Sunday, 6 April 2025

ఏప్రియల్ మొదటి వారామ్.. వేంకటేశ్వరుని కీర్తనలు




 శృంగార కీర్తన.. ప్రాంజలి ప్రభ  ..(1)

రేకు రాగము: మంగళకౌశిక


ఏది యెన్నానో విభుడు యెదురు చూచే నేను 

కాదు నన్నానో కలన కెదురు చూచే నేను 

ప్రేమ సంతోసాలు పెన గొనియే నే నేను 

క్షేమమే కోరేటి స్థితి గనియే నేనేను !!పల్లవి!!(2)


 కనులుగన లేకయు గాలమాయ నట్టుండు 

 తగులు కలవరింపు దలపోసితే 

 కవిపట్లలేనుండు కనిపెట్ట లేకాయె 

 గని పించే కోరికలు ఏమి సేతునే

 !!ఏది!!


తను వాయే యీవిధాన తప్పక వొ ప్ప చెప్పుడు 

మనసైనా యీ పతీమదీ కళ నొప్ప కొప్పడు 

క్షణ మైనా గాగిటా నసా విధి యెట్టి దో ఘని 

వను కాయే వేడుకా పస యిది యేమి సేతునో !!యేది!!


కానుకగా నాతోను పరగ నవ్వన ట్టుండు 

మేనుకు మేనౌను కలవ యివ్వ నట్టుండు 

ఆనుక శ్రీవేంకటేశుఁ డంతలో వచ్చి నట్టుండు 

యానిజ మిప్పుడే కంటి నింకా నేమిసేతునే ॥ఏది ॥

****

మల్లా ప్రగడ రామకృష్ణ


ప్రాంజలి ప్రభ... కీర్తన..(2).. 02-04-2025

 మల్లాప్రగడ రామకృష్ణ 


ఎవరివో నీవెవరివో యనకు వేంకటేశా 

 నవ విధానంబుగతి సేవలగు వేంకటేశా..... (2)


 ఎవరి కన్నుల్లో చేరినావో 

 ఎవరి గుండెల్లో దూరినావో

 ఎవరి మాయల్లో చిక్కినావో 

 ఎవరి ధ్యానాన్నే నమ్మినావో 


 ఎరుక పరచలేని అభాగ్యుడ్ని వెంకటేశా 

 దరిన చెలిమి లేని అభాగ్యుడ్ని వెంకటేశా....(2)


 చూపులతో మంత్రం వేసావో 

 అందముతో తంత్రం చేసావో 

 పందెము తో యంత్రం మారావో

 పొంది క తో సూత్రం చేరావో 


ఎరుక పరచలేని అభాగ్యుడ్ని వెంకటేశా 

 దరిన చెలిమి లేని అభాగ్యుడ్ని వెంకటేశా....(2)


 మనసున్న మనసునైతినో 

 ఊహల గంధము నైతినో 

 ఊయలూప మాలిని నైతినో

 నీ కాలి మువ్వనైన కాకపోతి నో 


ఎరుక పరచలేని అభాగ్యుడ్ని వెంకటేశా 

 దరిన చెలిమి లేని అభాగ్యుడ్ని వెంకటేశా


ఎవరివో నీవెవరివో యనకు వేంకటేశా 

 నవ విధానంబుగతి సేవలగు వేంకటేశా

 నమో వెంకటేశాయ నమో నమః

*****

ప్రాంజలి ప్రభ... కీర్తన.. (3)...03-04-2025

 మల్లాప్రగడ రామకృష్ణ 


శ్రీదేవి భూదేవిల మధ్య శ్రీ వెంకటేశ్వర లీలా విలాసము 


ఆశలు తీర్చగ రావేల, 

అలుపును మార్చవ నీవైనా 

పాశము బంధము యీవేళ , 

పలుకును మార్చవు నీవైనా....


 చరితము చిత్ర విచిత్రముగా చూపెదరా  

 పరిణయ భావ ప్రపత్తముగా మారెదరా 

 తరుణము సత్యము సఖ్యతగా మార్చెదరా 

కరుణను జూపి సహాయముగా యుండెదరా


వలపు పిలుపుతో చిక్కుముడైనదా మీలో 

 ప్రణయ పాఠముతో మధురమైనదా మీలో 

 క్షణ కవ్వింపులతో మనసు సిగ్గైనదా మీలో 

 అణువణువు దోచుకోవాలని ఆశైనదా మీలో 


అందాల ఓ భామలు అందుకో నా లేఖలు

 నా మదిలోని కలలన్నీ చేరాలి మీదాకా

 అడుగులు తడబడే పెదవులను చేరదా

 మిసమిసలాడే వయసులే థలతళ లాడే కనులే 

 కలిసిపోవాలి మన హృదయాల్లో చల్లదనములై


ఆశలు తీర్చగ రావేల, 

అలుపును మార్చవ నీవైనా 

పాశము బంధము యీవేళ , 

పలుకును మార్చవు నీవైనా 


ఆశలు తీర్చెద మేమేలే 

అలుపును మార్చెద మేమేలే 

పాశము బంధము యీ వేళే 

పలుకును మార్చెద సౌఖ్యమేలే

******

ప్రాంజలి ప్రభ... కీర్తన.. (4)...04-04-2025

 మల్లాప్రగడ రామకృష్ణ 


పల్లవి: కలియుగమాయే నీలీలలు

తెలియగలేరే యీస్థితిలు..2

తెలపగలేరే నీ విధులు..2

తిరుమల తిరుపతి వేంకటేశా.... 2


 చరణం:  మానవులైనా, ప సువులకైనా -2

 సంతాపమగును శాపాల వలన -2

 పాప నివారణా…ఆ…ఆఅ…..ఆ

 పాప నివారణ చూపుము కరుణా

ఓ శ్రీ వేంకటేశా....

 

 తెలపగలేరే నీ లీలలు తిరుమల తిరుపతి వెంకటేశా


 చరణం:  వింతైనది లోకము, ఇది మాయాలోకము -2

 సంతసించునంతలోనె కలుగును సంతాపము -2

పంతాల మధ్య నలిగేటి జీవితాల మయము.2

ధర్మా ధర్మాలు తెలపలేని పాలనా యుగము..2


తెలపగలేరే నీ లీలలు తిరుమల తిరుపతి వెంకటేశా

 

 త్యాగముతో… ఒక సోదరుడు, భోగములో మరియొక సోదరుడు -2

ధన పిచ్చిలో ఒక సోదరుడు, మదపిచ్చిలో మరియొక సోదరుడు..2

 ఉండుట యిది మాయా..ఆ.ఆ.... 2


కలియుగమాయే నీలీలలు

తెలియగలేరే యీస్థితిలు..2

తెలపగలేరే నీ విధులు..2

తిరుమల తిరుపతి వేంకటేశా.... 2

నమో వేంకటేశాయ నమో నమః

******

ప్రాంజలి ప్రభ... కీర్తన.. (  5  )...05-04-2025

 మల్లాప్రగడ రామకృష్ణ 


పల్లవి: కలియుగమాయే నీలీలలు

తెలియగలేరే యీస్థితిలు..2

తెలపగలేరే నీ విధులు..2

తిరుమల తిరుపతి వేంకటేశా.... 2


 చరణం:  మానవులైనా, ప సువులకైనా -2

 సంతాపమగును శాపాల వలన -2

 పాప నివారణా…ఆ…ఆఅ…..ఆ

 పాప నివారణ చూపుము కరుణా

ఓ శ్రీ వేంకటేశా....

 

 తెలపగలేరే నీ లీలలు తిరుమల తిరుపతి వెంకటేశా


 చరణం:  వింతైనది లోకము, ఇది మాయాలోకము -2

 సంతసించునంతలోనె కలుగును సంతాపము -2

పంతాల మధ్య నలిగేటి జీవితాల మయము.2

ధర్మా ధర్మాలు తెలపలేని పాలనా యుగము..2

 

 త్యాగముతో… ఒక సోదరుడు, భోగములో మరియొక సోదరుడు -2

ధన పిచ్చిలో ఒక సోదరుడు, మదపిచ్చిలో మరియొక సోదరుడు..2

 ఉండుట యిది మాయా..ఆ.ఆ.. 


కలియుగమాయే నీలీలలు

తెలియగలేరే యీస్థితిలు..2

తెలపగలేరే నీ విధులు..2

తిరుమల తిరుపతి వేంకటేశా.... 2

నమో వేంకటేశాయ నమో నమః

*****

ప్రాంజలి ప్రభ... కీర్తన.. ( 5)...0 -04-2025

 మల్లాప్రగడ రామకృష్ణ 


శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరుని విరహ విలాపం 

రచన.. మల్లాప్రగడ రామకృష్ణ 


మీ కళ్ళ మూలల్లో 

ఒక కళ మేల్కొని నన్ను చూడరే 

మీ అలకబూనిన కథలో 

ఒక ఆశ మేల్కొని నన్ను చూడరే 

నా ముద్దుల చెలులారా.....

నన్ను చేరి ముద్దు చేయరే చెలులారా..... చెలులారా...


కాలము మారే మనసాయెలే, 

చెరవీడిన హృదయమ్ము పులకించిలే

గాలము వేసే జపమాయెలే, 

దరి చేరిన సుగుణాలు ఫలమిచ్చులే

మీరొక శాంతి పలుకాయెలే,  

నను మాయలొ విధిగాను నిలిపేనులే 

నామది మార్చే రుణమాయెలే, 

కనుల చూపుతొ మురిపించి మనసిచ్చులే... మీ 


మీ చల్లని చూపు ఒక్కటి చాలు

నా మది పరవశించిపోడానికి

మీ వెచ్చని కౌగిలిలొక్కటి చాలు 

నాహృదయమున నిండి పోవడానికి 

మీ తియ్యని పొందు నొక్కటి చాలు 

నామనసుగను మారిపోవడానికి 

మీ ముద్దుగ రూపుఁ మక్కువ చాలు 

 నాసుగుణములు నిండి పోవడానికి 


నా మనసంతా మధురంగా మారడానికి.... మీ..


మీ అందమైన వయసులో ,  

నా కంటూ చిన్న చోటు చాలు

మీ ప్రేమ పొంద మనసులో, 

నా కంటూ చిన్న చోటు చాలు

నేను ఎన్ని జన్మలైనా మీ కోసమే, 

 ఎదురుచూడటానికి వీలు 

జన్మజన్మల బంధమని సాగితే 

ఒక్కరొక్కరం యగుతయే చాలు.. మీ 


మీ కళ్ళ మూలల్లో 

ఒక కళ మేల్కొని నన్ను చూడరే 

మీ అలకబూనిన కథలో 

ఒక ఆశ మేల్కొని నన్ను చూడరే 

నా ముద్దుల చెలులారా.....

నన్ను చేరి ముద్దు చేయరే చెలులారా..... చెలులారా...

.*****

Monday, 24 March 2025

Songs




పల్లవి

పల్లవి

నిజమా కలయా నీవు – నా మది దివ్యసౌందర్యమే

విధి రూపిణీ నీవే – నా గుండె గాగనములో

ఓహో నిజమా కలయా!

హనుమంతుడు గగనమున వెలయా!


అనుపల్లవి

సత్కార్యం జేయు వీరుడా – మారుతీ కీర్తి గావహించు

సేవాసాక్షి మైనాకుడా – సాగర శాంతి సాగరించు


చరణం..1

చిరునవ్వు యందు మాయ గానమై వెలసితివే

మధురస్మిత సుధారసమై హృదయమున నిండితివే

అనుమానమందు ఆశ కాంతిగా వెలిగితివే

నీవు గాక మరెవరూ – నా దైవ రూపమూ


చరణం....2

వేగముతో సాగెడి వానరవీరుడా

విశ్వమున నింపెడి రామదూతుడా

చిరునవ్వు వీరమున వెలసె రూపుడా

దేవతల మనసుల నందు దివ్యకాంతుడా


చరణం... 3

రెక్కలే దారమై నిలిచి – వేగముతో సాగెదా

సంకల్ప సత్యమై వెలిగి – సౌఖ్యమును నింపెదా

ప్రకృతి సహకారమై నిలిచి – పథమును చూపెదా

హనుమ దివ్యకార్యమై – హృదయమున వెలుగెదా


******

******

పల్లవి

ఓ హాసమా ఎక్కడున్నావు… ఈ పిచ్చి నోదిలించు

నేను నిన్ను వెదుకుతున్నాను పిచ్చి పిచ్చిగా

నువ్వు నన్ను వెతుకు పిచ్చి పిచ్చిగా

కలసి నవ్వే కాలం రాదో లేదో పిచ్చి పిచ్చిగా!

చరణం 1

అలసిన జీవితంలో అనుభవాలు పిచ్చి,

కాలంతో ఎదిగిన కోరికలు ఇంకా పచ్చ పిచ్చి.

చరణం 2

మనసింకా బాల్యాన్ని మరువని పలుకు పిచ్చి,

వంచన నేర్చని నిశ్శబ్దం చెప్పలేని పిచ్చి,

పసితనపు పరిమళం ఇంకా పలికే పిచ్చి,

తాజాగా పలుకరిస్తూనే పిచ్చి.

చరణం 3

హద్దులేక నవ్విన రోజులు గుర్తుకొచ్చే పిచ్చి,

పొద్దుపోక ఏడ్చిన జ్ఞాపకాల్లో పిచ్చి,

ఎల్లలు లేక ఎగరాలని ప్రయత్నించే పిచ్చి,

ఎంత బాగున్నాయో ఆ రోజులు అనలేని పిచ్చి.

చరణం 4

ఇప్పుడు నవ్వులు రువ్వాలంటే ఓపికలేని పిచ్చి,

తరాజులో తూకం వేయే చివరి జీవన పిచ్చి,

మనసు ఏడ్వాలనుకుంటే దారిలేని పిచ్చి,

ఒంటరితనానికి తోడు వెతికే పిచ్చి.

చరణం 5

పాత చిత్రాలు పలికే ఓదార్పు పిచ్చి,

నవ్వులన్నీ ఏడ్పుల మేళవింపు పిచ్చి,

లెక్కలేనివి లెక్కకట్టని జ్ఞాపకాలు పిచ్చి,

అనుభూతుల కాంతిలో నడిచే పిచ్చి.


🎶

*****

భావ కీర్తన

పల్లవి


సర్వేజనా సుఖినో భవంతు

భవగవాన్ ఆశీర్వాదం గనుండు

మనసా వాచా కర్మణా నీవు

మంగళ గానము పాడి సాగుము


చరణం 1

చిరు నవ్వుల చెందులు మరవకు

వీధిలో వెతకలేని బ్రతుకకు

కలలతో కవ్వింపు కామ్యకథకై

దొంగ ఏడుపు దారిన చేరకు


చరణం 2

పది మంది కోసమే ఆడంబరమై

ప్రతిష్ట నామమై భ్రమలోనై

ఆర్భాట ఖర్చులు శక్తి మించి

అప్పుల అగ్నిలో పడకు తేజమై


చరణం 3

సహజ సౌఖ్యం సంతోషమై

సజన సంగమం సత్సేవమై

సత్కార్య మార్గం దివ్యమై

భవగవాన్ దయతో శుభమై

👉

🎶 చిన్న పాట.. కీర్వాణి రాగం

పల్లవి

జీవితం ఏముంది? జ్ఞాపకం ఏముంది?

సందేహం వీడితే సత్యమే మిగులును కదా?

ప్రేమగాన పాడితే శాంతియే చెలిమి కదా?

చరణాలు

రేయిలో ఏముంది? రేపులో ఏముంది?

రేయిలో — సుఖం, శాంతితో నిద్రే, కదా?

రేపులో — కళ్లకు రక్ష, కొత్త దారే, మరి?

అలకలో ఏముంది? ఆలోచనలో ఏముంది?

అలకలో — ఇష్టమూ ఆశా ఫలమూ దాగి ఉంది కదా?

ఆలోచనలో — మెదడుకు పదును, మార్గమే, మరి?

ఊహలలో ఏముంది? ఊరులో ఏముంది?

ఊహలో — పిల్లల పండుగ, చిరునవ్వుల ఖర్చే కదా?

ఊరులో — మనుషుల ప్రేమే, కలిపే బంధమే, మరి?

కళ్ళల్లో ఏముంది? కల్లులో ఏముంది?

కళ్లలో — పాపం ఇంపిగా దాగి ఉంది కదా?

కల్లులో — మత్తు, మాయల మందంగా మిగులుతుంది, మరి?

ఆకర్షణలో ఏముంది? ఆశయంలో ఏముంది?

ఆకర్షణలో — అంతరంగపు ధారణ, హృదయపు పలుకరించి, కదా?

ఆశయంలో — ఫలితం, ఆ పని తీసుకునే ప్రయత్నమే, మరి?

మౌనంలో ఏముంది? మోక్షలో ఏముంది?

మౌనంలో — మూగ ప్రేమ, హృదయం పలుకులేనిదై, కదా?

మోక్షంలో — జీవితం ప్రశాంతి, తారసాహిత్యం లేనిదై, మరి?

నింగిలో ఏముంది? నేలలో ఏముంది?

నింగిలో — ప్రాణాన్ని మిచ్చే తీపి జలమే, నిలుపు సాక్షి కదా?

నేలలో — సమస్తాన్ని భరించే శక్తి, అదే మాతృశక్తి, మరి?

🌸

నేటి ప్రేమికుల.. కొత్త పాట


చినుకులు పడగా చిత్రరువయ్యేగా

తనువులు కలవా మత్తుగ నయ్యేగా 


ఆ..కనుల కలలు కథలు కావ్య సాక్షి లడుగు లెయ్యగా 

కినుకు తోను బెంగ తీర్చి కీర్తి సఖుడు చెయ్యగా... చి


అ..చెనకు సంధి చేయు కళలు చిన్మయమ్ము గుండగా 

మనసు హృదయ కమల మందు మంచి మనసు పండగా.. త


ఆ..సర్వ కమల నయన మాల సరిగమ కథ తెల్పగా 

సర్వ జగతి లోన నున్న సమయ మోహ రించగా.... చి


అ..నుర్వ నేను ఒక్క టవ్వ సూత్ర మందు మెండుగా 

ఓర్వ రొక్కరు కలయికయె ఓడి గెలుపు పండగా.. త


ఆ..సహన నిజపు వెలుగు దివ్వె సాగు మందు నవ్వగా

ఊహలనెడి రెక్క లొచ్చి ఊత ముండ నిండుగా చి


అ..ప్రహస విజయ వీను లందు పదము లేంచ జంటగా 

అహము తోను కలల కథలు కామ్య మందు పండుగా.. త 


ఇద్దరూ 

చినుకులు పడగా చిత్రరువయ్యేగా

తనువులు కలవా మత్తుగ నయ్యేగా (2)

*****


ప్రాంజలి ప్రభ.. కీర్తన 

మల్లాప్రగడ రామకృష్ణ 


చెలువము శక్తి భక్తిగద శ్రీ కరి శాంకరి శ్రీ మహేశ్వరీ 

చెలువము నాకు నీయగద !శ్రీకరి!శాంకరి!శ్రీమహేశ్వరీ!


