Saturday, 25 November 2017

165. రాముని మించిన రాముడు (1975)



చిత్రం : రాముని మించిన రాముడు (1975)
సంగీతం : టి.చలపతిరావు
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి :
చిన్నారి నా రాణి చిరునవ్వులే నవ్వితే..
గాలి ఈల వేసింది... పూల వాన కురిసింది..
గాలి ఈల వేసింది... పూల వాన కురిసింది..
లోకమే... పులకించి మైకంలో ఉయ్యాలే ఊగెలే..

అందాల నా రాజు అనురాగమే చిందితే..
గాలి ఈల వేసింది... పూల వాన కురిసింది
గాలి ఈల వేసింది... పూల వాన కురిసింది..
లోకమే పులకించి మైకంలో ఉయ్యాలే ఊగెలే..

చరణం 1 :
నా నోము పండింది నేడు..
నాకు ఈ నాడు తొరికింది తోడు
నా రాణి అధరాల పిలుపు..
నాకు తెలిపేను తనలోని వలపు.. నిండు వలపు

అందాల నా రాజు అనురాగమే చిందితే..
గాలి ఈల వేసింది... పూల వాన కురిసింది
లోకమే... పులకించి మైకంలో ఉయ్యాలే ఊగెలే..

చరణం 2 :
ఎన్నెన్ని జన్మాల వరమో..
నేడు నా వాడవైనావు నీవు
నా వెంట నీవున్న వేళ..
కోటి స్వర్గాల వైభోగమేలా??.... భోగమేల?

చిన్నారి నా రాణి చిరునవ్వులే నవ్వితే..
గాలి ఈల వేసింది... పూల వాన కురిసింది
లోకమే... పులకించి మైకంలో ఉయ్యాలే ఊగెలే..

చరణం 3 :
ఈ తోట మన పెళ్ళి పీఠ..
పలికే మంత్రాలు గోరింక నోట
నెమలి పురివిప్పి ఆడింది ఆట..
వినగ విందాయే చిలకమ్మ పాట.. పెళ్ళి పాట

అందాల నా రాజు అనురాగమే చిందితే..
గాలి ఈల వేసింది.... పూల వాన కురిసింది
లోకమే... పులకించి మైకంలో ఉయ్యాలే ఊగెలే..






nandamuri taraka ramaro's Ramuni minchini Ramudu

164. ఆంటీ



10. తళ తళ తళుకుల తారకల...తహ తహ తలపుల కొరికలా
తలుపులు తెరిచిన తీపికల...పిలిచె నను ఈ వేళ

చిత్రం : ఆంటీ
సంగీతం : రమేశ్ వినాయగం
గానం : SP బాలు,చిత్ర

తళ తళ తళుకుల తారకల
తహ తహ తలపుల కొరికలా
తలుపులు తెరిచిన తీపికల
పిలిచె నను ఈ వేళ
నా హౄదయమున ఎదొ రాగం సరిగమలు పాడగ

ఊరించె ఊసులాడింది
ఉహలొ ఉండిపొకంది
అవకాశం అందుకొమ్మంది చక్కని చుక్క
నింగికి నిచ్చెన వెయన
నిగ నిగ నిధులను పొందన
బంగరు ఆంతుల తొటలొ రారారైపొనా.. అహ
కోటి కునుకుల కొంటె పిలుపుల
కోటి కునుకుల కొంటె పిలుపుల కాదని రమ్మనగ

ఎండల్లొ ఝల్లు కురిసింది
గుండెల్లొ మల్లె విచ్చింది
తీపంటె తెలిసి వచ్చింది ఆ స్నెహంతొ
వెచ్చని ఉపిరి వేణువె విరిసెను బతుకున నందనం
పచ్చని ఆశల పండగై పాడె అనందం
వెండి వెలుగులు పండు వెన్నెల వెండి వెలుగులు
పండు వెన్నెల నిండిన గుండెలలొ

https://www.youtube.com/watch?v=3G3zUQCj6go
tala tala taarakala - Telugu song - Aunty (1993)
a melodious telugu movie song

163. అహనా పెళ్ళంట




అహనా పెళ్ళంట
..నిలువెల్ల వెలుగుల వేకువులా ... సిరిమల్లే జల్లుల వెల్లువలా
హరివిల్లు రంగులా పల్లకిలా.. తొలివలుపు గుండెలో అల్లరిలా
నీ చెలిమి కనిపిస్తూ ఉందీ .. అని నాకు అనిపిస్తూ ఉందీఈ ...
Chitra gaaari voice so sweeeeet

నీకోసం ... నీకోసం
నువ్వే నచ్చావు ప్రేమలా ఆ
నాతో కలిసావు నీడగా..
మౌనమే దాటని మాటలే నీవనీ
కన్నులే తలవని కలయికే నీవనీ ఈ ఈ

