Tuesday, 28 January 2025




**  జీవితంలో పోట్లు **

మల్లప్రగడ 


సిరులుగా వేలకోట్లగు సిగల పోట్లు 

 భాగ్యశాలిగా చింతలై భంగ పోట్లు 

 కంటినిండా నిదురలేక కునిక పోట్లు 

 నిజమైన భాగ్యాశాలి నిదుర పోట్లు 


ముక్కు మోము చక్కనివాని ముఖ్య పోట్లు 

చెడు తలపులేక కదలు చెలిమి పోట్లు 

ఆత్మ సౌందర్యము తెలుప ఆశ పోట్లు 

ఉన్నవాడేతినక యీర్ష్య యన్న పోట్లు 


విధి విలాస భోగము భాగ్య వింత పోట్లు 

నడుమ కులుకుట సంతోష నాట్య పోట్లు 

కాస్త సమయ స్వార్ధపరము గాను పాట్లు

పరులకు ఉపకార మలుపు పలుకు పాట్లు 

 

ఖరీదైన భవంతులు కట్ట పోట్లు 

డాబుదర్పము చూపుట కాదు పోట్లు 

డబ్బు కరువైన స్థితిగతి డాబు పోట్లు 

నిత్య ఆరోగ్య  వైభోగ నీడ పోట్లు 


పరపతిగను గొప్పగనుండు పలుకు పోట్లు

జీవితంమది యలజడి గీత పోట్లు 

తృప్తిగా ప్రశాంతంగాను తృణము పోట్లు 

బతుకుటే జీవితమ్ముయు బంధ పోట్లు


.*****

ప్రాంజలి ప్రభ.. కొత్త పాట..


వయ్యారి నీవు వద్దన్నా మైమరుపు 

సయ్యాటకు రమ్మన్నా కొస మెరుపు 

అయ్యారే మాటలు విన్నా ఆదమరుపు 

 భయ్యాన్ని తరిమియే యున్నా మది పిలుపు...


 మదిలో ముచ్చట రేకిస్తున్నా 

 విధిగా కన్నులతో కవ్విస్తున్నా 

 నిధిగా గమ్యమునే చూపిస్తున్నా 

 రోదనె చేయక ప్రోత్సహిస్తున్నా కదా.... వయ్యారి 


 చిరునవ్వులతో చిందులు వేస్తున్నా 

 మరుమల్లెలతో మాయలు చేస్తున్నా 

 కురుల కవ్వింపుతో గాయం చేస్తున్నా 

 తరుణి మగవారి మనసు గెలుస్తున్నా కదా... అయ్యారే


నీ కన్నా నా కెవరు లేరులే యన్నా 

నీవే నా సకలమని మెప్పులే యన్నా 

నీతో నా వెతలన్నీ తీర్చులే నన్నా 

నిశ్శబ్దంగా విన్నవించానులేనన్నాను కదా... వయ్యారి 


ఎంత మేర నా భాగ్యమోనని తెలుస్తున్నా 

కొంత కలత ఉన్నది కానీ యని తపిస్తున్నా 

అంతయూ నీకు తెలుసు నని విలపిస్తున్నా 

సుంత కరుణ చూపిన చాలని ఊహిస్తున్నాను కదా.. అయ్యారే


రెప్పలు మూయక వేచి యున్నా 

గొప్పగా నిన్ను తలచి యున్నా 

మెప్పు పొందాలని ఆశతో యున్నా 

కుప్పగా పువ్వులు పోసి నీ ముందరన్నా....కదా వయ్యారి 


వయ్యారి నీవు వద్దన్నా మైమరుపు 

సయ్యాటకు రమ్మన్నా కొస మెరుపు 

అయ్యారే మాటలు విన్నా ఆదమరుపు 

 భయ్యాన్ని తరిమియే యున్నా మది పిలుపు...

 

****

మల్లాప్రగడ రామకృష్ణ

******

*హృదయం*


కంటికి కనిపించవు, మేనిలో దాగి యుంటావు. 

 రాగాలను పలికిస్తావు, జీవ యాత్రకు తోడవతావు.


 హృదయ స్పర్శకు ఆరాట పడతావు, 

ఆతృత పడతావు ఆనంద పడతావు.

 కవాటాల్తో రుధిరాన్ని  కదిలిస్తావు,

 ఉశ్వాస, నిశ్వాసాలకే ఊగి పోతావు.


 అలజడి కే నొప్పి పెడతావు, 

మమ్ము భయపెట్టి ఆనందిస్తావు.

 మరి విసిగించి అలసిపోయావు,

అలిగి సద్దు సేయక మిన్నకుండేవు 


నిర్లక్ష్యం చేయలేని స్థితికి మారుతావు, 

దేహాన్ని కదలించ లేక 

 విశ్రాంతిగా మారిపోతావు.

స్వర్గ సీమాలో చేరిపోతావు.

.*****

నాపేరు నేనంటేనేనే .. 


