Saturday, 20 December 2025

 ధనుర్మాస సందర్భముగా  ప్రాంజలి ప్రభ


🌼 తిరుప్పావై – 6వ రోజు (పాటరూపం )


పల్లవి :

మునులు యోగులు మననమున నునుచుకొనియు

మెల్లగా లేచి “హరి” యను మేటి నామమున

నిదుర విడిచి మేలుకొన జేసిరే

తగిన మననోము నోమమున దరలిరే


చరణం – 1 :

ముందు లేచినట్టి సకల సుందరాంగులై

ముగ్ధ మందయాన నిటుల నిదుర మలుపులై

పక్షిజాలమెల్ల దిశల పాఠ్య వీక్షణమై

కూతలిడుచు గూళ్లలోన గోలలాయెనే


చరణం – 2 :

వదలె పంకజాక్షు సేవ జ్ఞప్తి పర్చుటై

దెలుపు తెల్ల శంఖ పిలుపు తీరు కర్ణమై

సరణి జొరద బాల లేచిరా నందబాలుడై

బూతన చను బాలు ద్రావి యముని పాలులై


చరణం – 3 :

రక్కసుండు బండి రూపు నుక్కు మిగిలి రాగమై

సంధులొక్క మొగిని వ్రక్క ద్రొక్కె ముదమున

మునులు యోగిజనులు నీట మునిగి వేడ్కగా

“హరి” యను నాదమెల్ల వినగరాదటే


చరణం – 4 :

మెల్ల మెల్ల నుల్ల మల్ల బల్లవించి చెల్లనే

సంతసిల్లి లేచిరార సంబరంబు మళ్ళియే


ముగింపు (ఆహ్వానం) :

అంతమంది గొంతుల శబ్దమధికమయ్యెనే

మా చెవులసోక వచ్చాము మగువలారా!

కనుక మీరును వింటిరి గాన లేచి

స్నానమాచరించి వచ్చి చక్కగాను

వ్రతము చేయుదమిక రండి భక్తితోడ

*****


సప్తపది - 6

సప్తపదులను ముద్దుపళని వ్రాసినదా లేక 

ఆమె గురువుగారు శ్రీనివాసులు వ్రాసిరా అను ప్రశ్న ఒకటి ఉన్నది. 

కాని మనకు దొఱకిన సప్తపదులు ముద్దుపళని

దనియే భావిస్తున్నారు. 

అసలు సప్తపదులు అంటే ఏమిటి? 

ఏడు పాదములున్న ఏ పద్యమైనా సప్తపదియే.

కావున ఈ సప్తపదులకు కూడ ఏడు పాదాలు ఉన్నాయి.

ముద్దుపళని సప్తపదులు త్ర్యస్రగతికి చెందినవి,

అనగా మూడు మాత్రలతో నిండినవి. 

ఎక్కువగా గ-ల,న-గణములు ఉన్నా 

అక్కడక్కడ ల-గములు కూడ ఉన్నాయి.

నాలుగేసి గణములకు యతియో లేక ప్రాసయతియో ఉండాలి.

ప్రాస ఐచ్ఛికము. 

కన్నడములోని భోగషట్పదికి ఇట్టి గణాలు ఉన్నాయి.

భోగషట్పదికి ఆఱు పాదాలు. 

మొదటి మూడు పాదములవలె చివరి మూడు పాదాలు. 

మొదటి మూడు పాదాలలో- 

మొదటి రెండు పాదాలకు 12 మాత్రలు, 

మూడవ పాదమునకు 20 మాత్రలు.

పద్యము మొత్తములో 88 మాత్రలు (అష్తకోత్తరాష్టదశకము).

