నేటి ఆమ్రపాలి (01)
కూరుచున్న పక్కగ జేర కుదురలేక
వద్దు వద్దని పలుకులు వదలలేక
చక్కబరచా సరిగమలు చాటు గుండె
మక్కువ మనసు నాదగు మాయబ్రతుకు
విడువలేక మమత విద్య విలువకాక
పాపమెంతయో మనసుగా పాపభీతి
వీడనైతివి ఏలను విశ్వమందు
ఆదమరచి నేనిదురించు ఆటబ్రతుకు
నాదు కళలన్ని కరుగగా నమ్మబలుకు
చేదు తీపి తెలుపజూపు చిత్తమిదియి
కాలమౌనము నన్నుగా కమ్మియుండె
ఎంత చెప్పిన తక్కువే యేల బ్రతుకు
వీణ చేబట్టి వీనుల విశ్వతలపు
శ్రావ్యగానంబు చక్కగా శాంతి సలుపు
గాననైతివి హృదయము గన్నులార
వినగనైతివి గానంబు విద్యబ్రతుకు
వ్యర్థమైనది కాలము వన్నెతగ్గి
స్వార్థబుద్ధి కనగలేను సాకు చెంత
అర్థ పరమార్థ తత్త్వంబు ఆశబ్రతుకు
నింగి నేల యున్నతభవ నీడబ్రతుకు
****
*నేటి ఆమ్రపాలి*(2)
దవ్వు మనమధ్య తగ్గించి దాపుకొచ్చి
నవ్వు కురిపించ నయనాల నాట్యమాడ
పువ్వు పొందుమా శుభమగు పుడమి నందు
కొవ్వు కామ్యమైన బతుకు కూడు తీరు
కాచి రక్షించు టెప్పుడో కాననైతి
వేచి వున్నమనసు తీరు విద్య మలువు
కాచి చల్లార్చ విధినాది కాలమందు
సూచిక మెరుపు మాత్రమే సూత్ర మవ్వ
ఎంత వారైన మనమధ్య యెప్పుడైన
కొంత ఖర్చగు తీరున కోర్కెలగును
శాంతి కూర్చేటి వయసిది సమయమిది
కాంత కళలను తీర్చేటి కామ్య బతుకు
భేద భావాలు కలిగించ బెరుకు బుట్టు
వాద వాదంబులు గనని వాక్కు మహిమ
చేద బ్రతుకు గమ్య మగుట చిత్త మాయ
వేద భూమినా జీవన వింత బ్రతుకు
ఉదయ సాయంత్ర వేళలో నుద్దరించ
పొదుపు లేక యదుపులేక పోరు వలపు
చదును పానుపు కలతీర్చ చక్క జేయ
అదును జూపఆశను తీర్చ ఆకలి యది
నేటి ఆమ్రపాలి (03)
వచ్చు దూతల డుగుసడి వాంఛ దీర్చె
మచ్చు తునకలా సుఖమిచ్చు మాయ యున్న
వచ్చిపోయే ఋతువు తీరు వలపు విద్య
నచ్చుతుందనా నిజముగా నమ్మబ్రతుకు
ఎరుగ నైతిని హృదయాన యింత ముదము
పరుగు పరుగునా పదనిస పాఠ్య మవ్వ
కరిగి పోవు యవ్వనమగు కాల రీతి
మెరుగు పార్చేటి విద్యల మేను బ్రతుకు
గతము నందున నెన్నడు కాననైతి
సుతము ధర్మము తీరుగా సూత్ర మవ్వ
మతము కులము కాన వయసు మాన మందు
మితము లేని జీవన కూడు మిధ్య బ్రతుకు
అర్థ మైనది యిప్పుడే యసలు కిటుకు
వ్యర్థమైన జీవన మాని వ్యాపకంబు
స్వార్ధ చింత లేని తనము సాగు బుద్ధి
న్యార్ధ మేజీవ కళలవి నమ్మ బ్రతుకు