నేనే అనంత జీవన మార్గాన్ని

నేనే అమృత వర్ష బాండాగారాన్ని

నేనే ఆస్రితులకు సహాకారాన్ని

నేనే అందరికి  అందించే అమృత జలాన్ని

---

నేనే బంధాలకు ఆధారాన్ని

నేనే నేనొక ప్రణయ ప్రభందాన్ని

నేనే వసంతంతో వికసించేవాన్ని

నేనే అందరికి అందించే ప్రకృతి తత్వాన్ని

---

నేనే సరస సల్లాప సరాగాన్ని

నేనే ఆకట్టు కుంటున్న అను రాగాన్ని

నేనే అర విరిసిన అందాన్ని

నేనే అందరికి  ఆనందాన్ని అందించే గుణాన్ని

---

నేనే ప్రకృతిలో వైవిధ్యాన్ని

నేనే వైవిద్యంలో ఏకత్వాన్ని

నేనే సుందర స్వప్నాన్ని

నేనే అందరికి సుందర స్వప్నాల తత్వాన్ని

---

నేనే దైవ దత్తమైన వరాన్ని

నేనే లలిత సంగీత స్వరాన్ని

నేనే వెదజల్లే చల్లని సమీరాన్ని

నేనే పంచ భూతాలకు సహకారాన్ని

---

నేనే మధుర భావాల్లో సత్యాన్ని

నేనే కవి హృదయంలో సాహిత్యాన్ని

నేనే స్మృతి సుమధర పరిమళాన్ని

నేనే  కవుల హృదయాలల్లో షాహిత్యాన్ని

---

నేనే నొక ప్రేమ తత్వాన్ని

నేనే తగ్గిస్తాను ప్రేమ తాపాన్ని

నేనే కలుపుతా ప్రేమ తన్మయత్వాన్ని

నేనే భోదిస్తా ప్రేమ శృంగార తత్వాన్ని

---

నేనే ఇంతకూ నేనెవరో తెలిసిందా

అధరాలలో ఉన్న లాలాజలాన్ని

కాదు నేనే జిహ్వాచాపాన్ని

కాదు కాదు నేనే  అమృత జలాన్ని

---

కాదు సమస్త లోకాల అధినాయకుణ్ణి నేనే  


--((*))--


*****

నేటి శీర్షిక - ప్రేమే నా జీవితం 

రామకృష్ణ మల్లాప్రగడ


ప్రేమకున్న మనసు ప్రేమ సాక్షికినీడ 

సాక్షి ప్రేమ శిక్ష సాగ లేదు 

ద్రోహమన్న దేది పోరు ప్రేమలు చేయు

ద్వేషమన్న నియమ దీక్ష ప్రేమ 


హేతువ న్న ప్రేమ దేహవాంచకు తోడు

సేతువు వలె ప్రేమ నీడ గుండు 

కాలముకళ జూపు కావ్య ప్రేమగ మార్చు

జాతికంత శుభము ఖ్యాతి తోడు


మార్పుయంబతీర్పు మనసున ప్రేమకు 

నేర్పు యున్న విధిగ నీడ నోర్పు

 ప్రేమ మాయ నేర్పు విధము 

తీర్పు లన్ని  ప్రేమ తెల్పు సాక్షి


సాక్షి ప్రేమ నీతి సాగనెంచ బతుకు 

నీతి యనుచు ప్రేమ నమ్మ బలుకు 

జాతి నందు ప్రేమ చాకచక్యము నీతి

ప్రీతి యన్న  ప్రేమ పేరు ఖ్యాతి


నిర్లక్షమ్ము గాను నెమ్మది గానున్న

ఆక్రమించ గలుగు ఆశ ప్రేమ 

కాల్చి వేయు గతియు కాల మహిమ ప్రేమ 

తప్పటడుగు వేస్తు తప్పు ప్రేమ 


ఈ పరిష్కరించ  ఇచ్ఛామదియె ప్రేమ

నిచ్చెనగతి పైకి నిజము ప్రేమ 

చీపురుగను నుండి చింత లూడ్చెడి ప్రేమ 

చేట,జల్లెడగను చేరువగుట 


ప్రేమ లనుచు పరుగు పెట్టెడి మగువలు 

అధిక మవగ జనులు ఆత్మ విలువ

నెరుగ సమయ మేది  నీతికి నిజమేది 

చెప్ప వినగ  లేరు చిత్త ప్రేమ 


వస్తు మోజున పడి ప్రజల మధ్యన ప్రేమ    

తగ్గు ముఖము పట్టె ధరణి ప్రేమ 

ప్రేమలు పెరగవలె ప్రియ మనుజుల మధ్య 

సఖ్యత గుడి సంఘమైఖ్య  ప్రేమ


****-నేటి శీర్షిక - ప్రేమే నా జీవితం 

రామకృష్ణ మల్లాప్రగడ


ప్రేమకున్న మనసు ప్రేమ సాక్షికినీడ 

సాక్షి ప్రేమ శిక్ష సాగ లేదు 

ద్రోహమన్న దేది పోరు ప్రేమలు చేయు

ద్వేషమన్న నియమ దీక్ష ప్రేమ 


హేతువ న్న ప్రేమ దేహవాంచకు తోడు

సేతువు వలె ప్రేమ నీడ గుండు 

కాలముకళ జూపు కావ్య ప్రేమగ మార్చు

జాతికంత శుభము ఖ్యాతి తోడు


మార్పుయంబతీర్పు మనసున ప్రేమకు 

నేర్పు యున్న విధిగ నీడ నోర్పు

 ప్రేమ మాయ నేర్పు విధము 

తీర్పు లన్ని  ప్రేమ తెల్పు సాక్షి


సాక్షి ప్రేమ నీతి సాగనెంచ బతుకు 

నీతి యనుచు ప్రేమ నమ్మ బలుకు 

జాతి నందు ప్రేమ చాకచక్యము నీతి

ప్రీతి యన్న  ప్రేమ పేరు ఖ్యాతి


నిర్లక్షమ్ము గాను నెమ్మది గానున్న

ఆక్రమించ గలుగు ఆశ ప్రేమ 

కాల్చి వేయు గతియు కాల మహిమ ప్రేమ 

తప్పటడుగు వేస్తు తప్పు ప్రేమ 


ఈ పరిష్కరించ  ఇచ్ఛామదియె ప్రేమ

నిచ్చెనగతి పైకి నిజము ప్రేమ 

చీపురుగను నుండి చింత లూడ్చెడి ప్రేమ 

చేట,జల్లెడగను చేరువగుట 


ప్రేమ లనుచు పరుగు పెట్టెడి మగువలు 

అధిక మవగ జనులు ఆత్మ విలువ

నెరుగ సమయ మేది  నీతికి నిజమేది 

చెప్ప వినగ  లేరు చిత్త ప్రేమ 


వస్తు మోజున పడి ప్రజల మధ్యన ప్రేమ    

తగ్గు ముఖము పట్టె ధరణి ప్రేమ 

ప్రేమలు పెరగవలె ప్రియ మనుజుల మధ్య 

సఖ్యత గుడి సంఘమైఖ్య  ప్రేమ

నేటి చందస్సు... మల్లాప్రగడ 


స్వరభూషణ.. ససమ గగ 


నను తీర్చగ జ్ఞానమ్మే దేవీ 

 తని వారగ మోదమ్మే దేవీ 

 కన లేనిది కాలమ్మే దేవీ 

 వినలేనిది మాటౌనే దేవీ 


 ప్రణవాత్మక దీపమ్మా నీవే 

 కను ముందుగ మార్గమ్మే నీవే 

 క్షణ మైనది సౌఖ్యమ్మా నీవే 

 రుణమైనది దుఃఖమ్మే నీవే 


 సర్వ భాద్యత భాష్యమ్మే నీవే 

 పర్వ వైనము బంధమ్మే నీవే 

 వర సుందర సుర్వా ర్ధీ నీవే 

 వరభూషణ భావమ్మే నీవే 


 ధర మోహన ధామమ్మే నీవే 

 దర హాసపు సోత్రమ్మే నీవే 


 పరమేశ్వరి రూపమ్మే దేవి 

 పరమాత్ముని ప్రేమమ్మే దేవీ 

 తరుణిమణి తాపమ్మే దేవీ 

అరి నాశన నాట్యమ్మే దేవీ


****-

నేటి చందస్సు.. త.త. త. త... మల్లాప్రగడ 


దేవుండు యున్నాడు దైవాత్మ నీలోన 

సేవల్లె నీ తోడు శీఘ్రమ్ము యీనాడు 


అన్నార్త హృద్యమ్ము ఆశ్రిత్వ భావమ్ము 

సన్మార్గ కారుణ్య  సాహిత్య మీనాడు 


 చల్లాని చూపుల్ల సంతోష నీడల్లె 

 కల్లోల దుఃఖంబు కాలంబు యీనాడు


 ప్రేమల్లె మంచౌను పీయూష బుద్దౌను

 క్షేమమ్ము కోరేను క్షంతవ్య యీనాడు 


 మాటల్లె మార్గమ్ము మానమ్ము మౌనమ్ము 

 ఆటల్లె జీవమ్ము ఆశల్లె యీనాడు 


ముళ్లూ మనస్సౌను ముంచేటి బంధమ్ము 

కుళ్లూ కుతంత్రాల కూడౌను యీనాడు 


మూటల్లె కట్టావు ముంపల్లె ముంచావు 

 మాటల్లే నేస్తమ్ము మంత్రమ్ము యీనాడు 


 సౌఖ్యమ్ము మాటేను సొమ్మంత దోచేను 

 ముఖ్యమ్ము ప్రేమమ్ము ముంచేను యీనాడు 


పాశమ్ము పెర్గేను పాపమ్ము మూలమ్ము 

ద్వేషమ్ము దుఃఖమ్ము దేశమ్ము యీనాడు 


 స్వార్థమ్ము పెర్గేను సామర్ధ్య మర్గేను 

 అర్థమ్ము కోరేను ఆశల్తొ యీ నాడు 


 అందమ్ము చుట్టూను ఆనంద మయ్యేను 

 పందెమ్ము జీవమ్ము పాఠమ్ము యీనాడు 


దేహమ్ము దాహమ్ము ద్వేషమ్ము రోగమ్ము 

మోహమ్ము మోసమ్ము మోక్షమ్ము యీనాడు


నీయంత నమ్మేటి నీమమ్ము నేడైన 

చేయూత చూపెట్టి చింతేలె యీనాడు


*****

అంబ సమున్నతి యాలనజేయన్

సంబర జాతర సందడిఁ బారన్

గుంభన విద్యలఁ గోర్కెల దీర్చన్

సంభవమేఁ గద స్వామిని దేవీ


 సాహితి బోధలు సాధన జేయన్  

వాహిని సంశ్రవ వర్ధని వీవే  

మాహిష రాక్షస మర్దని గౌరీ  

ద్రోహుల పాలిట దుర్గవు దేవీ


 ధర్మవివేక వితానముఁ తీర్చే   

ధార్మిక వర్తన దారులు జూపే   

నిర్మల ప్రాకట నిష్ఠల  నించే 

కర్మవిధాత నిగారము దేవీ


 కాలము నిర్ణయ కారణ మీవే  

మూలపు టమ్మవు ముద్దుల తల్లీ  

మేలుల గూర్చెడి మేటి శివానీ   

పాలనఁ గావుము పార్వతి, దేవీ


ప్రేరణజెందిన ప్రీతిని జీవుల్

ధారుణి నీతుల దారులఁ జూపన్

కోరిన కోర్కెల కొంగున దీర్చే

పేరిన నెమ్ములఁ బెంచుము దేవీ

****

మాత్రా శ్రేణి.. దేవీ 


అంబ సమోన్నత  ఆలనగానున్

సంబర జాతర శోధన గానన్ 

గుంబన విద్యల కాలము గానన్ 

సంభవమే ప్రతిసాధన దేవీ 


సాహసమే విధి సాధ్యముగానన్ 

దాహముగా నిధి దారులు గానన్ 

మోహముగా మది మాయలు గానన్ 

స్నేహముగా గతి సేవలు దేవీ 


ధర్మముగా మది దానము గానన్ 

మర్మముగా గతి మార్గముగానన్ 

నిర్మలమే ధరణీ స్థితి గానన్ 

కర్మలుగా నిజకాలము దేవీ 


కాలము నీది ప్రకాశము గానన్ 

మాలలు నీకు ప్రమాణము గానన్ 

మూలమునీవుయె ముఖ్యము గానన్ 

లాలన నీది ప్ర లాపము దేవీ 


ప్రేరణగాను సుప్రీతియు గానన్ 

ధారణ కాలము దారులు గానన్ 

మారణహోమము మాయలు గానన్ 

కారణ మేమది కర్మలు దేవీ 


పైత్యము లీలలు పైకముగానన్ 

నిత్య సమానము నీడలు గానన్ 

ముత్యపు కాంతులు ముఖ్యము గానన్ 

సత్యపు వాక్కులు సాధన దేవీ

*****


ప్రాంజలి ప్రభ.. కొత్త పాట.. జీవీ 


ఓ జీవీ ఎందుకు ఆలోచన

 జరిగేది జరగక మానదు 

 కాలానికి ఎదురీది బతక జాలవు.

దక్కినదే సొంతమని తృప్తిపడు 


తుచ్చ వాంఛలు ఎవరి కొరకు 

విషయ వాసనల వెంట పడకు 

మేనుపై ఇచ్ఛను మరల్చి బతుకు 

భౌతిక స్మృతిలో నుండుము ఎప్పుడు 


నిరంతర భగవతన్వేషణ యోచన

సదా మనసున తాత్విక చింతన

అంతరాత్మను దర్శించిన భక్తి భావన 

దైవమే లోకమైన, ధర్మమే తత్త్వమైన, 

సత్యమే వాక్కుయైన 

తోడు నీడ చేరిన సంఘర్షణ లేని 

తాదాత్మ్యత భోదల సంభాషణ 


గురువులకే గురువు ఆధ్యాత్మిక ముగా 

నిత్య ప్రవర్తన వినయ వివేకoగా 

జగతికి చాటిన ఏకీ భావన గా 

మంచి మాటతో మహిని మార్పు దిశగా 


చూడాలి అందరిలో దైవము 

వీడాలి మనసున కల్లోలము 

పాడాలి హృదయానంద పరము

ఆడాలి అనురాగ ఆనందముతో 

           

 ఓ జీవీ ఎందుకు ఆలోచన

 జరిగేది జరగక మానదు 

 కాలానికి ఎదురీది బతక జాలవు.

దక్కినదే సొంతమని తృప్తిపడు


ఓ జీవీ... ఓ జీవీ

******

ప్రాంజలి ప్రభ... కొత్త పాట.... ఆనందం 


అంగట్లో దొరికేది కాదు 

 అంబరాన వెతకాలి అన్న వెతికేది కాదు 

 పాతాళంలో దాగాలన్న దాగేది కాదు 

 మమతల్లో మానవత్వం  మనసుల్లో మకరందం అదే అవధులు లేని ఆనందం.


 వేకువ పొద్దు విహంగ విక్షనంగా 

మక్కువ హద్దు మహోన్నత క్ష ణం గా 

పెరటి సన్నజాజుల సిగ్గు సొగసుగా 

 అరటిపండు అమృతామృత కళగా ఆనందం


 బుజ్జాయి బోసి నవ్వుల మురిపంగా 

 సజ్జన సాంగత్య సుఖపరంగా 

 పడచు చిన్నదాని చిలిపి చూపుగా 

 తలచు పంట పైరు పచ్చని పలకరింపుగా ఆనందం


 నిండు పున్నమి నెలరేడి వెలుగుగా 

 పండువెన్నెల లో పరచిన  తనువుగా 

సెలయేటి పరుగుల గలగల సవ్వడిగా 

లేగదూడ చెంగుచెంగు నాట్యముగా ఆనందం


కమ్మని తెలుగు పద్యాల పఠనం గా 

మనసైన సతి అలకలోని వగలుగా 

బాల్యస్మృతుల గుండెచెమరింత గా 

సొంతూరి సంగతుల తీపికబుర్లు  గా ఆనందం


పరమాత్మ నామ నిత్య ధ్యానం గా ఆనందం

 సత్య వాక్కుతో  సమయసoతృప్తి ఆనందo


ఆనందం ఒక భాగ్యం 

ఆనందించడం ఒక యోగం 

ఆనందం పొందడం మన సంకల్పం 

ఆనందాస్వాదన సుధ కన్నా మధురం.! ఆనందం


 అంగట్లో దొరికేది కాదు 

 అంబరాన వెతకాలి అన్న వెతికేది కాదు 

 పాతాళంలో దాగాలన్న తాగేది కాదు 

 మమతల్లో మానవత్వం  మనసుల్లో మకరందం అదే అవధులలో ఆనందం.

*****

చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా... ప్రాంజలి ప్రభ 


ప్రజా సంక్షేమమే దేహ మై 

 శత్రుసంహారమే లక్ష్యమై 

 ముద్దు బిడ్డగా యుద్ధమై 

 భారతదేశ అఖండ జ్యోతి గా 


 ప్రజా హృదయాల్లో చిత్తమై 

 శత్రు సేనానికి భయ్యమై 

 సకల సామ్రాజ్య రక్షనై 

సత్యమ్ శివమ్ సుందరడుగా 


 భయము ఎరుగని మహా పరాక్రమ వీరుడై 

 శత్రువులకు దడ పుట్టించు ఘనసూరుడై 

 మొగలులకు బెదురైన మరాఠా యోధుడై 

 సుదీర్ఘ యుద్ధాలు చేసిన సమర్థ పాలకుడై

హిందువులలో గర్వించు చత్రపతి శివాజీ రేడు


 మతసామరస్యం చూపిన భవాని భక్తుడై 

దేశభక్తి దైవభక్తి మెండేన భరతమాత బిడ్డడై 

 మగవాళ్లకు తగు గౌరవం ఇచ్చిన సంస్కారుడై 

 ధర్మ పరిపాలన దురంధరుడై 

 హిందువులలో గర్వించు చత్రపతి శివాజీ రేడు

*-----

మాతృభాష దినోత్స వ సందర్భముగా 

ప్రాంజలి ప్రభ.. కొత్త పాట.. తెలుగు భాష న్నా 


సూర్యునితో రోగాలు హరిస్తున్న 

చంద్రునితో వెన్నెల పొందుతున్న 

ప్రకృతి కళలు నిండుతువున్న 

నా భాష తెలుగుభాషేనని చాటుతున్నా 


మాతృ దేశముకన్న 

మాతృమూర్తి కన్న

పితృమూర్తి కన్న 

తెలుగు భాష మిన్నా 


పాల బువ్వ కన్న 

పాపాయి నవ్వు కన్న

పసిడి సిరుల కన్న 

తెలుగు భాష మిన్నా 


పడచు సొగసు కన్న 

కొత్త చెఱకు తీపి కన్న 

సెలయేటి వంపు కన్న 

తెలుగు భాష మిన్నా 


సంధ్య వెలుగు కన్న 

కమ్మని వెన్న కన్న 

స్వాతి చినుకు తళకు కన్న 

తెలుగు భాష మిన్నా 


నెమలి కులుకు కన్న

నవ వధువు సిగ్గు కన్న 

సురలోక మధువు కన్న

తెలుగు భాష మిన్నా 


గుడి గంట సడి కన్న 

నిండు కలువల తటి కన్న 

పైరగాలి గిలిగింత కన్న 

తెలుగు భాష మిన్నా 


నవ వసంతపు శోభ కన్న 

మిన్నయైనది మధుర మిన్న 

మహత్తరమైనది మనసు మిన్న 

తెలుగు భాష మిన్నా 


మమకారమొలుకున్న 

ఆత్మీయత చిలుకునన్న 

వాగ్ధేవికి ప్రియమైనదినన్న 

తెలుగు భాష మిన్నా


తెలుగు నేలకు వరమైన

అందమైనది విన సొంపైన 

అనందమృత కళలు గన 

గురువు తెలిపే ఆంగ్లము కన్న 

తెలుగు అనగతొక్కే ప్రభుత్వము కన్న 

తెలుగు భాష మిన్నా 


సూర్యునితో రోగాలు హరిస్తున్న 

చంద్రునితో వెన్నెల పొందుతున్న 

ప్రకృతి కళలు నిండుతువున్న 

నా భాష తెలుగుభాషేనని చాటుతున్నా 

                       --

ప్రాంజలి ప్రభ.. కొత్త పాట..


వయ్యారి నీవు వద్దన్నా మైమరుపు 

సయ్యాటకు రమ్మన్నా కొస మెరుపు 

అయ్యారే మాటలు విన్నా ఆదమరుపు 

 భయ్యాన్ని తరిమియే యున్నా మది పిలుపు...


 మదిలో ముచ్చట రేకిస్తున్నా 

 విధిగా కన్నులతో కవ్విస్తున్నా 

 నిధిగా గమ్యమునే చూపిస్తున్నా 

 రోదనె చేయక ప్రోత్సహిస్తున్నా కదా.... వయ్యారి 


 చిరునవ్వులతో చిందులు వేస్తున్నా 

 మరుమల్లెలతో మాయలు చేస్తున్నా 

 కురుల కవ్వింపుతో గాయం చేస్తున్నా 

 తరుణి మగవారి మనసు గెలుస్తున్నా కదా... అయ్యారే


నీ కన్నా నా కెవరు లేరులే యన్నా 

నీవే నా సకలమని మెప్పులే యన్నా 

నీతో నా వెతలన్నీ తీర్చులే నన్నా 

నిశ్శబ్దంగా విన్నవించానులేనన్నాను కదా... వయ్యారి 


ఎంత మేర నా భాగ్యమోనని తెలుస్తున్నా 

కొంత కలత ఉన్నది కానీ యని తపిస్తున్నా 

అంతయూ నీకు తెలుసు నని విలపిస్తున్నా 

సుంత కరుణ చూపిన చాలని ఊహిస్తున్నాను కదా.. అయ్యారే


రెప్పలు మూయక వేచి యున్నా 

గొప్పగా నిన్ను తలచి యున్నా 

మెప్పు పొందాలని ఆశతో యున్నా 

కుప్పగా పువ్వులు పోసి నీ ముందరన్నా....కదా వయ్యారి 


వయ్యారి నీవు వద్దన్నా మైమరుపు 

సయ్యాటకు రమ్మన్నా కొస మెరుపు 

అయ్యారే మాటలు విన్నా ఆదమరుపు 

 భయ్యాన్ని తరిమియే యున్నా మది పిలుపు...

 

****

మల్లాప్రగడ రామకృష్ణ

ప్రాంజలి ప్రభ..కొత్త పాట..


పాడుతా తీయగా జోరుగా 

 పాడుతూ మాయలే మార్పుగా.. 2


 పాటలు మాటలే కూర్పుగా 

 పాటతో నవ్వులే నేర్పుగా.... 2..పా 


 ఎంత నేర్చిన తక్కువే యగు సంగీతమే ఇదియని 

 కొద్దికాలము కిందనే సంగీత మర్మము తెలుసుకొంటిని 

 మొద్దు బారిన యెడల తానే కరిగిపోవగ విస్తుపోతిని 

 ఇంతకన్నా భోగమేదని పరవశమ్మును పొందితిని...పా 


ఒదిగిన మనసున పొదిగే భావము కదిపేదెవరో 

 అదుపున జరిగిన మెదిలే భావము చదివేదెవరో 

 పొదుపున నలిపిన తెలిపే భావము వదిలేదెవరో 

 సరిగమపదనిస పలుకే భావము తెలిపేదేవరో... పా 


 అందుకే సంగీత స్వరాల ఔషధాల మయం 

 అందుకే సంగీతాన్ని ఆలకించడం భోగం 

 అందుకే సంగీతాన్ని ఆలపించడం యోగం 

 అందుకే సంగీతాన్ని నుపేక్షించడం రోగం.....


పాడుతా తీయగా జోరుగా 

 పాడుతూ మాయలే మార్పుగా 

 పాటలు మాటలే కూర్పుగా 

 పాటతో నవ్వులే నేర్పుగా.... పా..


 మల్లాప్రగడ రామకృష్ణ


*****

 సుందర సుకుమార కన్య విలాప సీస పద్యాలు 

మల్లా ప్రగడ రామకృష్ణ 


కర్ణాంత విశ్రాంత కనులున్న దానవే

వర్ణింపవసామౌనె వరుస కన్య

రాకేందు బింబమై  రాజిల్లు మోముగా

కేశబంధముగానె కేళి కన్య

నయగారా మొలికేటి నాజూకు నడుముగా

నయనాలు మరిపించు నటన కన్య

నడక జూడగనుండ నలువ వాహనబోలు

ముత్యాల నవ్వుతో ముదము కన్య


ఉండ బట్టలేని ఊగేది మనసగు

వింత సోకు జూడ వేయి కళ్ళు

నమ్మలేని సొగసు నాట్యమ్ము జేయించు

తనివి తీర కుండె తపన తీరు

***

సీస పద్యము 


భీతి కల్పనలగు బింబోష్టినిగనగా

నలిజాక్షి నినుఁజూడ నమ్మ కన్య

శోభిళ్ళు యందమే సోకుల కళలుగు

నాల్గు కన్నులు జూడ నయన కన్య

ఉల్లాస యుత్సాహ యుజ్వలా భావమ్ము

శాంతిని చేకూర్చు సమయ కన్య

బ్రహ్మసృష్టి గనుగా బంధమ్ము నేస్తమై

సకల శోభను పంచు సరళ కన్య


వర్ణనెంత తెలప వాలుజాక్షి లీలలు

మనసు దోచగలగు మాయ సృష్టి

వలవల కళ గాను వలపుజల్లుకురిసే

జవ్వని కులుకౌను జాగ రూక

**-

    

సీ

ప్రేలాప వంశాన ప్రభవమందినకన్య 

నైశ్వర్య విభవాన నలరు కన్య 

 కోపతాపముగల గొప్పచెప్పెడికన్య 

నరుల యాసలుగాను విరియు కన్య 

దివ్యగంధాలతో దీపించ గలకన్య 

పూలమాలలతోడ పొలయుకన్య 

మానస వేటల మాన్యుల తోడుత

పరివేష్టితుండౌచు బరగుకన్య


తేగీ

నృత్య గాన వినోదాల నెనరుకన్య 

నమ్మ బలుకుతో  నటనయే నచట కన్య 

బోరుబోరున విలపించి పొగిలి కన్య 

చెప్పదొడగెను కడగండ్లఁ చింత కన్య 

***


****-

*హృదయం*


కంటికి కనిపించవు, మేనిలో దాగి యుంటావు. 

