Saturday, 15 September 2018

నువ్వు నేను ప్రేమ...



ప్రేమించే ప్రేమవ...ఊరించె ఊహవ...ప్రేమించే ప్రేమవ...పూవల్లె పుష్పించే...

చిత్రం : నువ్వు నేను ప్రేమ...
సంగీతం::AR.రెహమాన్
రచన::వెన్నెలకంటి,వేటూరి
గానం::శ్రేయాఘోషల్,నరేష్ అయ్యర్

ప్రేమించే ప్రేమవ...
ఊరించె ఊహవ...
ప్రేమించే ప్రేమవ...
పూవల్లె పుష్పించీఎ...
నే..నేనా అడిగా నన్ను నేనే...
నేన్ నీవే హౄదయం అనదే...
ప్రేమించే ప్రేమవ

రంగో రంగోలి అని గొరింకె గుప్పెటే
రంగే పెట్టిన మెఘం విరిసి గాజుల సవ్వది ఘల్ ఘల్...
రంగో రంగొలీని గొరింకే గుప్పెటే,
రంగే పెట్టిన మేఘం విరిసి సుందరి
వన్నెలు చల్లగ మద్యాన చల్లని పున్నమి వెన్నెలై విరిసే...
ప్రేమించే ప్రేమవ

ఆ..ఆ...ఆ...ఊఊఊ......
పువై నా పూస్తున్నా నీ
పరువంగనె పుడుతా..
మదుమాసపు మాలల
మంటలు రగిలించెఉసురె..
నీవే న మది లొ వాడ,
నెనె నీ మొటమై రాగ...
నా నాడులొ నీ రక్తం,
నడక లొ నీ షబ్ధం ఉందె హొ...
తోడే దొరకని నాడు,
విల విల లాడె ఒంటరినై నెన్ హ్మ్మ్...
ప్రేమించే ప్రేమవ
నే నేనా అడిగా నన్ను నేనే...(2)
ప్రెమించే నా ప్రేమవ... ఊరించే ఊహవ...

వెలవెల వాడుక నడిగి
నెలవంకల గుడి కడదామ..
న పొదరింటికి వెరె అథిదులు రా తరమా...
తుమ్మెద చేరిన వెలె...
నీ మదిలొ చోటిస్తావా...
నెన్ ఒదిగె యెదపై ఎవరో
నిదురించ ర తరమా...
నీరే సంద్రం చెరే,
గలగల పారే మది తెలుసా...
ప్రేమించే ప్రేమవ

నే..నేనా అడిగ నన్ను నేనే...
నేన్ నీవే హౄదయం అనదె...
ప్రెమించే ప్రేమవ...
ఊరించే ఊహవా...
ప్రెమించే నా ప్రేమవ,
పూవల్లె పూవల్లె...రము

https://www.youtube.com/watch?v=qS9OmYoX2cQ
Preminche Premava Video Song || Nuvvu Nenu Prema || Surya, Bhoomika | Sri Balaji Video
Watch Nuvvu Nenu Prema Movie Video Songs (1080p) Starring Surya, Jyotika, Bhoomika Chawla, Vadivelu,...

చిల్లర కొట్టు చిట్టెమ్మ (1977)


సువ్వి కస్తూరి రంగా...సువ్వి కావేటి రంగా...సువ్వి రామాభిరామ...సువ్వి లాలీ

చిత్రం: చిల్లర కొట్టు చిట్టెమ్మ (1977)
సంగీతం: రమేశ్ నాయుడు
గీతరచయిత: దాసం గోపాలకృష్ణ
నేపధ్య గానం: బాలు, జానకి

పల్లవి:

సువ్వి ఆ హు సువ్వి ఆ హు ....సువ్వి...సువ్వి

సువ్వి కస్తూరి రంగా
సువ్వి కావేటి రంగా
సువ్వి రామాభిరామ
సువ్వి లాలీ

సువ్వి కస్తూరి రంగా
సువ్వి కావేటి రంగా
సువ్వి రామాభిరామ
సువ్వి లాలీ

హైలేసా హయ్యా .. హైలేసా హయ్యా .. హైలేసా హయ్యా .. హైలేసా హయ్యా ..

చరణం 1:

అద్దమరేతిరి నిద్దురలోన ముద్దుల కృష్ణుడు ఓ చెలియా
అద్దమరేతిరి నిద్దురలోన ముద్దుల కృష్ణుడు ఓ చెలియా
నా వద్దకు వచ్చెను ఓ సఖియా

సువ్వి కస్తూరి రంగా
సువ్వి కావేటి రంగా
సువ్వి రామాభిరామ
సువ్వి లాలీ

ఉ ఉ హు హయ్యా ... ఉ ఉ హు హయ్యా ... ఉ ఉ హు హయ్యా ...
ఉ ఉ హు హయ్యా ... ఉ ఉ హు హయ్యా ... ఉ ఉ హు హయ్యా ...

