Saturday, 18 May 2019



రహస్యం 


శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా 
శ్రీగిరినిలయా గిరామయా సర్వమంగళా 
https://www.youtube.com/watch?v=q24UGu45AUA 

శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా 
శ్రీగిరినిలయా గిరామయా సర్వమంగళా 
శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా 

చరణం: 
జగముల చిరునగవుల పరిపాలించే జననీ 
అనయము మము కనికరమున కాపాడే జననీ |జగముల| 
మనసే నీవశమై స్మరణే జీవనమై |మనసే| 
మాయని వరమీయవె పరమేశ్వరి మంగళనాయకి 

శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా 
శ్రీగిరినిలయా గిరామయా సర్వమంగళా 
శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా 

చరణం: 
అందరికన్న చక్కని తల్లికి సూర్యహారతి 
అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి 
రవ్వల తళుకుల కళగా జ్యోతుల కప్పురహారతి 
సకలనిగమ వినుతచరణ శాశ్వత మంగళహారతి 

శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా 
శ్రీగిరినిలయా గిరామయా సర్వమంగళా 
శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా
one of my favorite songs of P.LEELA, very nicely sung by miss. MANOGNA. Up loaded from my earlier co...

తొంగి తొంగి చూడమాకు... చందమామా..నీ సంగతంత తెలుసు మాకు... చందమామా

చిత్రం : శ్రీరంగ నీతులు (1983)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి :
హె... హె... హే.. లలలలా..
హె.... హె... హే.. లలలలా..

తొంగి తొంగి చూడమాకు... చందమామా
నీ సంగతంత తెలుసు మాకు... చందమామా

దోరదోర వయసులో చందమామా
ఆ తారనేం చేశావు చందమామా

వావి వరస చూశావా చందమామా
నీ వయసునాపుకున్నావా చందమామా

అంత మచ్చ పెట్టుకుని చందమామా
నీకెందుకింత మత్సరం చందమామా

తొంగి తొంగి చూడమాకు... చందమామా
నీ సంగతంత తెలుసు మాకు... చందమామా

చరణం 1 :

వెన్నెల్లో వేడుకుంది... కన్నుల్లో కోరికుంది ముద్దుగుమ్మా
ఇద్దర్లో వేగముంది... వద్దన్నా ఆగకుంది పైడిబొమ్మా

పూల బాణాలు వేసేకుందమా?
ప్రేమ గాయాలు చేసుకుందామా?
పూల బాణాలు వేసేకుందమా?
ప్రేమ గాయాలు చేసుకుందామా?

కలిసే ఉందామా కరిగే పోదామా
చుప్పనాతి చుక్కల్ని దాటుదామా
చూడలేని చంద్రుణ్ణి తరుముదామా

తొంగి తొంగి చూడమాకు... చందమామా
నీ సంగతంత తెలుసు మాకు... చందమామా
తొంగి తొంగి చూడమాకు... చందమామా
నీ సంగతంత తెలుసు మాకు... చందమామా

చరణం 2 :

గుండెల్లో తాళముంది... గొంతుల్లో రాగముంది కలుపుదామా
పొద్దెంతో హాయిగుంది... ఎంతెంతో పొద్దువుంది గడుపుదామా

ముద్దు మురిపెంలో మునిగిపోదమా?
తీపిగా వానలో తేలిపోదమా?
ముద్దు మురిపెంలో మునిగిపోదమా?
తీపిగా వానలో తేలిపోదమా?

స్వర్గం చూద్దామా... సొంతం చేద్దామా
మత్సరాలు మాననీ మచ్చమామా
దండమెట్టి ఇద్దరం కొలుచుకోమా

తొంగి తొంగి చూడమాకు... చందమామా
నీ సంగతంత తెలుసు మాకు... చందమామా

దోరదోర వయసులో చందమామా
ఆ తారనేం చేశావు చందమామా

వావి వరస చూశావా చందమామా
నీ వయసునాపుకున్నావా చందమామా

అంత మచ్చ పెట్టుకుని చందమామా
నీకెందుకింత మత్సరం చందమామా

తొంగి తొంగి చూడమాకు... చందమామా
నీ సంగతంత తెలుసు మాకు... చందమామా

తొంగి తొంగి చూడమాకు... చందమామా
తొంగి తొంగి చూడమాకు... చందమామా

https://www.youtube.com/watch?v=MVCuY4v4me0
Sree Ranga Neethulu Songs - Thongi Thongi Choodamaaku - A.N.R, Sridevi, Kaikala Satyanarayana
Sree Ranga Neethulu Songs - Thongi Thongi Choodamaaku Watch more movies @ http://www.youtube.com/vol...


ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మో...ఎన్నెలొచ్చి రెల్లుపూలే ఎండీ గిన్నేలయ్యేనమ్మో

చిత్రం: దేవత (1982)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి :

మ్మ్..మ్మ్..

ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లుపూలే ఎండీ గిన్నేలయ్యేనమ్మో
కొంగు దాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే
ఓరయ్యో.. రావయ్యో.. ఆగడాల పిల్లోడా నా సోగ్గాడా...
మీగడంతా నీదేలేరా బుల్లోడా

ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిలా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లుపూలే ఎండీ గిన్నేలయ్యేనమ్మో
కొంగు చాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే
మ్మ్..మ్మ్..
ఓలమ్మో..రావమ్మో.. ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడూ...

ఆగడాల పిల్లోడైన నీవోడు

చరణం 1 :

ఈ కళ్ళకున్న ఆకళ్ళలోన అందాల విందమ్మ నువ్వు
వాటేసుకుంటే వందేళ్ళ పంట వద్దంటే విందమ్మ నవ్వు
చెయ్యేస్తే చేమంతి బుగ్గా.. చెంగావి గన్నేరు మొగ్గా
చెయ్యేస్తే చేమంతి బుగ్గా.. చెంగావి గన్నేరు మొగ్గా

ఈడొచ్చి నీకోసం ఈడుంది రమ్మంటే ఏడేసుకుంటావు గూడూ
కౌగిళ్ళలో నన్ను కూడు.. ఆకళ్ళకుంటాది కూడు..
గుండెల్లో చోటుంది చూడూ

మ్మ్...మ్మ్...

ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిలా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లుపూలే ఎండీ గిన్నేలయ్యేనమ్మో
కొంగు చాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే...
ఓరయ్యో.. రావయ్యో.. ఆగడాల పిల్లోడా.. నా సోగ్గాడా...
మీగడంత నీదేలేరా బుల్లోడా.. ఓ ఓ ఓ..
ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడూ... ఆగడాల పిల్లోడైన నీవోడూ

చరణం 2:

నీ కళ్ళు సోక.. నా తెల్లకోక.. అయ్యిందిలే గళ్ళకోక
నీ మాట విన్న.. నా జారు పైట.. పాడిందిలే గాలిపాటా
కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళూ.. నే కోరినా మూడుముళ్ళూ
కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళూ.. నే కోరినా మూడుముళ్ళూ

పొద్దుల్లో కుంకాలు బొట్టెట్టీ పోతుంటే కట్టెయ్యనా తాళిబొట్టూ
నా మాటకీ యేరు తోడు.. ఏరెండిన ఊరు తోడు..
నీ తోడులో ఊపిరాడూ..

మ్మ్..మ్మ్..

ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిలా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లుపూలే ఎండీ గిన్నేలయ్యేనమ్మో
కొంగు దాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే
ఓలమ్మో..రావమ్మో.. ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడూ...
ఆగడాల పిల్లోడైన నీవోడు..ఆ ఆ ఆ...
ఆగడాల పిల్లోడా నా సోగ్గాడా...మీగడంత నీదేలేరా బుల్లోడా

మ్మ్..మ్మ్..

https://www.youtube.com/watch?v=SMXBN76wPe4
Shobhan Babu & Sridevi in Ellu Vachi Godaramma - Devatha.avi


3



నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో...నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో

చిత్రం : మూడుముళ్ళు (1983)
సంగీతం : రాజన్-నాగేంద్ర
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి :

నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో
నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో
మలి సందెలు మల్లెపూలు మనువాడిన వేళలలో..

నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో
నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో

చరణం 1 :

లాలాలాల..లాల్లలలా..లాలాలాల..లాల్లలలా
లాలాలాల..లాలా...

అటు చూడకు జాబిలి వైపు..కరుగుతుంది చుక్కలుగా..
చలి చీకటి చీర లోనే సొగసంతా దాచుకో

అటు వెళ్ళకు దిక్కుల వైపు..కలుస్తాయి ఒక్కటిగా..
నా గుప్పెడు గుండె లోనే జగమంతా ఏలుకో

నా హృదయం టూ-లెటు కాదు..మన జంటకి డ్యూయెటు లేదు
ఆ మాటే విననూ..మాట పడనూ..ఊరుకోను

నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో
నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో
మలి సందెలు మల్లెపూలు మనువాడిన వేళలలో..

నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో
నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో

చరణం 2 :

అటు చూడకు లోకం వైపు..గుచ్చుతుంది చూపులతో..
ఒడి వెచ్చని నీడ లోనే బిడియాలని పెంచుకో

అటు వెళ్ళకు చీకటి వైపు..అంటుతుంది ఆశలతో
విరి సెయ్యల వేడి లోనే పరువాలను పంచుకో

నా కొద్దీ కసి కాలేజీ..మానేస్తా నే మ్యారేజి
మరులన్నీ మనవీ..అన్న మనవే..చేసుకున్నా

నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో
నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో
మలి సందెలు మల్లెపూలు మనువాడిన వేళలలో..

