| నీ కోసం వెలిసిందీ ప్రేమమందిరం...నీ కోసం విరిసిందీ హృదయనందనం... చిత్రం : ప్రేమనగర్ (1971) సంగీతం : కె .వి.మహదేవన్ రచన : ఆత్రేయ గానం : ఘంటసాల , పి.సుశీల పల్లవి : నీ కోసం... నీ కోసం.. నీ కోసం వెలిసిందీ ప్రేమమందిరం నీ కోసం విరిసిందీ హృదయనందనం నీ కోసం వెలిసిందీ ప్రేమమందిరం నీ కోసం విరిసిందీ హృదయనందనం నీ కోసం వెలిసిందీ ప్రేమమందిరం చరణం 1 : ప్రతి పూవూ నీ నవ్వే నేర్చుకున్నదీ, ప్రతి తీగ నీ వంపులు తెచ్చుకున్నదీ ప్రతి పాదున నీ మమతే పండుతున్నదీ, ప్రతి పందిరి నీ మగసిరి చాటుతున్నదీ నీ కోసం విరిసిందీ హృదయనందనం నీ కోసం వెలిసిందీ ప్రేమమందిరం చరణం 2 : అలుపురాని వలపులు ఆడుకునేదిక్కడ, చెప్పలేని తలపులు చేతలయేదిక్కడ విడిపోని బంధాలు వేసుకొనేదిక్కడ, తొలి చెలిమి అనుభవాలు తుది చూసేదిక్కడ నీ కోసం వెలిసిందీ ప్రేమమందిరం చరణం 3 : కలలెరుగని మనసుకు కన్నెరికం చేసావు, శిల వంటి మనిశిని శిల్పంగా మార్చావు తెరువని నా గుడి తెరిచి దేవివై వెలిసావు, నువు మలిచిన ఈ బ్రతుకు నీకే నైవేద్యం నీ కోసం వెలిసిందీ ప్రేమమందిరం నీ కోసం విరిసిందీ హృదయనందనం నీ కోసం వెలిసిందీ ప్రేమమందిరం నీ కోసం....నీ కోసం https://www.youtube.com/watch? | ||
|
Tuesday, 21 May 2019
ప్రేమనగర్ (1971)
Sunday, 19 May 2019
| ఇది నా హృదయం.. ఇది నీ నిలయం...ఇది సురముని యోగీశ్వరుల చూపులకు. చిత్రం : శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979) సంగీతం : పెండ్యాల నేపధ్య గానం : బాలు, సుశీల పల్లవి : ఇది నా హృదయం.. ఇది నీ నిలయం.. ఇది సురముని యోగీశ్వరుల చూపులకు.. అందని ఆనందాలయం ఇది నా హృదయం .. ఇది నీ నిలయం ఇది సురమునియోగీశ్వరుల చూపులకు.. అందని ఆనందాలయం ఇది నా హృదయం .. చరణం 1 : ఇది నా "శ్రీ" నివాసం... ఇది నీ రాణి వాసం ఇది నా "శ్రీ" నివాసం... ఇది నీ రాణి వాసం నాపై నీకింత అనురాగమా?... నా పై మీకింత ఆదరమా.. ఇది నీ ప్రణయ డోళ.. ఇది నా ప్రభువుని లీలా .. ఆ .. ఆ.. ఇది నా హృదయం .. ఇది నీ నిలయం ఇది సురమునియోగీశ్వరుల చూపులకు అందని ఆనందాలయం ఇది నా హృదయం .. చరణం 2 : ఎల్లలోకముల ఏలేవారికి ఈడా... జోడా ఈ సిరి? వికుంఠపురిలో విభువక్షస్థలి విడిది చేయు నా దేవేరి .. ఇది నా భాగ్యం... ఇది మన భోగం.. ఇది నా హృదయం .. ఇది నీ నిలయం... ఇది సురముని యోగీశ్వరుల చూపులకు.. అందని ఆనందాలయం ఇది నా హృదయం .. https://www.youtube.com/watch? | ||
|
| కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా..పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా చిత్రం : నిన్నే ప్రేమిస్తా సంగీతం : ఎస్ . ఏ.రాజ్ కుమార్ సాహిత్యం : సిరివెన్నెల గానం : SP.