Thursday, 19 January 2017

బాబాయ్ అబ్బాయ్ (1985)


తెలుసా..ఆ..ఆ ఆ నీకు తెలుసా ఆ ఆ ఆ...ప్రేమంటే ఒకే మనిషి నివసించే భువనమని

చిత్రం: బాబాయ్ అబ్బాయ్ (1985)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, జానకి

పల్లవి:

తెలుసా..ఆ..ఆ ఆ నీకు తెలుసా ఆ ఆ ఆ
ప్రేమంటే ఒకే మనిషి నివసించే భువనమని
ఒకే మురళి పలికే.. గోకులమని
ఒకే కెరటం ఉప్పొంగే..ఏ..ఏ.. యమున అని
అదే అదే..నా జీవమని గానమని
మౌనమని... తెలుసా..ఆ..ఆ ఆ

చరణం 1:

శీత గాలి వీచినప్పుడు లేత ఎండలా
ఎండ కన్ను సోకినప్పుడు మంచు కొండలా

ఆదుకునే వెచ్చని మమత..
ఆవిరయే చల్లని ఎడద
ఒకటే శృతి.. ఒకటే లయ.. ఒకటే స్వరమూ..

ఆ..ఆ..ఆ..ఆ...ఆ.ఆ..ఆ..
ఆ.....ఆ....ఆ....ఆ

ఉన్న రాగమొకటే... అదే.. అదే..ఏ..ఏ
అనురాగమని.. మౌన యోగమని
ప్రేమ దీపమని..

తెలుసా..ఆ..ఆ ఆ నీకు తెలుసా ఆ ఆ ఆ

చరణం 2:

శరత్కాల నదులలోని తేట నీటిలా
పుష్యమాస సుమదళాల తేనె వాకలా

సుప్రసన్న సుందర కవిత
సుప్రభాత మరందగుళిక
ఒక పార్వతి.. ఒక శ్రీసతి.. ఒక సరస్వతి..

సర్వ మంగళ మాంగల్యే థివే సర్వార్థ సార్థకే
శరణ్యే త్రయం వకే దేవి నారాయణీ నమోస్థుతే

ఉన్న మంత్రమొకటే..ఏ..ఏ..ఏ
అదే..అదే.. మమకారము
సృష్టికారణం.. బ్రహ్మకు జననం..

తెలుసా..ఆ..ఆ ఆ నీకు తెలుసా ఆ ఆ ఆ..
తెలుసా..ఆ..ఆ ఆ నీకు తెలుసా ఆ ఆ ఆ..
 

Monday, 9 January 2017

పూజాఫలం (1964)

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:


పగలే వెన్నెలా జగమే ఊయల...కదలె వూహలకే కన్నులుంటే...

చిత్రం : పూజాఫలం (1964)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : జానకి

పల్లవి:

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ....... ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పగలే వెన్నెలా జగమే ఊయల
కదలె వూహలకే కన్నులుంటే...
ఏ..ఏ..ఏ.... ఏ..ఏ..ఏ.
పగలే వెన్నెలా జగమే ఊయల

చరణం 1:

నింగిలోన చందమామ తోంగి చూచే...
నీటిలోన కలువభామ పోంగి పూచే.....ఏ..ఏ..ఏ.
యీ అనురాగమే జీవనరాగమై...
యీ అనురాగమే జీవనరాగమై...
యెదలొ తేనేజల్లు కురిసిపోదా...ఆ ఆ ఆ ఆ

పగలే వెన్నెలా జగమే ఊయల

చరణం 2:

కడలి పిలువ కన్నేవాగు పరుగుతీసే...
మురళిపాట విన్ననాగు శిరసునూపే.....
యీ అనుబంధమే మధురానందమై
యీ అనుబంధమే మధురానందమై
ఇలపై నందనాలు నిలిపిపోదా... ఆ ఆ ఆ ఆ

పగలే వెన్నెలా జగమే ఊయల

చరణం 3:

నీలి మబ్బు నీడలేచి నెమలి ఆడే...
పూలరుతువు సైగ చూచి పికము పాడే....
నీలి మబ్బు నీడలేచి నెమలి ఆడే...
పూలరుతువు సైగ చూచి పికము పాడే
మనసే వీణగా ఝున ఝున మ్రోయగా

బ్రతుకే పున్నమిగా విరిసిపోదా.. ఆ ఆ ఆ ఆ

పగలే వెన్నెలా జగమే ఊయల
కదలె వూహలకే కన్నులుంటే
ఏ..ఏ..ఏ.... ఏ..ఏ..ఏ.
పగలే వెన్నెలా....

https://www.youtube.com/watch?v=kgWi5YgJ8Wg
PAGALE VENNELA JAGAME VUYALA....CHITRAM:-PUJA PHALAM.mp4
"ఓ నెలరాజా" SUBSCRIBERS కు సినీ సంగీత రసికులందరికి నమస్కారం ఓ నెలరాజా ఆదరించినట్లు గానే ఈ మేనేజర్ ద్.

