Thursday, 7 June 2018

రావయ్యా రామేశం...ఏమయ్యా ఆవేశం...నాజూకు చూపావో నా చుట్టూ తిప్పిస్తాను
గిరుక్కు గిరుక్కు గిరుక్కున... గిర గిర గిర గిర గిర....

చిత్రం: చుట్టాలున్నారు జాగ్రత్త (1980)
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:

రా.. రా.. రా..
రావయ్యా రామేశం...ఏమయ్యా ఆవేశం...
నాజూకు చూపావో నా చుట్టూ తిప్పిస్తాను
గిరుక్కు గిరుక్కు గిరుక్కున... గిర గిర గిర గిర గిర

చిన్నారి నాంచారీ ...మన్నించూ ఈ సారీ
నా వెంటే పడుతుంటే ..నీ భరతం పట్టిస్తాను
తళాంగు తళాంగు తళాంగుతోం...తక తక తక తక తక

చరణం 1:

నిలువూ.. ఏమంత బిగువూ..నిను నిలదీసి వలవేసి లాగేస్తా

అందాక నువ్వొస్తే.. ఆపైన నే చూస్తా ..
తీరా నువు లాగేస్తే.. తీయంగా అంటిస్తా..
చురుక్కు చురుక్కు చురుక్కున... చుర చుర చుర చుర చుర

రమ్మంటూ నేనంటే..రానంటూ నువ్వుంటే... గారాలే పోతుంటే..
నీ బుగ్గ చిదిమేస్తాను..చిటుక్కు చిటుక్కు చిటుక్కున... చిట చిట చిట చిట చిట

చిన్నారి నాంచారీ ...మన్నించూ ఈ సారీ
నా వెంటే పడుతుంటే ..నీ భరతం పట్టిస్తాను
తళాంగు తళాంగు తళాంగుతోం...తక తక తక తక తక

చరణం 2:

అలకా..బంగారు తునకా..ఏదో అలవోకగా అంటే.. అంత కినుకా
అలకా ..బంగారు తునకా.. ఏదో అలవోకగా అంటే ..అంత కినుకా

నీ వైనం చూస్తుంటే ...హైరానా అవుతుందీ
నన్ను అల్లరి చూస్తుంటే... నా గుండే అంటుంది
కలుక్కు కలుక్కు కలుక్కునా... కల కల కల కల కల

రమ్మటూ నువ్వంటే... రానంటూ నేనుంటే ...నా మాటా వినకుంటే
నీ ఆట కట్టిస్తాను ...గబుక్కు గబుక్కు గబుక్కున.. గబ గబ గబ గబ గబ

రావయ్యా రామేశం...ఏమయ్యా ఆవేశం...
నాజూకు చూపావో నా చుట్టూ తిప్పిస్తాను
గిరుక్కు గిరుక్కు గిరుక్కున... గిర గిర గిర గిర గిర

చిన్నారి నాంచారీ ...మన్నించూ ఈ సారీ
నా వెంటే పడుతుంటే ..నీ భరతం పట్టిస్తాను
తళాంగు తళాంగు తళాంగుతోం...తక తక తక తక తక

https://www.youtube.com/watch?v=ycsoJk_dvcc

కాచుకొంటి కాచుకొంటి...కళ్ళు కాయునంతదాక
చెప్పవమ్మ చెప్పవమ్మ ...చుప్పనాతి రామచిలక

చిత్రం : అందమైన అనుభవం (1979)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం: బాలు

What a waiting
What a waiting
Lovely birds tell my darling
You were watching you were watching
Love is but a game of waiting

కాచుకొంటి కాచుకొంటి
కళ్ళు కాయునంతదాక
చెప్పవమ్మ చెప్పవమ్మ
చుప్పనాతి రామచిలక
మొక్కనాటి కాచుకున్న
మొగ్గ తొడిగి పూచేనమ్మా
ఆమె రాదు ఆమె రాదు
ప్రేమ లేదో అడగవమ్మ

What a waiting
What a waiting
Lovely birds tell my darling
You were watching you were watching
Love is but a game of waiting

కాచుకొంటి కాచుకొంటి
కళ్ళు కాయునంతదాక
చెప్పవమ్మ చెప్పవమ్మ
చుప్పనాతి రామచిలక

https://www.youtube.com/watch?v=Y2mYEUcdeE8

చిత్రం : తెనాలి రామకృష్ణ

చేసేది ఏమిటో చేసేయి సూటిగా...వేసేయి పాగా ఈ కోటలో ..