 రాగాలను పలికిస్తావు, జీవ యాత్రకు తోడవతావు.


 హృదయ స్పర్శకు ఆరాట పడతావు, 

ఆతృత పడతావు ఆనంద పడతావు.

 కవాటాల్తో రుధిరాన్ని  కదిలిస్తావు,

 ఉశ్వాస, నిశ్వాసాలకే ఊగి పోతావు.


 అలజడి కే నొప్పి పెడతావు, 

మమ్ము భయపెట్టి ఆనందిస్తావు.

 మరి విసిగించి అలసిపోయావు,

అలిగి సద్దు సేయక మిన్నకుండేవు 


నిర్లక్ష్యం చేయలేని స్థితికి మారుతావు, 

దేహాన్ని కదలించ లేక 

 విశ్రాంతిగా మారిపోతావు.

స్వర్గ సీమాలో చేరిపోతావు.

*****

*ప్రేమికుల రోజు శుభాకాంక్షలతో*.. కొత్త పాట 


ఓహో ప్రేయసి అందుకో అనందపు రాశి 

ఈ ఆదర్శ అధరామృత పిపాసి 

నాలో నీవై నీలో నేనై ఏకంతాల హృదయపు రాశి 

ఓహో ప్రేయసి అందుకో అనందపు రాశి


చరణం.

నా కొరకే బ్రహ్మ సృష్ఠించిన 

     నా అదృష్ట దేవతవు 

ఎన్నెన్నో జన్మల బంధమైన 

    నా అనురాగ దేవతవు 

నా ఆలోచనలకు ప్రాణం పోసే

  నా అక్షరాల ఆకృతివైనావు 

ఉదయ సంధ్యలు నిను స్మరించే

           నా ప్రేమికురాలైనావు 

ఓహో ప్రేయసి అందుకో అనందపు రాశి 


నా బతుకు గమనంలో వెంటుండే 

        నా జీవన వేదంమైనావు 

నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు ఊతమైన

 నా ఊపిరి వైనావు          

 ప్రేమిస్తున్నా.. 

నిను నా ప్రాణంకన్నా మిన్నగా! 

హృదయంలో నిండి పోయావు 


ప్రేమనిస్తా.. ప్రేమే కుళ్ళు కొనేలాగా! 


ప్రేమిస్తా.. 

నిను నా ఆయువు ! ఆగినంతదాకా


ప్రేమిస్తూనే ఉంటా.. 

నాకు మరుజన్మ లేనంతదాకా.!!                         

*ప్రేమిస్తూనే ఉంటా.. **

 *ప్రేమకై తపిస్తూ ఉంటా*


ఓహో ప్రేయసి అందుకో అనందపు రాశి 

ఈ ఆదర్శ అధరామృత పిపాసి 

నాలోనివై నీలోనేనై ఏకంతాల హృదయపు రాశి

ఓహో ప్రేయసి అందుకో అనందపు రాశి


*తెలుగు తల్లి ఆవేదన*


ఏ దారం లేకుండ ఎగిరే'నా హృదయమా 

చూడ'లేని వారికి చూప గలిగేటి తరమా 


మేఘాల వస్త్రము చాటున మురిపమా

గుండెపోటు గగనమై గుర్తుగా మందహాసమా 


మధురిమలే పెంచి 'నా మన్మధ లీల గాయమా 

కన్ను పోటు కోరి వెన్నుపోటు మంత్రాంగమా


కిరీటాన్ని తుంచె 'నా కీర్తియనగా తంత్రమా 

ప్రేమవిలువ తెలియలేని మూర్ఖుని దాహమా 


చదువులెంత అద్భుతమో

యువతలోని పనితనమా 

 నిర్వీర్యత కాల్చ' విషమ గమనమా 


యుద్ధానికి దిగుతున్న ఫలితము సూన్యమా 

స్నేహానికి చిరునామా చూపే' విధి మార్గమా 


ప్రశ్నించే హక్కుండీ చేతకాని తనమా 

లాభమేమి ఒరిగిందోయ్ తెలియని మొహమా 


జవాబుదారీ తనమే బ్రతుకు పనితనమా 

సంయమనం ఎంతవరకో తెలుపుమా 


పగలగొట్టవలనన్న పెద్ద బండను

ఒంటిలోన నుండవలె గొప్ప బలమా 

విరచవలెనన్న లోని మనసును

అనకూడని చిన్న నోటి మాట చాలు నేర్పతనమా 


బండనైనా అతికించగవచ్చు

కానీ..విరిగిన మదినతికించ సాధ్యమా 

పెదవిదాటిన పెన్నదాటను సూక్తి సత్యమా 


దొర్లినమాట వెనకురాదు తెలుసుకొన లేమా 

నోరు మంచిదైన ఊరు మంచిదగుట నిజమా 


పారేసుకోకు నోరు సమస్యలు తెచ్చుకోకు సమంజసమా 

అర్థమేదొ మారిందా భగవద్గీతకు అద్ద మా


మగువలపై మగవాని అహంకారమా 

తెలుగు భాషపై ప్రభుత్వాలు ఉక్కు పాదమా


By. మల్లాప్రగడ రామకృష్ణ, 

6281190539

కొత్త పాట.. నీవేలే )(7) మల్లాప్రగడ 


ఎప్పుడు ఎప్పుడో అన్న మాట కాదులే 

 ఇప్పుడిప్పుడే అనే మాట అవునులే

 అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిన్ను మరవలేని మాటలే


 వెచ్చని ఊపిరికి నీ పరిమళాలు తాకిలే

 ఉదయభాను కిరన్నా లా గుచ్చుకునే నీ చూపులే

 చిగురాకుల మెరిసే నీ పెదవులే

 ఆకు పై బిందువు లా నీ నుదురులే

 గిలిగింతలు పెట్టే నీ నవ్వు మోములే... ఎప్పుడు..


 క్షణాలన్నియుగాలైన వేళ నీ పిలుపులే

 పెదాలు మూగబోయిన వేళ అధరాలు అందించు లే

 మరుపురాని జ్ఞాపకాలు గుర్తు చేయు లే

 నిన్ను నన్ను సున్నితంగా మీటే చిరుగాలిలే

 ప్రతిక్షణం నా హృదయాన్ని కదిలించే  దానివి నీవేలే...


నల్లని కురులలో తెల్లని మల్లెల మాలలే 

పుత్తడి మోముపై తెలతెల్లని వలవలే 

కరముల కున్న వజ్రపుపుత్తడి మెర్పుగాజులే 

నవ్వుల పెదాల మెరపుల మగువలే 


ఎప్పుడు ఎప్పుడో అన్న మాట కాదులే 

 ఇప్పుడిప్పుడే అనే మాట అవునులే

 అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిన్ను మరవలేని మాటలే


కొత్తపాట.. అమ్మలుగన్నమ్మ (6)మల్లాప్రగడ 


పల్లవి.

కలగంటినే నమ్మాకలగంటినే

కలలోన నీ కథలునే వింటినే 

కలలోననీరూపునే నే గంటినే 

కలలోన నీ పలుకునే వింటినే  ||2|| 


నీచరణ ధూళికి నే..తగునంటినా 

కోవెలలో కొలువైన దైవం నీవేనమ్మా .. 

కోరుకున్న వరాలు తీర్చే దైవము నీవమ్మా.... (కోవెలలో...)


నా దైవం నీవేనమ్మా, మమ్మాదుకునే 

అమ్మలూగన్న అమ్మవు నీవమ్మా 

 

బుడిబుడి కీర్తనలు పాడితిని 

పలుకే పంచిన అమ్మను వేడితిని  

అమ్మా పరమార్ధాన్ని గ్రహించితిని 

నేర్పిన ప్రధమ గురువు నీవేవైతివి 


కష్టము నందు  సహనము నేర్పి 

పలుకు పదములు గుట్టును నేర్పి 

ఎల్లరి ముదమున మన్నన నేర్పి 

హృదయంలో శాంతిని నింపిన అమ్మవు గదమ్మా

(కోవెలలో...)


పాకులాడిననెంతగా.. 

తాపత్రయపడిననెంతగా.. నమ్మా 

నీదిగానినేదియూ

నీతో కుదరని ఏ బంధమూ లేదమ్మా 

నీకు దక్కదు నీతోనుండదు. అని చెప్పితివమ్మా 

(కోవెలలో...)


వద్దనుకున్ననెంతగా.. 

దూరముంచిననెంతగా.. నమ్మా 

నీదైనదేదియూ 

నీతో ముడిపడిన ఏ అనుబందమూ 

నీకు చిక్కును నిను వీడకుండును.నేనమ్మా 

(కోవెలలో...)


చిత్రమిది సత్యమిది

అబ్బురమిది దైవ నిర్ణయమిది.

అదేనమ్మా లోకరీతి గదమ్మా 


కలగంటినే నమ్మాకలగంటినే

కలలోన నీ కథలునే వింటినే 

కలలోననీరూపునే నే గంటినే 

కలలోన నీ పలుకునే వింటినే  ||2||

** 

కొత్త పాట.. యేది భక్తి (5)


ఎవరికెవరు యీ లోకంలో

ఎరుక నెంచి మెసెగ గల వారేరి?

ఏభాష? యేదరి? యేమాయ? యేవిధి? ఎరుకలేరు యీ లోకంలో


ఎవరు ముందో? యివరు వెనకో? యేది నిజమో? యేది యబద్ధమో? ప్రయాణాలు తారుమారు యీ లోకంలో 


ఎవరికెవరు? యే బంధమెన్నాళ్ళో? యేకష్ట మెన్నాళ్ళు? యే సుఖమెన్నాళ్ళు ? అనురాగ బంధాలు యీ లోకంలో 


ఋణమున్నంతవరకే అనుబంధమంతా

ఏది నీది? యేది నాది? యేది చదువు? యేది భక్తి యీ లోకంలో


ఊపిరున్నంతవరకే వ్యామోహమంతా

ఏది వాస్తవము? యేది బూటకము? యేది న్యాయము? యేది యన్యాయము? యీ లోకంలో


కాలము సమాధానము చెప్పునంతా

ఎవరు హితులో? యెవరు దుర్మతులో? యెవరు స్వతంత్రులు? యెవరు యస్వతంత్రులు యీ లోకంలో


మాయ తొలగిన తెలిసేను నిజమంతా, అభూతకల్పనా 

ఏది సత్యమో? ఏది శాశ్వతమో? యీ లోకంలో


ఎరుకగలిగిన వేదాంతము తెలుపునంతా అర్ధము ఎంతవరకు, ఆనందం ఎంతవరకు 

ఏది సంతృప్తి? ఎక్కడ ప్రశాంతత? యీ లోకంలో


ఆశాపాశాలు వీడక? బోధపడక?

ఏది ఆత్మానందమో తెలియక? యేది జన్మ సార్ధకత?

ఏది ఆరోగ్యం? యేది వైరాగ్యం? యీ లోకంలో


ఎవరికెవరు యీ లోకంలో

ఎరుక నెంచి మెసెగ గల వారేరి?

ఏభాష యేదరి యేమాయ యేవిధి ఎరుకలేరు యీ లోకంలో

కొత్త పాట.. కన్నీరు (4)


ఏమని చెప్పేది? ఎవరు అని చెప్పేది? కన్నీటికి కారణం ఏ దనేది? పరిష్కారం కాలమనేది.


 కన్నీరు చిమ్మని కన్ను లేవి 

 వ్యధ చెందని  గుండె లేవి 

 ప్రేమకు లొంగని బుద్ధు లేవి 

 సత్యము తెల్పెడి బ్రత్కు లేవి 


 కన్నీటి విల్వకు మది యేది 

 సన్నీలు వెనీళ్ల కళ యేది 

మున్నాళ్ళ ముచ్చట స్థితి యేది 

చిన్మాయ శాంతించు గుణమేది 


 నొప్పి పడ్డ మతి కన్నీరు 

 చెప్పు కోని విద్య కన్నీరు 

 అప్పు చేయ బుద్ధి కన్నీరు 

 తప్పు చేసి బాధ కన్నీరు 


వొలికేది కన్నీటీ బరువు వలపల్లె చిందేటి తనువు 

చలనమ్ము కన్నీటి మెరుపు చెలిపోందు సుఖమంత చెరువు 

వలలోన కన్నీటిమరుపు వలపించి బ్రతుకంత తరువు 

అలలుగా కన్నీటి పరుపు అలకలు తీర్చేటి తెగువు


రాబడి కన్నీటి కారు రసరమ్య జీవిత తలపు 

నెపమాయె కన్నీటి తీరు నేస్తమ్ము సౌఖ్యమ్ము పిలుపు 

ఉపకార కన్నీటి యేరు యున్నత భాష్యమ్ము మలుపు 

అపకార కన్నీరు వేరు ఆత్రము జుపేటి తెలుపు


ఏమని చెప్పేది? ఎవరు అని చెప్పేది? కన్నీటికి కారణం ఏ దనేది? పరిష్కారం కాలమనేది.

కొత్త పాట.. దేవుడు (3)


మనసు కన్నను వేగపరుడు, 

మనసు శాస్త్రమురచయితలె 

మనసునందుoడెడి వాడు, 

మనకు వీర్యమెపంచు వాడు

మనకు నగ్నిని పంచు వాడు, 

మనలోన వాయువతడులె

క్షణ సుఖము హవిస్సుయతడు, 

క్షామాన్నిమార్చు దేవుడులె


కాల రూపము గల వాడు 

కార్యసాఫల్య పరుడులె

జ్వాలసృష్టిపర దేవరడు 

ఛాయామయమ్ముగా ధరుడు

మూలము తానైన వాడు 

ముఖ్య పరంధామ పరుడు

నాలుగు దిక్కులై నాడు 

నయనాల వాసుదేవుండు


గొప్ప సైన్యము గలవాడు 

కోర్కెలు తీర్చేడి వాడు

వప్పచెప్పెగల దీక్షగలడు 

వాక్కుతో జయిoచువాడు 

అప్పులేని మహాత్ముడతడు 

ఆశ్రిత రక్షణా పరుడు 

నిప్పు గాలి జలము నతడు 

నీడనివ్వ స్వేచ్ఛ పరుడు


ప్రకృతిగా తానైన వాడు 

ప్రకృతి పరంధామ పరుడు 

సుకృతి కలుగ జేయువాడు 

సుకృతి పరమేశ డతడు

ప్రకృతి ఆనందమే నతడు 

ప్రకృతి ప్రభావం గానతడు 

వికృతి నాశన పర్చు వాడు 

వికృతి మార్పునుకోరువాడు


కొత్త పాట.. లోకం తీరు (2)


ఇదే ఇదేలే కళల ప్రపంచం 

అందరి హృదయాల్లో నింపిన అగమ్య గోచరం 

పంచభూతాలతో జరిగే వ్యాపారం 

అర్ధo తో మధ్యనలిగే జీవిత సారాంశం  


కలలు తీర్చు కాలమే ఇదియేనా 

 పలుకులన్నీ బవ బంధాలకు మార్గ మేనా 

 ఉన్నది లేదని, లేనిది ఉందని, చింతల బ్రతుకేనా 

 నిజా అబద్ధాల మధ్య, సుఖదుఃఖాల మధ్యా , 

నలిగిపోయే జీవితమేనా....   ... ఇదే.. ఇదే 


జగతికి వెలుగును పంచే సూర్యుని మరిచే లోకం లోనా 

తల్లితండ్రులను, గురువులను, తప్పుగా,

 చూసే మనుష్యుల మధ్య నా 

 ఒక్కతారతో సుఖం పొందక జాబిల్లిలా 

వేల తారల మధ్య సుఖ మేననా 

 విద్యను వినయంగా బోధ చేయక 

విద్యా గర్వం తో పలుకు లేనా..... ఇదే.. Ide


 జలాల మధ్య కలువలగా నుండక 

సంద్రంలో ఎగిరే పక్షిలా ఉండాలనుటే యేలనా 

 మంచితనంతో మానవత్వం బతికించక,

 రాక్షస బుద్దితో మూర్ఖుడుగా మారుటేలనా 

కాంతా కాంచనములోని వెలుగు చూడక, 

రంగు రాళ్లలో రత్నాలు ఏరుటేలనా.... ఇదే.. ఇదే.


