Tuesday, 9 July 2019

చిత్రం: పరువు ప్రతిష్ట (1963)
సంగీతం: పెండ్యాల
గీతరచయిత: శ్రీశ్రీ
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల
ఆ మబ్బు తెరలలోన దాగుంది చందమామ...
ఈ సిగ్గుపొరలలోన బాగుంది సత్యభామ ఏమంది సత్యభామ...
ఏమందో ఏమో కాని పరిహాసాలే చాలునంది
శ్రీవారిని ఐదారడుగుల దూరాన ఆగమంది దూరాన ఆగమంది...
ఈ గాలి ఊయలా ఊగించు పయ్యెదా...
ఈ గాలి ఊయలా ఊగించు పయ్యెదా...
ఊరించే సైగలతోనే ఏమంది తియ్యగా...
పరువాల తొందరా నెలరాజు ముందరా...
పరువాల తొందరా నెలరాజు ముందరా...
మర్యాదా కాదని కాదా పలికింది చల్లగా పలికింది మెల్లగా...
ఆ మబ్బు తెరలలోన దాగుంది చందమామ...
ఈ సిగ్గుపొరలలోన బాగుంది సత్యభామ ఏమంది సత్యభామ...
ఏమందో ఏమో కాని పరిహాసాలే చాలునంది
శ్రీవారిని ఐదారడుగుల దూరాన ఆగమంది దూరాన ఆగమంది...
సిగలోని... పువ్వులు... చిలికించే నవ్వులు...
సిగలోని... పువ్వులు ...చిలికించే నవ్వులు...
ఓ... ఓ... ఓ... ఓ... ఓ...
మనకోసం... ఏ సందేశం ...అందించే ప్రేయసీ...
ఆనంద సీమలా ...అనురాగ డోలలా...
ఆనంద సీమలా... అనురాగ డోలలా...
కలకాలం ...తేలీసోలీ ...ఆడాలి హాయిగా...
అన్నాయి... తియ్యగా...
ఆ మబ్బు... తెరలే తొలగి... ఆగింది... చందమామ...
ప్రేమికుల ...హృదయము తెలిసి... పాడింది... చందమామ...
పాడింది... చందమామ...
ఆహా.హా.ఆ... ఆ... ఆ...
-3:38
చిత్రం : ఉయ్యాల జంపాల
రచన : ఆరుద్ర
సంగీతం :పెండ్యాల
గానం : ఘంటసాల,సుశీల
కొండగాలి తిరిగిందీ గుండె ఊసులాడింది
గోదవరి వరదలాగ కోరిక చెలరేగింది || కొండ ||
పుట్టమీద పాలపిట్ట పొంగిపోయి కులికింది
గట్టుమీద కన్నెలేడి గంతులేసి ఆడింది
పట్టపగలు సిరివెన్నెల భరతనాట్య మాడింది
పట్టరాని లేత వలపు పరవసించి పాడింది || కొండ ||
మొగలి పూల వాసనతో జగతి మురిసిపోయింది
నాగమల్లె పూలతో నల్లని జడ నవ్వింది
పడుచుదనం అందానికి తాంబూలమిచ్చింది
ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది || కొండ ||
వెన్నెలలోనే వేడి ఏలనో
చిత్రం : పెళ్ళినాటి ప్రమాణాలు (1959)
సంగీతం : ఘంటసాల
నేపధ్య గానం : ఘంటసాల, పి. లీల
పల్లవి:
వెన్నెలలోనే వేడి ఏలనో....వేడిమిలోనే చల్లనేలనో...
ఏమాయె ఏమో జాబిలి ...ఈ మాయ ఏమో జాబిలి
వెన్నెలలోనే విరహమేలనో... విరహములోనే హాయి ఏలనో...
ఏమాయె ఏమో జాబిలి... ఈ మాయ ఏమో జాబిలి
చరణం 1:
మొన్నటి కన్నా నిన్న వింతగ... నిన్నటి కన్నా నేడు వింతగ
ఓ..ఓహొ..ఓ..ఓహొ...