నన్ను బ్రోవంగ స్వయముగా నడచి వచ్చు
మిన్ను కోరిక తీర్చుటే మీరకుండ
కన్ను పొడిచియే దీక్షగా కాంక్ష తీర్చ
మన్ను పూజ్య మవగతీరు మచ్చ బతుకు
స్వామి నీవన్న తియ్యని సత్య మెరిగి
*****
నేటి ఆమ్రపాలి (04)
కొత్త గాలక్ష వెచ్చించి కొనుచు వచ్చు
మత్తు వదలగా మంచులా మాయ గరుగు
చిత్తు చిత్తుగా తొక్కియు చెత్తగాను
చిత్త మంత సిగ్గు నలుపా చేను బ్రతుకు
యింధనపుఖర్చు పెరిగిపోయెనని కంట
సంధి సేయగా కలిసేది సామరస్య
వంధి తాభవ భావము వాక్కు తీరు
గ్రంధి తామది తీరుగా రమ్య బ్రతుకు
వారు వీరనక విలువ వరుసలేక
తారుమారగు తీరుగా తాప నేస్త
నీరు కార్చు దొరయె పేద నీయిలనని
కారు చీకటి తప్పదే గాంచ బ్రతుకు
చిన్ని నుడువును మాటలు చెలిమి తోడ
సన్నిధానము గానగు సంతసంబు
పన్ని నాకొత్త కిటుకులు పాశ మవ్వ
సున్నితమయిన చురుకివ్వ సూణ్య బ్రతుకు
ముదము నేర్పుబ్రతుకుగాను ముఖ్యమగును
మదము మార్చ చురుకుగాను మలుపు గాంచ
యదను యిచ్చిపుచ్చుటనీతి యనక ముందు
విధము నేది యన్ననుగాంచ వింత బ్రతుకు
*******
[[[23/05, 09:56] Mallapragada Ramakrishna: నేటి ఆమ్రపాలి.. (05)
బయలు వెడలనే ఒంటిగ బాటసారి
వయసు ఊరుకోక మనసు వారకాంత
పయన ఖర్చులన్నీ కథపాఠ్యమేను
శయన తృప్తి నివ్వ వయసుసాని బ్రతుకు
గమ్యమెతుకుచు నడిరేయి కాలిబాట
రమ్యత కళలు సహనాయి రాశితీరు
సమ్యతాభవ తత్త్వము సంతసంబు
గమ్య జీవన వాంఛలే గరళ బ్రతుకు
వచ్చు చూచునుండె నెవ్వరో వాని వెనుక
నచ్చుతుందని గనక నమ్ము నాచుబుద్ధి
ముచ్చుమోహమన్న ఆరని మోహకంపు
మెచ్చు వారు వచ్చియు బాధమించి బ్రతుకు
వాని చూపులు ఏమార్చ వల్లకాదు
మౌనికాయన మధురత ముఖ్యమనియు
సానివై బెట్టు సంసారి సాగనీక
కాని పనులనోర్పు తపము గాంచు బ్రతుకు
గొంతు చించుకొని అరచుచు గోలచేస్తూ
నడచుచున్నట్టి ఏంటరి నరుడ నేను
అనుసరించుచు వచ్చెను అంతరాత్మ
గాలి ధూళితో నింపుతూ గగన బ్రతుకు
[23/05, 09:57] Mallapragada Ramakrishna: నేటి ఆమ్రపాలి.. (06)
కారు చీకట్లు కమ్మేసి కనులకేమి
కానిపించక మదినెంతో కలతపడుతూ
వెళ్లి చూసితి భక్తుల విస్తుపోతి
అంతకన్నను కోరము అధిక బ్రతుకు
మింగుతున్నారు కన్నులు మిటకరిస్తూ
కొంగుకోరివని చల్లగా కోరి మార్చి
చెంగున దూకు వరుసకు చిత్తమలుపు
