Tuesday, 12 December 2017

173 రగిలే మంటలు

ఇదేలే తర తరాల చరితం, జ్వలించే జీవితాల కధనం 
ఇదేలే తర తరాల చరితం, జ్వలించే జీవితాల కధనం
పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా
ఇదేలే తర తరాల చరితం, జ్వలించే జీవితాల కధనం

ఒడిలో పెరిగిన చిన్నారినే, ఎరగా చేసినదాద్వేషము
కధ మారదా, ఈ బలి ఆగదా
మనిషే పశువుగ మారితే, కసిగా శిశువును కుమ్మితే
మనిషే పశువుగ మారితే, కసిగా శిశువును కుమ్మితే
అభము శుభము ఎరుగని వలపులు ఓడిపోయేనా
ఇదేలే తర తరాల చరితం, జ్వలించే జీవితాల కధనం
పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా

విరిసీ విరియని పూదోటలో, రగిలే మంటలు చల్లారావా
ఆర్పేదెలా, ఓదార్చేదెలా
నీరే నిప్పుగ మారితే, వెలుగే చీకటి రువ్వితే
నీరే నిప్పుగ మారితే, వెలుగే చీకటి రువ్వితే
పొగలో సెగలో మమతల పువ్వులు కాలిపోయేనా
ఇదేలే తర తరాల చరితం, జ్వలించే జీవితాల కధనం
ఇదేలే తర తరాల చరితం, జ్వలించే జీవితాల కధనం
పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా
ఇదేలే తర తరాల చరితం, జ్వలించే జీవితాల కధనం



172


"ప్రాంజలి ప్రభ - అన్నమయ్య"

"ప్రొంజలి ప్రభ"

Saturday, 2 December 2017

170-అశోక చక్రవర్తి (1993)

నేటి పాత సినిమా సాహిత్యం 
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ :
(ఆనందం ఆరోగ్యం-ఆధ్యాత్మికం -ప్రాంజలి ప్రభ లక్ష్యం )
సేకరణ/రచయత మల్లాప్రగడ రామకృష్ణ 


ఎందరో మహానుభావులు.. ఒక్కరికే వందనము
చిత్రం : అశోక చక్రవర్తి (1993)
సంగీతం : ఇళయరాజా

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : బాలు, జానకి

పల్లవి :
ఎందరో మహానుభావులు.. ఒక్కరికే వందనము
ఎందరో మహానుభావులు.. ఒక్కరికే వందనము
ఒడినే గుడిగా మలచి.. తమనే వలచి.. పిలిచే.. వేళ
ఎందరో మహానుభావులు.. సుందరికే బంధనము
ఎందరో మహానుభావులు.. సుందరికే బంధనము
ఎదలా ఎదుటే నిలిచి.. వలపై.. ఇలపై.. నిలిచే.. వేళ
ఎందరో మహానుభావులు.. ఒక్కరికే వందనము
చరణం 1 :
నీ రాధనేరా.. ఆడాలిరా రాసలీల
శ్రీకృష్ణుడల్లే వస్తానులే.. వేసి ఈల
నీకెందుకా దేవి పూజ.. నేనుండగ బ్రహ్మచారి
పూజారినే వలచుటేల.. ఈ దేవతే కాలుజారి
అందుకో.. మహానుభావుడా కౌగిలినే కానుకగా
ఆపవే బాలికా.. చాలికా...
ఎందరో మహానుభావులు.. ఒక్కరికే వందనం
ఎందరో మహానుభావులు.. సుందరికే బంధనము
చరణం 2 :
నీ కొంగు జారి.. శృంగారమే ఆరబోసే
నీ దొంగ చూపే.. నా లేత ప్రాణలు తీసే
నిన్నంటుకున్నాక రేయి.. కన్నంటుకోనంది బాలా
గుళ్ళోకి నే తెచ్చుకుంటే.. మెళ్ళోకి చేరింది మాల
అందుకే వరించు ఘాటుగా.. కిమ్మనకా.. పొమ్మనక
ఆపరా.. నా దొర.. తొందరా
ఎందరో మహానుభావులు.. సుందరికే బంధనము
ఎందరో మహానుభావులు.. ఒక్కరికే వందనం
ఒడినే గుడిగా మలచి.. తమనే వలచి.. పిలిచే.. వేళ
ఎందరో మహానుభావులు.. సుందరికే బంధనము



