Tuesday, 16 January 2018

గండికోట రహస్యం (1969)



నీలాలనింగి మెరిసిపడే నిండుచందురుడా...నిరుపేద కలువ వేచెనని మరచిపోదువా

చిత్రం: గండికోట రహస్యం (1969)
సంగీతం: టి.వి. రాజు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:
నీలాల నింగి మెరిసిపడే నిండు చందురుడా
నిరు పేద కలువ వేచెనని మరచిపోదువా
అనురాగ మధువు దాచిన మనసైన ప్రియతమా
నెలరాజు కలువ చెలిమి మరచి నిలువగలుగునా

చరణం 1:
నీ కోసము కుసుమించెను శతకోటి తారలు
నీ కోసము కురిపించెను పన్నీటి ధారలు
నీ కోసము కుసుమించెను శతకోటి తారలు
నీ కోసము కురిపించెను పన్నీటి ధారలు
ఆ తళుకలలో పరవశించి కరగిపోదువా
అనురాగ మధువు దాచిన మనసైన ప్రియతమా
నెలరాజు కలువ చెలిమి మరచి నిలువగలుగునా

చరణం 2:
అలనాడే నిన్ను కన్నులలో నిలుపుకొంటిని
ఎద నిండ ప్రణయ పరిమళాలు పొదుగుకుంటిని
అలనాడే నిన్ను కన్నులలో నిలుపుకొంటిని
ఎద నిండ ప్రణయ పరిమళాలు పొదుగుకొంటిని
ఎన్నెన్ని జన్మలైన గాని నిన్ను మరతునా



Watch Neelaala Ningi Video Song from Gandikota Rahasyam Starring N.T.R, Jaya Lalitha, Devika…
youtube.com

భీష్మ


భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు

గంగా శంతనుల అష్టమ పుత్రుడైన దేవవ్రతుడు (గాంగేయుడు) తండ్రి మనోరథం చెల్లించడానికి ఆజన్మాంతము బ్రహ్మచారిగా ఉంటానని భీషణ శపథం చేసి భీష్ముడుగా వాసికెక్కాడు. అందుకు ప్రతిగా తండ్రి నుండి స్వచ్చంద మరణం కలిగేలా వరం పొందుతాడు. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుని చేత గాయపడి, అది దక్షిణాయనం అవడం వలన ఉత్తరాయణ పుణ్య కాలం వచ్చేవరకు పార్థుడు అమర్చిన అంపశయ్యపై విశ్రమించి, తనను జిజ్ఞాసతో సమీపించిన ధర్మజునికి శ్రీ విష్ణు సహస్రనామం వినిపించి, ఏకాదశి శుభదినాన తుది శ్వాస విడుస్తాడు శాంతనవుడు. అదే భీష్మ ఏకాదశిగా జరుపుకుంటాం. భీష్ముడు తన సవతి తమ్ముల కోసం కాశీరాజు కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలను జయించి తీసుకుని వస్తాడు. అయితే అంబ అంతకు మునుపే సాళ్వ రాజును వరించినదని తెలుసుకుని ఆమెను ఆమె ప్రియునివద్దకు పంపేస్తాడు భీష్ముడు. అయితే భీష్ముడు గెలుచుకున్న అంబను చేపట్టనని సాల్వుడు అనగా, అంబ తిరిగి భీష్ముని వద్దకు వచ్చి తనను పరిగ్రహించమంటుంది. అందుకు నిరాకరించిన భీష్ముని గెలిచే వరంకోసం అంబ పరమ శివుని గురించి తపస్సు చేస్తుంది. అంబ శివుని ప్రార్థించే పాట "మహాదేవ శంభో" పి.సుశీల గళంలో వినండి. అంబగా అంజలీదేవి నటించింది. 

చిత్రం:      భీష్మ (1962)
రచన:      ఆరుద్ర
గానం:      పి. సుశీల
సంగీతం:  సాలూరు రాజేశ్వర రావు

మహాదేవ శంభో..ఓ..ఓ..  మహాదేవ శంభో..ఓ..ఓ..
మహేశా గిరీశా ప్రభో దేవదేవా మొరాలించి పాలించ రావా                 | మహా దేవ |

జటాజూట ధారీ శివా చంద్రమౌళి నిటాలాక్ష నీవే సదా నాకు రక్షా        | జటాజూట |
ప్రతీకార శక్తి ప్రసాదించ రావా  ప్రసన్నమ్ము కావా! ప్రసన్నమ్ము కావా!
మహాదేవ శంభో..ఓ..ఓ.. మహాదేవ శంభో..ఓ..ఓ..
మహేశా గిరీశా ప్రభో దేవదేవా  మొరాలించి పాలించ రావా 
మహా దేవ శంభో..
శివోహం శివోహం శివోహం శివోహం  
మహాదేవ శంభో..ఓ..ఓ.. మహాదేవ శంభో..ఓ..ఓ..
మహేశా గిరీశా ప్రభో దేవదేవా మొరాలించి పాలించ రావా
మహా దేవ శంభో..
శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం

మంచి మనసుకు మంచి రోజులు


ధరణికి గిరి భారమా - మంచి మనసుకు మంచి రోజులు నుండి
చిత్రం: మంచి మనసుకు మంచి రోజులు (1958)
రచన: సముద్రాల జూనియర్
సంగీతం: ఘంటసాల


గానం: రావుబాలసరస్వతీదేవి

పల్లవి: ధరణికి గిరి భారమా? గిరికి తరువు భారమా?