 ధర్మాన్ని విస్తరించి సత్యం పలకక, 

అధర్మాన ఆదరించే ధనముపై కోర్కేలనా 

పాపపుణ్యాలు మరచి ధ్యానములో నుండక, 

విద్యాగర్వముతో ప్రశ్నలు వేయుటే లన


మాటల విలువలు తెలియ పరిచాక,

మన దురదృష్టం తెలిసికొని ఆచరించ పోవు టేలనా 

నమ్మకమే మోసమైన, ఆలోచనే ఆలస్యమైన, 

గౌరవాన్ని కోల్పోక, 

ధనమే దైవమని శత్రువుగా మారుటేలనా 


ఇదే ఇదేలే కళల ప్రపంచం 

అందరి హృదయాల్లో నింపిన అగమ్య గోచరం 

పంచభూతాలతో జరిగే వ్యాపారం 

అర్ధoలా మధ్యనలిగే జీవిత సారాంశం


కొత్తపాట (ధైర్యాన్ని నింపే ) (1)


ఓ వీరుడా, ఓ ఓ ధీరుడా, కల్లు తెరచి నిజం తెలుసుకో

శ్రీ కృష్ణుడిలా శంఖం పూరించు, అర్జునిడిలా అధర్మాన్ని ఎదిరించు

మానవత్వాన్ని బ్రతికించుటకు ధైర్యముగా ముందుకు సాగిపో సాగిపో


సత్యం పలకని చోట, ధర్మం గెలవని చోట

న్యాయం నిలవని చోట, నివే ధైర్యంగా చేయాలి వేట


నిన్ను నీవు రక్షించు కోవటం కాదు

నమ్మిన సిద్దాతాన్ని బ్రతికించటం నేర్చుకో

అవసరాన్ని బట్టి, ప్రకృతిని బట్టి మారుట నేర్చుకో

క్రూరమ్రుగాలను, కిరాతాకులను వేటాడుట తప్పదే 


ఓ వీరుడా, ఓ ఓ ధీరుడా, కల్లు తెరచి నిజం తెలుసుకో

మానవత్వాన్ని బ్రతికించుటకు ధైర్యముగా ముందుకు సాగిపో సాగిపో  సాగిపో సాగిపో


కలికాలంలో దుర్మార్గానికి ఎవ్వరూ బలి కాకుండా ఆదుకో

ప్రతిఒక్కరి మనసును మార్చుటకు వెయ్యాలి కొత్త వేషమే 

తప్పదు తప్పదు అనుకుంటే చెయ్యాలి కత్తుల వేట


తప్పో ఒప్పో తెలియదు ఆనాడు కృష్ణుడు కురుక్షేత్రంలో ఆడిన ఆట

నీవే చేయాలి ఈనాడు దుర్మార్గులపై రణక్షేత్రంలో వేట

హృదయాలలో నిలిచే మాటలతో ఆనందం, ఆరోగ్యం కలిగించే ఆటలతో ఆదర్సుని లా జూపించు బాట 


ఓ వీరుడా, ఓ ఓ ధీరుడా, కల్లు తెరచి నిజం తెలుసుకో

శ్రీ కృష్ణుడిలా శంఖం పూరించు, అర్జునిడిలా అధర్మాన్ని ఎదిరించు

మానవత్వాన్ని బ్రతికించుటకు ధైర్యముగా ముందుకు సాగిపో సాగిపో

--((*))--

Saturday, 28 December 2024

 

సం.. సా.. సం.. కవిత్వం 


* తే... సంగమిస్తూనె నేనుగా సర్దు సలిపి

సుఖమను దుఃఖ కళలను సూత్ర మాయె

చరిత చెప్పిన విధముగా చప్పరింత

చనువు ఏకమై సంబర చేష్ట లుడికె

.........


సుఖమను దుఃఖ సూత్రముయు చూపులమాయ ఫలమ్ము సౌఖ్యమున్ 

వికసిత భావ లక్ష్యముయు విద్దెలతీరునుమార్పు చేరుటన్ 

మకతిక మర్మజీవమగు మార్గము శోభన పర్వమేయగున్ 

సకలము కర్మలేయగుతయు సాక్షిగ జీవనయాత్ర బంధమున్ 

......

తే..కవి హృదయము ద్రవించెను కావ్యమగుటె

సవ్వసాచి గా శృంగారం సమయ మందు

హృదయ వాంఛల కలయిక హాయి గొలుపె

చిక్కు కున్న ముసుగులో న చీకు లొలుకె

......


కవి హృదయమ్ము కావ్యమును కాలము బట్టియువ్రాయు సౌఖ్యమున్ 

భవిత సమమ్ము గాంచుటయు భాగ్యము నిచ్చెడి పద్ధతీ గతిన్ 

రవి సహజమ్ము చూపులగు రమ్యతకూర్చ విధానమే యగున్ 

యువ మధురమ్ము చెంతసుఖమూ ప్రభవమ్ము గనౌను ప్రేమయున్ 

.....


* తే.. మృదుమధుర వాత్సాయన మందహాస

మగువ మగనితో కలియుటే మన్మధ కేళి

చిరునగవులతో చిందులు చిత్ర మాయె

ఊహ కందని స్వర్గము ఉట్టి పడుట

......

మృదు వాత్సాయన మందహాసమదియే ముఖ్యమ్ము జీవమ్ముగన్ 

మదనాతీర్పుయు మన్మధా కళలుగన్ మానమ్ము సౌఖ్యమ్ముగన్

వ్యధ చిందుల్ చిరుచిత్రమున్ యానుమతీవాక్కుల్లె సంతోషమున్ 

మదియూహల్ కళ స్వర్గమున్ వయసుగన్ మానమ్ము సంతృప్తిగన్ 

......

* తే ..సలప రింపుల సల్లాపం సాగి సాగి

జిహ్వ చాపల్య కళలన్ని జైత్ర యాత్ర

అంత రంగాల ఆరాట ఆలుమగలు

ఆశ పాశమై ఆనంద అలుక గెలుపు

......

సల్లాపమ్ముగనే సాగి సమరమ్ సాధ్యమ్ము నిత్యమ్ముగన్ 

కల్లాలా యగుటన్ జిహ్వ మలుపుల్ కార్యమ్ము గానిత్యమున్ 

ముల్లోకాలన తీరు విద్దెలవే ముఖ్యమ్ము చాపల్యమున్ 

చల్లారింప మదీసమమ్ము కళగన్ చాతుర్య శృంగారమున్ 


.......


వేసవికాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వీస్తావే 

 వర్షపు కాలం జల్లుల్లాగా కొంచెం కొంచెం తడ్పేవే 

 తరిమే తుంటరి తుఫానులా చుట్టేయచ్చుగా

 దరువే తప్పదు సుధామయీ చుట్టేయొచ్చుగా 


మదనార్తి తీవ్రతకు మందేమిటిటయ్యా?

 ఏముంది ఆలింగనం మందు, 

అదర చుంబనం అనుపానమూను 

 ఆదర్శ కలయకే ఆత్మీయం 


పంచ శరు బారికి చిక్కితి నీకు దక్కితి 

యెంచ గను చేరితి నక్కియు నీకు మొక్కితి 

వంచనను జేయక మక్కువ మీకు చూపితి 

సంచిత మమస్సును యెక్కువ మీకు పంచితి


శా.లోకంలో ననె మన్మధాకధలుగన్ లౌక్యమ్ము జూపే కళల్ 

లోకంలో వలపింతురే మధవతుల్ లోలత్వ భగుల్ కళల్ 

లోకంలో చెలి తేట లేనగవుగన్ కోలాట హాస్యా కళల్ 

లోకం లో భవ బంధ కుందువగనున్ కోపమ్ము జూపేకళల్


సకల చరాచరమయ జీవాళి నెల్ల 

సకలము కామ మయము దివ్యాతి దివ్వె 

మకుటముగాను వలగతి ఖ్యాతి భవ్య 

మొకటవ విద్య ప్రణితము తీవ్ర దృష్టి


పతి లేనీస్థితి కోర్కెలే గతిగనే పాఠమ్ము నేర్పే విధిన్ 

గతి వేషమ్ముమనస్సువడియే గమ్యమ్ము తెల్పేందుకున్ 

మతిలేకేనిజమున్ సుఖమ్ము కళలే మాయల్లె వెంటాడుటన్ 

రతికై రమ్మనె యాత్మ సోదరుని నారాటంబు గన్పట్టగన్


గుండెలో నిదురించే వలపంటే ప్రేమేగా 

 మొండిగా చెలి గాలి పిలుపంటే  ప్రేమేగా 

చండిగా పలుకంటే సహనమ్ము ప్రేమేగా 

 దండిగా దరువైన సుఖమాయ ప్రేమేగా  


ఉ.విన్నది చూపు కల్పనలు వెన్నెల నీడన కోర్కె ప్రేమగన్ 

కన్నియ మీద నా వలపు గాధము కూరుకు రాదు రేయి నా 

కెన్నడు గానమే మలువు క్షేమము నూరక యుండ లేక నా 

మన్నన జూపగా వలపు మార్గ పసందును తెల్ప గల్గగన్


*తే ..మొసుకు వచ్చెపల్లకిలాగ మొత్తుకొనక

ప్రకృతి ఒడిలో న మలుపులు పద్ధతి గాను

ఋతువు లు పిలుపు పొందుట ఋణము మల్లె

దాని కొరకేను కౌగిలి దరయు నీతి

........

మోసెను పల్లకీ మనసు మోత్తుకొనంకయు గాలిలాగగన్ 

ప్రాసలు కల్పసాగ కళ పాశము మాదిరి యూగ సాగగన్ 

మోసము లేని మోత కళ మోక్షము జూపెడి యవ్వనమ్ముయున్ 

ఆశల కొగిలే కరిగి యచ్చట ముచ్చట తీర్చ గల్గగన్ 


*తే... రాగ యనురాగ కళలన్ని రాటు తేలి

సరిగమల సుధ సహకార సమయమందు

సమరమే సంగమమై కళ సాక్షి యగుటె

నవ్య జీవితమునకు యే నాంది పలుకె

.......


చం.సరిగమలౌనుదున్నుటకు సాగెడి పంటకు నీరుచేరుటన్ 

పరిపరిగాలిశోక సహపాఠముతో కదలేను హాయిగన్ 

పరువపు లీలహేలగను పాదమునెంచియుయూగ సంగతిన్

చిరునగవేమనోమయముచిత్తముచేర్చ శుభంబు చేర్చగన్ 


*తే ...పూల పాన్పుల పైజంట పూర్తి కసియె

ఇచ్చి పుచ్చుకొనుట ముద్దు యీప్సితమగు

పంచు కొనె పరువపు లీల పలుకు హేళ

చిన్మయానంద శృంగార చిరుత పులియె

.......,

ఉ.పూర్తిగ పూలపాన్పు వశ పుణ్యపు జంటల ముద్దు ముచ్చటల్ 

స్ఫూర్తిగ యిచ్చిపుచ్చుకొను సూత్రపు సోకులు యీ ప్సితమ్ముగున్ 

కార్తిక వైభవమ్ముగను కామపు హేళ యు చిద్విలాసమున్ 

ఆర్తిగ పొందు సౌఖ్యమగు హాయిని గోల్పెడి యాటకౌగిలిన్

సం.. సా.. సం కవిత్వం 


తే

తే. గీ.మానవత్వపు సేద్యము మనసు నందు

మంచితనము గా మమతలై మనుగడకు లె

గుండె తడి ఆరకయె సాగు గుళ్ళ యగుటె

మనిషి తనముగా మహిమయై మంకు పట్టు

........


ఉ.మానవ సేధ్యమున్ మనసు మంచిని బట్టియు మార్గమేయగున్ 

మానము పంచబుద్ధిగను మాధురి పొందుట మంకుపట్టుగన్ 

మౌనము సాగుగుండెతడి మౌఖ్యమనంద శుభమ్ము కూడికన్ 

ధ్యానము సాగుగుళ్ళుయగు దాపరికమ్మగు వత్తిడేయగున్


*తే ..మనిషి కి మధుమాసముననే మధుర ఫలము

తాపము కు వసంతము గాను తల్ల డిల్లి

ప్రకృతి ఫలరాజ మగుటయే పండ్ల నందు

మామిడిది రాజస మధురం మనసు పంచు

...

మ. మధుమాసమ్మున మానసం యురకగా మాధుర్య మొoదేం దుకున్ 

విధితాపమ్మగు తల్లడిల్లిశుభమున్ విందార పండ్లు సొంతమున్ 

పదునైనా మది రాజసమ్ము సుఖమున్ ప్రాబల్య సంతోషమున్ 

నిధి కామమ్ముయు నిత్యసౌఖ్యమగుటన్ నిర్మల్ సు శోభల్ గతీ


తే ...సిగ్గుశరము లేనిది ప్రేమ సేతువగుటె

ఇష్టమైన కష్టముగాను యింతి తోను

కధలు కావులే జీవితం కాల మాయ

ఎంత తిన్నాతరగనిదే ఏలు ప్రేమ

........