బాలసుబ్రహ్మణ్యం,చిత్ర కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా అందమైన మల్లె బాల బాగుందా అల్లి బిల్లి మేఘమాల బాగుందా చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా అప్పుడిప్పుడు గున్నమామి తోటలో అట్లతద్ది ఊయలూగినట్లుగా ఇప్పుడెందుకో అర్థరాత్రి వేళలో గుర్తుకొస్తోంది కొత్త కొత్తగా నిదురించిన ఎద నదిలో అల లెగిసిన అలజడిగా తీపితీపి చేదు ఇదా లేతపూల ఉగాది ఇదా చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా మబ్బు చాటులో ఉన్న వెన్నెలమ్మకి బుగ్గచుక్కలాగా ఉన్న తారక కొబ్బరాకుతో అల్లుకున్న బొమ్మకి పెళ్లి చుక్కపెట్టినట్టు వుందిగా కలలుకనే కన్నులలో కునుకెరుగని కలవరమా రేయిలోని పలవరమా హాయిలోని పరవశమా చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా కోయిల పాట బాగుంది కొమ్మల సడి బాగుంది పున్నమితోట బాగుంది వెన్నెలసిరి బాగుంది అందమైన మల్లె బాల బాగుంది అల్లి బిల్లి మేఘమాల బాగుంది చిలకమ్మా బాగుంది చిరుగాలి బాగుంది కోయిల పాట బాగుంది కొమ్మల సడి బాగుంది పున్నమితోట బాగుంది వెన్నెలసిరి బాగుంది https://www.youtube.com/watch? | ||
|
| సన్నాజాజి కి గున్నా మావికి పెళ్ళికుదిరిందీ...మాటే మంతీ లేని వేణువు పాట పాడిందీ.. చిత్రం: ముత్యాల పల్లకి (1976) సంగీతం : సత్యం సాహిత్యం : మల్లెమాల గానం : బాలు, సుశీల సన్నాజాజి కి గున్నా మావికి పెళ్ళికుదిరిందీ.. మాటే మంతీ లేని వేణువు పాట పాడిందీ.. హాహహా ఆ ఆ...హాహహా ఆ ఆ... గున్నా మావికి సన్నా జాజికి పెళ్ళి కుదిరిందీ.. నాదే గెలుపని మాలతీ లత నాట్యమాడిందీ.. హాహహా ఆ ఆ...ఓహో.హోహ్హో... పూచే వసంతాలు మా కళ్ళ లో.. పూలే తలంబ్రాలు మా పెళ్ళి లో.. పూచే వసంతాలు మా కళ్ళ లో.. పూలే తలంబ్రాలు మా పెళ్ళి లో.. విరికొమ్మా.. చిరు రెమ్మా.. విరికొమ్మ చిరు రెమ్మ పేరంటానికి రారమ్మా కలలే నిజాలాయె ఈ నాటి కీ... అలలే స్వరాలాయె మా పాట కీ కలలే నిజాలాయె ఈ నాటి కీ... అలలే స్వరాలాయె మా పాట కీ శ్రీరస్తూ...శుభమస్తూ.. శ్రీరస్తు శుభమస్తు అని మీరూ మీరు దీవించాలి గున్నా మావికి సన్నా జాజికి పెళ్ళి కుదిరిందీ.. నాదే గెలుపని మాధవీ లత నాట్యమాడిందీ... సన్నాజాజి కి గున్నా మావికి పెళ్ళికుదిరిందీ.. https://www.youtube.com/watch? | ||
|
| సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వర..సురవైభవానా భాసుర కీర్తిలోనా చిత్రం: కంచుకోట (1961) సంగీతం: కె.వి. మహదేవన్ గీతరచయిత: సినారె నేపధ్య గానం: సుశీల, జానకి పల్లవి: సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ సురవైభవానా భాసుర కీర్తిలోనా సురవైభవాన భాసుర కీర్తిలోనా సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా సరిలేరు నీకెవ్వరూ సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా సరిలేరు నీకెవ్వరూ సిరిలోన గానీ మగసిరిలోన గానీ సిరిలోన గానీ మగసిరిలోన గానీ సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా సరిలేరు నీకెవ్వరూ చరణం 1: ప్రజలను నీకంటి పాపలుగా కాచి ఆ... ప్రజలను నీకంటి పాపలుగా కాచి పరరాజులదరంగ కరవాలమును దూసి ప్రజలను నీకంటి పాపలుగా కాచి