కలిమియు లేమియున్ గలుగు కాలములందున నొక్కరీతిగా

విలువలు ఒక్కమాదిరగు విద్యలు బట్టియు చెప్ప రీతిగా 

విలువలు గల్గువాడు గద విజ్ఞుడు, ప్రాజ్ఞుడు,నుత్తమౌక్తిగా 

కలుషము నంటనీక పలు కార్యము లన్నియు జక్కబెట్టగా 

.. చె 


చెలిమియు నెంచి నీదరియు చింతలు చెప్పుటనేరమేగదా 

కలిమిని కోరి యానతి నెకాలము బట్టిసాగుట దాహమేగదా 

బలిమియుజూపితిర్గుటయు బంధమునెంచుట దేహమేగదా 

కలి మహిమేను జీవితము కామ్యపుకాలమయమ్ము యీ శ్వరీ.. చె 


కళలను కావ్య రీతిగద కాలమునెంచ మనస్సు నీదిగా 

పలుకుల నేస్తమేసతద పాఠము నేర్ప యుషస్సు నీదిగా 

తలపులు నేర్పు మార్పుగద తత్త్వము చుట్టు యశస్సు నీదిగా 

కలువల యందచందమున కాలపు చూపు తపస్సు నీదిగా 


చెలువము శక్తి భక్తిగద శ్రీ కరి శాంకరి శ్రీ మహేశ్వరీ 

చెలువము నాకు నీయగద !శ్రీకరి!శాంకరి!శ్రీమహేశ్వరీ!


*****

ప్రాంజలి ప్రభ.. కీర్తన

మల్లా ప్రగడ రామకృష్ణ


నిన్ను నీవే నమ్ముకో, నిన్ను నమ్మిన వారు తోడు నీడౌను 

నీకళ తొ నిన్ను మార్చుకో, నిత్య సత్యము నీకు రక్ష నీడౌను..

యీ గోపాలుడు ఎప్పుడు నీ మనస్సుకి శాంతి శృంగార ప్రియుడౌను 

 (2)


ఆధారపడకు అతిగా ఎవ్వరిపైనా

అంతులేని బాధ మదికి వదిలెళ్ళినా


కాల ప్రకృతి విధిగా సఖ్యతయే లేకున్నా

సమయమంతా దుర్వినియోగ మయినా...... నిన్ను


పెంచుకోకు ప్రేమను ఏ బంధముపైనా

వేతనే తుదకు హృదికి నిను మరచినా


 సంత సమ్మ సఖ్యత ఏదీ లేక పోయినా

కాలచక్రం అడ్డం గా ఆదుకోక పోయినా...... నిన్ను


చింత వలదు కడపాత్రమే కాలదన్నినా

నీ నీడే నీతోరాదు చీకటి నిను ముసరినా


మమకార మోహాలన్నీ మాయేనోయీ

ఋణానుబంధాల సంస్కారాలగులే...... నిన్ను


 నీ భక్తి నీకు తో డు నీ శక్తి నీకు నీడగా 

నీ యుక్తి నీకు తోడు నీ రక్తి నీకు జోడుగా


ఫలితమెంచక ధర్మంగా కర్మలు చేయగా

యీ గోపాల ఆటలో నీ పాత్ర ముగిసే దాకే లే


నిన్ను నీవే నమ్ముకో, నిన్ను నమ్మిన వారు తోడు నీడౌను 

నీకళతొ నిన్ను మార్చుకో, నిత్య సత్యము నీకు రక్ష నీడౌను

 యీ గోపాలుడు ఎప్పుడు నీ మనస్సుకి శాంతి శృంగార ప్రియుడౌను 

****

*****

ఉగాది....అద్వైతం. సహజకవి మల్లాప్రగడ రామకృష్ణ 


 కవులు కూర్చున్నారు ఉగాది గురించి పాటగా చెప్పండి అన్న ప్రశ్నకు 

.

ఆనందం అర్ణవమైతే అలలు మాదిరి పరుగే 

అనురాగం అంబరమైతే అవకాశాల వర్షమే 

అనురాగపు తంచులు చూస్తాం మన్నా అగమ్య గోచరమే 

ఆనందపు లోతులు తీస్తాం. యన్నా కధా గమనమే 

అదే అదే కొత్త తెలుగు సంవత్సరం యుగాది....


నీ కంకణ నిక్వాణం_లో, మునిగి తెలిడమే 

నా జీవన నిర్వాణం_లో ఎండమావులుగనే 

నీ మదిలో డోలలు తూగే సుడిగుండాలుగనే 

నా హృదిలో జ్వాలలు రేపే జీర్నాశయమే

అదే అదే కొత్త తెలుగు సంవత్సరం యుగాది....

 

నీ తలపున రేకులు పూస్తే,పక్షులుగా ఎగరడమే 

నా వలపున బాకులు దూస్తే రుధి రమ్ము కలసి బ్రతుకే 

మరణానికి ప్రాణం పోస్తాం,సృష్టి సంక్రణమే 

స్వర్గానికి నిచ్చెన వేస్తాం ఆశయ సాధనల మార్గమే 

అదే అదే కొత్త తెలుగు సంవత్సరం యుగాది....


హసనానికి రాణివి నీవై హాయి అనుభవాల నిలయమే 

వ్యసనానికి బానిస నేనై మానవత్వం నిలబెట్టడమే 

విషమించిన మదీయ ఖేదం ప్రేమ జ్ఞాపకాల మయమే 

కుసుమించిన త్వదీయ మోదం స్వర్గసుఖాలు పొందడమే 

అదే అదే కొత్త తెలుగు సంవత్సరం యుగాది....


విషవాయువులై ప్రసరిస్తే, శివునిలా గొంతులో నుంచడమే 

విరితేనియలై ప్రవహిస్తే సీతాకొకచిలకళ విహారమే 

ప్రపంచమును పరిహాసిస్తాం, యన్న బ్రతక నేర్చుకోవడమేభవిష్యమును పరిపాలిస్తాంయన్నా శంకల్పమూయుండటమే 

అదే అదే కొత్త తెలుగు సంవత్సరం యుగాది....


వాసంత సమీరం నీవై, తే జగతిని బ్రతికించే ప్రాణమే 

హేమంత తుషారం నేనై హృదయ సంగ్రామమే 

నీ ఎగిరిన జీవవిహంగం అలుపెరగని గమనమే 

నా పగిలిన మరణమృదంగం దుష్టు లపై సంగ్రామమే 

అదే అదే కొత్త తెలుగు సంవత్సరం యుగాది....


చిగురించిన తోటలలోనే అవుద్భాంధవుడుగా ఎదగడమే 

చితులించిన చోటులలోనే జయాపజయాలగుటయే 

వలయములై చలించినపుడే, జీవన సాహిత్య మగుటయే 

విలయములై జ్వలించినపుడే నిగ్రహ బలముగా ముఖ్యమే 

అదే అదే కొత్త తెలుగు సంవత్సరం యుగాది....


కాలానికి కళ్ళెం వేస్తాం, యన్నా అమాయకమే 

ప్రేమానికి గొళ్ళెం తీస్తాం. విశ్వంతరాన్ని వెతకడమే 

నీ మోవికి కవిని నేనై, అభ్యాసం పొందగలగటమే 

నా భావికి దేవివి నీవై నా ప్రణానికి ప్రాణమే 

అదే అదే కొత్త తెలుగు సంవత్సరం యుగాది....


నా జీవన నిర్వాణం_లో నేనొక పావుగనే 

ఆనందం అర్ణవమైతే..అనురాగం అంబరమైతేనే 

ప్రపంచమును పరిహాసిస్తాం, భవిష్యమును

 కాలనిర్ణయము తెలిపే పండగ ఇదే ఇదే 


అదే అదే కొత్త తెలుగు సంవత్సరం యుగాది....

పరిపాలిస్తాం జీవముగానే

*****

ప్రాంజలి ప్రభ కొత్త పాట.. విశ్వావస


నినునూ లతాలా పరవశంగా 

జల్లులాగా తడిపేసి పోనా కళా రంగముగదా


చెప్పుకోనా నీతో మది ఊసులు ముద్దుగా 

ఒప్పుకోవే నీతో సుధ మాధురి హద్దుయే గదా


వ్రాలి పోనా నీ ఎదపై అభిసారికనై తన్మయంగా 

జాలి జూపే నా యదలో అభిమానమై తృప్తిపరిచెదా 


ఒదిగి పోనా ఒక్కటిగా నీలో నా ఆశలు తీరగా 

ఒదిగి పోవే చక్కగనే నాలో నీ ఆశలు తీర్చెదా 


కరిగిపోనా వెచ్చని నీ బిగి కౌగిళ్ళలో మత్తుగా 

కరిగిపోవే చల్లగ యీబహు బంధములో వోదార్చెదా 


మరచిపోనా నను నేను నీ ఒడిలో హాయిగా 

మరచిపోవే కళ గాను నా ఒడిలో తీపియే కదా 


జతపడనా జన్మజన్మాలకు తోడుగా నీచెలిగా 

జతకూడవే సృష్టి ధర్మాలకు తీరుగా నా సఖివే కదా


రాలిపోనా నీ తలపులతో ప్రేమకు సాక్ష్యిగా

జాలిగానే నా మనసు గనే ప్రేమయు నిత్యము కదా


నినునూ లతాలా పరవశంగా 

జల్లులాగా తడిపేసి పోనా కళా రంగముగదా


చెప్పుకోనా నీతో మది ఊసులు ముద్దుగా 

ఒప్పుకోవే నీతో సుధ మాధురి హద్దుయే గదా

***::

ప్రాంజలి కొత్త కీర్తన 

మల్లాప్రగడ రామకృష్ణ 


రాగము.. భౌళి 


నమ్మబలుకైన నాకు శాంత మాత్మ కేల గలుగు

నమ్మ చురుకైన నాకు ఆశ లూర కుండ గలుగు


జలము నగ్ని పొంత నున్న చల్ల బడక యేల గుండు

పెలుచ జల్ల తోటి పాలు పెర్గు బడక యేల గుండు

చిలికి పెర్గు తోటి వెన్న ముద్ద బడక యేల గుండు

చెలల సరస నున్న వారు మార కేల గుండునా 


బెరసి ఇనుము తోడి యగ్ని బెట్టు బడక యేల గుండు

విరుల తేన రుచి యెరిగి గంధము బడక యేల గుండు

సిరుల తోడ మెలగు వారు చింత బడక యేల గుండు

నరులు ప్రేమ మునగ తీరు నమ్మ బతుకు యేల గుండునా


దారి చూప భక్తి గలుగు ధర్మ మార్గ మేను యుండు

ఊరి చవట నేల జలము ఊరి శోభ చూపు చుండు

కోరి  వేంకటేశ్వర చెంత చేరి పూజ చేయు చుండు

జేరకున్న వారి చిత్త మందు వేంకటేశ్వర నుండునా 


నమ్మబలుకైన నాకు శాంత మాత్మ కేల గలుగు

నమ్మ చురుకైన నాకు ఆశ లూర కుండ గలుగు


***

ప్రాంజలి ప్రభ కొత్త కీర్తన

రచన.. మల్లాప్రగడ రామకృష్ణ


ఉన్నారయా, ఉన్నారయా శ్రీదేవీ భూదేవి సమేతులై లోకాల్ని రక్షించే శ్రీ వేంకటేశ్వరుండు  పరమాత్ములై యున్నారయా


ఉన్నారయా పరమాత్ములై యు న్నారయా

నెరనమ్మిన వారి యెదలోన పెన్నిధిగా వారున్నారయా....


భగభాగా మండేటి మండుటెండలలో

సేదతీర్చేటి చలివేంద్రమువలె వారున్నా రయా…..


పొంగిపొరలుచు వచ్చి ముంచేటి వరదలో

అండగా మెండైన దుంగల వలె వారున్నారయా …


ఫెళఫెళార్భాటుల జీమూత సంఘాలలో 

తళుక్కని మెరిసేటి మెరుపువలె వారున్నారయా ….


అజ్ఞానతిమిరాలు ఆవరించన వేళ

సుజ్ఞాన దీపికలవలె భాసమానముగ వారున్నారయా..


ప్రేమైక మూర్తుల హృదయాంగణములలో

ఆనంద తాండవంబాడగా వా రున్నారయా..


సమస్త లోకాల ఆకలి తీర్చ గలిగే వారున్నారయా

అన్యాయాన్ని అరికట్టే వారుగా వారున్నారయా

సమస్త ప్రాణులకు తోడు నీడ గా వారున్నారయా

శాంతితో ప్రశాంతి కల్పించే శ్రీదేవీ భూదేవి సామెతుడై శ్రీ వేంకటేశ్వరుండు పరమాత్మలై యున్నారయా....

ఉన్నారయా.. ఉన్నారయా.. ఉన్నారయా

****


మల్లాప్రగడ రామకృష్ణ..

అధ్యాత్మ సంకీర్తన.            

రాగము: శ్రీరాగం


 కన్నది యిదే నీదు రూపంబుల కళలు 

నిన్ను ప్రేమగా శ్రీ వేంకటేశ నమో నమో!


 ఉన్నది యిదే నీకు వే వేల విధముల 

 నిన్ను పూజగా శ్రీ వేంకటేశ నమో నమో!!


విన్నపమిదే నీకు వేవేలు విధముల

నన్నుఁ గావవే శ్రీ వేంకటేశ నమో నమో..!!


మన్నన జూపు మయ్య మాపైన మె పుడును 

మమ్ము గావుమా శ్రీ వేంకటేశ నమో నమో!!


 నీ మనసు నిన్నెరిగి నిన్ను గొలవ టేల 

నామనసు నీవెరిగి నన్ను నే కనగలయ్య

సాగరము నీవు దచ్చి సతిఁ దెచ్చుకొన్నట్టు 

ప్రేమగలిగిన శ్రీ వేంకటేశ నమో నమో 


 ॥ఉన్నది ॥


నీమాటలే జయము నిన్ను దళచగా నె 

నామాటలే మరచి నన్ను నీవు దళచవా 

కోవిదుఁడ నారఁ బేరుకొన్నవానిఁగాచినట్టు

నామనసు శ్రీ వేంకటేశ నమో నమో

॥ఉన్నది ॥


కళలు గా నున్న నిన్ను మరవకుండ టేల 

కలలు లోని నీవే నామరపు దెలుపవయ్య

పనివడి యహల్యఁ బాదమునఁ గాచినట్టు

ననిచి శ్రీ వేంకటేశ నమో నమో 


॥ఉన్నది ॥


గోవిందా.. గోవిందా.. గోవిందా

****



టి కొత్త కీర్తన 

మల్లాప్రగడ రామకృష్ణ 


(ఈ )జగమే బృందావనియై నీవే శ్రీదేవి.. భూదేవి రసమయ రాసకేళిలో నిరంతరము రమించి తరించవా…శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరా....


(నీ )తనువే తామస హరుని నిత్య నివాసమై

(నీ ) తపనే కాముని భజన సత్య నివాసమై 

(నీ ) తపమే సోముని కళలు తీరు నివాసమై 

(నీ ) తహతహాలు శ్రీ వేంకటేశ్వరుని వాసమై 


(నీ )తలపులే తాటాకాంతకునికై తెరచిన తలుపులై

(నీ ) వలపులే సేవాశాంతమునకై విరచిన వరుసలై 

(నీ ) మలుపులే ప్రేమాభావమునకై మరకలు మెరుపులై 

(నీ )చెలిమియే శ్రీ వేంకటేశ్వరుని పదముల చరితలై 


(నీ )పలుకులే పన్నగశాయిని పలుకరించే శృతులైతే

(నీ ) అలకలే పన్నగశాయిని పులకరించే దృతులైతే 

(నీ ) తలపులే పన్నగశాయిని కలవరించే లయలైతే 

(నీ )కలకళ శ్రీ వేంకటేశ్వరుని పలకరించే కథలేలే 


(నీ )యదయే యదుకులతిలకుని భావనలో భాసించితే

(నీ ) మదియే నరుల మనసున నిత్యము భాసించుమా 


(ఈ )జగమే బృందావనియై నీవే శ్రీదేవి.. భూదేవి రసమయ రాసకేళిలో నిరంతరము రమించి తరించవా…శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరా....

****



ప్రాంజలి ప్రభ.. కొత్త కీర్తన 

మల్లాప్రగడ రామకృష్ణ 

రేకురాగము.. పాడి


తెలిసితే యేముంది తెలియకున్న యేముందీ 

కలల బతుకున కరగటమే కదా 


అనునయ సుఖము అడమరికతో దుఃఖమేగా

తనువుపై ఆశల తత్త్వమే కదా

తొనికిస భావాలు పుణ్య పాపాలు పరమేగా

ఒనరు ఫలములు కర్మలతో కదా


తగిన అమృతమేది తగని విషమేదీ

తగరపు మెరుపు జీవితమే కదా

పగవారెవరు తనవారెవరు నిజము యేదీ 

వెగటు పుట్టినా వదలలేము కదా


వేవేల విధులలో మనిషి మనసేది మరుపేదీ

జావ కారే వయసున ఇచ్ఛ తగ్గదు కదా 

సావాస  దోషమేదీ మనిషికి తెలిసేటి ధర్మమేదీ 

సేవలెన్నియున్నా ఆశ చావదు కదా


అవహేళన లెన్నియున్న అవసరం ఓర్పే కదా 

సవరణలెన్నియున్న సమయం తీర్పే కదా 

భవబంధాలకు బ్రతుకంతా బానిసే కదా 

నవవిధ కళలు నవ్వుల యేడ్పులతో కదా 


శ్రీ వేంకటేశ్వరుని చిత్తములో నున్నవాడు 

ఎవరెన్ని యనినను ఎరుకలేని వాడేకదా.. (2)


****


శుభోదయంప్రాంజలి ప్రభ...కొత్త కీర్తన..

మల్లాప్రగడ రామకృష్ణ 


కులమేదైనా వ్యాకులమేలరా

అకులము తెలిసిన వికలముల కిక

తావేదిరా.... (2)


కలల బ్రతుకే జీవమని తెలుసుకో రా 

సకలము, శకలము కరతలా మలకమే కదరా…(2)


వికసిత శ్రీ వేంకటేశ్వరుని లీలలని నమ్మరా 

శ్రీదేవి. భూదేవి కృప మనపై నుండురా 


మతమేదైనా సతమతమవని జీవమ్ము రా 

మమతల తావీయక సుమతుల చెంతన జీవమ్ము రా (2)


చింతలకిసుమంతైనను చోటీయక ధ్యానించు రా 

సంతత పర చింతనయే సౌఖ్యము కదరా..(2)


వికసిత శ్రీ వేంకటేశ్వరుని లీలలని నమ్మరా 

శ్రీదేవి. భూదేవి కృప మనపై నుండురా 


భవమైనా అభవమైనా దిగులెందుకురా

లింగభేదము మనసుకు రానీకురా (2)


పరంధాముని విభవమేనని భావనతో నుండురా 

శుభాశుభ వివర్జిత మానసమే నని నమ్మురా 


భయహర భవ్యదివ్య ధామామని తెలుసుకోరా…

హరిహర పూజలే హృదయానందముకు మేలురా (2)


కర్మను మార్చే కర్తగా మారె పిలుపు రా 

కష్టం తీర్చే తీరం చేర్చే పిలుపు రా 


ఆకలి తీర్చే అహం కాల్చే పిలుపు రా 

అడుగులు నేర్పే అర్ధం తెలిసిన పిలుపు రా 

స్వార్థం తెలియని నారాయణ మంత్రం మేరా 

వికసిత శ్రీ వేంకటేశ్వరుని లీలలని నమ్మరా 

శ్రీదేవి. భూదేవి కృప మనపై నుండురా


*****

*ఓం నమో వేంకటేశాయ.* 

 మల్లాప్రగడ రామకృష్ణ కీర్తన*

శృంగార సంకీర్తన.            