ముకుంద (2014)

ఓం శ్రీ రామ్ -  శ్రీ మాత్రే నమ:

గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా...గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా...

చిత్రం : ముకుంద (2014)
సంగీతం : మిక్కీ జె. మేయర్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : చిత్ర, కోరస్

గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా
గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా

విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా
తలపును లేపాలిగా బాలా..
పరదాలే తీయకా పరుపే దిగనీయకా
పవళింపా ఇంతగా మేలా..
కడవల్లో కవ్వాలు సడిచేస్తున్నా వినకా
గడపల్లో కిరణాలు లేలెమ్మన్నా కదలక
కలికీ ఈ కునుకేల తెల్లవార వచ్చెనమ్మ

గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా
గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా

నీ కలలన్నీ కల్లలై రాతిరిలో కరగవనీ
నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచేనే కన్యామణి
నీకోసమనీ గగనమే భువిపైకి దిగివచ్చెననీ
ఆ రూపాన్నీ చూపుతో అల్లుకుపో సౌదామినీ
జంకేలా జాగేలా సంకోచాలా జవ్వనీ
బింకాలూ బిడియాలూ ఆ నల్లనయ్య చేత చిక్కి
పిల్లన గ్రోవై ప్రియమారా నవరాగాలే పాడనీ..
అంటూ ఈ చిరుగాలి నిను మేలుకొలుపు సంబరాన

గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా
గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా

ఆఆ..ఆఆఅ..ఆఆఆ.ఆఆఆఆఅ...ఆఆ.ఆఆఆఆఆ.
...
ఏడే అల్లరి వనమాలీ నను వీడే మనసున దయమానీ
నందకుమారుడు మురళీలోలుడు నా గోపాలుడు ఏడే ఏడే

లీలాకృష్ణా కొలనిలో కమలములా కన్నెమది
తనలో తృష్ణ తేనెలా విందిస్తానంటున్నదీ
అల్లరి కన్నా దోచుకో కమ్మని ఆశల వెన్న ఇదీ
అందరికన్నా ముందుగా తన వైపే రమ్మన్నదీ
విన్నావా చిన్నారీ ఏమందో ప్రతిగోపికా
చూస్తూనే చేజారే ఈ మంచి వేళ మించనీక
త్వరపడవమ్మా సుకుమారి ఏమాత్రం ఏమారకా
వదిలావో వయ్యారీ బృందావిహారి దొరకడమ్మ

గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా
గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా

గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా
గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా 
https://www.youtube.com/watch?v=SYrdw-nDx5c
Gopikamma Full Video Song - Mukunda Video Songs - Varun Tej, Pooja Hegde
Watch : Gopikamma Full Video Song - Mukunda Video Songs - Varun Tej, Pooja Hegde Subscribe - http://...

Monday, 2 January 2017

తలంబ్రాలు (1986)


నిన్న నీవు నాకెంతో దూరం...నీవె నాకు ఈనాడు ప్రాణం ...

చిత్రం : తలంబ్రాలు (1986)
సంగీతం : సత్యం
సాహిత్యం : రాజశ్రీ
గానం : సుశీల, బాలు

నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం
నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం
కంటిలో పాపలా తేనెలో తీపిలా తోడుగా నాతో ఉండిపో...



నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం
నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం
కంటిలో పాపలా.. తేనెలో తీపిలా.. తోడుగా నాతో ఉండిపో...

నీలాల నింగి వంగి నేల చెవిలో ఇలా అంది
నీలాల నింగీ వంగీ నేల చెవిలో ఇలా అందీ
నీవున్నదాకా నేనున్నదాకా ఉంటుంది ప్రేమన్నదీ..
ఆ ప్రేమ నాలో ఉంది నీ పొందునే కోరుకుంది
ఆ ప్రేమ నాలో ఉందీ నీ పొందునే కోరుకుందీ
ఈ జన్మకైనా ఏ జన్మకైనా సరిలేరు మనకన్నదీ..
పరువాల పందిట్లో సరదాల సందిట్లో పండాలి వలపన్నదీ హొయ్
సరిలేని సద్దుల్లో విడిపొని ముద్దుల్లో మునగాలి మనమన్నదీ..

నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం
నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం
కంటిలో పాపలా.. తేనెలో తీపిలా.. నీడలా నాతో ఉండిపో... హొ

గోదారి కెరటంలోనా.. గోరంత సొగసే ఉంది
హొయ్.. గోదారి కెరటంలోనా.. గోరంత సొగసే ఉందీ
నీరెండలాంటి నీ చూపులోన కొండంత సొగసున్నదీ
కార్తీక పున్నమిలోనా కాసింత హాయే ఉందీ
కార్తీక పున్నమిలోనా కాసింత హాయే ఉందీ
ఏ వేళనైనా నీ నీడలోనా ఎనలేని హాయున్నదీ
కడసంధ్య వాకిట్లో కాపున్న చీకట్లో కరగాలి వయసన్నదీ హొయ్
చిరునవ్వు చిందుల్లో మురిపాల విందుల్లో సాగాలి మనమన్నదీ హొయ్

నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం
నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం
కంటిలో పాపలా తేనెలో తీపిలా నీడలా నాతో ఉండిపో...
నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం
నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం

Thursday, 3 November 2016

.అతడు

అతడు
https://youtu.be/zXo2mYXjYGk
అవును నిజం .. నువ్వంటే నాకిష్టం
ఈ నిముషం .. గుర్తించా ఆ సత్యం
చలి పరదా ఇక నిలవదు గా..
తెలుసు కదా.. ఆ .. ఆ.. ఆ

తెలిసిందే అడగాలా..
అడగందే అనవేలా..
చెవిలో ఇలా..చెబితే చాలా !

అవును నిజం .. నువ్వంటే నాకిష్టం
ఈ నిముషం .. గుర్తించా ఆ సత్యం

కసిరేస్తున్నా మనసుకి వినపడదో ఏమో
విసిరేస్తున్నా నిను విడి వెనుకకు రాదేమో
నిదరోతున్నా ఎదురై కనబడతావేమో
కదలాలన్నా కుదరని మెలి పెడతావేమో

అంతగా కంట చూడనని మొండికేస్తే తప్పేమో
ఒంటిగా ఉండనీయనని ముందుకొస్తే ముప్పేమో

మన సలహా మది వినదు కదా..
తెలుసు కదా .. ఆ.. ఆ.. ఆ
తెలిసే ఇలా చెలరేగాలా..

అవును నిజం .. నువ్వంటే నాకిష్టం
ఈ నిముషం .. గుర్తించా ఆ సత్యం

సుడిగాలిలో తెలియని పరుగులు తీస్తున్నా
జడపూలతో చెలిమికి సమయము దొరికేనా
ఎదరేముందో తమరిని వివరములడిగానా
ఎద ఏమందో వినమని తరుముకు రాలేనా

తప్పుకో..కళ్ళుమూసుకుని తుళ్ళి రాకే నా వెంటా
వప్పుకో..నిన్ను నమ్మమని అల్లుకుంటా నీ జంటా

నడపదుగా నిను నది వరదా..
తెలుసు కదా.. ఆ.. ఆ.. ఆ
తెలిసే ఇలా..ముంచెయ్యాలా !!

అవును నిజం .. నువ్వంటే నాకిష్టం
ఈ నిముషం .. గుర్తించా ఆ సత్యం
చలి పరదా ఇక నిలవదు గా..
తెలుసు కదా.. ఆ .. ఆ.. ఆ

తెలిసిందే అడగాలా..
అడగందే అనవేలా..
చెవిలో ఇలా..చెబితే చాలా !

Watch : Avunu Nijam Full Video Song - Athadu Video Songs - Mahesh babu,Trisha SUBSCRIBE Aditya…
youtube.com


. 0yoyala






గోపాల బాలుడమ్మ నా చందమామ
పదే పదే చూసుకున్న తనివితీరదమ్మ

రారా కన్నా కడుపార కన్నా
నా చిటికిలు వింటూ చూస్తవే
నేనేవరో తేలుసా నాన్నా
నిను ఆడించే నీ అమ్మను రా
నువు ఆడుకునే నీ బొమ్మను రా (గోపాల బాలుడమ్మ )