ఉ.సిగ్గు శరమ్ము లేనిదగు ప్రేమల సేతువు కాపురమ్ముణన్ 

సిగ్గుతొ యిష్టకష్టములు యిన్తికి తప్పని దైన సౌఖ్యమున్ 

భగ్గుణ జీవితమ్ కదిలె బాధ్యత బంధము కాల మాయగన్ 

నెగ్గుకు వచ్చుప్రేమకళ నేతిగ గారెయు యిష్టమేయగున్


సం.. సా.. సం 


ఉ.నీ సహచర్యసంగీతకళ చిత్తతరఁoగము తట్టిలేపగన్ 

నా సహవాససందడితొ నన్నుగ నుంచక సంతసమ్ముగన్ 

నా సహ వాక్కుసర్వమను నమ్మక కోరిక తీర్చగల్గగన్ 

నా సహనమ్ము ప్రేమకళ నానుడి నిత్యము వైభవమ్ముగన్(1)


చం వన తరు వల్లికామదియు వాలుగ జూప గ నేస్తమాయనే 

ఘన దరి జేరి వాక్కులగు ఘాటుగ జిహ్వము జూప మాయగన్ 

స్థనభరితమ్ము యాయుధము సంధిగ కూడికకోరి చేరియున్ 

క్షణసుఖమైన యుద్ధమగుక్షామము తీర్చియుశాంతి మోక్షమున్   (2)


చం.కుసుమము లొల్లి వాసనను కూడియు శైలగ కన్యకామణిన్ 

పసయను వాడి నాడిగను పాఠ్య ఘనస్తనమేను వేణికన్ 

రసికత జూప సంగమము రాశిగయెక్కి సుఖమ్ము వేదికన్ 

పసగతి పొంద పాడియగు పాలనమేయగుతీరు యేలికన్ (3)



Friday, 27 December 2024

 

నేటి చందస్సు పాఠము 


నిత్యము నీదయ నిర్మలమేయని సుధామనసవ్వ కలగానే 

 సత్యము తెల్పెద సాక్షిగ నీవు సమరమ్ము గనౌను కలగానే 

ముత్యపు మెర్పుగ నుండగ ముఖ్యము సమమ్మును చెంద కలగానే 

 పత్యము చేసియు సంతస సాదు పలుకౌను సుఖమ్ము కలగానే 


లక్షణభూషిత తుండయి భావ లయ లక్షణహేల కలగానే 

కక్షన భిక్షను పెట్టుత కర్కశము గాను శుభమ్ము కలగానే 

రక్షణ కల్గెను మాకును రంజక భావమ్మగు జీవ కలగానే 

శిక్ష నొసంగుట వాడెడిక్షేమ చెరితమ్ము విధమ్ము కలగానే


కాలము నీదయ కావ్యము నీది కళ లౌను జయమ్ము కలగానే 

జ్వాలలు కమ్మిన జాతర నీది జతగాను సుఖమ్ము కలగానే 

 మూలము నుండియు ధర్మము ముఖ్యము లయమ్మ భయమ్ము కలగానే 

 పాలన నీదియు పాలన నీది య యెతృప్తి సమమ్ము కలగానే 


 నవరాగము. భ భ భ భ  జ జ స గ

******


అద్దపు చూపుల ఆశలు దేనికీ 

 వద్దని మాటలు వాదన దేనికీ

 సర్దుకు పోదము సప్పుడు చేయకే

 

దుఃఖపు దారిన దూరుట దేనికీ 

 దక్కిన దానిని దాల్చక దేనికీ

తక్కువ యెక్కువ తప్పులు చేయకే 


 నిప్పుల మాటున నీరుగ దేనికీ 

 తప్పులు చేయుట దాహత దేనికీ

 నొప్పులు  నున్నను నోములు దీనికే 


 వాడిన వాటికి వాంఛలు దేనికీ 

 వీడిన చోటున వేషము దేనికీ

కూడిన కష్టము కూడిక దేనికే 


 పంతపు చూపుల పాఠము దేనికీ 

 శాంతము ఓపిక శాపము దేనికీ

 పొంతన చూపక పాఠము దేనికే 


 మౌనపు మార్గము మర్చుట దేనికీ

మానము మీరుత మార్గము దేనికీ

 జ్ఞానము నీదయ గర్జన చేయకే

UII UII UII UIU

**** 

నేటి హృదయ రాగము 


వీణపై నవరాగాలు పలికించనా 

మేనుపై సుమరాగాలు కురిపించినా 


నీటితో భవరోగాలు తొలిగించినా 

త్రాటిపై సుమయోగాలు జరిపించినా 


ఓ చెలీ ఓ హో చెలీ 


గాలితో హృదయాంతాలు తెరిపించినా 

జాలితో చిరుహాసాలు కలిపించినా 


వీధిలో నను తోయకే గెలిపించవా 

బాధలో నను ముంచకే మురిపించావా 


ఓ రాజ ఓహో రాజ


ఎదలోయలో కొలువైతివే మరిచేదెలా 

కథరోచ్చులో తెలుగైతివే కలిచేదెలా 


వదిలేయకే  కోమలీనువే సుఖ మివ్వలా 

పదిలమ్ముగా జాగృతీ విధి నవ్వలా 


ఓ చెలీ ఓ హో చెలీ 


సంధ్యలో శశిబింబమై పిలిచానుగా 

విద్యతో వినసొంపుగా పలికానుగా 


మాసమే మన కోసమై అరుదెంచెనే 

మౌనమే యిక యెoదుకే దరి నుంటినే 


ఓ రాజ ఓహో రాజ


చేరగా అనుమానమా కరుణించవా 

నెరుగా కను సైగలే గమనించవా 


తోటలో వన రాణివై అలరించవా 

 మాటతో మన హృద్యమై పలికించవా 


ఓ చెలీ ఓ హో చెలీ 


బంధమే నిలిచేనుగా యికనమ్మవే  

చిందులే యిక యేలనే యిక మానవే 

 

కడదాక తోడుగ నీడగా నడిపించవా  

పడి లేచి వీడకే దగ్గరే మురిపించినా


ఓ చెలీ ఓ హో చెలీ 

ఓ చెలీ ఓ హో చెలీ 

ఓ రాజ ఓహో రాజ

ఓ రాజ ఓహో రాజ


మల్లాప్రగడ రామకృష్ణ


నా బాల్యము.. సీస పద్య మాలిక 


పూరిల్లుమాదియు పుల్లలు రాలుచూ 

పుడమిన బురదగా పురుడు పోయ 

బుడతగా యాటలు బుద్దిగా మట్టితో 

బంధమనేదియు పాఠమవగ 

లోకము నెటుజూడ శోకమే కన్పించు 

భిన్నప్రజలమధ్య భీతి గున్న 

అమ్మనెపుడు నేను ఆశ్చర్య పరిచె ద 

అమ్మ మాటలకునే నాడు చుండ 

నాన్న మటుకు చూపు నమ్మబలుకులౌను 

పరుగుదీసెద బండి పాట బట్టి 

గాలిపఠములనే గలగల యగరేసె 

గోళి లాటలు జూడ గొప్ప గుండె 

చెడుగుడు నాయాట చిరునవ్వు తెప్పించ

అష్టచెమ్మగనులే ఆట యాడ 

చదువుయన్న కినుకు చెప్పక తిరిగాను 

హృదయాల సందడే హాయి గొలిప 


తే. గీ. మరల రాదు బాల్యము చెప్ప మార్గ మిదియు 

ఎంత చెప్పిన తక్కువే యెంచ లేను 

బాల్య సంబరాలు గనుమా భావ మిదియు 

అట్టి రోజులు గనలేను ఆశ మదిలొ 


మల్లాప్రగడ రామకృష్ణ

-****-

నేటి ఛందస్సు పాఠము దేవరా 


కాలమ్ము నీదేను కావ్యమ్ము మనసులో 

లీలౌను నీదారి దేవరా 

మూలమ్ము నీవేను ముఖ్యమ్ము వయసులో 

నేలౌక్యమే పూజ దేవరా 


 దేవాది దేవు డవైనావు యుగములో 

సేవించ వచ్చాను దేవరా  

సేవే నిజమ్మగు ని భక్తి వయసులో 

ప్రావీణ్య ముంచాను దేవరా 


నిత్యమ్ము నీమనసైనాను వయసులో

సత్యమ్ము చెప్పేది దేవరా 

పత్యమ్ము నీకొరకేనేను  వయసులో 

పత్యమ్ము లేకున్న దేవరా 


వ్యాసుండు వ్రాసెను గ్రంధాలు వయసులో  

దోసమ్ము లేకుండ  దేవరా     

భాసిళ్లు భారతి వేదమ్ము వయసులో   

వ్రాసేను నిత్యమ్ము దేవరా 


హంగుళ్లు చూపెను సంతోష వయసులో 

రంగుళ్ల భావమ్ము దేవరా 

భంగమ్ము సేయక భాగ్యమ్ము వయసులో

చెంగావి లక్ష్యము దేవరా  


దేవరా :: త .. భా త న మ య జ గు

*-----**

నేటి ఛందస్సు పాఠము..3


ప్రేమమ్మగునా నిష్పేయముగా 

ప్రేమమ్మగునా కాసారముగా 

ప్రేమమ్మగునా సందేహముగా 

ప్రేమమ్మగునా సమ్మోహముగా 


దాహమ్మగునా దాంపత్యముగా 

మొహమ్మగునా మోక్షత్వముగా 

దేహమ్మగునా ధాత్రుత్వముగా 

స్నేహమ్మగునా నేత్రుత్వముగా 


రాగమ్ములతో యోగమ్మగునా 

భోగమ్ములలో భోజ్యమ్మగునా 

రోగమ్ములలో భాగమ్మగునా 

యోగమ్ములలో యోగ్యమ్నగునా 


నామానసమే గాజేయగునో 

యే ముక్కలుగా నే రోజగునో 

నామార్గమునే కష్టమ్మగునో 

నా దేహముగా నష్టమ్మగునో 


సాగంగ సదా సమ్మోహనమా 

వేగంగ మదీ వైనమ్మమమా 

పోగాలములో మృన్వా హనమా 

భాగమ్ములలో విందారెదమా 


జ్ఞానా మదీయమ్మున్ కళలే 

నానా ప్రతాపమ్ముల్ కళలే 

ధ్యానా మనస్సమ్ముల్ కళలే 

ప్రాణాలు కర్మమ్ముల్ కళలే 


సుషమా.. త.. య.. భ. గ..


నేటి చెందస్సు పాఠము 1/1/2025 


కాలమ్ముయు నీదేయన కావ్యమ్మును నీవ్రాసే 

మూలమ్ముయు నీవేయగు ముఖ్యమ్ముగ నావ్రాతే 


తెల్లానివి నీవెల్గులు తెల్పాలని నేనుండే 

నల్లానివి నీచెడ్డవి నమ్మాలని నేనుండే 


యోగమ్ముయు నీవల్లన యోన్నత్యము నీమేలే 

రాగమ్ముయు నీదారియు రమ్యత్వము నీచూపే 


భోగమ్ముయు నీశాంతియు భోజ్యమ్ముయు యిష్టమ్మున్ 

రోగమ్ముయు  నీమార్గము కోపమ్ముయు నీమూలమ్


నానత్వము పోయేకథ యే కత్వము చేకూర్చే 

ఏకత్వమ్ము పోయేకథ ఆనేకము చుట్టూనే 


నేనిక్కడ నేకాకిని  నీవెక్కడ నున్నావో 

నానేస్తము నీవైతివి నీమాయలు యెన్నెన్నో 


యీనాడిక నీవేగతి యీ వేళయు సొంతమ్మో 

యేనాటికి కష్టమ్ములు యీజీవిత మంతమ్మో 



పూరేకు .... త  య  స  భ   మ.. UUI   IUUI ... IUUI IUUU

***

నేటి ఛందస్సు పాఠము.. గీత గాత్రం  2.1.


మేళయ్యె కాల మేదియో మేదారి స్వామీ 

జ్వాలల్లె కాపురమ్మూయో జాడ్యమ్ము స్వామీ 


కాపాడుమయ్యా మమ్ము దుష్కార్యమ్ము లెన్నో 

మాపాడు బుద్దే మమ్ము దున్మార్గమ్ము స్వామీ 


నీచేయుకర్మేలే విదీ కామ్యమ్ము గానే 

దోచేటి కాలమ్మే మదీ దొబ్బుచ్చు స్వామీ 


నీస్వేచ్చ ధర్మమ్మే స్థితీ నేమమ్ము లెన్నో 

నీసేవయేనాదీ నిధీ నేస్తమ్ము స్వామీ 


నీ మాయ చూపేలే గతీ నీమిధ్య లెన్నో 

నీ మార్గమే మాకూ గతీ నీతృప్తి స్వామీ 


దీపమ్ము వెల్గు జేయుమా దిక్సూచి నీవే 

పాపాలు మావి మార్చు మా పాఠ్యమ్ము స్వామీ 


నీ విద్యయే శంఖమ్ముగా నీమార్గ మేదో 

నీవిశ్వమే ధైర్యమ్ముగా నీ శక్తి స్వామీ 


లేదయ్యె  శాంతి ఎందుకో లేశమ్ము స్వామీ 

రాదయ్యె హాయి జీవమే వ్యర్థమ్ము స్వామీ 



దిక్సూచి.. త మ య ర  గ ( UUIU UUIU.. UUIUU





Tuesday, 27 August 2024

తెలుగమ్మాయి తెలుగమ్మాయి...కళ్లలో వెన్నెలే వెలుగమ్మాయి...

చిత్రం : మర్యాద రామన్న
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
రచన: అనంత శ్రీరామ్
గానం : ఎం.ఎం.కీరవాణి,గీతామాధురి

రాయలసీమ మురిసిపడేలా
రాగలవాడి జన్మ తరించేలా
ముత్యమంటి సొగసే మూటగట్టుకుంది
మూడు ముళ్ళు వేయమంది
తెలుగమ్మాయి తెలుగమ్మాయి
కళ్లలో వెన్నెలే వెలుగమ్మాయి
తెలుగమ్మాయి తెలుగమ్మాయి
అందుకోమన్నది నిన్ను తన చేయి

పలికే పలుకుల్ల్లో ఒలికే తొలకరి
ఇంట్లో కురిసిందో సిరులే మరి
నవ్వే నవ్వుల్లో తుళ్ళే లాహిరి
జంటై కలిసిందో కలతే హరి
హంసల నడకల వయారి అయినా
ఏడడుగులు నీ వెనకే
ఆశల వధువుగ ఇలాగ ఇలపై జారిన
జాబిలి తునకే

తెలుగమ్మాయి తెలుగమ్మాయి
కళ్లలో వెన్నెలే వెలుగమ్మాయి
తెలుగమ్మాయి తెలుగమ్మాయి
అందుకోమన్నది నిన్ను తన చేయి

గీతలే అని చిన్న చూపెందుకు
వాటి లోతులు చూడలేరెందుకు
నదిలో పడవలా వానలో గొడుగులా
గువ్వపై గూడులా కంటిపై రెప్పలా
జతపడే జన్మకి తోడు ఉంటానని
మనసులో మాటనే మనకు
చెప్పకనే చెబుతుంది
తెలుగమ్మాయి తెలుగమ్మాయి
గుండెనే కుంచెగా మలచిందోయి
తెలుగమ్మాయి తెలుగమ్మాయి
అందుకోమన్నది నిన్ను తన చేయి 
https://www.youtube.com/watch?v=ff2Q4O61Q2E
Maryada Ramanna Songs | Telugammayi Video Song | Sunil, Saloni | Sri Balaji Video
Watch & Enjoy Maryada Ramanna Movie Video Songs (1080p) Starring Sunil, Saloni, Screenplay - Directi...

Friday, 24 May 2024

 


మల్లాప్రగడ రామకృష్ణ

నేటి.. జానపద గీతం 

అలా అలా పోదామా చక్కిలి గింతా 

 చాటునాటు సరసమే వద్దురా బొంతా

 అలా అలా అనకేలా చక్కని వింతా 

 చోటిస్తే చూపులతో కుమ్మేస్తా వంతా

పుష్కగంధ పరిమళాలు ఆస్వాధించు

 రుగ్మతులు ఏల అలా అలా పరిభ్రమించు

 వసంత కోకిల స్వరాలను ఆలపించు 

 సెలయేరుల శబ్దాలతో పులకించు.. అలా...

తరతరాల సాక్ష్యము స్త్రీ సుఖమే శాంతా

సుందర సుమధర  రూపవి కాంతా 

ఆనంద డోలి కల్లో తేలి పోదాము వసంతా 

హృదయానంద భరతమే సుమంతా..అలా.. అలా

కసిరి కసిరి కౌగిలింతకే ఆరాటమా

కొసరి కొసరి తినిపోవాలని తాపమా

అందానికి బానిసవ్వాలని ఉబలాట మా

 జీవిత నీదైతే ఎందుకు పోరాటమా అలా.. అలా..