రేకు రాగము: దేవగాంధారి


వాసి కెక్క మీ పెండ్లి కారనన్మేమోను గాక 

మీ చూపులిట్టివని మే మెంచగలమా  ॥పల్లవి॥


మక్కువ జూపేటి నీవు మెరపుల నవ్వెనాపె

చుక్కలను జూస్తుoటివి యెట్టు దెలుసు

చిక్కాయి పాదాలు నీకు దొరకక యెట్లు నుండు 

పక్కన మీ భావా లేరుపరచఁ గఁ గలమా ॥వాసి ॥


తొనకకేచూపు నీకు తోడుగ వడీనాపై 

మనసునే నీదు భక్తి మాకును యె లాగైనా 

ప్రణయమే మాకుమీకు దాహముగనేకాదా 

తనువు కొన్న మీ సుద్దులు తెలప గలమా ॥వాసి ॥


చెరిత తెల్పావు నీవు చన్నుల నొత్తీ నాపె

దరువైన మీ చయ్యాటా లెట్టు దెలు

గరిమ శ్రీవేంకటేశ కలసితివిటునన్ను

ఇరలోని మీరతులు తెలుపఁగఁగలమా ॥వాసి!!

***



ప్రాంజలిప్రభ కొత్త కీర్తన 

మల్లాప్రగడ రామకృష్ణ 


నేనెవరినో, నీవెవరివో 

ఎవరికి ఎవరో, ఈ 

లోకము యెరుకో 

యద సవ్వడి పెనవేయు కలలో


మదిలో అమ్మలుగన్న అమ్మ ఆటలే 

మది శ్రీ వేంకటేశ్వరుని లీలలే..... (2)


 సంతోషాల తో భాష్ప కణా లేవో 

 దుఃఖాలతో రుధిర కణా లేవో 

 సంభాషణలతో శాసనా లేవో 

 శుభశోభనలకు శాంతు లేవో.. మ 


చెలిమి గతిలేవో, చెరుప గతులెవో

తెలపగల వేవో, తెలపలేని వేవో 

మలచగల వేవో మరువలేని వేవో 

పలుకు పలకు లేవో పలకలేని బతుకు లేవో.... నే 

 

మూసిన కన్నులలో కథలెన్ని దాగి యున్న వో 

చేసిన బాసలలో వెతలెన్ని మూయకున్న వో 

మాసిన దేహములో గతులెన్ని దాహ మన్న వో 

రాసిన మోహములో మతులెన్ని దాచి యున్న వో.. మ 


నేనెవరినో నీవెవరివో 

ఎవరికి ఎవరో ఈ 

లోకము యెరుకో 

యద సవ్వడి పెనవేయు కలలో... మ 


మదిలో అమ్మలుగన్న అమ్మ ఆటలే 

మది శ్రీ వేంకటేశ్వరుని లీలలే 

***


కోపాన్ని భరించే వారు వాళ్ళు 

తమకంతో తపించే వారు వీళ్ళు 

తన్మయంతో తృప్తిపరిచే దేవళ్లూ

 

నిన్నుపుట్టించిన వాళ్ళు తోడైన వాళ్ళు 

నిన్నునమ్మించిన వాళ్ళు యదలో నున్నవాళ్లూ 


శ్రీ శ్రీ శ్రీ వెంకన్న దర్శనం తో పోతాయి పాపాలు, తాపాలు, కోపాలు బ్రతికున్న నాళ్లూ......

నీలాల నర్పించి మొక్కులు చెల్లిస్తే సర్వ దోషాలు మోసాలు మొహాలు చెల్లూ.....


కంటికి రెప్పమన పుట్టిల్లు 

 కనులతో కమ్మి వేసే మనమెట్టినిల్లు

 కాని దానికి రుణముగా చెల్లు 

 అయినదానికి అత్తెసర జల్లూ.....


దాచిపెట్టిన రతణాల రాళ్లు 

మైమరిపించే మనసైన కళ్ళు 

ఒక్కరోక్కరై జరిపే తిరుణాళ్ళు 

అదరహో అనిపించే గుళ్లూ 


వరుసకు యప్పగించే యవ్వన వొళ్ళు 

 ఎడ బాటుంటే ఎదలో ముల్లు

మూడునాల్ల ముచ్చట మురిపాల జల్లు 

చెడుగుడు ఆటలతో తుళ్లూ....


కోపాన్ని భరించే వారు వాళ్ళు 

తమకంతో తపించే వారు వీళ్ళు 

తన్మయంతో తృప్తిపరిచే దేవళ్లూ


నిన్నుపుట్టించిన వాళ్ళు తోడైన వాళ్ళు 

నిన్నునమ్మించిన వాళ్ళు యదలో నున్నవాళ్లూ 


శ్రీ శ్రీ శ్రీ వెంకన్న దర్శనం తో పోతాయి పాపాలు, తాపాలు, కోపాలు బ్రతికున్న నాళ్లూ......

నీలాల నర్పించి మొక్కులు చెల్లిస్తే సర్వ దోషాలు మోసాలు మొహాలు చెల్లూ.....


ప్రాంజలి ప్రభ.. కీర్తన 

మల్లాప్రగడ రామకృష్ణ 


హరి హరుల నర్ధం చేసుకోలేని జీవ ప్రక్రియ యేల కృష్ణా 

కాంచన కామిని చుట్టూ తిరుగుటేల జగతి కృష్ణా 


పుట్టుక ఎవరి కొరకు, గిట్టుట ఎవ్వరి కొరకు, చక్ర బ్రమనం లో తిరుగుట ఎవరి కొరకు తెల్పు కృష్ణా 


 ఏది ఎవరి దన్నది, ఏది కాని దన్నది, ఎంత వరకు నిజ మన్నది, ఎవరి కొరకు సాగు కృష్ణా 


 ఏది అవసరమో, ఏ దనవసరమో, ఎరుక పరచ కళలు యెవరకు తెలుసు నో తెల్పు... కృష్ణా 


మంచు పొరులుకన్న, మల్లెపూలకన్న, 

మంకెనపువ్వు కన్న, మనసు యర్ధం చేసుకునే భార్య మిన్నా యన్నా రెవరో..నిజమా...కృష్ణా 


కంచు కంఠము కన్న, కాల నిర్ణయము కన్న, 

కాల రాత్రి కన్న, మనసు యర్ధం చేసుకొనే భర్త మిన్నా 

యన్నా రెవరో.. నిజమా..కృష్ణా 


ఎంచు మబ్బులు కన్న, మెర్పు వర్షముకన్న, 

విద్య నైపుణ్యం యున్న, వయసు యర్ధం చేసుకొనే 

పిల్లలు మిన్నా యన్నా రెవరో... నిజమా..కృష్ణా 


పంచు కొనే బుద్ధికన్న, మభ్యపెట్టే గుణం కన్న, మాయలెనున్న, వయసు భాధలు యర్ధం చేయుట మిన్నాయన్నా రెవరో... నిజమా..కృష్ణా 


లేక యేడ్చుటేల? లేని వారెందరో

సంపదలనుగెల్చ బాధ పెట్టె రెందరో 

ఉన్న గర్వమేల? యుర్విలో నెందరో

చెడినవారు కలరు చరిత్రలో నెందరో... నిజమా...కృష్ణా 


హరి హరుల నర్ధం చేసుకోలేని జీవ ప్రక్రియ యేల కృష్ణా 

కాంచన కామిని చుట్టూ తిరుగుటేల జగతి కృష్ణా 

****


ప్రాంజలి ప్రభ.. నేటి ఆలాపన 

రచన.. మల్లాప్రగడ రామకృష్ణ


మమతల పందిరిలో మానవతావాదము తో బ్రతకలేని స్థితి ఏమిటి? కృష్ణా 


 కట్టిన బొమ్మరిల్లు లో రాబందుల రాజ్యానికి తలవంచే స్థితి ఏమిటి? కృష్ణా 


 బంధాలే ముల్లకంచలై చుట్టూ చేరి కదల లేని స్థితి ఏమిటి? కృష్ణా 


 మృగాల దాహానికి బలియై జీ వత్సవముగా జీవించే స్థితి ఏమిటి? కృష్ణా 


చెడు అన్నది ఎక్కడో లేదు మంచిని మనసారా స్వాగతించని నా ఆంతర్యము లో ఉందo టావా కృష్ణా 


సుజనులను సూటి బోటి మాటలతో 

హింసించే నా తలంపులో నే ఉందo టావా కృష్ణా 


మంచి కోరు వారికి చేయూత నివ్వక 

చేటు తెచ్చు నా చేతలలనే ఉందo టావా కృష్ణా 


నిరతము దుర్బుద్ధితో పరుల కీడెంచు శక్తి 

నా హృదయములో ఉందo టావా కృష్ణా 


యీ దేవ దేవుని తలవక కొలువక 

తూలనాడు బుద్ధి నా అంతరములో ఉందo టావా కృష్ణా 


 ఏమైనా నీ లీలా మానుషరూపం నాకు హృదయానందభరితం చేకూరును కృష్ణా 


 మహోన్నతమైన మానవ జన్మ సార్థకం 

మీ వల్లే జరుగును కృష్ణా 


హే కృష్ణా ముకుందా మురారి నమో నమో నమః 


****

అధ్యాత్మ  కీర్తన.     

మల్లాప్రగడ రామకృష్ణ         

రేకురాగము: బౌళి


ఏది తుద దీనికేది మొదలు

ఏది స్థితి దీనికేది మతియు 

పాదుకొను హరి మాయఁ బరగు జీవునికి

ఆదరణ హరి కోరి పరుగు జీవునికి 

 ॥ఏది॥


ఎన్ని బాధలు దనకు నెన్ని లంపటములు

ఎన్ని మోసములు దనకు ఎన్ని ద్రోహములు 

యెన్ని వేదనలు మరి యెన్ని దుఃఖములు

యెన్ని పాపములు మరి యెన్ని శాపములు 


యెన్ని పరితాపంబు లెన్ని దలపోఁతలు

యెన్ని దరి ద్రోహంబు లెన్ని కలమాయలు 


యెన్ని చూచిన మరియు నెన్నైనఁ గలవు

యెన్ని చెప్పిన మరియు నెన్నియో గలవు 

 ॥ఏది॥


యెన్ని కొలువులు దనకు నెన్ని యనుచరణలు

ఎన్ని వలపులు దనకు నెన్ని నను కరణలు 

యెన్ని యాసలు మరియు నెన్ని మోహములు

యెన్ని మాయలు మరియు నెన్ని వేషములు 


యెన్ని గర్వములు దనకెన్ని దైన్యంబులివి

యెన్ని మోహమ్ములు దానికెన్ని దృవ్యంబులివి


ఇన్నియునుఁ దలఁప మరి యెన్నైనఁ గలవు 

ఇన్ని చెప్పినా మరి నెన్నియో గలవు 

॥ఏది॥


యెన్నిటికిఁ జింతించను నెన్నిటికి [1]

హర్షించను 

నెన్నిటికి నాసించును నెన్నిటికిఁ దిరుగను 

యిన్నియును దిరువేంకటేశు లీలలు గాఁగ

నెన్ని చూచినను దా నెవ్వఁడును గాఁడు ॥ఏది॥

****


ప్రాంజలి ప్రభ.. కీర్తన 

మల్లాప్రగడ రామకృష్ణ 


హరి హరుల నర్ధం చేసుకోలేని జీవ ప్రక్రియ యేల కృష్ణా 

కాంచన కామిని చుట్టూ తిరుగుటేల జగతి కృష్ణా 


పుట్టుక ఎవరి కొరకు, గిట్టుట ఎవ్వరి కొరకు, చక్ర బ్రమనం లో తిరుగుట ఎవరి కొరకు తెల్పు కృష్ణా 


 ఏది ఎవరి దన్నది, ఏది కాని దన్నది, ఎంత వరకు నిజ మన్నది, ఎవరి కొరకు సాగు కృష్ణా 


 ఏది అవసరమో, ఏ దనవసరమో, ఎరుక పరచ కళలు యెవరకు తెలుసు నో తెల్పు... కృష్ణా 


మంచు పొరులుకన్న, మల్లెపూలకన్న, 

మంకెనపువ్వు కన్న, మనసు యర్ధం చేసుకునే భార్య మిన్నా యన్నా రెవరో..నిజమా...కృష్ణా 


కంచు కంఠము కన్న, కాల నిర్ణయము కన్న, 

కాల రాత్రి కన్న, మనసు యర్ధం చేసుకొనే భర్త మిన్నా 

యన్నా రెవరో.. నిజమా..కృష్ణా 


ఎంచు మబ్బులు కన్న, మెర్పు వర్షముకన్న, 

విద్య నైపుణ్యం యున్న, వయసు యర్ధం చేసుకొనే 

పిల్లలు మిన్నా యన్నా రెవరో... నిజమా..కృష్ణా 


పంచు కొనే బుద్ధికన్న, మభ్యపెట్టే గుణం కన్న, మాయలెనున్న, వయసు భాధలు యర్ధం చేయుట మిన్నాయన్నా రెవరో... నిజమా..కృష్ణా 


లేక యేడ్చుటేల? లేని వారెందరో

సంపదలనుగెల్చ బాధ పెట్టె రెందరో 

ఉన్న గర్వమేల? యుర్విలో నెందరో

చెడినవారు కలరు చరిత్రలో నెందరో... నిజమా...కృష్ణా 


హరి హరుల నర్ధం చేసుకోలేని జీవ ప్రక్రియ యేల కృష్ణా 

కాంచన కామిని చుట్టూ తిరుగుటేల జగతి కృష్ణా 

****


 ప్రాంజలి ప్రభ.. కీర్తన

మల్లా ప్రగడ రామకృష్ణ


నిన్ను నీవే నమ్ముకో, నిన్ను నమ్మిన వారు తోడు నీడౌను 

నీకళ తొ నిన్ను మార్చుకో, నిత్య సత్యము నీకు రక్ష నీడౌను..

యీ గోపాలుడు ఎప్పుడు నీ మనస్సుకి శాంతి శృంగార ప్రియుడౌను 

 (2)


ఆధారపడకు అతిగా ఎవ్వరిపైనా

అంతులేని బాధ మదికి వదిలెళ్ళినా


కాల ప్రకృతి విధిగా సఖ్యతయే లేకున్నా

సమయమంతా దుర్వినియోగ మయినా...... నిన్ను


పెంచుకోకు ప్రేమను ఏ బంధముపైనా

వేతనే తుదకు హృదికి నిను మరచినా


 సంత సమ్మ సఖ్యత ఏదీ లేక పోయినా

కాలచక్రం అడ్డం గా ఆదుకోక పోయినా...... నిన్ను


చింత వలదు కడపాత్రమే కాలదన్నినా

నీ నీడే నీతోరాదు చీకటి నిను ముసరినా


మమకార మోహాలన్నీ మాయేనోయీ

ఋణానుబంధాల సంస్కారాలగులే...... నిన్ను


 నీ భక్తి నీకు తో డు నీ శక్తి నీకు నీడగా 

నీ యుక్తి నీకు తోడు నీ రక్తి నీకు జోడుగా


ఫలితమెంచక ధర్మంగా కర్మలు చేయగా

యీ గోపాల ఆటలో నీ పాత్ర ముగిసే దాకే లే


నిన్ను నీవే నమ్ముకో, నిన్ను నమ్మిన వారు తోడు నీడౌను 

నీకళతొ నిన్ను మార్చుకో, నిత్య సత్యము నీకు రక్ష నీడౌను

 యీ గోపాలుడు ఎప్పుడు నీ మనస్సుకి శాంతి శృంగార ప్రియుడౌను 

****

Thursday, 27 February 2025

 

ప్రాంజలి ప్రభ.. కొత్తపాట 


మీ జుట్టు మిగల నిగ నిగల యెటుల 

 మీ ముక్కు ముక్కెర ధగధగలు యెటుల 

మీ కళ్ళ కాటుక మిరమిరలు యెటుల 

మీ చెవుల దిద్దులు కదలికలు యె టుల 

మెరసి పోవుచు నుండె నబల?


మీ పెదవుల ఎరుపులు పిలుపులు యెటుల 

మీ బుగ్గలుబ్బినా యెరుపులు యెటుల 

మీ ముఖ బింబము మెరుపులు యెటుల 

మీ పాపిడి తిలకం గంధములు యెటుల 

మెరసి పోవుచు నుండె నబల?


మనసున నుందువు మాయక యెటుల 

వనమున నెల రారు పలు పూలు యెటుల 

దినమున వెలుగుచు తెల్లగ యెటు ల 

మనసిజు ధనువందు మలువంపు యెటుల 

మెరసి పోవుచు నుండె నబల?


దేహమునందున దీప్తిగ యెటుల 

తుష్ణయు తొలగును తృప్తియే యెటుల 

కలలో మెలకువగా కాముడు యెటు ల 

పలుగాధలు గనుటే భావన యెటుల 

మెరసి పోవుచు నుండె నబల?

******

ప్రాంజలి ప్రభ నేటి కొత్తపాట 


హరియే గతియని నమ్మిన చాలును 

సద్గతులకు కొదవేమన విధిగాను 


హరియే బలమని యెరిగిన చాలును 

దుర్బలిమితో యవసరమేమి విధిగాను 


హరియే తోడని నమ్మిన చాలును 

గండము లన్నియు గనలేవు విధిగాను 


హరియే విభుడని నెరిగిన చాలును 

శాంతి సౌఖ్యముల బ్రతుకు విధిగాను 


హరియను రెండక్షరాలు పఠన చాలును 

నిత్య సత్య పలుకే యగు విధిగాను 


హరియను వ్రత కర్మలు చాలును 

హరియను యజ్ఞ యాగాదులు చాలును 

హరియను జపతపములు చాలును 

సంసార సముద్రాన్ని యీదుట విధిగాను 


హరియను బంధమే మోక్షం చాలను 

 అందరితో బంధ మేళ విధిగాను 


పుట్టుకనుండి పోయేవరకు హరియను 

జీవితంలో వున్నా లేకపోయినా హరియను 

 స్వతంత్రుడునని  మాయ కమ్మినా హరియను 


హరియను ఆత్మ సాధన చాలును 

హరియను నిగ్రహా శక్తి చాలును 

హరియను వెలుగు మనసున ఉంటే చాలును 

హరియను నిత్యపారాయణం చాలును 

సర్వంతర్యామి సర్వాన్ని చూస్తే చాలును 

హరిః ఓం..


గోవిందా.. గోవిందా.. గోవిందా

*****


ప్రాంజలి ప్రభ.. కొత్తపాట హోళీ..!!


కలతలు కష్టాలు మరచి 

చిందులేసే ఆనందం

కొలతలు వావివరుసలు మరిచే మహధానందం 

జాతి కుల మత వివక్ష వీడి 

వెల్లివిరిసే సంతోషం

చిన్నా పెద్ద రంగల వసంతాల జల్లుల మధ్య సుఖమయం 


పేద గొప్ప అసమానతల వదలి 

జరిపే సంబరం

సూర్య కళలతో సహకారం అందించే అంబరం 

ఈర్ష్యాసూయ ద్వేషాలుమాని 

పొందే ఉత్సాహం

సర్వ మానవ సౌబ్రాత్వుత్వము తో పొందే ప్రోత్సాహం 


రాధామాధవ వసంతోత్సవ 

సరస క్రీడా వినోదం

పౌర్ణమి వెలుగులో వేడుకైన 

కామదహన కార్యం

చిన్నా పెద్దా ఆడే రంగుల 

కేరింతల కోలాహలం

చెడుపై మంచి సాధించిన 

విజయపు విన్యాసం 


ప్రశాంతతివ్వని అష్టైశ్వర్యాలకన్నా.. 

సంతృప్తినిచ్చు చిన్ని నవ్వు మేలు


స్పర్ధ స్వార్ధ పగ ప్రతీకారలతో బ్రతికేకన్నా.. 

కలిసి పదుగురికి చేయూతనిచ్చే జీవితం మేలు. 


కం. కోకిల కుహు కుహు హోళీ 

గోకుల బృందా వనమున గోప్పగ హేళా! 

