Thursday, 8 January 2026


*రచన సీసమాలిక*
              ****
జ్ఞానమేడుస్థితులు-గమనించిచూడగా!
సప్తజ్ఞానపుభూమి-సంతరించు!
శుభమిచ్ఛయననాకు-సుబ్రహ్మ జ్ఞానమ్ము!
సుప్రసాదపుకోర్కె-సుఖమునిచ్చు!
జ్ఞానమేవిధముగా-సంప్రాప్తియగునను!
స్వాధ్యాయ,ధ్యానము-సజ్జనాళి!
సాంగత్య మీమాంస-సంశోధనమ్మున!
సమకూర్చుసత్యము-సతతపపునిధి!
తనుమానసముగతి-తన్నిమగ్నమ్మవ్వ!
తనుమానసమునను-ధరణిమూడు!
సత్త్వాపతిన్నాల్గు-సాత్విక,శుధ్ధత!
సాధించుసుస్థితి-సాధుయోగి!
ఐదవదసంసక్తి-యాదిభౌతికతపై!
య్యనాసక్తిపొందుట-ననగతామరపైన!
సలిలపుచుక్కగా-సాగువిధము!
పదార్థభావని-పరికింపనారోది!
ఆత్మలోజ్ఞానాన్ని-యందిపుచ్చు!
సవికల్పపుసమాధి-సంస్థితిదివ్యత్వ!
చక్షువునుత్తేజ-శాంతినిచ్చు!
ఏడుతురీయమ్ము-నీజాగృతస్వప్న్యపు!
స్థితులను దాటిన-చేతనిర్వి!
కల్పసమాధినా-స్కలితయోగి!

*తేగీ
అట్టియోగులునందరు*నాత్మజ్ఞాన!
మదినిపంచచుజనులను*మలచబూని!
కంకణముకట్టుకొనెదరు*కణకణమున!
ఇట్టి జ్ఞానభూమికలేడు-నిహపరముగ!