చరణం 2:

వంగి వంగి నను తొంగి చూచెను
కొంగు పట్టుకుని లగేనుగా
వంగి వంగి నను తొంగి చూచెను
కొంగు పట్టుకుని లగేనుగా
భల్ చెంగున యమునకు సాగేనుగా

సువ్వి కస్తూరి రంగా
సువ్వి కావేటి రంగా
సువ్వి రామాభిరామ
సువ్వి లాలీ ......

చరణం 3:

అల్లావనమున కొల్లలుగా వున్నా గొల్ల భామలను కూడితిని
నే గొల్లా భామనై అడితిని ...నే గొల్ల భామనై అడితినీ...

సువ్వి కస్తూరి రంగా
సువ్వి కావేటి రంగా
సువ్వి రామాభిరామ
సువ్వి లాలీ ....
సువ్వి...ఆహూం...సువ్వీ..ఆహుం..

నిద్దుర లేచి అద్దము చూడ ముద్దుల ముద్దర ఓ చెలియా ...
నిద్దుర లేచి అద్దము చూడ ముద్దుల ముద్దర ఓ చెలియా ...
హబ్బ... అద్దినట్టుంది ఓ సఖియా...

సువ్వి కస్తూరి రంగా
సువ్వి కావేటి రంగా
సువ్వి రామాభిరామ
సువ్వి లాలీ....

సువ్వి...ఆహూం...సువ్వీ..ఆహుం..
సువ్వి...ఆహూం...సువ్వీ..ఆహుం..
సువ్వి...ఆహూం...సువ్వీ..ఆహుం..

https://www.youtube.com/watch?v=8Z9qI1RLQ8g
Chillarakottu Chittamma | Suvvi Kasturi Ranga song
Listen to one of the melodious romantic songs, "Suvvi Kasturi Ranga" sung by SP Balasubramaniam and ...

ముక్కుపుడక (1983)



చినుకు చినుకుగా.. చిగురు మెత్తగా...గోరు వెచ్చగా.. గుండె విచ్చగా

చిత్రం : ముక్కుపుడక (1983)
సంగీతం : జె.వి. రాఘవులు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు, జానకి

పల్లవి:

చినుకు చినుకుగా.. చిగురు మెత్తగా
గోరు వెచ్చగా.. గుండె విచ్చగా

చినుకు చినుకుగా.. చిగురు మెత్తగా
గోరు వెచ్చగా.. గుండె విచ్చగా
చేరుకో సరాగిణీ.. చేరుకో తరంగిణీ

చినుకు చినుకుగా... చిగురు మెత్తగా
గోరు వెచ్చగా... గుండె విచ్చగా

చరణం 1:

అల్లన ఉదయించే ప్రతి కిరణం.. చల్లగ చలియించే నీ చరణం
నింగిని విహరించే ప్రతి మేఘం.. పొంగిన ప్రేమకు సందేశం
ఊహలే ఊసులై.. ఆశలే బాసలై
హే హే..ఊహలే ఊసులై.. ఆశలే బాసలై
మధువులు చిలుకగా మధురిమలొలకగా ప్రణయవేద మంత్రమేదో పలుకగా

చినుకు చినుకుగా.. చిగురు మెత్తగా
ఆహాహా.. గోరు వెచ్చగా.. గుండె విచ్చగా
చేరుకో సరాగిణీ.. చేరుకో తరంగిణీ
ఆ ఆ చినుకు చినుకుగా.. చిగురు మెత్తగా
గోరు వెచ్చగా.. గుండె విచ్చగా

చరణం 2:

వలచిన జంటను కనగానే.. చిలకలకే కన్ను చెదిరిందీ
కవితలకందని పలుకులలో.. కమ్మని దీవెన మురిసిందీ
కడలియే గగనమై.. గగనమే కడలియై
ఆహాహా.. కడలియే గగనమై.. గగనమే కడలియై
సహచరి నడకల స్వరఝరి తొణకగ సరసరమ్య దివ్యసీమ నిలుపగ

చినుకు చినుకుగా.. చిగురు మెత్తగా
గోరు వెచ్చగా.. గుండె విచ్చగా
చేరుకో సరాగిణీ.. చేరుకో తరంగిణీ

చినుకు చినుకుగా... చిగురు మెత్తగా
గోరు వెచ్చగా... గుండె విచ్చగా
గోరు వెచ్చగా... గుండె విచ్చగా
గోరు వెచ్చగా... గుండె విచ్చగా

https://www.youtube.com/watch?v=CCHSLp2QPc8
mukku pudaka songs

భగత్



అన్ని నీవనుకున్నా..ఎవరున్నరు నీకన్నా..ఈ రాధమ్మ కోరేది నిన్నేనురా...