వాకిట రంగుల హోళీ

జాతర చిన్నారుల గళ జాగృతి హోళీ 


ఇదేగా వర్ణ శోభిత సందడి పండుగ హోళీ

మనకిచ్చే జన్మ సార్ధకత అపురూప సందేశ హోళీ


****


ప్రాంజలి ప్రాభ.. కొత్తపాట 


నేను పుట్టాను, లోకం లో 

రాధా కృష్ణలా తిరిగాను 

నేను ఏడ్చాను, లోకం లో 

హోళి ఆటలలో సరదాగా .

నేను నవ్వాను,

రంగులు అద్ది జలకా లాటలతో 

నాకింకా లోకంతో పని ఏముందీ.....

హోళి ఆనందంతో సంతోష మైనా దీ ....

       ॥నేను పుట్టాను ... ॥


  1వ. చరణం:

మనిషిని మనిషిని కలిపేటందుకు 

పండుగ పెళ్లి చాలు 

ఎవరికి దొరకక తిరిగేటందుకె

పంట పొలాలు చాలు . 

ఒంటరి తుంటరి బ్రతుకు కోసమై

సుఖ ప్రేమంటే చాలు 

అందరి బుర్రలు నమలడానికే

సరదా సరదా హోళి ఆటుంటే చాలు 

ఇక చాలు.. ఇక చాలు   .....


  ॥నేను పుట్టాను ...  ॥


   2వ చరణం:

నవ్వుల సరదాలే 

అందరి గుండెలు ఆనందించాయీ ... 

కోప తాపాలే 

అందరి మనసులు చిరాకు పడ్డాయీ ...

పండగ సరదా ముగ్గేసిందీ 

అందరి బ్రతుకులు చతికిల బడ్డాయీ ...

తెల్లవారినా అవి,

కొంచెంకూడా బాగవకున్నాయీ .

ఇక చాలు.. ఇక చాలు 

     ॥ నేను పుట్టాను ...॥


 3వ చరణం:

సరదా వసతులతోటీ,

షరతులు వున్నాయీ ...

హద్దు మీరితే అంతు తెలియనీ,

శిక్షలు పడతాయీ ...

మనసుల భాషల కుండే,

సొగసులు తగ్గాయీ ...

సంతో షా లతో,

ఎవరికి తెలియని భాషలు పుట్టాయీ .

ఇక చాలు.. ఇక చాలు 


....           ॥ నేను పుట్టాను ...  ॥


  4వ చరణం:

మనుషుల మనసులు,

కలిపేటందుకె ప్రేమలు వున్నాయీ ...

ఏ సరదాకైనా 

మంచిగ వాడే మార్గాలున్నాయీ ...

మంచిగ వాడని,

సరదా కెపుడూ దోషా లొస్తాయీ ...

కలలో 

చెప్పే టందుకె నీతులు వున్నాయీ.

ఇక చాలు.. ఇక చాలు 

     ॥ నేను పుట్టాను ...  ॥


  5వ చరణం (ఆఖరి చరణం):

గంటలు రోజులు ప్రేమ కౌగిట్లో కరిగాయీ ,

వాగుతు గడిపేసెయ్ ...

చిలిపి చేష్టలతో గడిపాయీ 

బయటకు దుఃఖన్ని విసిరేసెయ్ ..

  ...

ఇక చాలు.. ఇకచాలు... 

హహ్హహ్హహ్హహ్హ !!!


॥నేను పుట్టాను ...॥

******


*ప్రాంజలి ప్రభ.. కొత్త*

రచన.. మల్లాప్రగడ రామకృష్ణ 


దేహమే దేవాలయమని

నిత్య ఆనంద నిలయమని

సృష్టి స్థితి లయలకు మూలమని

అదియే జీవన్ముక్తికి మార్గమని సోపానమురా.

హృదయా నందమురా..పరమాత్మ లీలరా


దేహానికి శిరమే సుందర మని 

వేదాంతమునకు పలుకే మూలమని

అనవరతంబు విహరించుమని

అదియే జీవన్ముక్తికి మూలమని సోపానమురా.

హృదయా నందమురా..పరమాత్మ లీలరా


ధైర్య సంపద నిశ్చల మని

కులమే దాని మూలమని

అకులమే తురీయమని 

అదియే జీవన్ము క్తి మూలమని సోపానమురా..తెలియుమురా..పరమాత్మ లీలరా


నేత్రద్వయమే నిశ్చలమని 

చీకటి వెలుగుల జీవితమని 

హృదయకుహరమే బ్రతుకని

పరమాత్ముని నిజవాసమని

ఉచ్వాస నిశ్వాసములే జప మంత్రమని

అదియే జీవన్ముక్తి మూలమని సోపానమురా.

హృదయా నందమురా..పరమాత్మ లీలరా


ప్రపంచమంతా పంచబాణుని వశమని

పంచేంద్రియములతొ జీవమని

జననీ జనకుల శరణు వేడెదమని

అదియే జీవన్ముక్తి మూలమని సోపానమురా.

హృదయా నందమురా....పరమాత్మ లీలరా


గోవిందా.. గోవిందా.. గోవిందా 


****

ప్రాంజలి ప్రభ.. కొత్తపాట 


చాలదా ఈ జన్మకీ భాగ్యము

విశ్వశాంతి ఫలాన్ని జూపే శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరా!!.. 2


చాలదా ఈ జన్మకీ భాగ్యము

సాహితీ క్షేత్రాన్ని జూపే శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరా !!...2


నీ దయాసింధు బిందువొక్కటె చాలదా

భవ జలధి తారణమునకు!!


సంసేవ్య ప్రభారాశియై జీవకోటికి చాలదా 

పూర్ణతత్వము పొందేందుకు!!


నీ పాదరజమందు రేణువొక్కటె చాలదా

భవ తాప హరణమునకు!!


శరణం పరమామృతాoబునిధి అన్న చాలదా 

కరుణించి కడవరకు కాసేందుకు!!


సత్యం,న్యాయం,ధర్మం కోసంసాధన  చాలదా

ధైర్యం తొ గుణం యోగ్యం బ్రతుకుకు!!


నీ నామసుధారస మొక్కటి చాలదా

భవ రోగ నివారణమునకు!!


నీశక్తి, యుక్తి, మాకు అందిస్తే చాలదా

సర్వ రోగ నివారణకు!"


నీ కథా శ్రవణ మాధుర్యమొక్కటె చాలదా

భవ బంధ మోచనమునకు!!


నీ దివ్య రూపమ్ము వొక క్షణము నిలుపుటె చాలదా

మోహంబు నశియించి మోక్షమ్ము పొందుకు!! 


చాలదా ఈ జన్మకీ భాగ్యము

విశ్వశాంతి ఫలాన్ని జూపే శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరా !!


చాలదా ఈ జన్మకీ భాగ్యము

సాహితీ క్షేత్రాన్ని జూపే శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వరా !!...


****

ప్రాంజలి ప్రభ.. కొత్త పాట 


నీవెవరు, నేనెవరు, అంతా ఆడించేది ఆ బ్రహ్మా....

మూడునాల్ల ముచ్చటైన జోరు 

కంపు లో పుట్టి, కంపునే భరించి, కట్టే కాలేంతవరకే 

తెలుసుకో మానవా నీ జోరు 


ఏది స్థిరము, యేది ఆస్థిరము తెలుసు కోలేని మానవ సఖ్యత జోరు 

తప్పించుట నుదుటి రాత జోరు 

వ్రాసిన విధాతకైనా తరము కాదు 

తెలుసుకో మానవా నీ జోరు 


ఉవ్వెత్తున ఎగిసిపడే అలల హోరు 

అవి సంద్రములో యున్నంత వరకే 


ఉబలాటంతో మిడిసి పడే మనిషి జోరు 

సంసారంలో యవ్వనంతో యున్నంత వరకే 


గర్వంతో పలికేటి మనిషి జోరు 

బ్రతుకులో సంపద నున్నంత వరకే 


దాంపత్యంలో ఉండేటి మహా జోరు 

స్వార్ధం అపనమ్మకం రానంత వరకే 


చదువుల వళ్ళ జన్మ సార్ధకం జోరు 

దేశ, కటుంబశ్రేయస్సు నున్నంత వరకే 


మనసుతో మమేకమై పంచుకొనే జోరు 

తనువుకు అలుపును మరిపించే వరకే 


జీవిత కాలాన్ని మరింత పెంపు జోరు 

సంతృప్తి ప్రశాంతతున్న జగత్తు యున్నంత వరకే 


మనం మనం సృష్టించుకొనే జోరు 

నాది, కష్టర్జీతం యన్నంత మరిచే వరకే 


నా బిడ్డలలో నా ప్రేమ అనే జోరు 

పెళ్లితో సుఖం పొంద నంత వరకే 


తత్వ మెరిగిన మహా జ్ఞానం జోరు 

నేలపై ప్రాణo యున్నంత వరకే 


నీవెవరు, నేనెవరు, అంతా ఆడించేది ఆ బ్రహ్మా 

మూడునాల్ల ముచ్చటైన జోరు 

కంపు లో పుట్టి, కంపునే భరించి, కట్టే కాలేంతవరకే 

తెలుసుకో మానవా నీ జోరు 

తెలుసుకో మానవా, తెలుసుకో మానవా, 

తెలుసుకో మానవా, 


గోవిందా.. గోవిందా.. గోవిందా

******



ప్రాంజలి ప్రభ.. కొత్త పాట 


చెప్పుకో లేని విపరీత వాంఛలు 

ఒప్పుకో లేని జీవితాన గాయాలు 

తప్పుకో లేని మానసిక వేదనలు 

విప్పుకో లేని మమతాను రాగాలు


కనులలో నీ అందమైన కలలు

కనులలో నీ కన్నీటి అలలు

తనువులో నీ స్పర్శ కదలికలు 

తనువులో నీ తియ్యటి గుర్తులు 


మనసంతా  నీ ఆలోచనలు

సొగసంతా నీ స్పందనలు 

నాతో నీ జ్ఞాపకాల పూమాలలు

నా హృదయం పై నీకోర చూపులు


ఎందుకీ  ప్రాయం నీది కానపుడు కళలు 

ఎందుకీ  జీవితం నువ్వు లేనప్పుడు కథలు 

ఎందుకీ  ప్రాణం నీవు రానప్పుడు వెతలు 

ఎందుకీ విధిగా స్నేహ దేహ తాపాలు 


నీవే నా తుది  మలుపులు 

నీవే నా గమనం తలపులు 

నీవే నా ఆరోప్రాణం అరుపులు 

నీవే నా సర్వo మరువ లేని వలపులు

******

ప్రాంజలి ప్రభ.. కొత్త పాట.. చిరునవ్వు 


చిరు చిరునవ్వుల చిట్టీ 

చిందులు వేసే మా ముద్దుల పట్టీ 

 మా కలల గారాబాల కుట్టీ 

 మా మనసులను దోచావు కాబట్టీ

దోచావు కాబట్టీ

దోచావు కాబట్టీ


 నీటిలో కలవ వై వెలిశావు నువ్వు 

 నింగిలో వెన్నెలై జాబిల్లి నవ్వు 

 కనుపాపలో కాంతిలా మెరియు ను వ్వు 

మురిపాలు బట్టి ముద్దులొలకే నవ్వు.....చి 


 మా పాపే మాకు ఇంటి దేవతా 

 మా ఇంట తీరు సిరులు లేని కొరతా 

మా అందరి మనసున తొలగు చింతా 

పాప స్పర్శతో కలుగును మాకు పులకింతా.... చి 


మా మనో వికాసకాలు నీ ముద్దు పలుకులు 

మా కనువిందు ఆనందాలు నీ ఆట పాటలు 

మా ఆట విడుపులు నీ చిలిపి చేష్టలు 

మా హృదయ స్పందనలు నీ బిత్తర చూపులు 


చిరు చిరునవ్వుల చిట్టీ 

చిందులు వేసే మా ముద్దుల పట్టీ 

 మా కలల గారాబాల కుట్టీ 

 మా మనసులను దోచావు కాబట్టీ

దోచావు కాబట్టీ

దోచావు కాబట్టీ

****

ప్రాంజలి ప్రభ.. కొత్త పాట..


అన్నీ అమరినా....  నా.. ....

ఇంకేదో కొదవను దిగులూ.... దిగులూ... లూ...  

మదిలో మెదిలే ఆలోచనా సందడీ.....

అర్ధంకానీ అర్ధం చుట్టూ తిరిగే సవ్వడీ....... అ 


ఆనందమనేది ఆరోగ్య మనీ 

ఆలోచననేది అనారోగ్యమనీ 

ప్రేమ పటుత్వానికి మూలమనీ 

అతి సంపాదన అనర్ధ మనీ.. అ 


 ఇతరుల కన్నా మేలనుకుంటే సంతృప్తి అనీ 

 ఇతరులను చూసి చింతిస్తూ ఉంటే అసంతృప్తి యనీ 

 అందరూ తనవారను కుంటే సంతృప్తి యనీ 

ఓర్వలేని గుణము వుంటే అసంతృప్తి యనీ... అ 


ప్రకృతి ప్రభవమునకు సుఖము యేదీ 

ప్రగతి ప్రతిభకు గుర్తింపు విలువ యేదీ 

ఈర్ష్యా అసూయ లేని తనమేదీ 

స్వార్ధ బుద్ధి లేని గుణ మేదీ 

అంతరాత్మకు స్వేచ్ఛ యేదీ 

మనుగడకు ప్రశ్న లేని జీవిత మేదీ 


అన్నీ అమరినా....  నా.. ....

ఇంకేదో కొదవను దిగులూ.... దిగులూ... లూ...  

మదిలో మెదిలే ఆలోచనా సందడీ.....

అర్ధంకాని అర్ధం చుట్టు తిరిగే సవ్వడీ.....అ 


*****

ప్రాంజలి ప్రభ కొత్త పాట.. వృద్దురాలి ఆవేదన 


ఏమని చెప్పేది, ఎలా చెప్పేది, అనుభవాల ఆశయాల తీరు 

 ఆశ్రిత పుత్రుల ఆలణ పాలణ అష్ట కష్టాల సుఖాల తీరు... 2


 వెతల వేదనలు నాదరి చేరెను  ఇపు డే 

 కలతలు కష్టాలు కడు దూరమవ కే 

 తోడుగా దారిద్రం నన్ను వెంటా డే 

సంక్షోభ సమస్యలు నేనే మూలమనే... యే 


 ఆనంద వినోదాలకు నేనే అడ్డనే వారు 

 మింగ లేక కక్కలేక చావు రాదనే వారు 

పరమాత్ముని భక్తితో కొలవ మనే వారు 

కుటుంబాల గోల నీ కెందుకనే వారు...      యే 


అందుకే ఎందరున్న భర్త మిన్న నే వారు 

ఎందరున్న భార్య తోడు మిన్ననే వారు 

కన్న బిడ్డలు కన్నా దైవం మిన్ననే వారు 

వయసు మీద బడ్డాక గుర్తింపు లేదనే వారు.... యే 


సంపదలున్నా సుఖ సంతోషాలు కరువే 

సంపద లేకున్నా సంతోష రాగాలు కరువే 

మూడు కాళ్ళ మనుషులున్నా కరువే 

మనుషుల విలువలు తెలియని చోట అంతా కరువే 


ఏమని చెప్పేది, ఎలా చెప్పేది, అనుభవాల ఆశయాల తీరు 

 ఆశ్రిత పుత్రుల ఆలణ పాలణ అష్ట కష్టాల సుఖాల తీరు... 2

*****


ప్రాంజలి ప్రభ కొత్త పాట

*శ్రీరంగ నీ రూప మేమిధృతీ*


శ్రీరంగ నీ రూప శ్రీ రమ్య  మేమి ధృతీ

వోరంగ మారంగ  నీ రూప మెంత ధృతీ

ధీ రంగ యో రంగ మీ రంగ మెంత శృ తీ

యేమిధృతీ యేమి ధృతీ యెంత శృతీ 


మెండైన శంఖచక్రాదులతోడ

నిండైన తోడుగ నీడల తోడ 

చెండైన మొక్కులు తీరున తోడ

నీ దివ్యరూపమ్ము యేమి ధృతీ


రంగ రంగ వైభోగముల కన్న

రంగ రంగ నైవేద్యముల కన్న

రంగ రంగ తాంబూలముల కన్న మిన్నైన

రంగేళి నీ లావణ్య రూపమ్ము యేమి ధృతీ


విందు వినోదాల కన్న కను విందైన

పొందు ప్రభోదాల కన్న సమ చిందైన

యందు సమోహాల కన్న కళ మందైన

కమనీయ రూపమ్ము ఏమి ధృతీ


గోకులము కావంగ గోవర్ధనంబెత్తి అమరేంద్రుగర్వంబు

ఖర్వంబు చేసిన లీల లేమి ధృతీ


రాధారమణీతోడ కూడి రాసకేళిలో రాజిల్లు

రసమయ రూపమ్ము ఏమి ధృతీ


పుండరీకునికై వేచివేచి శిలయై నిలిచిన 

అసలుసిసలైన రూపమ్ము యేమి ధృతీ


రంగనాయకితోడ కావేరితీరాన రంజుగా వెలసిన

రమణీయరూపమ్ము ఏమి ధృతీ


జననమరణ చక్ర భేదంబు గావించిన 

జగన్మోహన రూపంబు యేమి ధృతీ


ఉదరమ్ములోనున్న జగముల రాతలు

రాయంగ నాభి కమలమ్ములోన 

విధాతను దాల్చిన రూప మేమి ధృతీ


తిరముగా నీ దాసదాసుండు శ్రీనివాసుండు

నిరతితో కొలిచేటి నీ దివ్యరూపమ్ము ఏమి ధృతీ


కాలమే మారినా కావ్యమై వ్రాసిన 

కళలు జూపిన కమనీయ రూపమేమి దృతీ 


గోవిందా.. గోవిందా.. గోవిందా 


రచన: మల్లాప్రగడ రామకృష్ణ

*****

ప్రాంజలి ప్రభ..కొత్త పాట **   వైరాగ్య ఫలము  **


ఏది నీది? ఏది నాది? 

ఏది సొంతము? యనేది తెలిపేదె వరు? తెలిపేదెవరు?


నా వారెవరు? నీ వారెవరు? 

చివరికెవరు? ఎవరింకను మిగిలేదెవరు? మిగిలే దెవరు? 


ఎవరి ధనము? ఎవరు బలము? 

ఏది స్థిరము? ఎంత యున్నా స్వార్ధ మా?


ఏది సుఖము? ఏది దుఃఖము? 

ఏది నిజము? తెలిసినా తెలియకే తెలపలేని తనమా?


ఎవరి బంధము?ఎవరు అందము?

ఎవరు శాశ్వతము? ఏమి లింగభేదము వల్ల సౌఖ్యమా?


ఏది ఆనందము? ఏది విషాదము? 

ఏది నిత్యము? ఏ పలుకుల సొంతమా?


ఏది మిథ్యా? ఏది మాయ? 

ఏది సత్యము? యేది చెప్పలేని మౌనమా 


ఏది వైరాగ్యము? ఏది విరాగత్వము? యేది సమ్మోహము, యేది క్షంతవ్యమా?


అదే.. వాస్తవ యోగము 

అదే.. సుజ్ఞానము 

అదే భగవదన్వేషణా మార్గము.!! 

ఏది యన్న ప్రశ్న లే యగుట దైవ చింతనా, భ్రమల చిత్తమా, జీవితాసయ మార్గము!!

