలవంక దరఖాస్తు లేకుంటే చెక్కిళ్ళు
ఎరుపెక్కిపోవునా? ఎన్నెల్లు పండునా?
దరి చేరి కూడా దరఖాస్తులేలా?
కాస్తందుకో.. దరఖాస్తందుకో.. ప్రేమ దర ఖాస్తందుకో
దగ్గర చేరి దస్తతు చేసి.. ప్రేయసి కౌగిలి అందుకో
కాస్తందుకో.. దరఖాస్తందుకో.. ప్రేమ దర ఖాస్తందుకో

https://www.youtube.com/watch?v=ZOmh7OGNyow
Rendu Rellu Aaru Movie Songs - Ksthandhuko Darakasthandhuko Song
Watch






గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట...నిండు నా గుండెలొ మ్రోగిందిలే ఓ వీన పాట...

చిత్రం : ఖైదీ # 786 (1988)
సంగీతం : రాజ్-కోటి
గీతరచయిత : భువనచంద్ర
నేపధ్య గానం : బాలు, జానకి

పల్లవి :

గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నిండు నా గుండెలొ మ్రోగిందిలే ఓ వీన పాట
ఆడుకొవాలి గువ్వ లాగ
పాడుకుంటాను నీ జంట గొరింకనై

చరణం 1

జొడు కొసం గొడ దూకే వయసిదె తెలుసుకో అమ్మాయిగారు
అయ్యో పాపం అంత తాపం తగుదులె తమరికి అబ్బాయిగరు
ఆత్రము అరాటము చిందే వ్యామొహం
ఊర్పులొ నిట్టూర్పులొ అంతా నీ ధ్యానం
కొరుకున్ననని ఆత పట్టించకు
చెరుకున్నానని నన్ను దోచెయకు
చుట్టుకుంటాను సుడిగాలి

చరణం 2:

కొండ నాగు తొడు చేరి నాగిని బుసలలో వచ్చే సంగీతం
సందె కాడ అందగత్తె పొందులొ ఉందిలె ఎంతో సంతొషం
పువ్వులొ మకరందం ఉందె నీ కొసం
తీర్చుకొ ఆ దాహము వలపే జలపాతం
కొంచం ఆగాలిలే కొరిక తీరెందుకు
దూరం ఉంటానులే దగ్గరయ్యెందుకు
దాచిపెడతాను నా సర్వము 
https://www.youtube.com/watch?v=ZGmvMsZ99ns
Khaidi No 786 Video Songs - Guvva Gorinka Tho | Chiranjeevi | Bhanupriya | Raj-Koti
Download iDreamMedia app and enjoy all of these videos through your mobiles/tablets: iPhone: http://...

Friday, 26 June 2020



ఓం శ్రీ రామ్   ఓం శ్రీ రామ్    ఓం  శ్రీ రామ్ 
ప్రాంజలి ప్రభ 
gifs
సర్వేజనాసుఖినోభవంతు

చూచి.. వలచి.. చెంతకు పిలచి..నీ సొగసులు లాలన చేసి.. నీ సొంపుల ఏలికనైతి...

చిత్రం : వీరాభిమన్యు (1965)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల

పల్లవి :

చూచి.. వలచి.. చెంతకు పిలచి..

నీ సొగసులు లాలన చేసి.. నీ సొంపుల ఏలికనైతి


చూచి.. వలచి.. చెంతకు పిలచి..

సొగసులు లాలన చేసి.. నీ సొంపుల ఏలికనైతి


చూచీ.. వలచీ.. చెంతకు చేరీ

నా సొగసులు కానుక జేసి.. నీ మగసిరి బానిసనైతీ


చూచీ వలచీ చెంతకు చేరీ

సొగసులు కానుక జేసి.. నీ మగసిరి బానిసనైతీ

చరణం 1 :

అందాలన్నీ దోచీ.. ఆనందపుటంచులు చూచి

అందాలన్నీ దోచీ ఆనందపుటంచులు చూచి

సందిట బంది చేసీ... సందిట బంది చేసీ
నా బందీ వశమైపోతి.. 
చూచీ వలచీ చెంతకు చేరీ
సొగసులు కానుక జేసి.. నీ మగసిరి బానిసనైతీ

చరణం 2 :

నూతన వధువై నిలచీ.. వరుణి వలపుల మధువై మారి

నూతన వధువై నిలచీ.. వరుణి వలపుల మధువై మారి

సఖునీ ఒడిలో సురిగీ.. సఖునీ ఒడిలో సురిగీ
కోటి సుఖముల శిఖరమునైతీ


చూచి.. వలచి.. చెంతకు పిలచి..