తుమ్మెద దండు జూసి చింత వలదు నీవు 

తీరుతెన్నులన్ని తెలుసుకొనగలవు నీవు 

 శివుని చూపెమనకు శ్రీరామ రక్షగా సబవు 

సిరులు పొందు దారి చెలిమితోడ

సబవు 

అలా అలా పోదామా చక్కిలి గింతా 

 చాటునాటు సరసమే వద్దురా బొంతా 

 అలా అలా అనకేలా చక్కని వింతా 

 చోటిస్తే చూపులతో కుమ్మేస్తా వంతా

 .....

సొంత రచన యిది 

గానం చేసేవారుంటే చేయగలరు, ఇక్కడ పోస్టు చేయగలరు

పాటసందర్భం:- బలీయమైన ఇష్టం బలమైన కష్టాన్ని ఎదుర్కొన్న ఇతి వృత్తంతో సాగిన పాట

 బలవంతపు రాజ్యంలో బలహీనం ఎదుర్కొన్న రక్తసంబంద బందీ  ఎదుర్కోలేక ఎదురు తిరగలేక  ప్రేమకు వశమై   చట్రబంధాలను వీడి ప్రేమకై ఎగిరిన పావురం  చేఋ సందర్భంలో ని పాట....

***

పల్లవి:-

****

వేకువ చూడకముందే, వెన్నెల  వెళ్లకముందే, వేదనతీరక ముందే, వేర్పాటు కాకముందే, ఊరు మేలు కోకముందే, ఊపిరే ఎదకక ముందే, ఊతంగా ఉండేవారు లేందే, ఎందాక పయనం, గాలిగోపురము వదలి, వదలి వదలి   చిలకా చిలకా --- చిలకా  ఓ నా  దేవతా చిలకా ...

ఊతంగా ఉండేవారు లేందే, ఎందాక పయనం, గాలిగోపురము వదలి, వదలి వదలి   

నేనా ఆ నువ్వే 

 ఉరుకుల పరుగు లెందుకు, ఉన్న చోట తృప్తి చెందక, ఉన్న హద్దులన్ని చెరిపేసి, పరుగు పరుగున ఎందాక పోగలవు ఓ చిలకా, ఓ చిలకా, ఓ చిలకా,

పంజరానికి చిక్కక తప్పదు ఓ చిలకా, యవ్వనప్రాయంలో ఉన్నావు చిలకా, మంచి చేదు గమనించ లేవు చిలకా,  నామాట వినుమా చిలకా, నా ముద్దుల దేవతా చిలకా, నా ప్రియమైన చిలకా  ..

గాలి గోపురం దీవెనెలివ్వగా, స్నేహభందముగా తోడు ఉండగా, జాలి గుండె అండగా వుండగా, అనురాగం, ఆత్మీయత మనసే నిండగా,  హృదయంలో నే నున్నా నన్ను మరచి వెళుతున్నావా చిలకా, నిన్ను మరువలేను వేచి ఉన్నాను చిలకా, నామాట వినుమా చిలకా,  నామాట వినుమా చిలకా,   నా ముద్దుల దేవతా చిలకా, నా ప్రియమైన చిలకా  ..

వేకువ చూడకముందే, వెన్నెల  వెళ్లకముందే, వేదనతీరక ముందే, వేర్పాటు కాకముందే, ఊరు మేలు కోకముందే, ఊపిరే ఎదకక ముందే, ఊతంగా ఉండేవారు లేందే, ఎందాక పయనం, గాలిగోపురము వదలి, వదలి వదలి   చిలకా చిలకా --- చిలకా  ఓ నా  దేవతా చిలకా ...

****


Tuesday, 26 March 2024


*దివ్యత్వం*

ఎటువంటి మనిషైనా ఈ భూమ్మీదకు వచ్చి ఉత్తి చేతులతో తిరిగి వెళ్ళకూడదు.  కొద్దో గొప్పో దివ్య శక్తి సంపన్నుడు కావాలి.

ఆ శక్తిని ఆత్మలో నిక్షిప్తం చేసి తిరుగు పయనం కావాలి. అదే అతడి శాశ్వత సంపద. వేదాలు పదేపదే చెప్పే విషయం.

దేవుడు, మనిషిని పూర్తిగా తన పనిలో ఉంచుకోవాలని నిత్యం అనుకుంటాడు. మనిషి తాను శరీరం తప్ప మరేమీ కాదన్న భ్రమలో ఉంటూ దేవుడికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు.

శరీరం ఒక ఊబి అంటాడు అరవిందుడు. అందులో కూరుకుపోతే బయటకు రావడం చాలా కష్టం. ఎన్నో జన్మలు అందులోనే ఉన్నాం. ఇప్పుడైనా శరీరాన్ని(శరీర భావాన్ని) వదిలి ఆత్మ వైపు తిరగడం అత్యవసరమని మనిషి గ్రహించిన రోజునే అతడు దివ్యశక్తి సంపన్నుడవుతాడు.

ఏ అవకరం లేని, ఆరోగ్యవంతమైన శరీరాన్ని తల్లిదండ్రులు ఇచ్చారు. ఈ శరీరం నాదని సంతోషంగా చెప్పుకొంటున్నాం.

ఈ శరీరాన్ని మనకు ఇచ్చినందుకు ప్రతిఫలంగా వారికి మనం ఏం ఇవ్వాలి? మా పని మేం చేశాం, నీ ధర్మం నువ్వు నెరవేర్చు- అన్నట్లుగా ఉంటుంది ఈ భూమ్మీద మనిషి జన్మ రహస్యం.

శరీరాన్ని చూసి ఆనందపడవచ్చు. అందంగా ఉన్నదైతే మురిసిపోవచ్చు. శరీరాన్ని పోషించి సుఖపెట్టవచ్చు. కాని, ఈ శరీరం దేనికి అని ఎప్పుడైనా నిజాయతీగా ప్రశ్నించుకోవాల్సిందే.

మానవ శరీరం రావడం అదృష్టం. శరీరం గురించి తెలుసుకుంటూ దాని పరిమిత భావాన్ని పోగొట్టుకోవాలి. శరీరం నేను కాదని తెలుసుకోవాలి. శరీర ప్రయోజనం తెలుసుకోవాలి. శరీర బంధం తాత్కాలికమని గ్రహించాలి.

ఈ శరీరం ఉపయోగించి ఇతరులకు సాయపడటం, లోకం కోసం మంచి పనులు చెయ్యడం మంచిదే. సందేహం లేదు. ఇలాంటి వారికి శరీరం ఎక్కువ కాలం ఉండాలి. వాళ్లు దీర్ఘాయు ష్మంతులుగా ఉండాలి.

పుట్టుక కోసం, మరణం కోసం ఈ శరీరం వచ్చినట్లు కనపడుతుంది అందరికీ. శరీరం తప్ప ఇంకేం లేదన్నట్లు బతుకుతారు కొందరు.

శరీరాన్ని ఈడుస్తూ బతుకుతారు మరికొందరు. శరీరం జడం. అది శవం లాంటిది. నీ శవాన్ని నువ్వు మోస్తూ తిరుగుతున్నావు అంటారు రమణ మహర్షి.

నీకిచ్చిన శరీరంతోనే ముక్తిని సాధించి, జీవన పరమార్థం నెరవేర్చుకోవాలి అంటున్నాయి ఉప నిషత్తులు. అందరూ ముక్తిని సాధించలేరు. ఎంతో కొంత ప్రయత్నం చేసి దివ్యశక్తి సంపన్నులయ్యే అవ కాశం ఉంది అందరికీ.

జీవితాంతం ఈ శరీరంతో తిరుగుతూ ఉంటాం. దారి మార్చి, ఈ శరీరంతోనే మన అంతరంగ ప్రయాణం మొదలు పెట్టవచ్చు. అప్పుడు దివ్యశక్తి తొలకరి మొదలవుతుంది.

మనసు సారవంతమవుతుంది. కొంతకాలం తరవాత పచ్చటి ఆత్మ పంట పండుతుంది.

దయతో, ప్రేమతో మన అంతరంగ ప్రయాణానికి వాహనంగా ఇచ్చి, ఆత్మను శక్తిసంపన్నం చేసుకోవడానికి ఈశ్వరుడు ప్రసాదించిన అవకాశమే ఈ మానవ శరీరం అని బోధపడుతుంది.

దివ్యత్వం వైపు మనం వేసే ప్రతి అడుగు భగవంతుడికి ఆనందాన్ని ఇస్తూనే ఉంటుంది. మన నేత్రాలు ధ్యానం కోసం మూసినప్పుడు అంతర్నేత్రం తెరుచుకోవడం, హృదయంలో జ్ఞానకమలం వికసించడం ఆయనకు పరమానందం కలిగించే అంశాలు.

ఇలాంటి దివ్యానుభవాల ఇంద్రధనుస్సు చిదాకాశంలో వెళ్ళివిరియాలని ఆయన అభిలాష.

***

*ఆత్మ*

1) విడిచిపెట్టటానికీ వీలులేనిది..పట్టుకొనటానికీ వీలులేనిది.

మనకన్న వేరుగా నున్న వస్తువుని మనం పట్టుకుంటాం.. అవసరం లేదనుకుంటే విడిచిపెడతాం. ఆత్మ మనకన్న వేరైన వస్తువు కాదు. వేరైన భావమూ కాదు. అది నేనే అయినప్పుడు ఎలా విడిచిపెట్టటం... ఆత్మనైన నేను నా శరీరాన్ని విడిచిపెడతాను.. ఆలోచనలను విడిచిపెడతాను, మంచిభావాలను.. చెడ్డభావాలను విడిచిపెడతాను - చుట్టూ ఉన్న వస్తువులను, వ్యక్తులను, వారి తోటి గల బాంధవ్యాన్నీ విడిచిపెడతాను. నాలో ఉన్న వాసనలు, కర్మఫలాలను కూడా విడిచిపెడతాను జ్ఞానం పొంది; కాని నన్ను నేను ఎలా విడిచిపెట్టగలను. కనుక ఆత్మ విడిచిపెట్ట వీలులేనిది, 'అహేయం'.

అలాగే నాకన్న వేరుగా నున్న వస్తువులను పుస్తకాన్ని, పెన్నుని, కుర్చీని, బల్లని, మనిషిని, దొంగను - దేన్నైనా పట్టుకోవచ్చు. అలాగే ఆత్మనైన నేను ఈ దేహాన్ని పట్టుకున్నాను. ఈ మనోబుద్ధులను పట్టుకున్నాను. వాసనలను పట్టుకున్నాను. కాని ఆత్మను (నన్ను) పట్టుకోవటం ఎలా.. నన్ను నేనే పట్టుకోవటం ఎలా.. నా దగ్గర లేని దాన్ని నేను పట్టుకోవచ్చు. నాకు దూరంగా నాకన్న వేరుగా నున్నదాన్నీ పట్టుకోవచ్చు. అసలు నేనే అయినదాన్ని ఎలా పట్టుకోవటం.. కనుక ఆత్మను విడిచిపెట్టే వీలులేదు. పట్టుకొనే వీలులేదు. నేను శరీరాన్ని అనుకుంటే ఆత్మ నాకన్న వేరుగా ఉన్నట్లే గనుక పట్టుకోనూవచ్చు.. విడిచిపెట్టనూ వచ్చు. నేను శరీరాన్ని కాదే. అలా అనుకోవటం అజ్ఞానమే. కనుక 'అనుపాదేయం' పట్టుకొనే వీలులేనిది.

2) మనోవాచాం అగోచరం:-

మనస్సుకు వాక్కుకు అందనిది. ఆలోచనల ద్వారా అందుకోలేనిది. ఏదైనా ఒక వస్తువో ఒక వ్యక్తియో ఒక విషయమో ఒక భావమో ఉంటే దానిని గురించి మనస్సు ఆలోచనలు చేస్తుంది. మరి ఆత్మ వస్తువూ కాదు వ్యక్తీ కాదు విషయమూ కాదు భావనా కాదు. పైగా ఒక తెలిసిన విషయాన్ని గురించి మనస్సు ఆలోచించ గలుగుతుంది. మరి ఆత్మ తెలిసిన విషయం కాదే అసలు విషయమే కాదు గదా. అలాగే తెలియని విషయాన్ని గురించైనా ఆలోచించి తెలియ లేదు అనైనా అనుకుంటాం. మరి ఆత్మ తెలియని విషయమా.. కాదే. అది తెలిసిన దానికి తెలియని దానికి వేరైనది గదా కనుకనే మనస్సుకు అందదు. అగోచరం. మనస్సుకు అందిన వాటినే మాటల్లో చెబుతాం. భాష నుపయోగించి శబ్ద శక్తితో చెబుతాం. మనస్సుకు అందని దానిని వాక్కుతో ఎలా చెప్పటం.. కనుక వాక్కుకు అగోచరం. అసలు ఇంద్రియాలు అన్నింటికి అగోచరమే.

ఇదే విషయాన్ని కేనోపనిషత్తులో చెప్పటం జరిగింది. "నతత్ర చక్షుర్ గచ్ఛతి, నావాగ్గచ్ఛతి, నమనః..." అని. కళ్ళు, వాక్కు, మనస్సు అక్కడకు పోలేవు అని. ఆత్మయే అన్ని ఇంద్రియాలకు ఆధారంగా ఉండి ఆ ఇంద్రియాలు పనిచేయటానికి శక్తి నిస్తున్నది. అట్టి ఆధారమైన ఆత్మను ఇంద్రియాలు ఎలా తెలుసుకుంటాయి.. మనం మంచె మీద కూర్చొని పొలాన్ని కాపలా కాస్తుంటాం. పొలం అంతా మనకు కనిపిస్తుంది. అయితే మనం కూర్చున్న మంచెకు ఆధారంగా ఉన్న కొయ్యబాదుల్ని చూడగలమా.. చూడలేం. కనుకనే 'మనోవాచాం అగోచరం' అనటం.

3) అప్రమేయం:-

సాటిలేనిది. మరొక దానితో పోల్చటానికి కొలవటానికి అసలు రెండవ వస్తువు లేదు. సత్యవస్తువు ఆత్మ ఒక్కటే. సత్య వస్తువును అసత్య వస్తువుతో కొలవలేము.

ఇక్కడ ఒక బస్తా బియ్యం కుమ్మరించి మిమ్మల్ని కొలవమన్నాను. దేనితో? మానికలతో. అలా కొలిచి ఎన్ని మానికలో చెప్పాలి. ఓ.. ఇంతేగదా.. అని అందరూ పైట బిగించారు. అయితే ఒక షరతు చెప్పాను. మీరు కొలవవలసింది రాత్రి కలలో కనిపించిన మానికలతోనని అంతే ఆగిపోయారు. మీరేమైనా తెలివి తక్కువ వారా.. రాత్రి నాకు మానిక కలలోకి రాలేదండి. ఇప్పటివరకూ ఎప్పుడూ రాలేదు అన్నారు. సరే. అయితే ఇదిగో ఈ మానికతో కొలవండి అని ఒక పేపరు మీద మానిక బొమ్మను గీచి చూపించాను.  మరి కొలవగలరా. సత్యవస్తువును అసత్య వస్తువుతో కొలవలేం. కనుక ఆత్మను దేనితోనూ కొలవలేం. అన్నీ అసత్యవస్తువులే గనుక.

4) ఆద్యంత రహితం:-

పుట్టుక చావులు లేని నిత్యసత్యం ఆత్మ, అనంతం. దానికి ఆది అంతం అనేవి ఉండవు.

5) మహ:-

తేజో రూపం. రూపం లేదు. తేజస్సే దాని రూపం. అదీ కనిపించని తేజస్సు. ఈ కన్నులు చూచి తట్టుకోలేవు. కనుకనే అది కన్నులకు కనిపించదు. 