****


ద్విపద.. బేల


అలికిడి చేయకు అలజడి యేల

పలుకుల మాయలు వలదులే బేల


కులుకుల కలువవు కలకళ మేళ 

థలుకులు తపనలు జాలును బేల


వలపులు వరదలా పొంగులు యేల

మలుపులు తెలుపుట నీకేల బేల


తలపులు సలపరింతలకాల మేళ 

వలిగాలి వయసుకు రాపిడి బేల


చెలువుల కౌగిలి కోరుట యేల

తలుపులు తెరచియు పిలుపులూ బేల


కలలను కల్లోల మనుటయు యేల

అలికిడి అలకలు వలదులే బేల


తొలిజామునందెజనులనుమేల్కొలుప 

లలితమై ప్రకృతి వఱ లెనని బేల


కొలకొల కొక్కొరొకో యని యార్చె 

చెలసి కుక్కుటములు గళముల బేల


అలికిడివినిలేచి అతివలు కుదిలి 

చెలువుల కౌగిళ్లు సలివడి బేల


వలిగొని కిదుకు డింభకుల నేమార్చి 

కెలవున పాలిచ్చి , తలివము చేర్చి 


వలదుగ ముంగిళ్లపై రంగవల్లి 

కలను తీర్చిరి కలావుల జడిబేల

****


నేటి చందస్సు.. య. య. య. య.



నమో భూతనాధా నమో దేవ దేవా 

నమో సుందరేశా నమో ముక్తి దేవా 

నమో విశ్వ నాధా నమో శక్తి దేవా 

నమో రుద్ర రూపా నమోస్ఫూర్తి దేవా 


శిలా రూప లింగా శివా భస్మ ధారీ 

 విలోలమ్ము నీవే వినోదమ్ము ధారీ 

కలా వంత శీర్షా గవేషమ్ము ధారీ 

చలద్వహ్ని నేత్రా త్రినేత్రమ్ము ధారీ


మధోన్మాద నాశా మహాదేవదేవా 

ప్రధానమ్ము యీశా ప్రభో దేవదేవా 

చిదానంద మూర్తీ శివాన్మాయ దేవా 

సుధాతత్వ మూర్తీ సుఖమ్మిచ్చు దేవా


స్వరంశక్తి విశ్వాపరం భాగ్య దేవా 

వరాలిచ్చె దేవా సహాయమ్ము దేవా 

ధరా తత్వ దేవా దయానంద దేవా 

పరంధామ దీక్షాపరం జ్యోతిదేవా


నమో భూతనాధా నమో దేవ దేవా 

నమో సుందరేశా నమో ముక్తి దేవా 

నమో విశ్వ నాధా నమో శక్తి దేవా 

నమో రుద్ర రూపా నమోస్ఫూర్తి దేవా 

****

Tuesday, 28 January 2025




**  జీవితంలో పోట్లు **

మల్లప్రగడ 


సిరులుగా వేలకోట్లగు సిగల పోట్లు 

 భాగ్యశాలిగా చింతలై భంగ పోట్లు 

 కంటినిండా నిదురలేక కునిక పోట్లు 

 నిజమైన భాగ్యాశాలి నిదుర పోట్లు 


ముక్కు మోము చక్కనివాని ముఖ్య పోట్లు 

చెడు తలపులేక కదలు చెలిమి పోట్లు 

ఆత్మ సౌందర్యము తెలుప ఆశ పోట్లు 

ఉన్నవాడేతినక యీర్ష్య యన్న పోట్లు 


విధి విలాస భోగము భాగ్య వింత పోట్లు 

నడుమ కులుకుట సంతోష నాట్య పోట్లు 

కాస్త సమయ స్వార్ధపరము గాను పాట్లు

పరులకు ఉపకార మలుపు పలుకు పాట్లు 

 

ఖరీదైన భవంతులు కట్ట పోట్లు 

డాబుదర్పము చూపుట కాదు పోట్లు 

డబ్బు కరువైన స్థితిగతి డాబు పోట్లు 

నిత్య ఆరోగ్య  వైభోగ నీడ పోట్లు 


పరపతిగను గొప్పగనుండు పలుకు పోట్లు

జీవితంమది యలజడి గీత పోట్లు 

తృప్తిగా ప్రశాంతంగాను తృణము పోట్లు 

బతుకుటే జీవితమ్ముయు బంధ పోట్లు


.*****

ప్రాంజలి ప్రభ.. కొత్త పాట..


వయ్యారి నీవు వద్దన్నా మైమరుపు 

సయ్యాటకు రమ్మన్నా కొస మెరుపు 

అయ్యారే మాటలు విన్నా ఆదమరుపు 

 భయ్యాన్ని తరిమియే యున్నా మది పిలుపు...


 మదిలో ముచ్చట రేకిస్తున్నా 

 విధిగా కన్నులతో కవ్విస్తున్నా 

 నిధిగా గమ్యమునే చూపిస్తున్నా 

 రోదనె చేయక ప్రోత్సహిస్తున్నా కదా.... వయ్యారి 


 చిరునవ్వులతో చిందులు వేస్తున్నా 

 మరుమల్లెలతో మాయలు చేస్తున్నా 

 కురుల కవ్వింపుతో గాయం చేస్తున్నా 

 తరుణి మగవారి మనసు గెలుస్తున్నా కదా... అయ్యారే


నీ కన్నా నా కెవరు లేరులే యన్నా 

నీవే నా సకలమని మెప్పులే యన్నా 

నీతో నా వెతలన్నీ తీర్చులే నన్నా 

నిశ్శబ్దంగా విన్నవించానులేనన్నాను కదా... వయ్యారి 


ఎంత మేర నా భాగ్యమోనని తెలుస్తున్నా 

కొంత కలత ఉన్నది కానీ యని తపిస్తున్నా 

అంతయూ నీకు తెలుసు నని విలపిస్తున్నా 

సుంత కరుణ చూపిన చాలని ఊహిస్తున్నాను కదా.. అయ్యారే


రెప్పలు మూయక వేచి యున్నా 

గొప్పగా నిన్ను తలచి యున్నా 

మెప్పు పొందాలని ఆశతో యున్నా 

కుప్పగా పువ్వులు పోసి నీ ముందరన్నా....కదా వయ్యారి 


వయ్యారి నీవు వద్దన్నా మైమరుపు 

సయ్యాటకు రమ్మన్నా కొస మెరుపు 

అయ్యారే మాటలు విన్నా ఆదమరుపు 

 భయ్యాన్ని తరిమియే యున్నా మది పిలుపు...

 

****

మల్లాప్రగడ రామకృష్ణ

******

*హృదయం*


కంటికి కనిపించవు, మేనిలో దాగి యుంటావు. 

 రాగాలను పలికిస్తావు, జీవ యాత్రకు తోడవతావు.


 హృదయ స్పర్శకు ఆరాట పడతావు, 

ఆతృత పడతావు ఆనంద పడతావు.

 కవాటాల్తో రుధిరాన్ని  కదిలిస్తావు,

 ఉశ్వాస, నిశ్వాసాలకే ఊగి పోతావు.


 అలజడి కే నొప్పి పెడతావు, 

మమ్ము భయపెట్టి ఆనందిస్తావు.

 మరి విసిగించి అలసిపోయావు,

అలిగి సద్దు సేయక మిన్నకుండేవు 


నిర్లక్ష్యం చేయలేని స్థితికి మారుతావు, 

దేహాన్ని కదలించ లేక 

 విశ్రాంతిగా మారిపోతావు.

స్వర్గ సీమాలో చేరిపోతావు.

.*****

నాపేరు నేనంటేనేనే .. 


నేనే అనంత జీవన మార్గాన్ని

నేనే అమృత వర్ష బాండాగారాన్ని

నేనే ఆస్రితులకు సహాకారాన్ని

నేనే అందరికి  అందించే అమృత జలాన్ని

---

నేనే బంధాలకు ఆధారాన్ని

నేనే నేనొక ప్రణయ ప్రభందాన్ని

నేనే వసంతంతో వికసించేవాన్ని

నేనే అందరికి అందించే ప్రకృతి తత్వాన్ని

---

నేనే సరస సల్లాప సరాగాన్ని

నేనే ఆకట్టు కుంటున్న అను రాగాన్ని

నేనే అర విరిసిన అందాన్ని

నేనే అందరికి  ఆనందాన్ని అందించే గుణాన్ని

---

నేనే ప్రకృతిలో వైవిధ్యాన్ని

నేనే వైవిద్యంలో ఏకత్వాన్ని

నేనే సుందర స్వప్నాన్ని

నేనే అందరికి సుందర స్వప్నాల తత్వాన్ని

---

నేనే దైవ దత్తమైన వరాన్ని

నేనే లలిత సంగీత స్వరాన్ని

నేనే వెదజల్లే చల్లని సమీరాన్ని

నేనే పంచ భూతాలకు సహకారాన్ని

---

నేనే మధుర భావాల్లో సత్యాన్ని

నేనే కవి హృదయంలో సాహిత్యాన్ని

నేనే స్మృతి సుమధర పరిమళాన్ని

నేనే  కవుల హృదయాలల్లో షాహిత్యాన్ని

---

నేనే నొక ప్రేమ తత్వాన్ని

నేనే తగ్గిస్తాను ప్రేమ తాపాన్ని

నేనే కలుపుతా ప్రేమ తన్మయత్వాన్ని

నేనే భోదిస్తా ప్రేమ శృంగార తత్వాన్ని

---

నేనే ఇంతకూ నేనెవరో తెలిసిందా

అధరాలలో ఉన్న లాలాజలాన్ని

కాదు నేనే జిహ్వాచాపాన్ని

కాదు కాదు నేనే  అమృత జలాన్ని

---

కాదు సమస్త లోకాల అధినాయకుణ్ణి నేనే  


--((*))--


*****

నేటి శీర్షిక - ప్రేమే నా జీవితం 

రామకృష్ణ మల్లాప్రగడ


ప్రేమకున్న మనసు ప్రేమ సాక్షికినీడ 

సాక్షి ప్రేమ శిక్ష సాగ లేదు 

ద్రోహమన్న దేది పోరు ప్రేమలు చేయు

ద్వేషమన్న నియమ దీక్ష ప్రేమ 


హేతువ న్న ప్రేమ దేహవాంచకు తోడు

సేతువు వలె ప్రేమ నీడ గుండు 

కాలముకళ జూపు కావ్య ప్రేమగ మార్చు

జాతికంత శుభము ఖ్యాతి తోడు


మార్పుయంబతీర్పు మనసున ప్రేమకు 

నేర్పు యున్న విధిగ నీడ నోర్పు

 ప్రేమ మాయ నేర్పు విధము 

తీర్పు లన్ని  ప్రేమ తెల్పు సాక్షి


సాక్షి ప్రేమ నీతి సాగనెంచ బతుకు 

నీతి యనుచు ప్రేమ నమ్మ బలుకు 

జాతి నందు ప్రేమ చాకచక్యము నీతి

ప్రీతి యన్న  ప్రేమ పేరు ఖ్యాతి


నిర్లక్షమ్ము గాను నెమ్మది గానున్న

ఆక్రమించ గలుగు ఆశ ప్రేమ 

కాల్చి వేయు గతియు కాల మహిమ ప్రేమ 

తప్పటడుగు వేస్తు తప్పు ప్రేమ 


ఈ పరిష్కరించ  ఇచ్ఛామదియె ప్రేమ

నిచ్చెనగతి పైకి నిజము ప్రేమ 

చీపురుగను నుండి చింత లూడ్చెడి ప్రేమ 

చేట,జల్లెడగను చేరువగుట 


ప్రేమ లనుచు పరుగు పెట్టెడి మగువలు 

అధిక మవగ జనులు ఆత్మ విలువ

నెరుగ సమయ మేది  నీతికి నిజమేది 

చెప్ప వినగ  లేరు చిత్త ప్రేమ 


వస్తు మోజున పడి ప్రజల మధ్యన ప్రేమ    

తగ్గు ముఖము పట్టె ధరణి ప్రేమ 

ప్రేమలు పెరగవలె ప్రియ మనుజుల మధ్య 

సఖ్యత గుడి సంఘమైఖ్య  ప్రేమ


****-నేటి శీర్షిక - ప్రేమే నా జీవితం 

రామకృష్ణ మల్లాప్రగడ


ప్రేమకున్న మనసు ప్రేమ సాక్షికినీడ 

సాక్షి ప్రేమ శిక్ష సాగ లేదు 

ద్రోహమన్న దేది పోరు ప్రేమలు చేయు

ద్వేషమన్న నియమ దీక్ష ప్రేమ 


హేతువ న్న ప్రేమ దేహవాంచకు తోడు

సేతువు వలె ప్రేమ నీడ గుండు 

కాలముకళ జూపు కావ్య ప్రేమగ మార్చు

జాతికంత శుభము ఖ్యాతి తోడు


మార్పుయంబతీర్పు మనసున ప్రేమకు 

నేర్పు యున్న విధిగ నీడ నోర్పు

 ప్రేమ మాయ నేర్పు విధము 

తీర్పు లన్ని  ప్రేమ తెల్పు సాక్షి


సాక్షి ప్రేమ నీతి సాగనెంచ బతుకు 

నీతి యనుచు ప్రేమ నమ్మ బలుకు 

జాతి నందు ప్రేమ చాకచక్యము నీతి

ప్రీతి యన్న  ప్రేమ పేరు ఖ్యాతి


నిర్లక్షమ్ము గాను నెమ్మది గానున్న

ఆక్రమించ గలుగు ఆశ ప్రేమ 

కాల్చి వేయు గతియు కాల మహిమ ప్రేమ 

తప్పటడుగు వేస్తు తప్పు ప్రేమ 


ఈ పరిష్కరించ  ఇచ్ఛామదియె ప్రేమ

నిచ్చెనగతి పైకి నిజము ప్రేమ 

చీపురుగను నుండి చింత లూడ్చెడి ప్రేమ 

చేట,జల్లెడగను చేరువగుట 


ప్రేమ లనుచు పరుగు పెట్టెడి మగువలు 

అధిక మవగ జనులు ఆత్మ విలువ

నెరుగ సమయ మేది  నీతికి నిజమేది 

చెప్ప వినగ  లేరు చిత్త ప్రేమ 


వస్తు మోజున పడి ప్రజల మధ్యన ప్రేమ    

తగ్గు ముఖము పట్టె ధరణి ప్రేమ 

ప్రేమలు పెరగవలె ప్రియ మనుజుల మధ్య 

సఖ్యత గుడి సంఘమైఖ్య  ప్రేమ

నేటి చందస్సు... మల్లాప్రగడ 


స్వరభూషణ.. ససమ గగ 


నను తీర్చగ జ్ఞానమ్మే దేవీ 

 తని వారగ మోదమ్మే దేవీ 

 కన లేనిది కాలమ్మే దేవీ 

 వినలేనిది మాటౌనే దేవీ 


 ప్రణవాత్మక దీపమ్మా నీవే 

 కను ముందుగ మార్గమ్మే నీవే 

 క్షణ మైనది సౌఖ్యమ్మా నీవే 

 రుణమైనది దుఃఖమ్మే నీవే 


 సర్వ భాద్యత భాష్యమ్మే నీవే 

 పర్వ వైనము బంధమ్మే నీవే 

 వర సుందర సుర్వా ర్ధీ నీవే 

 వరభూషణ భావమ్మే నీవే 


 ధర మోహన ధామమ్మే నీవే 

 దర హాసపు సోత్రమ్మే నీవే 


 పరమేశ్వరి రూపమ్మే దేవి 

 పరమాత్ముని ప్రేమమ్మే దేవీ 

 తరుణిమణి తాపమ్మే దేవీ 

అరి నాశన నాట్యమ్మే దేవీ


****-

నేటి చందస్సు.. త.త. త. త... మల్లాప్రగడ 


దేవుండు యున్నాడు దైవాత్మ నీలోన 

సేవల్లె నీ తోడు శీఘ్రమ్ము యీనాడు 


అన్నార్త హృద్యమ్ము ఆశ్రిత్వ భావమ్ము 

సన్మార్గ కారుణ్య  సాహిత్య మీనాడు 


 చల్లాని చూపుల్ల సంతోష నీడల్లె 

 కల్లోల దుఃఖంబు కాలంబు యీనాడు


 ప్రేమల్లె మంచౌను పీయూష బుద్దౌను

 క్షేమమ్ము కోరేను క్షంతవ్య యీనాడు 


 మాటల్లె మార్గమ్ము మానమ్ము మౌనమ్ము 

 ఆటల్లె జీవమ్ము ఆశల్లె యీనాడు 


ముళ్లూ మనస్సౌను ముంచేటి బంధమ్ము 

కుళ్లూ కుతంత్రాల కూడౌను యీనాడు 


మూటల్లె కట్టావు ముంపల్లె ముంచావు 

 మాటల్లే నేస్తమ్ము మంత్రమ్ము యీనాడు 


 సౌఖ్యమ్ము మాటేను సొమ్మంత దోచేను 

 ముఖ్యమ్ము ప్రేమమ్ము ముంచేను యీనాడు 


పాశమ్ము పెర్గేను పాపమ్ము మూలమ్ము 

ద్వేషమ్ము దుఃఖమ్ము దేశమ్ము యీనాడు 


 స్వార్థమ్ము పెర్గేను సామర్ధ్య మర్గేను 

 అర్థమ్ము కోరేను ఆశల్తొ యీ నాడు 


 అందమ్ము చుట్టూను ఆనంద మయ్యేను 

 పందెమ్ము జీవమ్ము పాఠమ్ము యీనాడు 


దేహమ్ము దాహమ్ము ద్వేషమ్ము రోగమ్ము 

మోహమ్ము మోసమ్ము మోక్షమ్ము యీనాడు


నీయంత నమ్మేటి నీమమ్ము నేడైన 

చేయూత చూపెట్టి చింతేలె యీనాడు


*****

అంబ సమున్నతి యాలనజేయన్

సంబర జాతర సందడిఁ బారన్

గుంభన విద్యలఁ గోర్కెల దీర్చన్

సంభవమేఁ గద స్వామిని దేవీ


 సాహితి బోధలు సాధన జేయన్  

వాహిని సంశ్రవ వర్ధని వీవే  

మాహిష రాక్షస మర్దని గౌరీ  

ద్రోహుల పాలిట దుర్గవు దేవీ


 ధర్మవివేక వితానముఁ తీర్చే   

ధార్మిక వర్తన దారులు జూపే   

నిర్మల ప్రాకట నిష్ఠల  నించే 

కర్మవిధాత నిగారము దేవీ


 కాలము నిర్ణయ కారణ మీవే  

మూలపు టమ్మవు ముద్దుల తల్లీ  

మేలుల గూర్చెడి మేటి శివానీ   

పాలనఁ గావుము పార్వతి, దేవీ


ప్రేరణజెందిన ప్రీతిని జీవుల్

ధారుణి నీతుల దారులఁ జూపన్

కోరిన కోర్కెల కొంగున దీర్చే

పేరిన నెమ్ములఁ బెంచుము దేవీ

****

మాత్రా శ్రేణి.. దేవీ 


అంబ సమోన్నత  ఆలనగానున్

సంబర జాతర శోధన గానన్ 

గుంబన విద్యల కాలము గానన్ 

సంభవమే ప్రతిసాధన దేవీ 


సాహసమే విధి సాధ్యముగానన్ 

దాహముగా నిధి దారులు గానన్ 

మోహముగా మది మాయలు గానన్ 

స్నేహముగా గతి సేవలు దేవీ 


ధర్మముగా మది దానము గానన్ 

మర్మముగా గతి మార్గముగానన్ 

నిర్మలమే ధరణీ స్థితి గానన్ 

కర్మలుగా నిజకాలము దేవీ 


కాలము నీది ప్రకాశము గానన్ 

మాలలు నీకు ప్రమాణము గానన్ 

మూలమునీవుయె ముఖ్యము గానన్ 

లాలన నీది ప్ర లాపము దేవీ 


ప్రేరణగాను సుప్రీతియు గానన్ 

ధారణ కాలము దారులు గానన్ 

మారణహోమము మాయలు గానన్ 

కారణ మేమది కర్మలు దేవీ 


పైత్యము లీలలు పైకముగానన్ 

నిత్య సమానము నీడలు గానన్ 

ముత్యపు కాంతులు ముఖ్యము గానన్ 

సత్యపు వాక్కులు సాధన దేవీ

*****


ప్రాంజలి ప్రభ.. కొత్త పాట.. జీవీ 


ఓ జీవీ ఎందుకు ఆలోచన

 జరిగేది జరగక మానదు 

 కాలానికి ఎదురీది బతక జాలవు.