Saturday, 25 November 2017

169. మిధునం



మిధునం

అనుదినమ్మును కాఫియే అసలు కిక్కు
కొద్దిగానైన పడకున్న పెద్ద చిక్కు
కప్పు కాఫీ లభించుటె గొప్ప లక్కు
అమృతమ్మన్నది హంబక్కు అయ్యలారా...ఆ...ఆ..

జైకాఫి......
విశ్వాంతరాళంబులో నున్న బ్రహ్మాండ గోళాలలో
నీకు సాటైన పానీయమే లేదు ముమ్మాటికీ
అందుకే నిన్ను కట్టేసుకుంటాము మానోటికీ
నాల్కతో నీకు జేజేలు పల్కేము నానాటికీ

యెర్లి మార్నింగులో నిద్రలేవంగనే
పాచి పళ్ళైనయున్ తోమకన్ త్రాగు
బెడ్కాఫి కోసమ్ము పెండ్లాముపై ఱంకెలేయించకే బెస్ట్ టేస్టేశ్వరీ
ఫ్రెష్షు కాఫీశ్వరీ నెస్సు కేఫేశ్వరీ
జిహ్వకున్ సిధ్ధి చేకూర్చవే బ్రూకుబాండేశ్వరీ
లోకప్రాణేశ్వరీ ప్రాణదానేశ్వరీ
గంట గంటా ప్రతీయింట ఉప్పొంగవే ఉష్ణపానీశ్వరీ...

స్టీలు ఫిల్టర్ల పళ్ళెంబులోనున్న
రంధ్రాలలో నుండి నీ సారమంతా సుతారంగ జారంగ
నోరూరుచుండంగ నాసామి రంగా నిజంగానె చచ్చేవిధంగా
కాస్త తాగంగ మళ్ళీ పునర్జన్మ వచ్చేవిధంగా

ప్ప్రొద్దున్నె నీ పొందు లేకున్న మూడంత పాడయ్యె
టైమంత వేస్టయ్యె కచ్చెక్కి పిచ్చెక్కి
అశ్లీల సంభాషణల్ చేసి కాంటాక్ట్స్ సర్వంబు
నాశమ్ము కావించుకుంటారుగా
అందుకే నిన్ను అర్జెంటుగా తెచ్చుకుంటారుగా
దాచుకుంటారుగా కాచుకుంటారుగా
చచ్చినట్లింక యిచ్చేంత సేపందరున్ వేచి ఉంటారుగా

కాఫీని అంతెత్తుపైనుంచి ఓ కప్పులో వుంచి
ఆకప్పు లోనుంచి ఈ కప్పులోపోసి
అట్నుంచి ఇట్నుంచి ఇట్నుంచి అట్నుంచి
బాగా గిలక్కొట్టియున్నుర్గలుప్పొంగగా తెచ్చి ఇస్తారుగా..

గొప్ప నిష్ఠాగరిష్ఠుల్ వరిష్టాలలోనన్
గరిష్ఠంబుగా కాఫి తాగేందుకిష్టంబుగా పోవుగా...
షాపు మూసేయ వాపోవుగా...
సర్వ కాఫీ రసాంగీ సుధాంగీ శుభాంగీ ప్రభాంగీ
నమస్తే నమస్తే నమః

చిత్రం : మిధునం
సంగీతం : స్వరవీణాపాణి
సాహిత్యం : జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
గానం : జొన్నవిత్తుల
Coffee Dandakam full Telugu Video Song from Midhunam movie on Mango Classics, ft SP…