6) అహం పూర్ణం బ్రహ్మ:-

అట్టి పరిపూర్ణ బ్రహ్మమును, పరమాత్మను, శుద్ధ చైతన్యాన్ని నేనే, నాలో ఉన్న ఆత్మ అనటం తప్పు. నేనే ఆత్మను. నాలో ఇంకేమీ లేదు. కాకపోతే నేను దీనిలో ఉన్నట్లుగా భావన.. అంతే.

***

Monday, 25 March 2024

సోమవారం పద్యాలు, కథలు

 **+

సూత్రము లెల్లా కథలగు 

పాత్రలు బ్రతుకుకు సుఖమ్ము పాఠము గానున్ 

యాత్రలు పద్యాల మయము 

మాత్రలుగా కందమునకు మాత్రలు వెలసెన్


మాత పలుకులగు విద్యలు 

చేతన వల్ల కదలికలు చింతల్ మాపున్ 

యాతన లెన్ని యన మనసు 

ద్యూతమునన్ దొలగిపోవు దుఃఖము లెల్లన్


కొసరుచు నిన్ను నేము గొలిచెద లెళ్లాను

పసితన బుద్ధి మాది తలపులు యెళ్లాను 

రసమయ శక్తి యేది మలుపులు యెళ్లాను

రుసరుస లేని భక్తి పిలుపులు చెల్లేను


దారము పట్టుపుర్గును యధార్ధము దైవము తెల్పు సంఘటన్ 

నేరము తేనెటీ గవిధి నిత్యము పంచును తీపి పాకమున్ 

ధీరత మత్యమున్ బ్రతుకు దీక్షల మృత్యువు ప్రాణరక్షకన్ 

భారమునెంచమానవులు బంధము బాధ్యతయేల యీశ్వరా


శివమయమౌనుయెల్లరును శీఘ్ర తపమ్ము జయమ్ము ధైర్యమున్ 

శివశివ పల్క వారును వశీకర భక్త ప్రభావ మేయగన్ 

ర వ సము నామమేమదిణ రమ్యతచెంద శివాయనాగతిన్

నవ హరుడైనమార్గముయు నమ్మకమేను యుషస్సు యేసుధీ


ప్రగతి ప్రభావమౌనువిధి రాశికి యెక్కి యశో తపస్సుగన్ 

తగువిధమౌనుబంధముయు దారి గనంగ విధీభవమ్ముగన్ 

తగరపుకాంతిజీవితము తన్మయమౌను శుభమ్ము ముక్తిగన్ 

నగణిత దుఃఖజాలముల నంత మొనర్చెడి దొక్క ద్యూతమే!


నది పరుగుళ్ల ఘోషలకు నాట్యము వొడ్డున వృక్షముల్ 

చదువులపత్నిసాగుటయు సాధ్యపుబుద్ధియు బ్రష్టుబట్టుటన్ 

పదవుల మంత్రి మాటలను పట్టని రాజుయు పాఠమవ్వుటన్ 

పెదవుల యాస యున్న మది వేగము దప్పదు నిత్య సత్యమున్


పైబడు కాలనిర్ణయము భంజన యోగ్యత బట్టి గల్గగన్ 

యీ బడు బాపనుండుసమ యి చ్ఛయు కామ్యము కావ్యమే యగున్ 

బాప ప్రభంజనమ్మగుట భాగ్యపు కల్పన లౌను నిత్యమున్ 

చూపుల రాజనీతగుట సూత్ర ప్రభావము యేమి యీశ్వరా


ప్రాంజలి ప్రభ సరస లలిత శృంగార పద్య కుసుమాలు ..!!

మల్లాప్రగడ రామకృష్ణ


1)

శా సుళ్ళేలెక్క పసౌను గుర్రముల కున్ వ్యూహమ్ము వేగమ్ముగన్ 

పెళ్ళేలెక్క పసౌను యౌవ్వనము నన్ , పిర్దుల్  ను తాకేవిధిన్ 

జళ్ళేలెక్క పసౌను మోహవసమున్ జాడ్యమ్ము ఆడాళ్ళగన్ 

గుళ్ళేలెక్క పసౌను తిర్విదులుగన్ గుళ్ళల్లొ అంగగముల్ 

2)

మ .తొడపాశమ్ముయు చిన్ననాడు, చదువుల్ తోడ్పాటు విద్యల్లుగన్  జడపాశమ్ముయుయవ్వనమ్మగుటయే జవ్వాని చేతన్. కళల్ 

నడి వయ్యారము ధర్మ పాశమగుటే నాట్యమ్ము జీవమ్ముగన్ 

కడకామం యమపాశమింక కథగనే కర్మౌను దేహమ్ముగన్

3)

చం. విరహపు వేదనమ్ముగను వాక్కుల తాపముగాను దాహమున్ 

పరులకు జెప్పసంగమము పాఠముగాను నెజెప్ప మోహమున్ 

విరులను విప్పుచూకొదమ విద్యల వెల్లువగాను జీవమున్ 

విరతలబోసి కోర్కెలగు విద్య లపించునహోనయమ్ముగనన్ 

 4) 

చం.జడయన మన్మధాకళల జాడుతనమ్మునుజూప బాధ్యతల్ 

 జడబరితమ్ము గాపడినవాడు రసుండగ నౌను లక్ష్యమున్ 

జడమతియైన దారియగుజాడ్య పదమ్ముగనెంచ భవ్యతన్ 

జడలను తాకగా కలుగ జ్ఞానొదయమ్మగుటేను నిత్యమ్మున్ 

5) 

చం.తొడలను కొట్టుచూ కదలతోడునుకోర మనస్సు గాయగున్ 

జడలకు లానుచూకదల జవ్వ సవ్వడిసవాళ్ళు లోనగన్,  

గడగడ లాగుచూ పురుష గమ్యము చేష్టలుగాను పొందుగన్         

గొడవలు వద్దనే నెలగు గోల సుఖమ్ము రుగింతురేగగన్ 

6)

మ. చడిచేయమ్మని భంగిమై సొగసునై జాప్యమ్ము తెల్పెందుకున్

నొడలుప్పొంగగ నొద్దికై నిలబడేరో మాంచ మేనేయగున్ 

దడతోడన్ జడ సంతసమ్మగుటయే దర్యమ్ము జూపవ్వగన్ 

 మడి పడవేత ముగ్గులగుమార్గము గాను పసందు జాణల్ కళల్

+*****

రాముడేరీతి లంకకు రాగలండు 

సంద్రమున దాట గలిగేటి సాదు బుద్ధి

ధైర్య సంపద బలముగా ధరణి నందు 

చెప్ప తరముగా యెవ్వారు చింత మాప


సన్నని ధారగా కదల సానుకులమ్మున విద్యలన్నియున్ 

మన్నిక నెంచతత్త్వమది మానస వీణగ యెల్ల వేళలన్ 

సన్నుత భావమేగతియు సాధ్య మనోమయ తీరుగానటన్ 

కన్నులుమూయకుండ గలగాంచితిమంచి దటంచుమెచ్చితిన్


మైత్రిని చేయుమా మనసు మైకము పోవును ధర్మవాదిగన్ 

సూత్రము లన్నివిద్యగను చూపుల మేలును నెంచ కాలమున్  

శత్రువు నేన ప్రేమగను శాంతిని జూపెడి వాక్కులేయగున్ 

ధాత్రిన సేవభావమగు ధ్యానమనస్సున భాగ్య మందునన్


ఏమది చెప్పనయ్యవిధి యేలవిచిత్రయుపాసనమ్ముగన్ 

కాముని లీలసర్వమున కాన వయస్సగు యెంచలేకయున్

శోముని కాల గమ్యమున శోక మనేగతి మాయగమ్ముటన్ 

రాముని రాజ్యమన్నను యెరావణ చేష్టలు యేలబత్కునన్ 


చేరదు బయ్యమున్ మనసు చింతను జేర్చిన ధైర్య ముండగన్ 

మారదు నిత్యమున్ హితము మాయలు కమ్మిన దేహమాందునన్

తీరదు మంచి బందువులకు తేలిక మాటలు యాట పట్టుటన్ 

కోరదు యెన్ని యున్నను ప్రకోపము లేని సజీవమేయగున్ 


మామిడి వేప పువ్వులను మన్నిక పచ్చడి పుల్ల తీపిగన్ 

మామది కొత్తపుస్తకము మార్గపు పద్దతి కొత్త లెక్కలున్ 

ఏమని జెప్ప మానసము యెల్లలు కొత్తగ వత్స రమ్ముణన్ 

ఆమని మాటలన్నయన ఆశల కాంతుల కొత్త వత్సరమ్


ఆమని శబ్దమేళయన ఆలన పాలన శబ్దవేదిగన్ 

ఆమని నాడిపట్టిబతుకాయన శబ్దము నోరుమూయగన్ 

ఆమని వంట వార్పుకళ ఆటల శబ్దమురోలు రోకలిన్ 

ఆమని మాయమర్మమున ఆనతి కర్మలు జీవ మార్గమున్


వివరణ యన్న సాధనగ విద్యల సాక్షిగ నెంచ బాగుగన్ 

సవరణ లన్ని దైవమగుసంఘము తోడుగనీడ గాయగున్ 

భవితకుమంచిభావమును భాగ్యమునిచ్చుబంధమేయగున్

నవవిధ విద్యలన్నియు ననాదిగ మేధ మనస్సు కాలమున్ 


ఊహల లీల గోపకళ రాసికి యెక్కువగాను  గొప్పగా 

స్నేహపరంపరా కదల సీఘ్ర మనస్సగు టేను సమ్మతిన్ 

దేహసహాయవిద్యలగు దివ్య సుఖమ్మును గల్గజేయచున్ 

దాహము తీర్చ దక్షతల ధర్మ ప్రభోదము నిత్య సత్యమున్


జీవిత యంతరంగమగు జేరుతటాకము మున్గితేలుటన్ 

సేవలు మంచిచెడ్డలగు జీవన గుండము మానసమ్ముగన్ 

నావల లోకమెళ్లకధగా మలుపేయగు హృద్యలక్ష్యమున్

కావడిమాదిరే కదల గమ్యను భూతులు సుందరత్వమున్


మాయని మచ్చజీవితము మానస వీణగ దీక్షదక్షతన్

రాయనులేనిసత్యమది రక్షణ వైనమనస్సుగాంచగన్ 

మోయని సూత్రవిద్యలగు మేను ప్రభుత్వము గాంచగల్గ యీ

రాయిని జూచినంతటనె రమ్మని పిల్చును మిత్ర సత్తమా


సంసారీమదిగానుసంఘముగనున్ సన్యాసి నాట్యమ్ముగన్

ద్యాసాప్రాంతముభాషగాబతుకుటన్ ధ్యానమ్ము సాహిత్యమున్ 

రాసీ లక్ష్యముగన్ భవమ్ము చరితా ర్ధంమౌను నిత్యమ్ముగన్ 

ప్రాసస్యమ్ముగనౌను నాటకమదిన్ ప్రాబల్య మే జీవమున్


ఎవరెంతన్నను ఓర్పు దాల్చగలగేయేమైన సమ్మోహమున్ 

ఎవరెక్కాదిగ బుద్దిగామలుపులే యెoతైన సంఘమ్ముగన్ 

ఎవరేమన్న నిజమ్ముపల్కగలిగే యేమాయున్న బాగోతమున్

వివరించే విధి సంభవమ్మగుటయేనిత్యమ్ము సత్యమ్ముగన్

**:::

శుభోదయంa***

మిత్రులందరికీ  హోళీ పండుగ శుభాకాంక్షలు 


సోమవారం ప్రాంజలి ప్రభ పద్యాలు 

రచన.. మల్లాప్రగడ రామకృష్ణ, Rtd. Accounts officer, 


శీర్షిక -హోళి.. తేటగీతి మాల 


హృదయ సంబరాలానాంద హాయి గొలుపు  

కోయిలమ్మ రాగం కళ కొత్త వెలుగు 

ఏడువర్ణాల జల్లులు యెల్లరాడు 

ధ్వనుల కోలాహలముగాను ధరణి యందు 


మధురస తరంగ చేష్టలు మానసమ్ము 

అదియు హోళి సంబరమేను యల్లరవదు 

మంజరి సుగంధ పరిమళం మధుర కళలు 

భరత ఖండ మందున జనం భలిరె యాట 


బాల బేలా కలసి వసంతాలు చల్లు

కరుణ కవ్వించు కుంటూను కదలి యాడు 

ఇదియు భిన్నత్వ  యేకత్వ ఇచ్ఛ యాట 

సంస్కృతియు ఉత్సాహపుకేళి సౌరుభమ్ము 


పడుతులు ఎగిరెగిరికేళి  పడుతు యాడు 

లయలు సంతోష సంబరాలకళ యదియు 

పలకరింపుల కళలతో పలుకు కేళి 

పూల బంతులన్నివిసిరి పూజ్యు లాట 


అలక ఆత్మీయ యనురాగ ఆట యదియు 

హరిహరులతొ బృందావనం హోలి కళలు 

భారతీయ పర్వదినము భజన లీల 

దాగియున్న మహత్వమ్ము దారి తెలుపు

***


సీస పద్యమాలిక 


మధువనిలో లీల  మధుమాస రంగులే 

మాధవ చిరుహాస మాయ మెరిసి 

పువ్వులే నవ్వులై పున్నమి కలువలు

వెల్లువెత్తెడికళ వింత మెరుపు 


 పుప్పొడి రంగులు పురమునజల్లిరి 

గోపెమ్మ కళకళ గొప్ప లీల 

బుగ్గలు ఎరుపెక్కె బుద్ధులు పరుగులై 

వాడలన్ని మురిసె వరద పొంగు 


పొదపొదలో రొద పోరుగా యాటలే 

రత్నాల కాంతులు రంగుజల్లె

నగధారి పలుకుల నటనల కళకళ 

నవ్వినదే రంగు నటన కళలు 


వన్నెలొలక వేళ వర్ణము లే జల్లు 

కాముని పున్నమి కళల వేళ

కొంటెవాని చిలుకు  కొసరి అల్లరిలోన 

జంటకలిసెకధ జాతి నందు


చిమ్మినదేను విచిత్ర రంగులకళ 

వెంటబడి వనిత విలవిలవల 

తడిపినదె తడిపి తకధుమ యాటలు 

రాచకేళియంబర రంగుల కళ

***

కం..నరుడై సహకారముగన్ 

హరుడై సహనమ్ము మానవాకారముగన్ 

సిరులే యందించు కళల్ 

హరిమాయ పరమ్ముగా యధార్ధమ్ముగనెన్

***


శా..ఆదిత్యా సకలమ్ము నీ దయ సమానమ్మేను సద్భావమే 

వేదమ్మే తెలిపే విధమ్ము సహనం వేదాత్మ నిర్వాహమే 

నీ దాతృత్వముగాను మేము బ్రతికే నీశక్తి మమ్మేలుటే 

సాదాతత్త్వముగానుసాగు విధిగా సాధ్యమ్ము సర్వమ్ముగన్


శా..రాధాకృష్ణుల కేళివేడుకమనో రక్తీ యతీతం వసం 

తా ధారా ఋతువై సుహాసినివేదాంతమ్ము కోలాహలం 

ప్రాధాన్యమ్ము కళేను హోలి రమణీ ప్రాబల్య ప్రేమమ్ముగా 

చేదేతీపిగనే మనస్సు కదిలీ చిందేసె రంగుల్ కళే 


శా..చిన్నారుల్మది చేష్టలే చిలిపిగా చింతల్లొ చిన్మాయగా

పన్నీరుల్మది నిత్య మాటలగుటే పంతమ్ము యాటల్లుగా 

వెన్నాముద్దలనే తినేటి కళలే వేళల్లొ చూపేనుగా 

వెన్నెల్లో విహరించు నేస్తములతో విందుల్లొ గోపాలుడే


ఉ..రంగుల హోలికేళియగు రమ్యత లోకము జూప కల్గుటే 

రంగులు రాసి యాటలగు రత్నపు కాంతులు వెళ్ళు వవ్వుటే 

రంగుల హావభావములు రవ్వల మెర్పులు సందడేయగన్ 

రంగుల యాటలై రమణి రాజ్యపు లీలలు హోలి పండుగే


ఉ..ముద్దర జీవమేయగుట ముఖ్యమనోగతి కాల మాయగన్ 

ప్రొద్దున మేలుచేయుటయు మ్రొ క్కెద గుర్వుకు తల్లి తండ్రికిన్

ఒద్దిక పొందగల్గెడిది నొయ్యది నేస్తము నిర్మలమ్ముగన్ 

పెద్దల గౌరవించు మది భిన్నము కాకయు ప్రేమ జూపుటన్

****

సోమవారం ప్రాంజలి ప్రభ కథలు 

మల్లా ప్రగడ 


*🌹🎨  హోళీ పండుగ, వసంత పూర్ణిమ, ఫాల్గుణ పూర్ణమి, లక్ష్మీ జయంతి శుభాకాంక్షలు అందరికి / Greetings on Holi Festival,  Vasanta Purnima, Phalguna Purnima, Lakshmi Jayanti to All.  🎨🌹*