దక్కినదే సొంతమని తృప్తిపడు 


తుచ్చ వాంఛలు ఎవరి కొరకు 

విషయ వాసనల వెంట పడకు 

మేనుపై ఇచ్ఛను మరల్చి బతుకు 

భౌతిక స్మృతిలో నుండుము ఎప్పుడు 


నిరంతర భగవతన్వేషణ యోచన

సదా మనసున తాత్విక చింతన

అంతరాత్మను దర్శించిన భక్తి భావన 

దైవమే లోకమైన, ధర్మమే తత్త్వమైన, 

సత్యమే వాక్కుయైన 

తోడు నీడ చేరిన సంఘర్షణ లేని 

తాదాత్మ్యత భోదల సంభాషణ 


గురువులకే గురువు ఆధ్యాత్మిక ముగా 

నిత్య ప్రవర్తన వినయ వివేకoగా 

జగతికి చాటిన ఏకీ భావన గా 

మంచి మాటతో మహిని మార్పు దిశగా 


చూడాలి అందరిలో దైవము 

వీడాలి మనసున కల్లోలము 

పాడాలి హృదయానంద పరము

ఆడాలి అనురాగ ఆనందముతో 

           

 ఓ జీవీ ఎందుకు ఆలోచన

 జరిగేది జరగక మానదు 

 కాలానికి ఎదురీది బతక జాలవు.

దక్కినదే సొంతమని తృప్తిపడు


ఓ జీవీ... ఓ జీవీ

******

ప్రాంజలి ప్రభ... కొత్త పాట.... ఆనందం 


అంగట్లో దొరికేది కాదు 

 అంబరాన వెతకాలి అన్న వెతికేది కాదు 

 పాతాళంలో దాగాలన్న దాగేది కాదు 

 మమతల్లో మానవత్వం  మనసుల్లో మకరందం అదే అవధులు లేని ఆనందం.


 వేకువ పొద్దు విహంగ విక్షనంగా 

మక్కువ హద్దు మహోన్నత క్ష ణం గా 

పెరటి సన్నజాజుల సిగ్గు సొగసుగా 

 అరటిపండు అమృతామృత కళగా ఆనందం


 బుజ్జాయి బోసి నవ్వుల మురిపంగా 

 సజ్జన సాంగత్య సుఖపరంగా 

 పడచు చిన్నదాని చిలిపి చూపుగా 

 తలచు పంట పైరు పచ్చని పలకరింపుగా ఆనందం


 నిండు పున్నమి నెలరేడి వెలుగుగా 

 పండువెన్నెల లో పరచిన  తనువుగా 

సెలయేటి పరుగుల గలగల సవ్వడిగా 

లేగదూడ చెంగుచెంగు నాట్యముగా ఆనందం


కమ్మని తెలుగు పద్యాల పఠనం గా 

మనసైన సతి అలకలోని వగలుగా 

బాల్యస్మృతుల గుండెచెమరింత గా 

సొంతూరి సంగతుల తీపికబుర్లు  గా ఆనందం


పరమాత్మ నామ నిత్య ధ్యానం గా ఆనందం

 సత్య వాక్కుతో  సమయసoతృప్తి ఆనందo


ఆనందం ఒక భాగ్యం 

ఆనందించడం ఒక యోగం 

ఆనందం పొందడం మన సంకల్పం 

ఆనందాస్వాదన సుధ కన్నా మధురం.! ఆనందం


 అంగట్లో దొరికేది కాదు 

 అంబరాన వెతకాలి అన్న వెతికేది కాదు 

 పాతాళంలో దాగాలన్న తాగేది కాదు 

 మమతల్లో మానవత్వం  మనసుల్లో మకరందం అదే అవధులలో ఆనందం.

*****

చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా... ప్రాంజలి ప్రభ 


ప్రజా సంక్షేమమే దేహ మై 

 శత్రుసంహారమే లక్ష్యమై 

 ముద్దు బిడ్డగా యుద్ధమై 

 భారతదేశ అఖండ జ్యోతి గా 


 ప్రజా హృదయాల్లో చిత్తమై 

 శత్రు సేనానికి భయ్యమై 

 సకల సామ్రాజ్య రక్షనై 

సత్యమ్ శివమ్ సుందరడుగా 


 భయము ఎరుగని మహా పరాక్రమ వీరుడై 

 శత్రువులకు దడ పుట్టించు ఘనసూరుడై 

 మొగలులకు బెదురైన మరాఠా యోధుడై 

 సుదీర్ఘ యుద్ధాలు చేసిన సమర్థ పాలకుడై

హిందువులలో గర్వించు చత్రపతి శివాజీ రేడు


 మతసామరస్యం చూపిన భవాని భక్తుడై 

దేశభక్తి దైవభక్తి మెండేన భరతమాత బిడ్డడై 

 మగవాళ్లకు తగు గౌరవం ఇచ్చిన సంస్కారుడై 

 ధర్మ పరిపాలన దురంధరుడై 

 హిందువులలో గర్వించు చత్రపతి శివాజీ రేడు

*-----

మాతృభాష దినోత్స వ సందర్భముగా 

ప్రాంజలి ప్రభ.. కొత్త పాట.. తెలుగు భాష న్నా 


సూర్యునితో రోగాలు హరిస్తున్న 

చంద్రునితో వెన్నెల పొందుతున్న 

ప్రకృతి కళలు నిండుతువున్న 

నా భాష తెలుగుభాషేనని చాటుతున్నా 


మాతృ దేశముకన్న 

మాతృమూర్తి కన్న

పితృమూర్తి కన్న 

తెలుగు భాష మిన్నా 


పాల బువ్వ కన్న 

పాపాయి నవ్వు కన్న

పసిడి సిరుల కన్న 

తెలుగు భాష మిన్నా 


పడచు సొగసు కన్న 

కొత్త చెఱకు తీపి కన్న 

సెలయేటి వంపు కన్న 

తెలుగు భాష మిన్నా 


సంధ్య వెలుగు కన్న 

కమ్మని వెన్న కన్న 

స్వాతి చినుకు తళకు కన్న 

తెలుగు భాష మిన్నా 


నెమలి కులుకు కన్న

నవ వధువు సిగ్గు కన్న 

సురలోక మధువు కన్న

తెలుగు భాష మిన్నా 


గుడి గంట సడి కన్న 

నిండు కలువల తటి కన్న 

పైరగాలి గిలిగింత కన్న 

తెలుగు భాష మిన్నా 


నవ వసంతపు శోభ కన్న 

మిన్నయైనది మధుర మిన్న 

మహత్తరమైనది మనసు మిన్న 

తెలుగు భాష మిన్నా 


మమకారమొలుకున్న 

ఆత్మీయత చిలుకునన్న 

వాగ్ధేవికి ప్రియమైనదినన్న 

తెలుగు భాష మిన్నా


తెలుగు నేలకు వరమైన

అందమైనది విన సొంపైన 

అనందమృత కళలు గన 

గురువు తెలిపే ఆంగ్లము కన్న 

తెలుగు అనగతొక్కే ప్రభుత్వము కన్న 

తెలుగు భాష మిన్నా 


సూర్యునితో రోగాలు హరిస్తున్న 

చంద్రునితో వెన్నెల పొందుతున్న 

ప్రకృతి కళలు నిండుతువున్న 

నా భాష తెలుగుభాషేనని చాటుతున్నా 

                       --

ప్రాంజలి ప్రభ.. కొత్త పాట..


వయ్యారి నీవు వద్దన్నా మైమరుపు 

సయ్యాటకు రమ్మన్నా కొస మెరుపు 

అయ్యారే మాటలు విన్నా ఆదమరుపు 

 భయ్యాన్ని తరిమియే యున్నా మది పిలుపు...


 మదిలో ముచ్చట రేకిస్తున్నా 

 విధిగా కన్నులతో కవ్విస్తున్నా 

 నిధిగా గమ్యమునే చూపిస్తున్నా 

 రోదనె చేయక ప్రోత్సహిస్తున్నా కదా.... వయ్యారి 


 చిరునవ్వులతో చిందులు వేస్తున్నా 

 మరుమల్లెలతో మాయలు చేస్తున్నా 

 కురుల కవ్వింపుతో గాయం చేస్తున్నా 

 తరుణి మగవారి మనసు గెలుస్తున్నా కదా... అయ్యారే


నీ కన్నా నా కెవరు లేరులే యన్నా 

నీవే నా సకలమని మెప్పులే యన్నా 

నీతో నా వెతలన్నీ తీర్చులే నన్నా 

నిశ్శబ్దంగా విన్నవించానులేనన్నాను కదా... వయ్యారి 


ఎంత మేర నా భాగ్యమోనని తెలుస్తున్నా 

కొంత కలత ఉన్నది కానీ యని తపిస్తున్నా 

అంతయూ నీకు తెలుసు నని విలపిస్తున్నా 

సుంత కరుణ చూపిన చాలని ఊహిస్తున్నాను కదా.. అయ్యారే


రెప్పలు మూయక వేచి యున్నా 

గొప్పగా నిన్ను తలచి యున్నా 

మెప్పు పొందాలని ఆశతో యున్నా 

కుప్పగా పువ్వులు పోసి నీ ముందరన్నా....కదా వయ్యారి 


వయ్యారి నీవు వద్దన్నా మైమరుపు 

సయ్యాటకు రమ్మన్నా కొస మెరుపు 

అయ్యారే మాటలు విన్నా ఆదమరుపు 

 భయ్యాన్ని తరిమియే యున్నా మది పిలుపు...

 

****

మల్లాప్రగడ రామకృష్ణ

ప్రాంజలి ప్రభ..కొత్త పాట..


పాడుతా తీయగా జోరుగా 

 పాడుతూ మాయలే మార్పుగా.. 2


 పాటలు మాటలే కూర్పుగా 

 పాటతో నవ్వులే నేర్పుగా.... 2..పా 


 ఎంత నేర్చిన తక్కువే యగు సంగీతమే ఇదియని 

 కొద్దికాలము కిందనే సంగీత మర్మము తెలుసుకొంటిని 

 మొద్దు బారిన యెడల తానే కరిగిపోవగ విస్తుపోతిని 

 ఇంతకన్నా భోగమేదని పరవశమ్మును పొందితిని...పా 


ఒదిగిన మనసున పొదిగే భావము కదిపేదెవరో 

 అదుపున జరిగిన మెదిలే భావము చదివేదెవరో 

 పొదుపున నలిపిన తెలిపే భావము వదిలేదెవరో 

 సరిగమపదనిస పలుకే భావము తెలిపేదేవరో... పా 


 అందుకే సంగీత స్వరాల ఔషధాల మయం 

 అందుకే సంగీతాన్ని ఆలకించడం భోగం 

 అందుకే సంగీతాన్ని ఆలపించడం యోగం 

 అందుకే సంగీతాన్ని నుపేక్షించడం రోగం.....


పాడుతా తీయగా జోరుగా 

 పాడుతూ మాయలే మార్పుగా 

 పాటలు మాటలే కూర్పుగా 

 పాటతో నవ్వులే నేర్పుగా.... పా..


 మల్లాప్రగడ రామకృష్ణ


*****

 సుందర సుకుమార కన్య విలాప సీస పద్యాలు 

మల్లా ప్రగడ రామకృష్ణ 


కర్ణాంత విశ్రాంత కనులున్న దానవే

వర్ణింపవసామౌనె వరుస కన్య

రాకేందు బింబమై  రాజిల్లు మోముగా

కేశబంధముగానె కేళి కన్య

నయగారా మొలికేటి నాజూకు నడుముగా

నయనాలు మరిపించు నటన కన్య

నడక జూడగనుండ నలువ వాహనబోలు

ముత్యాల నవ్వుతో ముదము కన్య


ఉండ బట్టలేని ఊగేది మనసగు

వింత సోకు జూడ వేయి కళ్ళు

నమ్మలేని సొగసు నాట్యమ్ము జేయించు

తనివి తీర కుండె తపన తీరు

***

సీస పద్యము 


భీతి కల్పనలగు బింబోష్టినిగనగా

నలిజాక్షి నినుఁజూడ నమ్మ కన్య

శోభిళ్ళు యందమే సోకుల కళలుగు

నాల్గు కన్నులు జూడ నయన కన్య

ఉల్లాస యుత్సాహ యుజ్వలా భావమ్ము

శాంతిని చేకూర్చు సమయ కన్య

బ్రహ్మసృష్టి గనుగా బంధమ్ము నేస్తమై

సకల శోభను పంచు సరళ కన్య


వర్ణనెంత తెలప వాలుజాక్షి లీలలు

మనసు దోచగలగు మాయ సృష్టి

వలవల కళ గాను వలపుజల్లుకురిసే

జవ్వని కులుకౌను జాగ రూక

**-

    

సీ

ప్రేలాప వంశాన ప్రభవమందినకన్య 

నైశ్వర్య విభవాన నలరు కన్య 

 కోపతాపముగల గొప్పచెప్పెడికన్య 

నరుల యాసలుగాను విరియు కన్య 

దివ్యగంధాలతో దీపించ గలకన్య 

పూలమాలలతోడ పొలయుకన్య 

మానస వేటల మాన్యుల తోడుత

పరివేష్టితుండౌచు బరగుకన్య


తేగీ

నృత్య గాన వినోదాల నెనరుకన్య 

నమ్మ బలుకుతో  నటనయే నచట కన్య 

బోరుబోరున విలపించి పొగిలి కన్య 

చెప్పదొడగెను కడగండ్లఁ చింత కన్య 

***


****-

*హృదయం*


కంటికి కనిపించవు, మేనిలో దాగి యుంటావు. 

 రాగాలను పలికిస్తావు, జీవ యాత్రకు తోడవతావు.


 హృదయ స్పర్శకు ఆరాట పడతావు, 

ఆతృత పడతావు ఆనంద పడతావు.

 కవాటాల్తో రుధిరాన్ని  కదిలిస్తావు,

 ఉశ్వాస, నిశ్వాసాలకే ఊగి పోతావు.


 అలజడి కే నొప్పి పెడతావు, 

మమ్ము భయపెట్టి ఆనందిస్తావు.

 మరి విసిగించి అలసిపోయావు,

అలిగి సద్దు సేయక మిన్నకుండేవు 


నిర్లక్ష్యం చేయలేని స్థితికి మారుతావు, 

దేహాన్ని కదలించ లేక 

 విశ్రాంతిగా మారిపోతావు.

స్వర్గ సీమాలో చేరిపోతావు.

*****

*ప్రేమికుల రోజు శుభాకాంక్షలతో*.. కొత్త పాట 


ఓహో ప్రేయసి అందుకో అనందపు రాశి 

ఈ ఆదర్శ అధరామృత పిపాసి 

నాలో నీవై నీలో నేనై ఏకంతాల హృదయపు రాశి 

ఓహో ప్రేయసి అందుకో అనందపు రాశి


చరణం.

నా కొరకే బ్రహ్మ సృష్ఠించిన 

     నా అదృష్ట దేవతవు 

ఎన్నెన్నో జన్మల బంధమైన 

    నా అనురాగ దేవతవు 

నా ఆలోచనలకు ప్రాణం పోసే

  నా అక్షరాల ఆకృతివైనావు 

ఉదయ సంధ్యలు నిను స్మరించే

           నా ప్రేమికురాలైనావు 

ఓహో ప్రేయసి అందుకో అనందపు రాశి 


నా బతుకు గమనంలో వెంటుండే 

        నా జీవన వేదంమైనావు 

నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు ఊతమైన

 నా ఊపిరి వైనావు          

 ప్రేమిస్తున్నా.. 

నిను నా ప్రాణంకన్నా మిన్నగా! 

హృదయంలో నిండి పోయావు 


ప్రేమనిస్తా.. ప్రేమే కుళ్ళు కొనేలాగా! 


ప్రేమిస్తా.. 

నిను నా ఆయువు ! ఆగినంతదాకా


ప్రేమిస్తూనే ఉంటా.. 

నాకు మరుజన్మ లేనంతదాకా.!!                         

*ప్రేమిస్తూనే ఉంటా.. **

 *ప్రేమకై తపిస్తూ ఉంటా*


ఓహో ప్రేయసి అందుకో అనందపు రాశి 

ఈ ఆదర్శ అధరామృత పిపాసి 

నాలోనివై నీలోనేనై ఏకంతాల హృదయపు రాశి

ఓహో ప్రేయసి అందుకో అనందపు రాశి


*తెలుగు తల్లి ఆవేదన*


ఏ దారం లేకుండ ఎగిరే'నా హృదయమా 

చూడ'లేని వారికి చూప గలిగేటి తరమా 


మేఘాల వస్త్రము చాటున మురిపమా

గుండెపోటు గగనమై గుర్తుగా మందహాసమా 


మధురిమలే పెంచి 'నా మన్మధ లీల గాయమా 

కన్ను పోటు కోరి వెన్నుపోటు మంత్రాంగమా


కిరీటాన్ని తుంచె 'నా కీర్తియనగా తంత్రమా 

ప్రేమవిలువ తెలియలేని మూర్ఖుని దాహమా 


చదువులెంత అద్భుతమో

యువతలోని పనితనమా 

 నిర్వీర్యత కాల్చ' విషమ గమనమా 


యుద్ధానికి దిగుతున్న ఫలితము సూన్యమా 

స్నేహానికి చిరునామా చూపే' విధి మార్గమా 


ప్రశ్నించే హక్కుండీ చేతకాని తనమా 

లాభమేమి ఒరిగిందోయ్ తెలియని మొహమా 


జవాబుదారీ తనమే బ్రతుకు పనితనమా 

సంయమనం ఎంతవరకో తెలుపుమా 


పగలగొట్టవలనన్న పెద్ద బండను

ఒంటిలోన నుండవలె గొప్ప బలమా 

విరచవలెనన్న లోని మనసును

అనకూడని చిన్న నోటి మాట చాలు నేర్పతనమా 


బండనైనా అతికించగవచ్చు

కానీ..విరిగిన మదినతికించ సాధ్యమా 

పెదవిదాటిన పెన్నదాటను సూక్తి సత్యమా 


దొర్లినమాట వెనకురాదు తెలుసుకొన లేమా 

నోరు మంచిదైన ఊరు మంచిదగుట నిజమా 


పారేసుకోకు నోరు సమస్యలు తెచ్చుకోకు సమంజసమా 

అర్థమేదొ మారిందా భగవద్గీతకు అద్ద మా


మగువలపై మగవాని అహంకారమా 

తెలుగు భాషపై ప్రభుత్వాలు ఉక్కు పాదమా


By. మల్లాప్రగడ రామకృష్ణ, 

6281190539

కొత్త పాట.. నీవేలే )(7) మల్లాప్రగడ 


ఎప్పుడు ఎప్పుడో అన్న మాట కాదులే 

 ఇప్పుడిప్పుడే అనే మాట అవునులే

 అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిన్ను మరవలేని మాటలే


 వెచ్చని ఊపిరికి నీ పరిమళాలు తాకిలే

 ఉదయభాను కిరన్నా లా గుచ్చుకునే నీ చూపులే

 చిగురాకుల మెరిసే నీ పెదవులే

 ఆకు పై బిందువు లా నీ నుదురులే

 గిలిగింతలు పెట్టే నీ నవ్వు మోములే... ఎప్పుడు..