చిత్రం : తెనాలి రామకృష్ణ
గానం : ఘంటసాల
సంగీతం : విశ్వనాథన్ రామమూర్తి
సాహిత్యం : సముద్రాల సీనియర్

పల్లవి :

చేసేది ఏమిటో చేసేయి సూటిగా
వేసేయి పాగా ఈ కోటలో .. చేసేది
ఎన్ని కష్టాలు రానీ నష్టాలు రానీ
నీ మాట దక్కించుకో బాబయ్య

చరణం : 1

నాటేది ఒక మొక్క వేసేది నోరు కొమ్ము
కొమ్మ కొమ్మ విరబూసేది వేలాదిగా
ఇక కాయాలి బంగారు కాయలు
భోంచేయాలి మీ పిల్ల కాయలు

చరణం : 2

రహదారి వెంట మొక్క నాటి పెంచరా
కలవాడు లేని వాడు నిన్ను తలచురా
భువిని తరతరాలు నీదు పేరు నిలుచురా
పనిచేయువాడే ఫలము నారగించారా

https://www.youtube.com/watch?v=D4AW0VkmoPc

సూత్రధారులు (1989)

మహారాజ రాజశ్రీ మహనీయులందరికి...వందనాలూ వంద వందనాలూ

చిత్రం : సూత్రధారులు (1989)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : బాలు, మనో

పల్లవి :

మహారాజరాజ శ్రీ మహనీయులందరికీ
వందనాలు.. వంద వందనాలు
హరిహరులను సేవించే ఈ దాసులాడేటి
తందనాలూ.. తకిట తందనాలూ
వందనాలూ.. వంద వందనాలూ
తందనాలూ.. తకిట తందనాలూ

చరణం 1 :

సన్నాయి స్వరమెత్తి చిన్నారి బసవన్నా
చెన్నార చిందాడ కన్నార కనులారా
సిరులిచ్చే దీవించే సింహాదిరప్పన్నా
సిరిగజ్జలల్లాడ చెవులార విన్నారా
ముంగిళ్ళ బసవన్నా మురిసీ ఆడేవేళా
గుండె గుడిలో శివుడు మేలుకోవాలా
కోదండ రామన్నా.. గోవుల్ల గోపన్నా
కోలాటమాడుతూ కొలువూ తీరాలా

https://www.youtube.com/watch?v=jreVxVi3Zs4
కొలువై ఉన్నాడే దేవ దేవుడు...కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే...

చిత్రం : స్వర్ణ కమలం
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : SP.బాలసుబ్రహ్మణ్యం,P.సుశీల

కంఠేనాలంబయేత్ గీతం హస్తేన అర్ధం ప్రదర్శయేత్
చక్షుభ్యాం దర్శయేత్ భావం పాదాభ్యాం తాళం ఆచరేత్

పల్లవి :

కొలువై ఉన్నాడే దేవ దేవుడు
కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే
వలరాజు పగవాడే వనిత మొహనాంగుడే
కొలువై ఉన్నాడే...

చరణం : 1

పలుపొంకమగు చిలువల కంకనములమర
నలువంకల మనిరు చులవంక కనర
తలవంక నలవేలు...కులవంక నెలవంక
వలచేత నొసగింక వైఖరి మీరంగ

కొలువై ఉన్నాడే దేవ దేవుడు....కొలువై ఉన్నాడే

చరణం : 2

మేలుగ రంతనంబు రాళు చెక్కిన ఉంగరాలు
భుజగ కేయు రాలు నెరయంగ
పాలు గారు మోమున శ్రీ ను పొడమా...
పులి తోలు గట్టి ముమ్మొన వాలు బట్టి తెరగా

కొలువై ఉన్నాడే దేవ దేవుడు...దేవ దేవుడు కొలువై ఉన్నాడే

https://www.youtube.com/watch?v=aMjeq_9p06E


   
Sri Krutha
June 25 at 6:34am
 
ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి...కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి...