తరువుకు కాయ భారమా? కనిపెంచే తల్లికి పిల్ల భారమా?

చరణం: మును నే నోచిన నా నోము పండగా

నా వడిలో వెలిగే నా చిన్ని నాయనా

పూయని తీవెననే అపవాదు రానీక - 2

తల్లిననే దీవెనతో తనియించినావయ్య

తరువుకు కాయ భారమా? కనిపెంచే తల్లికి పిల్ల భారమా?

ధరణికి గిరి భారమా? గిరికి తరువు భారమా?

తరువుకు కాయ భారమా? కనిపెంచే తల్లికి పిల్ల భారమా?

చరణం: ఆపద వేళల అమ్మమనసు చెదరునా

పాపల రోదనకే ఆ తల్లి విసుగునా

పిల్లల కనగానే తీరేనా స్ర్తీ విధి - 2

ప్రేమగా పాపలను పెంచనిదొక తల్లియా?

తరువుకు కాయ భారమా? కనిపెంచే తల్లికి పిల్ల భారమా?

ధరణికి గిరి భారమా? గిరికి తరువు భారమా?

తరువుకు కాయ భారమా? కనిపెంచే తల్లికి పిల్ల భారమా?


మిస్సమ్మ


రావోయి చందమామ - రంగుల్లో


అలనాటి మిస్సమ్మ (1955) అనగానే ఎవరికయినా ముందుగా గుర్తుకు వచ్చే పాట శ్రీమతి పి. లీల, ఎ.ఎం.రాజా కలసి పాడిన "రావోయి చందమామా". నలుగురు మహా నటులు ఎన్.టి.ఆర్., సావిత్రి, ఎ.ఎన్.ఆర్. ఎస్.వి.ఆర్. నటించిన మణిహారం మిస్సమ్మ. చక్కని భావ ప్రకటనకు పెట్టింది పేరు సావిత్రి గారు. ముఖంలో అన్ని భావాలను అలవోకగా చూపించగల మహానటి ఆమె.  పింగళి నాగేంద్ర రావు గారి రచన, ర'సాలూరు' రాజేశ్వర రావు గారి స్వర రచన, చక్కని గాయనీ గాయకుల సమ్మేళనం, తగినంత హాస్యం అన్నీ చక్కగా కుదిరిన విజయా సంస్థ యొక్క అద్భుత చిత్రం "మిస్సమ్మ".  రంగుల్లో "రావోయి చందమామ"ను చూడండి.


Color

Black & White



A.M.రాజా:    రావోయి చందమామా మా వింత గాధ వినుమా          | రావోయి |
               రావోయి చందమామా
               సామంతము గల సతికీ ధీమంతుడనగు పతినోయ్       | సామంతము |
               సతి పతి పోరే బలమై సతమతమాయెను బ్రతుకే
లీల:          రావోయి చందమామా మా వింత గాధ వినుమా          | రావోయి |
               రావోయి చందమామా
               ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్      | ప్రతినలు |
               మాటలు బూటకమాయే నటనలు నేర్చెను చాలా
A.M.రాజా:    రావోయి చందమామా మా వింత గాధ వినుమా          | రావోయి |
               రావోయి చందమామా
               తన మతమేమొ తనదీ మన మతమసలే పడదోయ్     | తన మతమేదో |
               మనమూ మనదను మాటె అననీయదు తాననదోయ్
లీల:          రావోయి చందమామా మ వింత గాధ వినుమా           | రావోయి |
               రావోయి చందమామా
               నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో           | నాతో తగవులు |
               ఈ విధి కాపురమెటులో నీవొక కంటను గనుమా
ఇద్దరు:       రావోయి చందమామా మా వింత గాధ వినుమా
               రావోయి చందమామా

రాజ నందిని



హర హర పురహర శంభో


చిత్రం: రాజ నందిని (1958)
రచన: మల్లాది 
సంగీతం: టి.వి.రాజు 
గానం: ఎం.ఎస్.రామారావు, బృందం



లక్ష్మీ కటాక్షం.


లక్ష్మి స్థిరంగా ఉండాలంటే చేయకూడని పనులేమిటి?