ప్రాస నియతము.----నాగవర్మ చందోంబుధినుండి లక్షణాలు-

మున్ని నంఘ్రిగళిగె మాత్రె

పన్నెరడు విరాజిసువుదు

చన్నె మేలణాడిగె మాత్రె పత్తుమెరడు

సన్నిసల్కె భోగదాఱు

చెన్నపదగళొందు గూడి

సన్నుతాంగి అష్టకోత్తరాష్టదశక కేళ్


సప్తపది - 6

ముందు లేచినట్టి సకల సుందరాంగు లొక్క ముగ్ధ

మందయాన నిటుల నిదుర మలుప వచ్చిరే

పక్షిజాల మెల్ల దెసల వీక్షణములు గొలిపి వేగ

కుక్షులకయి కూతలిడుచు గూళ్ళు వదలెనే

పంకజాక్షు సేవ జ్ఞప్తిపఱచుకొఱకు దెలుపు తెల్ల

సంకు పిలుపు నీదు కర్ణ సరణి జొరదటే

బాల లేచిరావె నందబాలుడు దా బూతన చను

బాలు ద్రావి దాని యముని పాలు చేసెనే

రక్కసుండు బండి రూపు నుక్కు మిగిలి రాగ సంధు

లొక్క మొగిని వ్రక్కలుగా ద్రొక్కె ముదముగా

మునులు యోగిజనులు నీట మునిగి వేడ్క హరీ హరీ

యనెడు నాద మినుమడించె వినగరాదటే

మెల్ల మెల్ల నుల్ల మల్ల బల్లవించి చెల్ల సంత-

సిల్లి లేచినార మిటుల మళ్ళి లేగదే

[ veerarajua: తిరుప్పావు. 6 వ దినము 

"శ్రీ ద్రవిడాంధ్ర తిరుప్పావు" తెలుగుసీస పద్య సమర్పణ.

ఆ౦డాళు శ్రీ. తి. కం. తిరువేంగడాచార్యులు వారి సౌజన్యముతో 


సీ. పులుగులు. గలకలc బలుకుచు నేcగెడి, 

గరుడ వాహాలయగర్భమునను 

సితశంఖరావంబు చెవిcబడలేదటే 

లేచిరమ్మా పిల్ల! లేచిరమ్ము. 

పూతనాస్తనవిషపూరము బీలిచి, 

కాలను బండిని గూలcదన్ని, 

క్షీరవారాశిలో శేషశయ్యనుంబండు  

లోకబీజమును ముల్లోకములను 

గీ. మునులు యోగులు మననుల నునుచుకొనియు 

మెల్లగాలేచి  “హరి” యను మేటియఱపు 

నామదినిదూరి మేలుకొనంగcజేసె 

తగిన మననోము నోమంగc దరలిరండు. 6

****

" ధనుర్మాస సందర్భముగా  

శ్రీ. జెజ్జాల కృష్ణ మోహన రావు గారి సౌజన్యముతో "


సప్తపది - 7

వైష్ణవ దేవాలయాలలోని నందవనములను 

ఆండాళ్ నందవనమని కొందఱు పిలుతురు. 

ఆడువారు ఒక విధమైన కొప్పును ధరింతురు. 

దీనికి ఆండాళ్ కొండై అని పేరు. 

ఇట్టి ముడిని వివాహవేళలో వధువు తలపై చూడుట వాడుక.


సప్తపది - 7


విరివిమీఱ హరిని గలయ నెఱిగి మఱచి కను మొగడ్చు

సరసిజాక్షి నిదుర లేప సఖులు వచ్చిరే

కుటిల నీలకుంత లొకతె చటులసూక్తి పటిమ బల్కు

నటన దెలియకుండ నొక్క నాతి పలికెనే

కీచుకీచు మనుచు బక్షు లేచి లేచి కూయుచుండె

లేచిరావె పెరుగు తరువదోచె మిన్నునే

గల్లుగల్లు మనెడి వగల కలరవంబు దెల్ల దమ్మి-

కనులవానిమీది పాట గలసి మ్రోసెనే

వినగబడదె వెఱ్ఱిపిల్ల విడిచి నిన్ను వెడలలేక

కనుగొనంగనున్న మమ్ము గనవె నాయికా

హరి దయాభిపరవశుండు పరు డటన్న మొరలు చెప్పి

దరికిరాగ నిదుర చెందదగునె నాయికా

తేజమొప్ప గన్నువిప్పి తెప్పరిల్లి లేచివచ్చి

రాజసమున దలుపు దీయరావె నాయికా

[

 తిరుప్పావు. 7 వ దినము 

"శ్రీ ద్రవిడాంధ్ర తిరుప్పావు" తెలుగుసీస పద్య సమర్పణ.