ఖంగు తిన్న పులిగనైన కాలబ్రతుకు
దైవనైవేద్యమంతయు తనివితీర
సేవలన్నియు తప్పని చిత్రమాయె
భావమంతయు భజనగా భక్తిదాహ
నావనై సంద్రమున తేల నమ్మబ్రతుకు
భక్తిసేవలో కొందరు భజనపరులు
రక్తికొచ్చియు రవ్వలై రంగుమార్చు
యుక్తిగా సొమ్ములన్నియు ఉంచగలిగె
ముక్తిగాన భజన సముఖ్య బ్రతుకు
చిన్న గదిలోన చేరిరి సేదదీర
ఉన్నదానంతయును పంచు ఉజ్వలమగు
మన్ననెరుగని తీరు మనసుమాయ
సన్నుతించు సందడిగాను సరసబ్రతుకు
*****
[23/05, 09:46] Mallapragada Ramakrishna: నేటి అమ్రపాలి (8)
లేమి యన్నది లేకుండ లేశమైన
కామితార్థము తెల్పుచు కావ్యరీతి
సామి పూజవేళ ఇదిరా సాకు వద్దు
నేమి యనక పొందు ఫలము నిజము బ్రతుకు
కలువ వికసించి తామర కమిలిపోయె
తలపులన్ని కదల గాంచు తప్పుదారి
వలపు విలువలన్ని వరద వరుస తీరు
మలుపు కులుకుల మానసంబు మధ్య బ్రతుకు
ఇనుడు ఇలుజేరి నింగిన ఇందుడొచ్చె
కనుడు కాముకుడై కనువిందు కళ్లు జేసి
ఋణము తీరు కామము తీర్చు రుద్రమహిమ
క్షణము తృప్తి జీవిత మోహకాల బ్రతుకు
గూడు చేరిన గువ్వలు కూతనాపె
నాడు నడుమంత్రపు సిరులు నాట్యమాడ
కూడు ఏదొరక పట్టుట గుట్టుగాను
వాడు వీడు అనక శాంతి వాక్కు బ్రతుకు
కటిక చీకటి ధాత్రిని కమ్మివేసె
పటిక వెలుగునా పాశము పగ్గమేసి
నటిగ నటనలు జూపించి నమ్మబలుకు
స్పటిక వెలుతురు ఋణసుఖము పంచు బ్రతుకు
[23/05, 09:47] Mallapragada Ramakrishna: నేటి అమ్రపాలి (9)
బ్రతుకు బాటను వెతుకుచూ బాటసారి
మెతుకు కోరి యున్న తనము మేలు వలపు
అతుకులే బొంత జీవన ఆట మెరువు
గతులు ఎన్నియున్నను తప్పు గాంచు బ్రతుకు
అన్ని కోల్పోయి నిలుచుండె అంగలార్చి
సన్నిధానము తృప్తియే సాయతయియు
చిన్ని కమలము వికసించ చిత్తమాయ
నన్ని ప్రకృతి పరవశించు నయన బ్రతుకు
ఆదరించుము వానిని అవధరించు
కాదు కాదన విధముగా కాంక్ష తీర్చు
చేదు భవభావ మలుపులు చిత్తప్రభలు
నాదు పొంద కొన్నివదల నాటు బ్రతుకు
వంటకమ్ములు వడ్డించు వరుస కలుప
పంట చేతకొచ్చి మెరుపు పలుకు తలపు
కంటనీరు ఉన్న వదల గమ్యమోహ
ఇంట భోజనంబు బహుముఖ్య మిచ్చు బ్రతుకు
జీర్ణరసము లూర ఫలము జేయగాదె
స్వర్ణమెరుపు మయూరిగా సాక్షి వలపు
కర్ణకుండలాల మెరుపు కాలతీరు
వర్ణభేదము లేనిది వాంఛ బ్రతుకు
***
No comments:
Post a Comment