మొన్నటి కన్నా నిన్న వింతగ... నిన్నటి కన్నా నేడు వింతగ
నీ సొగసూ నీ వగలూ... హాయిహాయిగా వెలసేనే
వెన్నెలలోనే వేడి ఏలనో....వేడిమిలోనే చల్లనేలనో...
ఏమాయె ఏమో జాబిలి ...ఈ మాయ ఏమో జాబిలి
చరణం 2:
రూపము కన్నా చూపు చల్లగా... చూపుల కన్నా చెలిమి కొల్లగా...
ఓహొ..ఓ..ఓహొ..ఓ..
రూపము కన్నా చూపు చల్లగా... చూపుల కన్నా చెలిమి కొల్లగా..
నీ కళలూ.. నీ హొయలు... చల్లచల్లగా విరిసేనే
వెన్నెలలోనే హాయి ఏలనో...వెన్నెలలోనే విరహమేలనో..
ఏమాయె ఏమో జాబిలి... ఈ మాయ ఏమో జాబిలి
ఆ..ఆహ..ఆ..ఆ..అహ..ఆ...
నీవని నేనని తలచితిరా
చిత్రం : శ్రీ పాండురంగ మహత్యం (1957)
సంగీతం : టి.వి. రాజు
గీతరచయిత : సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి:
నీవని నేనని తలచితిరా....నీవే నేనని తెలిసితిరా ...
నీవని నేనని తలచితిరా....నీవే నేనని తెలిసితిరా ...
నిజమిదే....ఋజువేదీ...
ఉహు..హు...ఆహా...హా...
నీవని నేనని తలచితిరా....
నీవే నేనని తెలిసితిరా ...
చరణం 1:
కలయగ జూచితి నీకొరకై నే...కలయగ జూచితి నీకొరకై నే...
కనుపాపలలో కనుగొన్నారా...కనుపాపలలో కనుగొన్నారా....
అవునో... కాదో... నే చూడనా...
నీవని నేనని తలచితినే...నీవే నేనని తెలిసితినే
చరణం 2:
కలవర పాటున కల అనుకొందూ..కలవర పాటున కల అనుకొందూ...
కాదనుకొందు కళా నీ ముందూ...కాదనుకొందు కళా నీముందూ...
కాదు సఖా కల నిజమేలే.....
నీవని నేనని తలచితిరా....నీవే నేనని తెలిసితిరా ...
నీవే నేనని తెలిసితిరా ...
https://picosong.com/wNv8j ఆహ...ఆహ..హా...హా....ఉమ్మ్...ఉమ్మ్..ఉమ్మ్...
ఈరోజు (జూలై 9) ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ గారి జయంతి సందర్భంగా బాలచందర్ గారి దర్శకత్వంలో విడుదలైన రుద్రవీణ సినిమా నుండి సిరివెన్నెల సీతారామశాస్త్రి వ్రాసిన SPB పాడిన ఓ అందమైన పాట...
Movie : Rudraveena
Banner : Anjana Productions
Director : Balachander
Music : Ilayaraja
Cast : Chiranjeevi,Shobhana
తరలి రాద తనే వసంతంతన దరికి రాని వనాల కోసం!!2!!
గగనాల దాకా అల సాగకుంటేమేఘాల రాగం ఇల చేరుకోదా!!తరలి రాద!!
వెన్నెల దీపం కొందరిదా...అడవిని సైతం వెలుగు కదా
వెన్నెల దీపం కొందరిదా...అడవిని సైతం వెలుగు కదా
ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా
ప్రతి మదిని లేపే ప్రభాత రాగంపదే పదే చూపే ప్రధాన మార్గం
ఏదీ సొంతం కోసం కాదను సందేశం పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం
ఇది తెలియని మనుగడ కథ దిశనెరుగని గమనము కద!!తరలి రాద!!
బ్రతుకున లేని శృతి కలదా యదసడిలోనే లయ లేదా !బ్రతుకున !
కళకైనా ఏ కలకైనా జీవిత రంగం వేదిక కాదా...