చిత్రం : భగత్
సంగీతం : నవీన్ జ్యొతి
గానం : చిత్ర

అన్ని నీవనుకున్నా..ఎవరున్నరు నీకన్నా?
ఈ రాధమ్మ కోరేది నిన్నేనురా
కలనైనా రమ్మని పిలిచేవా?
నా కన్నుల్లో చెమ్మలు తుడిచేవా?

గుండె పగిలిపోతున్నా గొంతు విప్పలేను
కలలు చెరిగిపోతున్నా కలత చెప్పలేను
ఈ మూగ రాగమేదొ ఆలకించవా
ఆలకించి నన్ను నీవు ఆదరించవా

చందమామ రాకుంటే కలువ నిలువ లేదు
జతగ నీవు లేకుంటే బ్రతుకు విలువ లేదు
ఇన్నాళ్ళు కాచుకున్న ఆశ నీదిరా
ఆశ పడ్డ కన్నె మనసు బాస నీదిరా

https://www.youtube.com/watch?v=KdrMSo-T-28
అన్నీ నీవనుకున్నా...ఎవరున్నారు నీకన్నా
 
































   

ష్...గప్ చుప్


తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా
మకరందాలే మది పొంగి పొంగి పోయెనమ్మ తుంటరిగా

చిత్రం : ష్...గప్ చుప్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర
సంగీతం : రాజ్,కోటి

పల్లవి :

తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా
మకరందాలే మది పొంగి పొంగి పోయెనమ్మ తుంటరిగా
అమ్మడి సిగ్గులే గుమ్మడి పువ్వులై
పిల్లడి పల్లవే పచ్చని వెల్లువై
సాగపా దాపపా దాససా రీసదా
సాగపా దాపపా దాససా రీసదా
కాటుకాకళ్ళలో కన్నె వాకిళ్ళలో

చరణం :

తిక్కనలో తీయదనం లిపి చక్కని నీ కన్నెతనం
పోతనలో రామరసం, వడబోసెను నీ ప్రేమరసం
ప్రాయానికే వేదం, నవపద్మావతీపాదం
రాగానికే అందం రసగీతగోవిందం
వంశధర ఒడిలో హర్షవల్లికా
సూర్యకాంత వీణారాగదీపిక

సాగపా దాపపా దాససా రీసదా
సాగపా దాపపా దాససా రీసదా
కాటుకాకళ్ళలో కన్నె వాకిళ్ళలో
తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా
మకరందాలే మది పొంగి పొంగి పోయెనమ్మ తుంటరిగా

చరణం :

క్షేత్రయలో జాణతనం, వరదయ్యెనులే వలపుతనం
అందని నీ ఆడతనం, అమరావతిలో శిల్పధనం
ఏడుగ చీలిందిలే నది గౌతమి గోదావరి
ఏకం కావాలిలే ఏడుజన్మలబంధాలివి
కృష్ణవేణి జడలో శైలమల్లిక
శివుని ఆలయాన భ్రమరదీపిక

సాగపా దాపపా దాససా రీసదా
సాగపా దాపపా దాససా రీసదా
కాటుకాకళ్ళలో కన్నె వాకిళ్ళలో
తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా
మకరందాలే మది పొంగి పొంగి పోయెనమ్మ తుంటరిగా

https://www.youtube.com/watch?v=_ZxtIPYNeas&feature=youtu.be
telugandaale from shh..gupchup...Lyrics that reflect Telugu culture.
తెలుగందాలు, కాటుక కళ్ళు, కన్నె వాకిళ్ళు, తిక్కన, పోతన, వంశధార, క్షేత్రయ, అమరావతి, గోదావరి, కృష్ణవేణి...
 

అన్వేషణ

కీరవాణి… చిలకల కొలికలు పాడవేమే… వలపులే తెలుపగ..
విరబూసిన ఆశలు.. విరితేనెలు చల్లగ..