గుండే మీద తాకుతుంటే నీ చిట్టి పాదం
అందేకట్టి ఆడుతుంటే ఈ తల్లి ప్రాణం
ఉంగాలతొనే సంగీత పాటం
నేర్పావు నాకు నీ లాలి కోసం
ఉగ్గు పట్టనా .. దిష్టి తగలని చుక్క పెట్టన
బోసి నవ్వుల భాషకు నువ్వు
పిచ్చి తల్లికి ఊసులు చేపుతూ పలకరిస్తావు ఊ ఊ ఊ .. (గోపాల బాలుడమ్మ )

యే నోము ఫలమో పండి ఈ మోడు కోమ్మ
ఈ నాడు నిన్నే పోంది అందేర అమ్మ
ఇదే నాకు నేఅడు మరో కోత్త జన్మ్మ
ప్రసాదించినాడు ఈ చిన్ని బ్రహ్మ్మ

మూసి ఉంచ్చిన లేత పిడికిలి ఎమి దాచెనో
నిన్ను పంపుతూ దేవుడు ఇచ్చిన వరములన్ని
అమ్మకిచ్చావూ .. ఊ ఊఊ ఊఊ ( గొపాల బాలుడమ్మ )

Movie : Oyoyala
Singer : Chitra garu















1.మిధునం 2 ష్ గప్ చుప్ 3 వాన 4ముద్దులమేనల్లుడు 5 నారి నారి నడుమ మురారి

ఓం శ్రీ  రామ్ - శ్రీ మాత్రేనమ:

సర్వేజనా సుఖినోభవంతు

వాన
ఎదుట నిలిచింది చుడు జలతారు వెన్నెలేమో

ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో

ప్రాణంమంత మిటుతుంటే వాన వీణలో

నిజంలాంటి ఈ స్వప్నం ఎలా పట్టిఅపాలి

కలే ఐతె ఆ నిజం ఎలా తట్టుకోవాలి
అవునో కాదో అడగకంది నా మౌనం
చెలివో శిలవో తెలియకుంది ని రుపం
చెలిమి బంధం అల్లుకుందే...

నిన్నే చేరుకోలేకా ఎటెళ్లిందో నా లేఖ
వినేవారు లేక విసుక్కుంది నా కేక
నీదో కాదో వ్రాసున్న చిరునామ
ఉందో లేదో ఆ చోట నా ప్రేమా
వరంలంటి శాపమేదో సోంతమైందిలా..

Yeduta Nilichindi Choodu Video Song - Vaana Video Songs - Vinay, Meera Chopra
watch: Yeduta Nilichindi Choodu Video Song - Vaana Video Songs - Vinay, Meera Chopra Subscribe to ou.


కుహు కుహూ కూసే..కోయిల నాతో నీవు వచ్చావని..నీతో వసంతాలు తెచ్చావని...

చిత్రం :
బ్బు డబ్బు  డబ్బు
గానం : జానకి
సంగీతం : శ్యాం
సాహిత్యం : వేటూరి

పల్లవి :

కుహు కుహూ.. కూసే.. కోయిల నాతో నీవు వచ్చావని..
నీతో వసంతాలు తెచ్చావని...
బాగుందటా... జంటా బాగుందటా..
పండాలటా... మన ప్రేమే పండాలటా..

కుహు కుహూ... కుహు కుహూ...

చరణం : 1

నీడగ నీ వెంట నే జీవించాలంట...ఓ ఓ ఓ.. ఓ బావా
నీడగ నీ వెంట నే జీవించాలంట...ఓ ఓ ఓ.. ఓ బావా
నీహృదయం లోన.. మరుమల్లెల వానా..
నీహృదయం లోనా.. మరుమల్లెల వానా..
కురిసి..మురిసి..పులకించాలంటా...
కురిసీ..మురిసీ..పులకించాలంటా...

కుహు కుహూ... కుహు కుహూ...

చరణం : 2

గుండెల గుడిలోనా... నా దైవం నీ వంటా...ఓ ఓ ఓ.. ఓ బావా
గుండెల గుడిలోనా... నా దైవం నీ వంటా...ఓ ఓ ఓ.. ఓ బావా
నీ కన్నుల వెలిగే.. హారతి నేనంట..
నీ కన్నుల వెలిగే.. హారతి నేనంట..
కలసి... మెలసి... తరియించాలంట...
కలసీ... మెలసీ... తరియించాలంట...

https://www.youtube.com/watch?v=83oJ3B6CKVg
Kuhu Kuhu Song - Dabbu Dabbu Dabbu Movie Songs - Mohan Babu, Murali Mohan, Radhika
Watch Kuhu Kuhu Song From Dabbu Dabbu Dabbu Movie, starring Mohan Babu, Murali Mohan, Radhika among ...