ప్రజాధనం కానీ కళావిలాసంఏ ప్రయోజనం లేనీ సుధావికాసం
కూసే కోయిల పోతే కాలం ఆగిందాపాడే ఏనే పాడే మరో పదం రాదా
మురళికి గల స్వరముల కళపెదవిని విడి పలకదు కద
తరలి రాద తనే వసంతంతన దరికి రాని వనాల
దాకా అల సాగకుంటేమేఘాల రాగం ఇల చేరుకోదా
తరలి రాద తనే వసంతంతన దరికి రాని వనాల కోసం


నటి రేవతి మేడం పుట్టిన రోజు సందర్భంగా ఆమె అద్భుతంగా నటించిన క్షత్రియుడు సినిమానుండి సన్న జాజి పడక...అనేపాట నాకు నచ్చిన పాట.మీకూ నచ్చుతుందనుకుంటాను.పాటలో ఆడియో రాక పోతె YouTube link ఇచ్చాను...click చేయండి ఆనందించండి.
చిత్రం : క్షత్రియ పుత్రుడు
రచన : వెన్నెలకంటి
గానం: ఎస్.ఫై.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
సంగీతం : ఇళయరాజా
సన్నజాజి పడక
మంచెకాడ పడక
చల్లగాలి పడక
మాటవినకుందీ ఎందుకే
సన్నజాజి పడక
మంచెకాడ పడక
చల్లగాలి పడక
మాటవినకుందీ ఎందుకే
మనసులో ప్రేమే ఉంది
మరువనీ మాటే ఉంది
మాయని ఊసే పొంగి పాటై రావే
సన్నజాజి పడక
మంచె కాడ పడక
చల్లగాలి పడక
మాటవినకుందీ ఎందుకే
కొండమల్లి పువ్వులన్నీ
గుండెల్లోనీ నవ్వులన్నీ
దండే కట్టి తోచుకున్నా నీ కొరకే
పండు వెన్నెలంటి ఈడు
ఎండల్లోన చిన్నబోతే
పండించగా చేరుకున్నా నీ దరికే
అండాదండా నీవేనని
పండుగంతా నాదేనని
ఉండి ఉండి ఊగింది ఇంకా మనసే
కొండపల్లి బొమ్మా ఇక పండు చెండు దోచేయ్యనా
దిండే పంచే వేళైనది రావే
దిండే పంచే వేళైనది రావే
సన్నజాజి పడక
మంచె కాడ పడక
చల్లగాలి పడక
మాటవినకుందీ ఎందుకే
సన్నజాజి పడక
మంచె కాడ పడక
చల్లగాలి పడక
మాటవినకుందీ ఎందుకే
అడిగితే సిగ్గేసింది
సిగ్గులో మొగ్గేసింది
మొగ్గలా బుగ్గే కంది పోయే
సన్నజాజి పడక
మంచె కాడ పడక
చల్లగాలి పడక
https://youtu.be/0XzhfHNTbEk
మాటవినకుందీ ఎందుకే

Friday, 21 June 2019

ఘల్లు ఘల్లున గుండె ఝల్లన -
చిత్రం : నీరాజనం,1988
సంగీతం:OP Nayyar
సాహిత్యం: రాజశ్రీ.
గానం:S.జానకమ్మ
ఘల్లు ఘల్లున గుండె ఝల్లన పిల్ల ఈడు తుళ్ళి పడ్డదీ
ఘల్లు ఘల్లున గుండె ఝల్లన పిల్ల ఈడు తుళ్ళి పడ్డదీ
మనసు తీరుగ మాటలాడక మౌనం ఎందుకన్నదీ
ఘల్లు ఘల్లున గుండె ఝల్లన
క్షణమాగక తనువూగెను ఈ సంధ్యా సమీరాలలో
అనురాగమే తల ఊపెను నీలాకాశ తీరాలలో
క్షణమాగక తనవూగెను ఈ సంధ్యా సమీరాలలో
అనురాగమే తల ఊపెను నీలాకాశ తీరాలలో
ఘల్లు ఘల్లున గుండె ఝల్లన
కల గీతమె పులకించెను నవ కళ్యాణ నాదస్వరం
కథ కానిది తుదిలేనిది మన హృదయాల నీరాజనం
కల గీతమె పులకించెను నవ కళ్యాణ నాదస్వరం
కథ కానిది తుదిలేనిది మన హృదయాల నీరాజనం
ఘల్లు ఘల్లున గుండె ఝల్లన