 క్షణాలన్నియుగాలైన వేళ నీ పిలుపులే

 పెదాలు మూగబోయిన వేళ అధరాలు అందించు లే

 మరుపురాని జ్ఞాపకాలు గుర్తు చేయు లే

 నిన్ను నన్ను సున్నితంగా మీటే చిరుగాలిలే

 ప్రతిక్షణం నా హృదయాన్ని కదిలించే  దానివి నీవేలే...


నల్లని కురులలో తెల్లని మల్లెల మాలలే 

పుత్తడి మోముపై తెలతెల్లని వలవలే 

కరముల కున్న వజ్రపుపుత్తడి మెర్పుగాజులే 

నవ్వుల పెదాల మెరపుల మగువలే 


ఎప్పుడు ఎప్పుడో అన్న మాట కాదులే 

 ఇప్పుడిప్పుడే అనే మాట అవునులే

 అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిన్ను మరవలేని మాటలే


కొత్తపాట.. అమ్మలుగన్నమ్మ (6)మల్లాప్రగడ 


పల్లవి.

కలగంటినే నమ్మాకలగంటినే

కలలోన నీ కథలునే వింటినే 

కలలోననీరూపునే నే గంటినే 

కలలోన నీ పలుకునే వింటినే  ||2|| 


నీచరణ ధూళికి నే..తగునంటినా 

కోవెలలో కొలువైన దైవం నీవేనమ్మా .. 

కోరుకున్న వరాలు తీర్చే దైవము నీవమ్మా.... (కోవెలలో...)


నా దైవం నీవేనమ్మా, మమ్మాదుకునే 

అమ్మలూగన్న అమ్మవు నీవమ్మా 

 

బుడిబుడి కీర్తనలు పాడితిని 

పలుకే పంచిన అమ్మను వేడితిని  

అమ్మా పరమార్ధాన్ని గ్రహించితిని 

నేర్పిన ప్రధమ గురువు నీవేవైతివి 


కష్టము నందు  సహనము నేర్పి 

పలుకు పదములు గుట్టును నేర్పి 

ఎల్లరి ముదమున మన్నన నేర్పి 

హృదయంలో శాంతిని నింపిన అమ్మవు గదమ్మా

(కోవెలలో...)


పాకులాడిననెంతగా.. 

తాపత్రయపడిననెంతగా.. నమ్మా 

నీదిగానినేదియూ

నీతో కుదరని ఏ బంధమూ లేదమ్మా 

నీకు దక్కదు నీతోనుండదు. అని చెప్పితివమ్మా 

(కోవెలలో...)


వద్దనుకున్ననెంతగా.. 

దూరముంచిననెంతగా.. నమ్మా 

నీదైనదేదియూ 

నీతో ముడిపడిన ఏ అనుబందమూ 

నీకు చిక్కును నిను వీడకుండును.నేనమ్మా 

(కోవెలలో...)


చిత్రమిది సత్యమిది

అబ్బురమిది దైవ నిర్ణయమిది.

అదేనమ్మా లోకరీతి గదమ్మా 


కలగంటినే నమ్మాకలగంటినే

కలలోన నీ కథలునే వింటినే 

కలలోననీరూపునే నే గంటినే 

కలలోన నీ పలుకునే వింటినే  ||2||

** 

కొత్త పాట.. యేది భక్తి (5)


ఎవరికెవరు యీ లోకంలో

ఎరుక నెంచి మెసెగ గల వారేరి?

ఏభాష? యేదరి? యేమాయ? యేవిధి? ఎరుకలేరు యీ లోకంలో


ఎవరు ముందో? యివరు వెనకో? యేది నిజమో? యేది యబద్ధమో? ప్రయాణాలు తారుమారు యీ లోకంలో 


ఎవరికెవరు? యే బంధమెన్నాళ్ళో? యేకష్ట మెన్నాళ్ళు? యే సుఖమెన్నాళ్ళు ? అనురాగ బంధాలు యీ లోకంలో 


ఋణమున్నంతవరకే అనుబంధమంతా

ఏది నీది? యేది నాది? యేది చదువు? యేది భక్తి యీ లోకంలో


ఊపిరున్నంతవరకే వ్యామోహమంతా

ఏది వాస్తవము? యేది బూటకము? యేది న్యాయము? యేది యన్యాయము? యీ లోకంలో


కాలము సమాధానము చెప్పునంతా

ఎవరు హితులో? యెవరు దుర్మతులో? యెవరు స్వతంత్రులు? యెవరు యస్వతంత్రులు యీ లోకంలో


మాయ తొలగిన తెలిసేను నిజమంతా, అభూతకల్పనా 

ఏది సత్యమో? ఏది శాశ్వతమో? యీ లోకంలో


ఎరుకగలిగిన వేదాంతము తెలుపునంతా అర్ధము ఎంతవరకు, ఆనందం ఎంతవరకు 

ఏది సంతృప్తి? ఎక్కడ ప్రశాంతత? యీ లోకంలో


ఆశాపాశాలు వీడక? బోధపడక?

ఏది ఆత్మానందమో తెలియక? యేది జన్మ సార్ధకత?

ఏది ఆరోగ్యం? యేది వైరాగ్యం? యీ లోకంలో


ఎవరికెవరు యీ లోకంలో

ఎరుక నెంచి మెసెగ గల వారేరి?

ఏభాష యేదరి యేమాయ యేవిధి ఎరుకలేరు యీ లోకంలో

కొత్త పాట.. కన్నీరు (4)


ఏమని చెప్పేది? ఎవరు అని చెప్పేది? కన్నీటికి కారణం ఏ దనేది? పరిష్కారం కాలమనేది.


 కన్నీరు చిమ్మని కన్ను లేవి 

 వ్యధ చెందని  గుండె లేవి 

 ప్రేమకు లొంగని బుద్ధు లేవి 

 సత్యము తెల్పెడి బ్రత్కు లేవి 


 కన్నీటి విల్వకు మది యేది 

 సన్నీలు వెనీళ్ల కళ యేది 

మున్నాళ్ళ ముచ్చట స్థితి యేది 

చిన్మాయ శాంతించు గుణమేది 


 నొప్పి పడ్డ మతి కన్నీరు 

 చెప్పు కోని విద్య కన్నీరు 

 అప్పు చేయ బుద్ధి కన్నీరు 

 తప్పు చేసి బాధ కన్నీరు 


వొలికేది కన్నీటీ బరువు వలపల్లె చిందేటి తనువు 

చలనమ్ము కన్నీటి మెరుపు చెలిపోందు సుఖమంత చెరువు 

వలలోన కన్నీటిమరుపు వలపించి బ్రతుకంత తరువు 

అలలుగా కన్నీటి పరుపు అలకలు తీర్చేటి తెగువు


రాబడి కన్నీటి కారు రసరమ్య జీవిత తలపు 

నెపమాయె కన్నీటి తీరు నేస్తమ్ము సౌఖ్యమ్ము పిలుపు 

ఉపకార కన్నీటి యేరు యున్నత భాష్యమ్ము మలుపు 

అపకార కన్నీరు వేరు ఆత్రము జుపేటి తెలుపు


ఏమని చెప్పేది? ఎవరు అని చెప్పేది? కన్నీటికి కారణం ఏ దనేది? పరిష్కారం కాలమనేది.

కొత్త పాట.. దేవుడు (3)


మనసు కన్నను వేగపరుడు, 

మనసు శాస్త్రమురచయితలె 

మనసునందుoడెడి వాడు, 

మనకు వీర్యమెపంచు వాడు

మనకు నగ్నిని పంచు వాడు, 

మనలోన వాయువతడులె

క్షణ సుఖము హవిస్సుయతడు, 

క్షామాన్నిమార్చు దేవుడులె


కాల రూపము గల వాడు 

కార్యసాఫల్య పరుడులె

జ్వాలసృష్టిపర దేవరడు 

ఛాయామయమ్ముగా ధరుడు

మూలము తానైన వాడు 

ముఖ్య పరంధామ పరుడు

నాలుగు దిక్కులై నాడు 

నయనాల వాసుదేవుండు


గొప్ప సైన్యము గలవాడు 

కోర్కెలు తీర్చేడి వాడు

వప్పచెప్పెగల దీక్షగలడు 

వాక్కుతో జయిoచువాడు 

అప్పులేని మహాత్ముడతడు 

ఆశ్రిత రక్షణా పరుడు 

నిప్పు గాలి జలము నతడు 

నీడనివ్వ స్వేచ్ఛ పరుడు


ప్రకృతిగా తానైన వాడు 

ప్రకృతి పరంధామ పరుడు 

సుకృతి కలుగ జేయువాడు 

సుకృతి పరమేశ డతడు

ప్రకృతి ఆనందమే నతడు 

ప్రకృతి ప్రభావం గానతడు 

వికృతి నాశన పర్చు వాడు 

వికృతి మార్పునుకోరువాడు


కొత్త పాట.. లోకం తీరు (2)


ఇదే ఇదేలే కళల ప్రపంచం 

అందరి హృదయాల్లో నింపిన అగమ్య గోచరం 

పంచభూతాలతో జరిగే వ్యాపారం 

అర్ధo తో మధ్యనలిగే జీవిత సారాంశం  


కలలు తీర్చు కాలమే ఇదియేనా 

 పలుకులన్నీ బవ బంధాలకు మార్గ మేనా 

 ఉన్నది లేదని, లేనిది ఉందని, చింతల బ్రతుకేనా 

 నిజా అబద్ధాల మధ్య, సుఖదుఃఖాల మధ్యా , 

నలిగిపోయే జీవితమేనా....   ... ఇదే.. ఇదే 


జగతికి వెలుగును పంచే సూర్యుని మరిచే లోకం లోనా 

తల్లితండ్రులను, గురువులను, తప్పుగా,

 చూసే మనుష్యుల మధ్య నా 

 ఒక్కతారతో సుఖం పొందక జాబిల్లిలా 

వేల తారల మధ్య సుఖ మేననా 

 విద్యను వినయంగా బోధ చేయక 

విద్యా గర్వం తో పలుకు లేనా..... ఇదే.. Ide


 జలాల మధ్య కలువలగా నుండక 

సంద్రంలో ఎగిరే పక్షిలా ఉండాలనుటే యేలనా 

 మంచితనంతో మానవత్వం బతికించక,

 రాక్షస బుద్దితో మూర్ఖుడుగా మారుటేలనా 

కాంతా కాంచనములోని వెలుగు చూడక, 

రంగు రాళ్లలో రత్నాలు ఏరుటేలనా.... ఇదే.. ఇదే.


 ధర్మాన్ని విస్తరించి సత్యం పలకక, 

అధర్మాన ఆదరించే ధనముపై కోర్కేలనా 

పాపపుణ్యాలు మరచి ధ్యానములో నుండక, 

విద్యాగర్వముతో ప్రశ్నలు వేయుటే లన


మాటల విలువలు తెలియ పరిచాక,

మన దురదృష్టం తెలిసికొని ఆచరించ పోవు టేలనా 

నమ్మకమే మోసమైన, ఆలోచనే ఆలస్యమైన, 

గౌరవాన్ని కోల్పోక, 

ధనమే దైవమని శత్రువుగా మారుటేలనా 


ఇదే ఇదేలే కళల ప్రపంచం 

అందరి హృదయాల్లో నింపిన అగమ్య గోచరం 

పంచభూతాలతో జరిగే వ్యాపారం 

అర్ధoలా మధ్యనలిగే జీవిత సారాంశం


కొత్తపాట (ధైర్యాన్ని నింపే ) (1)


ఓ వీరుడా, ఓ ఓ ధీరుడా, కల్లు తెరచి నిజం తెలుసుకో

శ్రీ కృష్ణుడిలా శంఖం పూరించు, అర్జునిడిలా అధర్మాన్ని ఎదిరించు

మానవత్వాన్ని బ్రతికించుటకు ధైర్యముగా ముందుకు సాగిపో సాగిపో


సత్యం పలకని చోట, ధర్మం గెలవని చోట

న్యాయం నిలవని చోట, నివే ధైర్యంగా చేయాలి వేట


నిన్ను నీవు రక్షించు కోవటం కాదు

నమ్మిన సిద్దాతాన్ని బ్రతికించటం నేర్చుకో

అవసరాన్ని బట్టి, ప్రకృతిని బట్టి మారుట నేర్చుకో

క్రూరమ్రుగాలను, కిరాతాకులను వేటాడుట తప్పదే 


ఓ వీరుడా, ఓ ఓ ధీరుడా, కల్లు తెరచి నిజం తెలుసుకో

మానవత్వాన్ని బ్రతికించుటకు ధైర్యముగా ముందుకు సాగిపో సాగిపో  సాగిపో సాగిపో


కలికాలంలో దుర్మార్గానికి ఎవ్వరూ బలి కాకుండా ఆదుకో

ప్రతిఒక్కరి మనసును మార్చుటకు వెయ్యాలి కొత్త వేషమే 

తప్పదు తప్పదు అనుకుంటే చెయ్యాలి కత్తుల వేట


తప్పో ఒప్పో తెలియదు ఆనాడు కృష్ణుడు కురుక్షేత్రంలో ఆడిన ఆట

నీవే చేయాలి ఈనాడు దుర్మార్గులపై రణక్షేత్రంలో వేట

హృదయాలలో నిలిచే మాటలతో ఆనందం, ఆరోగ్యం కలిగించే ఆటలతో ఆదర్సుని లా జూపించు బాట 


ఓ వీరుడా, ఓ ఓ ధీరుడా, కల్లు తెరచి నిజం తెలుసుకో

శ్రీ కృష్ణుడిలా శంఖం పూరించు, అర్జునిడిలా అధర్మాన్ని ఎదిరించు

మానవత్వాన్ని బ్రతికించుటకు ధైర్యముగా ముందుకు సాగిపో సాగిపో

--((*))--

Saturday, 28 December 2024

 

సం.. సా.. సం.. కవిత్వం 


* తే... సంగమిస్తూనె నేనుగా సర్దు సలిపి

సుఖమను దుఃఖ కళలను సూత్ర మాయె

చరిత చెప్పిన విధముగా చప్పరింత

చనువు ఏకమై సంబర చేష్ట లుడికె

.........


సుఖమను దుఃఖ సూత్రముయు చూపులమాయ ఫలమ్ము సౌఖ్యమున్ 

వికసిత భావ లక్ష్యముయు విద్దెలతీరునుమార్పు చేరుటన్ 

మకతిక మర్మజీవమగు మార్గము శోభన పర్వమేయగున్ 

సకలము కర్మలేయగుతయు సాక్షిగ జీవనయాత్ర బంధమున్ 

......

తే..కవి హృదయము ద్రవించెను కావ్యమగుటె

సవ్వసాచి గా శృంగారం సమయ మందు

హృదయ వాంఛల కలయిక హాయి గొలుపె

చిక్కు కున్న ముసుగులో న చీకు లొలుకె

......


కవి హృదయమ్ము కావ్యమును కాలము బట్టియువ్రాయు సౌఖ్యమున్ 

భవిత సమమ్ము గాంచుటయు భాగ్యము నిచ్చెడి పద్ధతీ గతిన్ 

రవి సహజమ్ము చూపులగు రమ్యతకూర్చ విధానమే యగున్ 

యువ మధురమ్ము చెంతసుఖమూ ప్రభవమ్ము గనౌను ప్రేమయున్ 

.....


* తే.. మృదుమధుర వాత్సాయన మందహాస

మగువ మగనితో కలియుటే మన్మధ కేళి

చిరునగవులతో చిందులు చిత్ర మాయె

ఊహ కందని స్వర్గము ఉట్టి పడుట

......

మృదు వాత్సాయన మందహాసమదియే ముఖ్యమ్ము జీవమ్ముగన్ 

మదనాతీర్పుయు మన్మధా కళలుగన్ మానమ్ము సౌఖ్యమ్ముగన్

వ్యధ చిందుల్ చిరుచిత్రమున్ యానుమతీవాక్కుల్లె సంతోషమున్ 

మదియూహల్ కళ స్వర్గమున్ వయసుగన్ మానమ్ము సంతృప్తిగన్ 

......

* తే ..సలప రింపుల సల్లాపం సాగి సాగి

జిహ్వ చాపల్య కళలన్ని జైత్ర యాత్ర

అంత రంగాల ఆరాట ఆలుమగలు

ఆశ పాశమై ఆనంద అలుక గెలుపు

......

సల్లాపమ్ముగనే సాగి సమరమ్ సాధ్యమ్ము నిత్యమ్ముగన్ 

కల్లాలా యగుటన్ జిహ్వ మలుపుల్ కార్యమ్ము గానిత్యమున్ 

ముల్లోకాలన తీరు విద్దెలవే ముఖ్యమ్ము చాపల్యమున్ 

చల్లారింప మదీసమమ్ము కళగన్ చాతుర్య శృంగారమున్ 


.......


వేసవికాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వీస్తావే 

 వర్షపు కాలం జల్లుల్లాగా కొంచెం కొంచెం తడ్పేవే 

 తరిమే తుంటరి తుఫానులా చుట్టేయచ్చుగా

 దరువే తప్పదు సుధామయీ చుట్టేయొచ్చుగా 


మదనార్తి తీవ్రతకు మందేమిటిటయ్యా?

 ఏముంది ఆలింగనం మందు, 

అదర చుంబనం అనుపానమూను 

 ఆదర్శ కలయకే ఆత్మీయం 


పంచ శరు బారికి చిక్కితి నీకు దక్కితి 

యెంచ గను చేరితి నక్కియు నీకు మొక్కితి 

వంచనను జేయక మక్కువ మీకు చూపితి 

సంచిత మమస్సును యెక్కువ మీకు పంచితి


శా.లోకంలో ననె మన్మధాకధలుగన్ లౌక్యమ్ము జూపే కళల్ 

లోకంలో వలపింతురే మధవతుల్ లోలత్వ భగుల్ కళల్ 

లోకంలో చెలి తేట లేనగవుగన్ కోలాట హాస్యా కళల్ 

లోకం లో భవ బంధ కుందువగనున్ కోపమ్ము జూపేకళల్


సకల చరాచరమయ జీవాళి నెల్ల 

సకలము కామ మయము దివ్యాతి దివ్వె 

మకుటముగాను వలగతి ఖ్యాతి భవ్య 

మొకటవ విద్య ప్రణితము తీవ్ర దృష్టి


పతి లేనీస్థితి కోర్కెలే గతిగనే పాఠమ్ము నేర్పే విధిన్ 

గతి వేషమ్ముమనస్సువడియే గమ్యమ్ము తెల్పేందుకున్ 

మతిలేకేనిజమున్ సుఖమ్ము కళలే మాయల్లె వెంటాడుటన్ 

రతికై రమ్మనె యాత్మ సోదరుని నారాటంబు గన్పట్టగన్


గుండెలో నిదురించే వలపంటే ప్రేమేగా 

 మొండిగా చెలి గాలి పిలుపంటే  ప్రేమేగా 

చండిగా పలుకంటే సహనమ్ము ప్రేమేగా 

 దండిగా దరువైన సుఖమాయ ప్రేమేగా  


ఉ.విన్నది చూపు కల్పనలు వెన్నెల నీడన కోర్కె ప్రేమగన్ 

కన్నియ మీద నా వలపు గాధము కూరుకు రాదు రేయి నా 

కెన్నడు గానమే మలువు క్షేమము నూరక యుండ లేక నా 

మన్నన జూపగా వలపు మార్గ పసందును తెల్ప గల్గగన్


*తే ..మొసుకు వచ్చెపల్లకిలాగ మొత్తుకొనక

ప్రకృతి ఒడిలో న మలుపులు పద్ధతి గాను

ఋతువు లు పిలుపు పొందుట ఋణము మల్లె

దాని కొరకేను కౌగిలి దరయు నీతి

........