ఎవేవో అనుకుంటున్నా .. ఎన్నేనో కనుగుంటున్నా
పులకింతలోనే ఉంటున్నా ఆ... పులకింతలొనే ఉంటున్నా ఆ
యేద రాగమే వింటున్నా కనుతేరిచి కలకంటున్నా
ఇది వింత సుఖమే అంటున్నా ఆ ఆ ..ఇది వింతసుఖమే అంటున్నా ఆ

ఆ మురళి రవళీలో సరిగమల.. ఆనంద కడలిలో తురియలల
అరవిచ్చుకున్న ఓ పువ్వనిలా . ఆ నింగినున్న చిరు తారకలా
నీ చేలిమి కనిపిస్తూ ఉందీ .. అని నాకూనిపిస్తూ ఉందీ ... ( నువ్వే )

అనురాగ లోగిలి నువ్వే .. అనువైన తోడువునువ్వే
అపరంజి హ్రుదయం నువ్వెలేఅ .. అపరంజి హ్రుదయం నువ్వెలేఅ
అభిమానం ఐన నువ్వే ....అనుబంధం ఐన నువ్వే
అపురూపం అంటే నువ్వెలేఅ... అపురూపం అంటే నువ్వెలేఅ

నిలువెల్ల వెలుగుల వేకువులా ... సిరిమల్లే జల్లుల వెల్లువలా
హరివిల్లు రంగులా పల్లకిలా.. తొలివలుపు గుండెలో అల్లరిలా
నీ చెలిమి కనిపిస్తూ ఉందీ .. అని నాకు అనిపిస్తూ ఉందీఈ ... ( నువ్వే )
https://youtu.be/pDbryBbajWM


162. దేశోద్ధారకులు (1973)


ఈ వీణకు శృతి లేదు
చిత్రం: దేశోద్ధారకులు (1973)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: సుశీల

పల్లవి:
ఈ వీణకు శృతి లేదు.. ఎందరికో హృదయం లేదు
నా పాటకు పల్లవి లేదూ.. ఈ బ్రతుకులెందులకో అర్థంకాదు..ఊ

ఈ వీణకు శృతి లేదు.. ఎందరికో హృదయం లేదు
నా పాటకు పల్లవి లేదూ.. ఈ బ్రతుకులెందులకో అర్థంకాదు..ఊ
ఈ వీణకు శృతి లేదు.. ఎందరికో హృదయం లేదు..

చరణం 1:
అందాన్ని వెలకట్టేవాళ్ళకు..అనురాగం వెలివేసినవాళ్ళకూ..
అందాన్ని వెలకట్టేవాళ్ళకు..అనురాగం వెలివేసినవాళ్ళకూ..

తెగిపోయిన తీగలు మీటేవాళ్ళకూ..ఊ..ఊ
నేనేమని చెప్పేదీ..ఈ..ఈ..ఏ పాటలు పాడేదీ..ఈ..ఈ..ఈ
అని కన్నీరొలికానూ..ఊ..ఆ కన్నీరంతా కాదూ
నా పాటకు పల్లవి లేదూ..ఈ బ్రతుకులెందుకో అర్థంకాదూ..

ఈ వీణకు శృతి లేదు.. ఎందరికో హృదయం లేదు..
చరణం 2:
అందరిలా పుట్టిన నేనూ..కొందరి ఆశకు బలి అయినాను..
అందరిలా పుట్టిన నేనూ..కొందరి ఆశకు బలి అయినాను..

నావలే ఎందరో ఉన్నారని తెలిసీ..ఇది ఎవరు చేసిందీ..ఈ..ఈ
ఏ దేవుడు రాసిందీ..ఈ..ఈ..ఈ
అని ఎలుగెత్తడిగానూ..ఊ..నా ప్రశ్నకు బదులే లేదూ..
నా ప్రశ్నకు బదులే లేదూ..ఈ బ్రతుకులెందుకో అర్థంకాదూ

ఈ వీణకు శృతి లేదు.. ఎందరికో హృదయం లేదు..



Watch the love song,"Ee Veenaku Sruthi Ledu" sung by P Susheela from the movie Desoddarakulu. Music: KV Mahadevan Lyrics: Atreya Cast: NTR, Vanisri Director:...

--((*))--

161 . గోదావరి (2006)

ఉప్పొంగి పోయింది గోదావరి...తాను తెప్పున్న ఎగిసింది గోదావరి...