మాడుగుల మురళీధరశర్మ
సిద్ధిపేట
🎵 పాట – 1
“సమయం లేదు… అనుకున్న మనిషి”
(మెల్లని, లోతైన, ఆత్మసాక్షి రాగం)
చరణం – 1
ఒకప్పుడు పన్నెండు గంటల బాటలో
ఇప్పుడు నాలుగు గంటలే చాలదా
అయినా పెదవుల మీదే మాట ఒకటే
“సమయం లేదు” అనీ పలుకదా
చరణం – 2
పన్నెండు మంది నవ్విన ఇంటిలో
ఇప్పుడు ఇద్దరే మిగిలినా
మాటల మధ్య మౌనమే పెరిగి
“సమయం లేదు” అంటునా
పల్లవి
సమయం లేదు… సమయం లేదు
అంటూనే జీవితం జారిపోయిందే
చేతిలో గంటలన్నీ ఉన్నా
మనసుకే ఒక్క క్షణం దొరకలేదే
చరణం – 3
రెండు వారాల వార్త ఇప్పుడు
రెండు సెకన్లలో చేరినా
మనిషి మనిషిని చేరే వేళ
సమయం లేదంటునా
బ్రిడ్జ్
మొబైల్‌లో ప్రపంచం పట్టుకుని
మనసునే మర్చిపోయే మాయలో
స్వయమే తననుంచి పారిపోయి
ఒంటరిగా నిలిచే నడుమలో
పల్లవి (రీపీట్)
సమయం ఉంది… సమయం ఉంది
కానీ జీవించడమే మరిచిపోయిందే
చివరి క్షణంలో తెలిసొస్తుంది
అప్పుడు మాటలు మౌనమవుతాయే
*-*-*
పాట – 2
“కొంచెం జీవించు మనిషీ”
(సాఫ్ట్ హోప్‌ఫుల్, హ్యూమన్ టచ్ ఉన్న రాగం)
చరణం – 1
లిఫ్ట్‌లో ఎగిరే అంతస్తులు
కానీ మనసు దిగజారదా
సెకన్లలో జరిగే లావాదేవీలు
సంబంధాలు నెమ్మదించదా
చరణం – 2
స్టీరింగ్ ఒక చేతిలో
మరొక చేతిలో స్క్రీన్ వెలుగు
ముందు దారి కనిపించక
ఎక్కడికో పరుగెత్తే అడుగు
పల్లవి
కొంచెం ఆగు… కొంచెం చూడు
నీ ఊపిరి మాట విను
కొంచెం నవ్వు… కొంచెం మాట్లాడు
నీ మనసుకే చేరువ కాను
చరణం – 3
పుస్తకం మూసి దుమ్ము పట్టింది
తల్లి ఫోన్ మౌనమైంది
ప్రకృతి పిలిచే స్వరం వినక
జీవితం దూరమైంది
బ్రిడ్జ్
IPL ఉంది… రీల్స్ ఉన్నాయి
కానీ నువ్వు ఎక్కడున్నావో
Netflix లో కథలు చూసి
నీ కథను మరిచిపోయావో
పల్లవి (రీపీట్)
కొంచెం జీవించు… కొంచెం ప్రేమించు
బంధాలకు చోటివ్వు
సమయం లేదనొద్దు ఇకపై
సమయాన్నే నీవు సృష్టించు
ముగింపు
ఒక రోజు సమయమే చేతులు విడిచినప్పుడు
ఈ క్షణమే గుర్తొస్తుంది
“జీవించాల్సిన క్షణాలన్నీ
నేనే వదిలేశాను” అని
*****
సంక్రాతి పాట
🎵 పల్లవి
పంట పండె నేటి నేల – పులకించె పుడమితల్లి
లక్ష్మి జపము నడచె నోట – వెలిగె ఇంటి వెలుతురల్లి
భోగి సంక్రాంతి కనుమ – భాగ్యసిరులు చేరె వేళ
సంతసంబు నిండె లోకమంత – పండుగాయె ఈ వేళ
🎶 చరణం – 1 (మీ పద్య భావం)
పంట పండె నేటి నేల
గృహమున చేరె ధన్యమై
పుడమి తల్లి పులకించి
లక్ష్మి జపము నడచెనే
🎶 చరణం – 2 (మీ పద్య భావం)
భోగి సంక్రాంతి కనుమ
భోగభాగ్య ఫలప్రదం
సర్వ జీవరాశికంతా
సంతసంబు నింపెనే
🎶 చరణం – 3 (పాటకు విస్తరణ)
కూర్మి తోడ కలసి నేడు
కాపు చేత శ్రమ పండెను
పశు పక్షి మనుజులంతా
పండుగలో ఏకమగు
🎵 పల్లవి (రిపీట్)
పంట పండె నేటి నేల – పులకించె పుడమితల్లి
లక్ష్మి జపము నడచె నోట – వెలిగె ఇంటి వెలుతురల్లి
భోగి సంక్రాంతి కనుమ – భాగ్యసిరులు చేరె వేళ
సంతసంబు నిండె లోకమంత – పండుగాయె ఈ వేళ
*****

102..సీస పద్యము 

సర్వలోకంబులు సంపద కిరువైన 
పాదపద్మంబులు ప్రణతులైన 
సకలలోకములలో సాధ్యము శ్రీలక్ష్మి  
ఆశ్రయ వాసులకభయ మిచ్చె 
చరణకమలములు  చప్పఁన మనసున
లివిగాని ఆనంద మీగడoడెఁ 
శ్రీవారి పాదపు శ్రీ పంకజములుగా
చక్కని సొబగులు చలువ గుండె               

మనమునన్ దోచు చుండు సమ్మతము తోడ 
సంతతం బట్టి శ్రీకృష్ణ చరణయుగము 
ధ్యాన మొనరించు ప్రార్ధింతు దాస్య మాయ
నిత్యమైన బ్రహ్మ బలుకు నిష్ఠ కొరకు 

*†*

103.సీస పద్యం

కొవ్వొత్తి వెలుగు ఆమె కోలుకొని కరుగు సంకల్ప బలముగా సమయ తృప్తి

ఈప్రశాంతతగాను ఇష్ట పాటగనునే వెచ్చదనానివ్వ విద్య మలుపు

ఈగులాబీ రేకు యిచ్ఛ ప్రతిజ్ఞత శ్రావ్యతలనుకూడ సరయు చుండు 

 గుసగుసలాడుతూ గుర్తుగా ఉదయంబు హృదయంబు నిశ్శబ్ద శృతి లయలగు

తే. గీ

నీది యన్నది దేదియు నీది కాదు నాది నాదనుచు మదన మెందుకోయి 

పుట్టినపుడేమి యున్నది గిట్టు నపుడు కూడ వచ్చుటకై నీకు తోడు వినుమ

*****

104.సీస

 నిలిపివేయబడిన నిర్మల క్షణాన్ని కోరికతో నింపి కొరవ కాక 

మృదువైన కాంతిగా మనసును చేరియు సుఖమనే కళలు సూత్ర మదియు

యువతిగ నిశ్చల మునభవ భావము ప్రాముఖ్యతా కథ ప్రభల తీరు

 నిశ్శబ్ద వీక్షణ నియమ నిరీక్షణ క్షీణించక బ్రతుకు కీలక మగు 

తే. గీ.