ఎప్పుడో 1970 లో విడుదలయిన చిత్రం లక్ష్మీ కటాక్షం.  ఇందులో ఎన్నో చక్కని పాటలున్నాయి. అందులో ప్రత్యేకమైనది ఈ శుక్రవార మహిమ గురించి చెప్పే పాట. నిజంగా మన పూర్వీకులు ఎంతో ఆలోచించి చెప్పేరు. మన దైనందిన జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా, మనము పాటించవలసినవి, మన కర్తవ్యాన్ని నిర్వర్తించవలసినవి ఎన్నో ఉన్నాయి. వాటిని చక్కని పాట లేదా పద్య రూపంలో చెబితే సులభంగా గుర్తు వుంటుంది.  అటువంటి కోవకు చెందుతుంది ఈ పాట. ఇది శ్రీ చిల్లర భావనారాయణ గారి రచన. పాడినది శ్రీమతి ఎస్.జానకి గారు. ఈ పాటలో ఎన్‌.టి.ఆర్. చక్కని ముఖకవళికలు ప్రదర్శించారు. 


.

చిత్రం:లక్ష్మీ కటాక్షం 
రచన:చిల్లర భావనారాయణ 
సంగీతం:ఎస్.పి.కోదండపాణి
గానం:ఎస్.జానకి




శుక్రవారపు పొద్దు సిరిని విడువద్దు 

దివ్వె నూదగ వద్దు, బువ్వ నెట్టొద్దు 

తోబుట్టువుల మనసు కష్ట పెట్టొద్దు 

తొలి సంజె, మలి సంజె నిదురపోవద్దు 

మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు | మా తల్లి |




ఇల్ల్లాలు కంటతడి పెట్టనీ యింట 

కల్లలాడని యింట గోమాత వెంట 

ముంగిళ్ళ ముగ్గుల్లో, పసుపు గడపల్లో

పూలల్లో.. పాలల్లో..

పూలల్లో, పాలల్లో, ధాన్య రాశుల్లో

మా తల్లి మహలక్ష్మి స్థిరముగా నుండు | మా తల్లి |

సంఘం.

హృద్యమైన చిత్రీకరణ గల "సుందరాంగ మరువగలేనోయ్" - సంఘం చిత్రం నుండి

1954 లో విడుదలైన చిత్రం సంఘం. కులాంతర వివాహాల నేపథ్యంలో శృంగార, హాస్య చిత్రమిది. ఇందులో రామారావు, అంజలి, వైజయంతిమాల నటించారు.  హిందీ చిత్ర రంగంలో ప్రఖాతి పొందిన అలనాటి తెలుగు-తమిళ తార వైజయంతిమాల ఈ పాటలో ఎంతో అందంగా కనిపిస్తుంది.  పాట చిత్రీకరణ చూస్తే అంత పాత చిత్రంలో కూడ సాంకేతిక విలువలు ఎంత గొప్పగా వున్నాయో తెలుస్తుంది. ఈ చిత్రానికి సంగీతం ఆర్. సుదర్శనం. సుందరాంగ మరువగలేనోయ్" పాట అలనాటి సూపర్ డూపర్ హిట్. ఈ పాటలో వైజయంతిమాల, అంజలి నటించారు.ఈ పాట రచయిత శ్రీ తోలేటి. గానం పి.సుశీల, టి.ఎస్.భగవతి.


ప.    సుందరాంగ మరువగలేనోయ్ రావేలా..
        నా అందచందములు దాచితినీకై రావేలా                    
| సుందరాంగ |
  
చ.   ముద్దు నవ్వుల మోహన కృష్ణా రావేలా                | ముద్దు |
      నవ్వులలో రాలు సరాగాలు రాగమయ రతనాలు      | నవ్వులలోనా |
      సుందరాంగ  మరువగ లేనోయ్ రావేలా
      నా అందచందములు దాచితి నీకై రావేలా

ప.   నీలికనులలో వాలు చూపుల ఆవేళా
      నను చూసి కనుసైగ చేసితివోయీ ఆవేళా             | నీలి కనులలో |
      కాలి మువ్వలా కమ్మని పాట ఆవేళా                   | కాలి మువ్వలా |
      ఆ మువ్వలలో తెలుపు అదే మనసు
      మురిసే మన కలగలుపు                                | ఆ మువ్వల |  

చ.    హృదయ వీణ తీగలు మీటీ ఆవేళా... 
        అనురాగ రసములే పిండితివోయీ...రావేలా                 | హృదయ |
        మనసు నిలువదోయ్ మగువసొంతమోయ్...రావేలా..   | మనసు |
        పువ్వులు వికసించే ప్రకాశించే ప్రేమతో పల్లవించే.....      | పువ్వులు |
        సుందరాంగ మరువగలేనోయ్ రావేలా..
        నా అందచందములు దాచితినీకై రావేలా