168. ప్రేమ విజేత (1992)



నీలో అల గోదారి ఎన్నెల నండూరి ఎంకిలా...నవ్వింది నా తోడుగా
చిత్రం : ప్రేమ విజేత (1992)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం :
గానం : బాలు, జానకి

నిస రిమ పద నిద సా నిసని
నిస రిమ పద నిద సా నిసని
శభాష్
సరి నిస దని పదమా
సరి నిస దని పదమా
మపసా నిసనిద మపసా

నీలో అల గోదారి ఎన్నెల నండూరి ఎంకిలా
నవ్వింది నా తోడుగా
నీలో తొలి అందాల తోటలే ఆత్రేయ పాటలా
ఉన్నాయి నా నీడగా
వలపుల పులకింతే తెలుగుకు గిలిగింత
ఎదలే పలికే వేళా వగలొలికె
నీలో తొలి అందాల తోటలే ఆత్రేయ పాటలా
ఉన్నాయి నా నీడగా

నీ పేరు వయ్యారమా నడిచిన శృంగారమ
అందాలు చూశానే అలల నడుమ
నీ పేరు సంగీతమా వలచిన సాయంత్రమా
ఏ రాగమైనా నీ మనసు మహిమ
నీ హంస నాదమే నా సూర్య వేదమై
నీ ప్రేమ రాగమే నా రామ కీర్తనై
నీ రూపమే ఒక ఆలాపనై..
ఆలోచనే ప్రియ ఆరాధనై..నీలో..

నీలో అల గోదారి ఎన్నెల నండూరి ఎంకిలా
నవ్వింది నా తోడుగా
హహ మలి సందెలలో పొంచీ ఉన్నా
చలి విందులకే వేచీ ఉన్నా
బిడియాల బుగ్గెరుపూ
పరువాల పొద్దెరుపూ
కడియాల కాలెరుపూ
కలహాల కన్నెరుపూ

నా గుండె ఏ తాళమో తెలియని ఉల్లాసమే
ఉప్పొంగి పోయే నీ తపన వలన
నా గొంతు ఏ రాగమో అడిగెను నీ తాళమే
ఉర్రూతలూగే నీ మనసుతోనే
ఏ పొన్న పూసినా నీ నవ్వులేననీ
ఏ వెన్నదోచినా నీ వన్నెలేననీ
ఉన్నాయిలే కలలా ఆశలే
తెల్లారినా ఇక నీ ధ్యాసలే.. నీలో..

నీలో తొలి అందాల తోటలే ఆత్రేయ పాటలా
ఉన్నాయి నా నీడగా
నీలో అల గోదారి ఎన్నెల నండూరి ఎంకిలా
నవ్వింది నా తోడుగా
వలపుల పులకింతే తెలుగుకు గిలిగింత
ఎదలే పలికే వేళా వగలొలికె
నీలో అల గోదారి ఎన్నెల నండూరి ఎంకిలా
నవ్వింది నా తోడుగా



Movie: Prema Vijetha (1992) // Language: Telugu // Actors: Suresh, Harish, Yamuna, Roja // Singers: SP Balasubramanyam & S.Janaki // Composer:…

167. అంతులేని కథ (1976)




కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు...రాళ్ళలో ఉన్న నీరూ కళ్ళకెలా తెలుసు
నాలో ఉన్న మనసూ నాకు గాక ఇంకెవరికి తెలుసూ...