నీ సొగసులు లాలన చేసి.. నీ సొంపుల ఏలికనైతి

చరణం 3 :


వలపుల తేనెల మధురిమ గ్రోలితి.. నిదురా జగమూ మరచీ...

వలపుల తేనెల మధురిమ గ్రోలితి.. నిదురా జగమూ మరచీ

నీవే జగమై... నీలో సగమై.. నేటికి నిండుగ పండితి


చూచి.. వలచి.. చెంతకు పిలచి..

నీ సొగసులు లాలన చేసి.. నీ సొంపుల ఏలికనైతి


చూచీ వలచీ చెంతకు చేరీ

సొగసులు కానుక జేసి.. నీ మగసిరి బానిసనైతీ



NTR Sobhan Babu Kanchana's Veerabhimanyu Telugu Old Movie Song Music : K V Mahadevan Lyrics : Aarudra Samudrala Athreya Dasaradhi Comedy Videos http://www.yo...
youtube.com

Thursday, 11 June 2020



కొండగాలి తిరిగిందీ గుండె వూసులాడింది...గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది...

చిత్రం : ఉయ్యాల జంపాల (1965)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : ఆరుద్ర
గానం : ఘంటసాల, సుశీల

కొండగాలి తిరిగిందీ......
కొండగాలి తిరిగిందీ గుండె వూసులాడింది
గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది
ఆ..ఆ..ఆ..

పుట్ట మీద పాల పిట్ట పొంగిపోయి కులికిందీ....
ఆ..ఆ..ఆ..
పుట్ట మీద పాల పిట్ట పొంగిపోయి కులికింది
గట్టు మీద కన్నెలేడి గంతులేసి ఆడింది
ఆ..ఆ..
పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడిందీ
ఆఆ..ఓఓ..ఆఆ..ఆ..
పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడింది
పట్టరాని లేత వలపు పరవశించి పాడింది

కొండగాలి తిరిగిందీ ఆ.. గుండె వూసులాడింది
ఆ..ఆ..
గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది
ఆ..ఆ..ఆ..ఆ

మొగలిపూల వాసనతో జగతి మురిసి పోయిందీ..ఈ..ఈ.
మొగలిపూల వాసనతో జగతి మురిసి పోయింది
నాగమల్లి పూలతో నల్లని జెడ నవ్వింది
ఆ..ఆ..ఆ
పడుచుదనం అందానికి తాంబూలమిచ్చింది
ఆ..ఆ ..ఆ..
పడుచుదనం అందానికి తాంబూలమిచ్చింది
ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది
ఆ..ఆ..

కొండగాలి తిరిగిందీ గుండె వూసులాడింది
గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది
ఆ..ఆ..ఆ..ఆ

https://www.youtube.com/watch?v=71r29hrcFBs
KONDAGALI TIRIGINDI GUNDE USULAADINDI.......CHITRAM: - UYYAALA JAMPAALA. (1965) MP4
కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది - గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది..... చిత్రం :- ఉయ్యాల జంపాల(19...

Wednesday, 10 June 2020



మాయా బజార్
సుందరి నీవంటి దివ్య స్వరూపము
ఎందెందు వెదకిన లేదు కదా(2)
నీ అందచందాలింక నావే కదా
సుందరి ఓహో సుందరి ఆహా (సుందరి)
దూరం దూరం...ఆ..
దూరమెందుకే చెలియా వరియించి
వచ్చిన ఆర్య పుత్రుడింక నేనే కదా
ఆ.. (దూరమెందుకే)
మన పెళ్లి వేడుకలింక రేపే కదా
అయ్యో..సుందరి
ఆహా సుందరి ఊహూ (సుందరి)
రేపటి దాకా ఆగాలి...ఆ...
అగుమంచు సఖియా అరమరలెందుకే
సొగసులన్నీ నాకు నచ్చేగదా
ఊ.... (ఆగు)
నీ వగల నా విరహము హెచ్చేకదా
సుందరి ఓహో సుందరి ఆహ సుందరి
హెచ్చితే ఎలా? పెద్దలున్నారు
పెద్దలున్నారంటు హద్దులెందుకె రమణి(2)
వద్దకు చేరిన పతినే కదా..ఆ...(పెద్దలున్నారంటు)
నీ ముద్దు ముచ్చటలింక నావే కదా
ఊ.. (సుందరి)
Maya Bazar (1957) Movie | Sumdari Nivanti Divya Svarupamu Video Song | NTR,ANR,SVR,Savitri
► Watch From Movie Maya Bazar Starring N. T. Rama Rao, A. Nageswara Rao, V. Ranga Rao,…