చిత్రం : గోదావరి (2006)
సంగీతం : కె.ఎం. రాధాకృష్ణన్
సాహిత్యం : అడివి బాపిరాజు

ఉప్పొంగి పోయింది గోదావరి
తాను తెప్పున్న ఎగిసింది గోదావరి

ఉప్పొంగి పోయింది గోదావరి
తాను తెప్పున్న ఎగిసింది గోదావరి

కొండల్లో ఉరికింది గోదావరి
తాను కోనల్లో నిండింది గోదావరి
కొండల్లో ఉరికింది కోనల్లో నిండింది
ఆకాశ గంగతో హస్తాలు కలిపింది

ఉప్పొంగి పోయింది గోదావరి
తాను తెప్పున్న ఎగిసింది గోదావరి

మడులలో సుడులలో గరువాల నడలలో
పరవళ్ళు తొక్కుతూ ప్రవహించి వచ్చింది
అడవి చెట్లన్నీని జడలోన తురిమింది
ఊళ్ళు దండలు గుచ్చి మెళ్ళోన దాల్చింది

ఉప్పొంగి పోయింది గోదావరి
తాను తెప్పున్న ఎగిసింది గోదావరి
లాలాలలాలాల..లాలాలలాలాల..
లాలాలలాలాల..లాలాలలాలాల..
లాలాలలాలా..లాఆ..ఆఅ..

https://www.youtube.com/watch?v=4IXkWl9szuc
Uppongi Poyindi Godavari

160 .గాంధీ పుట్టిన దేశం



గాంధీ పుట్టిన దేశం
రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం
రఘుపతి రాఘవ రాజారాం
పతిత పావన సీతారాం
ఈశ్వర అల్లా తేరే నాం
సబకో సన్మతి దే భగవాన్‌

భేదాలన్నీ మరచీ మోసం ద్వేషం విడిచి
మనిషి మనిషిగా బ్రతకాలి
ఏనాడూ నీతికి నిలవాలి

ప్రజలకు శాంతి సౌఖ్యం
కలిగించే దేశమె దేశం
బానిస భావం విడనాడి
ఏజాతి నిలుచునో అదిజాతి
బాపూ.. నీ చల్లని దీవెన మా కివ్వు
నీ బాటను నడిచే బలమివ్వు

159 . అమరజీవి (1983)



అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు స్వామి..ఆడ ఉసురు తగలనీకు స్వామీ...
చిత్రం : అమరజీవి (1983)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల

సాకి :
శ్రీ రంగనాధ చరణారవింద చారాణ చక్రవర్తి! పుంభావ భక్తి!
ముక్తికై మూడు పుండ్రాలు నుదుటున దాల్చిన ముగ్ధ మోహన సుకుమార మూర్తీ.....ఈ ..ఈ..ఈ..
తొండరడిప్పొడి... నీ అడుగుధమ్ముల పడి..ధన్యమైనది ..
నీ దీన దీన దేవ దేవీ..నీ దాసాను దాసి..

నీ పూజల కు పువ్వుగా.. జపములకు మాలగా.. పులకించి పూమాలగా..
గళమునను.. కరమునను.. ఉరమునను..
ఇహములకు.. పరములకు నీదాననై..ధన్యనై..
జీవన వరాన్యనై తరియించుదాన.. మన్నించవే..మన్నించవే..
అని విన్నవించు నీ ప్రియ సేవిక .. దేవ దేవి. .

పల్లవి :
అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు స్వామి..
ఆడ ఉసురు తగలనీకు స్వామీ...
ముసురుకున్న మమతలతో.. కొసరిన అపరాధమేమి ?
స్వామీ... స్వామీ

అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు దేవీ ..
స్వామీ ఉసురు తగలనీకు దేవీ..
మరులుకున్నకరిమి వీడి మరలి ఈ నర జన్మ మేమి ..దేవి ..దేవీ!

చరణం 1 :
హరి హర సుర జేష్టాదులు.. కౌశికశుకవ్యాసాదులు
హరి హర సుర జేష్టాదులు.. కౌశికశుకవ్యాసాదులు
నిగ తత్వములను దెలిపి.. నీమ నిష్టలకు అలసి
పూనిన శృంగార యోగం ఇది కాదని .. నను కాదని ..
జడదారీ !..ఆ..ఆ..ఆ..ఆ.. పడకు పెడ దారి

అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు స్వామి..
ఆడ ఉసురు తగలనీకు స్వామీ...

అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు దేవీ ..
స్వామీ ఉసురు తగలనీకు దేవీ..

చరణం 2 :
నశ్వరమది..నాటక మిది... నాలుగు ఘడియల వెలుగిది..
కడలిని కలిసే వరకే... కావేరికి రూపు ఉన్నదీ
రంగని కీర్తన చేసే రాగమాలికను కానీ..
రంగని భక్తుల ముంగిట రంగ వల్లికను కానీ..
దేవి..దేవీ..దేవ దేవీ...

అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు దేవీ ..
స్వామీ ఉసురు తగలనీకు దే...

చరణం 3 :
అలిగే నట శ్రీ రంగం.. తొలగే నట వైకుంటం
యాతన కేనా దేహం?... ఈ దేహము సందేహం
ఈ క్షణమే సమ్మోహము... వీక్షణమే మరు దాహము

రంగా! రంగ... రంగ రంగ శ్రీ రంగ !!
ఎటు ఓపను..ఎటులాపాను?
ఒకసారి.. అ.. అ.. అనుభవించు ఒడి చేరి..



Watch Amarajeevi Full Movie / Amarajeevi Movie Starring Akkineni Nageshwara Rao, Jayapradha,…
youtube.com