చిత్రం : అన్వేషణ
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం :
గానం : బాలసుబ్రహ్మణ్యం,జానకి

స… ని-స-రి స ని
స…. ని-స-మ-గ మ రి
ప-ద స… ని-స-రి స ని
స…. ని-స మ-గ మ-రి
ప ద స-స-స ని రి-రి-రి స గ-గ-గ రి మ-మ-మ గ మ….
స ని ద ప మ గ రి స ని

కీరవాణి… చిలకల కొలికలు పాడవేమే… వలపులే తెలుపగ
విరబూసిన ఆశలు.. విరితేనెలు చల్లగ..
అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధురసవాణి… కీరవాణి
చిలకల కొలికలు పాడవేమే… వలపులె తెలుపగా……

ఈ పూలలొ అందమై.. ఈ గాలిలొ గంధమై
నా తొటలొ చైత్రమై… ఈ బాటనే నడచిరా
నీ గగనాలలో నే చిరు తారనై
నీ అదరాలలొ నే చిరునవ్వునై
స్వరమే లయగా ముగిసే….
సలలిత కలరుత స్వరనుత గతియుత గమకము తెలయకనె..

కీరవాణి.. చిలకల కల కల పాడలెదు…
వలపులే తెలుపగ…
ఇలరాలిన పువ్వులు వెదజల్లిన తావుల.. అలికిడి ఎరుగని పిలుపుల అలిగిన మంజులవాణి…..
కీరవాణి.. చిలకల కల కల పాడలెదు…
వలపులే తెలుపగ…

నీ కన్నుల నీలమై.. నీ నవ్వుల వెన్నెలై
సంపెంగల జాలినై .. తారాడన నీడనై
నీ కవనాలలొ నె చలి ప్రాసనై
నీ జవనాలలొ జాజులవాసనై
ఎదలొ..ఎదనె… కదిలె….
పడుచుల మనసుల పంజర సుఖముల పలుకులు తెలియకనె

కీరవాణి.. చిలకల కల కల పాడలెదు…
వలపులే తెలుపగ… విరబూసిన ఆశలు.. విరితేనెలు చల్లగ..
అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధురసవాణి… కీరవాణి
చిలకల కొలికలు పాడవేమే… వలపులె తెలుపగా……

https://www.youtube.com/watch?v=saibPv8q_jo
Anveshana - Telugu Songs - Keeravani la
Telugu Video Songs From Karthik & Bhanupriya's Anveshana Anveshana Telugu Songs, Anveshana Telugu Mo...
 

ప్రేమించు పెళ్లాడు (1985)



ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని...రొదగా ..నా ఎదలో.. తుమ్మెదలా చేసే ప్రేమాలాపన..

చిత్రం: ప్రేమించు పెళ్లాడు (1985)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, జానకి

పల్లవి:

లాల...లాలా....లాలా..లా.లా..
ల..లా..లాలా...ల..లా..
ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని..ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని
రొదగా ..నా ఎదలో.. తుమ్మెదలా చేసే ప్రేమాలాపన..
రొదగా ..నా ఎదలో ...తుమ్మెదలా చేసే ప్రేమాలాపన..

ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని..ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని
లాలా..లాలా..ల..లా..లా..లా..లా...

చరణం 1:

విడిపోలేనీ విరి తీవెలలో.. వురులే మరులై పోతుంటే... హో
ఎడబాటేదీ ఎద లోతులలో..అదిమీ వలపే పుడుతుంటే..
తనువు తనువు ..తరువు తరువై ..పుప్పోడి ముద్దే పెడుతుంటే...
పూలే గంధం పూస్తుంటే ..ఏ..

తొలిగా.. నా చెలితో కౌగిలీలో సాగే ప్రేమారాధనా...
ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని..ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని
లాలా..లాలా..ల..లా..లా..లా..లా... లాలా..లాలా..ల..లా..లా..లా..లా...
లాలా..లాలా..ల..లా..లా..లా..లా...లాలా..లాలా..ల..లా..లా..లా..లా...

చరణం 2:

గళమే పాడే కళ కోయిలనే...వలచీ పిలిచే నా గీతం..హోయ్..
నదులై సాగే ఋతు శోభలనే అభిషేకించే మకరందం...
గగనమ్... భువనమ్ ...కలిసే సొగసే...
సంధ్యారాగం అవుతుంటే...
లయలే ప్రియమై పోతుంటే....హోయ్..
వనమే ..యవ్వనమై ...జీవనమై సాగే రాధాలాపనా...

ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని..ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని
రొదగా ...నా ఎదలో ...తుమ్మెదలా చేసే ప్రేమాలాపన..

https://www.youtube.com/watch?v=9kndifGXDEQ
IR's Ee Chaitra Veena -Preminchu Pelladu-Vamsy (my version)
Music: Maestro Ilaiyaraja Lyrics: Veturi Singers: SPB & S Janaki Film: Preminchi Pelladu Director: V...