ఆహాహా..హాహాహా..లాలాల లాలలా...
ఆహాహా..హాహాహా..లాలాల లాలలా...

https://www.youtube.com/watch?v=gvo4K1UVT2E
Nee Kosam Yavvanamantaa Moodu Mullu SP Balu, Susheela

2




అందాల బొమ్మతో ఆటాడవా...పసందైన ఈ రేయి నీదోయి స్వామీ..

చిత్రం : అమరశిల్పి జక్కన (1964)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : సుశీల

పల్లవి:

అందాల బొమ్మతో ఆటాడవా
పసందైన ఈ రేయి నీదోయి స్వామీ..

అందాల బొమ్మతో ఆటాడవా..
పసందైన ఈ రేయి నీదోయి స్వామీ..

అందాల బొమ్మతో ఆటాడవా

చరణం 1:

కనులు చేపలై గంతులు వేసె..
మనసు తోటలో మల్లెలు పూసె..
దోసిట వలపుల పూవులు నింపీ..
దోసిట వలపుల పూవులు నింపీ
నీ కోసము వేచితి రావోయీ..

అందాల బొమ్మతో ఆటాడవా...

చరణం 2:

చల్ల గాలితో కబురంపితిని ...
చల్ల గాలితో కబురంపితిని...
చందమామలో వెదకితి నోయీ...
తార తారనూ అడిగితి నోయీ....
దాగెద వేలా? రావోయీ...

అందాల బొమ్మతో ఆటాడవా...

చరణం 3:

నల్లని మేఘము జల్లు కురియగా...
నల్లని మేఘము జల్లు కురియగా...
ఘల్లున ఆడే నీలినెమలినై....
నిను గని పరవశమందెద నోయీ...
కనికరించి ఇటు రావోయీ...

అందాల బొమ్మతో ఆటాడవా..
పసందైన ఈ రేయి నీదోయి స్వామీ..
అందాల బొమ్మతో ఆటాడవా...

https://www.youtube.com/watch?v=I1MRev3HtWQ
Andala Bommatho Aatadava Video Song || Amara Silpi Jakkana Movie || ANR, Saroja Devi, Haranath
Watch Amara Silpi Jakkana Telugu Old Movie Video Songs Starring : Akkineni Nageswarao, Saroja Devi, ...

(1)

ఓం శ్రీ రాం   శ్రీ మాయాత్రే నమ: 
ప్రాంజలి ప్రభ - సంగీత ప్రభ
సేకరణ : మల్లాప్రగడ శ్రీదేవి రామకిష్ణ  

Birds of color:
సర్వేజనా సుఖినోభవంతు 
అలనాటి , నేటి సినమా సాహిత్యాన్ని సేకరించి ఇందు పొందు  పరుస్తున్నాను , నాకు సహకరించినవారికి మరియు ప్రాంజలి ప్రభను ఆదరిస్తున్నవారికి పేరు పేరున ధన్యవాదములు తెలియపరుస్తున్నాను
 ఇట్లు 
మల్లాప్రగడ రామకృష్ణ

పగడాల జాబిలి చూడు...గగనాల దాగెను నేడు...

చిత్రం : మూగనోము (1969)
సంగీతం : ఆర్. గోవర్ధన్
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల

పగడాల జాబిలి చూడు
గగనాల దాగెను నేడు
వేయి అందాల నా రాజు అందిన ఈ రోజు
ఎందుకులే నెలరేడు

పగడాల జాబిలి చూడు
గగనాల దాగెను నేడు
కోటి అందాల నా రాణి అందిన ఈ రేయి
ఎందుకులే నెలరేడు

మనసు మనసు గుసగుసలాడెను..
పెదవి పెదవి కువకువ లాడెను
మనసు మనసు గుసగుసలాడెను..
పెదవి పెదవి కువకువ లాడెను
ఆకాశ దీపాలు శయినించెను ..
నా కళ్ళు నీకళ్ళు పయనించెను
ఆకాశ దీపాలు శయినించెను ..
నా కళ్ళు నీకళ్ళు పయనించెను

పగడాల జాబిలి చూడు
గగనాల దాగెను నేడు
కోటి అందాల నా రాణి అందిన
ఈ రేయి ఎందుకులే నెలరేడు

బంగరు మమతలు పొంగులు వారెను..
కొంగులు రెండూ ముడివడిపోయెను
బంగరు మమతలు పొంగులు వారెను..
కొంగులు రెండూ ముడివడిపోయెను
గుడిలోని దేవుడు దీవించెను
నా జడలోని పూవులు తిలకించెను
గుడిలోని దేవుడు దీవించెను
నా జడలోని పూవులు తిలకించెను

పగడాల జాబిలి చూడు గగనాల దాగెను నేడు
కోటి అందాల నా రాణి అందిన ఈ రేయి ఎందుకులే నెలరేడు

https://www.youtube.com/watch?v=cFRHdBP91u8
Pagadala Jabili choodu - "Telugu Movie Full Video Songs" - Mooga Nomu
Subscribe For More Telugu Movies: http://goo.gl/V65dIk Subscribe For More Tamil Movies: http://goo.g...