ఆ౦డాళు శ్రీ. తి. కం. తిరువేంగడాచార్యులు వారి సౌజన్యముతో 


సీ॥ కీచుకీచని యెందు నేచినగుంపులై 

కూసెడుపులుcగులకూcత వినవె? 

పిచ్చిపిల్లా! గాజు లిచ్చ  గల్గలలాడc

సారె కాసారప్రసారములను 


గోపికల్ తఱువంగ ఘూర్ణిల్లు ఘుమఘుమ 

ధ్వనియేని యింతకు వినcగలేదె? 

నారీమణీ! యీడ నారాయణుండగు 

కేశవు మేము భక్తిమెయిcబాడ 

గీ. వినియె శయనించితో తెలివిగలదాన? 

తలుపుతీయుము తీయుము త్వరితముగను,

వాకిటను మమ్మునిలుపcగా బాగెనీకు? 

తగిన మననోము నోమంగc. తరలిరండు. 7


: 🌹 తిరుప్పావై – ఏడవ రోజు : సరళ పాట 🌹


రా సఖీ రా లేవమ్మా,

మా నాయకురాలవమ్మా

విశ్వమంతా నిండిన వాడు

కృష్ణుడని తెలిసమ్మా


కేశిని సంహరించిన

ధీరుడే మన దైవం

తృష్ణ తీర్చే కరుణామూర్తి

ఆయనే మన జీవం


పక్షులు పాడే వేళయిదే

పల్లె అంతా మేలుకొనే

పిల్లల నవ్వుల సందడిలో

పూజ వేళ పిలుపులే


సౌజన్య రూపుడొచ్చాడు

సమ్మోహనుడై నిలిచాడు

రాజులకే రాజైన వాడు

రక్షకుడై చేరాడు


తలుపు తీయి చెల్లెలమ్మా

దర్శనం ఇయ్యుమమ్మా

కారుణ్యమూర్తి ఎదుటే

కాలం వృథా చేయవమ్మా


రాగాలతో పాడుదాం

లీలల్ని చూద్దాం

నిన్ను విడిచి పోలేమమ్మా

నోము నేడు చేద్దాం


పద్మనేత్రుని పాట విన్నావా

పద్మాక్షి లేవమ్మా

నిద్ర వదిలి మాతో కలిసి

భక్తి దారిలో రావమ్మా

🙏🏼

ఆండాళ్ కీళ్వానం వెళ్ళెన్రు – 7వ పాశురం నేపథ్యాన్ని పాట 

🎶 పల్లవి

తూర్పు తెల్లవారే వేళ… తోటి వారమా రండిరా

భక్తి కుతూహలముతో… స్వామి ద్వారమా చేరిరా

నోరార కీర్తించగా… నిత్యశుద్ధి కలుగునా

ఆండాళమ్మ చెప్పిన మార్గమే మనకు రక్షణా

🎵 చరణం – 1

పాలిచ్చు గేదెలు తలుపులు విడిచినివై

పచ్చిక మేయుటకై పొలముల చేరినివై

తోటి వారిని విడువక కలుపుకొని నడిచే

నిన్ను పిలువగా నీవాకిట చేరితివై

కుతూహలము కలిగి భక్తి మదిలో పొంగగా

ప్రేమ పూరిత పిలుపే ప్రభువు చెంత చేర్చగా

🎵 చరణం – 2

తల్లీ… కేశియను రాక్షసుడు గుర్రమై రాగా

అవలీలగా సంహరించిన కరుణా మూర్తిగా

చాణూర ముష్టకులను మట్టుపెట్టిన వీరా

నిత్యసూరుల కధిపుడైన నారాయణా

వీణాది వాద్యములతో వేద ఘోషమై