చిత్రం : శృతిలయలు (1987)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : అన్నమయ్య
నేపధ్య గానం : బాలు, వాణీ జయరాం

పల్లవి :

ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి
ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి
కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి ఇంతి చెలువపు రాశి

ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశిఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశికన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి.. ఇంతి చెలువపు రాశి

చరణం 1 :

కలికి బొమ విండ్లుగల కాంతకును.. ధనురాశి
మెలయు మినాక్షికిని.. మీనరాశి
కలికి బొమ విండ్లుగల కాంతకును.. ధనురాశి
మెలయు మినాక్షికిని.. మీనరాశి

కులుకు కుచకుంభముల కొమ్మకును.. కుంభరాశి
వెలగు హరిమధ్యకును.. సింహరాశి

ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి
కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి.. ఇంతి చెలువపు రాశి

చరణం 2 :

చిన్ని మకరంకపు బయ్యెద చేడెకు.. మకరరాశి
కన్నె ప్రాయపు సతికి... కన్నెరాశి
చిన్ని మకరంకపు బయ్యెద చేడెకు.. మకరరాశి
కన్నె ప్రాయపు సతికి... కన్నెరాశి

వన్నెమైపైడి తులదూగు వనితకు.. తులరాశి
వన్నెమైపైడి తులదూగు వనితకు.. తులరాశి
తిన్నని వాడి గోళ్ళ సతికి... వృశ్చికరాశి

ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి

చరణం 3 :

ఆముకొని నొరపుల మెరయు నతివకు.. వృషభరాశి
గామిడి గుట్టుమాటల సతికి.. కర్కాటక రాశి
ఆముకొని నొరపుల మెరయు నతివకు.. వృషభరాశి
గామిడి గుట్టుమాటల సతికి.. కర్కాటక రాశి

కోమలపు చిగురుమోవి కోమలికి.. మేషరాశి
ప్రేమ వేంకటపతి కలిసే ప్రియ.. మిథున రాశి
ప్రేమ వేంకటపతి కలిసే ప్రియ.. మిథున రాశి

ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి
కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి ఇంతి చెలువపు రాశి

https://www.youtube.com/watch?v=DorQlNRVmCY
నెమలికి నేర్పిన నడకలివీ..మురళికి అందని పలుకులివీ

చిత్రం : సప్తపది
సంగీతం : KV.మహదేవన్
సాహిత్యం : వేటూరి
గానం : S.జానకి

పల్లవి :

నెమలికి నేర్పిన నడకలివీ
మురళికి అందని పలుకులివీ
శృంగార సంగీత నృత్యాభినయ వేళ
చూడాలి నా నాట్య లీలా
నెమలికి నేర్పిన
నెమలికి నేర్పిన నడకలివీ

చరణం : 1

కలహంసలకిచ్చిన పదగతులు
ఇల కోయిల మెచ్చిన స్వరజతులు
ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు
ఏవేవో కన్నుల కిన్నెరలు
కలిసి మెలిసి కలలు విరిసి మెరిసిన
కాళిదాసు కమనీయ కల్పన
వల్ప శిల్ప మనిమేఖలను....శకుంతలను

నెమలికి నేర్పిన నడకలివీ

చరణం : 2

చిరునవ్వులు అభినవ మల్లికలు
సిరిమువ్వలు అభినయ గీతికలు
నీలాల కన్నుల్లో తారకలు
తారాడె చూపుల్లో చంద్రికలు
కురులు విరిసి మరులు కురిసి మురిసిన
రవి వర్మ చిత్ర లేఖనా లేఖ
సరస సౌందర్య రేఖను....శశిరేఖను

https://www.youtube.com/watch?v=hb0j7N7a6fA