పరరాజులదరంగ కరవాలమును దూసి శాంతిని వెలయించి మంచిని వెలిగించి శాంతిని వెలయించి మంచిని వెలిగించి జగతిని లాలించి పాలించినావూ.... సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ చరణం 2: మరుడే తొందరచేయ విరిబోణులనుగూడి మధువే పొంగులువార మనసార తూగాడి ఆ... ఆ... ఆ... మరుడే తొందరచేయ విరిబోణులనుగూడి మధువే పొంగులువార మనసార తూగాడి నవ్వులు చిలికించి మువ్వలు పలికించి నవ్వులు చిలికించి మువ్వలు పలికించి యవ్వనవీణనూ కవ్వించినావూ... సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా సరిలేరు నీకెవ్వరూ చరణం 3: రాజభోజ రవితేజ దానజిత కల్పభూజ జోహార్ నీటుగుల్కి సుమకోటి తేనెలానేటి తేటి జోహార్ రాజభోజ రవితేజ దానజిత కల్పభూజ జోహార్ నీటుగుల్కి సుమకోటి తేనెలానేటి తేటి జోహార్ అసమప్రభావ జోహార్ రసికావతంస జోహార్ అసమప్రభావ జోహార్ రసికావతంస జోహార్ జోహార్ జోహార్ జోహార్ జోహార్ జోహార్ జోహార్ జోహార్ జోహార్ ఆ...ఆ... ఆ... ఆ... సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ సిరిలోన గానీ మగసిరిలోన గానీ సరిలేరు నీకెవ్వరూ..... సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరూ https://www.youtube.com/watch? | ||
|
ఏనాడు విడిపోని ముడి వేసెనే...నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు...
చిత్రం: శ్రీకనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సంగీతం : ఇళయరాజ సాహిత్యం : సిరివెన్నెల గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, జానకి ఏనాడు విడిపోని ముడి వేసెనే నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు ఈ మధుర యామినిని ఏ జన్మ స్వప్నాల అనురాగమో ఏ జన్మ స్వప్నాల అనురాగమో పూసినది నేడు ఈ పసుపు తాడు పూసినది నేడు ఈ పసుపు తాడు ఈ సుధల ఆమనిని ఏనాడు విడిపోని ముడి వేసెనే ఏనాడు విడిపోని ముడి వేసెనే సా...గామ గమ గామ గమరీ.. సారి నిరి సారి నిసనీ.. సాదాదరీ.. రీగాగపా.. మోహాన పారాడు వేలి కొనలో నీ మేను కాదా చైత్ర వీణ వేవేల స్వప్నాల వేడుకలలో నీ చూపు కాదా పూల వాన రాగసుధ పారే అలల శ్రుతిలో స్వాగతము పాడే ప్రణయము కలకాలమూ కలగానమై నిలవాలి మన కోసము... ఈ మమత ఏనాడు విడిపోని ముడి వేసెనే ఏనాడు విడిపోని ముడి వేసెనే నీ మోవి మౌనాన మదన రాగం మోహాన సాగే మధుప గానం నీ మోవి పూసింది చైత్ర మోదం చిగురాకు తీసే వేణు నాదం పాపలుగ వెలిసే పసిడి కలకు ఊయలను వేసే క్షణమిదే రేపన్నదీ ఈ పూటనే చేరింది మన జంటకు... ముచ్చటగ ఏనాడు విడిపోని ముడి వేసెనే ఏనాడు విడిపోని ముడి వేసెనే నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు పూసినది నేడు ఈ పసుపు తాడు ఈ మధుర యామినిని ఏనాడు విడిపోని ముడి వేసెనే ఏనాడు విడిపోని ముడి వేసెనే https://www.youtube.com/watch? | ||
|
baatasaari -1961
samudraala ragavachaarya
bhanumati & gikki
|
Subscribe to:
Posts (Atom)