స్తుతి చేస్తే పాపములన్నియు పోవునై

🎵 చరణం – 3

ఎంత వింత కాంతలంత కంత సంతనంతగా

కింత యనుచు శాంతి నెంత చిత్తమందు సంతగా

అంత ముద్దు భక్తి చాలు పాఠమవ్వ రీతిగా

జింత చేసి మనల గరుణ చెలగి పోక రండిరా

🌸 ముగింపు (పునః పల్లవి)

తూర్పు తెల్లవారే వేళ… తోటి వారమా రండిరా

ఆండాళమ్మ చూపిన మార్గమే

మన జన్మ ధన్యమయ్యే దారిరా 🙏


[ " ధనుర్మాస సందర్భముగా  

శ్రీ. జెజ్జాల కృష్ణ మోహన రావు గారి సౌజన్యముతో "


సప్తపది - 8


ఆండాళ్ను చూడిక్కొడుత్త నాంచారు అనుట వాడుక.

అనగా (పూలను) ధరించి ఇచ్చిన యువతి అని అర్థము.


క్రింద ఒక అన్నమాచార్యుల కీర్తన-

చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ

కూడున్నది పతి జూడికుడుత నాచారి - పల్లవి

శ్రీమహాలకష్మి(క్ష్మి??)యట సింగారాల కేమరుదు

కాముని తల్లియట చక్కదనాల కేమరుదు

సోముని తోబుట్టువట సొంపుగళ కేమరుదు`

కోమలాంగి యీ చూడికుడుత నాచారి - చూడరమ్మ

కలశాబ్ధి కూతురట గంభీరాల కేమరుదు

తలప లోకమాతయట దయ మరి యేమరుదు

జలజనివాసియట చల్లదన మేమరుదు

కొలది మీర యీ చూడికుడుత నాచారి - చూడరమ్మ

అమరవందితయట అట్టె మహి మేమరుదు

అమృతము చుట్తమట ఆనందాల కేమరుదు

తమితో శ్రీవేంకటేశు దానె వచ్చి పెండ్లాడె

కొమెరవయసు చూడికుడుత నాచారి - చూడరమ్మ


సప్తపది - 8

బాలలెల్ల నందగోప బాలునకును వలపు గొలుపు

లీల గలిగినట్టి సఖిని లేపవచ్చిరే

ఇదిగొ తూర్పు తెల్లవాఱె నదిగొ బఱ్ఱెలెల్ల మెల్ల

బొదలె మళ్ళలోని మంచు పూరి మేయగా

నిన్ను లేపకుండ మున్న కన్నె లార్తితోడ నేగి

నున్న మాట విన్నవించి నిన్ను లేపగా

వచ్చినార మనుచు మమ్ము మెచ్చి ముదము హెచ్చినట్టి

మచ్చెకంటిమిన్న లేచి మముల గలయవే

మల్లవరుల యుల్ల మెల్ల బెల్లగిల్ల కొల్లలాడి

వెల్లివిరిసి యుల్లసిల్లు విష్ణుమూర్తివే

పాడుకొనుచు నేగి చిగురు టీడువచ్చు నడుగు దమ్మి

జోడు సోక మ్రొక్కి సరగ వేడుకొంటిమా

ఎంత వింత కాంత లంతకంత కంత కింత యనుచు

జింతచేసి మనల గరుణ చెలగి ప్రోచునే

[

: తిరుప్పావు. 8 వ దినము 

"శ్రీ ద్రవిడాంధ్ర తిరుప్పావు" తెలుగుసీస పద్య సమర్పణ.