*ప్రసాద్‌ భరధ్వాజ*ప్రాంజలి ప్రభ 


*. హోళికా పూర్ణిమ / కాముని పూర్ణిమ ఎందుకు ? *

*🍀🎨. హోలీ పండగ.. ఈ రంగుల పండగ విశిష్టత ఏంటి..ఎలా జరుపుకోవాలి..? 🎨🍀*


*తెలుగు నెలల్లో చివరిది ఫాల్గుణ మాసం. హోళి పర్వదినం ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. చతుర్దశి నాడు కాముని దహనం జరిపి మరుసటి రోజు పాల్గుణ పౌర్ణమి రోజు హోళి పండుగను జరుపుకుంటారు. వసంత కాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను 'వసంతోత్సవం' పేరిట జరుపుకునేవారు. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి. ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి.  హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. ఈ పండుగను హోళికా పూర్ణిమ, కాముని పూర్ణిమ,  ఫాల్గుణ పౌర్ణమి, హుతాశనీ పూర్ణిమా, వహ్యుత్సవం, వసంతోత్సవం అను పేర్లతో కూడా పిలుస్తారు.*


*🍀. పురాణాలు ఏం చెబుతున్నాయి ? 🍀*


*రాక్షసులకు రాజైన హిరణ్యకశ్యపుడు, తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించ దీనికి విరుద్ధంగా, హిరణ్యకశ్యపుడి సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు, భగవంతుడైన విష్ణువుకు భక్తుడు. హిరణ్యకశ్యపుడు పలు మార్లు బెదిరించినప్పటికి, ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించేవాడు.  హిరణ్యకశ్యపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరిగా, ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు, ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి, తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువా ఎగిరి పోవడం వలన ఆమె దహనం అవుతుంది ఆ శాలువా ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోలీను జరుపుకుంటున్నాము.*


*ఇంకొందరు ఫాల్గుణ పౌర్ణమి నాడు కాముని పున్నమి పేరిట సంబరాలు జరుపుకుంటారు. సతీవియోగంతో విరాగిలో మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయించారు. దీంతో పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని మన్మథుని సాయం తీసుకున్నారు. మన్మథుడు శివుడిపైకి పూల బాణాన్ని ప్రయోగించి, తపోభంగం కలిగించాడు. తపో భంగంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మథున్ని భస్మం చేస్తాడు. అలా కోరికలు దహింపజేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కామదహనం పేరుతో మన్మథుడి బొమ్మను గడ్డితో చేసి తగులబెడతారు. మన్మథుడు శివుని తపోభంగం చేసినపుడు శివుడు మూడవ కంటితో దహించిన రోజు కనుక కాముని పూర్ణిమ అని అంటారు. హోలిక అనే రాక్షసి చంపబడినందున హోళికా పూర్ణిమ అని అంటారు. హోలికా, హోళికాదాహో అనే నామాలతో దీనిని పేర్కొంటున్నది స్మృతి కౌస్తుభము. కామదహనమనే పేరునూ  వింటాము. హుతాశనీ పూర్ణిమా, వహ్యుత్సవం అని కూడా దీనిని అంటారు.*


*ఈనాడు లక్ష్మీనారాయణ వ్రతం, అశోక పూర్ణిమా వ్రతం, ధామత్రి రాత్ర వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి, శయన దాన వ్రతం చేస్తారని పురుషార్థచింతామణి, శశాంక పూజ చేస్తారని నీలమత పురాణం, చంద్రపూజ విషయం ప్రత్యేకం గమనింప తగింది.  కొన్ని గ్రంథాలు దీనిని డోలా పూర్ణిమ అంటున్నాయి. ఈనాడు లింగ పురాణమును దానం చేస్తే శివలోక ప్రాప్తి కలుగునని ఫాల్గుణశుద్ధ పూర్ణిమను తెలుగువారు కాముని పున్నమ అంటారు. అది అరవవారి పంగుని ఉత్తిరమ్.*


*ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నాడు చంద్రుడు ఉత్తర ఫల్గునీ నక్షత్రంతో ఉంటాడనేది మనకు తెలిసిందే. ఈ వండుగతో శీతాకాలం వెనుకబడి వసంత ఋతువు లక్షణాలు పైకొంటాయి. చలి తగ్గు ముఖంలో ఉంటుంది. ఉక్కపోత ఇంకా ప్రారంభం కాదు. సూర్యుడు బాగా ప్రకాశిస్తూ హితవై ఉంటాడు. అన్నిపంటలు ఇంటికి వస్తాయి. కర్షకుడికి కడుపు నిండా తిండి దండిగా దొరికే రోజులు అంతా ఆనందం గోవిందంగా ఉంటుంది. వస్తూ వున్న వసంత ఋతువుకు స్వాగతోపచారాలు చేసే సమయం.*


*🍀. శాస్త్రీయ కారణాలు - సహజమైన రంగులు 🍀*


*శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంత కాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. దీనివల్ల వైరల్ జ్వరం, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన, నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందనేది ఒక వాదన. కుంకుమ, పసుపు, బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు. తడి రంగుల కోసం, మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు, అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. అందుకని సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధముగా పనిచేస్తుందని అర్థం.*

***

సేకరణ... ప్రాంజలి ప్రభ కథలు


ప్రాంజలి ప్రభ సోమవారం కధలు 

మల్లాప్రగడ రామకృష్ణ 

 

*నీకంటూ ఒకరు ఉన్నారా 


నీకంటూ ఒకరు ఉన్నారా  ఈ ప్రపంచంలో ఎవరైనా అంటే నీకు తెలియకుండానే ఇద్దరు ఉన్నారు  ఒకరు  ( తల్లి  ) మరొకరు ( దైవం ) .ఈ లోకంలో మనకంటూ ఒకరుండాలి.


పసితనంలో- అమ్మ ఉంటే చాలు. అన్నం లేకపోయినా ఫరవాలేదు. అన్నీ లేకపోయినా ఫరవాలేదు. అయితే అది కొంతవరకే. ఆ తరవాత మన అవసరాలకు అమ్మ చాలదు. ఎందుకంటే తెలివిమీరిన మనిషికి ప్రేమ ఒక్కటే చాలదు. అమ్మప్రేమ ఒక్కటే చాలదు. అందుకే అమ్మలా ఒకరు కావాలి- అమ్మకంటే మిన్నగా అవసరాలు తీర్చేవారు!


మనలోనే మన అణువణువునా ఉన్నాడంటే మనం నమ్మగలమా? కానీ తప్పదు. ఎందుకంటే... ఉన్నాడు.


మన అర్హతానర్హతలు ఆయనకు అవసరంలేదు. మన స్థితిగతులతో ఆయనకు పనిలేదు. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు సకలం సమకూర్చిన మావిని బొడ్డుకోసి అవతల పడేసినట్టు, మనల్ని సృష్టించి పోషిస్తున్న భగవంతుడి ఉనికినీ మరచిపోయినా, అసలు గుర్తించకపోయినా- ఆయన మాత్రం మనల్ని వదలడు. అందుకే ఆయన ఉన్నాడు, ఉంటాడు. అంతే!..


90% అందరూ చేసే తప్పు ఇదే ఏవో ఏమో కావాలని పరుగులు తీస్తారు జీవితం చివరికి వారికి మిగిలింది ఉట్టిపోయిన శరీరం రోగాల కుప్పతో నిండిన శరీరం చీదరించుకున్న కుటుంబ సభ్యులు ఒక రోజు కబీర్ దాస్  ఒక ఊరిలో ఉండగా.. 

ఆ ఊరి ధనవంతుడు తన కొత్త ఇంటికి ఊరందరినీ పిలిచి భోజనాలు పెట్టాడు. 

కబీరు కూడా అక్కడికి వెళ్లారు. ఆ ఇంటి యజమాని అందరికీ నమస్కరించి.. ‘‘నేనెంతో ధనాన్ని వెచ్చించి ఈ ఇల్లు కట్టుకున్నాను. మీరంతా నా ఇంటిని నిశితంగా పరీక్షించి ఏవైనా దోషాలుంటే నిర్భయంగా చెప్పండి. సరిచేసుకోవడానికి ఎంత డబ్బయినా వెనుకాడను’’ అంటాడు. 


వచ్చిన వాళ్లల్లో కొందరు వాస్తు పండితులు కూడా ఉన్నారు. ఇంట్లోని ప్రతి భాగాన్నీ వాస్తుపరంగా చూసి ఏ దోషం లేదని చెప్పారు. కానీ, 


అక్కడే ఉన్న కబీరు దాసు మాత్రం.. ‘‘ఓ యజమానీ, ఇందులో నాకు రెండు దోషాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీవు చెప్పమంటే చెబుతాను’’ అన్నాడు.


 ‘‘అయ్యా, ఆ దోషాలేమిటో నిర్మొహమాటంగా చెప్పి సరిచేసుకునే అవకాశం కల్పించండి’’ అన్నాడు యజమాని. అప్పుడు కబీరు.. ‘‘ ఒకటి.. ఈ ఇల్లు ఎంతకాలం ఇలాగే ఉంటుందో తెలుసా?’’ అని ప్రశ్నించాడు.


తెలియదని తల ఊపాడు యజమాని. ‘‘ఇక రెండోది, ఈ ఇల్లు ఉన్నంత కాలం నువ్వుంటావా?’’  అని అడిగాడు కబీరు. ఆ మాట విని యజమాని తెల్లబోయాడు. అప్పుడు కబీరు ‘‘ఈ సంపదలన్నీ అశాశ్వతాలు. 

ఆత్మ, పరంగా అందరిలో ఉన్న భగవంతుడు మాత్రమే శాశ్వతం. 


ఈ విషయం తెలుసుకొని మొదట నిన్ను నీవు సరిదిద్దుకో! అప్పుడే నీవు తరిస్తావు. 


ఈ జన్మకున్న అర్థమేమిటో తెలుసుకుంటావు. 


మానవులంతా గొర్రెల వలెనే ప్రవర్తిస్తూ.. పుట్టడం గిట్టడం కోసమే అనుకుంటారు తప్ప.. పుట్టడం గిట్టడం మధ్య ఉన్న జీవితాన్ని ఎలా గడపాలో ఆలోచించరు’’ అని చెప్పి అందరితో కలిసి భోంచేసి అక్కడి నుండి వెళ్లి పోయాడు...

........

సోమవారం ప్రాంజలి ప్రభ  కధలు 

సేకరణ మల్లాప్రగడ రామకృష్ణ 

 

వివేక వాణి   ( తేచ్చుకోవలసింది  బిక్ష కాని తిట్లుకాదు )


సన్యాసులు భిక్షకు వెళ్లడం సంప్రదాయం . అలా నలుగురు శిష్యులతో కలకత్తాలో ఒక వీధిలో వివేకానందుడు భిక్షకు బయలుదేరాడు . 


మరీ పెద్ద చప్పుడు కాకుండా ఒక మోస్తరు ధ్వనితో గంట కొడుతూ -భవతి భిక్షామ్ దేహి - అని అడుగుతున్నారు . ఒక ఇంట్లో నుండి - చేయి ఖాళీ లేదు పొమ్మని సమాధానం వచ్చింది . ఒకామె సగం  పాడయిపోయిన అరటిపండు వేసింది . 


ఒకామె ఒంటికాలిమీద లేచి తిట్టింది . శాపనార్థాలు పెట్టింది . ఊగిపోయింది . ఒకరిద్దరు భిక్షాపాత్రల్లో బియ్యం పోశారు . 


పాడయిపోయిన అరటిపండు భాగాన్ని తొలిగించి - బాగున్నంతవరకు దారిలో కనపడిన ఆవుకు పెట్టి మఠం చేరుకున్నారు . వారివారి పనుల్లో మునిగిపోయారు . 


మధ్యాహ్నం భోజనానంతరం ఒక శిష్యుడు చాలా దిగాలుగా గుమ్మానికి ఆనుకుని కుమిలిపోతుండడాన్ని వివేకానందుడు గమనించాడు . నెమ్మదిగా అతడిదగ్గరికి వెళ్లి కారణం కోసం ఆరా తీశాడు . 


పొద్దున్న భిక్షకు వెళ్ళినప్పుడు ఆమె తిట్టిన తిట్లు , శాపనార్థాలు , ప్రదర్శించిన కోపం చాలా బాధపెడుతోంది . వికారంగా ఉంది . తట్టుకోలేకపోతున్నాను - అన్నాడు . 


వివేకానందుడు సమాధానం అతడిచేతే చెప్పించి ఓదార్చాడు .  


ప్రశ్న - సమాధానం 


----------------


ప్ర : మనకు భిక్షలో ఈ రోజు ఏమేమి వచ్చాయి ?


స : సగం పాడయిపోయిన అరటి పండు , కొద్దిగా బియ్యం .


ప్ర : మనం మఠానికి ఏమి తెచ్చుకున్నాం ?


స : కొంచెం అరటిపండు అవుకు పెట్టేసి , బియ్యాన్ని మాత్రం తెచ్చుకున్నాం .


ప్ర : మరి తెచ్చుకున్నవాటిలో తిట్లే లేనప్పుడు , అవి నీవి కావు . నీతో రాలేదు . మనం తీసుకున్నది అరటిపండు , బియ్యమే కానీ , తిట్లను  తీసుకోలేదు - ఇక్కడికి మోసుకురాలేదు . రానిదానికి - లేనిదానికి అకారణంగా బాధపడుతున్నావు . 


స : నిజమే స్వామీ !


మనమూ అంతే . తలుచుకుని తలుచుకుని ఆనందించాల్సిన , పొంగిపోవాల్సిన ఎన్నింటినో వదిలేసి ఎవెరెవరివో - ఎప్పటెప్పటివో - అన్నవారికే గుర్తుకూడా ఉండని తిట్లను , కోపాలను , అవమానాలను తలుచుకుని తలుచుకుని బాధపడుతూ ఉంటాం .( మనిషి నైజం ).


***