చిత్రం: అంతులేని కథ (1976)
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: జానకి

పల్లవి:

కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు
కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు
రాళ్ళలో ఉన్న నీరూ కళ్ళకెలా తెలుసు
రాళ్ళలో ఉన్న నీరూ కళ్ళకెలా తెలుసు

నాలో ఉన్న మనసూ నాకు గాక ఇంకెవరికి తెలుసూ

కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు
రాళ్ళలో ఉన్న నీరూ కళ్ళకెలా తెలుసు

చరణం 1:

తానే మంటై వెలుగిచ్చు దీపం
చెప్పదు తనలో చెలరేగు తాపం

నే వెళ్ళు దారీ ఓ ముళ్ళ దారీ
నే వెళ్ళు దారీ ఓ ముళ్ళ దారీ
రాలేరు ఎవరూ నాతో చేరీ
నాలో ఉన్న మనసు నాకు గాక ఇంకెవరికి తెలుసు

చరణం 2:

వేసవిలోనూ వానలు రావా
కోవెల శిలకూ జీవం రాదా

జరిగే నాడే జరుగును అన్నీ
జరిగే నాడే జరుగును అన్నీ
జరిగిన నాడే తెలియును కొన్నీ

నాలో ఉన్న మనసు నాకు గాక ఇంకెవరికి తెలుసూ

https://www.youtube.com/watch?v=pMhskYtCnmA
Kallalo Unnadedo Song - Anthuleni Katha Movie Songs - Jayaprada - Rajinikanth - Kamal Hassan
Watch Anthuleni Katha Full Movie / Anthuleni Katha Movie, Starring Jayaprada, Rajinikanth, Sripriya ...

166. మాంగళ్య బలం


మాంగళ్య బలం

తిరుపతి వెంకటేశ్వరా! దొరా
నీవే దిక్కని నమ్మినామురా!
ఉన్నవాళ్ళు నీకోసం పుణ్యానికి వస్తారు
కడుపు చూపి యాచిస్తే కసరి తిట్టిపోస్తారు ~ తిరుపతి ~

నిట్ట రాళ్ళ దారి పోయి సిమెంట్ రోడ్డు వెలిసింది
కాలినడక మారిపోయి కార్ల వసతి కలిగింది
వచ్చే పోయే వారికెల్లా వనరు బాగా కుదిరింది
బిచ్చగాళ్ళ బొచ్చెలోన గచ్చకాయ పడింది ~ తిరుపతి ~

పొంగల్, పులిహోర, బూంది, అట్టు
చక్కెర పొంగల్,వడ, లడ్డు, బొబ్బట్టు
ఆరగించని నీ పేరున అర్పణ చేస్తుంటారు
ప్రసాదాలు వంతులేసి పంచుకొని తింటారు
నీకు, నాకు సున్నయేనయో -
నీవైన గాని నిగ్గదీసి అడగవేమయో ~ తిరుపతి ~

ఉన్నది చాలదనీ, హుండీలో డబ్బులేసి
వరములెన్నో కోరుకొంటారు
మేము-
జానెడు పొట్టకని బిచ్చం ఎత్తామని
ఉరిమిచూసి తరుముకొస్తారు
పోలీసుల పిలిపిస్తారు - వేనులోన
పొలిమేరల దాటిస్తారు ~ తిరుపతి ~

ఆపదలో మొక్కువారే అసలు భక్తులనుకోకు
ఆకలితో కొల్చు మమ్ము అన్యులమని యెంచకు
వేదాలకు తావులేక ఆదరమున చూసుకో
సర్వతముడవన్న బిరుదు సార్ధకము చేసుకో
దైవమన్న పేరు నిల్పుకో! - ఈ పేదవాళ్ళ
కడుపుమంట తీర్చి యేలుకో! ~ తిరుపతి ~

మాంగల్యబలం చిత్రంలోని యీ పాటను జమునారాణి గారు మాస్టర్ వేణు సంగీతసారధ్యంలో పాడగా, పద్మినీసిస్టర్స్ లో ఒకరైన రాగిణి అద్భుతంగా నర్తించారు.
Mangalya Balam Movie Songs - Thirupathi Venkateswara Song - Nageshwar Rao - Savithri - SV Ranga Rao
Mangalya Balam Movie Songs, Mangalya Balam Songs, Mangalya Balam Movie Video Songs, Thirupathi Venka...