పున్నమిగను యమావాస్య పుడమి వంక వెలుగు వెన్నెల చీకటి విద్య వలపు

రోజు సూర్యచంద్ర గతులు రోలగుతయు జీత భత్యము నెలకొక జీవ యాత్ర

****

105.సీస పద్యం

నీది యన్నది దేది నీది కాదు యదియు, కానిది, నీవద్ద, కలవలేదు 

పుట్టిన దరినుండి పుడకల వరకుగానిజము మాటగనుట నిలువ బోదు

పదము పదము చేరి పడకతీరుదురద మొదము ముదరగాను ముద్దరగను

తరుణమేను సుఖము తరతమ భేదమే ధన్యవాదములను తెలుపు చుండ

ఆ.

శాస్త్ర జ్ఞాన మున్న,సర్వము మంచికే మంచి దారి జూపు,  మంద బ్రతుకు

దైవ భక్తి గలుగ,cదైన్యమ్ము దరిరాదు!చిత్త సుద్ధి మనల, చేర్చు తలపు 

*****

106.సీస పద్యం.. 

చిత్ర విచిత్ర కవిత్వంకాలమే అలలుగా కలలుతొ జ్ఞాపకo 

చిత్రకారుడిలాగ  చిందులాట  ముందు ఊయలమీద ముచ్చట ఒక జ్వాల 

సుడిగుండ బ్రతుకులో సూత్ర ధారి గాలిలో స్త్రీ తేళి గాళమునకు చిక్కిసముద్రపు నురుగు సరయు చుండ

 రంగులలోరంగు రంగరించు కళలు మూలకానికి బంధి ముఖ్య మవ్వ

ఆ.

కదలిక యగు కళలు  కోరిక విధి మధ్య సమయ సుఖము నెంచు సమత మమత 

సుందరాంగి చూపు సూత్ర బ్రతుకునీడ చిత్ర మాలికకునె చిత్త కవియె

*****

107..సీస పద్యం
తెల్లని పాలుగా తెలిపే దగు వధువు
నీటి అంచున, ప్రతిబింబమగుట
నల్లటి రంగుగా నమ్మక నేస్తము
 భూమి నిశ్చలముగా భుక్తి నిచ్చు
తాళితో దాంపత్య తప్పు కానిది నిప్పు
నిప్పులు చెరిగేను నీడ కలువ
 కన్య విశ్రాంతిగా కాపురం పతివ్రతా
రక్ష మరచిపోయి రమ్యతగను
తే. గీ
ఆమె నిశ్శబ్ద కోరిక ఆశ తెలువు
నిత్య ప్రతిబింబ నిర్మల నీడగాను
 కాల  మిప్పుతున్నది కల కావ్య రీతి
ఇదియు రుచికరా కాపురం ఇంతి మతియు
***
 
108..సీస
ఈ ప్రశాంత యువతి యిచ్ఛా సగంబగు
గుర్తుండిపోయిన పురము తీరు 
 పిలువబడుచుననె  పెనవేయబుద్ధియు
 ఆమె మణి ముసుగు ఆత్ర మగుట
తెల్లవారు మెరుస్తు తెలియ చేయ దళచె
 కాషాయ వస్త్రాలు కాల మాయ
 పురాతన ఇసుకపై 
 జడ వేసి జుట్టుణా జాగృతి పూలగు
కాలఅతీతమై ఆభరణమె

తే. గీ.
పుస్తకం నిశ్శబ్దమున పూజ్య మగుట
నిత్య జ్ఞానాన్ని సూచిస్తు నీడ ఆమె 
 శక్తి ప్రసరింపజేస్తుంది సమయ మందు
 మర్త్యమైన మృదుత్వంబు మనుసు పంచు

 

No comments:

Post a Comment