మోసెను పల్లకీ మనసు మోత్తుకొనంకయు గాలిలాగగన్ 

ప్రాసలు కల్పసాగ కళ పాశము మాదిరి యూగ సాగగన్ 

మోసము లేని మోత కళ మోక్షము జూపెడి యవ్వనమ్ముయున్ 

ఆశల కొగిలే కరిగి యచ్చట ముచ్చట తీర్చ గల్గగన్ 


*తే... రాగ యనురాగ కళలన్ని రాటు తేలి

సరిగమల సుధ సహకార సమయమందు

సమరమే సంగమమై కళ సాక్షి యగుటె

నవ్య జీవితమునకు యే నాంది పలుకె

.......


చం.సరిగమలౌనుదున్నుటకు సాగెడి పంటకు నీరుచేరుటన్ 

పరిపరిగాలిశోక సహపాఠముతో కదలేను హాయిగన్ 

పరువపు లీలహేలగను పాదమునెంచియుయూగ సంగతిన్

చిరునగవేమనోమయముచిత్తముచేర్చ శుభంబు చేర్చగన్ 


*తే ...పూల పాన్పుల పైజంట పూర్తి కసియె

ఇచ్చి పుచ్చుకొనుట ముద్దు యీప్సితమగు

పంచు కొనె పరువపు లీల పలుకు హేళ

చిన్మయానంద శృంగార చిరుత పులియె

.......,

ఉ.పూర్తిగ పూలపాన్పు వశ పుణ్యపు జంటల ముద్దు ముచ్చటల్ 

స్ఫూర్తిగ యిచ్చిపుచ్చుకొను సూత్రపు సోకులు యీ ప్సితమ్ముగున్ 

కార్తిక వైభవమ్ముగను కామపు హేళ యు చిద్విలాసమున్ 

ఆర్తిగ పొందు సౌఖ్యమగు హాయిని గోల్పెడి యాటకౌగిలిన్

సం.. సా.. సం కవిత్వం 


తే

తే. గీ.మానవత్వపు సేద్యము మనసు నందు

మంచితనము గా మమతలై మనుగడకు లె

గుండె తడి ఆరకయె సాగు గుళ్ళ యగుటె

మనిషి తనముగా మహిమయై మంకు పట్టు

........


ఉ.మానవ సేధ్యమున్ మనసు మంచిని బట్టియు మార్గమేయగున్ 

మానము పంచబుద్ధిగను మాధురి పొందుట మంకుపట్టుగన్ 

మౌనము సాగుగుండెతడి మౌఖ్యమనంద శుభమ్ము కూడికన్ 

ధ్యానము సాగుగుళ్ళుయగు దాపరికమ్మగు వత్తిడేయగున్


*తే ..మనిషి కి మధుమాసముననే మధుర ఫలము

తాపము కు వసంతము గాను తల్ల డిల్లి

ప్రకృతి ఫలరాజ మగుటయే పండ్ల నందు

మామిడిది రాజస మధురం మనసు పంచు

...

మ. మధుమాసమ్మున మానసం యురకగా మాధుర్య మొoదేం దుకున్ 

విధితాపమ్మగు తల్లడిల్లిశుభమున్ విందార పండ్లు సొంతమున్ 

పదునైనా మది రాజసమ్ము సుఖమున్ ప్రాబల్య సంతోషమున్ 

నిధి కామమ్ముయు నిత్యసౌఖ్యమగుటన్ నిర్మల్ సు శోభల్ గతీ


తే ...సిగ్గుశరము లేనిది ప్రేమ సేతువగుటె

ఇష్టమైన కష్టముగాను యింతి తోను

కధలు కావులే జీవితం కాల మాయ

ఎంత తిన్నాతరగనిదే ఏలు ప్రేమ

........


ఉ.సిగ్గు శరమ్ము లేనిదగు ప్రేమల సేతువు కాపురమ్ముణన్ 

సిగ్గుతొ యిష్టకష్టములు యిన్తికి తప్పని దైన సౌఖ్యమున్ 

భగ్గుణ జీవితమ్ కదిలె బాధ్యత బంధము కాల మాయగన్ 

నెగ్గుకు వచ్చుప్రేమకళ నేతిగ గారెయు యిష్టమేయగున్


సం.. సా.. సం 


ఉ.నీ సహచర్యసంగీతకళ చిత్తతరఁoగము తట్టిలేపగన్ 

నా సహవాససందడితొ నన్నుగ నుంచక సంతసమ్ముగన్ 

నా సహ వాక్కుసర్వమను నమ్మక కోరిక తీర్చగల్గగన్ 

నా సహనమ్ము ప్రేమకళ నానుడి నిత్యము వైభవమ్ముగన్(1)


చం వన తరు వల్లికామదియు వాలుగ జూప గ నేస్తమాయనే 

ఘన దరి జేరి వాక్కులగు ఘాటుగ జిహ్వము జూప మాయగన్ 

స్థనభరితమ్ము యాయుధము సంధిగ కూడికకోరి చేరియున్ 

క్షణసుఖమైన యుద్ధమగుక్షామము తీర్చియుశాంతి మోక్షమున్   (2)


చం.కుసుమము లొల్లి వాసనను కూడియు శైలగ కన్యకామణిన్ 

పసయను వాడి నాడిగను పాఠ్య ఘనస్తనమేను వేణికన్ 

రసికత జూప సంగమము రాశిగయెక్కి సుఖమ్ము వేదికన్ 

పసగతి పొంద పాడియగు పాలనమేయగుతీరు యేలికన్ (3)


శా.సౌందర్యానికి వన్నెతెచ్చు మగువే సౌకర్య నేస్తమ్ముగన్ 

మాధుర్యానికి వన్నెతెచ్చుతెగువే మంత్రమ్ము గాప్రేమయున్ 

విందేపొందుగనున్ సుధామధురమున్ విశ్వాస సామర్ధ్యతన్ 

పందెమ్మున్ గెలుపోటమేను మహిళా ప్రాధాన్యతా సౌఖ్యమున్

Friday, 27 December 2024

 

నేటి చందస్సు పాఠము 


నిత్యము నీదయ నిర్మలమేయని సుధామనసవ్వ కలగానే 

 సత్యము తెల్పెద సాక్షిగ నీవు సమరమ్ము గనౌను కలగానే 

ముత్యపు మెర్పుగ నుండగ ముఖ్యము సమమ్మును చెంద కలగానే 

 పత్యము చేసియు సంతస సాదు పలుకౌను సుఖమ్ము కలగానే 


లక్షణభూషిత తుండయి భావ లయ లక్షణహేల కలగానే 

కక్షన భిక్షను పెట్టుత కర్కశము గాను శుభమ్ము కలగానే 

రక్షణ కల్గెను మాకును రంజక భావమ్మగు జీవ కలగానే 

శిక్ష నొసంగుట వాడెడిక్షేమ చెరితమ్ము విధమ్ము కలగానే


కాలము నీదయ కావ్యము నీది కళ లౌను జయమ్ము కలగానే 

జ్వాలలు కమ్మిన జాతర నీది జతగాను సుఖమ్ము కలగానే 

 మూలము నుండియు ధర్మము ముఖ్యము లయమ్మ భయమ్ము కలగానే 

 పాలన నీదియు పాలన నీది య యెతృప్తి సమమ్ము కలగానే 


 నవరాగము. భ భ భ భ  జ జ స గ

******


అద్దపు చూపుల ఆశలు దేనికీ 

 వద్దని మాటలు వాదన దేనికీ

 సర్దుకు పోదము సప్పుడు చేయకే

 

దుఃఖపు దారిన దూరుట దేనికీ 

 దక్కిన దానిని దాల్చక దేనికీ

తక్కువ యెక్కువ తప్పులు చేయకే 


 నిప్పుల మాటున నీరుగ దేనికీ 

 తప్పులు చేయుట దాహత దేనికీ

 నొప్పులు  నున్నను నోములు దీనికే 


 వాడిన వాటికి వాంఛలు దేనికీ 

 వీడిన చోటున వేషము దేనికీ

కూడిన కష్టము కూడిక దేనికే 


 పంతపు చూపుల పాఠము దేనికీ 

 శాంతము ఓపిక శాపము దేనికీ

 పొంతన చూపక పాఠము దేనికే 


 మౌనపు మార్గము మర్చుట దేనికీ

మానము మీరుత మార్గము దేనికీ

 జ్ఞానము నీదయ గర్జన చేయకే

UII UII UII UIU

**** 

నేటి హృదయ రాగము 


వీణపై నవరాగాలు పలికించనా 

మేనుపై సుమరాగాలు కురిపించినా 


నీటితో భవరోగాలు తొలిగించినా 

త్రాటిపై సుమయోగాలు జరిపించినా 


ఓ చెలీ ఓ హో చెలీ 


గాలితో హృదయాంతాలు తెరిపించినా 

జాలితో చిరుహాసాలు కలిపించినా 


వీధిలో నను తోయకే గెలిపించవా 

బాధలో నను ముంచకే మురిపించావా 


ఓ రాజ ఓహో రాజ


ఎదలోయలో కొలువైతివే మరిచేదెలా 

కథరోచ్చులో తెలుగైతివే కలిచేదెలా 


వదిలేయకే  కోమలీనువే సుఖ మివ్వలా 

పదిలమ్ముగా జాగృతీ విధి నవ్వలా 


ఓ చెలీ ఓ హో చెలీ 


సంధ్యలో శశిబింబమై పిలిచానుగా 

విద్యతో వినసొంపుగా పలికానుగా 


మాసమే మన కోసమై అరుదెంచెనే 

మౌనమే యిక యెoదుకే దరి నుంటినే 


ఓ రాజ ఓహో రాజ


చేరగా అనుమానమా కరుణించవా 

నెరుగా కను సైగలే గమనించవా 


తోటలో వన రాణివై అలరించవా 

 మాటతో మన హృద్యమై పలికించవా 


ఓ చెలీ ఓ హో చెలీ 


బంధమే నిలిచేనుగా యికనమ్మవే  

చిందులే యిక యేలనే యిక మానవే 

 

కడదాక తోడుగ నీడగా నడిపించవా  

పడి లేచి వీడకే దగ్గరే మురిపించినా


ఓ చెలీ ఓ హో చెలీ 

ఓ చెలీ ఓ హో చెలీ 

ఓ రాజ ఓహో రాజ

ఓ రాజ ఓహో రాజ


మల్లాప్రగడ రామకృష్ణ


నా బాల్యము.. సీస పద్య మాలిక 


పూరిల్లుమాదియు పుల్లలు రాలుచూ 

పుడమిన బురదగా పురుడు పోయ 

బుడతగా యాటలు బుద్దిగా మట్టితో 

బంధమనేదియు పాఠమవగ 

లోకము నెటుజూడ శోకమే కన్పించు 

భిన్నప్రజలమధ్య భీతి గున్న 

అమ్మనెపుడు నేను ఆశ్చర్య పరిచె ద 

అమ్మ మాటలకునే నాడు చుండ 

నాన్న మటుకు చూపు నమ్మబలుకులౌను 

పరుగుదీసెద బండి పాట బట్టి 

గాలిపఠములనే గలగల యగరేసె 

గోళి లాటలు జూడ గొప్ప గుండె 

చెడుగుడు నాయాట చిరునవ్వు తెప్పించ

అష్టచెమ్మగనులే ఆట యాడ 

చదువుయన్న కినుకు చెప్పక తిరిగాను 

హృదయాల సందడే హాయి గొలిప 


తే. గీ. మరల రాదు బాల్యము చెప్ప మార్గ మిదియు 

ఎంత చెప్పిన తక్కువే యెంచ లేను 

బాల్య సంబరాలు గనుమా భావ మిదియు 

అట్టి రోజులు గనలేను ఆశ మదిలొ 


మల్లాప్రగడ రామకృష్ణ

-****-

నేటి ఛందస్సు పాఠము దేవరా 


కాలమ్ము నీదేను కావ్యమ్ము మనసులో 

లీలౌను నీదారి దేవరా 

మూలమ్ము నీవేను ముఖ్యమ్ము వయసులో 

నేలౌక్యమే పూజ దేవరా 


 దేవాది దేవు డవైనావు యుగములో 

సేవించ వచ్చాను దేవరా  

సేవే నిజమ్మగు ని భక్తి వయసులో 

ప్రావీణ్య ముంచాను దేవరా 


నిత్యమ్ము నీమనసైనాను వయసులో

సత్యమ్ము చెప్పేది దేవరా 

పత్యమ్ము నీకొరకేనేను  వయసులో 

పత్యమ్ము లేకున్న దేవరా 


వ్యాసుండు వ్రాసెను గ్రంధాలు వయసులో  

దోసమ్ము లేకుండ  దేవరా     

భాసిళ్లు భారతి వేదమ్ము వయసులో   

వ్రాసేను నిత్యమ్ము దేవరా 


హంగుళ్లు చూపెను సంతోష వయసులో 

రంగుళ్ల భావమ్ము దేవరా 

భంగమ్ము సేయక భాగ్యమ్ము వయసులో

చెంగావి లక్ష్యము దేవరా  


దేవరా :: త .. భా త న మ య జ గు

*-----**

నేటి ఛందస్సు పాఠము..3


ప్రేమమ్మగునా నిష్పేయముగా 

ప్రేమమ్మగునా కాసారముగా 

ప్రేమమ్మగునా సందేహముగా 

ప్రేమమ్మగునా సమ్మోహముగా 


దాహమ్మగునా దాంపత్యముగా 

మొహమ్మగునా మోక్షత్వముగా 

దేహమ్మగునా ధాత్రుత్వముగా 

స్నేహమ్మగునా నేత్రుత్వముగా 


రాగమ్ములతో యోగమ్మగునా 

భోగమ్ములలో భోజ్యమ్మగునా 

రోగమ్ములలో భాగమ్మగునా 

యోగమ్ములలో యోగ్యమ్నగునా 


నామానసమే గాజేయగునో 

యే ముక్కలుగా నే రోజగునో 

నామార్గమునే కష్టమ్మగునో 

నా దేహముగా నష్టమ్మగునో 


సాగంగ సదా సమ్మోహనమా 

వేగంగ మదీ వైనమ్మమమా 

పోగాలములో మృన్వా హనమా 

భాగమ్ములలో విందారెదమా 


జ్ఞానా మదీయమ్మున్ కళలే 

నానా ప్రతాపమ్ముల్ కళలే 

ధ్యానా మనస్సమ్ముల్ కళలే 

ప్రాణాలు కర్మమ్ముల్ కళలే 


సుషమా.. త.. య.. భ. గ..


నేటి చెందస్సు పాఠము 1/1/2025 


కాలమ్ముయు నీదేయన కావ్యమ్మును నీవ్రాసే 

మూలమ్ముయు నీవేయగు ముఖ్యమ్ముగ నావ్రాతే 


తెల్లానివి నీవెల్గులు తెల్పాలని నేనుండే 

నల్లానివి నీచెడ్డవి నమ్మాలని నేనుండే 


యోగమ్ముయు నీవల్లన యోన్నత్యము నీమేలే 

రాగమ్ముయు నీదారియు రమ్యత్వము నీచూపే 


భోగమ్ముయు నీశాంతియు భోజ్యమ్ముయు యిష్టమ్మున్ 

రోగమ్ముయు  నీమార్గము కోపమ్ముయు నీమూలమ్


నానత్వము పోయేకథ యే కత్వము చేకూర్చే 

ఏకత్వమ్ము పోయేకథ ఆనేకము చుట్టూనే 


నేనిక్కడ నేకాకిని  నీవెక్కడ నున్నావో 

నానేస్తము నీవైతివి నీమాయలు యెన్నెన్నో 


యీనాడిక నీవేగతి యీ వేళయు సొంతమ్మో 

యేనాటికి కష్టమ్ములు యీజీవిత మంతమ్మో 



పూరేకు .... త  య  స  భ   మ.. UUI   IUUI ... IUUI IUUU

***

నేటి ఛందస్సు పాఠము.. గీత గాత్రం  2.1.


మేళయ్యె కాల మేదియో మేదారి స్వామీ 

జ్వాలల్లె కాపురమ్మూయో జాడ్యమ్ము స్వామీ 


కాపాడుమయ్యా మమ్ము దుష్కార్యమ్ము లెన్నో 

మాపాడు బుద్దే మమ్ము దున్మార్గమ్ము స్వామీ 


నీచేయుకర్మేలే విదీ కామ్యమ్ము గానే 

దోచేటి కాలమ్మే మదీ దొబ్బుచ్చు స్వామీ 


నీస్వేచ్చ ధర్మమ్మే స్థితీ నేమమ్ము లెన్నో 

నీసేవయేనాదీ నిధీ నేస్తమ్ము స్వామీ 


నీ మాయ చూపేలే గతీ నీమిధ్య లెన్నో 

నీ మార్గమే మాకూ గతీ నీతృప్తి స్వామీ 


దీపమ్ము వెల్గు జేయుమా దిక్సూచి నీవే 

పాపాలు మావి మార్చు మా పాఠ్యమ్ము స్వామీ 


నీ విద్యయే శంఖమ్ముగా నీమార్గ మేదో 

నీవిశ్వమే ధైర్యమ్ముగా నీ శక్తి స్వామీ 


లేదయ్యె  శాంతి ఎందుకో లేశమ్ము స్వామీ 

రాదయ్యె హాయి జీవమే వ్యర్థమ్ము స్వామీ 



దిక్సూచి.. త మ య ర  గ ( UUIU UUIU.. UUIUU





Tuesday, 27 August 2024

తెలుగమ్మాయి తెలుగమ్మాయి...కళ్లలో వెన్నెలే వెలుగమ్మాయి...

చిత్రం : మర్యాద రామన్న
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
రచన: అనంత శ్రీరామ్
గానం : ఎం.ఎం.కీరవాణి,గీతామాధురి

రాయలసీమ మురిసిపడేలా
రాగలవాడి జన్మ తరించేలా
ముత్యమంటి సొగసే మూటగట్టుకుంది
మూడు ముళ్ళు వేయమంది
తెలుగమ్మాయి తెలుగమ్మాయి
కళ్లలో వెన్నెలే వెలుగమ్మాయి
తెలుగమ్మాయి తెలుగమ్మాయి
అందుకోమన్నది నిన్ను తన చేయి

పలికే పలుకుల్ల్లో ఒలికే తొలకరి
ఇంట్లో కురిసిందో సిరులే మరి
నవ్వే నవ్వుల్లో తుళ్ళే లాహిరి
జంటై కలిసిందో కలతే హరి
హంసల నడకల వయారి అయినా
ఏడడుగులు నీ వెనకే
ఆశల వధువుగ ఇలాగ ఇలపై జారిన
జాబిలి తునకే

తెలుగమ్మాయి తెలుగమ్మాయి
కళ్లలో వెన్నెలే వెలుగమ్మాయి
తెలుగమ్మాయి తెలుగమ్మాయి
అందుకోమన్నది నిన్ను తన చేయి

గీతలే అని చిన్న చూపెందుకు
వాటి లోతులు చూడలేరెందుకు
నదిలో పడవలా వానలో గొడుగులా
గువ్వపై గూడులా కంటిపై రెప్పలా
జతపడే జన్మకి తోడు ఉంటానని
మనసులో మాటనే మనకు
చెప్పకనే చెబుతుంది
తెలుగమ్మాయి తెలుగమ్మాయి
గుండెనే కుంచెగా మలచిందోయి
తెలుగమ్మాయి తెలుగమ్మాయి
అందుకోమన్నది నిన్ను తన చేయి 
https://www.youtube.com/watch?v=ff2Q4O61Q2E
Maryada Ramanna Songs | Telugammayi Video Song | Sunil, Saloni | Sri Balaji Video
Watch & Enjoy Maryada Ramanna Movie Video Songs (1080p) Starring Sunil, Saloni, Screenplay - Directi...