ఆ౦డాళు శ్రీ. తి. కం. తిరువేంగడాచార్యులు వారి సౌజన్యముతో 


సీ॥ తూర్పు వెల్వెలcబారె, నేర్చున నెనుములు 

లేcతపచ్చిక మేయ లేచిపోయె, 

నీవొక్కతెవుదప్ప నెల్లపిల్లల మేము 

పోcబోవువారిని పోవనీcక 

నినుబిల్చుటకువచ్చి నిలిచియుంటిమి, వ్రతా 

చరణప్రియా! లెమ్ము, చక్కరమ్ము, 

జంత్రములను బాడి చతురుc గేశిఘ్నుని 

మల్లభంజను దేవతల్లజు హరిc 


గీ. జేరి మన మెల్ల సేవలు సేయ నతcడు 

అయ్యయోపాపమని మదియందు నెంచి 

దయ దళుకులొత్త రక్షింపcదలచుcగాన 

తగిన మననోము నోమంగc దరలిరండు. 8

*******


#తిరుప్పావై_పాశురం - 9

రచన - #ముళ్ళపూడి_వెంకట_రమణ_గారు

చిత్ర సౌజన్యం - #బాపు_గారు

మాణిక్యదీపాలు - మధుమధుర ధూపాలు

పందిరీ మంచాలు చక్కన్ని పక్కల్లు

వెచ్చన్ని దుప్పట్లు - వేడుకల కలలు

బాగు బాగేగాని బంగారు తల్లి

ఇంకెంతసేపే నీ మొద్దు నిద్దరా

వాకిట్లో మా గోల చప్పట్లు తాళాలు

దుప్పట్లో దూరీ నిను లేపలేదా

కాకితో నిదరోయి కోడితో లేవాలి

కొక్కొరొక్కో అక్కరో

అత్తమ్మ నీవన్న చెప్పమ్మ దానికి

చెప్పినా వినిపించుకోవటం లేదా?

చెవులు దిబ్బళ్ళుపడి చెవుడు వచ్చిందా

చేతబడి మంత్రాల మాయ కమ్మిందా

మాయకమ్మిన గాని మనకే భయము లేదు మాయావులను మించు మాయలాడున్నాడు

వాడె మన పాలి ధవుడు - ఆ రమాధవుడు!

వాని పేరెలుగెత్తి పిలిచిన క్షణమే

మాయలన్నీ ఇట్టె మాయమైపోతాయి

హాయిగా నోములు నోచుకోవచ్చు

సిరినోము - హరిపూజ - గిరిపుత్రివరము

గోకులం కన్నెలకు కల్యాణకరము

లోకులందరికిదే సౌభాగ్యప్రదము

పల్లెపిల్లా మేలుకో!

రేపల్లె పిల్లా మేలుకో!!

#శుభోదయం!

******

🎵 పాశురం – 9వ రోజు పాట 🎵

(భావభక్తి గీతం)

పల్లవి

ఆరుచుండె దీపమ్ములే… యమ్మి వేగమే లేవవే

ఆరవమ్ము లాలించవో… యమ్మి శీఘ్రమే లేవవే

దీపం వెలిగే వేళ ఇదే… దైవమే పిలిచెనులే

నిద్ర విడిచి నడచిరావే… నాధుడే ఎదురాయెనే


చరణం – 1

ఆవులింత చాలింక చూడు అంజనమ్ము దీపమ్ముపై

నీవు చిలుకు తీయంగ రా నిద్ర న్యాయమే లేవవే

మాయ నిద్ర కప్పిన మనసు మేలుకొనుమా

బోధ వెలుగు పిలుచుచుండె బ్రహ్మవేళ ఇదే గదా

(పల్లవి)


చరణం – 2

అత్తగారు మీరెందుకో యామె నిప్పుడే లేపరే

మత్తుమందులం జల్లిరో మాయజాలమే లేవవే

సాకులన్ని మాయలే సోదరి వినుమా

స్వామి పిలుపు విననిచో శ్రమమంత వ్యర్థమా

(పల్లవి)


చరణం – 3

మాధవుండు బోధించునే మాయకాండె యాలించునే

సాధనమ్ము సేయంగ రా స్వామికిష్టమే లేవవే

గీత బోధ మార్గమై గుండె తలుపు తీయగా

భక్తి దీపం వెలిగితే భవమే మారిపోవునా

(పల్లవి)


చరణం – 4

వాఁడు చిత్ర చారిత్రమే వానిఁ దల్చుచుం గొల్వవే

వాఁడు మోహనాకారమే వాఁడనంతమే లేవవే

మోహమందు బంధము మోక్షమందు లయమవున్

అనంత రూప దర్శనమై ఆత్మ నిండిపోవున్

(పల్లవి)


చరణం – 5

కనులందు కాంతి వెలుగు కలలందు తేజములే

పలుకందు దీపములై పదము పదము సత్యములే

దేవి లేచె వేళ భూమి వెలుగొందెనులే

నాధ ధ్యాన మార్గమున భవము శుభమాయెనే

ముగింపు / ఫలశ్రుతి

నవముగను దివ్య నాయకుని దలచి పూజించ లే

భవము శుభమొంది భాగ్యముల నిచ్చు మాలావతీ

లేవవే… లేవవే… భక్తి మార్గమున లేవవే

నాధ సన్నిధి చేరగా నిత్య మంగళమౌనులే

🎶


🎵 పాశురం – 9వ రోజు పాట 🎵

(భావభక్తి గీతం)

పల్లవి

ఆరుచుండె దీపమ్ములే… యమ్మి వేగమే లేవవే

ఆరవమ్ము లాలించవో… యమ్మి శీఘ్రమే లేవవే

దీపం వెలిగే వేళ ఇదే… దైవమే పిలిచెనులే

నిద్ర విడిచి నడచిరావే… నాధుడే ఎదురాయెనే


చరణం – 1

ఆవులింత చాలింక చూడు అంజనమ్ము దీపమ్ముపై

నీవు చిలుకు తీయంగ రా నిద్ర న్యాయమే లేవవే

మాయ నిద్ర కప్పిన మనసు మేలుకొనుమా

బోధ వెలుగు పిలుచుచుండె బ్రహ్మవేళ ఇదే గదా

(పల్లవి)


చరణం – 2

అత్తగారు మీరెందుకో యామె నిప్పుడే లేపరే

మత్తుమందులం జల్లిరో మాయజాలమే లేవవే

సాకులన్ని మాయలే సోదరి వినుమా

స్వామి పిలుపు విననిచో శ్రమమంత వ్యర్థమా

(పల్లవి)


చరణం – 3

మాధవుండు బోధించునే మాయకాండె యాలించునే

సాధనమ్ము సేయంగ రా స్వామికిష్టమే లేవవే

గీత బోధ మార్గమై గుండె తలుపు తీయగా

భక్తి దీపం వెలిగితే భవమే మారిపోవునా

(పల్లవి)


చరణం – 4

వాఁడు చిత్ర చారిత్రమే వానిఁ దల్చుచుం గొల్వవే

వాఁడు మోహనాకారమే వాఁడనంతమే లేవవే

మోహమందు బంధము మోక్షమందు లయమవున్

అనంత రూప దర్శనమై ఆత్మ నిండిపోవున్

(పల్లవి)


చరణం – 5

కనులందు కాంతి వెలుగు కలలందు తేజములే

పలుకందు దీపములై పదము పదము సత్యములే

దేవి లేచె వేళ భూమి వెలుగొందెనులే

నాధ ధ్యాన మార్గమున భవము శుభమాయెనే

ముగింపు / ఫలశ్రుతి

నవముగను దివ్య నాయకుని దలచి పూజించ లే

భవము శుభమొంది భాగ్యముల నిచ్చు మాలావతీ

లేవవే… లేవవే… భక్తి మార్గమున లేవవే

నాధ సన్నిధి చేరగా నిత్య మంగళమౌనులే

🎶

No comments:

Post a Comment